ముగిసిన పరిపేతురు తిరునాల
కలసపాడు : కలసపాడు సగిలేరు ఒడ్డున వెలసిన పురాతన పరిశుద్ధ పరిపేతురు పరిపౌలు ఆలయ 137వ ప్రతిష్టా మహోత్సవాలు మంగళవారం ముగిశాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల డయాసిస్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ పి.వరప్రసాదరావు భక్తులకు దైవసందేశం ఇచ్చారు. సోమవారం రాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. డీనరీ చైర్మన్ ఆనందకుమార్, ప్రెస్బేటర్ ఆసిస్‌గాబ్రియేల్‌ల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉపాధ్యాయుడు కె.జె.ప్రవీణ్ కుమార్ (చిన్ను) చర్చి చరిత్ర ప్రతులను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. బాలాయపల్లెకు చెందిన రవికుమార్ వారిచే చెక్కభజన, గుమ్మడి జీవన్‌కుమార్ వారిచే నిర్వహించిన ధనవంతుడు–లాజరు క్రైస్తవ నాటకం భక్తులను ఆకట్టుకున్నాయి. మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల సీఐ శ్రీనివాసులు, కలసపాడు ఎస్‌ఐ చిరంజీవి, కాశినాయన ఎస్‌ఐ హనుమంతు, పోరుమామిళ్ల ఎస్‌ఐ కొండారెడ్డిల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment