రాష్ట్ర ఎంపీపీల సంఘం ఉపాధ్యక్షుడిగా వీరనారాయణరెడ్డి
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠం మండల పరిషత్ ప్రెసిడెంట్ (ఎంపీపీ) చిలేకాంపల్లి వీరనారాయణరెడ్డి రాష్ట్ర ఎంపీపీల సంఘం ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీపీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీపీల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. క్యాంపు కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ప్రభుత్వ విప్, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలసి వీరనారాయణరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వీరనారాయణరెడ్డిని రాష్ట్ర ఎంపీపీల సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించడంపై మైదుకూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకుడు, ఏపీఎస్ ఆర్టీసీ మాజీ జోనల్ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment