పులకించిన పులివెందుల | - | Sakshi
Sakshi News home page

పులకించిన పులివెందుల

Published Sat, Dec 28 2024 2:03 AM | Last Updated on Sat, Dec 28 2024 12:23 PM

పులకి

పులకించిన పులివెందుల

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నాలుగు రోజుల జిల్లా పర్యటన విజయవంతం

రోడ్డు మార్గంలో బెంగుళూరు వెళ్తున్నారని తెలుసుకున్న కేడర్‌

ప్రధాన రహదారిపైకి వచ్చి చేరిన అభిమానులు, ప్రజలు

అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, కడప: అభిమాన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు రోజుల పర్యటనతో పులివెందుల పులకించింది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూసిన వారికి భరోసా, అభిమానులకు అభయం, కేడర్‌కు ఉత్సాహం నింపింది. పల్లె ముంగిట్లోకి ప్రియతమ నాయకుడు రావడంతో గ్రామీణ ప్రజల ఆనందానికి అవధుల్లేవు. నాలుగు రోజులుగా నియోజకవర్గంలోనే ఉంటూ అటు కేడర్‌, ఇటు ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పరస్పర అభిమానం పోటెత్తింది. మరోవైపు సమస్యలు వింటూ నేనున్నాను.. అంటూ ధైర్యాన్ని కల్పించారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇలా అభిమాన నాయకుడు, కేడర్‌ మధ్య పరస్పర అభిమానం, ఆప్యాయతల మధ్య నాలుగు రోజుల పర్యటన ముగిసింది. ఉదయం నుంచి రాత్రి వరకూ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కుటుంబ సభ్యులతో క్రిస్మస్‌ వేడుకలు మినహా నాలుగు రోజులు పులివెందుల వాసులకు అందుబాటులో ఉండడంతో స్థానికులు వేలాది మంది ప్రత్యక్షంగా కలుసుకున్నారు.

వివాహ వేడుకలో..
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఓ వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.

తరలివచ్చిన శ్రేణులు... 
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు రోజులుగా పులివెందులలో అందుబాటులో ఉన్నారని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ కేడర్‌ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరూ తమ అభిమాన నాయకునితో కలిసి మాట్లాడాలనే ఉత్సాహాన్ని ప్రదర్శించారు. పలకరించిన ప్రతి ఒక్కరు ఫోటో, సెల్ఫీ కోసం ఉత్సాహం చూపారు. రాత్రి వరకూ ఓపిగ్గా అందరితో మాట్లాడుతూ వారి సమస్యలు ఆలకించారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యనేతలతోపాటు కడప కార్పోరేటర్లు కుటుంబ సభ్యులతో సైతం తరలివచ్చారు. వారందరి యోగక్షేమాలు ఆయన తెలుసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సైతం భరోసా నింపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పులకించిన పులివెందుల 1
1/1

పులకించిన పులివెందుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement