Market
-
15 వేల మంది తొలగింపు ప్రకటన.. షేర్లు భారీ పతనం
ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కార్పోరేషన్ భారీగా నష్టపోయింది. భారీ వృద్ధి అంచనాతో 15,000 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికను ప్రకటించిన మరుసటి రోజే ఆ కంపెనీ షేర్లు 40 సంవత్సరాలలో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి.శుక్రవారం న్యూయార్క్‌లో ట్రేడింగ్ ప్రారంభించిన తర్వాత షేర్లు 26% పైగా పడిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 32 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. బ్లూమ్‌బెర్గ్ సంకలనం చేసిన డేటా ప్రకారం, కనీసం 1982 నుంచి కంపెనీ స్టాక్ అతిపెద్ద ఇంట్రాడే పతనాన్ని ఇది సూచిస్తోంది.ప్రస్తుత త్రైమాసికంలో అమ్మకాలు 12.5 బిలియన్ డాలర్ల నుంచి 13.5 బిలియన్ డాలర్లుగా ఉంటాయని కంపెనీ గురువారం తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ సంకలనం చేసిన డేటా ప్రకారం విశ్లేషకులు సగటున 14.38 బిలియన్ డాలర్లు అంచనా వేశారు. కానీ ఇంటెల్ ఒక్కో షేరు 3 సెంట్ల చొప్పున నష్టపోయాయి. ఇంటెల్ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,10,000 మంది ఉద్యోగులు ఉండగా 15% మందికిపైగా తగ్గించాలని యోచిస్తున్నట్లు ఇంటెల్ తాజాగా తెలిపింది. -
మార్కెట్ల భారీ పతనం!
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీగా పతనమయ్యాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు ఏమాత్రం కోలుకోలేకపోయాయి. ఇటీవల భారీగా మార్కెట్లు గరిష్ఠాలను చేరుకోవడంతో మదుపర్లు లాభాల స్వీకరణ వైపు మొగ్గు చూపడంతో ఇండెక్స్‌లు భారీ పడిపోయాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 942.87 పాయింట్లు 1.15% పతనమై 80,924.68 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 311.40 పాయింట్లు లేదా 1.25% నష్టపోయి 24,699.50 వద్దకు క్షీణించింది.ఐషర్ మోటర్స్, మారుతీ సుజుకీ, టాటా మోటర్స్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు టాప్ లూజర్స్‌గా నష్టాలను చవిచూశాయి. దివీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, కోటక్ మహీంద్రా షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆశలను ఆవిరి చేస్తున్న ధరలు!.. మూడోరోజు పెరిగిన బంగారం, వెండి
దేశంలో మూడో రోజూ బంగారం ధరలు పెరుగుదలవైపే అడుగులు వేస్తున్నాయి. శుక్రవారం (ఆగష్టు 2) కూడా పసిడి ధరలు అమాంతం దూసుకుపోతున్నాయి. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. దేశ వ్యాప్తంగా ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూసేద్దాం.విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64800 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 70690 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.300, రూ.330 పెరిగింది.చెన్నైలో పసిడి ధరలు వరుసగా రూ. 300, రూ. 320 పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64600 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 70470 వద్ద ఉన్నాయి.దేశ రాజధాని నగరంలో కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 64950 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70840 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 300, రూ. 330 పెరిగింది.వెండి ధరలుబంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. గురువారం రూ. 600 పెరిగిన వెండి ధర శుక్రవారం (ఆగష్టు 2) రూ. 100 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 87200కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
నిఫ్టీ.. సిల్వర్ జూబ్లీ!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో గురువారం ఓ మరపురాని అద్భుతం చోటు చేసుకుంది. జాతీయ స్టాక్ ఎక్సే్చంజీ సూచీ ఎన్ఎస్ఈ తొలిసారి 25,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే, ముగింపుల్లోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. సెపె్టంబర్లో వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలతో ఆయిల్‌అండ్‌గ్యాస్, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సెన్సెక్స్ 126 పాయింట్లు పెరిగి 81,868 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 60 పాయింట్లు బలపడి 25 వేల స్థాయిపైన 25,011 వద్ద నిలిచింది. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 388 పాయింట్లు బలపడి 82,129 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు ఎగసి 25,078 వద్ద జీవితకాల గరిష్టాలు అందుకున్నాయి. పశి్చ మాసియాలో యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో మిడ్‌సెషన్ నుంచి గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ఎఫ్ఎంసీజీ, ఐటీ, యుటిలిటీ, టెక్ షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి స్వల్ప లాభాలతో ముగిశాయి. కాగా అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి.25,000 ప్రయాణం ఇలా.. → 1996, ఏప్రిల్ 22న 13 కంపెనీల లిస్టింగ్‌తో నిఫ్టీ సూచీ 1000 పాయింట్ల వద్ద ప్రయాణం ప్రారంభించింది. తొలినాళ్లలో దేశంలో తీవ్ర రాజకీయ అస్థిరత (1996–98), తర్వాత ఆసియా ఆర్థిక సంక్షోభం, డాట్‌కామ్ బబుల్, ప్రపంచ ఆర్థిక సంక్షోభం(2007) ప్రతికూల ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ తొలిసారి 5,000 పాయింట్లను చేరేందుకు 11 ఏళ్లు పట్టింది.→ సత్యం కుంభకోణం, యూరోపియన్ రుణ సంక్షోభం, ట్యాపర్ తంత్రం, జీఎస్టీ అమలు సవాళ్ల ఆటుపోట్లను ఎదుర్కొని 25 జూలై 2017న 10,000 మైలురాయిని చేరింది.→ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం, కార్పొరేట్ పన్ను, కోవిడ్ మహమ్మారి సూచీని పట్టి కుదిపాయి. కరోనా తొలి వేవ్ సమయంలో 7,600కు పడిపోయిన నిఫ్టీ కేవలం 220 రోజుల్లోనే రెండింతలకు కోలుకోవడం విశేషం. ఈ క్రమంలో 5 ఫిబ్రవరి 2021న 15,000 స్థాయిని అందుకుంది. → కరోనా వేళ పెంచిన వడ్డీరేట్లను తగ్గించేందుకు, పెరిగిన ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్‌తో పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు ప్రారంభం ప్రక్రియ ప్రారంభించాయి. ఇదే సమయంలో ఇజ్రాయిల్ – పాలస్తీనా యుద్ధ భయాలు తెరపైకి వచ్చాయి. ఈ సవాళ్లను ధీటుగా ఎదుర్కొని గతేడాది (2023) సెపె్టంబర్ 11న 20,000 స్థాయికి చేరింది. → ఇక 20,000 స్థాయి నుండి 25000 పాయింట్లు చేరేందుకు 220 ట్రేడింగ్ సెషన్ల సమయం తీసుకుంది. సూచీకి ఇదే అత్యంత వేగవంతమైన 5,000 పాయింట్ల లాభం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ‘రికార్డ్’ ముగింపు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఉదయం రికార్డ్ మార్కులు తాకిన బెంచ్ మార్క్ సూచీలు రోజంతా అదే దూకుడును ప్రదర్శించాయి. నిఫ్టీ రికార్డ్ గరిష్టాన్ని కోల్పోకుండా అదే మార్క్ వద్ద నిలిచింది.బీఎస్ఈ సెన్సెక్స్ 126.38 పాయింట్లు 0.15% పుంజుకుని 81,867.73 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 52.85 పాయింట్లు లేదా 0.21% లాభపడి 25,004.00 షెషన్ను ముగించింది.నిఫ్టీ సూచీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు టాప్ గెయినర్స్‌గా లాభాలను అందుకున్నాయి. మహీంద్రా&మహీంద్రా, హీరో మోటర్ కార్ప్, టాటా స్టీల్, ఎస్బీఐ, టాటా మోటర్స్ షేర్లు టాప్ లూజర్స్‌గా నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
వరుస తగ్గుదల తరువాత.. బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం (ఆగష్టు 1) కూడా పసిడి ధరలు అమాంతం దూసుకుపోతున్నాయి. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. దేశ వ్యాప్తంగా ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూసేద్దాం.విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63200 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 70360 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.500, రూ.540 పెరిగింది.చెన్నైలో పసిడి ధరలు వరుసగా రూ. 100, రూ. 110 పెరిగింది. దీన్ని బట్టి చూస్తే దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. చెన్నైలో ధరలు పెరుగుదల కొంత తక్కువే అని తెలుస్తోంది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64300 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 70150 వద్ద ఉన్నాయి.దేశ రాజధాని నగరంలో కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 64650 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70510 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 500, రూ. 540 పెరిగింది.వెండి ధరలుబంగారం మాదిరిగానే దేశంలో వెండి ధరలు కూడా పెరిగాయి. బుధవారం రూ. 500 పెరిగిన వెండి ధర గురువారం (ఆగష్టు 1) రూ. 600 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 87100కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు గరిష్టాలకు చేరువలో సెషన్‌ను ముగించాయి. నిఫ్టీ అయితే 25,000లకు దగ్గరకు వచ్చింది.ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 358.93 పాయింట్లు లేదా 0.44% లాభంతో 81,814.33 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 121.65 పాయింట్లు లేదా 0.49% లాభపడి 24,978.95 వద్ద ఉన్నాయి.నిఫ్టీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రిలయన్స్, గ్రాసిమ్, టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ షేర్లు టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి డిమాండ్‌కు ధరల చెక్
ముంబై: భారత్‌లో పసిడి పరిమాణం డిమాండ్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 5 శాతానికిపైగా పతనమైంది. 2023 ఇదే కాలంతో పోలి్చతే డిమాండ్ పరిమాణం 158.1 టన్నుల నుంచి 149.7 టన్నులకు పడిపోయింది. అధిక ధరలు, దీనితో కొనుగోళ్లు త్గగడం దీనికి కారణమని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) జూన్ త్రైమాసిక గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదిక పేర్కొంది. ఈ నెల 23వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కస్టమ్స్ సుంకాలను 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో బంగారం ధరలు భారీగా పడిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి డిమాండ్‌కు ఏమాత్రం దోహదపడిందన్న అంశం ఆగస్టు త్రైమాసికంలో తెలియనుంది. తాజా డబ్ల్యూజీసీ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... → జూన్ త్రైమాసికం డిమాండ్ పరిమాణంలో తగ్గినా.. విలువలో మాత్రం 17 శాతం పెరిగి రూ.82,530 కోట్ల నుంచి రూ.93,850 కోట్లకు ఎగసింది. → 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.74,000 దాటితే, సగటు ధర ఇదే కాలంలో రూ.52,191.60 నుంచి రూ.62,700.50కు ఎగసింది. (దిగుమతి సుంకం, జీఎస్టీ మినహా). అంతర్జాతీయంగా చూస్తే, ఔన్స్ (31.1గ్రాములు) ధర ఇదే కాలంలో 1,975.9 డాలర్ల నుంచి 2,338.2 డాలర్లకు ఎగసింది. (అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయర్క్ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో జూలై 16వ తేదీన ఔన్స్ ధర ఆల్‌టైమ్ హై 2,489 డాలర్లను తాకిన సంగతి తెలిసిందే) → ఇక జూన్ త్రైమాసికంలో ఆభరణాలకు పరిమాణ డిమాండ్ 17 శాతం పడిపోయి 128.6 టన్నుల నుంచి 106.5 టన్నులకు చేరింది. → ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ మాత్రం ఇదే కాలంలోలో 46 శాతం పెరిగి 29.5 టన్నుల నుంచి 43.1 టన్నులకు ఎగసింది. → రీసైకిల్డ్ గోల్డ్ పరిమాణం 39 శాతం తగ్గి 37.6 టన్నుల నుంచి 23 టన్నులకు పడింది. → దిగుమతులు 8 శాతం పెరిగి 182.3 టన్నుల నుంచి 196.9 టన్నులకు ఎగసింది.గ్లోబల్ డిమాండ్ 4 శాతం అప్మరోవైపు అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ జూన్ త్రైమాసికంలో 4 శాతం పెరిగి 1,207.9 టన్నుల నుంచి 1,258.2 టన్నులకు ఎగసింది. హోల్‌సేల్, స్పాట్‌సహా సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగడం, ఈటీఎఫ్ అవుట్ఫోస్లో మందగమనం దీనికి కారణం. గోల్డ్ సరఫరా 4 శాతం పెరిగి 929 టన్నులుగా ఉంది.ఎదురుగాలిలోనూ ముందుకే.. బంగారానికి ఎదురుగాలి వీసే అవకాశం ఉంది. అయినప్పటికీ, గ్లోబల్ మార్కెట్లో కూడా మార్పులు జరుగుతున్నాయి, ఇవి బంగారం డిమాండ్‌కు మద్దతునిస్తాయి. డిమాండ్‌ను మరింత పెంచుతాయి. – లూయిస్ స్ట్రీట్, డబ్ల్యూజీసీ సీనియర్ మార్కెట్స్ విశ్లేషకురాలు -
ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 55.15 పాయింట్ల లాభంతో 81,410.99 వద్ద, నిఫ్టీ 1.85 పాయింట్ల లాభంతో 24,837.95 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఏషియన్ పెయింట్స్ వంటివి చేరాయి. ఎల్‌టీఐమైండ్‌ట్రీ (LTIMindtree), సిప్లా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు - ఎంతంటే?
దేశంలో బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. మంగళవారం (జులై 30) పసిడి ధరలు గరిష్టంగా రూ. 330 తగ్గింది. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. దేశ వ్యాప్తంగా ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూసేద్దాం.విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63200 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 68950 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.200, రూ. 210 తగ్గింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉన్నాయి.చెన్నైలో గోల్డ్ రేటు వరుసగా రూ. 300, రూ. 330 తగ్గింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63850 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 69650 వద్ద ఉన్నాయి. నిన్న దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ.. చెన్నైలో మాత్రం ధరలు తగ్గాయి.దేశ రాజధాని నగరంలో కూడా బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 63350 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69100 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 210 తగ్గింది.వెండి ధరలుబంగారం మాదిరిగానే దేశంలో వెండి ధరలు కూడా తగ్గాయి. సోమవారం రూ. 500 పెరిగిన వెండి ధర మంగళవారం (జులై 30) రూ. 500 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 84500లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
Ola Electric IPO: పేటీఎం బాస్ షేర్లు విక్రయించడం లేదా?
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు వస్తుండటంలో మార్కెట్లో అందరి దృష్టి దీనిమీదే ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ రీటైల్ సబ్స్క్రిప్షన్లు ఆగస్టు 2 నుంచి 6వ తేదీ వరకు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటాయి. ఒక్కో షేర్ ధరను రూ.72 - 76గా కంపెనీ నిర్ణయించింది.కాగా ఓలా ఎలక్ట్రిక్‌లో గణనీయమైన సంఖ్యలో షేర్లున్న పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ, బాలివుడ్ డైరెక్టర్ జోయా అక్తర్, ఆమె సోదరుడు బాలివుడ్ నటుడు సోదరుడు ఫర్హాన్ అక్తర్ రానున్న ఐపీఓలో తమ షేర్లను విక్రయించకుండా అంటిపెట్టుకోనున్నారు. మనీకంట్రోల్ కథనం ప్రకారం.. వీరు ఆఫర్ ప్రైస్ బ్యాండ్ రూ. 72-76 షేరు ఎగువ ముగింపులో 26 శాతం లాభాల వద్ద ఉన్నారు.విజయ్ శేఖర్ శర్మ, అక్తర్ ద్వయం పెట్టుబడి తేదీ 2021 డిసెంబర్ 21గా నమోదైంది. అప్పటి నుంచి బెంచ్‌మార్క్ నిఫ్టీ 48.32 శాతం పెరిగింది. శర్మ తన పెట్టుబడి సంస్థ వీఎస్ఎస్ ఇన్వెస్ట్‌కో ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఏడు సిరీస్ సి ప్రిఫరెన్స్ షేర్లను రూ.7.5 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడవి ప్రైస్ బ్యాండ్ దిగువన రూ. 8.96 కోట్లు, ప్రైస్ బ్యాండ్ ఎగువన రూ. 9.46 కోట్లుగా ఉన్నాయి.జోయా అక్తర్ సింగిల్ సిరీస్ సి ప్రిఫరెన్స్ షేర్‌ను రూ. 1.07 కోట్లకు కొనుగోలు చేయగా, ఫర్హాన్ 2 షేర్లను రూ. 2.14 కోట్లకు కొనుగోలు చేశారు. ఫర్హాన్‌తో కలిసి ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సహ వ్యవస్థాపకుడు రితేష్ సిధ్వానీ కూడా ఓలా ఎలక్ట్రిక్ సిరీస్ సి రౌండ్లో రెండు షేర్లను కొనుగోలు చేశారు. ప్రిఫరెన్స్ షేర్ల మార్పిడి తర్వాత, శర్మ ఓలా ఎలక్ట్రిక్‌లో 12.45 లక్షలు, జోయా అక్తర్ 1.78 లక్షలు, ఫర్హాన్ అక్తర్ 3.56 లక్షలు, రితేష్ సిధ్వానీ 3.56 లక్షల షేర్లను కలిగి ఉన్నారు. -
లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో సెషన్‌ను మొదలు పెట్టిన బెంచ్ మార్క్ సూచీలు అవే లాభాలను కొనసాగించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 30.39 పాయింట్లు లేదా 0.037% శాతం లాభంతో 81,363.11 వద్ద, నిఫ్టీ 7.60 పాయింట్లు లేదా 0.031% శాతం పెరిగి 24,842.45 వద్ద ఉన్నాయి.నిఫ్టీలో దివిస్ ల్యాబ్స్, బీపీసీఎల్, లార్సెన్, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. టైటాన్, భారతీ ఎయిర్టెల్, సిప్లా, ఐటీసీ, కొటక్ మహీంద్రా షేర్లు టాప్ లూజర్స్‌గా నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
1,000 టూ 25,000 పాయింట్లు.. నిఫ్టీ ప్రస్థానం
నిఫ్టీ 50 ఇండెక్స్ సోమవారం చరిత్రాత్మక మార్కు 24,999.75ను తాకింది. నవంబర్ 1995లో 1,000 పాయింట్లతో ప్రారంభమైన నిఫ్టీ సూచీ 25,000 మార్కును చేరడానికి సుమారు 29 ఏళ్లు పట్టింది. ఈ క్రమంలో అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక అస్థిరత, ఆర్థికమాంద్యం వంటి ఎన్నో ఒడిదొడుకులను అధిగమించింది. దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు కొనసాగిస్తే స్టాక్మార్కెట్లో మంచి రాబడులు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీ 1,000 నుంచి 25,000 మార్కు చేరడానికి పట్టిన సమయాన్ని తెలుసుకుందాం.ఇదీ చదవండి: నిఫ్టీ 25,000 పాయింట్లకు..?1000 నుంచి 2,000 మార్కు-9 ఏళ్ల, 1 నెల 10 రోజులు3000 మార్కు-1 సంవత్సరం 2 నెలలు4,000 మార్కు-1 సంవత్సరం 5,000 మార్కు-10 నెలలు6,000 మార్కు-2 నెలలు7,000 మార్కు-6.5 సంవత్సరాలు 8,000 మార్కు-4 నెలలు9,000 మార్కు-రెండున్నరేళ్లు 10,000 మార్కు-4 నెలలు10,000 నుంచి 20,000కి చేరుకోవడానికి 6 సంవత్సరాలు21,000 మార్కు-61 సెషన్లు22,000 మార్కు-ఒక నెల 23,000 మార్కు-5 నెలలు24,000 మార్కు- నెల కంటే తక్కువ సమయం24,999.75 మార్కు-రెండున్నర నెలలు -
అక్కడ మాత్రమే తగ్గిన బంగారం.. మళ్ళీ ఊపందుకున్న ధరలు
యూనియన్ బడ్జెట్ 2024-25 తరువాత ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్ళీ ఊపందుకున్నాయి. జులై 27 నుంచి ఇప్పటి వరకు (జులై 29) గరిష్టంగా తులం గోల్డ్ రేటు రూ. 430 పెరిగింది. దేశ వ్యాప్తంగా ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూసేద్దాం..విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63400 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 69160 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.150, రూ.160 పెరిగింది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 150, రూ. 160 పెరిగింది. దీంతో ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 63550 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69310 వద్ద ఉంది.హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో బంగారం ధరలు పెరుగుదల దిశగా నడుస్తుంటే.. చెన్నైలో మాత్రమే గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 550 తగ్గింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 64130 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 69980 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు వరుసగా రూ. 500, రూ. 550 పెరిగినట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర మునుపటికంటే రూ.800 పెరిగింది. దీంతో కేజీ వెండి కొనుగోలు చేయాలంటే రూ. 85,000 వెచ్చించాల్సి ఉంటుంది. మూడు రోజులు తర్వాత మళ్ళీ వెండి ధర పెరిగింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
నిఫ్టీ 25,000 పాయింట్లకు..?
ఈ వారంలో నిఫ్టీ చరిత్రాత్మక స్థాయి 25,000 పాయింట్లను పరీక్షించొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎగువ స్థాయిలో 24,963 పాయింట్ల వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇన్వెస్టర్లు జీవితకాల గరిష్టాల వద్ద లాభాలను స్వీకరిస్తే దిగువన 24,504 – 24,600 శ్రేణిలో తక్షణ మద్దతు ఉందని చెబుతున్నారు. అమెరికా జీడీపీ గణాంకాలు, అంతర్జాతీయంగా డిమాండ్ ఊపందుకోవచ్చనే అంచనాలు, దలాల్ స్ట్రీట్‌పై సంస్థాగత ఇన్వెస్టర్ల విశ్వాసం తదితర అంశాలతో బడ్జెట్ తర్వాత నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ రికవరీ అయింది. వరుస అయిదు రోజుల పతనం నుంచి గట్టెక్కిన సూచీలు శుక్రవారం జీవితకాల గరిష్టం వద్ద ముగిశాయి.ఎఫ్ఐఐల కొనుగోళ్లు: రూ.53 వేల కోట్లువిదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఎన్ఎస్డీఎల్ డేటా ప్రకారం జులై నెలలో 26 నాటికి ఈక్విటీలో రూ.33,688 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. డెట్ మార్కెట్లోకి రూ.19,222 కోట్లు వచ్చాయి. దీంతో మొత్తం ఈ నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు రూ.52,910 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ‘ఎఫ్అండ్ఓ ట్రేడింగ్‌పై సెక్యూరిటీ లావాదేవీల పన్ను పెంపుతో పాటు మూలధన లాభాలపై పన్ను పెంచాలనే బడ్జెట్ ప్రతిపాదనలు ఎఫ్‌పీఐలకు ప్రతికూలంగా మారింది. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు తిరిగి ఉపసంహరించుకునే అవకాశం లేకపోలేదు. అయితే ఈ ధోరణి స్వల్ప కాలికంగా మాత్రమే ఉంటుందని, రానున్న రోజుల్లో ఈక్విటీల్లోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయి’ అని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: ట్రేడింగ్ చేస్తున్నారా.. జాగ్రత్త!ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్‌కు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. యూరోజోన్ జీడీపీ డేటా(మంగళవారం), చైనా తయారీ రంగ గణాంకాలు బ్యాంకు ఆఫ్ ఇంగ్లాడ్ ద్రవ్య విధాన నిర్ణయాలు(గురువారం), అమెరికా ఉద్యోగాల డేటా ట్రేడింగ్‌కు ప్రభావితం చేయొచ్చు. దేశీయంగా జులై నెలకు సంబంధించి గురువారం(ఆగస్టు 1న) దేశీయ ఆటో కంపెనీల అమ్మకాల డేటా, తయారీ రంగ పీఎంఐ గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పనితీరు, రూపాయి విలువ, విదేశీ పెట్టుబడులను పరిగణించే అవకాశం ఉంది. -
ఇదే మంచి అవకాశం!.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ఇటీవల ప్రవేశపెట్టిన మోదీ 3.0 బడ్జెట్లో బంగారం మీద ట్యాక్స్ 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించినట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన తరువాత పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. జులై 23 నుంచి ఇప్పటి వరకు తులం గోల్డ్ రేటు గరిష్టంగా ఐదువేల రూపాయలు తగ్గింది. గణనీయంగా తగ్గిన ధరలు మళ్ళీ పెరుగుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి తగ్గుతున్న బంగారం ధరలు మరికొన్ని రోజుల్లో భారీగా పెరిగే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడే బంగారం కొనుగులు చేయడానికి సన్నద్ధమవ్వాలని, రాబోయే రోజులు ఇది మంచి లాభాలను తెచ్చిపెడుతుందని ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు జతీన్ త్రివేది అన్నారు.24 క్యారెట్ల బంగారం 7500 రూపాయల నుంచి 6900 రూపాయలకు చేరింది. అంటే ఒక వారం రోజుల్లోనే ఒక గ్రామ్ గోల్డ్ రేటు 600 రూపాయలు తగ్గింది. ధరల తగ్గుదల అందరినీ ఆకర్షిస్తుంది. దీంతో తప్పకుండా రాబోయే రోజుల్లో పసిడి ధరలు పెరుగుతాయని గ్లోబల్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ & పరిశోధకులు సర్వేంద్ర శ్రీవాస్తవ అన్నారు.ఈ రోజు బంగారం ధరల విషయానికి వస్తే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పసిడి ధరలు ఉలుకు పలుకు లేకుండా అన్నట్లు స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబద్, విజయవాడలో గోల్డ్ రేటు రూ. 69000 (24 క్యారెట్స్ 10 గ్రా), రూ. 63250 (22 క్యారెట్ 10 గ్రా) వద్ద ఉంది. వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. దీంతో కేజీ వెండి రూ. 84500 వద్ద ఉంది. -
ఓలా ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది.. టార్గెట్ రూ. 5,500 కోట్లు
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ వచ్చే వారం ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానుంది. ఆగస్టు 2న రిటైల్ సబ్స్క్రిప్షన్లు ప్రారంభించనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. సంస్థాగత పెట్టుబడిదారులకు మాత్రం ఒక రోజు ముందుగా ఆగస్టు 1న సబ్స్క్రిప్షన్లు తెరుచుకోనున్నాయి. ఆగస్టు 6న ఐపీఓ ముగుస్తుంది.ఐపీఓ ద్వారా రూ. 5,500 కోట్లను (సుమారు 657 మిలియన్ డాలర్లు) ఆర్జించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఆఫర్ ఫర్ సేల్ (OFS)లో భాగంగా దాదాపు 38 మిలియన్ షేర్లను విక్రయించాల్సి ఉందని కంపెనీ తెలిపింది. 2023 డిసెంబర్లో దాఖలు చేసిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌లో సూచించిన 47.4 మిలియన్ షేర్ల విక్రయం కంటే ఇది దాదాపు 20% తక్కువ.ఓలా ఎలక్ట్రిక్ సుమారు 4.2 బిలియన్ డాలర్ల నుంచి 4.4 బిలియన్ డాలర్ల వాల్యూషన్‌తో ఐపీఓకు వస్తోంది. సింగపూర్‌కు చెందిన పెట్టుబడి సంస్థ టెమాసెక్ గతేడాది 140 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన తర్వాత కంపెనీ విలువను 5.4 బిలియన్ డాలర్లుగా నిర్ణయించింది. ఆ మొత్తంతో పోలిస్తే.. ఇప్పుడు కంపెనీ ఐపీఓ వాల్యూషన్ 20 శాతం మేర తగ్గడం గమనార్హం. -
ట్రేడింగ్ చేస్తున్నారా.. జాగ్రత్త!
స్టాక్మార్కెట్లో ట్రేడింగ్ అనగానే.. ఆహా! లక్షలు సంపాదించవచ్చని చాలామంది భావిస్తారు. అందులో పెట్టుబడి పెట్టేవారు ఒక్కరోజులోనే భారీగా లాభాలు రావాలని ఆశిస్తారు. దాంతో ఎక్కువగా ఇంట్రాడే ట్రేడింగ్(ఒకరోజులో స్టాక్స్ కొని అదేరోజు అమ్మడం)ను ఎంచుకుంటున్నారు. కానీ అలా ట్రేడింగ్ చేస్తున్న ప్రతి పది మందిలో ఏడుగురు నష్టపోతున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. దీని ప్రకారం 2018–19తో పోలిస్తే 2022–23లో ఈక్విటీల్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసిన వారి సంఖ్య ఏకంగా 300 శాతం పెరిగింది. వీరిలో ఎక్కువ శాతం మంది 30 ఏళ్ల లోపు యువ ట్రేడర్లే ఉన్నారు.ఇంట్రాడే ట్రేడింగ్‌లో లాభపడిన వారితో పోలిస్తే నష్టపోయిన ట్రేడర్లు సగటున అత్యధికంగా లావాదేవీలు చేశారు. వీరి లాభనష్టాల సరళిని విశ్లేషించడానికి సెబీ అధ్యయనం నిర్వహించింది. కరోనా మహమ్మారికి పూర్వం, తర్వాత ట్రెండ్స్‌ను పరిశీలించేందుకు 2018–19, 2019–20, 2022–23 మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఉన్న రిస్క్‌ల గురించి ట్రేడర్లలో అవగాహన పెంచేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని సెబీ భావిస్తోంది.సెబీ ఇప్పటికే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) సెగ్మెంట్లో ట్రేడర్ల ధోరణులపై అధ్యయనం చేసింది. దీని ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్అండ్ఓలో ట్రేడింగ్ చేసిన వారిలో 89 శాతం మంది నష్టపోయారని చెప్పింది. ఈ నష్ట పరిమాణం సగటున రూ.1.1 లక్షలుగా ఉందని తేలింది. 2019 ఆర్థిక సంవత్సరంలో 7.1 లక్షలుగా ఉన్న ఎఫ్‌అండ్‌వో ట్రేడర్ల సంఖ్య 500 శాతం ఎగిసి 2021 ఆర్థిక సంవత్సరం నాటికి 45.24 లక్షలకు పెరిగింది.ఇదీ చదవండి: భారమవుతున్న విద్యారుణాలు!తాజా నివేదికలోని వివరాల ప్రకారం..ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ లావాదేవీలు జరిపే ప్రతి ముగ్గురిలో ఒకరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు. 30 ఏళ్ల లోపు వయసున్న ఇంట్రాడే ట్రేడర్ల సంఖ్య 2018–19లో 18 శాతంగా ఉండగా 2022–23లో 48 శాతానికి పెరిగింది. 2022–23లో 71 శాతం మంది (ప్రతి పది మందిలో ఏడుగురు) ఇంట్రాడే ట్రేడర్లు నికరంగా నష్టపోయారు. తరచుగా ట్రేడింగ్ చేసి (ఏడాదికి 500 పైగా ట్రేడ్లు) నష్టపోయిన ట్రేడర్ల సంఖ్య 80 శాతం పెరిగింది. ట్రేడింగ్‌లో నష్టపోవడమే కాకుండా ఆ నష్టాల్లో దాదాపు సగభాగం (57 శాతం) ట్రేడింగ్ ఖర్చుల రూపంలో సమర్పించుకున్నారు. ఇక నష్టపోయిన వారిలో అత్యధికులు (76 శాతం) యువ ట్రేడర్లే ఉండటం గమనార్హం. -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
యూనియన్ బడ్జెట్ ప్రారంభమైంప్పటి నుంచి వరుస నష్టాల్లో సాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయంలో భారీ లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ 1,292.92 పాయింట్ల భారీ లాభంతో 81,332.72 వద్ద, నిఫ్టీ 428.75 పాయింట్ల లాభంతో 24,834.85 వద్ద ముగిసింది.శ్రీరామ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్స్, సిప్లా, భారతి ఎయిర్టెల్, అపోలో హాస్పిటల్, అశోక్ లేల్యాండ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, నెస్లే, ఫెడరల్ బ్యాంక్ వంటి సంస్థలు టాప్ లూజర్స్ జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 109.09 పాయింట్ల నష్టంతో.. 80,039.80 వద్ద, నిఫ్టీ 7.40 పాయింట్ల నష్టంతో 24,406.10 వద్ద నిలిచాయి.టాటా మోటార్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, సన్ ఫార్మా వంటి కంపెనీ టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. యాక్సిస్ బ్యాంక్, నెస్లే, టైటాన్ కంపెనీ, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తక్షణం తగ్గినా.. భవిత ‘బంగారమే’!
పుత్తడిపై కస్టమ్స్ సుంకాలు 15% నుంచి 6%కి తగ్గిస్తున్నట్లు వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వెంటనే ఇటు స్పాట్లో అటు ఫ్యూచర్స్ మార్కెట్లలో రూ.4,000 వరకూ పడిపోయిన పసిడి ధరలు.. ఇదే రీతిలో ముందు ముందు ఆభరణ ప్రియులకు అంతే సంతోషాన్ని కలిగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ అంశాలతో పాటు దేశీయంగా రూపాయి విలువ పతనం ఇందుకు కారణం.→ భౌగోళిక ఉద్రిక్తతలను మొదట ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, దీనికి పశ్చిమ దేశాల మద్దతు అలాగే చైనాతో అమెరికాకు ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితికి దారితీసే అంశాలు. ఎలాంటి ఉద్రిక్తతలు నెలకొన్నా.. పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్ బంగారం వైపే చూస్తాడనడంలో సందేహం లేదు. → ఇక రెండో అంశానికి వస్తే.. అమెరికాతో సహా పలు దేశాలు సరళతర వడ్డీరేట్ల విధానంలోకి మారినప్పటికీ ఆ విధానాన్ని ఎంతవరకూ కొనసాగిస్తాయో తెలియని పరిస్థితి. సరళతర వడ్డీరేట్ల విధానంతో బంగారంలో కొనుగోళ్లు పెరుగుతాయి. అయితే ఈ విధానం కొనసాగింపునకు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం సమస్యలు, సవాళ్లు ఉన్నాయి. → కీలక మూడవ అంశం.. రూపాయి విలువ. డాలరుతో రూపాయి మారకం విలువ సరికొత్త కనిష్ట స్థాయి రికార్డులను కొనసాగిస్తోంది. బుధవారం ఆల్‌టైమ్ కనిష్టం 83.71 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 83.72 కనిష్టాన్ని తాకింది. → భౌగోళిక ఆర్థిక అనిశ్చితి అంశాల నేపథ్యంలో... అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్చ ంజ్లో ఈ నెల 16వ తేదీన ఔన్స్ కు (31.1గ్రా) ఆల్‌టైమ్ హై 2,489 డాలర్లను తాకిన పసిడి ఆగస్టు కాంట్రాక్ట్ ధర అటు పై కొంత తగ్గినప్పటికీ... పటిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. అంతర్జాతీయ ఫ్యూ చర్స్లో 18 డాలర్లు అధికంగా 2,425 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత్‌లో రూపాయి క్షీణిస్తూ... అంతర్జాతీయంగా ధర పెరుగుదల ధోరణే కొనసాగిస్తే దేశీయంగా సైతం బంగారం మున్ముందుకే సాగుతుందనడంలో సందేహం లేదు. పెట్టుబడులకు ప్లస్సే... దేశీయంగా శుభకార్యాల్లో భారతీయులు పసిడి కొనుగోళ్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిన అంశమే. ఇది ఎలాగూ తప్పని అంశం. ఇక పసిడి పెట్టుబడులకు ఇది తగిన అవకాశమనడంలో సందేహం లేదు. వినియోగదారులకు ధరల తగ్గుదల ఇప్పుడు ప్రయోజనకరంగా ఎలానూ ఉంటుంది. తక్కువ ఖర్చులు అలాగే 2.5% వార్షిక వడ్డీని అందించే సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి డిజిటల్ ఆప్షన్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమ యం అనడంలో సందేహం లేదు.దేశీయంగా రెండోరోజూ భారీ తగ్గుదల బడ్జెట్లో నిర్ణయంతో దేశీయంగా రెండవరోజూ బుధవారమూ దేశీయంగా ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధానిలో 99.9 స్వచ్ఛత ధర 10 గ్రాములకు రూ.650 తగ్గి, రూ. 71,650కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇంతే స్థాయిలో దిగివచ్చి రూ. 71,300కు దిగివచి్చంది. ఇక మంగళవారం రూ.4 వేల వరకూ తగ్గిన వెండి ధర బుధవారం అక్కడక్కడే 87,500 వద్ద ముగిసింది. దేశ రాజధాని ముంబైలో 99.9, 99.5 స్వచ్ఛత ధరలు వరుసగా రూ. 451, రూ.449 తగ్గి రూ.69,151, రూ.68,874కు దిగివచ్చాయి. వెండి ధర రూ.57 తగ్గి రూ.84,862 వద్ద ముగిసింది. -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 280.16 పాయింట్ల నష్టంతో 80,148.88 వద్ద, నిఫ్టీ 65.55 పాయింట్ల నష్టంతో 24,413.50 వద్ద ముగిశాయి.టాప్ గెయినర్స్ జాబితాలో HDFC లైఫ్ ఇన్సూరెన్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, టెక్ మహీంద్రా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), టాటా మోటార్స్ మొదలైన కంపెనీలు చేరాయి. బజాజ్ ఫిన్సర్వ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, బ్రిటానియా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ మొదలైనవి నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి..వెండి.. ఊరట!
న్యూఢిల్లీ: ఇటు బులియన్ పరిశ్రమకు అటు ఆభరణాల ప్రియులకు ఊరటనిస్తూ ఆర్థికమంత్రి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాలు ప్రస్తుతం 15 శాతంకాగా, ఈ రేటును 6 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. ఇందులో ప్రాథమిక కస్టమ్స్ సుంకం (బీసీడీ) 10 నుంచి 5 శాతానికి తగ్గగా, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ (ఏఐడీసీ) 5 శాతం నుంచి 1 శాతానికి చేరింది.ఇక విలువైన లోహాల నాణేలు, హుక్, క్లాస్ప్, క్లాంప్, పిన్, క్యాచ్, స్క్రూ బ్యాక్ వంటి చిన్న భాగాలకు సంబంధించిన బంగారం–వెండి ఫైండింగ్స్, బంగారం, వెండి కడ్డీలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని కూడా 15 శాతం నుంచి 6 శాతానికి బడ్జెట్ తగ్గించింది. మరింత మెరుగుదల అవసరమైన బంగారం, వెండి డోర్లపై కస్టమ్స్ సుంకం 14.35 శాతం నుంచి 5.35 శాతానికి తగ్గించారు. ‘‘దేశంలో బంగారం, విలువైన లోహ ఆభరణాల పరిశ్రమకు ఊతం ఇవ్వడానికి బంగారం– వెండిపై కస్టమ్స్ సుంకాలను 6 శాతానికి తగ్గించాలని నేను ప్రతిపాదిస్తున్నాను’’ అని ఆర్థికమంత్రి తెలిపారు. ప్లాటినం, పల్లాడియం, ఓస్మియం, రుథేనియం, ఇరిడియంలపై లెవీని కూడా 15.4 శాతం నుంచి 6.4 శాతానికి బడ్జెట్లో తగ్గించారు.రాజధానిలో రూ.3,350 తగ్గుదల ఇక ఆర్థిక మంత్రి కీలక ప్రకటన నేపథ్యంలో స్పాట్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు భారీగా పడ్డాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత (99.9 శాతం ప్యూరిటీ) పసిడి ధర క్రితం ముగింపుతో పోలి్చతే రూ.3,350 తగ్గి, రూ.72,300కు దిగివచి్చంది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో దిగివచ్చి రూ.71,950 స్థాయికి చేరింది.వెండి కేజీ ధర సైతం రూ.3,500 (4 శాతం) తగ్గి రూ.87,500కు దిగివచ్చింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై విషయానికి వస్తే, 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత 10 గ్రాముల ధరలు క్రితం ముగింపుతో పోలి్చతే రూ.3,614 రూ.3,602 చొప్పున తగ్గి వరుసగా రూ.69,602, రూ.69,323కు దిగివచ్చాయి. ఇక వెండి కేజీ ధర రూ.3,275 తగ్గి రూ.84,919కి దిగింది. ఫ్యూచర్స్‌లో రూ.4,000 డౌన్ ఆర్థికమంత్రి ప్రకటన వెంటనే ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో చురుగ్గా ట్రేడవుతున్న బంగారం ఆగస్టు కాంట్రాక్ట్ 10 గ్రాముల ధర క్రితం ముగింపుతో పోలి్చతే దాదాపు రూ.4,000 పడిపోయి (5 శాతంపైగా) రూ.68,500కు చేరింది. కేజీ వెండి ధర సైతం రూ.88,995 నుంచి రూ.84,275కు దిగివచి్చంది. అంతర్జాతీయంగా ధర ఇలా... అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో ఈ నెల 16వ తేదీన ఔన్స్‌కు (31.1గ్రా) ఆల్‌టైమ్ హై 2,489 డాలర్లను తాకిన పసిడి ఆగస్టు కాంట్రాక్ట్ ధర మంగళవారం 2,400 డాలర్లపైన ట్రేడవుతోంది. తీపికబురే కానీ... కస్టమ్స్ సుంకాలు తగ్గించడం తక్షణ డిమాండ్‌కు సంబంధించి బులియన్ పరిశ్రమ, వినియోగదారుకు తీపి కబురే అయినప్పటికీ ఈ నిర్ణయంపై రానున్న కాలంలో భౌగోళిక ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల, దేశీయంగా డాలర్ మారకంలో రూపాయి విలువల కదలికలు ప్రభావం చూపుతాయి.డిజిటల్ పెట్టుబడికి అవకాశంకస్టమ్స్ సుంకం తగ్గింపు బులియన్ మార్కెట్‌ను తక్షణం ప్రభావితం చేసే అంశమే. ఇది పెట్టుబడిదారులకు సానుకూల చర్య అయినప్పటికీ, చైనాసహా ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పటికీ బంగారం ధరలను ప్రభావితం చేయవచ్చు. 2.5% వార్షిక వడ్డీని అందించే సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి డిజిటల్ ఆప్షన్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది తగిన సమయం. – మహేంద్ర లూనియా, విఘ్నహర్తా గోల్డ్ లిమిటెడ్ చైర్మన్ -
డెరివేటివ్స్అంటే దడే!
న్యూఢిల్లీ: బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(డెరివేటివ్స్) లావాదేవీలపై పన్నును పెంచేందుకు ప్రతిపాదించారు. ఇందుకు అనుగుణంగా ఎఫ్‌అండ్‌వో సెక్యూరిటీస్‌లో ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ)ను పెంచారు. దీంతో సెక్యూరిటీల ఆప్షన్ విక్రయంపై ప్రస్తుతమున్న ఆప్షన్ ప్రీమియంలో 0.625 శాతం పన్ను 0.1 శాతానికి పెరగనుంది. ఇక సెక్యూరిటీల ఫ్యూచర్స్ విక్రయంపై సైతం 0.0125 శాతం నుంచి 0.02 శాతానికి పెంచారు. అక్టోబర్ 1 నుంచి పన్ను పెంపు అమల్లోకి రానుంది.నిజానికి ఎఫ్‌అండ్‌వో విభాగంలో ఇటీవల కొంతకాలంగా రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా ఆసక్తి చూపుతున్నారు. దీనిపై సెబీ, ఆర్థిక శాఖ, స్టాక్ ఎక్సే్ఛంజీలతోపాటు ఆర్థిక సర్వే సైతం ఆందోళన వ్యక్తం చేసింది. డెరివేటివ్స్ విభాగంలో రిటైలర్ల పారి్టసిపేషన్ భారీగా పెరిగిపోతుండటంతో జూదానికి దారితీస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో సీతారామన్ ఎఫ్‌అండ్‌వో లావాదేవీలపై పన్నులను పెంచేందుకు నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సెబీ చీఫ్ మాధవి పురి బచ్, ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ ఇటీవలే ఎఫ్‌అండ్‌వో లావాదేవీలు పెరుగుతుండటంపై రిటైలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. రిటైలర్లను డెరివేటివ్స్ అత్యధికంగా ఆకట్టుకుంటున్న కారణంగా విశ్లేషకులు సైతం రిస్కులను అర్ధం చేసుకోగలిగినవాళ్లు మాత్రమే లావాదేవీలను చేపట్టమంటూ అప్రమత్తం చేస్తున్నారు. సాధారణ ఇన్వెస్టర్లు వీటిని చేపట్టకపోవడమే మేలని సూచిస్తున్నారు. టర్నోవర్ దూకుడు డెరివేటివ్స్ విభాగంలో నెలవారీ టర్నోవర్ 2024 మార్చికల్లా కొన్ని రెట్లు ఎగసి రూ. 8,740 లక్షల కోట్లను తాకింది. 2019 మార్చిలో కేవలం రూ. 217 లక్షల కోట్లుగా నమోదుకావడం గమనార్హం! ఇదే కాలంలో నగదు విభాగంలోనూ రోజువారీ సగటు టర్నోవర్ రూ. లక్ష కోట్లను తాకగా.. ఎఫ్‌అండ్‌వోలో రూ. 330 లక్షల కోట్లకు చేరింది. ఎఫ్‌అండ్‌వో అంటే? ఒక షేరు లేదా కమోడిటీ విలువ ఆధారంగా కుదుర్చుకునే తాత్కాలిక కాంట్రాక్ట్‌ల లావాదేవీలను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌గా పేర్కొనవచ్చు. అత్యధిక శాతం ట్రేడర్లు రిసు్కల రక్షణ(హెడ్జింగ్)కు, ధరల కదలికలపై అంచనాలు, షేర్లు లేదా కమోడిటీల ధర వ్యత్యాసాల లబ్ధికి సైతం వీటిలో లావాదేవీలను చేపడుతుంటారు. వెరసి వీటిని స్వల్పకాలిక లాభార్జనకు స్పెక్యులేటివ్ టూల్‌గా వినియోగిస్తుంటారు. అయితే మార్కెట్ ఆటుపోట్లు, లెవరేజ్.. తదితర రిస్క్‌ల కారణంగా అత్యధికస్థాయిలో నష్టాలు సైతం వాటిల్లుతుంటాయి.సెబీ ఇటీవలి నివేదిక ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లలో 89 శాతంమంది డెరివేటివ్స్‌లో నష్టపోతున్నారు. 2021–22 ఏడాదిలో వీరికి సగటున రూ. 1.1 లక్ష చొప్పున నష్టాలు నమోదయ్యాయి. కరోనా కాలంలో ఎఫ్‌అండ్‌వో ఇన్వెస్టర్ల సంఖ్య 500 శాతం దూసుకెళ్లింది. 2019లో ఈ సంఖ్య 7.1 లక్షలుకాగా.. 2021కల్లా 45.24 లక్షలకు జంప్‌చేసింది.5 రెట్లు అధికమైనా.. డెరివేటివ్స్‌లో ఎస్టీటీ 5 రెట్లు పెరగనున్నట్లు సిట్రస్ అడ్వయిజర్స్ వ్యవస్థాపకుడు సంజయ్ సిన్హా పేర్కొన్నారు. ఇటీవల ఈ విభాగంలో లావాదేవీలు భారీగా పెరిగిన నేపథ్యంలో పన్ను పెంపు ఊహించిందేనని తెలియజేశారు.అయితే పన్ను పెంపు అమల్లోకిరానున్న 2024 అక్టోబర్ 1 నుంచి ఎక్సే్ఛంజీల టర్నోవర్ చార్జీలు తగ్గనున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ డిజిటల్ బిజినెస్ హెడ్ ఆశిష్ నందా పేర్కొన్నారు. ఉదాహరణకు ఆప్షన్స్‌పై రూ. 10,000 రౌండ్ ట్రిప్ ప్రీమియంపై ఎస్టీటీ రూ. 3.75 పెరుగుతుందనుకుంటే.. టర్నోవర్ చార్జీలు రూ. 3.5–4 స్థాయిలో తగ్గనున్నట్లు వివరించారు. దీంతో నికరంగా ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.ఎల్‌టీసీజీలో సవరణలుకేంద్రానికి రూ. 15,000 కోట్ల అదనపు ఆదాయంబడ్జెట్లో వివిధ ఆస్తుల(సెక్యూరిటీలు, స్థిరాస్తులు) హోల్డింగ్ కాలావధి ఆధారంగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌లను క్రమబదీ్ధకరించారు. ఏడాదికి మించి లిస్టెడ్ ఫైనాన్షియల్ ఆస్తుల హోల్డింగ్‌తోపాటు.. రెండేళ్లకు మించి ఆర్థికేతర ఆస్తులు, అన్‌లిస్టెడ్ ఆస్తుల హోల్డింగ్స్ దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (ఎల్టీసీజీ) జాబితాలో చేరనున్నాయి.అన్‌లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లను మినహాయించి(వీటికి సంబంధిత స్లాబ్‌లు వర్తిస్తాయి) వివిధ ఆస్తులపై దీర్ఘకాలిక లాభాల పన్ను సగటున 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. ఇక స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌ను 15 శాతం నుంచి 20 శాతానికి పెంచారు. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్, బిజినెస్ ట్రస్ట్ యూనిట్లు వీటిలోకి వస్తాయి. అయితే ఆర్థికేతర ఆస్తులపై 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించారు.అయితే ఇండెక్సేషన్ లబ్ధిని ఎత్తివేశారు. ఎల్టీసీజీ పన్ను మినహాయింపు పరిమితి రూ. లక్ష నుంచి రూ. 1.25 లక్షలకు పెంచారు. కాగా... మూలధన లాభాలపై పన్ను(క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్) రేట్ల సవరణ కారణంగా రూ. 15,000 కోట్లమేర అదనపు ఆదాయం సమకూరే వీలున్నట్లు రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా అంచనా వేశారు. బైబ్యాక్ షేర్లపైనా పన్నుడివిడెండ్ తరహాలో విధింపు బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం డివిడెండ్ తరహాలో బైబ్యాక్ చేసే షేర్లపై వాటాదారులు పన్ను చెల్లించవలసి ఉంటుంది. అక్టోబర్ 1నుంచి అమల్లోకి రానున్న నిబంధనలతో ఇకపై బైబ్యాక్ షేర్లకు వాటాదారులపై పన్ను విధించనున్నారు.వెరసి కంపెనీలు చేపట్టే బైబ్యాక్‌లో భాగంగా షేర్లకు చెల్లించే సొమ్ముపై డివిడెండ్ తరహాలో వాటాదారులపైనే పన్ను భారం పడనుంది. ఇది ఇన్వెస్టర్లపై పన్ను భారాన్ని మరింత పెంచనుంది. మరోవైపు ఎస్టీటీతోపాటు.. స్వల్పకాలిక లాభాలపై పన్ను పెంపునకు తాజా బడ్జెట్ తెరతీసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ బైబ్యాక్ షేర్లకు కంపెనీలే పన్ను చెల్లిస్తున్నాయి.మ్యాచ్ విన్నింగ్ బడ్జెట్..ప్రపంచ కప్ గెలిచిన తర్వాత.. టీమ్ ఇండియా కోసం ఆర్థిక మంత్రి సీతారామన్ ద్వారా ఒక మ్యాచ్ విన్నింగ్ బడ్జెట్ ఇది. సామాన్యుల ప్రయోజనాలపై బడ్జెట్ దృష్టి సారిస్తుంది. అనుభవజు్ఞడైన కెప్టెన్ నాయకత్వంలో దేశం నాడిని పెంపొందించే కచి్చత, వివరణాత్మక, పరిశోధించి రూపొందించిన బడ్జెట్. – హర్‡్ష గోయెంకా, చైర్మన్, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్. పెట్టుబడులను ఆకర్షిస్తుంది..ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడానికి, స్థిర భవిష్యత్తును ప్రోత్సహించడానికి రూపొందించిన దార్శనికత, ఆచరణాత్మక బ్లూప్రింట్. ఇది వినియోగాన్ని ప్రేరేపిస్తుంది. గణనీయంగా పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని స్థిరీకరిస్తుంది. భారత్‌ను సాంకేతికతతో నడిచే, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టింది. – పవన్ ముంజాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హీరో మోటోకార్ప్.సమగ్ర రోడ్‌మ్యాప్..ప్రజల–కేంద్రీకృత బడ్జెట్. ఇది ఆర్థిక స్థిరత్వంతో సమానమైన వృద్ధిని సమతుల్యం చేస్తుంది. ఉద్యోగాల కల్పనపై దృష్టి సారిస్తూనే సుస్థిర, సమాన వృద్ధి కోసం ప్రభుత్వం సమగ్ర రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది. – సంజీవ్ పురి, ప్రెసిడెంట్, సీఐఐ.