●పంటలకు తీవ్ర నష్టం
తుపాన్ కారణంగా మంగళవారంతోపాటు బుధవారం సాయంత్రం వర్షం కురవడంతో వరి రైతులతోపాటు ఆరుతడి పంటల రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ రెండు రోజులలో బద్వేల్ డివిజన్‌లోని కాశినాయన, కలసపాడు, గోపవరం, పోరుమామిళల్లో అధిక వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో కలసపాడు మండలంతోపాటు పలు మండలాల్లోని గ్రామాల్లో వరితోపాటు ఆరుతడి పంటలైన మినుము, మిరప, ఉల్లి పంటలు నీట మునిగాయి.
● తుపాన్ ప్రభావం రెండు మూడు రోజులకు తగ్గుతుందిలే అని చాలామంది రైతులు వరి కోతలకు సిద్ధంగా ఉన్న వరిపంటను కోయకుండా వాయిదా వేసుకున్నారు. అయితే బుధవారం కురిసిన భారీ వర్షం పెద్ద నష్టం తెచ్చిపెట్టింది. పలు మండలాలలో వరిపంట నేలకొరిగిందని పలువురు రైతులు వాపోయారు. వరి కోతలు చేసుకున్న రైతులు మాత్రం వరి ధాన్యాన్ని ఆర బెట్టుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది రైతులు ఎక్కడ ఆరబెట్టుకోవాలో తెలియక పొలాల్లోనే పట్టలు కప్పి ఉంచుకున్నారు. కొంత మంది రైతులు జాతీయ రహదారులు, మిట్ట ప్రాంతాల్లో, కల్లాల్లో వరిధాన్యాన్ని పట్టలు కప్పి ఉంచుకున్నారు. ఈ చిత్తడి కారణంగా వరి ధాన్యం మొలక వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment