Market
-
స్టాక్ మార్కెట్‌పై పన్నుల పిడుగు
రూపాయి: 83.72 ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ అటు ఇంట్రాడే, ఇటు ముగింపు రెండింటిలో చరిత్రాత్మక కనిష్టాలను చూసింది. ఇంట్రాడేలో 83.72 స్థాయిని తాకితే, చివరికి క్రితం ముగింపుతో పోలి్చతే 3 పైసలు నష్టంతో 83.69 వద్ద ముగిసింది. క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను రేట్ల పెంపు రూపాయి నష్టానికి కారణం. న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ స్టాక్ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగ సమయంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెక్యూరిటీలపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్టీటీ), స్వల్పకాలిక మూలధన రాబడి(ఎస్టీసీజీ), ధీర్ఘ కాలిక మూలధన రాబడి(ఎల్టీసీజీ)లపై పన్నుల పెంపు ప్రతిపాదనలు ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశపరిచాయి.అయితే పన్ను మినహాయింపులు, కస్టమ్స్ సుంకం తగ్గింపు, ద్రవ్యోలోటు కట్టడికి చర్యల ప్రకటనలతో సూచీలు మళ్లీ పుంజుకొని స్వల్ప నష్టాలతో ముగిశాయి. రియలీ్ట, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రీయల్, ఫైనాన్సియల్ సరీ్వసెస్, మెటల్, కమోడిటీస్, టెలికం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, సరీ్వసెస్, ఫార్మా, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో తీవ్ర ఒడిదుడుకులు బడ్జెట్ రోజు ఉదయం స్టాక్ మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 222 పాయింట్లు పెరిగి 80,725 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 24,569 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఎఫ్అండ్ఓ సెక్యూరిటీలపై ఎస్టీటీ, ఎల్టీసీజీ, ఎస్టీసీజీ పన్నుల పెంపు ప్రకటనలతో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ 1,278 పాయింట్లు క్షీణించి 79,224 పాయింట్ల వద్ద, నిఫ్టీ 235 పాయింట్లు కుప్పకూలి 24,074 పాయింట్ల వద్ద కనిష్టాలను తాకాయి.పన్ను మినహాయింపులు, కస్టమ్స్ సుంకం తగ్గింపు ప్రకటన తరువాత.., కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. దీంతో సూచీలు కనిష్టాల నుంచి రికవరీ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 73 పాయింట్లు నష్టపోయి 80,429 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 24,479 వద్ద ముగిసింది. ‘‘బడ్జెట్లో మూలధన వ్యయాలకు అధిక కేటాయింపులు ఉండొచ్చని ఆశించారు. స్వల్పకాలిక మూలధన లాభాలపై (ఎస్టీసీజీ) పన్ను 20 శాతానికి పెంచడం; దీర్ఘకాలిక మూలధన లాభాలపై (ఎల్టీసీజీ) పన్ను 12.5 శాతానికి పెంపు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెక్యూరిటీలపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్టీటీ)0.1%, 0.02 శాతం పెంపు అంశాలు స్టాక్ మార్కెట్‌కు కచి్చతంగా ప్రతికూల అంశాలు.స్వల్ప కాలం పాటు ఎదురయ్యే ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలి. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన అధిక కేటాయింపు ప్రకటనలు మార్కెట్ నష్టాలు తగ్గించాయి’’ మెహ్తా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే తెలిపారు. ⇒ వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపుతో పాటు ఉద్యోగ కల్పనలకు పెద్ధ పీట వేయడంతో కన్జూమర్, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించాయి. ఐటీసీ షేరు 5%, టాటా కన్జూమర్స్ ప్రొడెక్ట్స్, డాబర్ షేర్లు 3% పెరిగాయి. గోద్రేజ్ కన్జూమర్ ప్రోడెక్ట్స్, హెచ్‌యూఎల్, మారికో, బ్రిటానియా, కోల్గేట్, యూనిటెడ్ బేవరేజెస్, యూనిటెడ్ స్పిరిట్స్, బలరామ్‌పుర్ చినీ షేర్లు 2% నుంచి ఒకశాతం లాభపడ్డాయి. -
ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ధరలు
యూనియన్ బడ్జెట్ 2024-25 ప్రకటన తరువాత బంగారం ధరలు భారీగా తగ్గాయి. గోల్డ్, సిల్వర్ వస్తువులు, కడ్డీలపైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. ప్లాటినం, పల్లాడియం, ఇరీడియం వంటి వాటిపై కూడా సుంకం 15.4 శాతం నుంచి 6 శాతానికి తగ్గిపోయింది.బంగారం, వెండి ధరలుకేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో 22 క్యారెట్ల తులం ధర రూ. 2750 తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్ మీద రూ. 2999 తగ్గింది. ధరల తగ్గుదలతో పసిడి ధరలు వరుసగా రూ. 64950 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 70860 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద నిలిచాయి.ఇక చైన్నె, ఢిల్లీలలో కూడా 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 2750, రూ. 2990 తగ్గింది. దీంతో అక్కడ రాష్ట్రాల్లో కూడా బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గాయి. వెండి ధర కూడా గరిష్టంగా రూ. 3500 తగ్గింది. దీంతో కేజీ వెండి రూ. 88000లకు చేరింది. -
బడ్జెట్ ఎఫెక్ట్: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు (మంగళవారం) ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 73.04 పాయింట్ల నష్టంతో 80,429.04 వద్ద, నిఫ్టీ 30.20 పాయింట్ల నష్టంతో 24,479.05 వద్ద ముగిశాయి.టైటాన్ కంపెనీ, ఐటీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, అదానీ పోర్ట్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్ & టుబ్రో, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్‌కు బడ్జెట్ షాక్
భారతీయ స్టాక్‌మార్కెట్లకు కేంద్ర బడ్జెట్ సెగ తగిలింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై కోటి ఆశలతో ఉన్న ఇన్వెస్టర్లు మార్కెట్ ఆరంభంలో సానుకూలంగా ఉన్నారు. కానీ బడ్జెట్ ప్రసంగంతో నిరాశ పడ్డారు. క్యాపిటల్ గెయిన్స్‌పై టాక్స్ తదితర పరిణామాల నేపథ్యంలో అమ్మకాలను దిగారు. దీంతో సెన్సెక్స్ ఏకంగా 750 పాయింట్లకు పైగా కుప్పకూలగా, నిఫ్టీ కూడా అదే బాటలోనడిచింది.ప్రస్తుతం కాస్త తెప్పరిల్లిన సెన్సెక్స్ 423 పాయింట్ల నష్టానికి పరిమితమే 80వేలకు ఎగువనకొనసాగుతుంది. అటు నిష్టీ 117 పాయింట్ల నష్టంతో 24, 392 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే ఆ ర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగానికి రూ. 1.52 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో వ్యవసాయ రంగ షేర్లు 10 శాతం వరకు ర్యాలీ చేశాయి. కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్, కోరమాండల్ ఆగ్రో ప్రొడక్ట్స్ అండ్ ఆయిల్స్ లిమిటెడ్, ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్, నోవా అగ్రిటెక్ లిమిటెడ్ టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. ఓఎన్జిసి, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, బిపిసిఎల్ , రిలయన్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.ఎస్టీటీ దెబ్బఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) వ్యాపారులకు షాకిచ్చేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెక్యూరిటీ లావాదేవీల పన్ను (STT) రేటును 0.01 శాతం నుండి 0.02 శాతానికి పెంచేశారు. ఫలితంగా ఈ బడ్జెట్ ప్రతిపాదనను అమలు తరువాత ఈక్విటీ , ఇండెక్స్ ట్రేడర్లు వమ వ్యాపారంపై రెట్టింపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.రూపాయి ఢమాల్ క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను రేటును పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదనతో రూపాయి రికార్డు స్థాయిలో పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.69కి క్షీణించింది. గత జీవితకాలపు కనిష్ట స్థాయి 83.67. కాగా కేంద్ర బడ్జెట్లో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 10-12.5శాతానికి పెంచారు. అలాగే , దిగువ, మధ్య-ఆదాయ తరగతుల ప్రయోజనాల కోసం కొన్ని ఆర్థిక ఆస్తులపై మూలధన లాభాల మినహాయింపు పరిమితిని సంవత్సరానికి రూ. 1.25 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 102.57 పాయింట్ల నష్టంతో 80,502.08 వద్ద, నిఫ్టీ 21.65 పాయింట్ల నష్టంతో 24,509.25 వద్ద ముగిశాయి.గ్రాసిమ్ ఇండస్ట్రీస్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ మొదలైన కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. విప్రో, కోటక్ మహీంద్రా, రిలయన్స్, ఐటీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Budget 2024: బడ్జెట్, క్యూ1 ఫలితాలపై దృష్టి
ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు సమగ్ర బడ్జెట్– 2024కు అనుగుణంగానే ఈ వారం స్టాక్ మార్కెట్ కదలాడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే కార్పొరేట్ కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలపైనా మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. జూలై డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు (గురువారం), ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చంటున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, రూపాయి ట్రేడింగ్, క్రూడ్ కదలికలు తదితర సాధారణ అంశాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావమెంత..? ఎన్డీఏ 3.0 ప్రభుత్వం ఈ జూలై 23న (మంగళవారం) ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆర్థిక లోటు, మూలధన వ్యయాలు, సామాజిక వ్యయాల కేటాయింపుల మధ్య సమతుల్యత చేకూర్చే దిశగా ప్రభుత్వం ప్రయతి్నస్తుండటంతో ఈసారి ‘పారిశ్రామిక అనుకూల బడ్జెట్’ను నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగ కల్పన, మేక్ ఇన్ ఇండియా, గ్రీన్ ఎనర్జీ, పట్టణ, గ్రామీణాభివృద్ధి అంశాలపై దృష్టి సారించే వీలుంది. అలాగే ‘దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను’పై ప్రకటన కోసం దేశీయ విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘‘బడ్జెట్ అంచనాలను అందుకుంటే, మార్కెట్‌కు మరింత స్థిరత్వం లభిస్తుంది. రక్షణ, రైల్వే, మౌలిక రంగ షేర్లలో కదలికలు అధికంగా ఉండొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌పై దృష్టి మార్కెట్ ముందుగా గత వారాంతాన వెల్లడైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యస్ బ్యాంక్ క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో బీఎస్ఈ ఎక్సే్చంజీలో లిస్టయిన 298 కంపెనీలు జూన్ క్వార్టర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్అండ్టీ, ఎస్బీఐ ఇన్సూరెన్స్, నెస్లే, సిప్లా, ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంకులున్నాయి. వీటితో పాటు ఇండిగో, ఐసీఐసీఐ ప్రుడెన్సియల్ లైఫ్ ఇన్సూరెన్స్, అలైడ్ బ్లెండర్స్, ఐడీబీఐ బ్యాంక్, సుజ్లాన్ ఎనర్జీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ సరీ్వసెస్, టొరెంట్ ఫార్మా, యూనిటెడ్ స్పిర్పిట్స్ కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు యూరోజోన్ జూలై వినియోగదారుల విశ్వాస గణాంకాలు, అమెరికా జూన్ గృహ అమ్మకాలు మంగళవారం విడుదల కానున్నాయి. అమెరికా, జపాన్ యూరోజోన్లు బుధవారం జూలై నెలకు సంబంధించి తయారీ, సేవారంగ గణాంకాలను ప్రకటించనున్నాయి. అదే రోజున దేశీయ జూలై హెచ్ఎస్బీసీ తయారీ, సేవారంగ పీఎంఐ గణాంకాలు విడుదల కానున్నాయి. అమెరికా క్యూ2 జీడీపీ డేటా, కోర్ పీసీఈ ధరల గణాంకాలు, వాస్తవ వినియోగదారుల వ్యయ డేటా గురువారం వెల్ల డి కానుంది. ఇక వారాంతపు రోజైన శుక్రవారం ఆర్బీఐ జూలై 19తో ముగిసిన వారపు ఫారెక్స్ నిల్వ లు ప్రకటించనుంది. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపుఈ గురువారం(జూలై 25న) నిఫ్టీకి చెందిన జూలై సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘సాంకేతికంగా నిఫ్టీ 24,700 వద్ద కీలక నిరోదాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని చేధించగలిగితే 25,000 స్థాయిని శ్రేణిని పరీక్షిస్తుంది. దిగువ స్థాయిలో 24,000 వద్ద తొలి మద్దతు, 23,500 వద్ద మరో కీలక మద్దతు స్థాయిలు ఉన్నాయి’’ అని ఆప్షన్ డేటా సూచిస్తోంది. -
ఈ వారం టాప్ 10 కంపెనీలు.. రూ. 1.03 లక్షల కోట్లు
ఈ వారం టాప్ 10 అత్యంత విలువైన కంపెనీలు కలిసి మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ. 1.03 లక్షల కోట్లను పొందాయి. ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ లిమిటెడ్ అత్యధిక లాభాన్ని పొందాయి.టీసీఎస్ మార్కెట్ విలువ ఈ వారం దాదాపు రూ.43,000 కోట్లు పుంజుకుని రూ.15.57 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఈ వారం 0.51% పెరిగింది. ఇన్ఫోసిస్ రూ.33,000 కోట్లు లాభపడింది. దాని మార్కెట్ విలువ రూ.7.44 లక్షల కోట్లకు చేరుకుంది.కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టాప్ 10 సంస్థలలో అత్యధికంగా రూ.57,000 కోట్లు క్షీణించింది. దీని మార్కెట్ క్యాప్ రూ.21.04 లక్షల కోట్లకు తగ్గిపోగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.12,000 కోట్లు తగ్గి 12.23 లక్షల కోట్లకు పడిపోయింది.అయితే క్షీణించినప్పటికీ ఆర్ఐఎల్ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్ లిమిటెడ్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఐటీసీ, లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
ఇది మేల్కొలుపు: మైక్రోసాఫ్ట్ అంతరాయంపై సెబీ చీఫ్
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన బగ్‌తో ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైంది. చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలు సహా సింగపూర్ ఎక్స్ఛేంజ్ (SGX) వంటి కొన్ని స్టాక్ ఎక్సేంజ్‌లపైనా దీని ప్రభావం పడింది.దీనిపై సెబీ చైర్పర్సన్ మధబి పూరిబుచ్ స్పందించారు. గ్లోబల్ మైక్రోసాఫ్ట్ అంతరాయాన్ని మేల్కొలుపుగా ఆమె అభివర్ణించారు. సైబర్ సెక్యూరిటీని టూ డైమెన్షనల్‌గా చూడాలని మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు సూచించారు. మైక్రోసాఫ్ట్ విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. -
మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. భారీగా నష్టపోయిన టెక్ దిగ్గజం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దిగ్గజ కంపెనీలకు అంతరాయం కలిగించిన మైక్రోసాఫ్ట్ సమస్య స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసింది. దీంతో మైక్రోసాఫ్ట్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఒక్క సారిగా కంపెనీ 23 బిలియన్ డాలర్లు నష్టపోయింది.టెక్ దిగ్గజం షేర్ విలువ ఒకేసారి 0.71 శాతం తగ్గింది. దీంతో కంపెనీ దాదాపు 23 బిలియన్ డాలర్లు నష్టపోయింది. మైక్రోసాఫ్ట్ స్టాక్ ధర నిన్నటి ముగింపు సమయంలో 443.52 డాలర్ల వద్ద ఉండేది. అయితే ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ సమయంలో ఇది 440.37 డాలర్లకు పడిపోయినట్లు ఇన్వెస్ట్మెంట్ డేటా ప్లాట్‌ఫారమ్ స్టాక్‌లిటిక్స్ వెల్లడించింది.స్టాక్‌లిటిక్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రముఖ టెక్ దిగ్గజాల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలపైన గణనీయమైన ప్రభావం చూపాయి. భారతీయ విమాన, ఐటీ సేవలకు మాత్రమే కాకుండా బ్యాంకులు, టెలికాం, మీడియా సంస్థలు కూడా ఈ అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి, విమానాశ్రయాల్లో మాన్యువల్ తనిఖీలు మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్ సమస్య ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఎవివిధ రంగాలపై ప్రభావం చూపింది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 738.81 పాయింట్లు తగ్గి.. 80604.65 వద్ద, నిఫ్టీ 269.95 పాయింట్లు తగ్గి 24,530.90 వద్ద ముగిసాయి.ఇన్ఫోసిస్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. టాటా స్టీల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మైక్రోసాఫ్ట్ సర్వీసులో సమస్య.. ట్రేడింగ్ బ్రోకరేజ్‌లో అంతరాయం
మైక్రోసాఫ్ట్ సర్వీస్‌లో ఏర్పడిన సమస్య వల్ల ఆన్లైన్ ట్రేడింగ్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్ సేవల్లో అంతరాయం కలిగినట్లు ‘ఎక్స్’లో పోస్ట్‌లు దర్శనమిచ్చాయి. ఏంజెల్ వన్, 5పైసా, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, నువామా, మోతీలాల్ ఓస్వాల్ వంటి బ్రోకరేజ్ సంస్థలు ఈమేరకు ప్రభావితం చెందినట్లు ఎక్స్‌లోని పోస్ట్‌ల ద్వారా తెలిసింది.మైక్రోసాప్ట్ క్లౌడ్ సర్వీస్‌లో సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులు, విమానాశ్రయ కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతోపాటు ఆన్లైన్ ట్రేడింగ్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్ సేవల్లోనూ సమస్య ఉత్పన్నమైనట్లు సమాచారం. ఏంజెల్ వన్, 5పైసా, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, నువామా, మోతీలాల్ ఓస్వాల్ వంటి బ్రోకరేజ్ సంస్థల ప్లాట్ఫామ్ల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు ఎక్స్ వేదికగా నివేదించాయి. మైక్రోసాఫ్ట్‌లోని సమస్య కారణంగా తమ సిస్టమ్‌లు ప్రభావితమయ్యాయని బ్రోకరేజ్ సంస్థలు తెలిపాయి. వీలైనంత త్వరగా ఆ సిస్టమ్‌లను పునరుద్ధరించడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నట్లు చెప్పాయి.‘బ్రేకరేజ్ సొల్యూషన్ ప్రొవైడర్‌గా ఉన్న మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్య ఉత్పన్నమవడంతో వినియోగదారులకు అంతరాయం ఏర్పడింది. దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని ఏంజెల్ వన్ తెలిపింది.పెండింగ్‌లో ఉన్న ఆర్డర్లు కనిపించకపోవడంతో తమ పొజిషన్లను విక్రయించలేకపోయామని వినియోగదారులు ఎక్స్‌లో తెలిపారు. ఆ పొజిషన్ల వల్ల తమకు కలిగిన నష్టాలకు బ్రోకర్లు పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఇదిలాఉండగా, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.You may be facing an intermittent issue due to a global outage faced by one of the solution providers. We are trying to get this resolved at the earliest.— Angel One (@AngelOne) July 19, 2024 -
81,000 దాటిన సెన్సెక్స్
ముంబై: దేశీయ స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ నాలుగోరోజూ కొనసాగింది. అధిక వెయిటేజీ టీసీఎస్(3%), ఇన్ఫోసిస్(2%), రిలయన్స్(1%), ఐసీఐసీఐ బ్యాంక్(1%) చొప్పున రాణించి సూచీల రికార్డు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతలు సెపె్టంబర్ నుంచి ప్రారంభం కావచ్చొనే అంచనాలూ సానుకూల ప్రభావం చూపాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కలిసొచ్చాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 627 పాయింట్ల లాభంతో 81,343 వద్ద ముగిసింది. నిఫ్టీ 188 పాయింట్లు పెరిగి 24,801 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు సూచీలకు సరికొత్త రికార్డులు కావడం విశేషం. ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు ప్రథమార్ధమంతా బలహీనంగా ట్రేడయ్యాయి. మిడ్ సెషన్ నుంచి మార్కెట్ లాభాల బాట పట్టింది. ఒక దశలో సెన్సెక్స్ 806 పాయింట్లు బలపడి 81,523 వద్ద, నిఫ్టీ 225 పాయింట్లు ఎగసి 24,838 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. → ఐటీ కంపెనీలు ప్రకటిస్తున్న జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెప్పిస్తున్నాయి. సెపె్టంబర్లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు ఈ రంగ షేర్లకు మరింత డిమాండ్ పెంచాయి. ఎల్టీఐఎం 3.50%, టీసీఎస్ 3%, విప్రో 2.50%, ఇన్ఫోసిస్, పెర్సిస్టెంట్, కోఫోర్జ్, టెక్ మహీంద్రా 2% రాణించాయి. ఎంఫసీస్‌లు ఒకశాతం లాభపడ్డాయి. రూపాయి రికార్డ్ కనిష్టం @ 83.63 దేశీ కరెన్సీ డాలరుతో మారకంలో చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 5 పైసలు నీరసించి 83.63 వద్ద ముగిసింది. రూపాయి 83.57 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 83.66 వరకూ క్షీణించింది. -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయంలో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 582.84 పాయింట్ల వద్ద 81299.40, నిఫ్టీ 167.00 పాయింట్ల లాభంతో 24780.00 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో టీసీఎస్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), బజాజ్ ఫిన్సర్వ్, విప్రో, ఎల్‌టీఐమైండ్‌ట్రీ మొదలైన కంపెనీలు చేరాయి. ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, హీరో మోటోకార్ప్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రేసు గుర్రాలు.. చిన్న షేర్లు
కొద్ది నెలలుగా సరికొత్త గరిష్టాల రికార్డులను నెలకొల్పుతూ సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లలో ఇటీవల మధ్య, చిన్నతరహా కౌంటర్లు సైతం జోరు చూపుతున్నాయి. వెరసి సెన్సెక్స్‌ను మించి బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు లాభాల దౌడు తీస్తున్నాయి. వివరాలు చూద్దాం..ఈ క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటివరకూ మధ్య, చిన్నతరహా కౌంటర్లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. చిన్న షేర్లు మార్కెట్ ఫేవరెట్లుగా నిలుస్తున్నాయి. దీంతో పలు చిన్న షేర్లు పెద్ద(భారీ) లాభాలను అందిస్తున్నాయి. ఇందుకు దేశీ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉండటం, మెరుగుపడిన లిక్విడిటీ తదితర అంశాలు తోడ్పాటునిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి ఈ ఏడాది జూలై 16(మంగళవారం)వరకూ చూస్తే బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 10,985 పాయింట్లు(30 శాతం) దూసుకెళ్లింది. ఈ బాటలో స్మాల్‌క్యాప్ సైతం 11,628 పాయింట్లు(27 శాతంపైగా) జంప్‌చేంది. ఇదే కాలంలో బీఎస్ఈ ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ కేవలం 8,476 పాయింట్ల(12 శాతం) ర్యాలీ చేసింది.ఏషియన్ పెయింట్స్ లాభం డౌన్ రూ. 1,187 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 25 శాతం క్షీణించి రూ. 1,187 కోట్లకు పరిమితమైంది. వేసవి ఎండలు, సార్వత్రిక ఎన్నికల కారణంగా పెయింట్లకు డిమాండ్ మందగించడం ప్రభావం చూపినట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ సింగ్లే పేర్కొన్నారు. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,575 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,182 కోట్ల నుంచి రూ. 8,970 కోట్లకు స్వల్పంగా నీరసించింది. మొత్తం వ్యయాలు మాత్రం రూ. 7,305 కోట్ల నుంచి రూ. 7,559 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో డెకొరేటివ్ విభాగం అమ్మకాల పరిమాణం 7% పుంజుకున్నప్పటికీ ప్రొడక్ట్ మిక్స్‌లో మార్పులు, ధరల తగ్గింపు వంటి అంశాలు లాభదాయకతను దెబ్బతీసినట్లు అమిత్ పేర్కొన్నారు. ముడిసరుకుల ధరలు, సప్లైచైన్ సవాళ్లు సైతం ఇందుకు జత కలసినట్లు వెల్లడించారు. అయితే ఇండ్రస్టియల్ బిజినెస్ 6% పుంజుకున్నట్లు తెలిపారు.పర్యాటకానికి పరిశ్రమ హోదా..జీఎస్టీ రేటు క్రమబదీ్ధకరించాలి ట్రావెల్ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ డిమాండ్ పర్యాటకానికి ఊతమిచ్చే దిశగా బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని, టూరిజానికి పరిశ్రమ హోదా కలి్పంచాలని ట్రావెల్ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ కేంద్రాన్ని కోరింది. అలాగే వీసా నిబంధనలను సరళతరం చేయడం, వీసా–ఫ్రీ ఎంట్రీని ప్రోత్సహించడం, జీఎస్టీ రేట్లను క్రమబద్ధీకరించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది. దేశ జీడీపీలో సుమారు 5.8 శాతం వాటాతో, 2047 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల లక్ష్యం పెట్టుకున్న ట్రావెల్, టూరిజం రంగానికి బడ్జెట్‌పై సానుకూల అంచనాలు ఉన్నట్లు వివరించింది. వీటిని అమలు చేస్తే ఇటు వ్యాపారాలు, అటు ప్రయాణికులకు కూడా ప్రయోజనం చేకూరగలదని టీఏఏఐ పేర్కొంది. కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, రైల్వేలు.. రహదారులు .. జలమార్గాల విస్తరణ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం రాబోయే బడ్జెట్లోనూ ప్రధానంగా దృష్టి పెట్టడాన్ని కొనసాగించగలదని ఆశిస్తున్నట్లు టీఏఏఐ వివరించింది. జీఎస్టీపై సానుకూలంగా వ్యవహరిస్తే టూరిస్టులకు బస ఏర్పాట్లు అందుబాటు స్థాయిలోకి రాగలవని, ఈ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభించగలదని పేర్కొంది.మరోవైపు, హోటళ్లపై ప్రస్తుతం వివిధ రకాలుగా ఉన్న జీఎస్టీ రేటును 12 శాతానికి క్రమబదీ్ధకరించాలని ఆన్లైన్ ట్రావెల్ సేవల సంస్థ మేక్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ మగోవ్ తెలిపారు. ప్రస్తుతం గది అద్దె, సీజన్ తదితర అంశాలను బట్టి ఇది 12 శాతం, 18 శాతంగా ఉంటోందన్నారు. పర్యావరణ అనుకూల విధానాలు పాటించే హోటళ్లు, హోమ్‌స్టేలకు పన్నులపరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన చెప్పారు. ‘విద్యుత్ ఆదా చేసే లైటింగ్, నీటిని ఆదా చేసే డివైజ్‌లు, వ్యర్ధాలను తగ్గించే విధానాలను పాటించే వారికి పన్నులపరమైన మినహాయింపులు ఇస్తే పర్యావరణహిత లక్ష్యాల సాధనలో పరిశ్రమ కూడా భాగం కావడానికి తోడ్పడగలదు‘ అని రాజేష్ వివరించారు. పర్యాటకం, ఆతిథ్య రంగానికి మౌలిక పరిశ్రమ హోదా కలి్పస్తే మరిన్ని పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందని హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (వెస్టర్న్ ఇండియా) ప్రెసిడెంట్ ప్రదీప్ శెట్టి పేర్కొన్నారు.బుల్ మార్కెట్ దేశీయంగా లిక్విడిటీ పరిస్థితులు బలపడటం మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల వృద్ధికి కారణమవుతున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ ఎండీ సునీల్ న్యాతి పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు(పీఎంఎస్), ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా నిధులు చిన్న షేర్లలోకి ప్రవహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీయంగా దీర్ఘకాలిక(స్ట్రక్చరల్) బుల్ ట్రెండ్‌లో మార్కెట్ కొనసాగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో మిడ్, స్మాల్ క్యాప్స్ మార్కెట్లను మించి పరుగు తీస్తున్నట్లు తెలియజేశారు. అయితే లార్జ్‌క్యాప్ స్టాక్స్ సైతం ర్యాలీ చేస్తున్నప్పటికీ చిన్న షేర్లతో పో లిస్తే వెనకబడుతున్నట్లు వివరించారు. ఎఫ్ ఐఐల అమ్మకాలు ఇందుకు కారణమన్నారు. ప్రస్తుతం యూఎస్ అధ్యక్షతన ప్రపంచవ్యాప్తంగా బుల్ మార్కెట్ల హవా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. షేర్ల విలువలరీత్యా చూస్తే లార్జ్ క్యాప్స్ మరింత బలపడేందుకు వీలున్నట్లు అంచనా వేశారు. గతేడాది చివర్లో అమ్మకాలకు ప్రాధాన్యత ఇచి్చన ఎఫ్ఐఐలు ప్రస్తుతం పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. సరికొత్త రికార్డులు బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఈ మంగళవారం(16న) 48,175 పాయింట్లను అధిగమించి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. అంతకుముందే అంటే ఈ నెల 8న స్మాల్‌క్యాప్ 54,618 పాయింట్లకు చేరడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని లిఖించింది. ఇక మరోవైపు సెన్సెక్స్ ఈ నెల 16నే 80,898ను తాకి చరిత్రాత్మక రికార్డుకు తెరతీసింది. ఇందుకు టెక్నాలజీ, హెల్త్‌కేర్, కన్జూమర్ గూడ్స్ రంగాలు ప్రధానంగా దోహదపడినట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అరి్వందర్ సింగ్ నందా పేర్కొన్నారు. అందుబాటులో షేర్ల విలువలు, అధిక వృద్ధికి వీలు, ఆర్థిక పురోగతి వంటి అంశాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశారు. కాగా.. మిడ్, స్మాల్ క్యాప్స్‌లో దిద్దుబాటుకు వీలున్నట్లు సునీల్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం పటిష్ట లిక్విడిటీ పరిస్థితుల కారణంగా కరెక్షన్ సమయాన్ని అంచనా వేయలేమని తెలియజేశారు. విధానాల్లో మార్పులు, ఫలితాల్లో నిరాశ తదితర అంశాలు ఇందుకు దారిచూపవచ్చని అభిప్రాయపడ్డారు. వచ్చే వారం వెలువడనున్న సార్వత్రిక బడ్జెట్ సానుకూలంగా ఉండవచ్చని, దీంతో మార్కెట్ల ర్యాలీ కొనసాగేందుకు వీలున్నదని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే దేశీ స్టాక్స్‌లో మరిన్ని పెట్టుబడులకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. సాధారణంగా చిన్న షేర్లను దేశీ ఫండ్స్, రిటైలర్లు కొనుగోలు చేస్తే, లార్జ్ క్యాప్స్‌లో పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపే సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక పరిస్థితులు, కార్పొరేట్ ఫలితాలు, ఇన్వెస్టర్ల సెంటిమెంటు, గ్లోబల్ మార్కెట్లు వంటి పలు అంశాలు మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశిస్తుంటాయని మార్కెట్ నిపుణులు వివరించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
పేటీఎమ్‌కు సెబీ ఝలక్
న్యూఢిల్లీ: పాలనా సంబంధ నిబంధనలు ఉల్లంఘించినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి వన్97 కమ్యూనికేషన్స్ తాజాగా హెచ్చరికల లేఖను అందుకుంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఆడిట్ కమిటీ లేదా వాటాదారుల అనుమతి లేకుండానే సహచర సంస్థ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్స్(పీపీబీఎల్)తో సంబంధిత పార్టీ లావాదేవీ(ఆర్పీటీ)లను నిర్వహించినట్లు లేఖలో సెబీ పేర్కొంది. అయితే సెబీ నిబంధనలను స్థిరంగా అమలు చేస్తున్నట్లు బీఎస్ఈకి దాఖలు వివరాలలో పేటీఎమ్ తెలియజేసింది. నిబంధనల అమలులో కంపెనీ అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా సెబీకి వివరణను సైతం సమర్పించనున్నట్లు పేటీఎమ్ బ్రాండ్ డిజిటల్ చెల్లింపుల కంపెనీ వెల్లడించింది. కాగా, సెబీ లేఖ ప్రకారం పీపీబీఎల్, వన్97 కమ్యూనికేషన్స్ సంబంధ ఫైనాన్షియల్ తదితర సమాచారంపై సెబీ పరిశీలన చేపట్టింది. దీనిలో నిబంధనలు పాటించని అంశం గుర్తించింది. ఆడిట్ కమిటీ లేదా వాటాదారుల అనుమతి లేకుండానే ఆర్‌పీటీలలో పేటీఎమ్ లేదా అనుబంధ సంస్థలు పీపీబీఎల్‌తో అధిక లావాదేవీలు చేపట్టినట్లు సెబీ పేర్కొన్నట్లు వన్97 బీఎస్ఈకి తెలియజేసింది. -
జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాపై దివాలా చర్యలు
ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ ఆదేశం మొత్తం బకాయిలు రూ.15,576 కోట్లుహైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ చెల్లింపుల్లో విఫలమైనందున జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జీవీకేపీఐఎల్)పై దివాలా చర్యలకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), హైదరాబాద్ బెంచ్ ఆదేశాలు ఇచి్చంది. ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని రుణదాతల గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌పై బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసిందని జీవీకేపీఐఎల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఫైలింగ్ ప్రకారం సతీష్ కుమార్ గుప్తాను మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్‌గా (ఐఆర్పీ) ఎన్సీఎల్టీ నియమించింది. గ్యారెంటర్‌గా ఉన్నందుకే.. వాస్తవానికి ఈ రుణాన్ని దశాబ్దం క్రితం జీవీకే కోల్ డెవలపర్స్ (సింగపూర్) ప్రైవేట్ లిమిటెడ్ పొందింది,. దీనికి జీవీకేపీఐఎల్ గ్యారెంటర్‌గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ 2022లో పిటిషన్ ఫైల్ చేసింది. దీనిపై దివాలా చర్యలకు ఆదేశిస్తూ జూలై 12న ఎన్సీఎల్టీ బెంచ్ ఆదేశాలు జారీచేస్తే, ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచి్చంది. 1.84 బిలియన్ డాలర్ల రుణ బకాయిలు ‘‘కార్పొరేట్ రుణగ్రహీత తన రుణ బాధ్యతలను అంగీకరించారు. 2018–19, 2019–20, 2020 –21 ఆర్థిక సంవత్సరాల వార్షిక నివేదికలలో ఈ విషయాన్ని అంగీకరించారు. జూన్ 13, 2022 నాటికి రుణగ్రహీత 1.84 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంది. చెల్లించాల్సిన మొత్తంలో 1.13 బిలియన్ డాలర్లు అసలు, 731.57 మిలియన్ డాలర్లు వడ్డీ, 1,44,000 డాలర్ల ఏజెన్సీ ఫీజు ఉన్నాయి’’(ఉత్తర్వు ప్రకారం రూ. 9,463 కోట్లు అసలు, రూ. 6,113 కోట్లు వడ్డీ, రూ. 1.23 కోట్ల ఏజెన్సీ ఫీజులు) అని ఎన్సీఎల్టీ ఉత్తర్వు పేర్కొన్నట్లు జీవీకేపీఐఎల్ తెలిపింది. మొదటి డిఫాల్ట్ 2017 ఫిబ్రవరి.. ఐసీఐసీఐ బ్యాంక్ తరఫున సీనియర్ న్యాయవాది కే. వివేక్ రెడ్డి వాదనల ప్రకారం, మొదటి డిఫాల్ట్ ఫిబ్రవరి 2017లో సంభవించింది. అప్పటి నుంచి రుణ చెల్లింపులు జరగలేదు. జీవీకే కోల్ తీసుకున్న రుణానికి జీవీకేపీఎల్ బాధ్యత వహిస్తుంది. తొలుత ఈ కేసులో విచారణ జరిపిన లండన్ కోర్టు కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. జీవీకే చెల్లింపుల్లో విఫలమైతే దివాలా చర్యలు తీసుకోవడం తప్పనిసరి చర్య అవుతుంది. ఆ్రస్టేలియాలో బొగ్గు గనులు కొనుగోలుకు రుణం ఆ్రస్టేలియాలో బొగ్గు గనులు కొనుగోలుకుగాను జీవీకే కోల్‌కు సెప్టెంబరు 2011లో ఐసీఐసీఐ బ్యాంక్ (దుబాయ్, బహ్రెయిన్, సింగపూర్ శాఖ లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రస్ అల్ ఖైమా), బ్యాంక్ ఆఫ్ ఇండియా (లండన్, సింగపూర్), కెనరా బ్యాంక్ (లండన్) రూ.8,356 కోట్ల టర్మ్ లోన్, అలాగే రూ.292 కోట్ల లెటర్ ఆఫ్ క్రెడిట్‌ను మంజూరు చేశాయి. ఇతర బ్యాంకులు 367 కోట్ల రూపాయల అదనపు టర్మ్ లోన్లను మార్చి 2014లో మంజూరు చేశాయి. ఆ తర్వాత ఈ మొత్తాన్ని 2,089 కోట్ల రూపాయలకు పెంచాయి.విచారణాంశాలు.. రుణ మంజూరు సమయంలో చేసుకున్న అవగాహనలను ఉల్లంఘిస్తూ, రుణదాత అనుమతి లేకుండానే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌లో జీవీకే గ్రూప్ తన వాటాను విక్రయించాలని భావిస్తున్నట్లు మార్చి 2016లో ఐసీఐసీఐ బ్యాంక్ గుర్తించింది. దీనితో బెంగళూరు విమానాశ్రయంలో జీవీకే తన వాటాను విక్రయించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏప్రిల్ 2016లో లండన్ కోర్టులో బ్యాంకులు ఇంజక్షన్ దావా వేశాయి. రుణం చెల్లించని కారణంగా, ఫెసిలిటీ అగ్రిమెంట్–1 కింద రూ. 5,915 కోట్లు, ఫెసిలిటీ అగ్రిమెంట్–2 కింద రూ. 1,236 కోట్ల కోసం బ్యాంకులు లండన్ కోర్టులో క్లెయిమ్ పిటిషన్లు వేశాయి. అసలు, వడ్డీకి సంబంధించి రూ. 5,000 కోట్లను డిమాండ్ చేస్తూ 2020 నవంబర్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ తన కార్పొరేట్ గ్యారెంటీ అమలుకు చర్యలు తీసుకుంది. రుణ చెల్లింపుల్లో తన వైఫల్యాన్ని అంగీకరించిన జీవీకేపీఐఎల్, రుణ చెల్లింపులకు కట్టుబడి ఉన్నానని అప్పటి వరకూ చర్యను నిలుపుచేయాలని బ్యాంకర్లను కోరింది. ముంబై జీవీకే ఎయిర్పోర్ట్ కొనుగోలు విషయంలో అదానీ గ్రూప్‌తో ఒక పరిష్కారానికి వచి్చన తరువాత రుణ చెల్లింపులు జరుపుతామని హామీ ఇచి్చంది. అయితే రుణ చెల్లింపులకు చర్యలు కనిపించకపోవడంతో బకాయిల కోసం 2022లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్సీఎల్టీ, హైదరాబాద్ బెంచ్‌ని ఆశ్రయించింది. -
టారిఫ్‌ల పెంపుతో ఏఆర్పీయూ జూమ్
ముంబై: టారిఫ్‌ల పెంపు టెలికం కంపెనీలకు మరింత ఆదాయన్ని తెచి్చపెట్టనుంది. ప్రతి యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 2025–26లో దశాబ్ద గరిష్ట స్థాయి రూ.225–230కు చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏఆర్పీయూ రూ.182తో పోల్చి చూస్తే 25 శాతం వృద్ధి చెందుతుందని తెలిపింది. అధిక లాభాలు, తక్కువ మూలధన వ్యయాలతో టెలికం కంపెనీల పరపతి సైతం మెరుగుపడుతుందని పేర్కొంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టెలికం చార్జీలను 20 శాతం మేర పెంచడం తెలిసిందే. ఈ రేట్లు ఈ నెల 3 నుంచి అమల్లోకి వచ్చినట్టు క్రిసిల్ తన నివేదికలో గుర్తు చేసింది. అయితే, తదుపరి రీచార్జ్‌ల నుంచే పెంచిన చార్జీలు చెల్లించాల్సి వస్తుంది కనుక, దీని అసలు ప్రతిఫలం వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే కనిపిస్తుందని వివరించింది. 5జీ సేవలతో డేటా వినియోగం పెరుగుతుందని, ఇది కూడా ఏఆర్పీయూ పెరిగేందుకు మద్దతుగా నిలుస్తుందని క్రిసిల్ రేటింగ్స్ చీఫ్ రేటింగ్ ఆఫీసర్ మనీష్ గుప్తా తెలిపారు. వీడియో స్ట్రీమింగ్ సేవల కోసం కస్టమర్లు అధిక డేటా ప్లాన్లకు మారుతున్నట్టు క్రిసిల్ తన నివేదికలో తెలిపింది. మూలధన వ్యయ భారం తగ్గుతుంది.. తాజా చార్జీల పెంపుతో టెలికం పరిశ్రమ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ (ఆర్‌వోసీఈ) 2023–24లో ఉన్న 7.5 శాతం నుంచి 2025–26లో 11 శాతానికి పెరుగుతుందని క్రిసిల్ అంచనా వేసింది. ఆదాయంలో మూలధన వ్యయాల (పెట్టుబడులు) శాతం 2023–24లో 28 శాతంగా ఉంటే, 2025–26లో 19 శాతానికి దిగొస్తుందని తెలిపింది. చాలా వరకు టెలికం సంస్థలు 5జీ సేవలను అమల్లోకి తెచ్చాయని.. అలాగే, స్పెక్ట్రమ్‌పై అధిక వ్యయాలు 2022–23లోనే చేసినట్టు గుర్తు చేసింది. దీంతో కంపెనీల రుణ భారం 6.4 లక్షల కోట్ల నుంచి రూ.5.6 లక్షల కోట్లకు దిగొస్తుందని వివరించింది. కంపెనీలు మరో విడత రేట్లను పెంచితే, తమ తాజా అంచనాలకు ఇంకా మెరుగుపడతాయని తెలిపింది. -
పప్పుల ధరలు తగ్గించండి
న్యూఢిల్లీ: పప్పుల విక్రయాల్లో లాభాల మార్జిన్లు తగ్గించుకోవాలంటూ రిటైలర్లకు కేంద్రం కీలక సూచన చేసింది. గడిచిన నెల రోజుల్లో హోల్‌సేల్ మార్కెట్లో కందిపప్పు, మినపపప్పు, శనగపప్పు ధరలు 4 శాతం వరకు తగ్గగా.. వాటి రిటైల్ ధరలు అంత మేర తగ్గకపోవడాన్ని కేంద్రం గుర్తించింది. దీంతో సహేతుక లాభాలకు పరిమితమై, వినియోగదారులకు ఉపశమనాన్ని కలి్పంచాలంటూ రిటైలర్లను కేంద్ర ప్రభుత్వం కోరింది. అనుచిత వ్యాపార విధానాలు, లాభాపేక్షతో వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ గట్టి హెచ్చరిక పంపింది. రిటైలర్ల సమాఖ్య (ఆర్ఏఐ), రిటైల్ సంస్థలతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంగళవారం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కందిపప్పు, శనగపప్పు నిల్వలపై ఆ శాఖ కార్యదర్శి నిధి ఖరే సమీక్ష నిర్వహించారు. ఆర్ఏఐ ప్రతినిధులు, రిలయన్స్ రిటైల్, డీమార్ట్, టాటా స్టోర్స్, స్పెన్సర్స్, వీమార్ట్ తదితర సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఆర్ఏఐ పరిధిలో 2,300 మంది సభ్యులు (రిటైలర్లు), 6 లక్షల రిటైల్ స్టోర్లు ఉన్నాయి. హోల్ సేల్ ధరలు, రిటైల్ ధరల మధ్య భిన్నమైన ధోరణులు ఉన్నాయని, రిటైలర్లు అధిక మార్జిన్లు పొందుతున్నట్టు తెలుస్తోందని నిధి ఖరే సమావేశంలో స్పష్టం చేశారు. ధరల నియంత్రణకు, వినియోగదారులకు సరసమైన ధరలకు అందించే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా నిలవాలని ఆమె రిటైలర్లను కోరారు. -
పసిడి వెలుగులు
న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పరుగులు పెడుతోంది. ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయర్క్ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఆగస్టు కాంట్రాక్ట్ ధర ఈ వార్త రాస్తున్న రాత్రి 9 గంటల సమయంలో ఔన్స్‌కు (31.1గ్రా) ఆల్‌టైమ్ హై 2,469 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల కోత అంచనా, ఈటీఎఫ్‌ల డిమాండ్, డాలర్ స్థిరత్వం వంటి అంశలు దీనికి కారణం. ఢిల్లీలో ఐదురోజుల్లో రూ.1,300 అప్ ఇక అంతర్జాతీయ ట్రెండ్‌కు తోడు ఆభరణ వర్తకుల డిమాండ్ నేపథ్యంలో బంగారం ధర దేశ రాజధాని న్యూఢిల్లీలో వరుసగా ఐదవ రోజూ పెరిగింది. పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర మంగళవారం రూ.550 పెరిగి రూ.75,700కు చేరింది. గడచిన ఐదు సెషన్లలో రేటు రూ.1,300 పెరిగింది. -
మార్కెట్ రికార్డుల హ్యాట్రిక్
ముంబై: స్టాక్ సూచీల రికార్డుల జోరు మూడో రోజూ కొనసాగింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, టెలికం షేర్లు రాణించడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల అంశాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 52 పాయింట్లు పెరిగి 80,717 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 24,613 వద్ద స్థిరపడింది. ముగింపు స్థాయిలు సూచీలకు సరికొత్త రికార్డు. ఉదయ లాభాలతో మొదలైన సూచీలు.., అధిక వాల్యుయేషన్ల ఆందోళనల తో పరిమిత శ్రేణిలో కదలాడాయి. అయినప్పటికీ.., ఒక దశలో సెన్సెక్స్ 233 పాయింట్లు బలపడి 80,862 వద్ద, నిఫ్టీ 133 పాయింట్లు ఎగసి 24,635 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. ఫైనాన్షియల్ సరీ్వసెస్, యుటిలిటీ, బ్యాంకులు, క్యాపిటల్ గూడ్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటపట్టాయి.⇒ మొహర్రం సందర్భంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు నేడు సెలవు. ట్రేడింగ్ జరగదు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లలో మాత్రం సాయంత్రంసెషన్‌లో ట్రేడింగ్ జరుగుతుంది.వేదాంతా క్విప్ ధర రూ. 461 వేదాంతా అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ (క్విప్)కి తెరతీసింది. షేరుకి రూ. 461.26 ఫ్లోర్ ధరలో రూ. 8,500 కోట్లు సమీకరించనుంది. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. సోమవారం ముగింపు ధర రూ. 459.4తో పోలిస్తే ఫ్లోర్ ధర స్వల్ప ప్రీమియం. వేదాంతా షేరు బీఎస్ఈలో 1% నీరసించి రూ. 456 వద్ద ముగిసింది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిసాయి. సెన్సెక్స్ 44 పాయింట్ల లాభంతో 80,708.86 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 24,602.70 వద్ద నిలిచాయి.టాప్ జెయినర్ జాబితాలో కోల్ ఇండియా, బీపీసీఎల్ (భారత్ పెట్రోలియం కార్పొరేషన్), హిందూస్తాన్ యూనీ లివర్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, భారతి ఎయిర్టెల్ కంపెనీలు ఉన్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ వంటివి టాప్ లూజర్స్‌లో ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఊపందుకున్న ధరలు.. మళ్ళీ పెరిగిన బంగారం, వెండి
ఆషాడంలో కూడా బంగారం ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. రెండు రోజులు స్వల్పంగా తగ్గితే.. అంతకు మించి ఒకేరోజులో ధరలు పెరిగిపోతున్నాయి. ఈ రోజు (జులై 16) కూడా పసిడి ధర గరిష్టంగా రూ. 490 వరకు పెరిగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో.. ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67850 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.74020 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 350, రూ. 380 పెరిగింది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 350, రూ. 380 పెరిగింది. కాబట్టి ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 68000 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74170 వద్ద ఉంది.చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 68300 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 74510 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు వరుసగా రూ. 450, రూ. 490 పెరిగినట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుబంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ వెండి ధర మునుపటికంటే రూ. 200 తగ్గింది. దీంతో కేజీ వెండి కొనుగోలు చేయాలంటే రూ. 95000 వెచ్చించాల్సి ఉంటుంది. వెండి ధరలు తగ్గడం వరుసగా ఇది రెండో రోజు కావడం గమనార్హం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
రికార్డు గరిష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం రికార్డు గరిష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన బెంచ్‌మార్క్ సూచీలు ఊపందుకున్నాయి. ఎస్బీఐ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఐటీసీ వంటి ఎంపిక చేసిన ఇండెక్స్ హెవీవెయిట్ల నేతృత్వంలోని మద్దతుతో ముగింపులో గరిష్ట స్థాయిలలో స్థిరపడ్డాయి.షెషన్ ముగింపు సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 145 పాయింట్లు (0.2%) పెరిగింది. అదే సమయంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 82 పాయింట్లు (0.3%) లాభపడింది.ఓఎన్జీసి, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఈరోజు టాప్ గెయినర్లలో ఉన్నాయి. మరోవైపు టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ ఈరోజు టాప్ లూజర్స్‌లో ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
రెండు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు కొంత తగ్గుముఖం పట్టాయి. దీంతో నేడు (జులై 15) పసిడి ధరలు గరిష్టంగా రూ. 110 తగ్గింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67500 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73650 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గినట్లు తెలుస్తోంది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గింది. కాబట్టి ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67650 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73790 వద్ద ఉంది.హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో మాత్రమే కాకుండా చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు తగ్గాయి. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 67850 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 74020 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గినట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ వెండి ధర మునుపటికంటే రూ. 300 తగ్గింది. దీంతో కేజీ వెండి కొనుగోలు చేయాలంటే రూ. 95200 వెచ్చించాల్సి ఉంటుంది. మూడు రోజులు తర్వాత మళ్ళీ వెండి ధర తగ్గింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఆకర్షణీయంగా ఫ్లెక్సీ, మల్టీ క్యాప్ ఫండ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్పొరేట్ల ఆదాయాలు బాగుంటున్న నేపథ్యంలో వాటితో ముడిపడి ఉన్న మార్కెట్ల పనితీరు కూడా మెరుగ్గానే ఉండగలదని ఎడెలీ్వజ్ మ్యుచువల్ ఫండ్ ఎండీ రాధికా గుప్తా చెప్పారు. కొన్ని విభాగాలు కాస్త అధిక వేల్యుయేషన్లలో ట్రేడవుతున్నప్పటికీ స్థూలంగా మార్కెట్‌ని చూస్తే బబుల్లాంటి (బుడగలాగా పేలిపోయే) పరిస్థితేమీ లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రెసివ్ ఇన్వెస్టర్లు .. ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, బిజినెస్ సైకిల్ ఫండ్స్ మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చని సూచించారు. కాస్త కన్జర్వేటివ్గా ఉండే వారు బ్యాలెన్స్డ్ ఫండ్స్ లాంటి హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చని పేర్కొన్నారు.ప్రస్తుతం తమ ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) రూ. 1.40 లక్షల కోట్ల స్థాయిలో ఉండగా, 25–30 శాతం వృద్ధి సాధించేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని రాధిక చెప్పారు. గత ఆరేళ్లలో ఆరు నగరాల నుంచి ప్రస్తుతం 35 పైచిలుకు నగరాలకు కార్యకలాపాలు విస్తరించామని. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్యను 60కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నామని తెలిపారు. సుమారు 15 లక్షలుగా ఉన్న ఫోలియోలను 30–40 లక్షలకు పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. సిప్‌లు పెరగడమనేది దేశీ మార్కెట్లకు మేలు చేస్తోందని, విదేశీ నిధులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని ఆమె చెప్పారు. ఇన్వెస్టర్లు అసాధారణ రాబడులకు హామీలనిచ్చే సాధనాల విషయంలో సదా అప్రమత్తంగా ఉండాలని, పనితీరు మాత్రమే కాకుండా సంస్థ పటిష్టతను కూడా చూసుకోవాలని రాధిక సూచించారు. భారత ఎకానమీ వృద్ధి చెందడమనేది కేవలం ఏదో ఒక రంగంపై ఆధారితమైనది కాకుండా వివిధ రంగాలవ్యాప్తంగా ఉంటుందనే విషయాన్ని రిటైల్ ఇన్వెస్టర్లు గుర్తించి, తదనుగుణంగా పెట్టుబడులు పెట్టాలని పేర్కొన్నారు.