Market
-
నామినీ నిబంధనలు సడలించిన సెబీ
డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ఫండ్ పోర్ట్‌ఫోలియోలో నామినీ పేరును జతచేయాలనే నిబంధనను సడలిస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది.గతంలో సెబీ జారీ చేసిన నియమాల ప్రకారం..డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ఫండ్ పోర్ట్‌ఫోలియోలో నామినీ పేరును తప్పకుండా జతచేయాలి. నామినీ అవసరం లేనివారు (ఆప్ట్ ఔట్ ఆఫ్ నామినేషన్) అని ఎంచుకోవాలి. ఇందులో ఏదో ఒకటి జూన్ 30లోపు తెలియజేయాల్సి ఉంది. ఆయా వివరాలు సమర్పించని వారి డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు జూన్30 తర్వాత పనిచేయవని సెబీ గతంలో చెప్పింది.ఈ నిబంధనలను మరోసారి పరిశీలించాలని సెబీకి మార్కెట్ వర్గాల నుంచి భారీగా అభ్యర్థనలు వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని సెబీ తన పాత ఆదేశాలన్ని సడలిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మదుపు చేస్తున్న డీమ్యాట్ ఖాతాదారులు, ఫండ్ మదుపరులు నామినేషన్ వివరాలు తెలియజేయకపోయినా వారి ఖాతాల విషయంలో ఎలాంటి చర్యలుండవని సెబీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతోపాటు భౌతిక రూపంలో షేర్ల సర్టిఫికెట్లు ఉన్న వారికీ డివిడెండ్, వడ్డీ, ఇతర చెల్లింపులతోపాటు, అవసరమైన సేవల విషయాలన్నీ నామినేషన్‌తో సంబంధం లేకుండా అందించాలని పేర్కొంది.నామినీ జత చేయడంపై సెబీ సడలింపు ఇచ్చినా తప్పకుండా డీమ్యాట్, ఫండ్ పెట్టుబడిదారులు ఆయా వివరాలు నమోదు చేయాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తును ఎవరూ ఊహించలేరు కాబట్టి ఏక్షణం ఏదైనా జరగొగ్గచ్చు. మనం ఉన్నా..లేకపోయినా మనం కష్టపడి సంపాదించికున్న పెట్టుబడులు, లాభాలను నామినీకు చెందేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. -
రైల్ షేర్ల పరుగు– మార్కెట్ ఫ్లాట్
ముంబై: గత వారం సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ర్యాలీ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 33 పాయింట్లు క్షీణించి 76,457 వద్ద నిలవగా.. 6 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 23,265 వద్ద స్థిరపడింది. అయితే ఆటుపోట్ల మధ్య కదిలిన మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా జోరందుకున్నాయి. సెన్సెక్స్ 370 పాయింట్లు ఎగసి 76,861కు చేరగా.. నిఫ్టీ 130 పాయింట్లు బలపడి 23,389ను అధిగమించింది.ఒక దశలో సెన్సెక్స్ 76,297, నిఫ్టీ 23,207 పాయింట్ల దిగువన కనిష్టాలను తాకాయి. ఎన్ఎస్ఈలో మీడియా, ఆయిల్, రియల్టీ 2–1 శాతం మధ్య వృద్ధి చూపగా.. హెల్త్‌కేర్ 0.5 శాతం తగ్గింది. బ్లూచిప్స్‌లో ఓఎన్జీసీ 5.7 శాతం జంప్‌చేయగా.. టాటా మోటార్స్, ఎల్అండ్టీ, అదానీ పోర్ట్స్, మారుతీ, అల్ట్రాటెక్ 2–1 శాతం మధ్య ఎగశాయి. మరోపక్క కొటక్ బ్యాంక్, దివీస్, ఐటీసీ, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా 1.3–0.8 శాతం మధ్య డీలాపడ్డాయి. చిన్న షేర్లు అప్ అశ్వినీ వైష్ణవ్ రైల్వే మంత్రిగా కొనసాగనుండటంతో రైల్వే రంగ కౌంటర్లు స్పీడందుకున్నాయి. ఎన్ఎస్ఈలో రైల్‌టెల్ 9%, ఇర్కాన్ 8%, టెక్స్మాకో 7 శాతం, జూపిటర్ వేగన్స్ 6%, ఐఆర్సీటీసీ, ఆర్వీఎన్ఎల్ 4 శాతం, ఐఆర్ఎఫ్సీ 2 శాతం చొప్పున ఎగశాయి. అయితే కెర్నెక్స్ మైక్రో 4.2 శాతం పతనమైంది. కాగా. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ దాదాపు 1 శాతం బలపడ్డాయి. కొత్త కనిష్టానికి రూపాయి @ 83.59దేశీ కరెన్సీ డాలరుతో మారకంలో కొత్త కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 9 పైసలు నీరసించి 83.59 వద్ద ముగిసింది. 83.49 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 83.59కు జారింది. అక్కడే స్థిరపడింది. ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు బలపడటానికితోడు.. చమురు ధరలు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెరిగిన డిమాండ్ ప్రభావం చూపింది. -
నాలుగేళ్లలో 50వేల కోట్ల లాభాలు: నితిన్ కామత్ ట్వీట్ వైరల్
దేశంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తరువాత మార్కెట్ వేగంగా పుంజుకుంటోంది. కరోనా మహమ్మారి భారతదేశంలో వ్యాపించిన తరువాత చాలామంది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఆ తరువాత అనుకున్నంత లాభాలు లాలేదు, కానీ ఇటీవల కొన్ని సంస్థలు ఏకంగా కోట్ల రూపాయల లాభాలను ఆర్జించాయి. ఇందులో ఒకటి జెరోధా కంపెనీ.జెరోధా కంపెనీ కో ఫౌండర్ నితిన్ కామత్ ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఈక్విటీ పెట్టుబడిదారులు గత నాలు సంవత్సరాల్లో రూ. 50,000 కోట్ల లాభాలను సాధించారు. రూ. 4,50,000 కోట్ల ఏయూఎంలో రూ. 1,00,000 కోట్ల లాభాలను పొందినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నితిన్ కామత్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఇక మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 23,264 వద్దకు చేరింది. సెన్సెక్స్ 33 పాయింట్లు నష్టపోయి 76,456 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.Equity investors @zerodhaonline have realized a profit of Rs 50,000 crores over the last 4+ years and are sitting on unrealized profits of Rs 1,00,000 crores on an AUM of Rs 4,50,000 crores. By the way, most of the AUM was added in the last four years. pic.twitter.com/4X981aY2jH— Nithin Kamath (@Nithin0dha) June 11, 2024 -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 23,264 వద్దకు చేరింది. సెన్సెక్స్ 33 పాయింట్లు నష్టపోయి 76,456 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్ అండ్ టీ, మారుతీసుజుకీ, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్‌ఫార్మా, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్, టైటాన్, ఇన్ఫోసిస్, నెస్లే కంపెనీ షేర్లు నష్టాల్లోకి చేరుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పడిలేసిన పసిడి.. మళ్ళీ తగ్గిన వెండి - కొత్త ధరలు ఇవే..
జూన్ 8న భారీగా తగ్గిన పసిడి ధరలు ఈ రోజు (జూన్ 11) స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం..విజయవాడ, హైదరాబాద్‌లలో 10 గ్రాముల బంగారం ధరలు రూ.65850 (22 క్యారెట్స్), రూ.71840 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 150, రూ. 170 తగ్గినట్లు తెలుస్తోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66000 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 71990 వద్ద ఉంది. ఈ ధరలు నిన్నటి కంటే రూ. 150, రూ. 170 ఎక్కువ.ఇక చెన్నై విషయానికి వస్తే.. బంగారం ధరలు వరుసగా రూ. 150, రూ. 170 తగ్గి.. రూ. 66450 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 72490 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద నిలిచాయి. ధరలు తగ్గినప్పటికీ.. ఇతర రాష్ట్రాలకంటే చెన్నైలో బంగారం ధరలు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు పెరిగినా.. వెండి ధరలు మాత్రం తగ్గు ముఖం పట్టాయి. దీంతో ఈ రోజు (జూన్ 11) ఒక కేజీ వెండి ధర రూ. 90500 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు ఏకంగా రూ. 1200 తగ్గింది. దీన్ని బట్టి చూస్తే క్రమంగా పెరుగుతూ వెళ్లిన వెండి ధరలు కూడా ఒక్కసారిగా కిందకు పడుతున్నట్లు స్పష్టమవుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 23,243కు చేరింది. సెన్సెక్స్ 77 పాయింట్లు దిగజారి 76,410 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.15 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 78.01 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.26 శాతం, నాస్డాక్ 0.38 శాతం లాభాల్లోకి చేరాయి.డీప్‌ఫేక్ వీడియోలను నమ్మొద్దు: ఎన్ఎస్ఈడీప్ఫేక్ వీడియోల పట్ల జాగ్రత్త వహించాలంటూ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేజీ(ఎన్ఎస్ఈ) ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో అశిష్‌కుమార్ చౌహాన్ పెట్టుబడులకు సంబంధించి సలహాలిస్తున్నట్లు వైరల్ అవుతున్న నకిలీ వీడియోల నేపథ్యంలో ఎక్స్ఛేజీ ఈ హెచ్చరిక జారీ చేసింది.మేలో ఈక్విటీ ఎంఎఫ్‌ల రికార్డుమే నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)కు ఇన్వెస్టర్లు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ మే నెలలో రూ.34,697 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 83 శాతం అధికం. సిప్‌కు సైతం రూ.20,904 కోట్ల పెట్టుబడులు లభించినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా(యాంఫీ) వెల్లడించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
77,000 స్థాయి తాకి.. వెనక్కి
ముంబై: సరికొత్త రికార్డుల వద్ద ఐటీ, ఫైనాన్స్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారంతో ఉదయం ప్రారంభంలోనే సూచీలు జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 386 పాయింట్లు పెరిగి 77,000 స్థాయిపై 77,079 వద్ద, నిఫ్టీ 122 పాయింట్లు బలపడి 23,412 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి.తదుపరి ఐటీ, ఫైనాన్స్ మెటల్, ఇంధన షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 203 పాయింట్లు పతనమై 76,490 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 23,259 వద్ద నిలిచాయి. సరీ్వసెస్, రియల్టీ, కమోడిటీస్, యుటిలిటీస్, హెల్త్‌కేర్, పారిశ్రామికోత్పత్తి రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ స్మాల్, మిడ్ సూచీలు వరుసగా 1.04%, 0.56% చొప్పున రాణించాయి. క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.136)తో పోలిస్తే 21% ప్రీమియంతో రూ.165 వద్ద లిస్టయ్యింది. ఆఖరికి 17% లాభంతో రూ.159 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.591.25 కోట్లుగా నమోదైంది. డీప్‌ఫేక్ వీడియోలను నమ్మొద్దు: ఎన్ఎస్ఈకాగా, డీప్‌ఫేక్ వీడియోల పట్ల జాగ్రత్త వహించాలంటూ నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో అశిష్‌కుమార్ చౌహాన్ పెట్టుబడులకు సంబంధించి సలహాలిస్తున్నట్లు వైరల్ అవుతున్న నకిలీ వీడియోల నేపథ్యంలో ఎక్సే్చంజీ ఈ హెచ్చరిక జారీ చేసింది.మేలో ఈక్విటీ ఎంఎఫ్‌ల రికార్డ్ మే నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)కు ఇన్వెస్టర్లు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ మే నెలలో రూ. 34,697 కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 83 శాతం అధికం. సిప్‌కు సైతం రూ. 20,904 కోట్ల పెట్టుబడులు లభించినట్లు యంఫీ వెల్లడించింది. -
వరుస లాభాలకు బ్రేక్.. నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాల్లోకి చేరాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 55 పాయింట్లు తగ్గి 23,234 వద్దకు చేరింది. సెన్సెక్స్ 203 పాయింట్లు దిగజారి 76,490 వద్ద ముగిసింది. గతవారంలోని వరుస మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడినట్లయింది. మదుపర్లు గరిష్ఠాల వద్ద షేర్లు విక్రయించినట్లు తెలుస్తుంది.సెన్సెక్స్ 30 సూచీలో ఆల్ట్రాటెక్ సిమెంట్, పవర్‌గ్రిడ్, నెస్లే, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, ఐటీసీ, హెచ్‌యూఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కొటక్‌మహీంద్రా బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి చేరుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం కొనడానికి ఇది మంచి తరుణం!.. ఎందుకంటే?
రెండు రోజులకు ముందు భారీగా తగ్గిన బంగారం ధరలు ఉలుకు పలుకు లేకుండా స్థిరంగా ఉన్నాయి. ఏకంగా రూ. 2080 తగ్గి పసిడి ప్రియులకు ఊరట కలిగించిన గోల్డ్ రేటు అదే ధర వద్ద నిలిచింది. ఈ రోజు (జూన్ 10) దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..హైదరాబాద్, విజయవాడలలో సోమవారం ఒక తులం బంగారం ధరలు రూ. 65700 (22 క్యారెట్స్), రూ.71760 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరలే ఈ రోజు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా ఈ రోజు పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. దీంతో నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 65850, కాగా 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71820గా ఉంది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి కాబట్టి కొనుగోలు చేయడానికి ఇది మంచి తరుణం అని తెలుస్తోంది.హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నప్పటికీ, చెన్నైలో మాత్రం ఈ రోజు కూడా బంగారం ధర స్వల్ప తగ్గుదలను నమోదు చేసింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 66300 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 72330 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. గోల్డ్ ధర నిన్నట్లి కంటే రూ. 200, రూ. 220 తగ్గినట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుబంగారం ధరలు పసిడి ప్రియులకు ఊరట కలిగించినప్పటికీ.. వెండి మాత్రం స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. ఈ రోజు (జూన్ 10) ఒక కేజీ వెండి ధర రూ. 91700 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరల కంటే ఈ రోజు ధరలు రూ. 200 పెరిగినట్లు తెలుస్తోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఎన్నికల ఫలితాల రోజు మార్కెట్ పతనంపై సుప్రీం కోర్టులో పిటిషన్
లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జూన్ 4వ తేదీన స్టాక్‌మార్కెట్లు భారీగా పతనమవ్వడంపై కేంద్రం, సెబీ నివేదిక సమర్పించాలని విశాల్ తివారీ అనే న్యాయవాది డిమాండ్ చేశారు. ఈమేరకు సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన పూర్తి నివేదికన సమర్పించేలా కేంద్రం, సెబీకి ఆదేశాలు జారీచేయాలని తివారీ సుప్రీంకోర్టును కోరారు. దాంతోపాటు అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలోని నిపుణుల కమిటీ జనవరి 3న ఇచ్చిన సూచనలపై స్టేటస్ రిపోర్టును సమర్పించేలా ప్రభుత్వం, సెబీని ఆదేశించాలని కోరారు.నిపుణుల కమిటీ సూచనలను కేంద్రం, సెబీ నిర్మాణాత్మకంగా పరిగణించాలని సుప్రీంకోర్టు తెలిపింది. నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి, పెట్టుబడిదారులను రక్షించడానికి, సెక్యూరిటీ మార్కెట్ పనితీరును నిర్ధారించడానికి అవసరమైన తదుపరి చర్యలను తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది.తివారీ దాఖలు చేసిన పిటిషన్లో..‘సార్వత్రిక ఎన్నికలు 2024 ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ప్రకటనల సమయంలో స్టాక్‌మార్కెట్లు భారీగా పెరిగాయి. కానీ వాస్తవ ఫలితాలు వెలువడిన రోజు మార్కెట్లో ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని నివేదికల ప్రకారం ఏకంగా ఒక్కరోజే రూ.20లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ వ్యవహారం నియంత్రణ యంత్రాంగంపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. మార్కెట్ నియమాలపై స్పష్టమైన కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రభావం చూపించలేదు’ అని తెలిపారు.ఇదీ చదవండి: రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్‌జాబ్స్..!ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం సోమవారం (జూన్3న) బీఎస్ఈ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 2,507 పాయింట్లు లేదా 3.4 శాతం పెరిగి 76,469 వద్ద గరిష్ట స్థాయిని చేరింది. తర్వాతరోజు వాస్తవ ఫలితాలు వెలువడిన మంగళవారం సెన్సెక్స్ 4,390 పాయింట్లు లేదా 6 శాతం దిగజారి 72,079 వద్ద స్థిరపడింది. -
ఆల్‌టైమ్‌హైలో స్టాక్‌మార్కెట్ సూచీలు.. 23,400 మార్కు చేరిన నిఫ్టీ
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 113 పాయింట్లు లాభపడి 23,402కు చేరింది. సెన్సెక్స్ 334 పాయింట్లు ఎగబాకి 77,015 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.9 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 79.36 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.43 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.11 శాతం, నాస్డాక్ 0.25 శాతం నష్టపోయాయి.ఫెడ్ సమావేశమే కీలకం..అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశ నిర్ణయాలు గురువారం(జూన్ 13న) విడుదల కానున్నాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా (5.25–5.50 శ్రేణిలో) ఉంచొచ్చని అంచనాలు నెలకొన్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల కోత తర్వాత ఫెడ్ రిజర్వ్ తొలిరేట్ల తగ్గింపు సెప్టెంబర్లోనా..? డిసెంబర్లోనా..? అనే అంశంపై స్పష్టత కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం, ఆర్థిక స్థితిగతులపై ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు కీలకంగా మారనున్నాయి.దేశీయంగా మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి డేటా జూన్ 12న, హోల్‌సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు జూన్ 14న విడుదల కానున్నాయి. రిటైల్ ద్రవ్యల్బోణం ఏప్రిల్‌లో 4.85%, మార్చిలో 4.83 శాతంగా నమోదైంది. ఈసారి మేలో 4.8 శాతంగా నమోదవ్వొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గోల్డ్ బాండ్లకు ఇన్వెస్టర్ల ఆదరణ...
న్యూఢిల్లీ: 2023–24 ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ భారీగా పెరిగి రూ.27,031 కోట్లకు చేరింది. పరిమాణంలో ఈ విలువ 44.34 టన్నులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 2022–23లో ఈ విలువ, పరిమాణం వరుసగా రూ.6,551 కోట్లు, 12.26 టన్నులుగా ఉంది. అధికారిక సమాచారం ప్రకారం.. 2015లో ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి 67 విడతల్లో విక్రయాలు జరిగాయి. రూ.72,274 కోట్లు సమకూరగా, పరిమాణంలో 146.96 టన్నులకు ఈ విలువ ప్రాతినిధ్యం వహిస్తోంది. వార్షికంగా పసిడి ధర 10 గ్రామలుకు (పూర్తి స్వచ్ఛత) రూ.62,300 నుంచి రూ.73,200కు ఎగసింది. -
Indian stock market: భారీ లాభాలకు అవకాశం
ముంబై: దలాల్ స్ట్రీట్ ఈ వారం భారీ కొనుగోళ్లతో కళకళలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటు, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారంతో ఆర్థిక సంస్కరణల కొనసాగింపుపై మరింత స్పష్టత రావడంతో బుల్ పరుగులు తీసే వీలుందంటున్నారు. ఇక అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం నుంచి ఈ వారం మార్కెట్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే దేశీయ ద్రవ్యల్బోణ గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం ట్రేడింగ్‌ను నిర్దేశిస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ, విదేశీ ఇన్వెస్టర్ల క్రయ విక్రయాలు, క్రూడాయిల్ ధరలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. ఇటీవల పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకున్న క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్ షేర్లు సోమవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఇదే రోజున లీ ట్రావెన్యూస్ టెక్నాలజీ ఐపీఓ సోమవారం ప్రారంభమై, బుధవారం ముగుస్తుంది. ఎగ్జిట్ పోల్స్, ఎన్నికల ఫలితాలు, ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో గతవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ లాభ, నష్టాల మధ్య ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 76,795 వద్ద కొత్త రికార్డు నమోదుతో పాటు 2,732 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 23,339 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మొత్తంగా 759 పాయింట్లు ఆర్జించింది. కళ్లన్నీ ఫెడ్ సమావేశం పైనే..! అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశ నిర్ణయాలు గురువారం(జూన్ 13న) విడుదల కానున్నాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా (5.25–5.50 శ్రేణిలో) ఉంచొచ్చని అంచనాలు నెలుకొన్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల కోత తర్వాత ఫెడ్ రిజర్వ్ తొలి రేట్ల తగ్గింపు సెపె్టంబర్లోనా.? డిసెంబర్లోనా..? అనే అంశంపై స్పష్టత కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం, ఆర్థిక స్థితిగతులపై ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి దేశీయంగా మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి డేటా జూన్ 12న, హోల్‌సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు జూన్ 14న విడుదల కానున్నాయి. రిటైల్ ద్రవ్యల్బోణం ఏప్రిల్‌లో 4.85%, మార్చిలో 4.83 శాతంగా నమోదైంది. ఈసారి మేలో4.8శాతంగా నమోదవ్వొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఐఐపీ డేటా 4.9% నుంచి 3.9 శాతానికి దిగిరావచ్చని భావిస్తున్నారు.రూ.14,794 కోట్ల అమ్మకాలు దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తొలి వారంలో రూ.14,794 కోట్లను వెనక్కి తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా రావడం.., అదే సమయంలో చైనా స్టాక్ మార్కెట్ ఆకర్షణీయంగా ఇందుకు ప్రధాన కారణాలు. మరోవైపు డెట్ మార్కెట్లో రూ.4,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ఇక మే నెలలో ఎన్నికల ఫలితాలపై భిన్న అంచనాల కారణంగా రూ.25,586 కోట్లు ఉపసంహరించుకున్నారు. కాగా ఏప్రిల్‌లో రూ.8,700 కోట్లకు పైగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. -
బంగారం బంగారమే
కాలంతో పాటే దేశీ కరెన్సీ విలువ తరిగిపోతుంటుంది. కానీ, కాలంతోపాటే విలువ పెంచుకుంటూ వెళ్లే వాటిల్లో బంగారం కూడా ఒకటి. అందుకే ప్రతి ఒక్కరి పెట్టుబడుల్లో బంగారానికి (గోల్డ్) తప్పక చోటు ఇవ్వాలి. ఇటీవలి కాలంలో బంగారంలో మంచి ర్యాలీ చూస్తున్నాం. ప్రతి ఏటా పసిడి ఇదే మాదిరి పరుగు పెట్టుకపోవచ్చు. కానీ, దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇచ్చే విషయంలో నిజంగా ‘బంగారమే’ అని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. 2017–18 సంవత్సరం సావరీన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ)లో ఇన్వెస్ట్ చేసినవారికి గడిచిన ఐదేళ్లలో ఏటా 16.5 శాతం రాబడి వచి్చంది. సంప్రదాయ డెట్ సాధనాల కంటే రెట్టింపు రాబడి బంగారంలో రావడం అంటే మామూలు విషయం కాదు. ఈక్విటీల స్థాయిలో బంగారం రాబడి ఇవ్వడం విశేషం. అందుకే దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసే వారు బంగారానికి తప్పక చోటు ఇవ్వాలి. ఏ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రయోజనమో తెలియజేసే కథనమే ఇది.వివిధ సాధనాలు బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఆభరణాలను పెట్టుబడిగా చూడొద్దు. ధరించడానికి కావాల్సినంత వరకే ఆభరణాలకు పరిమితం కావాలి. పెట్టుబడి కోసం అయితే ఎలక్ట్రానిక్ రూపంలో ఎన్నో సాధనాలు ఉన్నాయి. వీటిల్లో తమకు నచి్చన దానిని ఎంపిక చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఫండ్స్, సావరీన్ గోల్డ్ బాండ్స్ (ఎస్‌జీబీలు), డిజిటల్ గోల్డ్ అందుబాటులో ఉన్న పలు రకాల సాధనాలు. వీటన్నింటిలోకి ఎస్‌జీబీలు ఎక్కువ ప్రయోజనకరం. గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్స్ మాదిరే స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో నిత్యం ట్రేడ్ అవుతుంటాయి. ఇందులో చార్జీలు, వ్యయాలు చాలా తక్కువ. భౌతిక బంగారం ధరలకు అనుగుణంగానే గోల్డ్ ఈటీఎఫ్ ధర ఏరోజుకారోజు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో మారుతుంటుంది. నచి్చనప్పుడు కొనుగోలు చేసుకుని, అవసరమైనప్పుడు సులభంగా విక్రయించుకోవచ్చు. వీటిల్లో ఎక్స్పెన్స్ రేషియో రూపంలో ఏటా నిర్ణీత మొత్తాన్ని చార్జీగా తీసుకుంటారు. వీటిల్లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. ఉదాహరణకు ఎల్ఐసీ గోల్డ్ ఈటీఎఫ్‌లో ఎక్స్పెన్స్ రేషియో 0.41 శాతంగా ఉంది. ఈ ఫండ్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశారనుకోండి. దీనిపై 0.41 శాతం ప్రకారం రూ.410ని ఎక్స్పెన్స్ రేషియో కింద ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ వసూలు చేస్తుంది. ఇది కూడా సంవత్సరానికి ఒకే విడతగా కాకుండా, ఏ రోజుకారోజు ఇన్వెస్టర్ యూనిట్ల నుంచి తీసుకుంటుంది. పెట్టుబడులను ఉపసంహరించుకుంటే ఎగ్జిట్ లోడ్ ఉండదు. పెట్టుబడులపై వచ్చిన లాభాన్ని వార్షిక ఆదాయానికి చూపించి, తాము ఏ శ్లాబు పరిధిలోకి వస్తే ఆ మేరకు పన్ను చెల్లించాలి. గోల్డ్ ఫండ్స్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను తీసుకెళ్లి గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడమే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ చేసే పని. కనుక వీటికి బదులు నేరుగా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోనే పెట్టుబడులు పెట్టుకోవచ్చు. కానీ, కొందరికి గోల్డ్ మ్యూచువల్ ఫండ్సే అనుకూలం. ఎలా అంటే.. గోల్డ్ ఈటీఎఫ్ ఒక యూనిట్ ఒక గ్రాము బంగారం పరిమాణంలో ట్రేడవుతుంటుంది. కనుక ఎంతలేదన్నా ఒక గ్రాము బంగారం స్థాయిలో ఒకే విడత ఇన్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అదే గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌లో అయితే రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడికి డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. కొనుగోలు చేసిన యూనిట్లు డీమ్యాట్ ఖాతాకే జమ అవుతాయి. కానీ గోల్డ్ ఫండ్స్‌లో పెట్టుబడులకు డీమ్యాట్ ఖాతా తప్పనిసరి కాదు. కాకపోతే గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునే వారికి కొంచెం అదనపు భారం పడుతుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అక్కడ ఎక్స్పెన్స్ రేషియో.. తిరిగి గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో పేరిట రెండు సార్లు చార్జీ చెల్లించాల్సి వస్తుంది. వీటిల్లో పెట్టుబడులు విక్రయించినప్పుడు వచి్చన లాభాన్ని రిటర్నుల్లో చూపించి, తమ శ్లాబు రేటు ప్రకారం చెల్లించాలి. డిజిటల్ గోల్డ్ ఫోన్‌పే, పేటీఎం, పలు ఫిన్‌టెక్ సంస్థలు డిజిటల్ గోల్డ్ కొనుగోలుకు వీలు కలి్పస్తున్నాయి. రూపాయి నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించుకోవచ్చు. ఇన్వెస్టర్ కొనుగోలు చేసిన పరిమాణం మేర అసలైన బంగారం ఖజనాల్లో భద్రపరుస్తారు. కొంత మొత్తం సమకూరిన తర్వాత (కనీసం 10 గ్రాములు అంతకుమించి) భౌతిక రూపంలో తీసుకోవచ్చు. లేదా ఎంపిక చేసిన జ్యుయలరీ సంస్థల్లో ఆభరణాల కిందకు మార్చుకోవచ్చు. అవసరం ఏర్పడితే దీనిపై రుణం పొందొచ్చు. ఇందులో కాస్త చార్జీలు ఎక్కువ. ఒక ఇన్వెస్టర్ ఒక ప్లాట్ఫామ్లో గరిష్టంగా రూ.2లక్షలు మించి కొనుగోలు చేయలేరు. ఆర్బీఐ, సెబీ తదితర నియంత్రణ సంస్థల పర్యవేక్షణ వీటిపై ఉండదు. ఇందులో వచ్చే లాభాలు సైతం వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఎస్‌జీబీల్లో రాబడి ఇండియా బులియన్‌అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకటించే 999 స్వచ్ఛత బంగారం (గత మూడు పనిదినాల్లోని సగటు)ధరను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ఐబీజేఏ ధర మార్కెట్ ఆధారితమే. మొదటి విడత జారీ చేసిన ఎస్జీబీ 2016– సిరీస్1 బాండ్ గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 8న ముగసింది. నాడు ఒక గ్రాము బాండ్ రూ.2,600కు విక్రయించారు. గడువు ముగిసిన రోజు ఆర్బీఐ నిర్ణయించిన ధర రూ.6,271. ఇందులో ఇన్వెస్ట్ చేసి చివరి వరకు కొనసాగిన వారికి ఏటా 11% రాబడి వచి్చంది. 2.5% వడ్డీ రాబడిని కలిపి చూస్తే వార్షికంగా 11.63 శాతం చొప్పున నికర రాబడి వచ్చినట్టు. ఇది బంగారం గత 20 ఏళ్ల సగటు రాబడి కంటే ఎక్కువే ఉండడం గమనార్హం. తర్వాత వచ్చిన సిరీస్‌లపై రాబడులు మరింత అధికంగా ఉంటున్నాయి. ఇతర వివరాలు ఎస్‌జీబీలపై వడ్డీని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాకు జమ చేస్తారు. చివరి ఆరు నెలల వడ్డీ, మెచ్యూరిటీతో కలిపి ఇస్తారు. ఒక ఇన్వెస్టర్ కనిష్టంగా ఒక గ్రాము, గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 4 కిలోల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఎస్జీబీలను ఎనిమిదేళ్ల పాటు గడువు పూర్తయ్యే వరకు కొనసాగించినప్పుడే లాభంపై ఎలాంటి పన్ను పడదు. ఒకవేళ ఈ మధ్యలోనే వైదొలిగితే లాభం వార్షిక ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఆన్లైన్లో కొనుగోలు చేసే వారికి ప్రతి గ్రాముపై రూ.50 తగ్గింపు లభిస్తుంది.కేటాయింపులు ఎంత మేర? ఒకరి మొత్తం పెట్టుబడుల్లో కనీసం 5% బంగారంపై ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది నిపుణుల సూ చన. గరిష్టంగా 10 వరకు కేటాయించుకోవ చ్చు. మోస్త రు రాబడులు వచ్చినా ఫర్వాలేదు, రిస్క్ వద్దనుకునే ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో 15% వరకు కూడా బంగారంపై ఇన్వెస్ట్ చేసుకోవ చ్చు. కానీ, పెట్టుబడి కోసం భౌతిక బంగారం అంత మెరుగైన ఆప్షన్ కాబోదు. ఎందుకంటే అసలు బంగారం ధరకు తోడు, కొనుగోలు ధరపై 3% మేర జీఎస్టీని భరించాల్సి ఉంటుంది. అదే పెట్టుబడి కోసం అని చెప్పి ఆభరణాలు కొనుగోలు చేస్తే దా నిపై తయారీ చార్జీలు, తరుగు భరించాల్సి వ స్తుంది. ఇవన్నీ నికర రాబడులను ప్రభావితం చే స్తాయి. కనుక బంగారంపై పెట్టుబడి ఎప్పుడూ కూ డా డిజిటల్‌గానే ఉంచుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. దీనివల్ల భద్రతాపరమైన రిస్క్ కూడా ఉండదు. బంగారం బాండ్లు భౌతిక బంగారంపై పెట్టుబడుల ఒత్తిడిని తగ్గించేందుకు.. డిజిటల్ రూపంలో బంగారంపై పెట్టుబడులను, పారదర్శకతను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన సాధనమే సావరీన్ గోల్డ్ బాండ్స్ పథకం. ప్రతీ ఆర్థిక సంవత్సరంలోనూ ఒకటికి మించిన పర్యాయాలు ఎస్జీబీలను ప్రభుత్వం తరఫున ఆర్బీఐ విక్రయిస్తుంటుంది. ఒక గ్రాము డినామినేషన్ రూపంలో బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇష్యూ సమయంలో ఒక గ్రాము ధర ఎంతన్నది ఆర్బీఐ ప్రకటిస్తుంటుంది. బ్యాంక్‌లు, బ్రోకరేజీ సంస్థలు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ కొనుగోలుకు అవకాశం కలి్పస్తుంటాయి. ఈ బాండ్ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఇందులో పెట్టుబడిపై ఏటా 2.5 శాతం చొప్పున ఎనిమిదేళ్లపాటు వడ్డీని ఆర్బీఐ ప్రతి ఆరు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత బంగారం మార్కెట్ ధర ప్రకారం ఇన్వెస్టర్‌కు ఆర్బీఐ చెల్లింపులు చేస్తుంది. లాభంపై పన్ను లేకపోవడం, ఏటా 2.5 శాతం రాబడి వల్ల అన్నింటిలోకి ఇది మెరుగైన సాధనం అని చెప్పుకోవాలి. ఇక ఎస్‌జీబీపై ఏటా వచ్చే 2.5 శాతం వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. రిటర్నుల్లో ‘ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్’లో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎనిమిదేళ్ల పాటు పెట్టుబడి కొనసాగించినట్టయితే.. వచ్చే మూలధన లాభంపై పన్ను ఉండదు. మధ్యలోనే వైదొలిగితే లాభం పన్ను పరిధిలోకి వస్తుంది. ‘‘ఏడాదిలోపే విక్రయించినప్పుడు వచి్చన లాభాన్ని వార్షిక ఆదాయానికి కలిపి రిటర్నుల్లో చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత విక్రయించేట్టు అయితే లాభంపై 10 శాతం పన్ను చెల్లించాలి. లాభం నుంచి ద్రవ్యోల్బణాన్ని తీసేసే ఇండెక్సేషన్ ఎంపిక చేసుకుంటే కనుక 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది’’అని ఆర్ఎస్ఎం ఇండియా వ్యవస్థాపకుడు సురేష్ సురానా తెలిపారు. ఈ బాండ్‌కు ప్రభుత్వ హామీ ఉంటుంది. రాబడులు బంగారంపై పెట్టుబడి దీర్ఘకాలంలో డెట్ కంటే మెరుగైన రాబడే ఇచి్చనట్టు చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 20 ఏళ్లలో ఏటా 11 శాతం కాంపౌండెడ్ రాబడిని బంగారం ఇచి్చంది. ముందస్తు ఉపసంహరణ ఎలా? ఎస్జీబీ కాల వ్యవధి ఎనిమిదేళ్లు అయినప్పటికీ.. కోరుకుంటే ఆ లోపు కూడా విక్రయించుకోవచ్చు. కొనుగోలు చేసిన తేదీ నుంచి ఐదేళ్లు ముగిసిన తర్వాత ఆర్బీఐ ముందస్తు ఉపసంహరణకు వీలు కలి్పస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ అవకాశం ఉంటుంది. బంగారం బాండ్‌పై ఆరు నెలలకు ఒకసారి ఆర్బీఐ వడ్డీ చెలిస్తుందని చెప్పుకున్నాం కదా. ఆ వడ్డీ చెల్లింపు తేదీ నుంచి 21 రోజుల ముందు వరకు ఇన్వెస్టర్ తన వద్దనున్న బాండ్‌ను ఆర్బీఐకి ఇచ్చేయాలి. దీనిపై ఎలాంటి చార్జీలు ఉండవు. ఇక ఇన్వెస్ట్ చేసిన తేదీ నుంచి ఐదేళ్లలోపే బాండ్‌ను విక్రయించుకోవాలంటే.. ఉన్న ఏకైక మార్గం స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ లేదా బీఎస్ఈ). కాకపోతే స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో కొనుగోలుదారులు పరిమితంగా ఉంటుంటారు. లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కొనుగోలుదారు అందుబాటులో ఉంటే విక్రయించుకోవచ్చు. కాకపోతే డిమాండ్ తక్కువ కనుక మార్కెట్ రేటు కంటే తక్కువకే ఇక్కడ విక్రయాలు నమోదవుతుంటాయి. బంగారం బాండ్ భౌతిక రూపంలో ఉంటే దాన్ని డీమెటీరియలైజ్ చేసుకున్న తర్వాతే విక్రయించుకోవడం సాధ్యపడుతుంది. -
పసిడి ప్రియులకు శుభవార్త!.. మళ్ళీ రాదేమో ఈ అవకాశం..
గత కొన్ని రోజులుగా చాప కింద నీరులా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్క సారిగా తగ్గిపోయాయి. ఈ రోజు (జూన్ 8) గరిష్టంగా రూ. 2080 తగ్గి పసిడి కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా.. గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.65700 (22 క్యారెట్స్), రూ.71760 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు ఏకంగా రూ. 1900, రూ. 2080 తగ్గినట్లు తెలుస్తోంది.చెన్నైలో కూడా బంగారం ధరలు అమాంతం తగ్గిపోయాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 66500 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 72550 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. గోల్డ్ రేట్లు వరుసగా రూ. 1900, రూ. 2070 వరకు తగ్గినట్లు స్పష్టమవుతోంది.దేశ రాజధాని ఢిల్లీలో నేడు బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 1900, రూ. 2080 తగ్గింది. దీంతో నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 65850, కాగా 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71820గా ఉంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే వెండి కూడా భారీగా తగ్గింది. ఈ రోజు (జూన్ 8) కేజీ వెండి ధర రూ. 91500 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు ఏకంగా రూ. 4500 తక్కువని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే క్రమంగా పెరుగుతూ వెళ్లిన వెండి ధరలు కూడా ఒక్కసారిగా కిందకు పడ్డాయని స్పష్టమవుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
RBI Governor Shaktikanta Das: ఆర్థికాభివృద్ధి.. ధరల కట్టడే లక్ష్యం
ముంబై: అంతా ఊహించినట్లే రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను (రెపో) వరుసగా ఎనిమిదో సారీ యథాతథంగా ఉంచింది. ఇటు పటిష్టమైన వృద్ధి అటు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని 6.5 శాతం స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) వృద్ధి రేటు గతంలో భావించిన 7 శాతానికి మించి 7.2 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. అలాగే ద్రవ్యోల్బణం 4.5 శాతం స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి బుధవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఈ విషయాలు వెల్లడించారు. ఆగస్టు 8న తదుపరి పాలసీ ప్రకటన ఉంటుంది. వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది. ఎక్స్టర్నల్ సభ్యులు (ఆషిమా గోయల్, జయంత్ వర్మ) వీరిలో ఉన్నారు. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటే రెపో. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఈ రేటు య«థాతథంగా ఉంది.బల్క్ డిపాజిట్ల పరిమితి పెంపు బ్యాంకుల అసెట్ మేనేజ్మెంట్ను మెరుగుపర్చేందుకు తోడ్పడేలా బల్క్ ఫిక్సిడ్ డిపాజిట్ల ప్రారంభ పరిమితిని ఆర్బీఐ రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు పెంచింది. సాధారణంగా రిటైల్ టర్మ్ డిపాజిట్లతో పోలిస్తే బల్క్ ఎఫ్డీలపై బ్యాంకులు కొంత అధిక వడ్డీ రేటు ఇస్తాయి. పరిమితులను సవ రించడం సాధారణంగా జరిగేదేనని కొన్నేళ్ల క్రితం ఇది కోటి రూపాయలుగా ఉండేదని, తర్వాత రెండు కోట్లకు పెరిగిందని, తాజా పరిస్థితుల కు అనుగుణంగా దీన్ని రూ. 3 కోట్లకు పెంచామని డిప్యుటీ గవర్నర్ జె. స్వామినాథన్ తెలిపారు. యూపీఐ లైట్ వాలెట్లు, ఫాస్టాగ్‌లకు ఆటోలోడ్ సదుపాయం.. చిన్న మొత్తాలను డిజిటల్‌గా చెల్లించేందుకు ఉపయోగపడే యూపీఐ లైట్ వాలెట్లలో బ్యాలెన్స్ తగ్గినప్పుడల్లా ఆటోమేటిక్‌గా లోడ్ చేసుకునే సదుపాయాన్ని కస్టమర్లకు అందుబాటులోకి తేవాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇందుకోసం దీన్ని ఈ–మ్యాన్‌డేట్ ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. యూపీఐ లైట్ వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడగలదని దాస్ తెలిపారు. ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్సీఎంసీ)లను కూడా ఈ–మ్యాన్‌డేట్ పరిధిలోకి తేవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం యూపీఐ లైట్ రోజువారీపరిమితి రూ. 2,000గా ఉండగా, ఒకసారి గరిష్టంగా రూ. 500 వరకు మాత్రమే చేయడానికి వీలుంది. యూపీఐ లైట్ యాప్‌లో బ్యా లెన్స్ గరిష్టంగా రూ. 2,000కు మించరాదు.బ్యాంకుల సిస్టమ్ వైఫల్యాల వల్లే పేమెంట్స్ అంతరాయాలు.. చెల్లింపు లావాదేవీల్లో అంతరాయాలతో కస్టమర్లకు సమస్యలు ఎదురవడానికి కారణం బ్యాంకుల సిస్టమ్‌ల వైఫల్యమే తప్ప యూపీఐ, ఎన్‌పీసీఐలు కాదని దాస్ చెప్పారు. ప్రతి అంతరాయాన్ని కేంద్రీయ బ్యాంకులో సంబంధిత అధికారులు నిశితంగా అధ్యయనం చేస్తారని, ఈ విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) లేదా ఏకీకృత చెల్లింపుల విధానం ప్లాట్‌ఫాం లోపాలున్నట్లుగా ఏమీ వెల్లడి కాలేదని ఆయన తెలిపారు. టెక్నాలజీకి సంబంధించి బ్యాంకులు గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నాయన్నారు. -
వరుస లాభాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో దూసుకుపోతున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 468 పాయింట్లు పెరిగి 23,290 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1618 పాయింట్లు ఎగబాకి 76,693 వద్ద ముగిసింది. మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో దూసుకుపోయాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంగళవారం భారీగా కుప్పకూలిన స్టాక్‌మార్కెట్ సూచీలు వరుసగా లాభాలతో ట్రేడవుతున్నాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీలో భాగంగా కీలక వడ్డీరేట్లును యథాతథంగా ఉంచింది. భారత జీడీపీ అభివృద్ధిపై సానుకూలంగా స్పందించడంతో మార్కెట్లు శుక్రవారం భారీగా పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.సెన్సెక్స్ 30 సూచీలో ఎం అండ్ఎం, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, భారతీఎయిర్‌టెల్, టైటాన్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇలాగే కొనసాగితే బంగారం కొనడం కష్టమే!.. ఈ రోజు ధరలు చూశారా?
పసిడి ధరలు మళ్ళీ పైపైకి చేరుతున్నాయి. మొన్నటి వరకు స్వల్పంగా తగ్గుముఖం పట్టి కొనుగోలుదారులకు ఊరట కలిగించిన పసిడి మళ్ళీ షాకిచ్చింది. ఈ రోజు (జూన్ 7) కూడా గోల్డ్ రేటు పెరుగుదల దిశగా అడుగులు వేసింది. వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.67600 (22 క్యారెట్స్), రూ.73750 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 300, రూ. 330 పెరిగినట్లు తెలుస్తోంది.చెన్నైలో కూడా బంగారం ధరలు అమాంతం పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 68400 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 74620 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. గోల్డ్ రేట్లు వరుసగా రూ. 400, రూ. 440 వరకు పెరిగినట్లు స్పష్టమవుతోంది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు పెరిగాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 300, రూ. 330 పెరిగింది. దీంతో నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67750, కాగా 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 73900గా ఉంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే వెండి కూడా పెరిగింది. ఈ రోజు (జూన్ 7) కేజీ వెండి ధర రూ. 96000 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు ఏకంగా రూ. 2500 ఎక్కువని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే కేజీ వెండి ధర త్వరలో రూ. లక్షకు చేరుతుందని తెలుస్తోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
స్టాక్ మార్కెట్ కుంభకోణంలో మోదీ, షా: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్కుంభకోణంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రత్యక్షంగా భాగస్వాములయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటూ వారిచి్చన సలహాలు నమ్మి రిటైల్ ఇన్వెస్టర్లు రూ.30 లక్షల కోట్లు పోగొట్టుకున్నారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఫేక్’ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన రోజు స్టాక్ మార్కెట్ సూచీలు విపరీతంగా పెరిగిపోయాయని, ఈ నెల 4న ఎన్నికల అసలు ఫలితాలు వెల్లడయ్యాక సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో మోదీ, అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడారని, షేర్లు కొనాలంటూ ప్రజలకు సూచించారని చెప్పారు. స్టాక్ మార్కెట్లు, షేర్ల గురించి ప్రధానమంత్రి, హోంమంత్రి బహిరంగంగా మాట్లాడడం దేశంలో ఇదే మొదటిసారి అని గుర్తుచేశారు. ప్రధానమంత్రి, హోంమంత్రి చేసే పని స్టాక్ మార్కెట్ సలహాలు ఇవ్వడమేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఎందుకిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు లెక్క తప్పుతాయని బీజేపీ నేతలకు ముందే తెలుసని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 220 సీట్ల వరకు వచ్చే అకాశం ఉందని అంతర్గత అధికారిక సర్వేలో తేలిందన్నారు. 200 నుంచి 220 సీట్లు వస్తాయంటూ నిఘా సంస్థలు మోదీ ప్రభుత్వానికి నివేదించాయని తెలిపారు. ఇదంతా తెలిసి కూడా 5 కోట్ల కుటుంబాలకు పెట్టుబడి సలహాలు ఎందుకిచ్చారని మోదీ, అమిత్ షాపై రాహుల్ మండిపడ్డారు. రిటైల్ ఇన్వెస్టర్లను ముంచేశారు షేర్ల విలువను తారుమారు చేసిన ఆరోపణలపై సెబీ దర్యాప్తును ఎదుర్కొంటున్న బిజినెస్ గ్రూప్‌నకు చెందిన మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మోదీ, అమిత్ షా స్టాక్ మార్కెట్ పెట్టుబడి సలహాలను ఇచ్చారని రాహుల్ పేర్కొన్నారు. తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేసిన వారికి, బీజేపీకీ, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు ఒక్కరోజు ముందు పెట్టుబడి పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లకు మధ్య ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. దీని వెనుక భారీ కుట్ర ఉందన్నారు. మోదీ, అమిత్ షా సలహాలను విశ్వసించి పెట్టుబడిన పెట్టిన భారత రిటైల్ ఇన్వెస్టర్ల సంపదను కొందరు బడాబాబులు కాజేశారని ఆరోపించారు. ఇన్వెస్టర్లను ముంచేసి రూ.వేల కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. మోదీ, అమిత్ షాతోపాటు తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించిన వారిపై దర్యాప్తు జరపాలని రాహుల్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో రాహుల్ వెల్లడించిన ప్రకారం ఎప్పుడేం జరిగిందంటేమే 13: జూన్ 4 (ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే రోజు) కంటే ముందే షేర్లు కొనేసి పెట్టుకోండి అని అమిత్ షా సూచించారు. మే 19: జూన్ 4న స్టాక్ మార్కెట్ రికార్డులు బద్ధలవుతాయి. కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జూన్ 1: సార్వత్రిక ఎన్నికల్లో తుది దశ పోలింగ్ జరిగింది. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. జూన్ 3: కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం స్పష్టమైన మెజారీ్టతో అధికారంలోకి రాబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో పుంజుకుంది. సూచీలు ఆల్‌టైమ్ అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. జూన్ 4: ఓట్ల లెక్కింపు మొదలైంది. బీజేపీకి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం లేదని తేలింది. దాంతో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మార్కెట్లో పెట్టుబడి పెట్టిన చిన్నస్థాయి ఇన్వెస్టర్ల సంపద రూ.30 లక్షల కోట్ల మేర కరిగిపోయింది.పస లేని ఆరోపణలు పీయూష్ గోయల్ మండిపాటు స్టాక్ మార్కెట్లో అతిపెద్ద కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఖండించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురైన ఓటమిని తట్టుకోలేక ఇలాంటి పస లేని ఆరోపణలు చేస్తున్నారని రాహుల్‌పై మండిపడ్డారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించడానికి పెద్ద కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఇన్వెస్టర్లను దగా చేయొద్దని సూచించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత మన మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారులు అధిక రేట్ల వద్ద భారీగా షేర్లు కొన్నారని, వాటిని భారత ఇన్వెస్టర్లు విక్రయించి, లాభం పొందారని పీయూష్ గోయల్ వివరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.67 లక్షల కోట్లు ఉన్న స్టాక్ మార్కెట్ విలువ ఇప్పుడు రూ.415 లక్షల కోట్లకు చేరిందని గుర్తుచేశారు. దేశీయ, రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా లబ్ధి పొందారని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో స్టాక్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందిందన్నారు. మార్కెట్లో నమోదైన ప్రభుత్వ రంగ సంస్థల విలువ 4 రెట్లు పెరిగిపోయిందని పేర్కొన్నారు. మోదీ పాలనలో భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని గుర్తుచేశారు. -
రెండో రోజూ మార్కెట్ ర్యాలీ
ముంబై: అనిశి్చతికి తెరదించుతూ మూడోసారి బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టనుండటంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దౌడు తీశాయి. సెన్సెక్స్ 692 పాయింట్లు జంప్‌చేసింది. 75,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి 75,075 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 201 పాయింట్లు ఎగసి 22,821 వద్ద నిలిచింది. తొలుత ఒక దశలో గరిష్టంగా సెన్సెక్స్ 75,298కు చేరగా.. నిఫ్టీ 22,910ను తాకింది. వెరసి సెన్సెక్స్ 915 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్లు చొప్పున దూసుకెళ్లాయి. దీంతో బీజేపీకి మెజారిటీ లభించకపోవడంతో మంగళవారం నమోదైన రూ. 31 లక్షల కోట్ల మార్కెట్ విలువ నష్టంలో చాలావరకూ రికవరైంది. గత రెండు రోజుల్లో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 21 లక్షల కోట్లకుపైగా బలపడింది. ఫలి తంగా బీఎస్ఈ మార్కెట్ క్యాప్ దాదాపు రూ. 416 లక్షల కోట్లకు(4.98 ట్రిలియన్ డాలర్లు) చేరింది. నేటి ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టినేడు(శుక్రవారం) ఆర్బీఐ పాలసీ సమీక్ష నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో ఇకపై ఇన్వెస్టర్ల దృష్టి వడ్డీ రేట్లవైపు మళ్లనున్నట్లు మార్కెట్ నిపుణులు వివరించారు. కాగా.. రియలీ్ట, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్, ఐటీ, ఆయిల్, మెటల్ రంగాలు 5–1.5 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు హిందాల్కో, హీరోమోటో కార్ప్, ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్ఎం, నెస్లే, ఇండస్ఇండ్, సిప్లా, బ్రిటానియా 2.4–1% మధ్య నీరసించాయి.కాగా, బీఎస్ఈలో ట్రేడైన షేర్లలో 2,981 లాభపడితే.. కేవలం 878 నష్టపోయాయి. నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మరోసారి అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. రూ. 6,868 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీ ఫండ్స్ మాత్రం రూ. 3,718 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. గత 2 రోజుల్లో ఎఫ్‌పీఐలు రూ. 18,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసు కున్నారు.బీహెచ్ఈఎల్ 9% జంప్ అదానీ పవర్ రూ. 3,500 కోట్ల భారీ ఆర్డర్ నేపథ్యంలో బీహెచ్ఈఎల్ షేరు తాజాగా 9 శాతం జంప్‌చేసింది. రూ. 278 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 15% దూసుకెళ్లి రూ. 292ను అధిగమించింది. మార్కెట్ విలువ రూ. 7,974 కోట్లు బలపడి రూ. 96,854 కోట్లకు చేరింది. అదానీ షేర్లు జూమ్ వరుసగా రెండో రోజు అదానీ గ్రూప్ కౌంటర్లకు డిమాండ్ నెలకొంది. గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీలలో అదానీ పోర్ట్స్ స్వల్ప వెనకడుగు వేయగా.. ఎనర్జీ సొల్యూషన్స్, టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ, పవర్, విల్మర్, ఏసీసీ, ఎంటర్ప్రైజెస్, గ్రీన్ ఎనర్జీ, అంబుజా 5– 2 శాతం మధ్య ఎగశాయి. గ్రూప్ మార్కెట్ విలువ రూ. 17 లక్షల కోట్లను అధి గమించింది. -
వరుస లాభాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో దూసుకుపోతున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 231 పాయింట్లు పెరిగి 22,850 వద్దకు చేరింది. సెన్సెక్స్ 785 పాయింట్లు ఎగబాకి 75,168 వద్ద ముగిసింది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భారీగా పడిపోయిన మార్కెట్లు వరుసగా రెండో రోజు పుంజుకున్నాయి.సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, విప్రో, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, మారుతీసుజుకీ, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్‌గ్రిడ్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి చేరుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్ళీ ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి: నేటి కొత్త ధరలు ఇవే..
జూన్ ప్రారంభం నుంచి స్వల్ప తగ్గుదలను నమోదు చేసిన పసిడి ధరలు మళ్ళీ పుంజుకుంటున్నాయి. ఈ రోజు (జూన్ 6) కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 820 వరకు పెరిగింది. కాబట్టి నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.67300 (22 క్యారెట్స్), రూ.72110 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గాయి.చెన్నైలో కూడా బంగారం ధరలు రూ. 750 నుంచి రూ. 820 వరకు పెరిగాయి. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 68000 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 74180 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు ధరలు పెరిగాయని అవగతమవుతోంది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67450 (10 గ్రా), 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73570 (10 గ్రా) వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 770 పెరిగింది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా పెరిగాయి. నిన్న (జూన్ 6) రూ. 2300 తగ్గిన వెండి ధర.. ఈ రోజు (జూన్ 7) రూ. 1800 పెరిగింది. దీంతో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 93500లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 22,654కు చేరింది. సెన్సెక్స్ 251 పాయింట్లు ఎగబాకి 74,653 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.25 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 78.59 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.18 శాతం లాభపడింది. నాస్డాక్ 1.95 శాతం పెరిగింది.సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజున గత నాలుగేళ్లలోనే అత్యధిక స్థాయి పతనాన్ని చవిచూసిన స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. బీజేపీ కూటమి మరోసారి అధికారాన్ని చేపట్టే వీలుండటంతో సెంటిమెంటు బలపడింది. ఒక్కసారిగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఉపక్రమించడంతో ఇండెక్సులు లాభాల పరుగు అందుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) తాజాగా రూ.5,656 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్ రూ.4,555 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock market: మార్కెట్ యూటర్న్..
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఖరారు కావడంతో నేలక్కొట్టిన బంతిలా దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ను సాధించాయి. ఇన్వెస్టర్లు మూకుమ్మడిగా కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ ఇంట్రా డేలో 2,456 పాయింట్ల ‘పోల్’వాల్ట్ చేసింది. నిఫ్టీ సైతం 786 పాయింట్లు జంప్‌చేసింది. దీంతో సెన్సెక్స్ తిరిగి 74,530 పాయింట్లను అధిగమించగా.. నిఫ్టీ 22,670ను దాటేసింది. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 13 లక్షల కోట్లకుపైగా బలపడింది! ముంబై: సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజున గత నాలుగేళ్లలోనే అత్యధిక స్థాయి పతనాన్ని చవిచూసిన స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. బీజేపీ కూటమి మరోసారి అధికారాన్ని చేపట్టే వీలుండటంతో సెంటిమెంటు బలపడింది. ఒక్కసారిగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఉపక్రమించడంతో ఇండెక్సులు లాభాల పరుగు అందుకున్నాయి. సెన్సెక్స్ 2,303 పాయింట్లు జంప్‌చేసి 74,382 వద్ద నిలిచింది. నిఫ్టీ 736 పాయింట్లు పురోగమించి 22,620 వద్ద ముగిసింది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్కు రూ. 13.22 లక్షల కోట్లు జమయ్యింది. మొత్తం విలువ రూ. 408 లక్షల కోట్ల(4.89 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది!ఎఫ్‌పీఐ అమ్మకాలు బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 4.4%, 3% చొప్పున ఎగశా యి. కాగా.. నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) తాజాగా రూ. 5,656 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్ రూ. 4,555 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 12,436 కోట్లు, దేశీ ఫండ్స్ రూ. 3,319 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. దీంతో బీఎస్ఈ మా ర్కెట్ విలువలో రూ. 31 లక్షల కోట్లకుపైగా తగ్గింది. బ్లూ చిప్స్ దన్ను...ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 6–2 శాతం మధ్య ఎగశాయంటే కొనుగోళ్ల జోరును అర్ధం చేసుకోవచ్చు! ప్రధానంగా మెటల్, ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, కన్జూమర్ డ్యురబుల్స్ 4 శాతంపైగా బలపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీ దిగ్గజాలలో దాదాపు అన్ని షేర్లూ లాభపడ్డాయి. అదానీ షేర్లు అప్మార్కెట్ల బౌన్స్‌బ్యాక్‌తో ఒక్క అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ మినహా (–2.6%) అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలలో అత్యధికం మళ్లీ లాభపడ్డాయి. దీంతో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 15.57 లక్షల కోట్లను అధిగమించింది. మేలో ‘సేవలు’ పేలవంన్యూఢిల్లీ: భారత్ సేవల రంగం మేనెల్లో ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఏప్రిల్ నెల్లో 60.8 వద్ద ఉన్న హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మే లో 60.2కు తగ్గింది. కాగా, కొత్త ఎగుమతుల ఆర్డర్లు 10 సంవత్సరాల గరిష్టానికి చేరడం హర్షణీయ పరిణామం. -
ఎన్నికల ఫలితాలు తారుమారు.. భారీగా తగ్గిన అంబానీ, అదానీల సంపద
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అంచనాలు తారుమారయ్యాయి. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా క్రాష్ అయ్యాయి. దీంతో భారత చెందిన అదానీ ఎంటర్ ప్రైజెస్ అధినేత గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నికర సంపద భారీగా తగ్గింది.దేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. లోక్‌సభ ఫలితాలకు ముందు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగా.. బీజేపీ ఆ స్థాయిలో సీట్లులో రాణించకపోవడం.. అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడంతో స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. దీంతో అంబానీ, అదానీ నికర సంపద క్షీణించినట్లు తెలుస్తోంది. ముఖేష్ అంబానీ 8.99 బిలియన్ డాలర్ల సందప క్షీణించింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద 106 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు.గౌతమ్ అదానీ నికర విలువ ఒక్క రోజులో 24.9 బిలియన్ డాలర్లు పడిపోయింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బుధవారం నాటికి అయన సంపద 97.5 బిలియన్ డాలర్లుగా ఉంది. గౌతమ్ అదానీ ప్రస్తుతం ప్రపంచ సంపన్నుల జాబితాలో 15వ స్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ తర్వాత భారత్‌లో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.