ఆస్తులు వక్ఫ్‌బోర్డ్‌వి అయితే ఇన్నేళ్లు ఏం చేశారు?
మదనపల్లె : అంజుమన్–ఏ–హమ్‌దర్ద్–ఏ–ఇస్లాం ట్రస్ట్ ఆస్తులు వక్ఫ్‌బోర్డువి అయితే 24 ఏళ్లు అధికారులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ట్రస్ట్ అధ్యక్షుడు, టీడీపీ మైనారిటీ నాయకుడు ఎస్.ఏ.మస్తాన్, ట్రెజరర్ ఐనుల్లా ప్రశ్నించారు. సాక్షి దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన మైనారిటీ ఆస్తులపై పెద్దల కన్ను వార్తపై అంజుమన్–ఏ–హమ్‌దర్ద్–ఏ–ఇస్లాం ట్రస్ట్ సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ట్రస్ట్ అధ్యక్షుడు ఎస్.ఏ.మస్తాన్ మాట్లాడుతూ అంజుమన్–ఏ– హమ్‌దర్ద్– ఏ–ఇస్లాం ట్రస్ట్ ముస్లిం సమాజానికి జవాబుదారీగా పనిచేస్తుందే తప్ప ప్రభుత్వానికి, వక్ఫ్‌బోర్డుకు జవాబుదారీ కాదన్నారు. ట్రస్ట్ తన పరిధిలో కార్యకలాపాలను చేసుకుంటూ వెళుతుంటే, వక్ఫ్‌బోర్డుకు చెందిన అధికారుల అనాలోచిత నిర్ణయాలతో గందరగోళం ఏర్పడిందన్నారు. జిల్లా వక్ఫ్‌బోర్డు ఇన్స్‌పెక్టర్‌కు అనుభవం, అవగాహన లేకపోవడంతో ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించేశారన్నారు. అంజుమన్–ఏ–హమ్‌దర్ద్–ఏ–ఇస్లాం–ట్రస్ట్ ఆస్తుల విషయాన్ని జిల్లా కలెక్టర్, వక్ఫ్‌బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఎస్.జెడ్.నాసిర్ పాల్గొన్నారు.
అంజుమన్–ఏ–హమ్‌దర్ద్–ఏ–ఇస్లాం
కమిటీ సభ్యుల ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment