Market
-
మార్కెట్ ట్రెండ్ గమనిస్తున్నారా? ఇప్పుడేం చేయాలంటే..
స్టాక్ మార్కెట్ సూచీలు ఆల్‌టైమ్‌హై చేరుకున్నాయి. రానున్న రోజుల్లో కీలక వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉందనే ఊహాగానాలు, వచ్చేనెలలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పన్నుదారులకు మరింత ఉపశమనం కల్పిస్తారనే వార్తలతో మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను చేరుకుంటున్నాయి. ఇలా పెరుగుతున్న షేర్ల విలువల మధ్య పెట్టుబడులు కొనసాగించాలా? వద్దా? అనే సందేహం చాలామంది ఇన్వెస్టర్లకు వస్తోంది. మార్కెట్లు ఇంతలా పెరిగాక అనుకోకుండా నష్టాలకు వెళ్లిపోతే ఆందోళన సహజం. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దాదాపు మార్కెట్లు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. దాంతో సూచీలు జీవితకాల గరిష్ఠాలను చేరాయి. అయితే ఇంతలా పెరిగిన ష్లేర్ల విలువ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దాంతో పెట్టుబడులను ఉపసంహరించుకోవానుకుంటారు. కానీ మన లక్ష్యాలు ఏమిటో ఒకసారి తెలుసుకోవాలి. కొన్ని స్వల్పకాలిక లక్ష్యాలుంటాయి. మరికొన్ని పదేళ్ల తర్వాత సాధించేవి ఉంటాయి. వివిధ అవసరాలు, పెట్టుబడి కాలాలు, లక్ష్యాలు తదితరాల ఆధారంగా మన ప్రణాళిక రూపొందించుకోవాలి. స్టాక్ మార్కెట్ పనితీరును కచ్చితంగా అంచనా వేయలేమనే సంగతినీ మర్చిపోవద్దు. నిన్నటి పనితీరు నేడు, నేటి పనితీరు రేపు ఉంటుందన్న హామీ ఇక్కడేమీ ఉండదు. మార్కెట్ గమనం ఎటువైపు సాగుతుందన్న ఆలోచన ఎప్పుడూ సరికాదు. మంచి పెట్టుబడులను ఎంచుకొని, దీర్ఘకాలం కొనసాగిస్తే మార్కెట్ ఎప్పుడూ మంచి ఫలితాలనే అందిస్తుందని గుర్తుంచుకోవాలి.ఎంపికే కీలకంగతకొన్ని రోజులుగా మార్కెట్లోని లాభాలను చూస్తున్న చాలామంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లతోపాటు, నేరుగా షేర్లలోనే మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు, ఫండ్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. తమ మొత్తం పెట్టుబడులను వీటికే కేటాయిస్తున్నారు. మార్కెట్ పనితీరు బాగున్నప్పుడు వీటితో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ, ఒక్కసారి దిద్దుబాటు వస్తే నష్టాలు అధికంగా చూడాల్సి వస్తుంది. కాబట్టి, పోర్ట్‌ఫోలియోను ఎంపిక చేసుకునేటప్పుడు, లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు, ఫండ్లు ఉండేలా చూసుకోవాలి.లక్ష్యాల ఆధారంగా..స్టాక్ మార్కెట్ పెరుగుతోంది కదా అని ఉన్న పెట్టుబడి మొత్తం అంతా షేర్లలోనే మదుపు చేయడమూ సరికాదు. లక్ష్యం, పెట్టుబడి వ్యవధి ఆధారంగా పథకాలను ఎంచుకోవాలి. అప్పుడే నష్టభయమూ పరిమితంగా ఉంటుంది. మంచి రాబడిని ఆర్జించేందుకూ వీలవుతుంది. పెట్టుబడి పథకాలను వృద్ధి, నాణ్యత, విలువ ఆధారంగా చూడాలి. మార్కెట్లో అందుబాటులో ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మనకు ఏది సరిపోతుంది అనేది తెలుసుకుంటే చాలు.సమీక్ష ముఖ్యం..సూచీల్లో వృద్ధి కారణంగా ఈక్విటీ పెట్టుబడుల మొత్తం పెరిగిపోవచ్చు. వాటిని ఒకసారి సమీక్షించుకోవాలి. ఇందులో కొంత భాగాన్ని వెనక్కి తీసుకొని, సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లించవచ్చు. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ పథకాల్లో ఉన్న పెట్టుబడులనూ ఒకసారి పరిశీలించండి. స్మాల్, మిడ్ క్యాప్‌లలో అధికంగా ఉంటే.. వాటిని కొంత మేరకు విక్రయించి, లార్జ్ క్యాప్‌లోకి మార్చుకోవచ్చు.మార్కెట్‌ను నిరంతరం ఎన్నో వార్తలు ప్రభావితం చేస్తుంటాయి. కొన్నింటికి సానుకూలంగానూ, మరికొన్నింటికి ప్రతికూలంగానూ మార్కెట్ స్పందిస్తుంది. పెట్టుబడిదారులు ఎప్పుడూ మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాలి. -
రికార్డుల ర్యాలీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు బ్యాంకులు, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ మూడో రోజూ కొనసాగింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడి ఇంట్రాడే, ముగింపులో సరికొత్త రికార్డులు లిఖించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి ఆర్థిక సంవత్సరం(2024–25) కోసం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న సమగ్ర బడ్జెట్ వృద్ధికి ప్రాధాన్యతనిస్తూనే., ప్రజారంజకంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. సెన్సెక్స్ ఉదయం 242 పాయింట్ల లాభంతో 77,235 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 374 పాయింట్లు పెరిగి 77,366 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరికి 308 పాయింట్ల లాభంతో 77,301 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 113 పాయింట్లు బలపడి 23,579 వద్ద రికార్డు గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 92 పాయింట్లు 23,558 వద్ద ముగిసింది. బ్యాంకులు, ఐటీతో పాటు రియలీ్ట, కన్జూమర్, యుటిలిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 1శాతం, అరశాతం చొప్పున రాణించాయి. ఆటో, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా మార్కెట్లు జీవితకాల గరిష్టానికి చేరుకోవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్ల సంపద రయ్...సెన్సెక్స్ నాలుగోరోజూ రాణించడంతో బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ జీవితకాల గరిష్టానికి చేరింది. మంగళవారం ఒక్కరోజే రూ.2.42 లక్షల కోట్లు పెరగడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 437.24 లక్షల కోట్లకు చేరింది. ఈ మొత్తం 4 రోజుల్లో రూ.10.29 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది.⇒ అమెరికా ఫ్యాషన్ దుస్తుల సంస్థ హానెస్ బ్రాండ్స్‌తో వ్యాపార కాంట్రాక్టు కొనసాగింపుతో పాటు జీబీఎస్టీతో కొత్త వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో విప్రో షేరు 3% పెరిగి రూ.492 వద్ద ముగిసింది. ⇒ రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి 156 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల కొనుగోళ్ల ఆర్డర్ దక్కించుకోవడంతో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) షేరు 6 శాతం పెరిగి రూ. 5,533 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 7% ఎగసి రూ. 5,565 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. -
మనోళ్లు ‘మ్యాగీ’ లాగించేస్తున్నారు!
న్యూఢిల్లీ: మ్యాగీ.. బహుశా భారత్‌లో ఈ పేరు తెలియనివారు ఉండరేమో. నూడుల్స్‌కు మారుపేరుగా స్థానం సంపాదించిందంటే ఎంతలా మార్కెట్లోకి చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. నూడుల్స్, సూప్స్ ఉత్పత్తులను ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే మ్యాగీ బ్రాండ్ కింద విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా మ్యాగీ ఉత్పత్తుల అమ్మకాల్లో భారత్ తొలి స్థానంలో నిలవడం విశేషం. 2023–24లో ఏకంగా 600 కోట్లకుపైగా సర్వింగ్స్ (ఒకరు తినగలిగే పరిమాణాన్ని ఒక సర్వింగ్‌గా పరిగణిస్తారు) స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయని కంపెనీ వెల్లడించింది.అంతేకాదు నెస్లే కిట్‌క్యాట్ బ్రాండ్‌కు టాప్–2 మార్కెట్‌గా భారత్ స్థానం సంపాదించింది. గత ఆర్థిక సంవత్సరంలో 420 కోట్ల కిట్‌క్యాట్ ఫింగర్స్ అమ్ముడయ్యాయి. ఈ విషయాలను నెస్లే ఇండియా తన 2023–24 వార్షిక నివేదికలో వెల్లడించింది. రెండంకెల వృద్ధితో నెస్లే ఇండియా వేగంగా దూసుకెళ్తున్న మార్కెట్లలో ఒకటిగా నిలిచిందని సంస్థ తెలిపింది. భారత్‌లో 10వ ప్లాంటును నెస్లే ఒడిశాలో ఏర్పాటు చేస్తోంది. ప్లాంట్ల విస్తరణ, సామర్థ్యం పెంపునకు 2020–25 మధ్య రూ.7,500 కోట్లు వెచి్చస్తున్నట్టు నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ వెల్లడించారు. గడిచిన ఎనిమిదేళ్లలో కంపెనీ భారత్‌లో 140కిపైగా ఉత్పత్తులను పరిచయం చేసింది. -
లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 23,560 వద్దకు చేరింది. సెన్సెక్స్ 308 పాయింట్లు ఎగబాకి 77,301 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో పవర్‌గ్రిడ్, విప్రో, టైటాన్, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌యూఎల్, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.మారుతీ సుజుకీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఐటీసీ, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్ళీ తగ్గిన బంగారం, వెండి: ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
భారతదేశంలో జూన్ ప్రారంభం నుంచి పసిడి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. రెండు రోజులకు ముందు తగ్గిన గోల్డ్ రేటు.. మళ్ళీ మెల్లగా తగ్గుముఖం పట్టాయి. దీంతో బంగారం ధర ఈ రోజు (జూన్ 18) స్వల్పంగా తగ్గింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో బంగారం ధరలు కొంత మేర తగ్గాయి. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66200 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.72220 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గినట్లు తెలుస్తోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి నేడు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66350 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72470 వద్ద ఉంది. నిన్న రూ. 200 నుంచి రూ. 220 వరకు తగ్గినా బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ రూ. 100 నుంచి రూ. 110 తగ్గింది.తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, ఢిల్లీలలో గరిష్టంగా రూ. 110 తగ్గిన గోల్డ్ రేటు చెన్నైలో మాత్రం గరిష్టంగా రూ. 60 మాత్రమే తగ్గింది. కాబట్టి చెన్నైలో పసిడి ధరలు వరుసగా రూ. 66950 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 73040 (24 క్యారెట్స్ 10 గ్రా) వద్ద నిలిచాయి. నిన్న రూ. 150 నుంచి రూ. 170 వరకు పెరిగిన గోల్డ్ రేటు ఈ రోజు మళ్ళీ రూ. 50 నుంచి రూ. 60 మాత్రమే తగ్గింది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ రోజు (జూన్ 18) ఒక కేజీ వెండి ధర రూ. 96000 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు రూ. 400 వరకు తగ్గింది. ఇది బంగారం, వెండి కొనేవారికి శుభవార్త అనే చెప్పాలి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
లాభాలతో దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@23,500
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 51 పాయింట్లు లాభపడి 23,513కు చేరింది. సెన్సెక్స్ 138 పాయింట్లు ఎగబాకి 77,131 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.55 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.6 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.22 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.77 శాతం, నాస్డాక్ 0.95 శాతం లాభాల్లోకి చేరాయి.ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారం మార్కెట్లో స్థిరీకరణ (కన్సాలిడేషన్) అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు, రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వచ్చేవారం రోజుల్లో 3 కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. ఇందులో డీ డెవలప్మెంట్ ఇంజినీర్స్, ఆమ్కే ఫిన్ ట్రేడ్ పబ్లిక్ ఇష్యూలు జూన్ 19న, స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ ఐపీఓ జూన్ 21న ప్రారంభం కానున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..?
ఈక్విటీమార్కెట్లు ఇటీవల కాలంలో తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. దాంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో సోమవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,300 (22 క్యారెట్స్), రూ.72,330 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఆదివారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.220, రూ.220 తగ్గింది.చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.150, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.170 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.66,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.72,980 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.66,450.. 24 క్యారెట్ల ధర రూ.72,480కు చేరాయి. మార్కెట్లో కేజీ వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.95,600 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫండ్స్‌లో కొత్త ఇన్వెస్టర్ల జోరు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ రంగంలో కొత్త ఇన్వెస్టర్ల జోరు కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి రెండు నెలల్లోనే (ఏప్రిల్, మే) మ్యూచువల్ ఫండ్స్‌లో 81 లక్షల కొత్త ఖాతాలు (ఫోలియోలు) నమోదయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) డేటాను పరిశీలించగా.. మే చివరికి నాటికి ఫోలియోలు 18.6 కోట్లకు చేరాయి. ఈ ఏడాది మార్చి చివరికి ఉన్న 17.78 కోట్ల ఫోలియోలతో పోలిస్తే 4.6 శాతం పెరిగాయి. ఏప్రిల్‌లో 36.11 లక్షల ఫోలియోలు ప్రారంభం కాగా, మే నెలలో 45 లక్షలుగా ఉన్నాయి. 2023లో నెలవారీ సగటు నూతన ఖాతాల ప్రారంభం 22.3 లక్షలుగా ఉంది. దీంతో పోల్చి చూసినప్పుడు ఏప్రిల్, మే నెలల్లో రెట్టింపు స్థాయిలో కొత్త ఖాతాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఒక ఇన్వెస్టర్‌కు ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడిని సూచించేదే ఫోలియో. ఇలా ఒక ఇన్వెస్టర్ పలు రకాల పథకాల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒకటికి మించిన ఫోలియోలు కలిగి ఉండడం సహజం. పెరుగుతున్న అవగాహన... ఇన్వెస్టర్లలో అవగాహన పెంచేందుకు మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ అనుసరిస్తున్న పలు ప్రచార కార్యక్రమాలకు తోడు, ఈక్విటీల బలమైన ప్రదర్శన ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చి చూసినప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లలో రాబడులు అంత ఆకర్షణీయంగా లేకపోవడం కూడా ఇన్వెస్టర్ల ధోరణిలో మార్పునకు కారణంగా పేర్కొంటున్నారు. అలాగే పెరుగుతున్న ఆదాయం, డిజిటల్ సాధనాల ద్వారా ఆరి్థక సాధనాల్లో పెట్టుబడులకు ఉన్న సౌలభ్యం వృద్ధికి అనుకూలిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. కొత్తగా వస్తున్న ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది డిజిటల్ ఛానళ్లను ఎంపిక చేసుకుంటున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఏప్రిల్, మే నెలలో వచి్చన 81 లక్షల కొత్త ఫోలియోలలో 61.25 లక్షలు ఈక్విటీలకు సంబంధించినవి కావడం గమనార్హం. దీంతో పరిశ్రమ వ్యాప్తంగా మొత్తం ఈక్విటీ ఫోలియోలు 12.89 కోట్లకు పెరిగాయి. మొత్తం ఫోలియోలలో ఈక్విటీల వాటా 69 శాతంగా ఉంది. ఈ ఆరి్థక సంవత్సరం మొదటి రెండు నెలల్లో థీమ్యాటిక్/సెక్టోరల్ విభాగంలోనే 23.19 లక్షల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత స్మాల్‌క్యాప్ (8.04 లక్షలు), మిడ్‌క్యాప్ ఫండ్ (7.74 లక్షలు) విభాగాల్లో కొత్త ఖాతాల ప్రారంభం ఎక్కువగా ఉంది. -
ప్రపంచ పరిణామాలు కీలకం
ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారం మార్కెట్లో స్థిరీకరణ (కన్సాలిడేషన్) అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు స్థూల ఆరి్థక గణాంకాలు, రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వచ్చే వారం రోజుల్లో 3 కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. ఇందులో డీ డెవలప్మెంట్ ఇంజనీర్స్, ఆమ్కే ఫిన్ ట్రేడ్ పబ్లిక్ ఇష్యూలు జూలై 19న, స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ ఐపీఓ జూలై 20న ప్రారంభం కానున్నాయి. బక్రీద్ సందర్భంగా నేడు (సోమవారం) ఎక్సే్చంజీలకు సెలవు. ‘‘వివిధ మంత్రిత్వ శాఖలు ప్రకటిస్తున్న ‘అధికారం చేపట్టిన తొలి 100 రోజుల ప్రణాళిక’లను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటుచేసుకుంటే సాంకేతికంగా నిఫ్టీకి 22,800–23,100 శ్రేణిలో కీలక మద్దతు లభించే వీలుంది. కొనుగోళ్లు జరిగి 23,600 స్థాయిని చేధించగలిగే 24,000 మైలురాయిని అందుకోవచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. కేంద్రంలోని కొత్త ప్రభుత్వం మూలధన వ్యయాలకు ప్రాధాన్యత కొనసాగిస్తుందనే ఆశలతో గతవారం అభివృద్ధి ఆధారిత రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 77,145 వద్ద సరికొత్త రికార్డు నెలకొల్పంది. నిఫ్టీ 175 పాయింట్లు బలపడి 23,490 వద్ద జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. కాగా ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రపంచ పరిణామాలు బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, నార్వేల కేంద్ర బ్యాంకులు ఈ వారంలో ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు వెల్లడించనున్నాయి. దాదాపు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల కోతకే మొగ్గు చూపొచ్చనేది ఆరి్థకవేత్తల అంచనా. యూరోజోన్ మే ద్రవ్యోల్బణం డేటా మంగళవారం, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య సమావేశ నిర్ణయాల వివరాలు (మినిట్స్) బుధవారం, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్రవ్య పరపతి సమావేశం గురువారం, అమెరికా జూన్ ప్రథమార్థపు సేవా, తయారీ రంగ గణాంకాలు శుక్రవారం వెల్లడి కానున్నాయి.గతవారంలో రూ.11,730 కోట్ల పెట్టుబడులు ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు ఆచూతూచి వ్యవహరించిన విదేశీ ఇన్వెస్టర్లు తరువాత దేశీయ మార్కెట్లోకి బలమైన పునరాగమనం చేశారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం, రానున్న బడ్జెట్లో ప్రోత్సాహకాలు, రాయితీలు లభిస్తాయనే ఆశలతో భారత మార్కెట్లో క్రమంగా పెట్టుబడులు పెంచుకుంటున్నారు. గత వారం (జులై 14తో ముగిసిన వారం)లో విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ ఈక్విటీల్లో రూ.11,730 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇదే సమయంలో నికర అమ్మకాలు (జూన్ 1– 14 వరకు) రూ.3,064 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు ఈ నెలలో (జూన్ 14 వరకు) ఎఫ్‌పీఐలు డెట్ మార్కెట్ లో రూ.5,700 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ‘‘దేశంలో సంకీర్ణ కూటమి ఉన్నప్పటికీ, వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం విధాన సంస్కరణలు, ఆరి్థక వృద్ధి కొనసాగింపుపై అంచనాలను పెంచింది’’ అని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ మేనేజర్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. ఇక మేలో ఎఫ్‌పీఐలు ఈక్విటీల నుండి రూ. 25,586 కోట్లను ఉపసంహరించుకున్నారు, ఏప్రిల్‌లో రూ. 8,700 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. అదే మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్లు నికర పెట్టుబడి పెట్టారు. -
రేపు స్టాక్ మార్కెట్ పనిచేస్తుందా?
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం పనిచేయవు. రోజంతా ఎటువంటి ట్రేడింగ్ సెషన్లు జరగవు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) జూన్ 17 సోమవారం బక్రీద్ సందర్భంగా మూతపడనున్నాయి.ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ (సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ ఎరాక్టివ్) సెగ్మెంట్లపై ఈ మూసివేత ప్రభావం చూపుతుందని బీఎస్ఈ వెబ్సైట్ పేర్కొంది. తిరిగి జూన్ 18న ట్రేడింగ్ పునఃప్రారంభం కానుంది.ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎంసీఎక్స్) జూన్ 17న ఉదయం సెషన్‌ను మూసివేయనుంది. అయితే సాయంత్రం సెషన్లో మాత్రం సాయంత్రం 5 గంటల నుంచి 11:30/11:55 గంటల వరకు ట్రేడింగ్ కోసం తిరిగి తెరవనున్నారు. -
బంగారం, వెండి ధరలు: ఈ రోజు ఎలా ఉన్నాయో తెలుసా?
జూన్ ప్రారంభం నుంచి పెరుగుతూ.. తగ్గుతూ ఉన్న పసిడి ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. నిన్న రూ. 660 తగ్గిన బంగారం ధరలు నేడు (జూన్ 16) ఉలుకు పలుకు లేకుండా ఉన్నట్లు ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66500 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.72550 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలలో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. కాబట్టి నేడు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66650 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72700 వద్ద ఉంది. నేడు 22 క్యారెట్స్ బంగారం, 24 క్యారెట్స్ గోల్డ్ ధరల్లో ఎటువంటి పెరుగుదల లేదు.చెన్నై విషయానికి వస్తే.. బంగారం ధరలు వరుసగా రూ. 67050 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 73150 (24 క్యారెట్స్ 10 గ్రా) వద్ద నిలిచాయి. పసిడి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలకంటే చెన్నైలో బంగారం ధరలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. దీంతో ఈ రోజు (జూన్ 16) ఒక కేజీ వెండి ధర రూ. 91000 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలలో ఎటువంటి మార్పు లేదు. ఇది బంగారం, వెండి కొనేవారికి శుభవార్త అనే చెప్పాలి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
పడిలేసిన బంగారం.. అదే బాటలో వెండి: కొత్త ధరలు చూశారా?
జూన్ ప్రారంభం నుంచి పెరుగుతూ.. తగ్గుతూ ఉన్న పసిడి ధరలు ఈ రోజు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. నిన్న రూ. 270 తగ్గిన బంగారం ధరలు నేడు (జూన్ 15) గరిష్టంగా రూ.660 పెరిగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66500 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.72550 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 600, రూ. 660 పెరిగింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. కాబట్టి నేడు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66650 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72700 వద్ద ఉంది. నేడు 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 600 పెరిగింది. 24 క్యారెట్స్ ధరలు రూ. 660 పెరిగింది.చెన్నై విషయానికి వస్తే.. బంగారం ధరలు వరుసగా రూ. 550, రూ. 600 పెరిగి.. రూ. 67050 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 73150 (24 క్యారెట్స్ 10 గ్రా) వద్ద నిలిచాయి. ఇతర రాష్ట్రాలకంటే చెన్నైలో బంగారం ధరలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా పెరిగాయి. దీంతో ఈ రోజు (జూన్ 15) ఒక కేజీ వెండి ధర రూ. 91000 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు కేవలం రూ. 500 పెరిగినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నట్లు అవగతం అవుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
మేలో ఈక్విటీ ఫండ్స్ హవా..!
న్యూఢిల్లీ: గత నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)కు ఇన్వెస్టర్లు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ మే నెలలో రూ. 34,697 కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 83 శాతం అధికంకాగా.. అప్పుడప్పుడూ మార్కెట్లో నమోదైన దిద్దుబాట్లు ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టేందుకు అవకాశాలను కలి్పంచాయి. ఇన్వెస్టర్లు ప్రధానంగా థిమాటిక్ ఫండ్స్‌పట్ల ఆకర్షితులైనట్లు దేశీ ఎంఎఫ్ అసోసియేషన్(యాంఫీ) పేర్కొంది. ఈ బాటలో క్రమబద్ధ పెట్టుబడి పథకాల(సిప్)కు సైతం రూ. 20,904 కోట్ల పెట్టుబడులు లభించినట్లు వెల్లడించింది. ఇది కూడా సరికొత్త రికార్డ్‌కావడం గమనార్హం! హెచ్చుతగ్గుల్లోనూ ఇటీవల మార్కెట్లలో ఆటుపోట్లు కొనసాగినప్పటికీ ఇన్వెస్టర్లు ఈక్విటీలపట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లు భారీ పెట్టుబడులు తెలియజేస్తున్నాయి. వెరసి ఈక్విటీ ఫండ్స్‌లోకి వరుసగా 39వ నెలలోనూ నికరంగా పెట్టుబడులు ప్రవేశించాయి. ఏప్రిల్‌లో సిప్ పెట్టుబడులు రూ. 20,371 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో వరుసగా రెండో నెలలోనూ సిప్‌లో రూ. 20,000 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు సిప్‌లో ఇన్వెస్ట్ చేసే సంగతి తెలిసిందే. ఇక మొత్తంగా ఎంఎఫ్ పరిశ్రమకు మే నెలలో రూ. 1.1 లక్ష కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. ఏప్రిల్‌లో ఇవి రూ. 2.4 లక్షల కోట్లుకావడం గమనార్హం! ఫలితంగా ఎంఎఫ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) ఏప్రిల్‌లో నమోదైన రూ. 57.26 లక్షల కోట్ల నుంచి మే చివరికల్లా రూ. 58.91 లక్షల కోట్లకు బలపడింది. స్మాల్ క్యాప్స్ జోరు చిన్న షేర్ల(స్మాల్ క్యాప్స్) విభాగం మే నెలలో 23 శాతం వృద్ధితో రూ. 2,724 కోట్ల పెట్టుబడులను అందుకుంది. అయితే లార్జ్‌క్యాప్ ఫండ్స్‌కు రూ. 663 కోట్లు మాత్రమే లభించాయి. అంటే ప్రత్యేకించిన, అధిక రిటర్నులు అందించే అవకాశాలకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీర్ఘకాలంగా మార్కెట్లలో అప్‌ట్రెండ్ కొనసాగుతుండటంతో మధ్యమధ్యలో వస్తున్న దిద్దుబాట్లను ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు అవకాశాలుగా వినియోగించుకుంటున్నట్లు మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. కొటక్ మహీంద్రా ఏఎంసీ సేల్స్ నేషనల్ హెడ్ మనీష్ మెహతా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదన్న అంచనాలు సైతం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టనుందన్న అంచనాలు మార్కెట్లలో మరింత ర్యాలీకి కారణమవుతుందన్న ఆలోచన కొనుగోళ్లకు దారి చూపుతున్నట్లు వివరించారు. దేశ ఆర్థిక వృద్ధిపట్ల విశ్వాసంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు క్యూ కడుతున్నట్లు ఫైయర్స్ వైస్‌ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి పేర్కొన్నారు. ఇక ఈక్విటీలుకాకుండా రుణ పథకాల విభాగంలోనూ రూ. 42,495 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడులపై ఆసక్తి చూపడం ప్రభావం చూపింది. అయితే ఏప్రిల్‌లో నమోదైన రూ. 1.9 లక్షల కోట్లతో పోలిస్తే పెట్టుబడులు 78 శాతం క్షీణించాయి. రుణ పథకాలలో లిక్విడ్ ఫండ్స్ అత్యధికంగా రూ. 25,873 కోట్లు ఆకట్టుకుని రికార్డ్ నెలకొల్పాయి. ఈఎల్ఎస్ఎస్ మినహా ఈక్విటీ ఆధారిత ఎంఎఫ్‌లలో నికర పెట్టుబడులు రూ. 25 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించి రూ. 25.39 లక్షల కోట్లకు చేరాయి. ఇది చరిత్రాత్మక గరిష్టమని యాంఫీ సీఈవో వెంకట్ చలసాని తెలియజేశారు. ఫోకస్డ్, ఈక్విటీ లింక్డ్ పొదుపు పథకాలు(ఈఎల్ఎస్ఎస్) విభాగాలను మినహాయించి చూస్తే ఇతర విభాగాలకు నికరంగా పెట్టుబడులు తరలి వచి్చనట్లు పేర్కొన్నారు. సెక్టార్, థిమాటిక్ ఫండ్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. దీంతో మే నెలలో రూ. 19,213 కోట్లు లభించాయి. ప్రధానంగా హెచ్డీఎఫ్సీ మ్యాన్యుఫాక్చరింగ్ ఫండ్ నుంచి వెలువడిన కొత్త ఆఫరింగ్(ఎన్ఎఫ్వో) రూ. 9,563 కోట్లు అందుకోవడం ఇందుకు సహకరించింది. -
లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 23,453 వద్దకు చేరింది. సెన్సెక్స్ 181 పాయింట్లు ఎగబాకి 76,992 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో ఎం అండ్ ఎం, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, టాటా స్టీల్, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, కోటక్ మహీంద్రాబ్యాంక్, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
'బంగారం'లాంటి అవకాశం.. గోల్డ్ ఇప్పుడైనా కొనొచ్చు!
జూన్ ప్రారంభం నుంచి పెరుగుతూ.. తగ్గుతూ ఉన్న పసిడి ధరలు ఈ రోజు కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు (జూన్ 14) దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.శుక్రవారం విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.65900 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.71890 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 250, రూ. 270 తగ్గింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66050 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72040 వద్ద ఉంది. నేడు 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 200 తగ్గింది. 24 క్యారెట్స్ ధరలు రూ. 270 తగ్గింది.చెన్నై విషయానికి వస్తే.. బంగారం ధరలు వరుసగా రూ. 100, రూ. 110తగ్గి.. రూ. 66500 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 72550 (24 క్యారెట్స్ 10 గ్రా) వద్ద నిలిచాయి. ధరలు తగ్గినప్పటికీ.. ఇతర రాష్ట్రాలకంటే చెన్నైలో బంగారం ధరలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ రోజు (జూన్ 14) ఒక కేజీ వెండి ధర రూ. 90500 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు కేవలం రూ. 200 తగ్గినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే క్రమంగా పెరుగుతూ వెళ్లిన వెండి ధరలు కూడా ఒక్కసారిగా కిందకు పడుతున్నట్లు అవగతం అవుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 23,351కు చేరింది. సెన్సెక్స్ 197 పాయింట్లు దిగజారి 76,609 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.26 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 81.99 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.24 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.23 శాతం, నాస్డాక్ 0.34 శాతం లాభాల్లోకి చేరాయి.ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్(విలువ) మరోసారి కొత్త రికార్డును సృష్టించింది. గత రెండు రోజుల్లో రూ.4.72 లక్షల కోట్లు జమకావడంతో రూ.431.67 లక్షల కోట్లను(5.17 ట్రిలియన్ డాలర్లు) అధిగమించింది. గురువారం ఇంట్రాడేసహా ముగింపులోనూ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 77,145 పాయింట్లను అధిగమించగా.. నిఫ్టీ 23,481కు చేరింది. రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) తగ్గడంతో ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు మార్కెట్లు పెరిగేలా చేశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సీపీఐ పుష్.. మార్కెట్ రికార్డ్స్
ముంబై: గత నెలలో సీపీఐ ఆర్బీఐ లక్ష్యం 6 శాతానికంటే తక్కువగా 4.75 శాతానికి దిగిరావడంతో వడ్డీ రేట్లు తగ్గవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. దీంతో ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా రోజంతా మార్కెట్లు లాభాల మధ్యే కదిలాయి. వెరసి సెన్సెక్స్ 204 పాయింట్లు ఎగసి 76,811 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 539 పాయింట్లు జంప్‌చేసింది. ఇక నిఫ్టీ 76 పాయింట్లు పుంజుకుని 23,399 వద్ద స్థిరపడింది. తొలుత 158 పాయింట్లు ఎగసి 23,481ను తాకింది. ఇవి సరికొత్త రికార్డులుకావడం విశేషం! కాగా.. తాజా సమీక్షలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల యథాతథ కొనసాగింపునకే కట్టుబడింది. ద్రవ్యోల్బ ణం తక్కువగానే నమోదవుతున్నప్పటికీ ఈ ఏడాది వడ్డీ రేట్లలో ఒకసారి మాత్రమే కోత విధించవచ్చని పేర్కొనడం గమనార్హం! రియల్టీ అప్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా రియలీ్ట, క న్జూమర్ డ్యురబుల్స్, ఐటీ 2.2–1% మధ్య బలపడగా.. మీడియా, ఎఫ్ఎంసీజీ 1% స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో శ్రీరామ్ ఫైనాన్స్ 5% జంప్‌చేయగా.. ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్, టైటన్, ఎల్టీఐఎం, ఇండస్ఇండ్, టెక్ఎం, టీసీఎస్, విప్రో, అ్రల్టాటెక్ 3–1 మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్‌యూఎల్, యాక్సిస్, పవర్‌గ్రిడ్, బ్రిటానియా, టాటా కన్జూమర్, ఎయిర్టెల్, ఐసీఐసీఐ 1.6–1% మధ్య క్షీణించాయి. మార్కెట్ క్యాప్ @ 431.67 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్(విలువ) మరోసారి కొత్త రికార్డును లిఖించింది. గత రెండు రోజుల్లో రూ. 4.72 లక్షల కోట్లు జమకావడంతో రూ. 431.67 లక్షల కోట్లను(5.17 ట్రిలియన్ డాలర్లు) అధిగమించింది. వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధించాయి. ఇంట్రాడేసహా ముగింపులోనూ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 77,145 పాయింట్లను అధిగమించగా.. నిఫ్టీ 23,481కు చేరింది. రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) తగ్గడంతో ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. -
లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 77 పాయింట్లు పెరిగి 23,399 వద్దకు చేరింది. సెన్సెక్స్ 204 పాయింట్లు పెరిగి 76,810 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్‌ఫార్మా, ఎస్బీఐ, టాటా స్టీల్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, భారతీఎయిరటెల్, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం బాటలోనే వెండి.. ధరలు ఎలా ఉన్నాయంటే?
ఇటీవల ఒక్కసారిగా భారీగా తగ్గిన బంగారం ధరలు నెమ్మదిగా పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. అయితే నేడు (జూన్ 13) పసిడి ధరలు తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీ, చైన్నైలలో తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66150 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.72160 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66250 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72310 వద్ద ఉంది. నేడు 22 క్యారెట్స్ బంగారం ధర మాత్రం రూ. 50 తగ్గింది. 24 క్యారెట్స్ ధరలు మాత్రమే నిన్న మాదిరిగానే ఉన్నాయి.చెన్నై విషయానికి వస్తే.. బంగారం ధరలు వరుసగా రూ. 200, రూ. 210తగ్గి.. రూ. 66600 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 72660 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద నిలిచాయి. ధరలు తగ్గినప్పటికీ.. ఇతర రాష్ట్రాలకంటే చెన్నైలో బంగారం ధరలు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ రోజు (జూన్ 13) ఒక కేజీ వెండి ధర రూ. 90700 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు ఏకంగా రూ. 600 తగ్గింది. దీన్ని బట్టి చూస్తే క్రమంగా పెరుగుతూ వెళ్లిన వెండి ధరలు కూడా ఒక్కసారిగా కిందకు పడుతున్నట్లు స్పష్టమవుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు..23,400 మార్కు చేరిన నిఫ్టీ
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 117 పాయింట్లు లాభపడి 23,435కు చేరింది. సెన్సెక్స్ 370 పాయింట్లు ఎగబాకి 76,984 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.3 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.85 శాతం, నాస్డాక్ 1.53 శాతం లాభాల్లోకి చేరాయి.డిపాజిట్ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, మధ్య కాలికంగా తగ్గే అవకాశం ఉందని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా విశ్లేషించారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తే..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం నుంచి ఆర్బీఐ కూడా తన వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్నారు.స్విట్జర్లాండ్, స్వీడన్, కెనడా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్ బ్యాంకులు 2024లో తమ రేటు సడలింపు ప్రక్రియను ప్రారంభించాయి. అయితే, ద్రవ్యోల్బణం నిలకడగా ఉంటున్న నేపథ్యంలో అమెరికా సెంట్రర్ బ్యాంక్ ఫెడ్ వడ్డీరేట్ల పెంపుపై వెనక్కి తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా, బుధవారం రాత్రి విడుదలైన ఫెడ్ మీటింగ్‌లో వడ్డీ రేట్లను (5.25%–5.5%) యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈఏడాదిలో చివరివరకు కనీసం రెండుసార్లు వడ్డీరేట్లు తగ్గుతాయని మార్కెట్ వర్గాలు ఆశించాయి. కానీ అందుకు భిన్నంగా కేవలం ఒకేసారి వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉండబోతుందని ఫెడ్ మీటింగ్ సూచిస్తుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎన్ఎస్ఈ నిఫ్టీ.. భళా
మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 58 పాయింట్లు బలపడి 23,323 వద్ద నిలిచింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ఇంట్రాడేలోనూ 177 పాయింట్లు పురోగమించి 23,442 వద్ద సరికొత్త రికార్డును సాధించింది. ఇక ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో తొలి సెషన్లో సెన్సెక్స్ 594 పాయింట్లు జంప్ చేసింది. ఇంట్రాడే రికార్డ్ 77,079కు చేరువగా 77,050ను అధిగమించింది. చివరికి 150 పాయింట్లు జమ చేసుకుని 76,607 వద్ద ముగిసింది. ముంబై: ఎంపిక చేసిన బ్లూచిప్ షేర్లకు డిమాండ్ నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు మళ్లీ జోరందుకున్నాయి. రోజంతా ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ఆసక్తి చూపడంతో లాభాలమధ్యే కదిలాయి. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్(విలువ) మరోసారి కొత్త రికార్డును లిఖించింది. రూ. 429.32 లక్షల కోట్లను(5.14 ట్రిలియన్ డాలర్లు) అధిగమించింది. కాగా.. ఎన్ఎస్ఈలో మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్, హెల్త్‌కేర్ రంగాలు 2–1 శాతం మధ్య పుంజుకున్నాయి. చిన్న షేర్లు జూమ్ బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతానికిపైగా బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,518 లాభపడితే.. 1,376 మాత్రమే డీలాపడ్డాయి. నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ. 427 కోట్లు, దేశీ ఫండ్స్ రూ. 234 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. ఫెడ్‌పై దృష్టి దేశీయంగా జీడీపీ పురోగతిపై ఆర్బీఐ ఆశావహ అంచనాలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకురానున్న తుది బడ్జెట్ వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇవికాకుండా యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు తెలియజేశారు. ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు బలహీనపడినట్లు తెలియజేశారు. విదేశీ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 83 డాలర్లకు చేరగా, డాలరుతో మారకంలో రూపాయి నామమాత్రంగా 3 పైసలు బలపడి 83.56(ప్రొవిజినల్) వద్ద ముగిసింది. ఇక్సిగో ఐపీవో బంపర్ సక్సెస్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఇక్సిగో మాతృ సంస్థలే ట్రావెన్యూస్ టెక్నాలజీ చేపట్టిన పబ్లిక్ ఇష్యూ సూపర్ సక్సెస్‌ను సాధించింది. షేరుకి రూ. 88–93 ధరలో బుధవారం ముగిసిన ఇష్యూ 98 రెట్లు అధిక సబ్‌్రస్కిప్షన్‌ను అందుకుంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 740 కోట్లు సమీకరించింది.డీ డెవలప్మెంట్ @ రూ. 193–203పైపింగ్ సొల్యూషన్స్ కంపెనీ డీ డెవలప్మెంట్ ఇంజనీర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 193–203 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవో ఈ నెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ. 418 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఈ నిధులను వినియోగించుకోవాలన్నది సంస్థ ప్రణాళిక. -
లాభాలతో సెన్సెక్స్.. రికార్డ్స్థాయిని తాకిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయంతో పాటు మే నెల సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణ డేటా కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూడడంతో భారత ఈక్విటీ మార్కెట్లు బుధవారం స్వల్ప శ్రేణిలోనే కొనసాగాయి.ఈరోజు బీఎస్ఈ సెన్సెక్స్ 150 పాయింట్లు లేదా 0.2 శాతం పెరిగి 76,607 వద్ద ముగిసింది. నిఫ్టీ 50.58 పాయింట్లు లేదా 0.25 శాతం పెరిగి 23,323 వద్ద ముగియగా అంతకు ముందు 23,442 పాయింట్ల రికార్ట్ హైని తాకింది.కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్, టెక్ మహీంద్రా, ఎల్టీఐ మైండ్ ట్రీ, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్ షేర్లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, హెచ్ యూఎల్, టైటాన్, టాటా కన్జూమర్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. -
పెరిగిన బంగారం, వెండి ధర.. ఎంతంటే..?
ఈక్విటీమార్కెట్లు ఇటీవల కాలంలో తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. దాంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,150 (22 క్యారెట్స్), రూ.72,160 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.300, రూ.320 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.350, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.380 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.66,800 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.72,870 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.66,300.. 24 క్యారెట్ల ధర రూ.72,310కు చేరాయి. మార్కెట్లో కేజీ వెండి ధర ఏకంగా రూ.800 పెరిగి రూ.95,800కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
సెబీ.. ఇన్వెస్టర్ సర్టిఫికేషన్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వ్యక్తిగత ఇన్వెస్టర్లకు సర్టిఫికేషన్ పరీక్షను నిర్వహించనుంది. దీంతో ఉచితంగా స్వచ్చంద పద్ధతిలో ఇన్వెస్టర్లు ఆన్లైన్లో పరీక్షను రాయడం ద్వారా సరి్టఫికేషన్‌ను అందుకునేందుకు వీలుంటుంది. తద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి సమగ్ర విజ్ఞానాన్ని పొందవచ్చని ఒక ప్రకటనలో సెబీ పేర్కొంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (ఎన్ఐఎస్ఎం) సహకారంతో అభివృద్ధి చేసిన సర్టిఫికేషన్‌ను సెబీ జారీ చేయనుంది. వెరసి ఇన్వెస్టర్లు స్వచ్చందంగా మార్కెట్లు, పెట్టుబడుల విషయంలో తమ విజ్ఞానాన్ని పరీక్షించుకునేందుకు వీలుంటుందని పేర్కొంది. రిటైల్ ఇన్వెస్టర్లు దేశీ సెక్యూరిటీల మార్కెట్లో ప్రావీణ్యాన్ని పెంచుకునేందుకు పరీక్ష ఉపయోగపడుతుందని తెలియజేసింది. -
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 51 పాయింట్లు లాభపడి 23,316కు చేరింది. సెన్సెక్స్ 166 పాయింట్లు ఎగబాకి 76,628 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.27 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 81.93 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.4 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.27 శాతం, నాస్డాక్ 0.88 శాతం లాభాల్లోకి చేరాయి.భారత్ వేగంగా వృద్ధి చెందే ఎకానమీగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సహా వచ్చే మూడేళ్ల పాటు నిలకడగా 6.7 శాతం వృద్ధి నమోదు చేయగలదని తెలిపింది. పెట్టుబడుల వృద్ధి కాస్త నెమ్మదించినా గతంలో అంచనా వేసిన దానికన్నా పటిష్టంగానే ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు తెలిపింది.కొత్త కనిష్టానికి రూపాయిదేశీయ కరెన్సీ రూపాయి విలువ అమెరికా డాలరుతో పోలిస్తే కొత్త కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 9 పైసలు నష్టపోయి 83.59 వద్ద ముగిసింది. 83.49 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 83.59కు చేరింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)