Market
-
UPI Transactions: రోజుకు రూ.67,165 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ చెల్లింపుల్లో భారత్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) హవా కొనసాగుతోంది. యూపీఐ వేదికగా 2024 జూన్ నెలలో రోజుకు సగటున 46.3 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ రోజుకు రూ.67,165 కోట్లు. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రోజుకు 31.1 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రోజుకు రూ.49,182 కోట్లు. గత నెలలో (1–29 తేదీల మధ్య) రూ.19,47,787 కోట్ల విలువైన 1,342.3 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2023 జూన్‌లో రూ.14,75,464 కోట్ల విలువైన 933 కోట్ల లావాదేవీలు జరిగాయి. దీనినిబట్టి చూస్తే యూపీఐ హవా ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం అవుతోంది. మొబైల్ ఫోన్ ద్వారా క్షణాల్లో, సురక్షితంగా చెల్లింపులు చేసే వీలుండడం వల్లే యూపీఐ ఈ స్థాయిలో దూసుకుపోతోంది. టెల్కోల దూకుడుతో మారుమూల పల్లెలకూ యూపీఐ యాప్స్ విస్తరించడం విశేషం.598 సంస్థల సేవలుదేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో 598 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, సర్వీస్ ప్రొవైడర్లు నిమగ్నమయ్యాయి. యూపీఐ యాప్స్‌లో ఫోన్‌పే తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. యూపీఐ వేదికగా ఒక నెలలో రూ.10 లక్షల కోట్లకుపైగా విలువైన లావాదేవీలు సాధించిన తొలి యాప్‌గా ఫోన్‌పే సంచలనం సృష్టించింది. 2024 మే నెలలో ఫోన్‌పే ద్వారా ఏకంగా 683 కోట్ల లావాదేవీలు జరగగా, వీటి విలువ రూ.10,33,589 కోట్లు ఉంది. గూగుల్‌పే రూ.7,23,316 కోట్ల విలువైన 522 కోట్ల లావాదేవీలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మూడవ స్థానంలో ఉన్న పేటీఎం యాప్ వేదికగా ఆర్బీఐ ఆంక్షల ప్రభావంతో లావాదేవీలు భారీగా క్షీణించాయి. మే నెలలో పేటీఎం ద్వారా రూ.1,24,705 కోట్ల విలువైన 114 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2024 జనవరిలో పేటీఎం యాప్‌తో రూ.1,92,615 కోట్ల విలువైన చెల్లింపులు నమోదయ్యాయి. -
సెన్సెక్స్ 100 టూ 80,000..!
భవిష్యత్తులో అంతర్జాతీయ అనిశ్చితులు రావొచ్చు. దేశాల మధ్య యుద్ధాలు జరగొచ్చు. కమోడిటీ, ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లొచ్చు. అయినా సరే అన్నింటినీ తట్టుకుని పెట్టుబడి విషయంలో క్రమశిక్షణ పాటిస్తే 20-30 ఏళ్లలో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరుగుతుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. మార్కెట్లు గతంలోనూ చాలా అనిశ్చితులను తట్టుకుని ఇన్వెస్టర్లకు పెద్దమొత్తంలో సంపద సృష్టించాయి. ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు జీవితకాల గరిష్టాలను తాకుతున్నాయి. 1979లో 100 పాయింట్లు ఉన్న సెన్సెక్స్ ప్రస్తుతం 80,000 మార్కు చేరింది. నిఫ్టీ 24,200 మార్కు దాటింది. ఇన్నేళ్ల చరిత్రలో మార్కెట్ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుంది. ఆ విషయాలేంటో తెలుసుకుందాం.100 పాయింట్లు: ఏప్రిల్ 3, 1979లో బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్లను చేరింది.1000 పాయింట్లు: జులై 23, 1990లో ఈ మార్కెను చేరుకుంది. 900 పాయింట్లు పెరగడానికి అప్పట్లో దాదాపు 11 ఏళ్లు పట్టింది.5000 పాయింట్లు: సెన్సెక్స్ 1000 పాయింట్లు చేరుకున్నాక దేశీయంగా చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి.జనవరి 17, 1991లో గల్ఫ్‌యుద్ధం మొదలైంది.జులై 24న మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కీలక మార్పులు తీసుకొచ్చారు.ఏప్రిల్ 26, 1992లో హర్షద్‌మెహతా కుంబకోణం సంచలనం సృష్టించింది. జనవరి 01, 1993 నుంచి భారత్‌లోకి ఎఫ్ఐఐల రాకమొదలైంది. అక్టోబర్ 28, 1997లో ఏషియన్ మార్కెట్లు కుప్పకూలాయి. మే 1,1998లో భారత్ న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించింది. అక్టోబర్ 05, 1998లో యూఎస్‌లో ఆర్థిక అనిశ్చితుల కారణంగో భారత్‌లోని సెన్సెక్స్ ఓకేరోజు 7 శాతం కుంగింది.మే26, 1999లో పాకిస్థాన్‌పై భారత్ కార్గిల్ యుద్ధం ప్రకటించింది.డిసెంబర్ 30, 1999లో సెన్సెక్స్ 5000 మార్కును తాకింది.10000 పాయింట్లుఏప్రిల్ 13, 2000లో టెక్ కంపెనీలు భారీగా నష్టపోయాయి.మార్చి 30, 2001లో కేతన్‌ప్రకాశ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది.జులై 2, 2001లో ‘బద్లా ట్రేడింగ్’ను రద్దు చేశారు.ఫిబ్రవరి 7, 2002లో ఎఫ్ఐఐలకు డెరివేటివ్ ట్రేడింగ్‌లోకి అనుమతులు ఇస్తూ ప్రకటనలు జారీ చేశారు.ఫిబ్రవరి 6, 2006లో 10000 మార్కెను చేరింది.25000 పాయింట్లుఏప్రిల్ 26, 2007లో ఐపీఓ స్కామ్ వెలుగులోకి వచ్చింది.అక్టోబర్ 17,2007లో సెబీ ఎఫ్ఐఐల ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో 50 శాతం ఉండేలా పార్టిసిపేటరీ నోట్ పద్ధతిలో మార్పులు తీసుకొచ్చింది.జనవరి 21, 2008 అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.మే 16, 2014లో సెన్సెక్స్ 25000 మార్కును తాకింది.50000 పాయింట్లుమే 26, 2014లో నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.నవంబర్ 9, 2016లో రూ.500, రూ.1000 పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.జులై 1, 2017లో జీఎస్టీను అమలులోకి తీసుకొచ్చారు.సెప్టెంబర్ 14, 2018లో ఎల్ అండ్ ఎఫ్ఎస్ స్కామ్ వెలుగులోకి వచ్చింది.మార్చి 24, 2020లో కొవిడ్ వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు.జనవరి 21, 2021లో సెన్సెక్స్ 50000 మార్కును చేరింది.75000 పాయింట్లుజనవరి 24, 2023లో అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికతో మార్కెట్లు కొంత రెడ్‌లో ముగిశాయి.నవంబర్ 29, 2023లో భారత్ కంపెనీలు 4 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్కు చేరాయి.ఏప్రిల్ 9, 2024లో సెన్సెక్స్ చివరకు 75000 మార్కును కూడా విజయవంతంగా చేరుకుంది.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైలింగ్‌లో ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తున్నారా..?80,039 పాయింట్లుమే 2024, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారతప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా ఈక్విటీ మార్కెట్లను ఉద్దేశించి దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూలంగా స్పందించారు. ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెడితే రానున్న రోజుల్లో స్పష్టమైన ప్రభుత్వం ఏర్పడి ఇన్వెస్టర్ల సంపద మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత బుల్ ర్యాలీ కొనసాగుతోంది. దాంతో మార్కెట్లు కొత్త గరిష్ఠాలను చేరుతున్నాయి. జులై 03, 2024న సెన్సెక్స్ 80,039 మార్కును తాకింది. -
హిండెన్‌బర్గ్‌కు సెబీ షోకాజ్!
న్యూఢిల్లీ: అకౌంటింగ్లో అవకతవకల ఆరోపణలతో అదానీ గ్రూప్‌ను కుదిపేసిన అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షాకాజ్ నోటీసులు జారీ చేసింది. అదానీ సంస్థల స్టాక్స్ విషయంలో అనుచిత వ్యాపార విధానాలను అమలు చేశారనే ఆరోపణల మీద జూన్ 27న తమకు 46 పేజీల నోటీసు వచ్చినట్లు హిండెన్‌బర్గ్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. ఇది అర్ధరహితమైన చర్యగా కొట్టిపారేసింది. కార్పొరేట్ అవినీతిని, మోసాలను బహిర్గతం చేసేవారిని భయపెట్టేందుకు భారత్‌లో అత్యంత శక్తిమంతులైన వారు చేస్తున్న ప్రయత్నమని వ్యాఖ్యానించింది.అదానీ గ్రూప్ స్టాక్స్‌లో తమకు షార్ట్ పొజిషన్లు ఉన్నాయనే విషయాన్ని అధ్యయన నివేదికను ప్రకటించినప్పుడే తాము వెల్లడించామని హిండెన్‌బర్గ్ పేర్కొంది. ఒక ఇన్వెస్టర్ తరఫున తీసుకున్న పొజిషన్లకు సంబంధించి 4.1 మిలియన్ డాలర్లు లభించాయని, సొంతంగా అదానీ అమెరికా బాండ్లను షార్ట్ చేయడం ద్వారా 31,000 డాలర్లు వచ్చాయని తెలిపింది. లీగల్ ఖర్చులు, అధ్యయనంపై చేసిన వ్యయాలకు అవి బొటాబొటీగా సరిపోయాయని వివరించింది. ఆర్థికంగా గానీ వ్యక్తిగత భద్రతపరంగా గానీ అదానీ గ్రూప్‌పై అధ్యయనం తమకు ఏమాత్రం ప్రయోజనకరమైనది కాకపోయినా ఇప్పటివరకు తాము చేసిన వాటిల్లో అత్యంత గర్వకారణమైనదిగా ఇది నిలిచిపోతుందని హిండెన్‌బర్గ్ తెలిపింది. కోటక్ గ్రూప్ పాత్ర .. అదానీ స్టాక్స్‌ను షార్ట్ చేసేందుకు తమ భాగస్వామ్య ఇన్వెస్టరు ఒకరు .. కోటక్ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్ ఫండ్‌ను ఉపయోగించినట్లు హిండెన్‌బర్గ్ తెలిపింది. ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ పేరు బైటికి రాకుండా చూసేందుకే సెబీ తన నోటీసులో కోటక్‌ను ప్రస్తావించకుండా కే–ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ (కేఐవోఎఫ్) అని మాత్రమే పేర్కొందని ఆరోపించింది. సెబీ నోటీసుల ప్రకారం హిండెన్‌బర్గ్ క్లయింట్ అయిన కింగ్డన్ క్యాపిటల్.. అధ్యయన నివేదిక విడుదలకు ముందు కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్స్కి (కేఎంఐఎల్) చెందిన కేఐవోఎఫ్లో ఇన్వెస్ట్ చేసింది.అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లను షార్ట్ చేసిన కేఐవోఎఫ్ .. నివేదిక విడుదల తర్వాత పరిణామాలతో మొత్తం రూ. 183.24 కోట్ల లాభాలు ఆర్జించింది. మరోవైపు, కేఐవోఎఫ్, కేఎంఐఎల్‌కు హిండెన్‌బర్గ్ ఎన్నడూ క్లయింటుగా లేదని కోటక్ మహీంద్రా గ్రూప్ స్పష్టం చేసింది. తమ ఇతర ఇన్వెస్టర్లకు, హిండెన్‌బర్గ్‌కు మధ్య ఉన్న సంబంధాల గురించి తమకు తెలియదని పేర్కొంది. అదానీ గ్రూప్‌లో షేర్లు, అకౌంట్లలో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ 2023 జనవరిలో విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
ప్రమోటర్లు వాటాలు అమ్మేస్తున్నారు!
ఇటీవల సెకండరీ మార్కెట్లు బుల్ వేవ్‌లో పరిగెడుతున్నాయి. తాజాగా సెన్సెక్స్ 79,000, నిఫ్టీ 24,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించాయి. తద్వారా ప్రామాణిక ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను సాధించాయి. ఈ నేపథ్యంలో పలు లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు కొంతమేర సొంత వాటాలను విక్రయించేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇందుకు పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయి. వివరాలు చూద్దాం..ముంబై: రోజుకో చరిత్రాత్మక గరిష్టాన్ని తాకుతూ దౌడు తీస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లో పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు సైతం కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. దీంతో కొన్ని కంపెనీల ప్రమోటర్లు ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా తమ వాటాలో కొంతమేర విక్రయిస్తున్నారు. తద్వారా నిధులను సమకూర్చుకుంటున్నారు. వీటిని రుణ చెల్లింపులు, విస్తరణ ప్రణాళికలు, పబ్లిక్కు కనీస వాటా తదితరాలకు వినియోగిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వివరాల ప్రకారం 2024 తొలి ఆరు నెలల్లోనే ఎన్ఎస్ఈ–500లోని కొన్ని కంపెనీల ప్రమోటర్లు 10.5 బిలియన్ డాలర్ల(రూ. 87,000 కోట్లకుపైగా) విలువైన ఈక్విటీలను విక్రయించారు. మరొక విశ్లేషణ ప్రకారం గత రెండు నెలల్లోనే సుమారు 200 లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు రూ. 33,000 కోట్లకుపైగా విలువైన షేర్లను విక్రయించడం తాజా ట్రెండ్‌కు అద్దం పడుతోంది. వెరసి దేశీ ఈక్విటీల విలువలు అత్యంత ప్రీమియంస్థాయికి చేరాయన్న సంకేతాలు వెలువడుతున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇందువల్లనే కొన్ని లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు తమతమ బిజినెస్‌లలో లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారని విశ్లేíÙంచారు. కరోనా ఎఫెక్ట్...ప్రస్తుత మార్కెట్లలో పలు కంపెనీల షేర్లు గరిష్ట విలువలకు చేరడంతో బ్లాక్ డీల్స్ లేదా బల్క్ డీల్స్ ద్వారా ప్రమోటర్లు కొంతమేర వాటాలను అమ్మివేస్తున్నారు. వీరికితోడు ఇటీవల పీఈ దిగ్గజాలు, ఇతర సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం తమ పెట్టుబడులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుత ట్రెండ్ కారణంగా 2023 జనవరి–డిసెంబర్లో నమోదైన 12.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,04,000 కోట్లు) విక్రయ రికార్డ్ 2024 కేలండర్ ఏడాదిలో తుడిచిపెట్టుకుపోయే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.2023లో అదానీ గ్రూప్ ప్రమోటర్లు వాటాలు విక్రయించిన విషయం విదితమే. 2024లో ఇప్పటివరకూ దేశ, విదేశీ ప్రమోటర్లు మొత్తంగా రూ. 87,000 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. కోవిడ్–19 నేపథ్యంలో 2020 జనవరి–డిసెంబర్‌లోనూ రికార్డు నెలకొల్పుతూ రూ. 78,500 కోట్ల విలువైన షేర్లను వివిధ కంపెనీల ప్రమోటర్లు అమ్మివేశారు.జూన్‌లో పలువురు ప్రమోటర్లు బ్లాక్ డీల్స్ ద్వారా భారీగా వాటాలను విక్రయించారు. రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలతో ఇండస్ టవర్స్‌లో యూకే దిగ్గజం వొడాఫోన్ గ్రూప్ 18 % వాటాను విక్రయించింది. ఇక ఎంఫసిస్‌లో 15% వాటాను పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ 80 కోట్ల డాలర్లకు అమ్మింది. దేశీ మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌లో ప్రమోటర్ వేదాంతా రిసోర్సెస్ 2.63% వాటా విక్రయం ద్వారా రూ. 4,184 కోట్లు సమీకరించింది. ఇక జెడ్ఎఫ్ కమర్షియల్ వెహికల్లో వాబ్కో ఏషియా 30 కోట్ల డాలర్ల విలువైన వాటాను విక్రయించింది.విక్రయ తీరు(రూ. కోట్లలో)కంపెనీ పేరు షేర్ల విలువ ఇండస్ టవర్స్ 15,300 ఎంఫసిస్ 6,680 వేదాంతా 4,184 ఇంటర్‌గ్లోబ్ 3,300 జెడ్ఎఫ్ సీవీ 2,194 గ్లాండ్ ఫార్మా 1,754 -
వాహన అమ్మకాలు అంతంతే
న్యూఢిల్లీ: దేశంలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రత కారణంగా జూన్‌లో ఆటో అమ్మకాలు అంతంత మాత్రంగా జరిగాయి. అయితే బేస్ ఎఫెక్ట్ కారణంగా విక్రయాల్లో స్వల్ప వృద్ధి నమోదైంది. మొత్తంగా ఈ జూన్‌లో 3,40,784 వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 3,28,710 యూనిట్లతో ఇవి కేవలం 3.67 శాతం అధికం. మారుతీ సుజుకీ, మహీంద్రాఅండ్‌మహీంద్రా, టయోటా కిర్లోస్కర్, కియా మోటార్స్ కంపెనీలు అమ్మకాల్లో వృద్ధిని కనబరిచాయి. టయోటా కిర్లోస్కర్ నెలవారీగా కంపెనీ చరిత్రలో అత్యధికంగా 27,474 వాహనాలకు విక్రయించింది. టాటా మోటార్స్, హోండా కార్స్, హ్యుందాయ్ మోటార్స్ అమ్మకాలు తగ్గాయి. ⇒ఈ ఏడాది ప్రథమార్థంలో మొత్తం 21,68,512 వాహనాలు అమ్ముడయ్యాయి. 2023 తొలి ఆరు నెలల్లో అమ్ముడైన 20,15,033 యూనిట్లతో పోలిస్తే ఇవి 7.6 శాతం అధికం. ఏప్రిల్ పండుగ సీజన్ డిమాండ్ తర్వాత మే, జూన్‌లో వాహన పరిశ్రమ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో క్షీణత చూసింది. సార్వత్రిక ఎన్నికలు, అధిక ఉష్ణోగ్రతలు ఇందుకు కారణాలు. గత రెండు నెలల్లో అమ్మకాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఎంక్వెరీలు బలంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో విక్రయాలు ఊపందుకునే వీలుంది.– పార్థో బెనర్జీ, మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్ హెడ్ -
ప్యాసివ్ ఫండ్స్‌కు సెబీ బూస్ట్
న్యూఢిల్లీ: ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రోత్సాహకంగా సరళతర నిబంధనలను సెబీ ప్రతిపాదించింది. ప్యాసివ్‌గా నడిచే మ్యూచువల్ ఫండ్స్‌లో అంతర్గతంగా రిస్క్ చాలా తక్కువగా ఉండడాన్ని పరిగణనలోకి తీసుకున్న మార్కెట్ల నియంత్రణ సంస్థ.. నిబంధనల అమలు భారాన్ని తగ్గించడం, ఆవిష్కరణలను వేగవంతం చేయడం, పోటీకి మద్దతునివ్వడం, కేవలం ప్యాసివ్ పథకాలనే ఆవిష్కరించే మ్యూచువల్ ఫండ్స్ సంస్థలను (అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) ప్రోత్సహించడం కోసం ‘ఎంఎఫ్ (మ్యూచువల్ ఫండ్) లైట్’ పేరుతో సులభతర నిబంధనలు ప్రతిపాదించింది. దీనిపై సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేస్తూ భాగస్వాముల నుంచి అభిప్రాయాలు కోరింది. ప్యాసివ్ పథకాలు అంటే?మ్యూచువల్ ఫండ్స్‌లో యాక్టివ్, ప్యాసివ్ అని రెండు రకాల పథకాలు ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్‌లో ఫండ్ మేనేజర్ల పాత్ర కీలకం. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది నిర్ణయించేది వీరే. అదే ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ పనితీరు వీటికి భిన్నం. ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్ ప్యాసివ్ ఫండ్స్ కిందకే వస్తుంటాయి. ఇవి ఒక సూచీని అనుసరిస్తూ ఆ సూచీలోని కంపెనీల్లో, వాటి వెయిటేజీకి అనుగుణంగా పెట్టుబడులు పెడుతుంటాయి. కనుక వీటి రాబడులు ఆయా సూచీల పనితీరును పోలి ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్‌లో సరైన కంపెనీలను, సరైన వ్యాల్యూషన్ల వద్ద ఎంపిక చేసుకోవాలి. సరైన సమయంలో ఆయా కంపెనీల్లోని పెట్టుబడులను ఉపసంహరించుకోవడం కూడా చేయాల్సి వస్తుంది. అందుకే వీటికి ఫండ్ మేనేజర్లు, పరిశోధక బృందం నైపుణ్యాలు కీలకం అవుతాయి. కానీ, ప్యాసివ్ ఫండ్స్‌లో అంత నైపుణ్యాలు అవసరం ఉండవు. సూచీల ఆధారంగా పెట్టుబడులను కేటాయిస్తే సరిపోతుంది. అందుకే వీటిల్లో రిస్క్ చాలా తక్కువ. కానీ, ప్రస్తుతం ప్యాసివ్, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్‌కు ఒకే విధమైన కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. నికర విలువ, పనితీరు, లాభదాయకత తదితర అంశాల విషయంలో నిబంధనలు కేవలం ప్యాసివ్ ఫండ్స్‌నే ప్రారంభించాలనుకునే సంస్థలకు ప్రతిబంధకంగా ఉన్నాయి. ఇది గుర్తించిన సెబీ, ఎంఎఫ్ లైట్ పేరుతో ప్యాసివ్ ఫండ్స్‌కు సులభతర నిబంధనలు ప్రతిపాదించింది. కేవలం ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించే సంస్థలే ఎంఎఫ్ లైట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తూ, యాక్టివ్తోపాటు, ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించే సంస్థలు ప్రస్తుత రిజి్రస్టేషన్ కిందే కొనసాగొచ్చు. కేవలం ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించాలనుకునే సంస్థలకు రిజిస్ట్రేషన్, సమాచార వెల్లడి, నింధనల అమలులో వెసులుబాటును సెబీ ప్రతిపాదించింది. సభ్యులందరికీ ఒకే చార్జీలుస్టాక్ ఎక్సే్ఛంజ్‌లు తమ సభ్యులందరికీ ఒకే విధమైన చార్జీలు వసూలు చేయాలని సెబీ తాజాగా ఆదేశించింది. సభ్యుల లావాదేవీల పరిమాణంతో సంబంధం లేకుండా అందరికీ చార్జీలు ఒకే రకంగా ఉండాలని సూచించింది. స్టాక్ ఎక్సే్ఛంజ్లతోపాటు, ఇతర మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్స్ (ఎంఐఐలు) అయిన క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలకు ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. ‘‘ఎంఐఐలు నూతన చార్జీల విధానం రూపొందించే ముందు, ప్రస్తుతం ఒక యూనిట్ వారీ అవుతున్న చార్జీలను పరిగణనలోకి తీసుకోవాలి. దీనివల్ల చార్జీల తగ్గింపుతో తుది క్లయింట్ (ఇన్వెస్టర్) లబ్ధి పొందుతారు’’అని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. -
ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు జీవితకాల గరిష్ట స్థాయిలు నమోదు తర్వాత అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో ఈ వారంలో ఒడిదుడుకులకు లోనవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు దిశానిర్ధేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు సమగ్ర బడ్జెట్‌పై అంచనాలు, రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. ‘‘స్టాక్ మార్కెట్లో ఓవర్‌బాట్ పరిస్థితుల కారణంగా గరిష్ట స్థాయిల వద్ద కొంత లాభాల స్వీకరణ జరగొచ్చు. అధిక వాల్యుయేషన్లు, స్థూల ఆర్థిక డేటా విడుదల నేపథ్యంలో కొంత అస్థిరత చోటు చేసుకునే వీలుంది. ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్ షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు స్తబ్ధుగా ట్రేడవుతున్నాయి. సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 23800 వద్ద కీలక మద్దతు ఉంది. ఎగువున 24,200 వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంది’’ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ సాంకేతిక నిపుణుడు నాగరాజ్ శెట్టి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు, ద్రవ్యోల్బణ సంబంధిత ఆందోళలను అధిగమిస్తూ గతవారం స్టాక్ సూచీలు 2% ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1,823 పాయింట్లు, నిఫ్టీ 510 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. స్థూల ఆర్థిక గణాంకాలు జూన్ జీఎస్టీ వసూళ్లు, ఆటో కంపెనీలు జూన్ వాహన విక్రయ గణాంకాలు నేడు(సోమవారం) విడుదల కానున్నాయి. ఇదే రోజు జూన్ తయారీ రంగ పీఎంఐ వెల్లడి కానుంది. సేవారంగ పీఎంఐ గణాంకాలు బుధవారం వెల్లడి అవుతాయి. జూన్ 28తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, జూన్ 21తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ఆర్బీఐ శుక్రవారం(జూన్ 5న) విడుదల చేస్తుంది. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. ప్రపంచ పరిణామాలు చైనా, జపాన్ జూన్ తయారీతో పాటు యూరోజోన్ జూన్ వినియోగదారుల విశ్వాస, తయారీ గణాంకాలు సోమవారం(నేడు) విడుదల అవుతాయి. యూరోజోన్ జూన్ ద్రవ్యోల్బణం, మే నిరుద్యోగ గణాంకాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ మినిట్స్ బుధవారం (జూలై 3న), బ్రిటన్‌లో (గురువారం) జూలై4న సార్వత్రి ఎన్నికలు జరగునున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం జపాన్ ఏప్రిల్ గృహ వినియోగ వ్యయ డేటా, యూరోజోన్ జూన్ రిటైల్ అమ్మకాలు, అమెరికా జూన్ నిరుద్యోగ గణాంకాలు విడుదల కానున్నాయి. జూన్‌లో రూ.26,565 కోట్ల కొనుగోళ్లు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు జూన్‌లో రూ.26,565 కోట్ల కొనుగోళ్లు జరిపారు. రాజకీయ స్థిరత్వం, స్టాక్ మార్కెట్ అనూహ్యంగా పుంజుకోవడం ఇందుకు కారణాలుగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇదే ఏడాది మార్చిలో అత్యధికంగా రూ.35,098 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘జేపీ మోర్గాన్ గ్లోబల్ బాండ్ ఇండెక్సులో భారత ప్రభుత్వ బాండ్లలను చేర్చడంతో దేశీయంగా కూడా పెట్టుబడులు భారీగా పెరగొచ్చు. అమెరికా అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఉండే అవకాశం ఉంది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లకు భారత మార్కెట్ మరింత ఆకర్షణగా కనిపిస్తుంది’’ స్వస్తిక ఇన్వెస్ట్మెంట్ సీనియర్ సాంకేతిక నిపుణుడు ప్రవేశ్ గౌర్ తెలిపారు. ఎఫ్ఐఐలు మే నెలలో రూ. 25,586 కోట్లు, ఏప్రిల్‌లో రూ.8,671 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించగా, జనవరిలో రూ. 25,744 కోట్లతో అమ్మకాలు జరిపారు. ఫిబ్రవరిలో మాత్రం రూ.1,539 కోట్ల స్వల్ప ఇన్‌ఫ్లోలు వచ్చాయి. -
ఈ వారం 2 లిస్టింగ్‌లు, 2 ఐపీవోలు
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో 4 ఐపీవోలు హడావిడి చేయనున్నాయి. గత వారమే ఇష్యూలు పూర్తి చేసుకున్న అలైడ్ బ్లెండర్స్ 2న, వ్రజ్ ఐరన్ 3న స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నాయి. ఇక మరోపక్క ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్, బన్సల్ వైరింగ్ పబ్లిక్ ఇష్యూలు 3నే ప్రారంభంకానున్నాయి. ఆఫీసర్స్ చాయిస్ విస్కీ బ్రాండ్ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ రూ. 281 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 1,500 కోట్లు అందుకుంది. స్పాంజ్ ఐరన్, టీఎంటీ బార్ల తయారీ కంపెనీ వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ షేరుకి రూ. 207 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 171 కోట్లు అందుకుంది. జూలై 5న ముగియనున్న స్టీల్ వైర్ల తయారీ కంపెనీ బన్సల్ వైర్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 243–256 ధరల శ్రేణిని ప్రకటించింది. మొత్తం రూ. 745 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయడం ద్వారా రూ. 745 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. రిటైలర్లు కనీసం 58 షేర్లకు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఎమ్క్యూర్ ఫార్మా పబ్లిక్ ఇష్యూకి రూ. 960–1008 ధరల శ్రేణిని ప్రకటించింది. 5న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.14 కోట్ల షేర్ల(రూ. 1,152 కోట్ల విలువ)ను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,952 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. రిటైలర్లు కనీసం 14 షేర్లకు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. -
తప్పుడు సలహాలు ఇక కుదరవు!! సెబీ కొత్త రూల్స్
ముంబై: సెక్యూరిటీస్ లావాదేవీలపై అనియంత్రిత ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు (ఫిన్ఫ్లుయెన్సర్లు) ఇచ్చే తప్పుడు సలహాలతో తలెత్తే రిస్కులపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ అంశంపై దృష్టి సారించింది. ఫిన్ఫ్లుయెన్సర్లను నియంత్రణ పరిధిలోకి తెస్తూ నిబంధనలను ఆమోదించింది.వీటి ప్రకారం ప్రతిఫలం తీసుకుని కచ్చితమైన రాబడులు వస్తాయంటూ సలహాలిచ్చే వ్యక్తులతో సెబీ నియంత్రణలోని వ్యక్తులు (బ్రోకర్లు మొదలైనవారు) కలిసి పని చేయకూడదు. సాధారణంగా కమీషన్ ప్రాతిపదికన పని చేసే ఫిన్‌ఫ్లుయెన్సర్లకు కొన్నాళ్లుగా తమ ఫాలోయర్ల ఆర్థిక నిర్ణయాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నారు. తామిచ్చే సలహాల విషయంలో ఫిన్ఫ్లుయెన్సర్లు జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు తాజా సెబీ నిబంధనలు ఉపయోగపడనున్నాయి.మరోవైపు, తరచుగా ట్రేడయ్యే షేర్లను డీలిస్ట్ చేయడానికి సంబంధించి ఫిక్సిడ్ ధర ప్రక్రియను ప్రవేశపెట్టాలని సెబీ నిర్ణయించింది. అలాగే, ఇన్వెస్ట్మెంట్, హోల్డింగ్ కంపెనీల (ఐహెచ్సీ) డీలిస్టింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ఆవిష్కరించింది. ఫిక్స్డ్ ధర విధానంలో డీలిస్టింగ్‌కు ఫ్లోర్ ధర కంటే కనీసం 15 శాతం ప్రీమియంతో ఆఫర్‌ను చేపట్టవలసి ఉంటుంది. డెరివేటివ్స్ నిబంధనలు కఠినతరం.. ఇండివిడ్యువల్ స్టాక్స్‌ను డెరివేటివ్స్ సెగ్మెంట్లో చేర్చడం, తీసివేయడానికి సంబంధించిన నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. క్యాష్ మార్కెట్లో పనితీరును బట్టి వాటిని చేర్చడం లేదా తీసివేయడమనేది ఉంటుందని పేర్కొంది. తక్కువ టర్నోవరు ఉన్న స్టాక్స్‌ను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ నుంచి తప్పించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. మరోవైపు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కేటగిరీని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇది సెకండరీ మార్కెట్ అడ్వైజరీ కమిటీకి తన నివేదికను సమర్పిస్తుందని సెబీ చీఫ్ మాధవి పురి బచ్ తెలిపారు. -
బుల్.. కొత్త రికార్డుల్
ముంబై: ఐటీ, ఇంధన షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. తొలిసారి సెన్సెక్స్ 79 వేలు, నిఫ్టీ 24 వేల పాయింట్ల మార్కును దాటాయి. అధిక వెయిటేజీ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ 1%, టీసీఎస్, ఇన్ఫోసిస్ 2%, అ్రల్టాటెక్ సిమెంట్ 5%, ఎన్టీపీసీ 3% పెరిగి సూచీల రికార్డుల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు, కాసేపటికే పుంజుకొని తాజా రికార్డులు నమోదు చేశాయి. మిడ్‌సెషన్ నుంచి కొనుగోళ్లు మరింత ఊపందుకోవడంతో ఇరు సూచీలు సరికొత్త రికార్డుల ఎగువనే ముగిశాయి.ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 721 పాయింట్లు ఎగసి 79,396 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. చివరికి 569 పాయింట్ల లాభంతో 79,243 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 219 పాయింట్లు బలపడి 24,087 వద్ద తాజా గరిష్టాన్ని నెలకొలి్పంది. ఆఖరికి 176 పాయింట్లు బలపడి 24,044 వద్ద నిలిచింది. రికార్డుల ర్యాలీలోనూ ఫైనాన్స్, పారిశ్రామిక, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.17 % లాభపడగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ అరశాతానికి పైగా నష్టపోయింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 12 పైసలు బలపడి 83.45 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూరప్ సూచీలు బలహీనంగా ముగిశాయి. అమెరికా మార్కెట్లూ స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ‘‘జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ జరగడంతో సెన్సెక్స్ 79 వేలు, నిఫ్టీ 24 వేల స్థాయిలను అధిగమించాయి. అధిక వెయిటేజీ షేర్లు రాణించడం, రాజకీయ స్థిరత్వం, విదేశీ ఇన్వెస్టర్ల పునరాగమన అంశాలు సూచీలను సరికొత్త శిఖరాలపైకి చేర్చాయి. అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి’’ రిలిగేర్ బ్రోకింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ రికార్డు ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరింది. సెన్సెక్స్ 4 రోజుల్లో 2,033 పాయింట్లు(2.63%) పెరగడంతో రూ.3.93 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్‌టైం రికార్డు రూ.438.41 లక్షల కోట్లకు చేరింది. ర్యాలీ ఇలానిఫ్టీ చేరేందుకు పట్టిన కాలం 20,000 51 రోజులు 21,000 60 రోజులు 22,000 25 రోజులు 23,000 88 రోజులు 24,000 25 రోజులు -
లాభాలు ఓకే.. డివిడెండ్లు ప్చ్!
దేశీయంగా లిస్టెడ్ కంపెనీలు మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో సగటున రికార్డ్ స్థాయిలో లాభాలు ఆర్జించాయి. అయితే లాభాలను వాటాదారులకు పంచే(డివిడెండ్ పేఔట్) విషయంలో వెనుకంజ వేస్తున్నాయి. వార్షికంగా పేఔట్ దాదాపు 5 శాతం నీరసించింది. ఇందుకు పలు అంశాలు ప్రభావాన్ని చూపుతున్నాయి. డివిడెండ్ ప్రకటించిన 999 లిస్టెడ్ కంపెనీలను పరిగణించిన ఒక నివేదిక రూపొందించిన వివరాలు చూద్దాం.. ముంబై: దేశీ లిస్టెడ్ కార్పొరేట్లు గతేడాది(2023–24)కి డివిడెండ్లను ప్రకటించడంలో ఆచితూచి అడుగేస్తున్నాయి. దీంతో సగటున అంతక్రితం ఏడాది(2022–23)తో పోలిస్తే డివిడెండ్ చెల్లింపు 4.7 శాతం తగ్గింది. రూ. 4.03 లక్షల కోట్లను పంచిపెట్టాయి. అయితే 2022–23లో సరికొత్త రికార్డును లిఖిస్తూ చెల్లించిన రూ. 4.23 ట్రిలియన్లతో పోలిస్తే తక్కువే. ఇక నికర లాభాల విషయానికివస్తే(అనుకోని లాభాలు లేదా నష్టాల సర్దుబాటు తదుపరి) గతేడాది వార్షికంగా 30 శాతం వృద్ధితో రూ. 14.75 లక్షల కోట్లను ఆర్జించాయి. ఇవి చరిత్రాత్మక గరిష్టంకాగా.. 2022–23లో రూ. 11.36 ట్రిలియన్ నికర లాభాన్ని సాధించాయి. కరోనా మహమ్మారి తదుపరి గత మూడేళ్లుగా దేశీ కార్పొరేట్ లాభాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతూ వస్తున్నాయి. దీంతో డివిడెండ్ చెల్లింపులు సైతం 2020–23 కాలంలో వార్షిక పద్ధతిన 29.5 శాతం చొప్పున ఎగశాయి. వార్షిక చెల్లింపులు 2023కల్లా 4.23 లక్షల కోట్లకు జంప్‌చేసింది. 2020లో ఇవి రూ. 1.95 ట్రిలియన్లు మాత్రమే. ఇదే కాలంలో మొత్తం లిస్టెడ్ కంపెనీల నికర లాభం దాదాపు 34 శాతం దూసుకెళ్లాయి. అయినప్పటికీ గతేడాది లాభాల పంపకం డీలా పడటం గమనార్హం! కోవిడ్–19 ముందు.. గత మూడేళ్లతో పోలిస్తే ఈక్విటీ డివిడెండ్ల చెల్లింపులు కోవిడ్–19కు ముందు తక్కువగానే నమోదయ్యాయి. 2017–20 కాలంలో లిస్టెడ్ కంపెనీల ఈక్విటీ డివిడెండ్ల పంపకం వార్షికంగా కేవలం 3 శా తం వృద్ధిని అందుకుంది. దీంతో 2017లో నమోదైన రూ. 1.78 ట్రిలియన్ డివిడెండ్లు 2020కల్లా రూ. 1.95 లక్షల కోట్లకు మాత్రమే బలపడ్డాయి. ఇందుకు నికర లాభాలు నీరసించడం కారణమైంది. 2017లో మొత్తం లిస్టెడ్ కంపెనీల నికర లాభం రూ. 4.81 లక్షల కోట్లుకాగా.. 2020కల్లా రూ. 4.75 ట్రిలియన్లకు పరిమితమైంది. కాగా.. ప్రస్తుతానికి వస్తే గత ఐదేళ్లలో తొలిసారి వార్షికంగా డివిడెండ్ పేఔట్ రేషియో గతేడాది తగ్గింది. ఇలా ఇంతక్రితం 2019 లోనూ పేఔట్లో క్షీణత నమోదైంది. 2018లో రూ. 1.87 లక్షల కోట్లుకాస్తా 2019లో రూ.1.85 ట్రిలియ న్లకు బలహీనపడింది. ఇక గతేడాది లాభాలు, డివిడెండ్లు వ్యతిరేక దిశలో నమోదయ్యాయి. గత 9 ఏళ్లలోనే కనిష్టంగా డివిడెండ్ పేఔట్ నిష్పత్తి 27 శాతానికి పరిమితమైంది. 2023లో ఇది 37 శాతంకాగా.. 2020లో ఆల్‌టైమ్ గరిష్టం 41 శాతాన్ని తాకింది. కారణాలు.. సగటున పేఔట్ రేషియో నీరసించడానికి మార్కెట్ విశ్లేషకులు కొన్ని కారణాలను ప్రస్తావిస్తున్నారు. గతేడాది కొన్ని కీలక రంగాలలో కార్పొరేట్ ఆర్జన మందగించింది. దీంతో కొన్ని కంపెనీలు నగదును అంతర్గత వనరుల కోసం పక్కన పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. పీఎస్‌యూ బ్యాంకులు, చమురు కంపెనీలు అధిక లాభాలను ఆర్జించగా.. అధిక డివిడెండ్లు పంచే ఐటీ, ఎఫ్ఎంసీజీ తదితర రంగాలలో డిమాండ్ మందగించడం, వినియోగ వ్యయాలు తగ్గడం ప్రభావం చూపినట్లు వివరించారు. -
ట్రేడింగ్‌లో రూ.46 లక్షలు నష్టపోయిన బీటెక్ విద్యార్థి!
స్టాక్‌మార్కెట్‌పై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్నాకే ఇన్వెస్ట్ చేయాలని ఆర్థిక నిపుణులు, సెబీ హెచ్చరిస్తున్నా వారి సూచనలు పట్టించుకోకుండా చాలామంది తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్ నిపుణుల సలహాలు పట్టించుకోని ఓ బీటెక్ విద్యార్థి రెండేళ్లలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేసి ఏకంగా రూ.46 లక్షలు పోగొట్టుకున్నాడు. ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు ఆ విద్యార్థి రోషన్ అగర్వాల్ అనే చార్టర్డ్ అకౌంటెంట్‌ను సంప్రదించడంతో ఈ వ్యవహారం బయటపడింది.రోషన్ తెలిపిన వివరాల ప్రకారం..‘బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాలని నా వద్దకు వచ్చాడు. తనకు ఎలాంటి ఆదాయం లేదు. తన తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి హోటల్ నిర్వహిస్తోంది. పేరెంట్స్‌కు తెలియకుండానే వాళ్ల అకౌంట్ నుంచి కొంత డబ్బు విత్‌డ్రా చేశాడు. ఆ డబ్బుతో ట్రేడింగ్ చేయడం ప్రారంభించాడు. ఆ డబ్బు నష్టపోవడంతో యాప్‌ల ద్వారా వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. స్నేహితుల దగ్గర అప్పు చేశాడు. ట్రేడింగ్ ద్వారా నిత్యం డబ్బు నష్టపోతున్నా అప్పుచేసి మరీ ట్రేడింగ్ చేసేవాడు. గడిచిన ఏడాదిలో ఎఫ్ అండ్ ఓ ద్వారా రూ.26 లక్షలు నష్టపోయాడు. అంతకుముందు ఏడాదిలోనూ రూ.20 లక్షలు పోగొట్టుకొన్నాడు. ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ ద్వారానే మొత్తం రూ.46 లక్షలు కోల్పోయాడు’ అని చెప్పారు.‘ఆ విద్యార్థి మిత్రుడు ఒకరు ఎఫ్ అండ్ ఓ ద్వారా రూ.కోటి సంపాదించాడని విని ఎలాగైనా డబ్బు సంపాదించాలని ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టాడు. నిత్యం నష్టం వస్తునపుడు ఆ ట్రేడింగ్‌ను మానేయొచ్చు కదా అని ప్రశ్నిస్తే..ట్రేడింగ్‌కు బానిసైపోయా అని బదులిచ్చాడు. ఇంతలా నష్టపోయావు కదా.. భవిష్యత్తులో మళ్లీ ట్రేడింగ్ చేస్తావా? అని అడిగితే ఇకపై ట్రేడింగ్ చేయనని చెప్పాడు’ అని అగర్వాల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైలింగ్.. ఇవి గమనిస్తే మేలుఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో 90 శాతం మంది మదుపర్లు తమ డబ్బు పోగొట్టుకుంటున్నారని గతంలో సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి బచ్ అన్నారు. ‘ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేస్తున్న దాదాపు 45.24 లక్షల మందిలో, కేవలం 11 శాతం మందే లాభాలు పొందుతున్నారు. ట్రేడింగ్‌పై పూర్తి అవగాహన చాలా ముఖ్యం. దీర్ఘకాలిక దృష్టితో మార్కెట్లో పెట్టుబడులు పెడితే తాత్కాలికంగా నష్టాలు వచ్చినా మంచి రాబడులు పొందవచ్చు. సంపద సృష్టికి అవకాశం ఉన్న విభాగంలోనే పెట్టుబడులు పెట్టండి’ అని ఆమె గతంలో మదుపర్లకు సూచించారు. -
సెన్సెక్స్ @ 78,000
ముంబై: ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం ఇంట్రాడే, ముగింపులోనూ జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. సెన్సెక్స్ తొలిసారి 78 వేల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ ఈ ఏడాదిలో 34వ సారి సరికొత్త రికార్డును నెలకొల్పింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.మిడ్‌సెషన్ నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో ఊహించని రీతిలో పుంజుకున్నాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 823 పాయింట్లు ఎగసి 78,165 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. చివరికి 712 పాయింట్ల లాభంతో 78,054 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 216 పాయింట్లు బలపడి 23,754 వద్ద తాజా గరిష్టాన్ని నెలకొలి్పంది. ఆఖరికి 183 పాయింట్లు బలపడి 23,721 వద్ద నిలిచింది. రికార్డుల ర్యాలీలోనూ రియలీ్ట, విద్యుత్, వినిమయ, మెటల్, టెలికం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రికార్డుల ర్యాలీకి కారణాలు ⇒ కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, సంస్కరణల కొనసాగింపుపై ఆశలు, అధికారం చేపట్టిన తొలి 100 రోజుల ప్రణాళికల అమలుపై మంత్రిత్వ శాఖలు దృష్టి సారించడంతో ట్రేడర్లు ఎఫ్అండ్ఓలపై బుల్లిష్ వైఖరి ప్రదర్శించారు. నిఫ్టీ జూలై సిరీస్ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లోకి పొజిషన్లను రోలోవర్ చేసుకునేందుకు ట్రేడర్లు ఆసక్తి చూపుతున్నట్లు ఎఫ్అండ్ఓ గణాంకాలు సూచిస్తున్నాయి. ⇒ ఇటీవల ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లలో ర్యాలీ మందగించడంతో మంగళవారం సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ప్రైవేటు రంగ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. యాక్సిస్ బ్యాంక్ 3.50%, ఐసీఐసీఐ బ్యాంక్ 2.50%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.32% కోటక్ బ్యాంక్ అరశాతం మేర రాణించాయి. అలాగే పీఎస్‌యూ ఎస్బీఐ బ్యాంకు షేరూ ఒకశాతానికి పైగా లాభపడింది. ⇒ మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో విదేశీ ఇన్వెస్టర్లు ఇండెక్స్ ఫ్యూచర్లలో షార్ట్ పొజిషన్లను కవరింగ్ చేయడంతో పాటు క్రమంగా లాంగ్ పొజిషన్లను బిల్డ్ చేసుకున్నారు. గడచిన ఏడు ట్రేడింగ్ సెషన్లలో ఇండెక్స్ ఫ్యూచర్లలో నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఇండెక్సు ఫ్యూచర్లలో 59.08 శాతం లాంగ్ పొజిషన్లను కలిగి ఉన్నారు. ఇది గత రెండు నెలల్లో అత్యధికం. ⇒ గత ఆర్థిక సంవత్సరంలో జనవరి–మార్చి త్రైమాసికంలో మనదేశ కరెంట్ ఖాతా మిగులు 5.7 మిలియన్ డాలర్లుగా ఉందని, ఇది జీడీపీలో 0.6 శాతానికి సమానమని ఆర్బీఐ ప్రకటించింది. ఇది సానుకూల సంకేతం కావడంతో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్లకు మొగ్గుచూపారు. అలాగే అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై స్పష్టత ఇచి్చన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో పెట్టుబడులు పెంచవచ్చని, రూపాయి మారకంపై ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు సూచీలకు కలిసొచ్చాయి. స్టాన్లీ లైఫ్‌స్టైల్ ఐపీవో సక్సెస్ 96 రెట్లు అధిక స్పందనలగ్జరీ ఫరీ్నచర్ బ్రాండ్(కంపెనీ) స్టాన్లీ లైఫ్‌స్టైల్ పబ్లిక్ ఇష్యూకు భారీ స్పందన లభించింది. ఇష్యూ చివరి రోజు మంగళవారానికల్లా 96 రెట్లు సబ్‌్రస్కిప్షన్‌ను అందుకుంది. కంపెనీ 1.02 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. దాదాపు 98.57 కోట్ల షేర్లకు స్పందన లభించింది. రిటైల్ ఇన్వెస్టర్లు 18 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. షేరుకి రూ. 351–369 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 537 కోట్లు సమీకరించింది.⇒ అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ షేరు 19% పెరిగి రూ.1,647 వద్ద ముగిసింది. లిథియం అయాన్ సెల్స్ ఉత్పత్తి చేసేందుకు స్లొవేకియా సంస్థ జీఐబీ ఎనర్జీఎక్స్తో ఈ సంస్థ లైసెన్సింగ్ డీల్ కుదుర్చుకోవడం ఇందుకు కారణం.⇒ ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు షేరు 2.5% పెరిగి రూ.1199 వద్ద స్థిరపడింది. దీంతో బ్యాంకు మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల (రూ.8.43 లక్షల కోట్లు) వద్ద ముగిసింది. -
తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..?
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల కాలంలో తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. దాంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,800 (22 క్యారెట్స్), రూ.70,140 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలో వరుసగా రూ.200, రూ.210 తగ్గింది.చెన్నైలో మంగళవార 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.50, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.50 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.70,350 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.67,250.. 24 క్యారెట్ల ధర రూ.70,610 వద్ద ఉన్నాయి. మార్కెట్లో కేజీ వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.700 తగ్గి రూ.95,500 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
క్వాంట్ ఫండ్ కార్యాలయాల్లో సెబీ సోదాలు
ముంబై: ఫ్రంట్ రన్నింగ్ కేసులను తీవ్రంగా పరిగణిస్తున్న మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా క్వాంట్ మ్యుచువల్ ఫండ్‌పై దృష్టి సారించింది. కంపెనీకి చెందిన హైదరాబాద్, ముంబై కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ కేసుతో సంబంధమున్న డీలర్లు, వ్యక్తులను కూడా సెబీ ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సందీప్ టాండన్ నెలకొల్పిన క్వాంట్ మ్యుచువల్ ఫండ్ అసెట్లు 2019లో సుమారు రూ. 100 కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం రూ. 90,000 కోట్ల పైచిలుకు చేరాయి. 26 స్కీములు, 54 లక్షల ఫోలియోలతో ఈ ఫండ్ ఈ ఏడాది జనవరిలోనే రూ. 50,000 కోట్ల మార్కును దాటింది. సంస్థకి చెందిన స్మాల్ క్యాప్ ఫండ్ గత అయిదేళ్లలో ఏకంగా 45 శాతం రాబడిని అందించింది. మే నెలలో స్మాల్ క్యాప్ ఫండ్ కేటగిరీలోకి వచి్చన మొత్తం నిధులలో 43 శాతం నిధులు క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్‌లోకే రావడం గమనార్హం. పెద్ద ఆర్డర్లు రాబోతున్న సమాచారం తెలుసుకుని ఫండ్ మేనేజర్లు, డీలర్లు, బ్రోకర్లు ముందుగానే తమ సొంత ఖాతాల ద్వారా ఆయా షేర్లలో ట్రేడింగ్ చేసి లాభపడటాన్ని ఫ్రంట్ రన్నింగ్‌గా వ్యవహరిస్తారు. ఇలాంటి లావాదేవీలన్నీ వేరే వారి పేరిట ఉండే ఖాతాల ద్వారా జరుగుతాయి కాబట్టి అంతిమంగా లబ్ధి పొందే వ్యక్తులను గుర్తించడం కఠినతరంగా ఉంటోంది. దీంతో సెబీ కొన్నాళ్లుగా ఈ తరహా కేసులపై మరింత లోతుగా విచారణ జరుపుతోంది. ఇలాంటి ఆరోపణలపైనే యాక్సిస్ మ్యుచువల్ ఫండ్‌కి చెందిన ఫండ్ మేనేజర్ వీరేశ్ జోషితో పాటు అతనికి సంబంధించిన 20 సంస్థలు, వ్యక్తులపై సెబీ గతంలో చర్యలు తీసుకుంది. -
పరిమిత శ్రేణిలోనే కదలికలు
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. డెరివేటివ్ కాంట్రాక్టుల నెలవారీ గడువు గురువారం(జూన్ 27)తో పూర్తి కానుండడం కూడా మార్కెట్లో ఊగిసలాట ఉండొచ్చంటున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. ‘‘స్టాక్ మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ ఉన్నప్పట్టకీ., కొనుగోళ్లు చేసేందుకు గానీ, అమ్మకాలు జరిపేందుకు గానీ ప్రేరేపించే అంశాలేవీ లేనందున సూచీలు పరిమిత శ్రేణిలో చలించవచ్చు. అలాగే బడ్జెట్ అంచనాల వార్తలకు అనుగుణంగా బడ్జెట్ ఆధారిత రంగ షేర్లలో మూమెంటమ్ అధికంగా ఉండొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 23,400 – 23,700 శ్రేణిలో దిద్దుబాటు ఉండొచ్చు. దిగువ స్థాయిలో 23,300–23,200 పరిధిలో తక్షణ మద్దతు నెలకొని ఉంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ సాంకేతిక నిపుణులు ప్రవేశ్ గౌర్ తెలిపారు. ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే గతవారంలో సెన్సెక్స్ 217 పాయింట్లు, నిఫ్టీ 36 పాయింట్లు లాభపడ్డాయి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశ నిర్ణయాల ప్రభావం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం జరిగిన 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశ నిర్ణయాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. ముఖ్యంగా ఎరువులపై జీఎస్టీ 18% నుంచి 5 శాతానికి తగ్గింపు ప్రతిపాదనను మంత్రుల బృందానికి (జీవోఎం) సిఫార్సు చేయడంతో ఫెర్టిలైజర్లలో కదలికలు ఉండొచ్చు. అలాగే, ఈ సమావేశంలో ఆన్లైన్ గేమింగ్‌పై జీఎస్టీకి సంబంధించి ఎటువంటి చర్చ జరగకపోవడంతో ఆన్లైన్ గేమింగ్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు. విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయ్ విధాన సంస్కరణలు, ఆర్థిక వృద్ధి కొనసాగింపుపై అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లో క్రమంగా పెట్టుబడులు పెంచుకుంటున్నారు. ఈ జూన్ ఇప్పటివరకు(జూన్ 21 నాటికి) నికరంగా రూ.12,170 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫైనాన్సియల్ సరీ్వసెస్, టెలికం, రియల్టీ షేర్ల పట్ల ఆసక్తి కనబరిచారు. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్, అయిల్‌అండ్‌గ్యాస్ షేర్లను విక్రయించారు. ఇక డెట్ మార్కెట్ లో రూ.10,575 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశారు. ‘‘కేంద్రం వృద్ధికి మద్దతనిచ్చే బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చనే ఆశలు ఎఫ్ఐఐలను కొనుగోళ్లకు ప్రేరేపిస్తున్నాయి. అయినప్పట్టకీ దేశీయ ఈక్విటీ మార్కెట్ వాల్యుయేషన్లు భారీ పెరిగాయనే నెపంతో ఎఫ్ఐఐలు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు’’ అని మార్నింగ్స్టాక్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవత్సవ తెలిపారు. ఇక మేలో ఎఫ్‌పీఐలు ఈక్విటీల నుండి రూ. 25,586 కోట్లను ఉపసంహరించుకున్నారు, ఏప్రిల్‌లో రూ. 8,700 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. అదే మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్లు నికర పెట్టుబడి పెట్టారు. రెండు ఐపీఓలు, 2 లిస్టింగులు రెండు కంపెనీలు ఈ వారంలో నిధుల సమీకరణకు రానున్నాయి. ఆఫీసర్స్ చాయిస్ విస్కీ తయారీ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ పబ్లిక్ ఇష్యూ మంగళవారం( 25న) ప్రారంభమై, గురువారం (జూన్ 27న) ముగియనుంది. తద్వారా రూ.1,500 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 26న ప్రారంభంకానుంది. 28న ముగియనున్న ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 171 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇదే వారంలో డీఈఈ డెవలప్మెంట్ ఇంజినీర్స్ షేర్లు మంగళవారం, ఆక్మే ఫిన్‌ట్రేడ్ షేర్లు శుక్రవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం అమెరికా మార్చి త్రైమాసిక జీడీపీ వృద్ధి గణాంకాలు గురువారం, అదే రోజు యూరోజోన్ జూలై కన్జూమర్ కాని్ఫడెన్స్ డేటా, జపాన్ మే రిటైల్ అమ్మక గణాంకాలు విడుదల కానున్నాయి. మరుసటి రోజు(శుక్రవారం) చైనా మార్చి క్వార్టర్ కరెంట్ ఖాతా లోటు, జపాన్ మే నిరుద్యోగ గణాంకాలు, బ్రిటన్ క్యూ1 జీడీపీ వృద్ధి డేటా వెల్లడి కానున్నాయి. భారత మే నెల వాణిజ్య లోటు, మౌలిక రంగ వృద్ధి, మార్చి త్రైమాసిక కరెంటు ఖాతా లోటు (సీఏడీ), విదేశీ కరెన్సీ రుణ గణాంకాలు శుక్రవారం విడుదల కానున్నాయి. -
ప్రొఫెసర్ జగదీష్ షేత్‌కు 2024 గ్లోబల్ మార్కెటింగ్ అవార్డు
గ్లోబల్ మార్కెటింగ్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ (SIG).. 'ప్రొఫెసర్ జగదీష్ షెత్' 2024 గ్లోబల్ మార్కెటింగ్ అవార్డును గెలుచుకున్నట్లు ప్రకటించింది. గ్లోబల్ మార్కెటింగ్ రంగంలో ఈయన చేసిన కృషిని గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించినట్లు వెల్లడించింది.2024లో ఈ అవార్డుకు ఎంపిక చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసారు. ఈ కమిటీకి లీడ్స్ యూనివర్శిటీ బిజినెస్ స్కూల్ కాన్స్టాంటైన్ ఎస్. కాట్సికేస్ నాయకత్వం వహించారు. కనెక్టికట్ యూనివర్సిటీ నుంచి రాబిన్ కౌల్టర్, మోల్డే యూనివర్సిటీ నుంచి కార్లోస్ సౌసా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.సుమారు 40 సంవత్సరాలుగా ప్రపంచ మార్కెటింగ్‌లో ప్రముఖ వ్యక్తిగా ఎదిగిన ప్రొఫెసర్ షెత్.. ఈ రంగానికి సంబంధించి అనేక రచనలు కూడా చేశారు. ఇందులో ఒకటి 'ది గ్లోబల్ రూల్ ఆఫ్ త్రీ'. ఈ పుస్తకాన్ని 2020లో ప్రచురించారు. ఇది అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ యొక్క జార్జ్ ఆర్. టెర్రీ అవార్డుకు నామినేట్ అయింది. ఇప్పటికే ఈయన 2020లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నారు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 384.83 పాయింట్ల నష్టంతో 77094.10 వద్ద, నిఫ్టీ 109.5 పాయింట్ల నష్టంతో 23457.94 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా నష్టాల్లో ముగిశాయి.టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఎయిర్టెల్, ఎల్టీఐ మైండ్‌ట్రీ, హిందాల్కో, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ మొదలైన కంపెనీలు చేరాయి. అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ ఎంటర్ప్రైజెస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, టాటా మోటార్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్కం పెనీలు నష్టాల్లో ముగిశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దిగ్గజ ఐపీవోలకు ఓకే.. సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు కంపెనీలూ 2023 డిసెంబర్లో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. రూ. 5,500 కోట్లకు రెడీ ఐపీవో ద్వారా ఓలా ఎలక్ట్రిక్ రూ. 5,500 కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూ నిధులలో అత్యధిక శాతాన్ని సామర్థ్య విస్తరణ, సెల్ తయారీ ప్లాంట్, ఆర్అండ్డీపై పెట్టుబడులకు వినియోగించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 5,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 9.52 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. రూ. 1,226 కోట్లు సెల్ తయారీ యూనిట్‌కు, రూ. 1,600 కోట్లు ఆర్‌అండ్‌డీకి, మరో రూ. 800 కోట్లు రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. ఇక బెయిన్ క్యాపిటల్‌కు పెట్టుబడులున్న ఎమ్క్యూర్ ఫార్మా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.ఆఫీసర్స్ చాయిస్ @ రూ. 267–281 ఆఫీసర్స్ చాయిస్ విస్కీ తయారీ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 267–281 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 24న షేర్లను కేటాయించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,000 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయాలి. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను సానుకూలంగా ప్రారంభించాయి. ఉదయం 9:20 సమయానికి ఎన్ఎస్ఈ నిఫ్టీ 35.80 పాయింట్లు (0.15 శాతం) పెరిగి 23,661 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 132.49 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో 77,729.48 వద్ద ప్రారంభమయ్యాయి.ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్ షేర్లు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. టాటా స్టీల్, హెచ్‌యూఎల్, టాటా మోటర్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ ఎంటర్‌ప్రైజస్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 172.75 పాయింట్ల లాభంతో 77510.34 పాయింట్ల వద్ద, నిఫ్టీ 51.20 పాయింట్ల లాభంతో 23567.20 పాయింట్ల లాభంతో ముగిసాయి. నేడు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ స్వల్ప లాభాలతోనే ముగిసాయి.టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా హిండాల్కో ఇండస్ట్రీస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), జేఎస్‌డబ్ల్యు స్టీల్, అదానీ పోర్ట్స్ వంటివి ఉన్నాయి. హీరోమోటోకార్ప్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), విప్రో కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 26 పాయింట్లు పెరిగి 23,539కు చేరింది. సెన్సెక్స్ 116 పాయింట్లు పుంజుకుని 77,456 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.24 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 85.16 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.23 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.25 శాతం, నాస్డాక్ 0.03 శాతం లాభాల్లోకి చేరాయి.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతోపాటు బ్యాంకులు, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీల స్థిరంగా కదలాడేందుకు దోహదం చేశాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి ఆర్థిక సంవత్సరం(2024–25) కోసం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న సమగ్ర బడ్జెట్ వృద్ధికి ప్రాధాన్యతనిస్తూనే..ప్రజారంజకంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. బుధవారం ఈక్విటీ మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.7,908 కోట్లు, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.7,107 కోట్ల విలువచేసే షేర్లును కొనుగోలు చేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 23,521 వద్దకు చేరింది. సెన్సెక్స్ 49 పాయింట్లు దిగజారి 77,337 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్‌బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.టైటాన్, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్టెల్, మారుతీ సుజుకీ, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌యూఎల్, సన్‌ఫార్మా, ఎం అండ్ ఎం, ఏషియన్ పెయింట్స్, నెస్లే, టాటా మోటార్స్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీగా బంగారం వెండి దిగుమతులు
న్యూఢిల్లీ: యూఏఈ నుంచి బంగారం, వెండి దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం లో గణనీయంగా పెరిగాయి. 210 శాతం అధికంగా 10.7 బిలియన్ డాలర్లు (88,810 కోట్లు) విలువైన బంగారం, దిగుమతులు నమోదైనట్టు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీ యేటివ్ (జీటీఆర్ఐ) సంస్థ అధ్యయనంలో తెలిసింది. 2022–23లో బంగారం, వెండి దిగుమతుల విలువ 3.5 బిలియన్ డాలర్లుగానే ఉంది. భారత్–యూఏఈ సమగ్ర ఆరి్థక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కింద యూఏఈకి భారత్ కలి్పంచిన కస్టమ్స్ డ్యూటీ రాయితీలే ఈ పెరుగుదలకు కారణమని జీటీఆర్‌ఈ ఓ నివేదికలో వెల్లడించింది. పెరిగిన దిగుమతులను నియంత్రించేందుకు కస్టమ్స్ డ్యూటీ రాయితీలను సమీక్షించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. యూఏఈ నుంచి వెండి దిగుమతులపై 7 శాతం టారిఫ్ రాయితీని భారత్ కల్పిస్తోంది. దిగుమతుల పరిమాణంపై ఎలాంటి పరిమితి విధించలేదు. అదే బంగారం అయితే ఒక ఆరి్థక సంవత్సరంలో 160 మెట్రిక్ టన్నుల వరకు ఒక శాతం డ్యూటీ రాయితీ కింద అనుమతించింది. 2022 మే నుంచి రెండు దేశాల మధ్య సీఈపీఏ అమల్లోకి వచ్చింది. దీనికితోడు గిఫ్ట్ సిటీలోని ‘ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్సే్ఛంజ్’(ఐఐబీఎక్స్) ద్వారా యూఏఈ నుంచి ప్రైవేటు సంస్థలు బంగారం, వెండి దిగుమతులకు ప్రభుత్వం అనుమతించింది. బంగారం, వెండి మినహా యూఏఈ నుంచి ఇతర ఉత్పత్తుల దిగుమతులు గత ఆరి్థక సంవత్సరంలో క్షీణించాయి. 2022–23లో 48 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు యూఏఈ నుంచి భారత్‌కు రాగా, 2023–24లో 9.8 శాతం తక్కువగా 48 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.ఇదే ధోరణి ఉండకపోవచ్చు.. యూఈఏ నుంచి బంగారం, వెండి దిగుమతులు ఇక ముందూ ఇదే స్థాయిలో కొనసాగకపోవచ్చని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఎందుకంటే యూఏఈలో బంగారం లేదా వెండి తవ్వకాలు (మైనింగ్) లేవని, కనుక ఆ దేశానికి ఈ ఉత్పత్తుల ఎగుమతులతో ఒనగూడే అదనపు విలువ ఏమంత ఉండదన్నారు. ‘‘ప్రస్తుతం భారత్‌లో బంగారం, వెండి, ఆభరణాల దిగుమతులపై 15 శాతం సుంకం అమలవుతోంది. ఇదే అసలు మూలంలోని సమస్య. టారిఫ్‌లను 5 శాతానికి తగ్గించినట్టయితే అక్రమ రవాణా, దురి్వనియోగానికి అడ్డుకట్ట పడుతుంది’’అని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. యూఏఈ నుంచి దిగుమతులపై తక్కువ టారిఫ్ నేపథ్యంలో ఆర్బిట్రేజ్ ట్రేడింగ్‌ను నియంత్రించేందుకు రాయితీతో కూడి కస్టమ్స్ సుంకాలను సమీక్షించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. బంగారం మాదిరే వెండి దిగుమతులపై వార్షిక పరిమితిని అయినా విధించాలని సూచించారు. దీనివల్ల ఆదాయ నష్టాన్ని తగ్గించుకోవచ్చన్నారు. గిఫ్ట్ సిటీ ద్వారా బంగారం, వెండి దిగుమతుల విషయంలో నిబంధనలను కఠినతరం చేయాలని సూచించారు. -
ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 23,564కు చేరింది. సెన్సెక్స్ 111 పాయింట్లు పుంజుకుని 77,401 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.3 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 85.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.21 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.25 శాతం, నాస్డాక్ 0.03 శాతం లాభాల్లోకి చేరాయి.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతోపాటు బ్యాంకులు, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ నాలుగో రోజూ కొనసాగుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి ఆర్థిక సంవత్సరం(2024–25) కోసం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న సమగ్ర బడ్జెట్ వృద్ధికి ప్రాధాన్యతనిస్తూనే..ప్రజారంజకంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)