ఆకట్టుకున్న బండలాగుడు పోటీలు
చాపాడు : మండల పరిధిలోని వెదురూరు, నరహరిపురం గ్రామాల్లో కనుమ సందర్భంగా బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీలను తిలకించేందు వివిధ గ్రామాల నుంచి వేలాది ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వెదురూరులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, నరహరిపురంలో ప్రభుత్వ ఉద్యాన మాజీ సలహదారు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, టీడీపీ నాయకుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.
వెదురూరులో నంద్యాల ఎడ్లు ప్రథమ స్థానం..
వెదురూరు గ్రామంలో నిర్వహించిన బండలాగుడు పోటీలలో నంద్యాల జిల్లా గుంపరమానుదిన్నెకు చెందిన కుందూరు రాంభూపాల్‌రెడ్డి ఎడ్లు ప్రథమ స్థానంలో నిలువగా, ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీకి చెందిన డి.గురివిరెడ్డి ఎడ్లు ద్వితీయ, కల్లూరుకు చెందిన పి.శివకృష్ణయాదవ్ ఎడ్లు తృతీయ స్థానంలో నిలిచాయి. ప్రకాశం జిల్లా బోడుచెర్లకు చెందిన నక్షత్రరెడ్డి ఎడ్లు నాలుగవ, వైఎస్సార్ జిల్లా రంగోరుపల్లెకు చెందిన మహేందర్‌రెడ్డి ఎడ్లు ఐదో స్థానంలో గెలుపొందాయి.
నరహరిపురంలో ప్రొద్దుటూరు ఎడ్లు ప్రథమ స్థానం..
నరహరిపురం గ్రామంలో నిర్వహించిన బండలాగుడు పోటీలలో ప్రొద్దుటూరు మండలం చౌటపల్లెకు చెందిన మార్తల చంద్ర ఓబుళరెడ్డి ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. మైదుకూరుకు చెందిన వెంకటేశ్వరయాదవ్ ఎడ్లు ద్వితీయ, ప్రొద్దుటూరు మండలం చౌటపల్లెకు చెందిన మార్తల చంద్ర ఓబుళరెడ్డి ఎడ్లు తృతీయ బహుమతి పొందాయి. నంద్యాల జిల్లా గుంపరామనుదిన్నెకు చెందిన కుందూరు రాంభూపాల్‌రెడ్డి ఎడ్లు నాలుగవ, కమలాపురానికి చెందిన టీవీ కుమారి ఎడ్లు ఐదవ స్థానంలో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment