Market
-
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: దేశీయ కార్పొరేట్ కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలు, బడ్జెట్‌కు ముందు కొనుగోళ్లు అంశాల నేపథ్యంలో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలు సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. మొహర్రం సందర్భంగా బుధవారం (జూన్ 17న) ఎక్సే్చంజీలకు సెలవ కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. ‘‘వృద్ధి ఆధారిత బడ్జెట్ ఉహాగానాలు, క్యూ1 ఆర్థిక ఫలితాలపై మిశ్రమ అంచనాల నడుమ మార్కెట్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. సాంకేతికంగా నిఫ్టీకి ఎగువ స్థాయిలో 24,600 వద్ద నిరోధం ఉంది. దిగువున 24,150 – 24,200 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది. ఫలితాల సీజన్ సందర్భంగా స్టాక్ ఆధారిత ట్రేడింగ్ జరగొచ్చు. రుతుపవనాలు చురుగ్గా కదలుతున్నందున ఎఫ్ఎంసీజీ షేర్లకు డిమాండ్ లభించవచ్చు.’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణులు నాగరాజ్ శెట్టి తెలిపారు. గతవారం స్టాక్ సూచీలు దాదాపు ఒక శాతం ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 523 పాయింట్లు, నిఫ్టీ 178 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రభావం మార్కెట్ ముందుగా గత వారాంతాన వెల్లడైన హెచ్‌సీఎల్ టెక్, డీమార్ట్ క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ ఇండెక్స్‌లో 36% వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, ఏసియన్ పేయింట్స్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బీపీసీఎల్ కంపెనీలు తమ జూన్ త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. వీటితో పాటు జియో ఫైనాన్సియల్ సరీ్వసెస్, హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్, ఏంజెల్ వన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, స్పైస్‌జెట్, ఆదిత్య బిర్లా కంపెనీ, ఎల్అండ్టీ ఫైనాన్స్ హావెల్స్, ఎల్అండ్టీ సరీ్వసెస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, పాలీక్యాబ్ ఇండియా, టాటా టెక్నాలజీ, ఐసీఐసీఐ లాంబార్డ్, పేటీఎం, పీవీఆర్, యూనియన్ బ్యాంక్, ఆర్బీఎల్, యస్ బ్యాంక్ సహా మొత్తం 197 కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం దేశీయ జూన్ హోల్‌సేల్ ద్రవ్యల్బణ డేటా, చైనా క్యూ1 జీడీపీ, జూన్ రిటైల్ అమ్మకాలు, యూరోజోన్ మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నేడు(జూన్ 15న) విడుదల కానున్నాయి. మంగళవారం మే నెల యూరోజోన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, జూన్ అమెరికా రిటైల్ అమ్మకాల డేటా, బుధవారం బ్రిటన్ జూన్ ద్రవ్యోల్బణం, యూరోజోన్ జూన్ ద్రవ్యోల్బణం, అమెరికా జూన్ పారిశ్రామికోత్పత్తి డేటా వెల్లడి కానుంది. గురువారం బ్రిటన్ మే నిరుద్యోగ గణాంకాలు, జపాన్ జూన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటా, యూరోజోన్ ఈసీబీ వడ్డీరేట్ల నిర్ణయం వెలువడునున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం ఆర్బీఐ జూన్ 12తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది. బ్రిటన్ జూన్ రిటైల్ అమ్మకాల డేటా, జపాన్ జూన్ ద్రవ్యోల్బణం, యూరోజోన్ మే కరెంట్ ఖాతాల గణాంకాలు వెలువడునున్నాయి. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.రెండు వారాల్లో రూ.15వేల కోట్ల పెట్టుబడులువిదేశీ ఇన్వెస్టర్లు జూలై తొలి రెండు వారాల్లో దేశీయ మార్కెట్లో రూ.15,352 కోట్ల పెట్టుబడి పెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, కొనసాగుతున్న సంస్కరణలు ఇందుకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. ‘‘రాబోయే కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాలకు సంబంధించి ప్రోత్సహకాలు, రాయితీలు ఉండే అవకాశం ఉంది. అలాగే, అమెరికా ఫెడరల్ తన వడ్డీ రేట్లను తగ్గించే సూచనలు కూడా ఉన్నాయి. దీంతో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ ఈక్విటీల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లను జరుపుతున్నారు’’ అని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్‡్ష శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు సమీక్షా కాలంలో డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు రూ.8,484 కోట్ల పెట్టుబడులు పెట్టారు. విదేశీ కొనుగోలుదారులతో పాటు దేశీయ కొనుగోలు దారులు సైతం 2024లో ఈక్విటీల్లో స్థిరమైన కొనుగోలుదారులుగా ఉన్నారు. ఎఫ్‌పీఐలు జనవరి, ఏప్రిల్, మే నెలల్లో రూ.60,000 కోట్లు ఉపసంహరించుకోగా, ఫిబ్రవరి, మార్చి, జూన్లలో కలిపి రూ.63,200 కోట్లు కొనుగోళ్లు జరిపారు.బడ్జెట్‌పై ఆంచనాలు ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్ తరహాలోనే ఈసారి ఆర్థిక లోటు, రుణ లక్ష్యాలపై దృష్టి సారించవచ్చు. గ్రామీణ ఆర్థికావృద్ధిని బలోపేతం దిశగా సానుకూల ప్రకటనలు ఉండొచ్చు. తక్కువ ఆదాయ శ్రేణి వర్గాలకు పన్ను ప్రయోజనాలు ఉండొచ్చు. మూలధన వ్యయాలకు పెద్దపీట వేయవచ్చు. మొత్తంగా ప్రభుత్వ విధానాలు కొనసాగించే వీలుంది. బడ్జెట్ ఆధారిత వార్తలకు అనుగుణంగా ఆయా రంగాల షేర్లలో కదిలికలు ఉండొచ్చు. మొహర్రం సందర్భంగా బుధవారం ఎక్సే్చంజీలకు సెలవు -
లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 622.00 పాయింట్లు లేదా 0.78 శాతం పెరిగి 80,519.34 వద్ద, నిఫ్టీ 186.20 పాయింట్లు లేదా 0.77 శాతం పెరిగి 24,502.20 వద్ద ఉన్నాయి.బలహీనమైన గ్లోబల్ సూచనలు ఉన్నప్పటికీ, నిఫ్టీ మొదటిసారిగా 24,500ని అధిగమించి, ఇంట్రాడేలో 24,600కి చేరుకోవడంతో సెషన్ పురోగమించడంతో భారతీయ బెంచ్‌మార్క్‌లు లాభాలను పొడిగించాయి.నిఫ్టీలో టీసీఎస్, విప్రో, ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అత్యధికంగా లాభపడగా, నష్టపోయిన వాటిలో మారుతీ సుజుకీ, దివిస్ ల్యాబ్స్, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పడిలేసిన బంగారం, స్థిరంగా వెండి - నేటి కొత్త ధరలు ఇవే
గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ ఉన్న పసిడి ధరలు మళ్ళీ పెరుగుదలవైపు అడుగులువేశాయి. దీంతో నేడు (జులై 12) మళ్ళీ బంగారం ధరలు గరిష్టంగా రూ. 440 పెరిగింది. దీంతో మళ్ళీ ఒక్కసారిగా గోల్డ్ రేట్లు పైకి లేశాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67600 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73750 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 300, రూ. 330 పెరిగినట్లు తెలుస్తోంది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 300, రూ. 330 పెరిగింది. కాబట్టి ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67750 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73900 వద్ద ఉంది.హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో మాత్రమే కాకుండా చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 68250.. కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 74460 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు వరుసగా రూ. 400, రూ. 440 పెరిగినట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుబంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరల్లో మాత్రం ఎటువంటి చలనం లేదని తెలుస్తోంది. అంటే ఈ రోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు (జులై 12) ఒక కేజీ వెండి రూ. 95500 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగినట్లు తెలుస్తోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
మిశ్రమంగా ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్ప నష్టంతో 10.52 పాయింట్లు లేదా 0.013% కోల్పోయి 79,914.26 వద్ద సెషన్‌ను ముగించింది. అదే సమయంలో నిఫ్టీ మాత్రం 24,300 మార్క్‌ను నిలబెట్టుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 12.70 పాయింట్లు లేదా 0.052% లాభపడి 24,337.15 వద్ద నిలిచింది.ఓఎన్జీసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఐటీసీ, టాటా మోటర్స్ షేర్లు మంచి లాభాలతో టాప్‌గెయినర్స్‌గా నిలిచాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా&మహీంద్రా, దివిస్ ల్యాబ్స్, ఎన్టీపీసీ టాప్ లూజర్స్ జాబితాలోకి చేరి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పెరిగిన బంగారం, వెండి ధర.. ఎంతంటే..
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల కాలంలో తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. దాంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో గురువారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.67,300 (22 క్యారెట్స్), రూ.73,420 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. బుధవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.200, రూ.220 పెరిగింది.చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.250, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.270 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,850 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.74,020 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.200 పెరిగి రూ.67,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.220 పెరిగి రూ.73,570 వద్దకు చేరింది. మార్కెట్లో కేజీ వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.1,000 పెరిగి రూ.1,00,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 426.87 పాయింట్ల నష్టంతో 79,924.77 వద్ద, నిఫ్టీ 108.75 పాయింట్లు క్షీణించి 24,324.45 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, దివిస్ ల్యాబ్స్, బ్రిటానియా, గ్రాసిమ్ కంపెనీలు ఉన్నాయి. మహీంద్రా& మహీంద్రా, టాటా స్టీల్, హిందాల్కో, టీసీఎస్, హీరో మోటోకార్ప్ కంపెనీలు టాప్ లూజర్స్‌గా నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం
ముంబై: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జూన్ లో రూ.40,608 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అంతకుముందు నెలలో వచి్చ న పెట్టుబడుల కంటే 17 శాతం అధికం. మే నెలలోనూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 83 శాతం అధికంగా రూ.34,670 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.1,07,357 కోట్లు బయటకు వెళ్లాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ జూన్ చివరికి రూ.61.15 లక్షల కోట్లకు చేరింది. మే నెలతో పోలిస్తే 4% అధికం. ఇందులో ఈక్విటీ పెట్టుబడుల విలువ రూ.27.67 లక్షల కోట్లుగా ఉంది.కొత్త గరిష్టానికి సిప్ పెట్టుబడులుసిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.21,262 కోట్ల పెట్టుబడులు వచ్చా యి. ఇది నెలవారీ సరికొత్త గరిష్ట స్థాయి. మే నెల సిప్ పెట్టుబడులు రూ.20,904 కోట్లు. జూన్‌లో కొత్తగా 55.13 లక్షల సిప్ రిజి్రస్టేషన్లు పెరిగాయి. దీంతో మొత్తం సిప్ ఖాతాల సంఖ్య మే చివరికి ఉన్న 8.76 కోట్ల నుంచి జూన్ చివరికి 8.99 కోట్లకు చేరాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం సిప్ పెట్టుబడులు రూ.12.44 లక్షల కోట్లకు దూసుకుపోయాయి. మే చివరికి ఇవి రూ.11.53 లక్షల కోట్లుగా ఉన్నాయి. ‘‘మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ చెప్పుకోతగ్గ వృద్ధిని చూసింది. ఆర్థిక స్థిరత్వానికి, కోట్లాది మంది ఇన్వెస్టర్ల సంపద సృష్టికి కీలకంగా మారింది.’’అని ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) సీఈవో వెంకట్ చలసాని తెలిపారు. జూన్‌లో పెట్టుబడులు రూ.21,262 కోట్లు మేలో పెట్టుబడులు రూ.20,904 కోట్లుపెట్టుబడుల మొత్తం రూ.12.44 లక్షల కోట్లు (యాంఫి నివేదిక)థీమ్యాటిక్ అదుర్స్ రంగాలవారీ/థీమ్యాటిక్ ఫండ్స్ జూన్ నెలలో రూ.22, 351 కోట్లు ఆకర్షించాయి. ముఖ్యంగా ఈ విభాగంలో 9 కొత్త పథకాలు (ఎన్‌ఎఫ్‌వోలు) ప్రారంభమయ్యాయి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి రూ.12,974 కోట్లు సమీకరించాయి. మలీ్టక్యాప్ ఫండ్స్‌లోకి 78% అధికంగా రూ.4,708 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లార్జ్‌క్యాప్ పథకాల్లోకి పెట్టుబడులు 46% పెరిగి రూ.970 కోట్లుగా ఉన్నాయి. స్మాల్‌క్యాప్ పథకాల్లోకి 17% తగ్గి రూ.2,263 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి 3% తక్కువగా రూ.2,527 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. హైబ్రిడ్ ఫండ్స్ రూ.8,854 కోట్ల పెట్టబడులను ఆకర్షించాయి. ప్యాసివ్స్లోకి రూ.14,601 కోట్లు వచ్చాయి. -
ఆగని బుల్ పరుగు
ముంబై: ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మరో రికార్డు స్థాయిలకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సెంటిమెంట్ బలపరిచాయి. అధిక వెయిటేజీ మారుతీ సుజుకీ(7%), ఎంఅండ్ఎం(3%), ఐటీసీ(2%), ఐసీఐసీఐ బ్యాంక్(1%) రాణించి సూచీల రికార్డు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 391 పాయింట్లు పెరిగి 80,352 వద్ద ముగిసింది. నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 24,433 వద్ద స్థిరపడింది. ముగింపు స్థాయిలు ఇరు సూచీలకు సరికొత్త రికార్డు. ఉదయం లాభాలతో మొ దలైన స్టాక్ సూచీలు రోజంతా లాభాల్లో ట్రేడయ్యాయి.ఆటో, ఎఫ్ఎంసీజీతో పాటు కన్జూమర్ డ్యూరబుల్స్, రియలీ్ట, వినిమయ, ఫార్మా, యుటిలిటీ, కన్జూమర్ డిస్రే్కషనరీ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 437 పాయింట్లు బలపడి 80,397 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు ఎగసి 24,444 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. రికార్డు ర్యాలీలోనూ టెలికం క్యాపిటల్ గూడ్స్, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా చట్ట సభల్లో ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగానికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.మారుతీ పరుగు⇒ పర్యావరణహిత వాహనాలను ప్రోత్సహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైబ్రిడ్ కార్ల రిజి్రస్టేషన్ పన్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూపీ సర్కా రు నిర్ణయంలో దేశంలో ఈ తరహా కార్లను ఉత్పత్తి చేసే మారుతీ సుజుకీ కంపెనీ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 6.60% పెరిగి రూ.12,820 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 8% దూసుకెళ్లి రూ.12,955 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. ⇒ నైరుతి రుతుపవనాలు రాకతో దేశవ్యాప్తంగా ఖరీఫ్ సందడి మొదలైంది. దీ ంతో వినియోగ ఆధారిత రంగ ఎఫ్ఎంసీ జీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈః రూ. 451.27 లక్షల కోట్లు ⇒ స్టాక్ సూచీలు రికార్డు స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్ల సంపద సైతం జీవితకాల గరిష్టానికి చేరుకుంది. మంగళవారం ఒక్క రోజే రూ.1.56 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ ఆల్‌టైం గరిష్టం రూ. 451.27 లక్షల కోట్లకు చేరింది. -
లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 391.26 పాయింట్ల లాభంతో 80,351.64 వద్ద, నిఫ్టీ 112.65 లాభంతో 24,433.20 వద్ద ముగిసాయి. నేడు స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా లాభాలను పొందాయి.టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా మారుతి సుజుకి, బోష్ (Bosch), పీఐ ఇండస్ట్రీస్, అపోలో టైర్స్, ఇప్కా లేబొరేటరీస్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ మొదలైన కంపెనీలు ఉన్నాయి. బంధన్ బ్యాంక్ లిమిటెడ్, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఐఆర్సీటీసీ, చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
క్రమంగా పెరుగుతూ ఉన్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. మళ్ళీ తగ్గుదల మొదలైంది. ఈ రోజు కూడా గోల్డ్ రేట్లు గరిష్టంగా రూ. 380 తగ్గింది. దీంతో నిన్నటి ధరల కంటే ఈ రోజు (జులై 9) ధరలు మళ్ళీ తగ్గాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67100 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73720 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 350, రూ. 380 తగ్గాయి.ఢిల్లీలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 350, రూ. 380 తగ్గింది. కాబట్టి ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67250 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73350 వద్ద ఉంది.హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో మాత్రమే కాకుండా చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 67700.. కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 73850 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు వరుసగా రూ. 300, రూ. 330 తగ్గింది.వెండి ధరలుజులై నెలలో వెండి ధరలు మొదటిసారి తగ్గుముఖం పట్టాయి. దీంతో నేడు (జులై 9) కేజీ వెండి ధర రూ. 94500 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధర కంటే ఈ రోజు వెండి ధర రూ. 500 తగ్గింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
జెరోధాలో సమస్య!.. కోర్టుకెళ్తా అంటున్న యూజర్
పాపులర్ స్టాక్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్ 'జెరోధా'లో మళ్ళీ సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన ఆర్డర్లకు సంబంధించిన సాంకేతిక లోపాల గురించి సోమవారం బహుళ జెరోధా వినియోగదారులు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు.''జెరోధా వల్ల 10 లక్షలు నష్టపోయాం. ఇది కష్టపడి సంపాదించిన డబ్బు. నేను నా డబ్బును తిరిగి పొందాలనుకుంటున్నాను. దీనికోసం కోర్టును ఆశ్రయిస్తాను'' అని ఒక వినియోగదారు చెప్పారు. జెరోధాలో సమస్య తలెత్తినట్లు బ్రోకర్ కూడా అంగీకరించారు.ఈ సమస్య ఇప్పుడు పూర్తిగా పరిష్కరించాము. కొత్త ఆర్డర్ల స్థితి ఇప్పుడు అప్డేట్ చేయబడుతోంది. మేము పాత ఆర్డర్ల స్థితిని అప్డేట్ చేయడానికి పని చేస్తున్నాము. మీకు కలిగిన అసౌకర్యానికి జెరోధా క్షమాపణలు చెప్పింది.జీరోధాలో ఇలాంటి సమస్య తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికి ఆరు సార్లు ఇలాంటి సమస్యను యూజర్లు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లో ఆర్డర్ ప్లేస్‌మెంట్‌కు సంబంధించి సాంకేతిక లోపం ఏర్పడింది. 2023లోనే, Zerodha కైట్ యాప్‌లో లాగిన్ చేయడం , ఆర్డర్లు మరియు పొజిషన్ల ప్రదర్శన అలాగే ఆర్డర్ ప్లేస్మెంట్లకు సంబంధించిన సమస్యలలో సాంకేతిక లోపాలను సంస్థ అంగీకరించింది.#zerodha stuck. My orders not getting executed. Will take you to court if I lose any single penny pic.twitter.com/oSy17lg32H— Rashshad Rasheed (@rashshadrasheed) July 8, 2024 -
ధరల పెరుగుదలకు బ్రేక్!.. తగ్గిన గోల్డ్ రేట్లు
జులై ప్రారంభం నుంచి పెరుగుతూ వచ్చిన పసిడి ధరలకు ఈ రోజు బ్రేక్ పడింది. జులై నెలలో బంగారం ధరలు మొదటిసారి తగ్గుముఖం పట్టాయి. దీంతో నేడు (జులై 8) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67450 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73580 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గాయి. ఇదే ధరలు ముంబై, బెంగళూరు, వైజాగ్, ప్రొద్దుటూరులలో కూడా కొనసాగుతాయి.చెన్నైలో కూడా పసిడి ధరలు ఈ రోజు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 68000 వద్ద, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 220 తగ్గి రూ. 74180 వద్ద నిలిచాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు బంగారం కొంత తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.విజయవాడ, హైదరాబాద్, చెన్నై మాదిరిగానే దేశ రాజధాని నగరంలో కూడా గోల్డ్ రేట్లు తగ్గాయి. దీంతో ఈ రోజు 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 67600 వద్ద, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 73730 వద్ద నిలిచింది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గినట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుబంగారం ధరలు తగ్గుముఖం పట్టినా.. వెండి ధరలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఈ రోజు (జులై 8) కూడా వెండి ధరలు రూ. 200 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర నేడు రూ. 95వేలకు చేరింది. జులై ప్రారంభం నుంచి పెరుగుతూ ఉన్న ధరలు ఇలాగే కొనసాగితే.. వెండి ధర త్వరలోనే లక్షకు చేరుకునే అవకాశం ఉందనిపిస్తోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఇకపై అద్భుతమైన రాబడులు కష్టమే!
ముంబై: ఈక్విటీ మార్కెట్లో రాబడులు వచ్చే మూడేళ్ల కాలంలో క్రితం మూడేళ్ల స్థాయిలో మాదిరి గొప్పగా ఉండకపోవచ్చని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ అంచనా వేసింది. కాకపోతే వచ్చే మూడేళ్లలో ఈక్విటీ రాబడులు గౌరవనీయ స్థాయిలో, ఇతర పెట్టుబడి సాధనాల కంటే మెరుగ్గా ఉండొచ్చని ఈ సంస్థ ఈక్విటీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఆర్ జానకీరామన్ చెప్పారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నుంచి కొత్తగా మలీ్టక్యాప్ ఫండ్ (ఎన్ఎఫ్వో)ను ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈక్విటీ సూచీలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలకు చేరి, అధిక వ్యాల్యూషన్లపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో జానకీరామన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత్ వృద్ధి దశ ఆరంభంలో ఉన్నందునే మార్కెట్ విలువలు అధికంగా ఉన్నట్టు, మరో ఐదేళ్లపాటు ఇదే పరిస్థితి కొనసాగొచ్చన్నారు. ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్లపై (ఐపీవో) స్పందిస్తూ.. అదనంగా వచ్చే పెట్టుబడుల ప్రవాహాన్ని సర్దుబాటు చేసుకునేందుకు కొత్తగా లిస్ట్ అయిన కంపెనీలు వేదిక కాగలవన్నారు. గడిచిన కొన్నేళ్లలో కంపెనీల వృద్ధి కంటే ఈక్విటీ రాబడులే అధికంగా ఉన్నాయని, కనుక దీనికి విరుద్ధమైన పరిస్థితికి ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలని సూచించారు. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు కేటాయించిన పెట్టుబడులు రిస్‌్కను అధిగమించేందుకు తోడ్పడతాయన్నారు. ఈ సంస్థ నిర్వహణలోని ఆస్తుల్లో సగం మేర మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లోనే ఉండడం గమనార్హం. భారత్ మరింత వృద్ధి చెందేకొద్దీ మిడ్, స్మాల్‌క్యాప్ విభాగంలో మరిన్ని కంపెనీలు మెరుగ్గా రాణించడాన్ని చూస్తామంటూ.. ఈ విభాగం పట్ల ఇన్వెస్టర్ల ప్రాధాన్యాన్ని ఇది తెలియజేస్తోందన్నారు. రూ.లక్ష కోట్ల మైలురాయి తమ నిర్వహణలోని ఆస్తుల విలువ మొదటిసారి రూ.లక్ష కోట్లను అధిగమించినట్టు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ ప్రెసిడెంట్ అవినాష్ సత్వాలేకర్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి చివరికి 15వ అతిపెద్ద అస్సెట్ మేనేజర్‌గా ఉన్నట్టు చెప్పారు. ఈ త్రైమాసికంలోనే పలు ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్) పథకాలను ప్రారంభించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మలీ్టక్యాప్ ఫండ్ ఎన్ఎఫ్వో ఈ నెల 8న ప్రారంభమై, 22 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. -
మార్కెట్ స్థిరీకరణకు అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలో స్థిరీకరణకు గురికావొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పట్టికే భారీ కొనుగోళ్లు జరిగినందున, ఇన్వెస్టర్లు కొంతమేర లాభాలు స్వీకరించే వీలుందంటున్నారు. ‘పతనమైన షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని, అందువల్ల నష్టాలు సైతం అధికంగా ఉండకపోవచ్చంటున్నారు. సాంకేతికంగా ‘‘నిఫ్టీ ఎగువ స్థాయిలో 24,400–24,500 శ్రేణిని చేధించాల్సి ఉంటుంది. దిగువ 24,170 స్థాయి వద్ద తక్షణ మద్దతు ఉంది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణులు నాగరాజ్ శెట్టి తెలిపారు.ఈ వారం ప్రభావిత అంశాలు→ అంతర్జాతీయంగా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా సెనెట్, ప్రజా ప్రతినిధుల సభల్లో కీలక ప్రసంగం(మంగళ, బుధవారం), యూఎస్, చైనా జూన్ ద్రవ్యోల్బణ డేటా, బ్రిటన్ మే జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. → ఐటీ దిగ్గజం టీసీఎస్ జూన్ 11న (గురువారం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు(2024–2025) తొలి తైమాసికపు ఫలితాలు వెల్లడించి దేశీయ ఆర్థిక ఫలితాల సీజన్‌ను షురూ చేయనుంది. శుక్రవారం హెచ్‌సీఎల్ టెక్(జూలై 12), అవెన్యూ సూపర్ మార్ట్శనివారం), ఐఆర్ఈడీఏ(జూలై 13న) కంపెనీలు సైతం ఇదే వారంలో క్యూ1 ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన షేర్లలో కదిలికలు, స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉండొచ్చు. → వారాంతాపు రోజైన శుక్రవారం దేశీయ జూన్ రిటైల్ ద్రవ్యోల్బణ, మే పారిశ్రామికోత్పత్తి, తయారీ రంగ వృద్ధి గణాంకాలు వెలువడనున్నాయి. అదే రోజున ఆర్బీఐ ఫారెక్స్ నిల్వలు, బ్యాంకుల రుణ, డిపాజిట్ల వృద్ధి డేటాను ప్రకటించనుంది. → వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, సమగ్ర బడ్జెట్(జూలై 23న)పై అంచనాలు, రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. → గత వారంలో పబ్లిక్ ఇష్యూలు పూర్తి చేసుకున్న ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ బన్సాల్ ఫార్మా షేర్లు బుధవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. -
తగ్గేదేలే అంటున్న బంగారం, వెండి.. నేటి కొత్త ధరలు ఇవే
జులై ప్రారంభం నుంచి పెరుగుతూ ఉన్న పసిడి ధరలు అస్సలు తగ్గేదెలా అన్నట్టు దూసుకెల్తూనే ఉన్నాయి. ఈ రోజు కూడా ధరల్లో ఎటువంటి తగ్గుదల కనిపించలేదు. దీంతో నిన్నటి ధరలే ఈ రోజు (జులై 7) కూడా కొనసాగుతాయి. నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67650 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73800 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి నేడు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67800 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73950 వద్ద ఉంది.హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో మాత్రమే కాకుండా చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 68200.. కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 74400 వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు కూడా ఈ రోజు స్థిరంగానే ఉన్నాయి. దీంతో నేడు (జులై 7) కేజీ వెండి ధర రూ. 94800 వద్ద ఉంది. అయితే వెండి ధర కూడా ఈ నెల ప్రారంభం నుంచి ఏ మాత్రం తగ్గలేదు. కాబట్టి వెండి దాదాపు ఒక లక్షలు చేరువవుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
భారీగా పెరిగిన బంగారం, వెండి: ఇలా అయితే కష్టమే!
జులై ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు బంగారం ధరలు అస్సలు తగ్గడం లేదు. ఈ రోజు కూడా గరిష్టంగా రూ.710 పెరిగి పసిడి ప్రియులకు మళ్ళీ షాకిచ్చింది. దీంతో ఈ రోజు (జులై 6) ధరలు మళ్ళీ పెరిగాయి. నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67650 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73800 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 650, రూ. 710 పెరిగినట్లు స్పష్టమవుతోంది.ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం భారీగానే పెరిగాయి. నేడు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67800 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73950 వద్ద ఉంది. అంటే ఈ రోజు ధరలు రూ. 650, రూ. 710 పెరిగాయి.చెన్నైలో ఈ రోజు బంగారం ధరలు రూ. 600 (22 క్యారెట్స్, 10 గ్రామ్స్), రూ. 650 (24 క్యారెట్స్, 10 గ్రామ్స్) పెరిగాయి. దీంతో ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 68200.. కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 74400 వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ రోజు (జులై 6) వెండి ధర ఏకంగా రూ. 1600 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 94800 వద్ద ఉంది. జులై ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వెండి ఏకంగా రూ. 4800 పెరిగింది. ఈ ధరలు ఇలాగే కొనసాగితే కేజీ వెండి లక్ష రూపాయలకు చేరుతుందని స్పష్టమవుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బ్యాంక్ డిపాజిట్లు డీలా..
న్యూఢిల్లీ: డిపాజిట్ల వృద్ధి స్పీడ్‌ను పెంచడానికి బ్యాంకులు ప్రయతి్నంచినప్పటికీ జూన్ త్రైమాసికంలో నిరాశే మిగిలింది. తక్కువ వ్యయాలకే నిధుల సమీకరణకు దోహదపడే కరెంట్ ఖాతా – సేవింగ్స్ ఖాతా (సీఏఎస్ఏ–కాసా) డిపాజిట్లను సమీకరించడంలో బ్యాంకింగ్ పనితీరు అంత ప్రోత్సాహకరంగా లేదని గణాంకాలు పేర్కొంటున్నాయి. పలు అగ్రశ్రేణి బ్యాంకుల కాసా డిపాజిట్ సమీకరణ వృద్ధి స్పీడ్ 2023–24 మార్చి త్రైమాసికంతో పోలి్చతే తదుపరి 2024–25 జూన్ త్రైమాసికంలో తగ్గింది. కొన్ని బ్యాంకుల విషయంలో డిపాజిట్ల తీరు అక్కడక్కడే ఉండగా, మరికొన్నింటి విషయంలో క్షీణత సైతం నమోదయ్యింది. తొలి సమాచారం ప్రకారం 13 బ్యాంకుల మొత్తం డిపాజిట్లు మార్చి త్రైమాసికంలో పోలి్చతే జూన్ త్రైమాసికంలో 1.15 శాతం క్షీణించింది. జూన్ త్రైమాసికంలో డిపాజిట్ల తీరు క్లుప్తంగా... -
ఎఫ్ఎంసీజీ ఆదాయాల్లో 9 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–9 శాతం మధ్య పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. అధిక అమ్మకాల పరిమాణానికి తోడు గ్రామీణ మార్కెట్లు కోలుకోవడాన్ని ప్రస్తావించింది. పట్టణాల్లోనూ అమ్మకాలు 7–8 శాతం మేర పెరుగుతాయని, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధికితోడు, ప్రీమియం ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ అధిక విక్రయాలకు తోడ్పడొచ్చని అంచనా వేసింది. ప్రీమియం ఉత్పత్తుల వినియోగ ధోరణి, అమ్మకాల్లో వృద్ధి ఎఫ్ఎంసీజీ పరిశ్రమల నిర్వహణ మార్జిన్ల విస్తరణకు తోడ్పడతాయని.. మొత్తం మీద నిర్వహణ మార్జిన్లు 50–75 బేసిస్ పాయింట్లు పెరిగి 20–21 శాతానికి చేరుకోవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. ‘‘మార్జిన్ల విస్తరణ అధికంగానే ఉంటుంది. కానీ మార్కెటింగ్ వ్యయాలు పెరగడం, సంఘటిత, అసంఘటిత రంగంలోని సంస్థల మధ్య అధిక పోటీ నెలకొనడం దీన్ని పరిమితం చేస్తుంది’’అని వివరించింది. ఫుడ్, బెవరేజెస్ విభాగంలో(ఎఫ్అండ్బీ) ముడి సరుకుల ధరలు పెరగడం మార్జిన్ల విస్తరణను పరిమితం చేస్తున్నట్టు తెలిపింది. అదే సమయంలో వ్యక్తిగత, గృహ సంరక్షణ విభాగంలో కీలక ముడి సరుకుల ధరలు స్థిరంగానే ఉన్నాయని పేర్కొంది. ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆదాయంలో సగం ఫుడ్, బెవరేజెస్ నుంచే వస్తుండగా, వ్యక్తిగత సంరక్షణ, గృహ సంరక్షణ చెరో పావు శాతం వాటా కలిగి ఉన్నట్టు క్రిసిల్ గుర్తు చేసింది. ప్రీమియం ఉత్పత్తులను ఎక్కువగా ఆవిష్కరించడం, ముఖ్యంగా ఫుడ్, బెవరేజెస్, వ్యక్తిగత సంరక్షణ విభాగంలో తీసుకురావడం కంపెనీల మార్జిన్లకు మద్దతునిచ్చే అంశంగా పేర్కొంది. ఆహారం, పానీయాల్లో ఎక్కువ వృద్ధి ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆదాయంలో వృద్ధి అన్నది విభాగాల వారీగా భిన్నంగా ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ రవీంద్ర వర్మ తెలిపారు. ‘‘ఫుడ్, బెవరేజెస్ (ఎఫ్అండ్బీ) విభాగంలో ఆదాయాలు 8–9 శాతం మేర పెరగొచ్చు. వ్యక్తిగత సంరక్షణ విభాగంలో ఇది 6–7 శాతం మధ్య ఉంటుంది. గృహ సంరక్షణ ఉత్పత్తుల నుంచి ఆదాయం 8–9 శాతం మేర పెరగొచ్చు’’అని వర్మ తెలిపారు. -
సరికొత్త శిఖరంపై నిఫ్టీ
ముంబై: వారాంతాపు రోజున ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో స్టాక్ సూచీలు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 53 పాయింట్లు కోల్పోయి 80వేల దిగువన 79,997 వద్ద స్థిరపడింది. అయితే నిఫ్టీ 61 పాయింట్లు బలపడి 24,363 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 22 పాయింట్లు పెరిగి ఆల్‌టైం హై 24,314 వద్ద ముగిసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ప్రైవేట్ బ్యాంకుల షేర్లలో విక్రయాల ప్రభావంతో భారీగా పతనమైన సూచీలను రిలయన్స్ (2%) ఎస్బీఐ (2.50%) రాణించడంతో సూచీలు రికవరీ అయ్యాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఇంధన, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రీయ ల్, విద్యుత్, ప్రభుత్వ బ్యాంకుల షేర్లు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫైనాన్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యూఎస్ గణాంకాలు, బ్రిటన్ ఎన్నికల నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. → జియో పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.55,000 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడంతో రిలయన్స్ ఇండస్ట్రియల్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 2% పెరిగి రూ.3180 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ 3% ఎగసి రూ.3198 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. మార్కెట్ విలువ రూ.55,287 కోట్లు పెరిగి రూ.21.51 లక్షల కోట్ల చేరింది.రూ.450 లక్షల కోట్లు సూచీలు ఫ్లాట్‌గా ముగిసినా, ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరింది. శుక్రవారం ఒక్క రోజే రూ. 2.58 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ ఆల్‌టైం గరిష్టం రూ.450 లక్షల కోట్లకు చేరింది. -
స్థిరంగా బంగారం.. రూ.లక్షకు చేరువలో వెండి - నేటి ధరలు ఇవే
జులై ప్రారంభం నుంచి స్వల్పంగా పెరుగుతూ వచ్చి నిన్న ఒకేసారి పైకి లేచిన బంగారం ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. దీంతో నిన్నటి ధరలే ఈ రోజు (జులై 5) కూడా కొనసాగుతాయి. నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67000 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73090 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి నేడు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67150 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73240 వద్ద ఉంది.హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో మాత్రమే కాకుండా చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 67600.. కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 73750 వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు స్థిరంగా ఉన్నా.. వెండి ధర మాత్రం అస్సలు తగ్గనంటోంది. దీంతో ఈ రోజు (జులై 5) కూడా వెండి ధర రూ. 200 పెరిగింది. దీంతో కేజీ ధర రూ. 93200 వద్ద ఉంది. జులై ప్రారంభం నుంచి వెండి ఏకంగా రూ. 3200 పెరిగింది. ఈ ధరలు ఇలాగే కొనసాగితే కేజీ వెండి లక్ష రూపాయలకు చేరుతుందని స్పష్టమవుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
మార్కెట్ల పరుగు... తస్మాత్ జాగ్రత్త!
ముంబై: ఈక్విటీ మార్కెట్ల గణనీయమైన పెరుగుదల నేపథ్యంలో భారత్ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ రెగ్యులేటర్– సెబీ, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు (శాట్) కీలక సూచనలు చేశారు. ఈ విషయంలో ముందస్తు జాగ్రత్త అవసరమన్నారు. ఎటువంటి సవాలునైనా సత్వరం పరిష్కరించడానికి, వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి మరిన్ని ట్రిబ్యునల్ బెంచ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. శాట్ కొత్త ప్రాంగణాన్ని ఇక్కడ ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్లలో అధిక మొత్తంలో లావాదేవీలు, అలాగే కొత్త నిబంధనల కారణంగా శాట్‌పై అధిక పనిభారం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో శాట్ కొత్త బెంచ్‌లను ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలించాలన్నారు. → బీఎస్ఈ సెన్సెక్స్ 80,000 పాయింట్ల మైలురాయిని దాటడం ఒక ఆనందకరమైన క్షణం అంటూ వచి్చన వార్తాపత్రికల కథనాలను ప్రస్తావిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ నష్టపోని వ్యవస్థల ఏర్పాటు, పటిష్టతలపై రెగ్యులేటరీ అధికారుల దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఇలాంటి సంఘటనలు ఉద్ఘాటిస్తున్నాయని తెలిపారు. → ‘మీరు స్టాక్ మార్కెట్లో ఉప్పెనను ఎంత విజయవంతంగా చూస్తారో... అంతే స్థాయిలో జాగ్రత్తలు పాటించే విషయంలో సెబీ, శాట్‌లకు ఎక్కువ పాత్ర ఉంటుందని నేను విశ్వసిస్తునాను. మార్కెట్ భారీ పెరుగుదల సమయాల్లోనే వ్యవస్థ స్థిరంగా ఉండేలా చూసుకోవాలి’ చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. → స్థిరమైన–ఊహాజనిత పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచడంలో, పరిరక్షించడంలో సెబీ, శాట్ వంటి అప్పీలేట్ ఫోరమ్‌ల ప్రాముఖ్యత ఎంతో ఉంటుందన్నారు. దీనిని కీలక జాతీయ ప్రాముఖ్యతగల అంశంగా పేర్కొన్న ఆయన, ఇది దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన అంశంగా వివరించారు. 6,700 అప్పీళ్ల పరిష్కారం శాట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ జస్టిస్ పీఎస్ దినేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ శాట్‌లో ప్రస్తుతం 1,028 పెండింగ్ అప్పీళ్లు ఉన్నాయని, 1997లో మొదలైనప్పటి నుండి 6,700 అప్పీళ్లను పరిష్కరించామని తెలిపారు. శాట్ కొత్త వెబ్సైట్ ప్రారంభం.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన శాట్ కొత్త వెబ్‌సైట్‌ను భారత్ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ కార్యక్రమంలో ప్రారంభించారు. సాంకేతికత సమస్యపై తగిన శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. డిజిటల్ రంగం పురోగతి నేపథ్యంలో న్యాయం పొందడానికి సంబంధించిన భావనకు కొత్త రూపును ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. -
పసిడి ప్రియులకు షాక్!.. ఒక్కసారిగా పెరిగిన ధరలు
జులై ప్రారంభం నుంచి స్వల్పంగా పెరుగుతూ ఉన్న పసిడి ధరలు ఈ రోజు (జులై 4) మరింత పైకి లేచాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు గరిష్టంగా రూ.710 పెరిగింది. దీంతో బంగారం ధర మళ్ళీ తారా స్థాయికి చేరుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67000 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73090 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 650, రూ. 710 పెరిగింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. కాబట్టి నేడు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67150 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73240 వద్ద ఉంది. నేడు 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 650 పెరిగింది. 24 క్యారెట్స్ ధరలు రూ. 710 పెరిగింది.చెన్నై విషయానికి వస్తే.. బంగారం ధరలు వరుసగా రూ. 650, రూ. 710 పెరిగి.. రూ. 67600 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 73750 (24 క్యారెట్స్ 10 గ్రా) వద్ద నిలిచాయి. ఇతర రాష్ట్రాలకంటే చెన్నైలో బంగారం ధరలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుదేశంలో వెండి ధరలు గత నాలుగు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. నేడు ఒక కేజీ వెండి ధర నిన్నటి కంటే రూ. 1500 పెరిగింది. దేంతో ఈ రోజు (జులై 4) కేజీ వెండి రూ. 93000లకు చేరింది. గంట నాలుగు రోజుల్లో వెండి ధర ఏకంగా రూ. 3000 పెరిగింది. ఈ ధరలు ఇలాగె కొనసాగితే కేజీ వెండి లక్ష రూపాయలకు చేరుతుందని తెలుస్తోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
సెన్సెక్స్ రోలర్ కోస్టర్
ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఎన్నికల ఫలితాలు బీజేపీ, ఎన్డీయే కూటమిని బిత్తరపోయేలా చేశాయి. అయితే, మిత్రపక్షాల దన్నుతో మళ్లీ సుస్థిర ఎన్డీయే సర్కారు కొలువుదీరడంతో మార్కెట్ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఫలితాల రోజున నష్టాలన్నింటినీ మూడు రోజుల్లోనే ఎగిరిపోయాయి. వృద్ధికి ఊతమిచ్చేలా 100 రోజుల అజెండాను ప్రకటించిన మోదీ ‘హ్యాట్రిక్’ ప్రభుత్వ చర్యలు ఇన్వెస్టర్లలో మళ్లీ ఉత్సాహా న్ని నింపాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాటను వీడి మళ్లీ కొనుగోళ్ల రూట్లోకి రావడం కూడా మార్కెట్‌కు మరింతి ఇం‘ధనాన్ని’ అందించింది. రాబోయే కాలంలో మౌలిక రంగ ప్రాజెక్టులపై మోదీ సర్కారు భారీగా ఖర్చు చేయనుండటం, బడ్జెట్లో వృద్ధికి ఊతమిచ్చేలా పలు చర్యలు ఉంటాయన్న అంచనాలతో మార్కెట్లో ర్యాలీ కొనసాగుతోంది. తాజాగా 80,000 పాయింట్ల శిఖరాన్ని కూడా దాటేయడం దీనికి నిదర్శనం. కాగా, ఈ ఏడాది చివరికల్లా సెన్సెక్స్ 90,000 పాయింట్లను తాకే అవకాశాలు మెండుగా ఉన్నా యని సుందరం మ్యూచువల్ ఫండ్ మాజీ ఎండీ సునీల్ సుబ్రమణ్యం అంచనా వేయడం విశేషం. దీనికి ప్రధానంగా లార్జ్ క్యాప్ షేర్ల ర్యాలీ దన్ను గా నిలుస్తుందని కూడా ఆయన చెబుతున్నారు. కాగా, ఇన్వెస్టర్ల సంపద గత నెల రోజుల్లోనే రూ. 50 లక్షల కోట్లు దూసుకెళ్లింది. జూన్ 4నరూ.395 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జూలై 3న రూ.445.5 లక్షల కోట్లకు ఎగబాకడం గమనార్హం!జూన్ 4: ఎన్డీయేకు బంపర్ మెజారిటీ ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ముందు రోజు 2,500 పాయింట్ల ర్యాలీ చేసి మార్కెట్ ఫుల్ జోష్ మీదుంది. అయితే, తెల్లారేసరికి అంచనాలు తారుమారయ్యాయి. మార్కెట్‌కు ఎన్నికల ఫలితాల ట్రెండ్ ఊహించన్ని షాకిచి్చంది. బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కష్టమేనని తేలిపోవడంతో దేశీ స్టాక్ మార్కెట్‌పై అమ్మకాల సునామీ విరుచుకుపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 6,234 పాయింట్లు దిగజారి ఏకంగా 70,234 పాయింట్లకు కుప్పకూలింది. చివరికి 4,390 పాయింట్ల భారీ నష్టంతో 72,079 వద్ద ముగిసింది.కట్ చేస్తే... జూలై 3: ఎన్నికల ఫలితాలతో బుర్రతిరిగిన బుల్.. మళ్లీ రంకెలేస్తూ దూసుకుపోయింది. సరిగ్గా నెల రోజుల వ్యవధిలో (ఫలితాల రోజు కనిష్ట స్థాయితో పోలిస్తే) దాదాపు 10,000 పాయింట్ల ర్యాలీతో దుమ్మురేపింది. చరిత్రలో తొలిసారి 80,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. రోజుకో సరికొత్త రికార్డులతో హోరెత్తిస్తోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
Stock Market: సెన్సెక్స్ 80000
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో బుధవారం మరో మరపురాని రోజు. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ తొలిసారి 80,000 శిఖరాన్ని తాకింది. బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్, పారిశ్రామిక షేర్లు ముందుండి నడిపించాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు 2% రాణించి సూచీలకు దన్నుగా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే ముగింపులోనూ తాజా రికార్డులు నమోదు చేశాయి. ఉదయం సెన్సెక్స్ 572 పాయింట్ల లాభంతో 80 వేల స్థాయిపైన 80,013 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 633 పాయింట్లు పెరిగి 80,074 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 545 పాయింట్ల లాభంతో 80 వేల స్థాయి దిగువన 79,987 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 183 పాయింట్లు ఎగసి 24,307 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. చివరికి 163 పాయింట్ల లాభంతో 24,287 వద్ద స్థిరపడింది. లార్జ్‌క్యాప్ షేర్లలో ర్యాలీ క్రమంగా చిన్న, మధ్య తరహా షేర్లకు విస్తరించింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.86%, 0.86 శాతం రాణించాయి. → బ్యాంకుల స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏలు) 12 ఏళ్ల కనిష్టమైన 2.8 శాతానికి పరిమితం కావడంతో బ్యాంకింగ్ షేర్లు మరింత రాణిస్తాయని విశ్లేషకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ బ్యాంక్, ఎస్బీఐలు 2% లాభపడ్డాయి.→ బ్యాంకింగ్ షేర్ల ర్యాలీతో పాటు ఎంఎస్సీఐ ఇండెక్సు ఆగస్టు సమీక్షలో వెయిటేజీ పెంచవచ్చనే అంచనాలతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 2% పెరిగి రూ.1,768 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 3.50% ఎగసి రూ.1,792 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.28,758 కోట్లు ఎగసి రూ.13.45 లక్షల కోట్లకు చేరుకుంది. → ఈ జూన్ 25న 78 వేల స్థాయిని అందుకున్న సెన్సెక్స్... 80,000 స్థాయిని చేరేందుకు కేవలం ఏడు ట్రేడింగ్ సెషన్ల సమయాన్ని మాత్రమే తీసుకుంది. → ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం(జూన్ 9న) నాటి నుంచి 3,294 పాయింట్లు ర్యాలీ చేసింది. → సెన్సెక్స్ రికార్డు ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ జీవితకాల గరిష్ట స్థాయి రూ.445.43 లక్షల కోట్లకు చేరింది. వ్రజ్ ఐరన్ బంపర్ లిస్టింగ్ వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ లిస్టింగ్ రోజే అప్పర్ సర్క్యూట్ తాకింది. బీఎస్ఈలో 16% ప్రీమియంతో రూ.240 వద్ద లిస్టయ్యింది. ఈక్విటీ మార్కెట్ రికార్డు ర్యాలీతో మరింత కొనుగోళ్ల మద్దతు లభించింది. చివరికి 22% లాభపడి రూ.252 అప్పర్ సర్క్యూట్ వద్ద లాకైంది. కంపెనీ మార్కెట్ విలువ రూ.831 కోట్లుగా నమోదైంది.సెన్సెక్స్ 80 వేల స్థాయిని అందుకోవడం దలాల్ స్ట్రీట్‌కు దక్కిన పెద్ద విజయం. లేమన్ సంక్షోభం(2008)లో 8800 స్థాయికి దిగివచి్చంది. కానీ 16 ఏళ్లలో 9 రెట్ల ఆదాయాలు ఇచి్చంది. నాలుగేళ్ల క్రితం కరోనా భయాలతో 26,000 స్థాయికి చేరుకుంది. అయితే పతనమైన ప్రతిసారీ అంతే వేగంగా పుంజుకుంది. ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలానికి అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాయి అనేందుకు ఇది నిదర్శనం. – శ్రీకాంత్ చౌహాన్, కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ -
స్పల్పంగా పెరిగిన బంగారం ధర
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల కాలంలో తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. దాంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,350 (22 క్యారెట్స్), రూ.72,380 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.50, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.60 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.66,950 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.73,040 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.66,500.. 24 క్యారెట్ల ధర రూ.72,530 వద్ద ఉన్నాయి. మార్కెట్లో కేజీ వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.500 పెరిగి రూ.96,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)