ఎస్పీ చొరవతో గల్ఫ్ నుంచి గాలివీడుకు చేరుకున్న బాధితురా
రాయచోటి : ఉపాధి కోసం సౌదీకి వెళ్లి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న నీరుగుట్టు రమణమ్మ ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు చొరవతో సురక్షితంగా స్వదేశానికి చేరుకుంది. గాలివీడుకు చెందిన నీరుగుట్టు రమణమ్మ బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లింది. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సేఠ్‌్‌కు తెలిపినా ఇంటికి పంపకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని భర్త నీరుగుట్టు ఆంజనేయులుకు సమాచారం అందింది. బాధితురాలి భర్త ఆంజనేయులు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీని కలిసి గల్ఫ్‌లో తన భార్య పడుతున్న ఇబ్బందులను తెలియజేసి ఇంటికి రప్పించాలని విజ్ఞప్తి చేశారు. వారి వినతిపై తక్షణం స్పందించిన జిల్లా ఎస్పీ సౌదీలో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న బాధితురాలిని స్వదేశానికి రప్పించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రయత్నాలు ఫలించడంతో సోమవారం ఉదయం సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నట్లు ఎస్పీ ఆఫీసు నుంచి సమాచారం అందింది. సోమవారం స్వగ్రామానికి చేరుకున్న బాధితురాలు రమణమ్మ భర్తతో కలిసి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment