Market
-
ఎన్నికల ఫలితాలు తారుమారు.. భారీగా తగ్గిన అంబానీ, అదానీల సంపద
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అంచనాలు తారుమారయ్యాయి. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా క్రాష్ అయ్యాయి. దీంతో భారత చెందిన అదానీ ఎంటర్ ప్రైజెస్ అధినేత గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నికర సంపద భారీగా తగ్గింది.దేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. లోక్‌సభ ఫలితాలకు ముందు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగా.. బీజేపీ ఆ స్థాయిలో సీట్లులో రాణించకపోవడం.. అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడంతో స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. దీంతో అంబానీ, అదానీ నికర సంపద క్షీణించినట్లు తెలుస్తోంది. ముఖేష్ అంబానీ 8.99 బిలియన్ డాలర్ల సందప క్షీణించింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద 106 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు.గౌతమ్ అదానీ నికర విలువ ఒక్క రోజులో 24.9 బిలియన్ డాలర్లు పడిపోయింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బుధవారం నాటికి అయన సంపద 97.5 బిలియన్ డాలర్లుగా ఉంది. గౌతమ్ అదానీ ప్రస్తుతం ప్రపంచ సంపన్నుల జాబితాలో 15వ స్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ తర్వాత భారత్‌లో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. -
భారీగా పుంజుకున్న స్టాక్‌మార్కెట్ సూచీలు.. 22,550 మార్కు దాటిన నిఫ్టీ
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీగా పుంజుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 688 పాయింట్లు పెరిగి 22,573 వద్దకు చేరింది. సెన్సెక్స్ 2156 పాయింట్లు ఎగబాకి 74,235 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో అత్యధికంగా ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌యూఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, విప్రో, ఐటీసీ, హెసీఎల్ టెక్నాలజీస్, నెస్లే, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, టైటాన్ స్టాక్‌లు పెరిగాయి.ఎన్డీఏ కూటమి కేంద్రంలో మరోసారి అధికారం చేపట్టనుందని స్పష్టమవడంతో ఈరోజు మార్కెట్లు భారీగా పెరిగాయి. జూన్ 8వ తేదీన సాయంత్రం దిల్లీలోని కర్తవ్యపథ్‌లో మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఫలితాలవేళ తీవ్ర ఒడిదొడుకులకు లోనైన మార్కెట్లు ఎలాగైనా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందనే స్పష్టమైన నిర్ణయంతో ఈరోజు సూచీలు భారీగా పుంజుకున్నట్లు తెలుస్తుంది.మార్కెట్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నవారు కంగారుపడకుండా మార్కెట్ సరళిని అవకాశంగా చూడాలని నిపుణులు చెబుతున్నారు. ఫండమెంటల్స్ బలంగా ఉన్న స్టాక్స్‌లో పెట్టుబడిపెట్టిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. మార్కెట్ పడిపోతున్న సమయంలో మరిన్ని స్టాక్‌లు కొనుగోలు చేయాలంటున్నారు. మంచి కంపెనీల్లో పెట్టుబడి పెట్టినవారు కొంతసమయం వేచిచూస్తే లాభాలు పొందవచ్చని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ అల్లకల్లోలం
లోక్‌సభ తాజా ఫలితాలలో ఎన్డీఏ 300 సీట్లకంటే తక్కువకు పరిమితం కానున్నట్లు స్పష్టమవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాలకు దిగారు. దీంతో సెన్సెక్స్ 6,234 పాయింట్లు, నిఫ్టీ 1,982 పాయింట్ల చొప్పున కుప్పకూలాయి. చివరికి కొంత కోలుకుని 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద సెన్సెక్స్ నిలిచింది. 1,379 పాయింట్లకు నిఫ్టీ నీళ్లొదులుకుని 21,885 వద్ద ముగిసింది.ఇది రెండు నెలల కనిష్టంకాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 70,234కు పడిపోయింది. వెరసి ఎగ్జిట్ పోల్స్ కారణంగా సోమవారం ఇన్వెస్టర్లకు అందిన 3 శాతం లాభాలు ఒక్క రోజు తిరగకుండానే ఆవిరయ్యాయి. అంతేకాకుండా రికార్డ్ గరిష్టాలు 76,469, 23,264 పాయింట్ల స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ గత నాలుగేళ్లలోలేని విధంగా భారీగా పతనమయ్యాయి! ఇంతక్రితం కోవిడ్–19 మహమ్మారి కట్టడికి కేంద్రం లాక్డౌన్ ప్రకటించడంతో దేశీ స్టాక్ మార్కెట్లు 2020 మార్చి 23న ఇంతకంటే అధికంగా 13 % కుప్పకూలిన సంగతి తెలిసిందే!! పీఎస్‌యూ షేర్లు ఫట్ మోడీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ప్రభుత్వ రంగ కౌంటర్లు తీవ్రంగా నష్టపోయాయి. ప్రధానంగా ఆర్ఈసీ 24 శాతం, పీఎఫ్సీ 22%, బీఈఎంఎల్, కంకార్, బీఈఎల్, బీహెచ్ఈఎల్ 19%, హెచ్ఏఎల్ 17%, ఓఎన్జీసీ, మజ్గావ్ డాక్ 16%, రైల్‌టెల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా 14%, ఆర్వీఎన్ఎల్ 13%, ఐఆర్సీటీసీ, పవర్‌గ్రిడ్, బీపీసీఎల్ 12% చొప్పున దిగజారాయి. ఇక పీఎస్‌యూ బ్యాంక్స్‌లో యూనియన్ బ్యాంక్, బీవోబీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఎస్బీఐ 18–13% మధ్య కుప్పకూలాయి. దీంతో పీఎస్ఈ ఇండెక్స్ 16%పైగా క్షీణించింది. ఎన్ఎస్ఈలో బ్యాంకెక్స్ 2022 ఫిబ్రవరి తదుపరి అత్యధికంగా 8% పతనమైంది. ఎదురీదిన ఎఫ్ఎంసీజీ.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, చమురు, రియలీ్ట, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ 15–6 శాతం మధ్య పతనమయ్యాయి. ఎఫ్ఎంసీజీ మాత్రం 1 శాతం బలపడింది. ప్రభుత్వేతర దిగ్గజాలలో ఎల్అండ్టీ, శ్రీరామ్ ఫైనాన్స్,టాటా స్టీల్, ఇండస్ఇండ్, హిందాల్కో, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ, భారతీ, యాక్సిస్ 16–7 శాతం మధ్య క్షీణించాయి. అయితే హెచ్‌యూఎల్, బ్రిటానియా, నెస్లే, హీరో మోటో, టాటా కన్జూమర్ 6–2 % మధ్య జంప్ చేశాయి.అదానీ గ్రూప్ బేర్.. అదానీ గ్రూప్ కౌంటర్లు భారీగా పతనమై ముందురోజు ఆర్జించిన లాభాలను పోగొట్టుకోవడంతోపాటు మరింత నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 21 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్ 20 శాతం దిగజారగా.. గ్రీన్ ఎనర్జీ, ఎంటర్ప్రైజెస్, టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ 19 శాతం, అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ 17 శాతం చొప్పున పతనమయ్యాయి. ఏసీసీ 15 శాతం, అదానీ విల్మర్ 10 శాతం పడ్డాయి. అత్యధిక శాతం షేర్లు కొనేవాళ్లులేక లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఫలితంగా గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు ఒక్క రోజులో రూ. 3.64 లక్షల కోట్లమేర కోతపడింది. రూ. 15.78 లక్షల కోట్లకు పరిమితమైంది. -
అంచనాలు తారుమారు..మార్కెట్లో బ్లడ్‌బాత్..రూ.30లక్షల కోట్లు ఆవిరి
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం భారీగా పడిపోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 1379 పాయింట్లు పడిపోయి 21,884 వద్దకు చేరింది. సెన్సెక్స్ 4389 పాయింట్లు దిగజారి 72,079 వద్ద ముగిసింది. చరిత్రలో ఎప్పడూలేని విధంగా మార్కెట్‌సమయంలో నిఫ్టీ దాదాపు ఒక్కరోజులో 8శాతం మేర తగ్గింది. చివరకు 5.92 శాతం నష్టంతో ముగిసింది. ఈ ఒక్కరోజు మదుపర్ల సంపద రూ.30లక్షల కోట్లు ఆవిరైంది.సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌యూఎల్, నెస్లే మినహా అన్ని స్టాక్‌లు నష్లాల్లో ముగిశాయి. భారీగా నష్టపోయిన స్టాక్ల్లో ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీఎయిర్‌టెల్ స్లాక్‌లున్నాయి.అదానీ స్టాక్స్‌లో అమ్మకాలు..ఎన్డీఏ కూటమికి అంచనాల ప్రకారం ఆధిక్యత రావడంలేదని మార్కెట్ వర్గాలు భావించాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 350 స్థానాలకు పైగా గెలుచుకుంటుందని.. 150 సీట్లకు కాస్త అటూఇటూగా ఇండియా కూటమి పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా కనిపిస్తున్నాయి. దాంతో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 19.80 శాతం, అదానీ పవర్ షేర్లు 19.76 శాతం, అంబుజా సిమెంట్స్ 19.20 శాతం పతనమయ్యాయి. అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 19.13 శాతం పడిపోయాయి.అంచనాలు తలకిందులు..స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే మార్కెట్లు పుంజుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకు భిన్నంగా ఫలితాలు వెలువడితే మాత్రం సూచీలు మరింత దిగజారే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. తిరిగి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రభుత్వరంగ సంస్థల్లో తీసుకున్న నిర్ణయాల్లో భారీ మార్పులు చేయవచ్చనే వాదనలున్నాయి. మరోవైపు అంచనాలకు భిన్నంగా ఇండియా కూటమి పుంజుకోవడంతో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మదుపర్ల అంచనాలు తప్పాయి.ఇప్పుడేం చేయాలి..మార్కెట్లు ఇంతలాపడుతుంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నవారు కంగారుపడిపోకుండా దీన్నో అవకాశంగా చూడాలని నిపుణులు చెబుతున్నారు. ఫండమెంటల్స్ బలంగా ఉన్న స్టాక్స్‌లో పెట్టుబడిపెట్టిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఇలా మార్కెట్ పడిపోతున్న సమయంలో మరిన్ని స్టాక్‌లు కొనుగోలు చేయాలంటున్నారు. గతంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఆరు నెలల వ్యవధిలో మార్కెట్లు పడిపోయిన దానికంటే చాలా పాయింట్లు పెరిగినట్లు రుజువైంది. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందకుండా మంచి కంపెనీల్లో పెట్టుబడి పెట్టినవారు కొంతసమయం వేచిచూస్తే లాభాలు పొందవచ్చని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మధ్యాహ్నం వరకే రూ.35లక్షల కోట్లు ఆవిరి..స్టాక్‌మార్కెట్‌పై బేర్ పంజా!
స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం కుప్పకూలాయి. ఈ ఒక్కరోజు మధ్యాహ్నం వరకు మదుపర్ల సంపద దాదాపు రూ.35లక్షలకోట్లమేర ఆవిరైంది. ఎగ్జిట్‌పోల్ అంచనాలు తప్పడంతో స్టాక్‌మార్కెట్లు రికార్డు స్థాయి నుంచి భారీగా పడిపోయాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ఒక్కరోజు నష్టం నమోదైంది. సోమవారం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తెచ్చిన హుషారు మంగళవారం కొన్ని గంటల వ్యవధిలోనే ఆవిరైంది.మధ్యాహ్నం 12:47 సమయానికి నిఫ్టీ 1466 పాయింట్లు నష్టపోయి 21,797 వద్దకు చేరింది. సెన్సెక్స్ 4514 పాయింట్లు దిగజారి 71,891 వద్ద ట్రేడవుతోంది.ఎన్డీయే కూటమి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు ప్రస్తుతానికి సమాచారం మెజారిటీ మార్కుతో పోలిస్తే భారీ వ్యత్యాసం లేకపోవడంతో మార్కెట్లు కుప్పకూలాయి. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే మార్కెట్లు పుంజుకునే అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా ఫలితాలు వెలువడితే మాత్రం సూచీలు మరింత దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తిరిగి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రభుత్వరంగ సంస్థల్లో తీసుకున్న నిర్ణయాల్లో భారీ మార్పులు చేయవచ్చనే వాదనలున్నాయి. మరోవైపు అంచనాలకు భిన్నంగా ఇండియా కూటమి పుంజుకోవడంతో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మదుపర్ల అంచనాలు తప్పాయి. -
పెరిగిన బంగారం, వెండి ధర.. ఎంతో తెలుసా..?
ఈక్విటీమార్కెట్లు మంగళవారం భారీగా పడిపోయాయి. దాంతో బంగారం ధరలు పుంజుకున్నాయి. స్థిరప్రభుత్వం ఏర్పడదేమోననే భయాలు మార్కెట్లను కుంగదీశాయి. దాంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీమార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు బంగారం ధరలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,800 (22 క్యారెట్స్), రూ.72,870 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.700, రూ.760 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.790, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.860 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,450 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.73,580 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.66,950.. 24 క్యారెట్ల ధర రూ.73,020కు చేరాయి. మార్కెట్లో కేజీ వెండి ధర ఏకంగా రూ.1200 పెరిగి రూ.98,500కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
సెబీ నుంచి అప్డేటెడ్ మొబైల్ యాప్ సారథి2.0
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పర్సనల్ ఫైనాన్స్‌పై విస్తృత సమాచారంతో సారథి2.0(Saarthi2.0) మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. ఇన్వెస్టర్లకు ఉద్దేశించిన ఈ యాప్‌లో సమీకృత టూల్స్‌కు చోటు కలి్పంచింది. సంక్లిష్టమైన ఫైనాన్షియల్ కాన్సెప్్ట్సను సరళతరం చేయడమే లక్ష్యంగా అప్డేటెడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టినట్లు సెబీ పేర్కొంది. వినియోగదారులకు సులభరీతిలో అర్ధమయ్యే విధంగా సమాచారాన్ని క్రోడీకరించినట్లు తెలియజేసింది. యాప్‌లో ఫైనాన్షియల్ కాల్క్యులేటర్లు, కేవైసీ విధానాలు వివరించే మాడ్యూల్స్, ఎంఎఫ్‌లు, ఈటీఎఫ్లతోపాటు స్టాక్ ఎక్సే్ఛంజీలలో షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు, ఇన్వెస్టర్ల సమస్యల పరిష్కార విధానాలు తదితర పలు అంశాలను చేర్చినట్లు వివరించింది. -
ఎగ్జిట్ పోల్ జోష్.. కుమ్మేసిన బుల్స్
ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు కానుందని వెలువడిన ఎగ్జిట్ పోల్ అంచనాలతో మార్కెట్ కొత్త శిఖరాలకు పరుగులు తీసింది. ఎన్డీఏ భారీ మెజారిటీని సాధించనుందన్న అంచనా కొనుగోళ్ల జోరుకు దారిచూపింది. ఒక్కసారిగా ఊపందుకున్న పెట్టుబడులతో స్టాక్ బుల్ లాభాలతో కుమ్మేసింది. దీంతో సెన్సెక్స్ 2,507 పాయింట్ల(3.5 శాతం) పోల్‌వాల్ట్ చేసింది. 76,469 వద్ద ముగిసింది. నిఫ్టీ 733 పాయింట్లు(3.3 శాతం) ఎగసి 23,264 వద్ద స్థిరపడింది, బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభాలతో ముగిశాయి. గతంలో 2021 ఫిబ్రవరి 1న బడ్జెట్ రోజున సెన్సెక్స్, నిఫ్టీ 5 శాతం చొప్పున జంప్ చేశాయి. అంతక్రితం అంటే 2019 మే 20న సైతం ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి రెండోసారి విజయాన్ని అంచనా వేయడంతో మార్కెట్లు 3 శాతానికిపైగా పురోగమించాయి. ఇంట్రాడేలోనూ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డు గరిష్టాలకు చేరాయి.సంపదే సంపదమార్కెట్లు కదం తొక్కడంతో ఒకే ఒక్క రోజులో స్టాక్ ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ. 13.78 లక్షల కోట్లు పెరిగింది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 426 లక్షల కోట్లకు చేరింది. వెరసి సరికొత్త రికార్డ్ 5.13 ట్రిలియన్ డాలర్లను తాకింది. ఈ బాటలో ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ సైతం 5.09 లక్షల కోట్ల డాలర్ల(రూ. 422.48 లక్షల కోట్లు)కు చేరింది. స్పష్టమైన మెజారిటీతో వరుసగా మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకానుండటంతోపాటు.. గతేడాది(2023–24) దేశ జీడీపీ ప్రపంచ దేశాలలోనే అత్యధికంగా 8.2 శాతం వృద్ధిని సాధించడం ఇన్వెస్టర్లకు ఎనలేని ప్రోత్సాహాన్నిచ్చినట్లు విశ్లేషణ.రిలయన్స్ భళా..సెన్సెక్స్ 30 షేర్లలో 25 కౌంటర్లు భారీ లాభాలతో నిలవగా.. కేవలం సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, ఇన్ఫోసిస్ నామమాత్రంగా డీలా పడ్డాయి. వీటితోపాటు ఇక నిఫ్టీ 50లో ఐషర్, ఎల్టీఐఎం, బ్రిటానియా స్వల్ప వెనకడుగు వేశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, రియలీ్ట, ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్, మీడియా, ఆటో 7–2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. హెవీవెయిట్ షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 6 శాతం జంప్‌చేసి మార్కెట్లకు దన్నునిచ్చింది. రూ. 3,021కు చేరడం ద్వారా రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువను జమ చేసుకుంది. దీంతో మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 20.44 లక్షల కోట్లను దాటింది. షేరు తొలుత రూ. 3,029 వద్ద రికార్డ్ గరిష్టానికి చేరింది. ప్రభుత్వ షేర్ల పరుగుతాజా ర్యాలీలో పలు ప్రభుత్వ రంగ కౌంటర్లు లాభాల పరుగు తీశాయి. దీంతో ఎస్బీఐ, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, ఓఎన్జీసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా 9.5–4.5 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఇతర బ్లూచిప్స్‌లో శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం, అ్రల్టాటెక్, ఇండస్ఇండ్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ త్రయం, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గ్రాసిమ్, కొటక్ బ్యాంక్ 7–2.5 శాతం మధ్య ఎగశాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌లో బీవోబీ, ఎస్బీఐ, కెనరా బ్యాంక్ ఒక దశలో 52 వారాల గరిష్టాలకు చేరాయి. పీఎస్‌యూగా ఎస్బీఐ తొలిసారి రూ. 8 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించడం విశేషం!విదేశీ పెట్టుబడుల జోరు బీఎస్ఈ నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లుతాజాగా రూ. 6,851 కోట్ల పెట్టుబడులను పంప్ చేశారు. డీఐఐలు సైతం రూ. 1,914 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. గత వారాంతాన సైతం ఎఫ్‌పీఐలు రూ. 1,613 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. బీఎస్ఈ సూచీలలో మిడ్ క్యాప్ 3.5 శాతం, స్మాల్ క్యాప్ 2 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,346 లాభపడితే.. 1,615 మాత్రమే నష్టపోయాయి.అదానీ షేర్ల మెరుపులుప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న అంచనాలకుతోడు, జఫరీస్ బ్రోకింగ్ బయ్ రేటింగ్‌తో తాజాగా అదానీ గ్రూప్ కౌంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో గ్రూప్‌లోని అన్ని లిస్టెడ్ షేర్లు 4% నుంచి 16% వరకు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ఫలితంగా గ్రూప్‌లోని మొ త్తం 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 19.42 లక్షల కోట్లను అధిగమించింది.రూపాయి ర్యాలీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ మెజారిటీపై అంచనాలతో స్టాక్ మార్కెట్లతోపాటు దేశీ కరెన్సీ సైతం జోరందుకుంది. దీంతో డాలరుతో మారకంలో రూపాయి 28 పైసలు బలపడింది. తద్వారా 2023 నవంబర్ 15 తదుపరి(24 పైసలు) ఒకే రోజు రూపాయి అత్యధికంగా పుంజుకుంది. వెరసి రెండు నెలల గరిష్టం 83.14 వద్ద ముగిసింది. ఇంతక్రితం మార్చి 21న 83.13 వద్ద నిలిచింది. ఉత్పత్తిని యథాతథంగా కొనసాగించే ఒపెక్ నిర్ణయంతో చమురు ధరలు బలహీనపడటం సైతం రూపాయికి ప్రోత్సాహాన్నిచి్చనట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి తొలుత 83.09 వద్ద హుషారుగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82.95 వద్ద గరిష్టాన్ని తాకగా.. 83.17 వద్ద కనిష్టానికీ చేరింది. చివరికి 83.14 వద్ద స్థిరపడింది. వారాంతాన రూపాయి 13 పైసలు నీరసించి 83.42 వద్ద నిలిచిన సంగతి తెలిసిందే. స్టాక్స్‌లో విదేశీ పెట్టుబడులు, జీడీపీ, జీఎస్టీ గణాంకాలు సైతం రూపాయికి దన్నునిచి్చనట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
పసిడి ప్రియులకు శుభవార్త!.. మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు
జూన్ 1 నుంచి తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. ఈ రోజు (జూన్ 3) కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. కాబట్టి నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66100 (22 క్యారెట్స్), రూ.72110 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గాయి.చెన్నైలో కూడా బంగారం ధరలు రూ. 440 నుంచి రూ. 480 వరకు తగ్గాయి. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 66660 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 72720 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు ధరలు కొంత తగ్గినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66250 (10 గ్రా), 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72260 (10 గ్రా) వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గినట్లు తెలుస్తోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా గత నాలుగు రోజుల నుంచి తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు ఒక కేజీ వెండి ధర రూ. 700 తగ్గింది. కాబట్టి రూ. 93500 వద్ద ఉన్న వెండి రూ. 92800లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
తగ్గిన చమురు ధరలు.. ఒపెక్‌ప్లస్ కూటమి ప్రభావం
ముడిచమురు ఉత్పత్తిలో కోతలను వాయిదావేసేలా ఎనిమిది ఒపెక్ ప్లస్ దేశాలు ప్రణాళికలు సూచించాయి. దాంతో బ్రెంట్, వెస్ట్‌టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యూటీఐ) ఫ్యూచర్ ఇండెక్స్‌లపై ప్రభావం పడింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పడిపోయాయి.బ్రెంట్ ఫ్యూచర్స్ 24 పాయింట్లు లేదా 0.3% తగ్గి బ్యారెల్ చమురు ధర 80.87 అమెరికన్ డాలర్లకు చేరుకుంది. జులై నెల డెలివరీ కోసం యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ ఫ్యూచర్స్ 19 పాయింట్లు లేదా 0.25% పడిపోయి 76.80 అమెరికన్ డాలర్లకు చేరింది. (బ్రెంట్ ఫ్యూచర్లు, డబ్ల్యూటీఐ ద్వారా ప్రపంచమార్కెట్లో క్రూడాయిల్ ఇండెక్స్‌లో ట్రేడింగ్ చేయవచ్చు)పెట్రోలియం ఎగుమతి చేసే అజర్బైజాన్, బెహ్రెయిన్, బ్రూనై, మలేషియా, రష్యా, ఒమన్, సౌత్‌సుడాన్..వంటి దేశాల కూటమి ఒపెక్ ప్లస్ సమావేశం ఆదివారం నిర్వహించారు. 2025 వరకు ఉత్పత్తి కోతలను పొడిగించేందుకు కొన్ని దేశాలు నిరాకరించాయి. దాంతో సోమవారం క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి.ప్రస్తుతం ఒపెక్‌ప్లస్ దేశాలు రోజుకు 58.6 లక్షల బ్యారెల్స్ (బీపీడీ) చమురు ఉత్పత్తిని తగ్గించాయి. ఇది ప్రపంచ డిమాండ్‌లో 5.7%గా ఉంది. ఎనిమిది సభ్యదేశాలు గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం..2024 చివరి నాటికి 36.6 లక్షల బ్యారెల్స్, జూన్ 2024 చివరి నాటికి 22 లక్షల బ్యారెల్స్ చమురు ఉత్పత్తిపై స్వచ్ఛంద కోతలు విధించాయి. వాటిపై నిర్ణయం తీసుకునేలా ఇటీవల సమావేశం జరిగింది. ఇందులో 2025 చివరి వరకు 3.66 మిలియన్ బీపీడీ కోతలను పొడిగించడానికి కూటమి అంగీకరించింది. 22 లక్షల బీపీడీ కోతలను 2024 సెప్టెంబర్ చివరి వరకు మూడు నెలల పాటు పొడిగించింది.అయితే ఎనిమిది ఒపెక్ + దేశాలు అక్టోబర్ 2024 నుంచి సెప్టెంబరు 2025 వరకు 22 లక్షల బీపీడీ చమురు కోతలను క్రమంగా ఉపసంహరించుకునే ప్రణాళికలను సూచించాయి. సెప్టెంబర్ 2024 వరకు కోతలను పొడిగించనప్పటికీ భవిష్యత్తులో చమురు కోతలుండవని భావించి సోమవారం ధరలు పతనమయ్యాయి. -
lok sabha exit poll 2024: మార్కెట్లకు ఫలితాల జోష్!
న్యూఢిల్లీ: ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్‌నివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే శనివారం(1న) వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో అధికార బీజేపీ అధ్యక్షతన ఏర్పాటైన ఎన్డీఏ భారీ విజయా న్ని సాధించనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. దీంతో మంగళవారం(4న) వెలువడనున్న లోక్‌సభ ఫలితాలలో తిరిగి బీజేపీ కూటమి అధికారాన్ని అందుకుంటుందన్న అంచనాలు బలపడినట్లు రాజకీయ వర్గాలు తెలియజేశాయి. వరుసగా మూడో సారి భారీ మెజారిటీతో నరేంద్ర మోడీ ప్రధాని పదవిని చేపట్టే వీలున్నట్లు పేర్కొన్నాయి. వెరసి స్టాక్ మార్కెట్లలో ప్రోత్సాహకర సెంటిమెంటుకు తెరలేవనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రభావంతో నేడు(3న) మార్కెట్లు జోరు చూపే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు.అయితే 4న ప్రకటించనున్న వాస్తవిక ఫలితాలు భిన్నంగా వెలు వడితే.. మార్కెట్లలో దిద్దుబాటుకూ అవకాశమున్న ట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలియజేశారు. కాగా.. గత వారం సెన్సెక్స్ చరిత్రాత్మక గరిష్టం 76,010కు, నిఫ్టీ 23,111కు చేరినప్పటికీ సెన్సెక్స్ 1,449 పాయింట్లు(1.9 శాతం) కోల్పోయి, నిఫ్టీ 426 పాయింట్లు(1.9 శాతం) పతనమై ముగిశాయి. ఈ బాటలో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ సైతం 1.5 శాతం చొప్పున డీలా పడ్డాయి. జీడీపీ దన్ను గత వారాంతాన వెలువడిన జీడీపీ గణాంకాలు సైతం ఇన్వెస్టర్లకు జోష్‌నివ్వనున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో ఆర్థిక వ్యవస్థ 7.4 శాతం పురోగతిని సాధించగా.. పూర్తి ఏడాదికి అంచనాలను మించుతూ 8.2 శాతం వృద్ధి చూపింది. ప్రోత్సాహకర ఎగ్జిట్ పోల్స్, జీడీపీ గణాంకాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) సైతం కొనుగోళ్లకు ఆసక్తి చూపే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. ఎగ్జిట్ పోల్స్ పరిధిలోనే వాస్తవిక ఫలితాలు సైతం వెలువడితే.. రాజకీయ, పాలసీ కొనసాగింపుపై ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనలకు చెక్ పడుతుందని ఎమ్కే రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. రెపో యథాతథం లోక్‌సభ ఫలితాల తదుపరి దేశీ స్టాక్ మార్కెట్లను శుక్రవారం(7న) వెలువడనున్న ఆర్బీఐ పాలసీ సమీక్షా నిర్ణయాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 5న ప్రారంభంకానున్న ఆర్బీఐ పాలసీ సమావేశం 7న ముగియనుంది. 2024 ఏప్రిల్‌లో నిర్వహించిన పాలసీ సమీక్షలో ఆర్బీఐ కమిటీ వరుసగా ఏడోసారి వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగించేందుకే నిర్ణయించింది. ఇక ఈ వారంలో మే నెలకు తయారీ(3న), సరీ్వసెస్ పీఎంఐ(5న) గణాంకాలు వెలువడనున్నాయి. చైనా, యూఎస్ తయారీ, ఉపాధి గణాంకాలు సైతం 3, 5న వెల్లడికానున్నాయి. వీటికితోడు ఎఫ్ఐఐల పెట్టుబడుల తీరు, విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయగలవని మార్కెట్ నిపుణులు ప్రస్తావించారు. -
రిస్క్ లు తెలుసుకోకుండానే ఎఫ్‌అండ్‌వోలోకి
న్యూఢిల్లీ: సత్వర లాభాలపై ఆశలు, స్పెక్యులేటివ్ ధోరణులే రిటైల్ ఇన్వెస్టర్లను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) సెగ్మెంట్ వైపు ఆకర్షిస్తున్నాయి. దీంతో వారు రిస్క్ ల గురించి ఆలోచించకుండా ట్రేడింగ్‌లోకి దూకి, చేతులు కాల్చుకుంటున్నారు. అలా జరగకుండా ఎఫ్‌అండ్‌వోపై పూర్తి అవగాహన పెంచుకుని, రిస్క్ లను ఎలా ఎదుర్కొనాలనేది తెలుసుకుని మాత్రమే ఇందులోకి అడుగుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. రిస్క్ లతో కూడుకున్న ఎఫ్‌అండ్‌వో విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేస్తుండటంపై కొన్నాళ్ల క్రితం ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ మాధవిపురి బచ్ తదితరులు ఈ సాధనం విషయంలో జాగ్రత్త వహించాలని కూడా సూచించారు. అయినప్పటికీ ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ భారీగా పెరుగుతూనే ఉంది. 2019లో ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్ నెలవారీ టర్నోవరు 8,740 లక్షల కోట్లుగా ఉండేది. ఇది 2024 మార్చి నాటికి ఏకంగా రూ. 217 లక్షల కోట్లకు ఎగిసింది. సెబీ అధ్యయనం ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరం ఈక్విటీ ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో వ్యక్తిగత ట్రేడర్లలో 89 శాతం మంది నష్టపోయారు. నష్టాలు సగటున రూ. 1.1 లక్షలుగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నిపుణుల సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ అనేది హెడ్జింగ్, స్పెక్యులేషన్ కోసం ఉపయోగకరంగా ఉంటుందని, కానీ అధిక స్థాయిలో మార్జిన్లు అవసరమవుతాయి కాబట్టి రిస్క్ లు కూడా ఎక్కువగా ఉంటాయని ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఫైయర్స్ సహ–వ్యవస్థాపకుడు తేజస్ ఖోడే చెప్పారు. వీటి వల్ల చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కాబట్టి ఈ సాధనాలు, వాటిలో ఉండే రిసు్కల గురించి రిటైల్ ఇన్వెస్టర్లు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయడం మంచిదని సూచించారు. ‘ఈ సాధనాలకు అవసరమైన పెట్టుబడి తక్కువగానే ఉండటం, వివిధ సూచీల్లో వీక్లీ ఎక్స్‌పైరీలు కూడా అందుబాటులోకి రావడంతో ఇన్వెస్టర్లు భారీగా పెరిగారు. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లకు రిస్క్ లు కూడా పెరిగాయి‘ అని ఆనంద్ రాఠీ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు ప్రదీప్ గుప్తా చెప్పారు. -
తగ్గిన బంగారం, వెండి ధర.. ఎంతో తెలుసా..?
ఈక్విటీమార్కెట్లు ఇటీవల భారీగా పడిపోయాయి. దాంతో బంగారం ధరలు పుంజుకున్నాయి. శుక్రవారం మార్కెట్లో స్టాక్‌సూచీలు తీవ్రఒడిదుడుకులతో చివరకు స్వల్పలాభాలతో ముగిశాయి. దాంతో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వివిధ ప్రాంతాల్లో శనివారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,500 (22 క్యారెట్స్), రూ.72,550 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. శుక్రవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.200, రూ.210 తగ్గింది.చెన్నైలో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.73,200 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.66,650.. 24 క్యారెట్ల ధర రూ.72,700కు చేరాయి. మార్కెట్లో శనివారం కేజీ వెండి ధర ఏకంగా రూ.2000 తగ్గి రూ.98,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గతేడాది ఎఫ్‌డీఐలు డీలా
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) 3.5 శాతం క్షీణించాయి. 44.42 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రధానంగా సరీ్వసెస్, కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, టెలికం, ఆటో, ఫార్మా రంగాలకు పెట్టుబడులు తగ్గడం ప్రభావం చూపింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022–23లో 46.03 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు లభించాయి. అయితే గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో మాత్రం 33 శాతంపైగా జంప్ చేశాయి. 12.38 బిలియన్ డాలర్లు ప్రవహించాయి. అంతక్రితం క్యూ4లో ఇవి 9.28 బిలియన్ డాలర్లు మాత్రమే. ఈక్విటీ పెట్టుబడులు, లాభార్జన, ఇతర మూలధనంతో కూడిన మొత్తం ఎఫ్‌డీఐలను పరిగణిస్తే గతేడాది నామమాత్రంగా 1 శాతం నీరసించి 70.95 బిలియన్ డాలర్లను తాకాయి. 2022–23లో ఇవి 71.35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) వివరాల ప్రకారం 2021–22లో దేశ చరిత్రలోనే అత్యధికంగా 84.83 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు లభించాయి.రంగాల వారీగా..గతేడాది మారిషస్, సింగపూర్, యూఎస్, యూఏఈ, కేమన్ ఐలండ్స్, జర్మనీ, సైప్రస్ తదితర ప్రధాన దేశాల నుంచి విదేశీ పెట్టుబడులు నీరసించాయి. అయితే నెదర్లాండ్స్, జపాన్ నుంచి ఎఫ్‌డీఐలు పుంజుకోవడం గమనార్హం! ఇక రంగాలవారీగా చూస్తే సర్వీసెస్, కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, ట్రేడింగ్, టెలికం, ఆటోమొబైల్, ఫార్మా, కెమికల్స్‌కు పెట్టుబడులు తగ్గాయి. మరోపక్క నిర్మాణ రంగ(మౌలిక సదుపాయాలు) కార్యకలాపాలు, అభివృద్ధి, విద్యుత్ రంగాలు అధిక పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. గతేడాది మహారాష్ట్ర అత్యధికంగా 15.1 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలను అందుకోగా.. గుజరాత్‌కు 7.3 బి.డా. లభించాయి. 2022–23లో ఇవి వరుసగా 14.8 బి.డా, 4.7 బి.డాలర్లుగా నమోదయ్యాయి. -
పెద్ద కంపెనీలకు వెళ్లిపోదాం..
చెన్నై: అంకుర సంస్థల్లో పని చేసే వారిలో చాలా మంది పెద్ద కంపెనీలకు మారితే బాగుంటుందని భావిస్తున్నారు. ఉద్యోగ భద్రత, మెరుగైన జీతం, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు వారికి ఆకర్షణీయంగా ఉంటున్నాయి. మానవ వనరుల సేవల సంస్థ సీఐఈఎల్ హెచ్ఆర్ సరీ్వసెస్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న స్టార్టప్స్ ఉద్యోగుల్లో 67 శాతం మంది ఈ మేరకు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సర్వే నివేదిక ప్రకారం స్టార్టప్ రంగంలో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) అత్యధికంగా ఉంటోంది. ఉద్యోగి పనిచేసే సగటు వ్యవధి 2–3 ఏళ్లు మాత్రమే ఉంటోంది. స్టార్టప్ రంగంలో పనిచేసే వారిలో అత్యధిక శాతం మంది ఉద్యోగ భద్రతకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే ఇప్పటికే నిలదొక్కుకున్న కంపెనీల వైపు చూస్తున్నారు. ఇక 30 శాతం మంది మెరుగైన జీతభత్యాలు ఇందుకు కారణంగా తెలిపారు. 25 శాతం మంది స్టార్టప్‌లలో ఉద్యోగం–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం ఉండటం లేదని అందుకే పేరొందిన సంస్థల్లోకి మారాలని భావిస్తున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా సుమారు 70 స్టార్టప్‌లకు చెందిన 1,30,896 మంది ఉద్యోగులపై ఈ సర్వే నిర్వహించారు. హైరింగ్ ప్రణాళికల్లో అంకురాలు..‘కొత్త ఆవిష్కరణలు, ఉపాధికి ఊతమివ్వడంలో స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 65 శాతం కంపెనీలు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరిపే యోచనలో ఉన్నాయి. దీంతో స్టార్టప్ వ్యవస్థ భవిష్యత్తు ఆశావహంగా కనిపిస్తోంది‘ అని సీఐఈఎల్ హెచ్ఆర్ సరీ్వసెస్ ఎండీ ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. అయితే, ఉద్యోగులు వెళ్లిపోకుండా తగు చర్యలు తీసుకోవడంపై అంకుర సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగుల కెరియర్ పురోగతికి అవకాశాలుకల్పించడం, వర్క్–లైఫ్ బ్యాలెన్స్ ఉండేలా చూడటం మొదలైనవి చేయాలని పేర్కొన్నారు. తద్వారా ఉద్యోగులకు స్టార్టప్‌లపై నమ్మకం పెరుగుతుందని, అట్రిషన్ తగ్గగలదని మిశ్రా వివరించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, మెరుగైన మానవ వనరుల విధానాలు ఉన్న అంకురాలు.. అట్రిషన్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఆకర్షణీయమైన ప్యాకేజీలు, రిమోట్ పని విధానాలు, భారీ స్టాక్ ఆప్షన్స్ స్కీములు మొదలైనవి అందిస్తున్నాయి. రిపోర్టు ప్రకారం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి అత్యధిక డిమాండ్ ఉంటోంది. ఆ తర్వాత సేల్స్, ప్రీ–సేల్స్, రిటైల్ వంటి ఉద్యోగాలు ఉంటున్నాయి. -
అయిదు రోజుల అమ్మకాలకు బ్రేక్
ముంబై: దేశీయ జీడీపీ గణాంకాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు సానుకూలంగా స్పందించడంతో స్టాక్ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. నేడు(శనివారం) ఎగ్జిట్ పోల్స్, వచ్చే మంగళవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అప్రమత్తత కొనసాగింది. ఫలితంగా సెన్సెక్స్ 76 పాయింట్లు పెరిగి 73,961 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 42 పాయింట్లు బలపడి 22,530 వద్ద నిలిచింది. దీంతో సూచీల అయిదురోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇటీవల వరుస పతనంలో భాగంగా కనిష్టాలకు దిగివచి్చన బ్యాంకులు, ఫైనాన్స్, మెటల్ ఇంధన, కన్జూమర్, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 593 పాయింట్లు బలపడి 74,479 వద్ద, నిఫ్టీ 165 పాయింట్లు పెరిగి 22,654 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. నెలాఖరున డాలర్లకు డిమాండ్ పెరగడంతో దేశీయ కరెన్సీ ఆరంభ నష్టాలు కోల్పోయింది. అమెరికా బ్రోకేరేజ్ సంస్థ జెప్ఫారీస్ ‘బై’ రేటింగ్‌తో అదానీ షేర్లు భారీగా పెరిగాయి. డాలర్ మారకంలో 13 పైసలు బలహీనపడింది 83.42 స్థాయి వద్ద స్థిరపడింది. -
లాభాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్ 550 పాయింట్ల లాభంతో 74436 వద్ద నిఫ్టీ 155 పాయింట్ల లాభంతో 22644 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.అదానీ ఎంటర్ ప్రైజెస్,లార్సెన్, అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్ సర్వీ, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా.. ఇన్ఫోసిస్, ఎల్టీఐ మైండ్ ట్రీ, భారతీ ఎయిర్టెల్,సిప్లా, టాటా కాన్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఎథేర్ మోటార్స్ కొటక్ మహీంద్రా, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. -
వెండే బంగారమాయెగా..
న్యూఢిల్లీ: వెండి ధర దేశంలో సరికొత్త రికార్డులను చూస్తోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో కేజీ ధర క్రితం ముగింపుతో పోల్చితే బుధవారం రూ.1,150 ఎగిసి రూ.97,100కి ఎగసింది. ఆర్థిక రాజధాని ముంబైలో రూ. 3,707 ఎగసి రూ.94,118కి చేరింది. చెన్నైసహా పలు నగరాలు, కొన్ని పట్టణాల స్పాట్ మార్కెట్లలో ఏకంగా రూ.లక్ష దాటినట్లు కూడా సమాచారం అందుతోంది. గడచిన పది రోజుల్లో వెండి ధర దాదాపు రూ.11,000 పెరిగింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాలు విలువైన మెటల్స్ ధర పెరగడానికి కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. ఢిల్లీలో పసిడి 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత ధర క్రితంతో పోలి్చతే రూ.250 పెరిగి రూ.73,200కు చేరగా, ముంబైలో రూ.222 ఎగసి రూ.72,413కి చేరింది. -
నాలుగేళ్లకే లాభాల్లోకి చేరిన హైదరాబాద్ కంపెనీ
కేజీఎఫ్, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు తాజాగా విడుదలకు సిద్ధమైన కల్కి చిత్రానికి డిజిటల్‌మార్కెట్ చేస్తున్న సిల్లీమాంక్స్ నాలుగేళ్లకే లాభాల్లోకి చేరింది. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ జనవరి-మార్చి త్రైమాసికానికిగాను రూ.26.83లక్షలు లాభాన్ని పోస్ట్ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.5.5 కోట్లమేర నష్టపోయిన సంస్థ తాజా ఫలితాల్లో లాభాలు పోస్ట్ చేయడంతో పెట్టుబడిదారులకు కొంత ఊరట లభించింది.కంపెనీ లాభాలపై సంస్థ సహవ్యవస్థాపకులు, ఎండీ సంజయ్‌రెడ్డి మాట్లాడుతూ..‘ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కీలకంగా ఉన్న సంస్థ నాలుగేళ్ల తర్వాత లాభదాయకంగా మారడం గొప్ప విజయంగా భావిస్తున్నాం. సంస్థ చేపట్టిన కొన్ని వ్యూహాత్మక కార్యక్రమాలతో ఈ విజయం సొంతమైంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాం. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానాన్ని అనుసరించాం. ప్రతిభావంతులైన బృంద సభ్యులతో మరిన్ని విజయాలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. సంస్థ ప్రాజెక్ట్‌లు ఇవే..ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఈ సంస్థ సినిమాలకు డిజిటల్ మార్కెటింగ్ సేవలందిస్తోంది. గతంలో విడుదలైన కేజీఎఫ్, కేజీఎఫ్-2, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు త్వరలో విడుదలయ్యే ప్రబాస్ నటించిన కల్కి 2898-ఏడీ చిత్రం యూనిట్లతో కలిసి పనిచేసింది. డిజిటల్ మార్కెటింగ్తోపాటు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరిస్తోంది.ఉద్యోగులకు షేర్క్యాపిటల్లో 5 శాతం వాటాకంపెనీ త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన సందర్భంగా తమ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ‘ఎంప్లాయి స్టాక్ ఓనర్షిప్ ప్లాన్’(ఈసాప్)ను ప్రకటించింది. ఈప్లాన్‌లో భాగంగా కంపెనీ మొత్తం షేర్క్యాపిటల్లో 5శాతం వాటాను తమ ఉద్యోగులకు కేటాయించింది. రానున్న ఐదేళ్లలో ఈవాటాలో 70 శాతం మూలధనాన్ని ఉద్యోగులకు పంచనున్నారు. ఈ ప్రక్రియ జూన్ 2024 నుంచి ప్రారంభంకానుందని కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండికరోనా కారణంగా సినిమా పరిశ్రమ 2020 ప్రారంభం నుంచి తీవ్ర అనిశ్చితులు ఎదుర్కొంది. క్రమంగా కొవిడ్ భయాలు తొలగి గతేడాది నుంచి ఆ రంగం పుంజుకుంటోంది. ఫలితంగా ఆ పరిశ్రమపై ఆధారపడిన కంపెనీలు లాభాల్లోకి చేరుతున్నట్లు మార్కెట్‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాంతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరుగుతోంది. అందులో ప్రమోషన్లు, ప్రకటనలు, డిజిటల్ మార్కెటింగ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. -
పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండి
కొంతకాలంగా ఈక్విటీమార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. దాంతో బంగారం ధరలు పడిపోయాయి. ఇటీవల మళ్లీ మార్కెట్లో అనిశ్చితులు నెలకొంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మార్కెట్లు పడిపోతున్నాయి. దాంతో తిరిగి బంగారం ధరలు పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులు సేఫ్డ్ అసెట్స్‌లో భాగంగా పసిడిని ఎంచుకుంటారు. కాబట్టి బుధవారం గోల్డ్రేట్లు స్వల్పంగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో పసిడిధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.67,100 (22 క్యారెట్స్), రూ.73,200 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.250, రూ.270 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.350, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.380 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.73,910 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.67,250.. 24 క్యారెట్ల ధర రూ.73,350కు చేరింది.ఇదీ చదవండి: వ్యాధుల నియంత్రణకు ఏఐ సహాయంవెండి ధరలువెండి ధర మార్కెట్లో భారీగా పెరుగుతోంది. బుధవారం కేజీ వెండి ధర ఏకంగా రూ.1200 పెరిగి రూ.1,02,200కు చేరింది. దాంతో లక్షమార్కును దాటినట్లయంది. వెండి తయారీలో ప్రధానపాత్ర పోషిస్తున్న, స్టాక్మార్కెట్లో లిస్ట్ అయిన ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ జింక్ స్టాక్ ధర నెల రోజులుగా భారీగా పెరిగింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
పడిలేసిన పసిడి.. పరుగులు పెడుతున్న వెండి: నేటి కొత్త ధరలు ఇలా..
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నాయి. ఈ రోజు (మే 28) పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో తులం గోల్డ్ రేటు మునుపటి కంటే రూ.200 పెరిగింది. వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66850 (22 క్యారెట్స్), రూ.72930 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 200, రూ. 220 పెరిగింది.చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 200 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 220 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 67400 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 73530 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 67000 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 73080 రూపాయలకు చేరింది. నిన్న రూ. 250 నుంచి రూ. 270 వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు రూ. 200 , రూ. 220 వరకు పెరిగాయి.వెండి ధరలుబంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి, కానీ వెండి ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. ఈ రోజు (మే 29) వెండి ధర రూ. 3500 పెరిగి రూ. 96500 (కేజీ) వద్ద నిలిచింది. రాబోయే రోజుల్లో వెండి ధరలు ఏకంగా ఒక లక్షకు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
కొత్త రికార్డు స్థాయిని తాకి, వెనక్కి..
ముంబై: ట్రేడింగ్‌లో జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేసిన సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల స్వీకరణతో వెనక్కి వచ్చాయి. ఉదయం ఆసియా మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఇంట్రాడేలో భారీ లాభాలు ఆర్జించాయి. బ్యాంకులు, ఫైనాన్స్, ఐటీ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 600 పాయింట్లు ఎగసి తొలిసారి 76 వేల స్థాయిపై 76,010 వద్ద కొత్త రికార్డును నమోదు చేసింది. నిఫ్టీ 154 పాయింట్లు బలపడి 23,111 వద్ద ఆల్‌టైం అందుకుంది. అయితే ఆఖరి గంటలో సరికొత్త రికార్డుల స్థాయిల వద్ద ఇంధన, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 20 పాయింట్లు నష్టపోయి 75,390 వద్ద ముగిసింది. నిఫ్టీ 25 పాయింట్లు పతనమై 22,932 వద్ద స్థిరపడింది. చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 0.63%, 0.10% చొప్పున రాణించాయి. -
హై రిటర్న్స్ కోసం ఆశపడితే మీకూ ఇదే జరగొచ్చు..!
అత్యధిక లాభాల కోసం ఆశపడి మోసగాళ్ల చేతికి చిక్కిన ఓ వ్యక్తి కోటి రూపాయలకు పైగా పోగొట్టుకున్న సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబైలోని ఖర్ఘర్‌కు చెందిన 48 ఏళ్ల వ్యక్తిని షేర్ ట్రేడింగ్ ద్వారా అధిక రాబడులు ఇప్పిస్తామని నమ్మించి రూ.1.07 కోట్లు కాజేశారు కేటుగాళ్లు.దీనిపై దర్యాప్తులో భాగంగా ఆదివారం ఒక యాప్, వెబ్సైట్ యజమానులతో సహా 15 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని నవీ ముంబై జిల్లా ఖర్ఘర్ టౌన్‌షిప్‌కు చెందిన బాధితుడికి ఫిబ్రవరి 13 నుంచి మే 5 మధ్య పలుమార్లు ఫోన్ వచ్చింది. షేర్ ట్రేడింగ్ ద్వారా అధిక రాబడి వచ్చేలా చేస్తామని నమ్మించి వివిధ బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి అతన్ని ఒప్పించారని నవీ ముంబై సైబర్ పోలీసు సీనియర్ ఇన్స్పెక్టర్ తెలిపారు.మోసగాళ్లను నమ్మిన బాధితుడు మొత్తం రూ.1,07,09,000 వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. తర్వాత తాను ఇన్వెస్ట్ చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని కోరగా మోసగాళ్లు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
జూన్ 1 నుంచి సెబీ కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: మార్కెట్ వదంతుల ప్రభావంతో షేర్ల ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటాన్ని కట్టడి చేసే దిశగా సెబీ కొత్త నిబంధనలు ప్రకటించింది. జూన్ 1 నుంచి ఇవి టాప్ 100 లిస్టెడ్ కంపెనీలకు వర్తిస్తాయి. డిసెంబర్ 1 నుంచి తదుపరి 150 కంపెనీలకు వర్తిస్తాయి. వీటి ప్రకారం తమ షేర్ల ధరలను ప్రభావితం చేసే వదంతులేవైనా వస్తే లిస్టెడ్ కంపెనీలు 24 గంటల్లోగా ధృవీకరించడమో లేదా ఖండించడమో లేదా స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, కంపెనీల విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్‌ఈ) డీల్స్ విషయంలో ’అప్రభావిత ధర’ కాన్సెప్టును కూడా సెబీ ప్రతిపాదించింది. దీని ప్రకారం వదంతుల ప్రభావమేమీ లేనప్పుడు షేరు సగటు ధర ఎంత ఉందో దాన్ని ఎంఅండ్‌ఈ డీల్స్ కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. దీన్ని లెక్కించేందుకు సెబీ నిర్దిష్ట విధానాన్ని సూచించింది. -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: సార్వత్రిక ఎన్నికలు, కార్పొరేట్ మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు చివరి దశకు చేరుకోవడంతో స్టాక్ మార్కెట్లో లాభాలు కొనసాగే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల సరళి ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. మే డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులకు అవకాశం ఉంది. ప్రాథమిక మార్కెట్లో అవఫిస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ సోమవారం ముగిస్తుంది. ఎక్సే్చంజీల్లో షేర్లు గురువారం లిస్టవుతాయి. ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగిన గత వారంలో సెన్సెక్స్ 1,404 పాయింట్లు, నిఫ్టీ 455 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు తగ్గడం, దేశీయ ఇన్వెస్టర్ల సిర్థమైన కొనుగోళ్లు, ఆర్బీఐ కేంద్రానికి రూ.2.1 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటన, ఆయా కంపెనీల మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించడంతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించడం తదితర పరిణామాలు కలిసొచ్చాయి. చివరి దశకు కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు దలాల్ స్ట్రీట్ ముందుగా దివీస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మాలతో పాటు గతవారాంతపు రోజుల్లో విడుదలైన ఇతర కార్పొరేట్ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సీజన్ చివరి దశ(ఎనిమిదో వారం)కు చేరుకుంది. ఇప్పటి వరకు వెల్లడైన క్యూ4 ఫలితాలు అంచనాలకు తగ్గట్టు ఉన్నాయి. ఈ వారంలో దాదాపు 2,100 కి పైగా కంపెనీలు తమ మార్చి క్వార్టర్ ఫలితాలు ప్రకటించనున్నాయి. టాటా స్టీల్, ఎల్ఐసీ, ఐఆర్టీసీ, ఆ్రస్టాజెనికా, నాట్కో ఫార్మా, ఎన్ఎండీసీ, జీఐసీలు కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. ఎన్నికల ఓటింగ్ శాతంపై దృష్టి దేశంలో లోక్ సభ ఆరో విడత ఎన్నికలు శనివారం ముగిశాయి. మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఓటింగ్ శాతం 61.20 శాతంగా నమోదైంది. ఇది ఇప్పటి వరకు జరిగిన అన్ని దశల కంటే అత్యల్పం. చివరి (ఏడో) విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఇదే రోజున రాత్రి ఆరు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఎన్నికల పోలింగ్ నమోదు శాతం, సంబంధిత వార్తల పరిణామాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం జపాన్ మే కన్జూమర్ కన్ఫిడెన్స్ డేటా బుధవారం, అమెరికా క్యూ1 జీడీపీ వృద్ధి, ఉద్యోగ గణాంకాల గురువారం వెల్లడి కానున్నాయి. అదేరోజున యూరోజోన్ ఏప్రిల్ నిరుద్యోగ రేటు, పారిశ్రామిక సరీ్వసుల సెంటిమెంట్, మే వినియోగదారుల విశ్వాస గణాంకాలు గురువారం విడుదల కానున్నాయి. ఇక శుక్రవారం(మే 31న) చైనా ఏప్రిల్ నిరుద్యోగ రేటు, రిటైల్ అమ్మకాలు, నిర్మాణ ఆర్డర్ల డేటా, యూరోజోన్ మే ద్రవ్యల్బోణ గణాంకాలతో భారత నాల్గవ త్రైమాసికానికి (జనవరి–మార్చి 2024) అలాగే మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడీపీ తొలి అధికారిక గణాంకాలు విడుదల అవుతాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. కొనసాగుతున్న ఎఫ్ఐఐల అమ్మకాలు సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడడంతో భారత మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ నెలలో (మే 24 వరకు) దాదాపు రూ.22,000 కోట్లు ఉపసంహరించుకున్నట్లు ఎన్ఎస్డీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు, సమీక్షా కాలంలో ఎఫ్‌పీఐలు రూ.178 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. ఏప్రిల్‌లో రూ.2,009 కోట్ల ఉపసంహరణతో పోలిస్తే ఈ నెల ఎక్కువగా ఉంది. అంతకుముందు ఎఫ్‌పీఐలు మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్ల నికర పెట్టుబడులు పెట్టడం విశేషం.గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపుఈ గురువారం(మే 30న) నిఫ్టీకి చెందిన మే సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘సాంకేతికంగా నిఫ్టీ 22,800 వద్ద కీలక నిరోదాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని చేధించగలిగితే 23,250–23,350 శ్రేణిని పరీక్షిస్తుంది’’ అని ఆప్షన్ డేటా సూచిస్తోంది.