రాయలసీమపై వివక్ష తగదు
కడప కల్చరల్: రాయలసీమపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపించడం తగదని ప్రజాసంఘాల ప్రతినిధులు అన్నారు. రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్ డాక్టర్ సి.ఓబుల్‌రెడ్డి ఆధ్వర్యంలో సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ కన్వీనర్ రఘునాథ్‌రెడ్డి అధ్యక్షతన స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లాలో ఆదివారం రౌండ్ టేబుల్ సమా వేశం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు హరికిషోర్‌రెడ్డి, అరసం అధ్యక్షుడు ఆచార్య ఈశ్వర్‌రెడ్డి, ప్రైవేటు విద్యాసంస్థల సంఘం నేత జోగిరామిరెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ బాలిరెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా నేత జనార్దన్‌రెడ్డి మాట్లాడారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని మరో మూడు బ్యాంకుల విలీనం తర్వాత అమరావతికి తరలించాలన్న ప్రయత్నం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలకు ఏదైనా మేలు చేయకపోగా ఉన్న ప్రధాన కార్యాలయాలను అమరావతికి తరలిస్తామని చెప్పడం.. సీమ పట్ల వివక్ష చూపడమేనన్నారు. ఇప్పటికే లోకాయుక్త, ఎంఎస్‌ఎంఈ ట్రైనింగ్ సెంటర్, న్యాయ విశ్వవిద్యాలయం, హైకోర్టు, నార్కోటిక్స్ కోర్టులను రాయలసీమకు లేకుండా చేశారని, రాష్ట్రమంటే అమరావతి మినహా మరొకటి లేదనట్లు ప్రవర్తించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, సంప్రదాయం ప్రకారం కడపలోనే ఏపీజీబీ హెడ్ క్వార్టర్‌ను కొనసాగించాలని, లేనిపక్షంలో రాజకీయాలకతీతంగా అన్ని పక్షాలను, సంఘాలను, తరగతులను సమీకరించి పోరాటం చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే జిల్లా స్థాయిలో వెనుకబడిన ప్రాంతాల శ్రేయస్సు కోరుకునే సకల జనుల సదస్సు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, వివిధ రంగాల ప్రముఖులు గాలి చంద్ర, జి.చంద్రశేఖర్, రవిశంకర్‌రెడ్డి, ఎస్ ఏ సత్తార్, సునీల్ కుమార్, రచయిత పాలగిరి విశ్వ ప్రసాద్‌రెడ్డి, డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ నాయకుడు డీవీకే కుమార్, కార్మిక సంఘాల ప్రతినిధులు కామనూరు శ్రీనివాసరెడ్డి, సుబ్బిరెడ్డి, శివశంకర్, రామాంజనేయులు, రాజమణి, ప్రసాద్, కాంగ్రెస్ ప్రతినిధి మైనుద్దీన్, ఎల్‌ఐసీ సంఘాల ప్రతినిధులు శంకర్రావు, శ్రీనివాస్, నిత్యానందరెడ్డి, కస్తూరి, బ్యాంకు సంఘాల ప్రతినిధులు అబ్దుల్ అజీజ్, జగదీష్, ప్రసన్న, శివశంకర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఉపాఽ ద్యాయ సంఘాల ప్రతినిధులు లక్ష్మీ రాజా, మహేష్, శ్రీనివాస్, జెవివి ప్రతినిధులు రాహుల్, వెంకటసుబ్బయ్య, నరసింహారెడ్డి, రాజు, బుద్ధిస్ట్ సొసైటీ ప్రతినిధులు కుమారస్వామి, భాస్కర్ పాల్గొన్నారు.
ఏపీజీబీ ప్రధాన కార్యాలయం తరలింపు వద్దు
రౌండ్ టేబుల్ సమావేశంలోప్రజా సంఘాల ప్రతినిధులు
Comments
Please login to add a commentAdd a comment