ప్రధాన వార్తలు
ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు !
అర్హత కలిగిన ప్రతి పౌరుడూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన ఓటింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా ఎన్నికల సంఘం అనేక సౌకర్యాలు కల్పించింది. ఓటరు జాబితా సవరణలో ఏ కారణం చేతనైనా మీ పేరు తొలగించినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఓటరు జాబితా పరిశీలనకు అధికారులు వచ్చినప్పుడు మీరు లేకపోతే మీ పేర్లను తొలగించేందుకు అవకాశాలు ఎక్కువ. అయితే ఇలా అబ్సెంట్ అయిన వారి కోసం ప్రత్యేకంగా ఒక జాబితా రూపొందుతుంది. అంతేకాకుండా... ఒకవేళ మీ అడ్రస్ మారి ఉంటే, ఇంకో జాబితా, మరణించిన వారి కోసం కూడా ప్రత్యేకంగా జాబితా సిద్ధం చేస్తారు.ఈ జాబితాలన్నీ ఓటరు జాబితాతోపాటు ప్రిసైడింగ్ అధికారికి అందుబాటులో ఉంటాయి. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తి పేరు ఓటరు జాబితాలో లేకపోతే, ఆ వ్యక్తి పేరును ఏఎస్డీ ఓటర్ల జాబితాలో వెతకాలి. ఏఎస్డీ ఓటర్ల జాబితాలో ఆ వ్యక్తి పేరుంటే ఓటరు గుర్తింపు కార్డు/ లేదా ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ వ్యక్తి గుర్తింపును ప్రిసైడింగ్ అధికారి ముందుగా నిర్ధారించుకుంటారు.అనంతరం ఆ వ్యక్తి పేరును ఫారం 17ఏలో నమోదు చేసి సంతకంతో పాటు వేలిముద్ర తీసుకుంటారు. ఈ క్రమంలో తొలి పోలింగ్ అధికారి సదరు ఏఎస్డీ ఓటరు పేరును పోలింగ్ ఏజెంట్లకు గట్టిగా వినిపిస్తారు. సదరు ఓటరు నుంచి నిర్దిష్ట ఫార్మాట్లో డిక్లరేషన్ తీసుకోవడంతో పాటు ఫొటో, వీడియో తీసుకుంటారు. అనంతరం అతడికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. దివ్యాంగులకు వాహన సదుపాయం...దివ్యాంగులు, వృద్ధులు ఓటేసేందుకు వాహన సదుపాయం కోసం స్థానిక బూత్ లెవెల్ అధికారి (బీఎల్ఓ)ని సంప్రదించాలి. ఆటో ద్వారా ఓటర్లను ఇంటి నుంచి పోలింగ్ తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తారు.పోలింగ్ కేంద్రం తెలుసుకోవడం ఇలా... ఓటర్లందరికీ ఎన్నికల సంఘం ఫొటో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు జారీ చేస్తుంది. ఈ ఓటర్ స్లిప్పుల వెనకభాగంలో పోలింగ్ కేంద్రం రూటు మ్యాప్‌ను పొందుపరిచింది. ఈ రూట్ మ్యాప్‌తో సులువుగా పోలింగ్ కేంద్రానికి చేరుకోవచ్చు.
మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చాం: సీఎం జగన్
విశాఖపట్నం, సాక్షి: అబద్ధాలకు రెక్కలుకట్టి గతంలో మేనిఫెస్టోలు ఇచ్చేవారని, తాము మాత్రం మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకువచ్చామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత గాజువాకలో మంగళవారం(మే7) జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మీటింగ్‌కు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించారు. ‘మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలివి. గతంలో ఎప్పుడూ ఎవరూ బటన్ నొక్కలేదు. నేరుగా అక్క చెల్లెల్లకు డబ్బులిచ్చిందీ లేదు. 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి స్కీమ్ కూడా పేదలకు గుర్తుకు రాదు. 59 నెలల్లో 2లక్షల31 వేల ఉద్యోగాలిచ్చాం. 59 నెలల్లోనే అనూహ్య మార్పులు తీసుకువచ్చాం. 13 జిల్లాలను 26 జిల్లాలు చేశాం. ఇది అభివృద్ధి కాదా. 59 నెలల పాలనలో 17 మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా.ఒక్క ఉత్తరాంధ్రకే నాలుగు మెడికల్ కాలేజీలు వచ్చాయి. వైస్‌ఆర్‌సీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయి. దశాబ్దాల నాటి ఉద్దానం సమస్యను పరిష్కరించాం. మూడు వేల గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు నిర్మాణంలో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో 400 సెల్‌టవర్లు పెట్టాం. భోగాపురం ఎయిర్‌పోర్టు శరవేగంగా పూర్తవుతుండడానికి కారణం ఎవరు. కుల,మత ప్రాంతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నాం. ఇంటి వద్దకే పెన్షన్, రేషన్ సౌకర్యం కల్పిస్తున్నాం. నాడు-నేడు ద్వారా బడులకు కొత్త రూపం తీసుకువచ్చాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన తీసుకువచ్చాం. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఈజ్ఆఫ్ డూయింగ్‌లో ఏపీని నెంబర్‌వన్‌గా నిలిపాం. బాబు హయాంలో కంటే ఎక్కువగా మీ బిడ్డ హయాంలో లక్ష కోట్లపైబడి పెట్టుబడులు వచ్చాయి’ అని సీఎం జగన్ వివరించారు. సీఎం జగన్ ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలువిశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తా.. జూన్ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది విశాఖ నుంచే పాలన కొనసాగించేది విశాఖ నుంచేఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండిలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిసస్టెయినబుల్ డెవలప్మెంట్ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారుప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండివెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళ వారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయాబాబు, దత్తపుత్రుడు, మోదీగారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటిప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రేవేట్ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్ ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదుగాజువాకలో కూటమికి ఓటేస్తే స్టీప్లాంట్ అమ్మేయమన్నట్లేగాజువాకలో మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్లు అవుతుందిఇక్కడ టీడీపీ, ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపడం సాధ్యం కాదు ఎందుకంటే దీన్నే వారు ఎన్నికల రెఫరెండంగా తీసుకుంటారుప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి, తర్వాత జగన్ ఎంత ప్రయత్నించినా నీకెందుకయ్యా వారు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి అనకూలంగా తీర్పు ఇచ్చారంటారుఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్‌కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపండి
చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉంది: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు మాటలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. కూటమికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెప్తారని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చిందని, దానిని తాము అడ్డుకోలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. కూటమి దుర్మార్గపు ఆలోచనలను ప్రజలు గమనించాలని కోరారు. టీడీపీ ఆపించిన పథకాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయన్న ఆయన..ఎన్నికలు అయిన వెంటనే..లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు.బాబు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు మంత్రి బొత్స. చంద్రబాబుది మనిషి పుట్టుకేనా? ఆయన పేరెత్తడానికే అసహ్యంగా ఉందన్నారు. ఎన్నికల నిబంధనలకు మేము వ్యతిరేకం కాదని తెలిపారు. ఎన్నికల కమిషన్ వాస్తవాలు పరిగనించాలనిసూచించారు. సమయానికి ఇన్పుట్ సబ్సిడీ అంధక రైతులు నష్టపోతే బాద్యులు ఎవరని ప్రశ్నించారు. రియింబర్స్‌మెంట్ అందక విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే బాద్యులు ఎవరని నిలదీశారు. వీటన్నింటికి కూటమే బాధ్యత వహించాలని తెలిపారు. పింఛను లబ్ధిదారులు వారికి కలుగుతున్న ఇబ్బందుల పట్ల ఓపిక పట్టాలని, 15 రోజుల తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. భవిష్యత్తులో హక్కుగా పథకాలు అందిస్తామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలకు మంత్రి బొత్సనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. రైల్వేజోన్‌పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. బీజేపీ, టీడపీ, జనసేన తోడు దొంగలు ఎద్దేవా చేశారు. ఒకరు తానా అంటే ఇంకొకరు తందనా అంటున్నారని సెటైర్లు వేశారు. ప్రధాని మోదీకి స్థానిక సమస్యలు అవసరం లేదని అందుకే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు. ఇప్పుడు బీజేపీ చేస్తున్న అవినీతి..దేశ చరిత్రలో ఏ పార్టీ చెయ్యలేదని అన్నారు మంత్రి బొత్స. తన రాజకీయ జీవితంలో బీజేపీ అంత అవినీతి పార్టీని ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. మోదీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మోడీ అంత దిగజారే ప్రధానిని ఎప్పుడూ చూడలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల మేరకే బిల్లులకు ఆమోదం తెలిపామని పేర్కొన్నారు. బీజేపీ ఏపీలో రాదని, బంగాళాఖాతంలో వస్తుందని చురకలంటించారు. కేంద్రంలో తమ పార్టీపై ఆధారపడే ప్రభుత్వం రావాలని అన్నారు.
వ్యవస్థలను మేనేజ్ చేసేది చంద్రబాబే: ఎమ్మెల్సీ లేళ్ల
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ‘ఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారు. ఇంకొపార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారు. ఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు..? అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వటాన్ని కూడా ఈసీ అడ్డుకుంది. అదే వర్షాలకు నష్టపోయిన తెలంగాణ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈసీ ఓకే చెప్పింది.కానీ ఏపీలో మాత్రం ఇవ్వటానికి వీల్లేదని ఈసీ చెప్తోంది. ఎన్నికల కమిషన్ ఒక్కోచోట ఒకోలా ఎందుకు వ్యవహరిస్తోంది?. విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యాదీవెన, అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన చేయూత నిధులను కూడా ఆపేశారు. చంద్రబాబు కూటమిలో చేరగానే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని ఆపేసి వృద్దుల మరణాలకు కారణమయ్యారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై చంద్రబాబు, పవన్.. నిన్న మోదీని ఎందుకు ప్రశ్నించలేదు?’ అని లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
వీడియోలు
పచ్చ మద్యం స్వాధీనం..
బాబును నమ్మే ప్రసక్తే లేదు..
మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..
నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే
విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ
విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం
పవన్, బాబు, లోకేష్ పై జోగి రమేష్ పంచులు
వైఎస్సార్సీపీలో భారీ చేరికలు
ఎంపీ గురుమూర్తి తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
చంద్రబాబుని చీ కొడుతున్న ప్రజలు..రాచమల్లు స్ట్రాంగ్ కౌంటర్