Holidays
-
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
'అంబేద్కర్ జయంతి'ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14ను జాతీయ సెలవు దినంగా అధికారికంగా ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా సోమవారం దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు దినంగా పేర్కొంది. అంటే అన్ని బ్యాంకులు మూసి ఉంటాయన్నమాట.బ్యాంకులు అన్నీ క్లోజ్ అయినప్పటికీ.. ఆన్లైన్ బ్యాంకింగ్ (ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్ మొదలైనవి) సేవలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. బ్యాంకులకు వెళ్లి చేసుకోవలసిన పనులన్నీ ఎల్లుండికి (మంగళవారం) వాయిదా వేసుకోవాలి.ఇతర సెలవు దినాలు➤15 ఏప్రిల్: బెంగాలీ నూతన సంవత్సరం, భోగ్ బిహు (అసోం, పశ్చిమ్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లోని బ్యాంక్‌లకు సెలవు)➤18 ఏప్రిల్: గుడ్ ఫ్రైడే (ఛండీగఢ్, త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ము, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లోని బ్యాంక్‌లకు సెలవు)➤20 ఏప్రిల్: ఆదివారం➤21 ఏప్రిల్: గరియా పూజ (త్రిపురలోని బ్యాంక్‌లకు సెలవు)➤26 ఏప్రిల్: నాల్గవ శనివారం➤27 ఏప్రిల్: ఆదివారం➤29 ఏప్రిల్: పరశురామ జయంతి (హిమాచల్ ప్రదేశ్‌లోని బ్యాంక్‌లకు సెలవు)➤30 ఏప్రిల్: బసవ జయంతి, అక్షయ తృతీయ (కర్ణాటకలోని బ్యాంక్‌లకు సెలవు) -
వచ్చేవారం స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్ 3 రోజులే..
దేశీయ స్టాక్ మార్కెట్లు వచ్చేవారంలో మూడు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. వారాంతపు సెలవులు పోనూ సాధారణంగా వారంలో ఐదు రోజులపాటు స్టాక్ మార్కెట్లు తెరచి ఉంటాయి. కానీ వచ్చే వారంలో (ఏప్రిల్ 14 నుంచి) విశిష్ట దినోత్సవాలు, పండుగల కారణంగా రెండు రోజులు అదనపు సెలవులు వచ్చాయి. దీంతో డెరివేటివ్స్, ఈక్విటీలు, ఎస్ఎల్బీలు, కరెన్సీ డెరివేటివ్స్, వడ్డీరేట్ల డెరివేటివ్స్ ట్రేడింగ్ మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.ప్రముఖ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలైన ఎన్ఎస్ఈ, బీఎస్ఈ స్టాక్ మార్కెట్ సెలవులను ముందుగానే నోటిఫై చేసి ఏటా ప్రచురిస్తాయి. 2025 ఏప్రిల్ నెలలో మొత్తం మూడు స్టాక్ మార్కెట్ సెలవులను ఎక్స్ఛేంజీలు నోటిఫై చేశాయి. మహావీర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 10వ తేదీన ఇదివరకే స్టాక్‌మార్కెట్లు సెలవు దినంగా పాటించాయి. ఇక ఏప్రిల్ 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి, ఏప్రిల్ 14న గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది.శని, ఆదివారాలు, ఎక్స్ఛేంజీలు ముందుగానే ప్రకటించిన సెలవులు మినహా వారంలోని అన్ని రోజుల్లో ఈక్విటీల విభాగంలో ట్రేడింగ్ జరుగుతుంది. ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) విషయానికి వస్తే.. ఏప్రిల్ 18న (గుడ్ ఫ్రైడే) రెండు సెషన్లకు మూసివేసి ఉంటుంది. ఏప్రిల్ 14న ఉదయం సెషన్ (ఉదయం 09:00 - సాయంత్రం 5:00)కు మాత్రమే ఎక్స్చేంజ్ మూసివేసి సాయంత్రం సెషన్ లో (సాయంత్రం 5:00 - రాత్రి 11:30 / 11:55) ట్రేడింగ్ ను తిరిగి ప్రారంభిస్తుంది.ఏప్రిల్‌లో స్టాక్ మార్కెట్ సెలవులుఏప్రిల్ 5 - శనివారంఏప్రిల్ 6 - ఆదివారంఏప్రిల్ 10 - మహావీర్ జయంతిఏప్రిల్ 12 - శనివారంఏప్రిల్ 13 - ఆదివారంఏప్రిల్ 14 - డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిఏప్రిల్ 18 - గుడ్ఫ్రైడేఏప్రిల్ 19 - శనివారంఏప్రిల్ 20 - ఆదివారంఏప్రిల్ 26 - శనివారంఏప్రిల్ 27 - ఆదివారం -
స్టాక్ మార్కెట్ సెలవులు.. ఏప్రిల్‌లో ఈ రోజుల్లో నో ట్రేడింగ్
ఇటీవలి రోజుల్లో స్టాక్ మార్కెట్లపై జనంలో ఆసక్తి పెరిగింది. చాలా మంది మార్కెట్ పెట్టుబడుల వైపు వస్తున్నారు. దీంతో రోజువారీ ట్రేడింగ్‌ను గమనించేవారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఏయే రోజులు పనిచేస్తాయి.. సెలవులు ఎప్పుడెప్పుడు ఉంటాయన్నది ఈ కథనంలో తెలుసుకుందాం..ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) సందర్భంగా ఈరోజు (2025 మార్చి 31 సోమవారం) భారత స్టాక్ మార్కెట్‌కు సెలవు. మూడు రోజుల వారాంతం తర్వాత 2025 ఏప్రిల్ 1 మంగళవారం ట్రేడింగ్ పునఃప్రారంభమవుతుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) రెండూ ఈరోజు స్టాక్స్, డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ లోన్ (ఎస్ఎల్బీ) విభాగాల్లో ట్రేడింగ్, సెటిల్మెంట్కు తెరిచి ఉండవు.అయితే 2025 మార్చి 31న మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) మాత్రం పాక్షికంగా తెరిచి ఉంటుంది. సాయంత్రం సెషన్ సాయంత్రం 5 గంటల నుండి 11:30 / 11:55 గంటల వరకు నడుస్తుంది. దీనికి విరుద్ధంగా, భారతదేశపు అతిపెద్ద వ్యవసాయ కమోడిటీ ఎక్స్ఛేంజ్ అయిన నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ (ఎన్సీడీఈఎక్స్) ఈరోజు పూర్తిగా మూసి ఉంటుంది.ఏప్రిల్‌లో స్టాక్ మార్కెట్ సెలవులుపండుగలు, విశేష దినోత్సవాలు, వారాంతపు సెలవులతో కలుపుకొని ఏప్రిల్ నెలలో స్టాక్ మార్కెట్లు మొత్తంగా 11 రోజులు మూసిఉంటాయి. ఆయా రోజుల్లో స్టాక్ ఎక్స్చేంజీలు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉండవు. సెలవు రోజులు ఇవే..అదనపు సెలవులుఏప్రిల్ 10 - మహావీర్ జయంతిఏప్రిల్ - 14 - డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిఏప్రిల్ 18 - గుడ్ ఫ్రైడేవారాంతపు సెలవులుఏప్రిల్ 5 - శనివారంఏప్రిల్ 6 - ఆదివారంఏప్రిల్ 12 - శనివారంఏప్రిల్ 13 - ఆదివారంఏప్రిల్ 19 - శనివారంఏప్రిల్ 20 - ఆదివారంఏప్రిల్ 26 - శనివారంఏప్రిల్ 27 - ఆదివారం -
ఏప్రిల్‌లో బ్యాంకులు పనిచేసేది 15 రోజులే!
మార్చి 2025 ముగుస్తోంది. దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏప్రిల్‌లో బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేస్తాయి, ఎన్ని రోజులు క్లోజ్‌లో ఉంటాయనే జాబితాను (Bank Holidays) విడుదల చేసింది. వచ్చే నెలలో వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సినవారు తప్పకుండా ఈ సెలవుల జాబితాను తెలుసుకోవాలి. తద్వారా మీ ప్రాంతంలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో.. ఏయే రోజుల్లో పనిచేస్తాయో తెలుస్తుంది. తదనుగుణంగా బ్యాంకింగ్ పనిని ప్లాన్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.ఏప్రిల్‌లో బ్యాంక్ హాలిడేస్➤1 ఏప్రిల్: యాన్యువల్ బ్యాంక్ క్లోజింగ్➤5 ఏప్రిల్: బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజు (తెలంగాణ/ హైదరాబాద్‌లోని బ్యాంక్‌లకు సెలవు)➤6 ఏప్రిల్: ఆదివారం (శ్రీరామనవమి)➤10 ఏప్రిల్: మహావీర్ జయంతి (గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, తెలంగాణలోని బ్యాంక్‌లకు సెలవు)➤12 ఏప్రిల్: రెండవ శనివారం➤13 ఏప్రిల్: ఆదివారం➤14 ఏప్రిల్: అంబేద్కర్ జయంతి ➤15 ఏప్రిల్: బెంగాలీ నూతన సంవత్సరం, భోగ్ బిహు (అసోం, పశ్చిమ్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లోని బ్యాంక్‌లకు సెలవు)➤18 ఏప్రిల్: గుడ్ ఫ్రైడే (ఛండీగఢ్, త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ము, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లోని బ్యాంక్‌లకు సెలవు)➤20 ఏప్రిల్: ఆదివారం➤21 ఏప్రిల్: గరియా పూజ (త్రిపురలోని బ్యాంక్‌లకు సెలవు)➤26 ఏప్రిల్: నాల్గవ శనివారం➤27 ఏప్రిల్: ఆదివారం➤29 ఏప్రిల్: పరశురామ జయంతి (హిమాచల్ ప్రదేశ్‌లోని బ్యాంక్‌లకు సెలవు)➤30 ఏప్రిల్: బసవ జయంతి, అక్షయ తృతీయ (కర్ణాటకలోని బ్యాంక్‌లకు సెలవు)బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది). -
బ్యాంకులకు వరుస సెలవులు..
ఉగాది, రంజాన్ వచ్చేస్తున్నాయి. వారాంతం, వెంటనే పండుగల కారణంగా బ్యాంకులకు వరుస సెలవులు లభిస్తున్నాయి. రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు కాకుండా.. ప్రత్యేకంగా పండుగలను దృష్టిలో ఉంచుకుని కూడా బ్యాంకులకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవులు అందిస్తుంది.మార్చి 28న జుమాత్-ఉల్-విదా కారణంగా జమ్మూకశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు, ఆ తరువాత 30న ఉగాది సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. 31వ తేదీ రంజాన్ సందర్బంగా కూడా బ్యాంకులకు సెలవు.ఆర్ధిక సంవత్సరం చివరి రోజు (మార్చి 31)రంజాన్ మార్చి 31న వచ్చింది. సాధారణంగా ఆ రోజు బ్యాంకులకు సెలవు. కానీ ఆర్ధిక సంవత్సరం చివరి రోజు కాబట్టి బ్యాంకులు పనిచేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడికావాల్సి ఉంది.మొత్తం మీద 28వ తేదీ నుంచి 31 వరకు మూడు రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయని తెలుస్తోంది. బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది). -
బ్యాంకులకు వరుస సెలవులు: ఎందుకో తెలుసా?
ఈ నెలలో (మార్చి 2025) దాదాపు పది రోజుల కంటే ఎక్కువ బ్యాంకు సెలవులు ఉన్నాయి. కాగా ఈ ఒక్క వారంలోనే వరుస సెలవులు వస్తున్నాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెలవులు ఉన్నాయి, ఆ సమయంలో ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయా? అనే వివరాలు తెలుసుకుందాం.మార్చి రెండో వారం కూడా మొదలైపోయింది. ఈ వారంలో 13 నుంచి 16వరకు వివిధ ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వరుస సెలవులు రావడం చేత.. తప్పకుండా బ్యాంకులకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనులను ముందుగానే పూర్తి చేసుకోవచ్చు. ఆలస్యమైనా పరవాలేదు అనుకున్నప్పుడు.. ఎప్పుడు బ్యాంకులు మూసి ఉంటాయి అనే విషయం తెలుసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.➤మార్చి 13 (గురువారం): మార్చి 13న హోలిక దహన్, అట్టుకల్ పొంగళ పండుగ కారణంగా జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది.➤మార్చి 14 (శుక్రవారం): హోలీ పండుగ సందర్భంగా.. త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్ మినహా ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో సెలవు.➤మార్చి 15 (శనివారం): కొన్ని రాష్ట్రాలు మార్చి 14కి బదులుగా మార్చి 15న హోలీని జరుపుకుంటాయి. ఈ జాబితాలో త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్ ఉన్నాయి.➤ మార్చి 16 (ఆదివారం); ఆదివారం కావడం చేత దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది). -
మార్చిలో 12 రోజులు స్టాక్ మార్కెట్ క్లోజ్!
ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చిలో ముగియనుంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ నెలలో ట్రేడింగ్‌కు సిద్ధమవుతున్నారు. అయితే ట్రేడింగ్‌ను బాగా ప్లాన్ చేయడానికి మార్చి నెలలో స్టాక్ మార్కెట్ ఏయే రోజుల్లో పనిచేస్తుంది.. ఎప్పుడు మూసివేత ఉంటుంది అన్నది తెలుసుకోవడం మంచిది. ఈ హాలిడే క్యాలెండర్ ను స్టాక్ ఎక్స్ఛేంజీలు జారీ చేస్తాయి. తమ అధికారిక వెబ్ సైట్లలో ఇవి అందుబాటులో ఉంటాయి.బీఎస్ఈ ప్రతి సంవత్సరం పూర్తి ట్రేడింగ్ హాలిడేస్ జాబితాను ప్రచురిస్తుంది. సాధారణంగా ఈ జాబితాలో పండుగలు, జాతీయ సెలవులు, వారాంతపు సెలవులు ఉంటాయి. బడ్జెట్ సమర్పణ వంటి ప్రత్యేక సందర్భాలు మినహా అన్ని వారాంతాల్లో స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉండవు. అందువల్ల మార్కెట్ షెడ్యూల్‌ను తెలుసుకుని తదనుగుణంగా ట్రేడింగ్‌ను ప్లాన్ చేయడానికి ఇన్వెస్టర్లు సెలవుల జాబితాపై ఆధారపడాలి.మార్చిలో స్టాక్ మార్కెట్ కు 12 రోజులు సెలవులు ఉంటాయి. ఇన్వెస్టర్లు ఈ రోజుల్లో మార్కెట్లో ఎలాంటి ట్రేడింగ్ లు చేయలేరు. వారాంతపు సెలవులతో పాటు ఈ నెలలో హోలీ, రంజాన్ పండుగకు కూడా మార్కెట్లు మూతపడతాయి. అందువల్ల మార్చిలో చివరి ట్రేడింగ్ రోజు 28వ తేదీ. ఎందుకంటే 29, 30 తేదీలు వారాంతపు సెలవులు. ఆ రోజుల్లో మార్కెట్లు పనిచేయవు.మార్చిలో స్టాక్ మార్కెట్ సెలవులు ఇవే» మార్చి 1 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 2 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 8 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 9 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 14 శుక్రవారం హోలీ» మార్చి 15 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 16 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 22 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 23 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 29 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 30 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 31 సోమవారం ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) -
హోలీ.. ఉగాది పండుగలు: మార్చిలో బ్యాంక్ హాలిడేస్ ఇవే..
ఫిబ్రవరి 2025 ముగుస్తోంది. దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చిలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసి ఉంటాయో జాబితాను (Bank Holidays) విడుదల చేసింది. వచ్చే నెలలో వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సినవారు తప్పకుండా ఈ సెలవుల జాబితాను తెలుసుకోవాలి. తద్వారా మీ ప్రాంతంలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో.. ఏయే రోజుల్లో పనిచేస్తాయో తెలుస్తుంది. తదనుగుణంగా బ్యాంకింగ్ పనిని ప్లాన్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.మార్చిలో బ్యాంక్ హాలిడేస్➤మార్చి 7 (శుక్రవారం): 'చాప్చార్ కుట్' పండుగను సందర్భంగా మిజోరాంలో సెలవు దినం.➤మార్చి 13 (గురువారం): మార్చి 13న హోలిక దహన్, అట్టుకల్ పొంగళ పండుగ కారణంగా జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది.➤మార్చి 14 (శుక్రవారం): హోలీ పండుగ సందర్భంగా.. త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్ మినహా ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో సెలవు.➤మార్చి 15 (శనివారం): కొన్ని రాష్ట్రాలు మార్చి 14కి బదులుగా మార్చి 15న హోలీని జరుపుకుంటాయి. ఈ జాబితాలో త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్ ఉన్నాయి.➤మార్చి 22 (శనివారం): 'బీహార్ దివస్' లేదా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మార్చి 22న బీహార్‌లో బ్యాంకులకు సెలవు.➤మార్చి 27-28 (గురువారం-శుక్రవారం): ఇస్లామిక్ క్యాలెండర్లో ముఖ్యమైన రోజు అయిన షబ్-ఎ-ఖదర్ను పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్ మార్చి 27న సెలవు దినంగా పాటిస్తుంది. రంజాన్ నెల చివరి శుక్రవారం అయిన జుమాత్-ఉల్-విదాను పురస్కరించుకుని కేంద్రపాలిత ప్రాంతం మార్చి 28న సెలవు దినంగా పాటిస్తుంది.➤మార్చి 31 (సోమవారం): మిజోరం, హిమాచల్ ప్రదేశ్ మినహా.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మార్చిలో ఈద్ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తాయి.బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది). -
బ్యాంకులకు ఆరు రోజులు వరుస సెలవులు
2024 డిసెంబర్ నెల ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా బ్యాంకులకు ఈ నెలలో వరుస సెలవులు రానున్నాయి. ఈ సెలవులు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు వర్తిస్తాయా?.. సెలవు రోజుల్లో ఆన్లైన్ కార్యకలాపాల పరిస్థితి ఏమిటి? అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.➤డిసెంబర్ 25న క్రిస్మస్, కాబట్టి దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.➤డిసెంబర్ 26, 27వ తేదీలలో మిజోరం, నాగాలాండ్, మేఘాలయ ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. ఈ కారణంగా అక్కడి బ్యాంకులకు మాత్రమే సెలవు.➤డిసెంబర్ 28, 29వ తేదీలు వరుసగా నాల్గవ శనివారం, ఆదివారం. ఈ కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.➤డిసెంబర్ 30వ తేదీ మేఘాలయాలో యు కియాంగ్ నంగ్బా.. ఈ సందర్భంగా అక్కడి బ్యాంకులకు సెలవు.బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదు.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.) -
వచ్చే వారంలో బ్యాంకులు పనిచేసేది మూడు రోజులే!.. ఎందుకంటే..
ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ 2024 సెలవులను వెల్లడించింది. ఈ నెలలో సుమారు 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నట్లు (సెలవు) తెలుస్తోంది. ఇందులో మతపరమైన పండుగలు, ప్రాంతీయ కార్యక్రమాలు, ఆదివారాలు ఇలా అన్నీ ఉన్నాయి. అయితే వచ్చే వారం వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు ఉన్నట్లు సమాచారం.వచ్చే వారంలో 7, 8వ తేదీల్లో ఛత్ పూజ, 9వ తేదీ రెండో శనివారం, 10న ఆదివారం కావడంతో.. ఇలా వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు పనిచేయవు.ఛత్ పూజ బీహార్, ఢిల్లీ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో మాత్రమే జరుపుకుంటారు. కాబట్టి ఆ రాష్ట్రాల్లోని బ్యాంకులకు మాత్రమే సెలవు. 8వ తేదీ బీహార్, జార్ఖండ్, మేఘాలయాలలో ఛత్ సంబంధిత వేడుకలు జరుపుకుంటారు. కాబట్టి ఈ రాష్ట్రాల్లోని బ్యాంకులు ఆ రోజు పనిచేయవు. ఇక 9 రెండో శనివారం, 10 ఆదివారం కావడంతో యధావిధిగా బ్యాంకులకు సెలవు. ఇలా మొత్తం నాలుగు రోజులు బ్యాంకులకు సెలవన్న మాట.ఇదీ చదవండి: 85 లక్షల ఖాతాలపై నిషేధం!.. వాట్సప్ కీలక నిర్ణయంఛత్ పూజఛత్ అనేది బీహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ వంటి ప్రాంతాలలో జరుపుకునే హిందూ పండుగ. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో ఆరవ రోజు జరుగుతుంది. దీనిని సూర్య షష్టి అని కూడా అంటారు. కాబట్టి సూర్య దేవుడిని పూజిస్తారు.బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. -
ఆ రాష్ట్రంలో దీపావళికి ఐదు రోజులు సెలవు
జమ్ము: ఈనెల 31న దీపావళి పండుగను వేడుకగా జరుపుకునేందుకు దేశమంతా సిద్ధమైంది. ఈ నేపధ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు దీపావళి సెలవులను ప్రకటించాయి. తాజాగా జమ్ము పాఠశాల విద్యా డైరెక్టర్ దీపావళి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించించారు.దీపావళి సందర్భంగా అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 29 నుండి నవంబర్ 2 వరకూ సెలవులను ప్రకటించారు. నవంబర్ 3 ఆదివారం కావడంతో ఆ రోజు కూడా సెలవు ఉంటుంది. నవంబర్ 4న విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. దీనికి సంబంధించి జిల్లా మేజిస్ట్రేట్ తన అధికారిక వెబ్సైట్లో నోటీసు జారీ చేశారు.దీపావళికి ఆదివారంతో కలుపుకుని ఆరు రోజుల పాటు సెలవు రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు నవంబర్ ఒకటిన కూడా సెలవు ప్రకటించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తిరిగి తమ స్వస్థలానికి వచ్చేందుకు వీలుగా నవంబర్ ఒకటిన సెలవు ప్రకటించారు.ఇది కూడా చదవండి: ఐదుపదుల వయసులోనూ స్లిమ్‌గా మలైకా..శరీరాకృతి కోసం..! -
దసరా సందడి మొదలైంది.. సొంతూళ్లకు చలో చలో..(ఫొటోలు)
-
రేపటి నుంచి దసరా సెలవులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి పాఠశాలలు ఈ నెల 14న పునఃప్రాంరంభమవుతాయని పేర్కొన్నారు.వాస్తవానికి ఈ నెల 4వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రకటించినప్పటికీ ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు మార్పులు చేశారు. అయితే, బుధవారం గాంధీ జయంతి కావడంతో మరో రోజు సెలవు కలిసి వచ్చింది. అన్ని జూనియర్ కాలేజీలకు సైతం ఈ నెల 3 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా మరో ప్రకటనలో పేర్కొన్నారు. -
అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?
సెప్టెంబర్ నెల ముగుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఈ నెలలో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ సెలవుదినాల్లో పబ్లిక్ హాలిడేస్, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాల సాధారణ సెలవులు ఉన్నాయి.సెలవుల పూర్తి జాబితా➤అక్టోబర్ 1: రాష్ట్ర శాసనసభకు సాధారణ ఎన్నికలు 2024 (జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి (జాతీయ సెలవుదినం)➤అక్టోబర్ 3: నవరాత్రి (జైపూర్)➤అక్టోబర్ 5: ఆదివారం➤అక్టోబర్ 10: దుర్గాపూజ - మహా సప్తమి (అగర్తల, గౌహతి, కోహిమా, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 11: దసరా - దుర్గా అష్టమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్టక్, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, కోల్‌కతా, పాట్నా, రాంచీ, షిల్లాంగ్‌లలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 12: రెండవ శనివారం / విజయదశమి (తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 13: ఆదివారం➤అక్టోబర్ 14: దుర్గా పూజ (గ్యాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 16: లక్ష్మీ పూజ (అగర్తల, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 17: మహర్షి వాల్మీకి జయంతి (బెంగళూరు, గౌహతి, సిమ్లాలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 20: ఆదివారం➤అక్టోబర్ 26: నాల్గవ శనివారం➤అక్టోబర్ 27: ఆదివారం➤అక్టోబర్ 31: దీపావళి (దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులకు సెలవు)ఇదీ చదవండి: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.) -
AP: 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు
సాక్షి, అమరావతి: అక్టోబర్ 3వ తేదీ నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు విద్యామంత్రి లోకేశ్ చెప్పారు. ఆయన శుక్రవారం పాఠశాల విద్యపై సమీక్షించారు. ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందు నుంచే సెలవులు ఇస్తున్నామని చెప్పారు. అక్టోబర్ 13 వరకు సెలవులు ఉంటాయని తెలిపారు.ఇదీ చదవండి: నిరుద్యోగులకు సర్కార్ షాక్ -
2 నుంచి దసరా సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని స్కూళ్లకు అక్టోబర్ 2 నుంచి 14 వరకూ దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాలలు తిరిగి 15వ తేదీన తెరుచుకుంటాయని పేర్కొంది. సెలవుల తర్వాత సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన హోంవర్క్ ఇవ్వాలని అధికారులు అన్ని పాఠశాలలప్రధానోపాధ్యాయులకు సూచించారు. -
సెప్టెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ఏకంగా 14 రోజులు!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఈ నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మూసివేతలలో పబ్లిక్ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాలలో సాధారణ సెలవుదినాలు ఉన్నాయి.►5 సెప్టెంబర్: శ్రీమంత శంకరదేవుని తిథి (అస్సాంలో బ్యాంకులు సెలవు)►7 సెప్టెంబర్: వినాయక చవితి, శనివారం►8 సెప్టెంబర్: ఆదివారం►13 సెప్టెంబర్: రామ్‌దేవ్ జయంతి (రాజస్థాన్‌లో బ్యాంకులు సెలవు)►14 సెప్టెంబర్: రెండవ శనివారం►15 సెప్టెంబర్: ఆదివారం ►16 సెప్టెంబర్: మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఎ-మిలాద్ (ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు) ►17 సెప్టెంబర్: ఇంద్ర జాత్ర (సిక్కింలో బ్యాంకులు సెలవు)►18 సెప్టెంబర్: శ్రీ నారాయణగురు జయంతి (కేరళలో బ్యాంకులు సెలవు)►21 సెప్టెంబర్ 21: శ్రీ నారాయణగురు సమాధి (కేరళలో బ్యాంకులు సెలవు)►22 సెప్టెంబర్: ఆదివారం►23 సెప్టెంబర్: బలిదాన్ డే (హర్యానాలో బ్యాంకులు సెలవు)►28 సెప్టెంబర్: నాల్గవ శనివారం ►29 సెప్టెంబర్: ఆదివారంబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.) -
సెలవులొచ్చాయ్.. ఛలో ఊరికి..
సాక్షి, అమరావతి : గురువారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు రావడంతో ప్రజలంతా ప్రయాణాలు కట్టారు. సొంత ఊళ్లకు, బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్తున్నారు. దీంతో రైళ్లు, బస్సులు రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. వరుస సెలవులు రావడంతో ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులతోపాటు పలువురు ఎంపీలు దక్షిణ మధ్య రైల్వేను కోరారు. దాంతో రైల్వే శాఖ ఇప్పటికే ఉన్న ప్రత్యేక రైళ్లకు అదనంగా మరికొన్నింటిని ప్రకటించింది. 18న నర్సాపూర్– సికింద్రాబాద్, 19న సికింద్రాబాద్– నర్సాపూర్, 15, 17, 19 తేదీల్లో కాకినాడ–సికింద్రాబాద్, 16, 18, 20 తేదీల్లో సికింద్రాబాద్–కాకినాడ, 14, 15 తేదీల్లో తిరుపతి–నాగర్సోల్, కాచిగూడ– తిరుపతి మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతామని తెలిపింది. వాటన్నింటిలోనూ ఏసీ కోచ్‌లున్నాయి. కానీ, వీటిలో ప్రయాణికులకు ఇచ్చేందుకు బెడ్ రోల్స్ లేవు. దక్షిణ మధ్య రైల్వే రోజూ నిత్యం 210 రెగ్యులర్ రైళ్లను నిర్వహిస్తోంది. ఇక ఏడాదిలో వివిధ సందర్భాలను పరిగణలోకి తీసుకుని 200 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. నిర్ణీత తేదీల్లో వీటిని నడుపుతుంటుంది. రెగ్యులర్, ప్రత్యేక రైళ్లలోని ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు సరిపడా దుప్పట్లు (బెడ్‌రోల్స్) ఇస్తుంది. విజయవాడ, తిరుపతి, గుంతకల్, కాచిగూడల్లో ఉన్న రైల్వే మెకనైజ్డ్ లాండ్రీల్లో వాటిని శుభ్రపరిచి, తిరిగి సరఫరా చేస్తుంటుంది. కానీ ఇప్పుడు అదనంగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లలోని ఏసీ కోచ్‌ల ప్రయాణికులకు సరిపడా దుప్పట్లు లేవు. దాంతో ఈ రైళ్లలో బెడ్ రోల్స్ అందించలేమని, ప్రయాణికులు దుప్పట్లను వారే తెచ్చుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్ ఆర్టీసీ రాష్ట్రంలో రోజుకు 11 వేల బస్సు సర్వీసులు నిర్వహిస్తోంది. వరుస సెలవుల కారణంగా బస్సుల్లో టికెట్లు దొరకడంలేదు. రానున్న వారం రోజులకు సీట్లన్నీ రిజర్వ్ అయిపోయాయి. దాంతో ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆధారపడుతున్నారు. ఇదే అవకాశంగా ప్రైవేటు ట్రావెల్స్ చార్జీలను అమాంతంగా పెంచేశారు. విజయవాడ నుంచి విశాఖపట్నంకు ప్రైవేటు ట్రావెల్స్ ఏసీ బస్సు చార్జీ రూ.1,200 ఉండగా ఇప్పుడు రూ.2 వేలకు పెంచేశారు. స్లీపర్ ఏసీ బస్సుల్లో రూ.3 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లోనూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఊళ్లకు వెళ్తుండటంతో టోల్ గేట్ల వద్ద రద్దీ భారీగా పెరిగింది. పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్నందున డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఇవీ సెలవులు15వ తేదీ గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సెలవు16వ తేదీ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఐచ్ఛిక సెలవు17వ తేదీ శనివారం – సాధారణ సెలవు 18వ తేదీ ఆదివారం – సాధారణ సెలవు 19వ తేదీ సోమవారం – రాఖీ పౌర్ణమి సెలవు -
ఒకేసారి 10 రోజుల సెలవు.. ఆనందంలో 50వేల ఉద్యోగులు
గుజరాత్‌లోని సూరత్‌లో వున్న ప్రముఖ వజ్రాల తయారీ సంస్థ కిరణ్ జెమ్స్ తన 50000 మంది ఉద్యోగులకు 10 రోజులు (ఆగస్టు 17 నుంచి 27 వరకు) సెలవును ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పడిపోతున్న డిమాండ్‌ను అధిగమించడానికి.. వజ్రాల ఉత్పత్తిని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ప్రపంచ మార్కెట్లో పాలిష్ చేసిన వజ్రాలకు డిమాండ్ లేదని కంపెనీ తెలిపింది. అయితే వజ్రాల ఉత్పత్తిని నియంత్రించేందుకు వీలుగా 10 రోజుల సెలవు ప్రకటించామని, కంపెనీ చరిత్రలో తొలిసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని కంపెనీ చైర్మన్ వల్లభాయ్ లఖానీ తెలిపారు.గుజరాత్‌లోని డైమండ్ ఫ్యాక్టరీలు దీపావళి సందర్భంగా సుదీర్ఘ సెలవులు తీసుకుంటాయి. అయితే ఇప్పుడు పండుగకు ముందే.. కంపెనీ సంచనల నిర్ణయం తీసుకుంది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.సంస్థలో పనిచేస్తున్న 50,000 మందికి పైగా డైమండ్ పాలిషర్లు పనిచేస్తున్నారు. ఇందులో 40,000 మంది సహజ వజ్రాలను కత్తిరించి పాలిష్ చేస్తారు. మిగిలిన 10,000 మంది ల్యాబ్‌లో తయారయ్యే డైమండ్ యూనిట్లో పని చేస్తున్నారని లఖానీ పేర్కొన్నారు. కిరణ్ జెమ్స్ కంపెనీ ప్రపంచంలోని అతిపెద్ద సహజ వజ్రాల తయారీదారు మాత్రమే కాకుండా.. పాలిష్ చేసిన వజ్రాల అతిపెద్ద ఎగుమతిదారులలో కూడా ఒకటి. -
ఆగష్టులో బ్యాంక్ హాలిడేస్: పనిదినాలు 18 రోజులే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగష్టు నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మూసివేతలలో పబ్లిక్ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాలలో సాధారణ మూసివేతలు ఉన్నాయి.ఆగస్టు 3: కేర్ పూజ - అగర్తల రాష్ట్రంలో బ్యాంకులకు సెలవుఆగస్టు 4: ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుఆగస్టు 8: టెన్డాంగ్‌లో రమ్ ఫాత్ సిక్కింఆగస్టు 10: రెండో శనివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుఆగస్టు 11: ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుఆగష్టు 13: పేట్రియాట్ డే (ఇంఫాల్)ఆగస్ట్ 15: స్వాతంత్య్ర దినోత్సవం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుఆగస్ట్ 18: ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుఆగస్టు 19: రక్షా బంధన్/రాఖీ - దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుఆగష్టు 20: శ్రీ నారాయణ గురు జయంతి (కొచ్చి, తిరువనంతపురం)ఆగస్ట్ 24: నాల్గవ శనివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుఆగస్ట్ 25: ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుఆగస్ట్ 26: జన్మాష్టమి - దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.) -
జూన్‌లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మూసివేతలలో పబ్లిక్ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాలలో సాధారణ మూసివేతలు ఉన్నాయి.జూన్ 2024లో సెలవుల జాబితా2 జూన్ 2024 (ఆదివారం)- తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (తెలంగాణ)8 జూన్ 2024 - రెండో శనివారం9 జూన్ 2024 (ఆదివారం) - మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ బ్యాంకులకు సెలవు10 జూన్ 2024 (సోమవారం) - శ్రీ గురు అర్జున్ దేవ్ మార్టిర్డమ్ డే సందర్భంగా పంజాబ్‌లో సెలవు.14 జూన్ 2024 (శుక్రవారం) - పహిలి రాజా డే సందర్భంగా ఒడిశాలో బ్యాంకులకు సెలవు15 జూన్ 2024 (శనివారం) - రాజా సంక్రాంతి సందర్భంగా ఒరిస్సాలో, YMA డే సందర్భంగా మిజోరం బ్యాంకులకు సెలవు16 జూన్ 2024 - ఆదివారం17 జూన్ 2024 (సోమవారం) - బక్రీద్ సందర్భంగా జాతీయ సెలవుదినం21 జూన్ 2024 (శుక్రవారం) - వట్ సావిత్రి వ్రతం కారణంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు22 జూన్ 2024 (శనివారం) - సంత్ గురు కబీర్ జయంతి సందర్భంగా ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ బ్యాంకులకు సెలవు23 జూన్ 2024 - ఆదివారం30 జూన్ 2024 (ఆదివారం) - శాంతి దినోత్సవం (మిజోరం)బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి. (బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.) -
TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వేసవి సెలవులు అనంతరం జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు తిగిరి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విద్యా శాఖ విడుదలు చేసింది.అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. రానున్న విద్యా సంవత్సరంలో పాఠశాలలు మొత్తం 229 రోజులు పనిచేయనున్నాయి. స్కూళ్లు జూన్ 12న ప్రారంభమై.. వచ్చే ఏడాది ఏప్రిల్ 24 చివరి వర్కింగ్ డే. ఇక, 2025 ఏప్రిల్ 24 నుంచి 2025 జూన్ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. ఈ ఏడాది దసరాకు అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు అంటే 13 రోజులపాటు పండుగ సెలవులు ఉంటాయి. డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు. ఇక, 2025 జనవరిలో సంక్రాంతి సెలవులు జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం ఆరు రోజులు ఉంటాయని విద్యా శాఖ వెల్లడించింది.మరోవైపు, 2025 జనవరి పదో తేదీ వరకు పదో తరగతి సిలబస్‌ను పూర్తి చేయనున్నారు. తర్వాత రివిజన్ క్లాసులు ఉంటాయి. ఫిబ్రవరి 28, 2025 వరకు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి సిలబస్ పూర్తి చేస్తారు. ప్రతీ రోజూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఐదు నిమిషాల పాటు యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండనున్నాయి. పదో తరగతి బోర్డు పరీక్షలను 2025 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్లో పేర్కొంది. -
ఈ సమ్మర్ సెలవుల్లో.. పిల్లలు ఫోన్‌కి దూరంగా ఉండాలంటే?
సెలవులొచ్చేది ఆటల కోసం, స్నేహాల కోసం బంధువుల కోసం, విహారాల కోసం, వినోదాల కోసం పిల్లలు ఇంతకాలం ఫోన్లలో కూరుకుపోయారు. వారిని ఫోన్ల నుంచి బయటకు తెండి. మీ బాల్యంలో సెలవుల్లో ఎలా గడిపారో అలా గడిపేలా చేయండి. పెద్దయ్యాక తలుచుకోవడానికి బాల్యం లేకపోవడానికి మించిన విషాదం లేదు.ఆటస్థలాలు లేని స్కూళ్లలో చదివించడం, ఆడుకునే వీలు లేని ఇళ్లలో నివసించడం, పార్కులు లేకపోవడం, ఆడుకోవడానికి తోటి పిల్లలు లేని వాతావరణంలో జీవించడం, ఇవన్నీ ఉన్నా పిల్లలతో గడిపే సమయం తల్లిదండ్రులకు లేకపోవడం... వీటన్నింటి వల్ల పిల్లలకు స్కూల్, ఇల్లు కాకుండా తెలిసింది ఒకే ఒక్కటి. సెల్‌ఫోన్. పిల్లలకు సెల్ఫోన్లు ఇచ్చి వారు వాటిలో కూరుకుపోతే ‘అమ్మయ్య. మా జోలికి రావడం లేదు’ అనుకునే తల్లిదండ్రులు ఉన్న ఈ కాలంలో పిల్లలకు ఆరోగ్యకరమైన ఆటలు, విహారం, అనుబంధాల విలువ, కొత్త విషయాల ఎరుక ఎలా కలుగుతుంది?అందుకే వేసవి సెలవలు ఒక పెద్ద అవకాశం. ఇరవై ముప్పై ఏళ్ల క్రితం వరకు తెలుగు ్రపాంతాలలో వేసవి సెలవులు వస్తే పిల్లలు ఎలా గడిపేవారో ఇప్పుడూ అలా గడిపే అవకాశం కల్పించవచ్చు. కాకుంటే తల్లిదండ్రులు ప్రయత్నించాలి. పిల్లలను మోటివేట్ చేయాలి.బంధువులు– బంధాలు..బంధువులు ఎవరో తెలియకపోతే బంధాలు నిలవవు. ఎంత స్వతంత్రంగా జీవిద్దామనుకున్నా, సాటి మనుషుల విసిగింపును తప్పించుకుని తెగదెంపులు చేసుకుని బతుకుదామనుకున్నా మనిషి సంఘజీవి. అతడు బంధాలలో ఉండాల్సిందే. బంధాల వల్ల బతకాల్సిందే. పిల్లలకు బంధాలు బలపడేది, బంధాలు తెలిసేది వేసవి సెలవుల్లోనే. ఇంతకు ముందు పిల్లలు వేసవి వస్తే తల్లిదండ్రులను వదిలిపెట్టి పిన్ని, బాబాయ్, పెదనాన్న, తాతయ్య... వీళ్ల ఇళ్లకు వెళ్లి రోజుల తరబడి ఉండేవారు. వారి పిల్లలతో బంధాలు ఏర్పరుచుకునేవారు.దీని వల్ల కొత్త ఊరు తెలిసేది. ఆటలు తెలిసేవి. కలిసి వెళ్లిన సినిమా అలా ఓ జ్ఞాపకంగా మిగిలేది. ఇవాళ పెద్దల పట్టింపులు పిల్లలకు శాపాలవుతున్నాయి. రాకపోకలు లేని బంధుత్వాలతో పిల్లలు ఎక్కడకూ వెళ్లలేని స్థితి దాపురించింది. దీనిని సరి చేయాల్సిన బాధ్యత పెద్దలదే. లేకుంటే పిల్లలు ఫోన్లనే బంధువులుగా భావించి అందులోని చెత్తను నెత్తికెక్కించుకుంటారు. జీవితంలో సవాళ్లు ఎదురైన సమయంలో ఒంటరితనం ఫీలయ్యి అతలాకుతలం అవుతారు.తెలుగు ఆటలు..సెలవుల్లో పిల్లలకు తెలుగు ఆటలు తెలియడం ఒక పరంపర. బొంగరాలు, గోలీలు, వామనగుంటలు, పరమపదసోపాన పటం, ఒంగుళ్లు–దూకుళ్లు, నేల–బండ, ఏడుపెంకులాట, పులి–మేక, నాలుగు స్తంభాలాట, వీరి వీరి గుమ్మడిపండు, లండన్ ఆట, రైలు ఆట, ΄÷డుపుకథలు విప్పే ఆట, అంత్యాక్షరి, కళ్లకు గంతలు... ఈ ఆటల్లో మజా తెలిస్తే పిల్లలు ఫోన్ ముట్టుకుంటారా?కథ చెప్పుకుందామా..కథలంటే పిల్లలకు ఇష్టం. పెద్దలు చె΄్పాలి గాని. ఈ సెలవుల్లో రాత్రి పూట భోజనాలయ్యాక, మామిడి పండ్లు తిన్నాక, పక్కలు వేసుకుని అందరిని కూచోబెట్టి పెద్దలు కథలు చెప్తే ఎన్నెన్ని తెలుస్తాయి! ఎన్ని ఊహల కవాటాలు తెరుచుకుంటాయి. మర్యాద రామన్న, తెనాలి రాముడు, బేతాళుడు, సింద్బాద్, ఆలీబాబా, పంచతంత్రం, రామాయణం, మహాభారతం... భీముడిలోని బలం, అర్జునుడిలోని నైపుణ్యం... ఇవి కదా చె΄్పాలి.బలం కోసం తిండి..పిల్లలను సరిగ్గా గమనించి వారికి కావలసిన బలమైన తిండి తినిపించడానికి వీలయ్యేది ఈ సెలవుల్లోనే. బలహీనంగా ఉండే పిల్లలు, ఎదిగే వయసు వచ్చిన ఆడపిల్లలకు ఏమేమి వొండి తినిపించాలో పెద్దల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు ఈ కాలంలో తినిపిస్తారు. శిరోజాల సంరక్షణ, చర్మ సంరక్షణ, పంటి వరుస సరి చేయించడం, జీర్ణశక్తిని ఉద్దీపన చేయడం, బంధువుల రాక వల్ల లేదా బంధువుల ఇంటికి వెళ్లడం వల్ల పిల్లలందరికీ కలిపి వారికి వృద్ధి కలిగించే ఆహారం చేసి పెట్టవచ్చు. తోటి పిల్లలు పక్కన ఉంటే ఇష్టం లేకపోయినా పిల్లలు తింటారు.సెలవులొచ్చేది పిల్లల మానసిక, శారీరక వికాసానికి. కదలకుండా మెదలకుండా ఫోన్ పట్టుకుని కూచుని వారు ఈ సెలవులు గడిపేస్తే నింద తల్లిదండ్రుల మీదే వేయాలి... పిల్లల మీద కాదు.ఇవి చదవండి: Indian Navy Women Officers: సముద్రంపై సాహస సంతకం -
ఏప్రిల్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. చూశారా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మూసివేతలలో పబ్లిక్ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాలలో సాధారణ మూసివేతలు ఉన్నాయి. ఏప్రిల్ 2024లో సెలవుల జాబితా ఏప్రిల్ 1 (సోమవారం): మిజోరాం, చండీగఢ్, సిక్కిం, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఇయర్లీ అకౌంట్స్ క్లోజింగ్ కారణంగా బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 5 (శుక్రవారం): బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజు. జుమాత్-ఉల్-విదా కోసం తెలంగాణ, జమ్మూ మరియు శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 9 (మంగళవారం): మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, గోవా, జమ్మూలో గుఢి పడ్వా/ఉగాది పండుగ/తెలుగు నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. ఏప్రిల్ 10 (బుధవారం): రంజాన్ ( కేరళలోని బ్యాంకులకు హాలిడే) ఏప్రిల్ 11 (గురువారం): చండీగఢ్, గ్యాంగ్‌టక్, కొచ్చి, సిమ్లా, తిరువనంతపురం మినహా చాలా రాష్ట్రాల్లో రంజాన్ కారణంగా బ్యాంకులకు హాలిడే. ఏప్రిల్ 13 (శనివారం): అగర్తలా, గౌహతి, ఇంఫాల్, జమ్మూ, శ్రీనగర్‌లలో బోహాగ్ బిహు/చీరోబా/బైసాఖీ/బిజు ఫెస్టివల్ ఏప్రిల్ 15 (సోమవారం): గౌహతి, సిమ్లాలో బోహాగ్ బిహు/హిమాచల్ డే ఏప్రిల్ 17 (మంగళవారం): గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో శ్రీరామ నవమి ఏప్రిల్ 20 (శనివారం): అగర్తలాలో గరియా పూజ కోసం బ్యాంకులకు హాలిడే ఏప్రిల్ 21- ఆదివారం ఏప్రిల్ 27- నాలుగో శనివారం ఏప్రిల్ 28- ఆదివారం బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి. -
మార్చిలో బ్యాంక్ సెలవులు ఇవే - చూసారా..
2024 ఫిబ్రవరి ముగియడానికి మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెలతో పోలిస్తే వచ్చే నెలలో (మార్చి) బ్యాంకులకు సెలవులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి నెలలో ఏకంగా 14 రోజులు బ్యాంకులు మూత పడనున్నట్లు తెలుస్తోంది. మార్చి 1 - చప్చుర్ కుట్ - మిజోరాం మార్చి 6 - మహర్షి దయానంద్ సరస్వతి జయంతి మార్చి 8 - మహా శివరాత్రి / శివరాత్రి మార్చి 12 - రంజాన్ ప్రారంభం మార్చి 22 - బీహార్ డే - బీహార్ మార్చి 23 - భగత్ సింగ్ అమరవీరుల దినోత్సవం - అనేక రాష్ట్రాలు మార్చి 25 - హోలీ మార్చి 29 - గుడ్ ఫ్రైడే మార్చి 31 - ఈస్టర్ హాలిడే ఈ సెలవులు కాకుండా మార్చి 9, 23 రెండవ, నాలుగవ శనివారాలు.. 3, 10, 17, 24, 31 ఆదివారం సెలవులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం 14 సెలవులు ఉన్నాయి. కాబట్టి బ్యాంకులు పనిచేయవు. బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇదీ చదవండి: స్విగ్గీ అకౌంట్‌తో రూ.97 వేలు మాయం చేశారు - ఎలా అంటే? -
పల్లెకు బైబై.. పట్నం దారిలో కిటకిటలాడుతున్న బస్సులు, రైళ్లు
సాక్షి, విజయవాడ: సంక్రాంతి సెలవులు ముగియడంతో పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో ఏపీకి తరలి వెళ్లిన వారంతా రిటర్న్ అవుతున్నారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ రహదారిపై హైదరాబాద్ వైపు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. వేలాది వాహనాల్లో ప్రజలు పల్లెల నుంచి పట్నం బాట పడుతున్నారు. చౌటుప్పల్ వద్ద పంతంగి టోల్ ప్లాజా, కేతేపల్లి వద్ద కొర్లపాడ్ టోల్ ప్లాజాల వద్ద రద్దీకి అనుగుణంగా బూత్‌ల సంఖ్యను పెంచారు. మరోపక్క ఏపీలో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. కాకినాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు బస్సులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇక ట్రావెల్స్ బస్సులైతే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇదీచదవండి.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. ట్రాఫిక్ ఆంక్షలివే -
ఢిల్లీ స్కూళ్లకు మరో 5 రోజులు సెలవులు
న్యూఢిల్లీ: ఢిల్లీలో చలి తీవ్రత పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలకు ఈ నెల 12వ తేదీ వరకు సెలవులను పొడిగించింది. ఢిల్లీలో పాఠశాలలకు సోమవారంతో శీతాకాల సెలవులు ముగియాల్సి ఉంది. ‘ఢిల్లీలో చలి వాతావరణ పరిస్థితులు కొనసాగుతుండటంతో నర్సరీ నుంచి అయిదో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను మరో అయిదు రోజుల పాటు మూసి ఉంచాలని నిర్ణయించాం’అని విద్యాశాఖ మంత్రి అతిషి ఆదివారం ‘ఎక్స్’లో తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తమ విద్యార్థుల కోసం ఆన్లైన్ తరగతులు నిర్వహించుకోవచ్చని తెలుపుతూ విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం ఉదయం 8 గంటలు–సాయంత్రం 5 గంటల మధ్యలోనే తరగతులు నడపాలని కోరింది. -
బ్యాంక్ హాలిడేస్ జనవరిలో ఎన్ని రోజులంటే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే 2024లో బ్యాంకుల సెలవులకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఇప్పటికే విడుదకైనా జాబితా ప్రకారం, జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ, ప్రాంతీయ సెలవుల కారణంగా మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవని (సెలవు దినాలు) తెలుస్తోంది. రిపబ్లిక్ డే కారణంగా జనవరి 26 నేషనల్ హాలిడే, మిగిలిన రోజుల్లో ప్రాంతీయ పండుగలు, రెండవ & నాల్గవ శనివారాలు, ఆదివారాలు ఉన్నాయి. ఇవన్నీ వేరు వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంటాయి. జనవరి 2024లో బ్యాంక్ సెలవుల జాబితా జనవరి 1 (సోమవారం): దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జనవరి 11 (గురువారం): మిజోరంలో మిషనరీ డే జరుపుకున్నారు జనవరి 12 (శుక్రవారం): పశ్చిమ బెంగాల్లో స్వామి వివేకానంద జయంతిని జరుపుకున్నారు జనవరి 13 (శనివారం): పంజాబ్, ఇతర రాష్ట్రాల్లో లోహ్రీ జరుపుకుంటారు జనవరి 14 (ఆదివారం): చాలా రాష్ట్రాల్లో మకర సంక్రాంతి జరుపుకుంటారు జనవరి 15 (సోమవారం): తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో పొంగల్, తమిళనాడులో తిరువల్లువర్ దినోత్సవం జరుపుకుంటారు. జనవరి 16 (మంగళవారం): పశ్చిమ బెంగాల్, అస్సాంలో తుసు పూజ జరుపుకుంటారు జనవరి 17 (బుధవారం): కొన్ని రాష్ట్రాల్లో గురు గోవింద్ సింగ్ జయంతి జరుపుకుంటారు జనవరి 23 (మంగళవారం): సుభాష్ చంద్రబోస్ జయంతిని అనేక రాష్ట్రాల్లో జరుపుకున్నారు జనవరి 26 (శుక్రవారం): భారతదేశం అంతటా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు జనవరి 31 (బుధవారం): అస్సాంలో మీ-డ్యామ్-మీ-ఫై జరుపుకుంటారు -
తెలంగాణ: 2024 సెలవుల్ని ప్రకటించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: మరికొన్నిరోజుల్లో కొత్త ఏడాది రాబోతోంది. ఈ క్రమంలో సెలవులపై మంగళవారం ఒక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాదిలో అన్ని పండుగలతో కలిపి 27 సాధారణ(జనరల్), 25 ఆఫ్షనల్(ఐచ్ఛిక సెలవులు) హాలీడేస్ ఇస్తున్నట్లు ఉత్వర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. జనవరి 15న సంక్రాంతి సెలవు, మార్చి 8న మహా శివరాత్రి, మార్చి 25న హోలి, ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 17న శ్రీరామనవమి, జూన్ 17న బక్రీద్, సెప్టెంబర్ 7న వినాయక చవితి, అక్టోబర్ 10న దసరా, అక్టోబర్ 31న దీపావళికి సెలవులుగా పేర్కొంది. -
విద్యార్థులకు శీతాకాలపు సెలవులు తగ్గింపు
దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు శీతాకాలపు సెలవులకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ఈసారి పాఠశాలలకు శీతాకాలపు సెలవులు 6 రోజులు మాత్రమే ఉండనున్నాయి. గతంలో జనవరి ఒకటి నుండి జనవరి 15 వరకు పాఠశాలకు సెలవులు ఇచ్చేవారు. అయితే ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం పాఠశాలలు జనవరి ఒకటి నుండి జనవరి ఆరు వరకు మాత్రమే మూసివేయనున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత తక్కువగా ఉన్నందున ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే నవంబర్ 9 నుండి నవంబర్ 18 వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. అందుకే పిల్లల చదువులను దృష్టిలో ఉంచుకుని ఈసారి శీతాకాలపు సెలవులను తగ్గించాలని నిర్ణయించారు. ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లో.. 2023-24 అకడమిక్ సెషన్లో శీతాకాలపు సెలవులు జనవరి ఒకటి నుండి జనవరి ఆరు వరకు ఉండనున్నాయని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: గర్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు -
ఆర్టీసీలో ‘మానసిక’ టెన్షన్!
ముందు రోజు రాత్రివిధులు నిర్వహించి వచ్చాడు ఆ డ్రైవర్.. మరుసటి రోజు రాత్రి విధులకు వెళ్లేలోపు కనీసం నాలుగు గంటలన్నా నిద్రపోవాలి.. కానీ దగ్గరి బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లాల్సి ఉంది, సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో పగటి పూట వేడుకలో గడిపి, 110 కి.మీ. దూరంలోని తానుంటున్న పట్టణం నుంచి సొంత వాహనం నడుపుకుంటూ హైదరాబాద్ వచ్చి విజయవాడ బస్సు తీసుకుని బయలుదేరాడు. దారిలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనటంతో మృతి చెందాడు. మరో 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ డ్రైవర్ కొన్నేళ్లుగా కుటుంబ వివాదాలతో సతమతమవుతున్నాడు.. దాదాపు కుటుంబ సభ్యులు వెలివేసినంత పనిచేశారు.. దీంతో అతని మానసిక స్థితి అదుపు తప్పింది. దూరప్రాంత బస్సు కావటంతో ఇద్దరు డ్రైవర్లు విధుల్లో ఉంటున్నారు. మరో డ్రైవర్ నడుపుతున్నప్పుడు అతను మద్యం సేవిస్తున్నాడు. ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేయగా, ఆ రోజు అధికంగా మద్యం తాగి ఉన్నట్టు తేలి అధికారులు కంగుతిన్నారు. అప్పుడు కాని అతన్ని విధుల నుంచి తప్పించలేదు. సాక్షి, హైదరాబాద్: ఇది తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితి. సగటున ఒక్కో బస్సులో 60 మందికిపైగా ప్రయాణికులు ఉంటారు. వారిని క్షేమంగా గమ్యం చేర్చేది డ్రైవరే. కానీ, ఇప్పుడు ఆర్టీసీకి డ్రైవర్లపై పర్యవేక్షణే లేకుండా పోయింది. డ్రైవర్ భద్రంగా బస్సును గమ్యం చేర్చటమనేది డ్రైవింగ్ స్కిల్స్ పైనే కాకుండా, అతని మానసిక స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే గతంలో డ్రైవర్‌పై నిఘా, పర్యవేక్షణ ఉండేది. కానీ, క్రమంగా నష్టాలను అధిగమించేందుకు ఆదాయంపైనే దృష్టి కేంద్రీకరించటం మొదలయ్యాక ఇది గతి తప్పింది. ఇప్పుడు డ్రైవర్ల కొరత కూడా ఉండటంతో, కచ్చి తంగా ఉన్నంత మంది విధులకు వచ్చేలా చూడ్డానికే అధికారులు పరిమితమవుతున్నారు. వారికి గతంలోలాగా సెలవులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో విధులు ముగిసిన తర్వాత నుంచి తిరిగి విధులకు వచ్చే వరకు ఆ డ్రైవర్ విషయాన్ని సంస్థ పట్టించుకోవటం లేదు. డ్యూటీకి వచ్చే సమయానికి అతని మానసిక స్థితి ఏంటో కూడా తెలుసుకోలేకపోతున్నారు. మద్యం తాగి ఉన్నాడా లేదా అన్న ఒక్క విషయాన్ని మాత్రమే తేల్చుకుని బస్సు అప్పగిస్తున్నారు. సెలవులు లేక.. ఒంట్లో కాస్త నలతగా ఉన్నా, విశ్రాంతి సమయంలో నిద్రపోలేని పరిస్థితిలో ఉన్నా, రకరకాల వివాదా లతో మానసికంగా ఆందోళనతో ఉన్నా.. డ్రైవింగ్ సరిగా చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో తనకు సెలవు కావాలంటూ డ్రైవర్లు అడుగుతారు. అయితే, సెలవు ఇస్తే డ్రైవర్ల కొరత వల్ల సరీ్వసునే రద్దు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో వా రికి సెలవుల్లేక విధులకు హాజరు కావాల్సి వస్తోంది. విజయవాడ మార్గంలో జరిగిన యాక్సిడెంట్లో చనిపోయిన డ్రైవర్.. ఆ రోజు నిద్రలేమితో ఉండి కూడా సెలవుకు దరఖాస్తు చేయకుండా డ్యూటీకి హాజరయ్యాడని తెలిసింది. ఆ విధానమేమైంది..? గతంలో ప్రతి డిపోలో స్పేర్ డ్రైవర్లు ఉండేవారు. డ్యూటీ చేయలేని స్థితిలో డ్రైవర్ ఉంటే అతని స్థానంలో మరో డ్రైవర్‌ను పంపే వారు. కానీ 13 ఏళ్లుగా డ్రైవర్ల రిక్రూట్మెంట్ లేకపోవటం, రిటైర్మెంట్లు, మరణించడం, పదోన్నతులు.. వంటి కారణాల వల్ల డ్రైవర్లకు కొరత ఏర్పడింది. గతంలో డ్రైవర్ల మానసిక స్థితిని తెలుసుకునే విధానం ఉండేది. ఏవైనా కారణాలతో వారు మానసికంగా కుంగిపోతున్నారా అన్నది సంస్థకు తెలిసే ఏర్పాటు ఉండేది. ప్రతి సంవత్సరారంభంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేవారు. వాటికి డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా డ్రైవర్ల స్థితిగతులపై ఆర్టీసీకి సమాచారం చేరేది. డ్రైవర్లతోపాటు, వారి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ చేసేవారు. డ్యూటీకి–డ్యూటీకి మధ్య చాలినంత నిద్ర ఉండేలా చూడాలంటూ కుటుంబ సభ్యులకు సూచించేవారు. ఇప్పుడు ఆ వారోత్సవాలు సరిగా నిర్వహించటం లేదు. సంవత్సరంలో ఒకసారి ప్రమాదరహిత వారోత్సవాలు నిర్వహించేవారు. ఆ వారంలో ఒక్క బస్సు కూడా ప్రమాదానికి గురి కాకుండా డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలుండేవి. ఇది కూడా వారి నైపుణ్యం, మానసిక స్థితి తెలుసుకునేందుకు ఉపయోగపడేది. ఇప్పుడు దీన్ని నిర్వహించటం లేదు. వరుస ప్రమాదాలతో.. చాలా విరామం తర్వాత మళ్లీ ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబ సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. ఇటీవలి వరుస ప్రమాదాలతో సంస్థలో టెన్షన్ నెలకొంది. డ్యూటీకి వచ్చేప్పుడు సరైన స్థితితో డ్రైవర్లు ఉండేలా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులది అని అధికారులు చెబుతున్నారు. వారు రెస్ట్ సమయంలో తగినంతగా నిద్రపోవటం, సెల్ఫోన్లతో ఎక్కువ సేపు గడపకుండా చూడటం, అనవసర వివాదాలతో ఒత్తిడికి గురికాకుండా చూడటం.. లాంటి అంశాలపై కుటుంబ సభ్యులు దృష్టి సారించాలని చెప్పనున్నారు. కానీ, గతంలో ఉన్నట్టు పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేస్తే తప్ప ఇది ఫలించే సూచనలు కనిపించటం లేదు. డ్రైవర్లపై పని ఒత్తిడి తగ్గటంతోపాటు డ్రైవింగ్ చేయలేని పరిస్థితి ఉంటే సెలవు ఇచ్చే ఏర్పాటు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అది జరగాలంటే, తాత్కాలిక పద్ధతిలోనైనా డ్రైవర్ల రిక్రూట్మెంట్ ఉండాలని వారు పేర్కొంటున్నారు. -
నేటినుంచి మళ్లీ బడులు
సాక్షి, హైదరాబాద్: దసరా సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు గురువారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి విజయదశమి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల వేడి నెలకొనడంతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధనపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే సిలబస్ అనుకున్న మేర పూర్తవ్వలేదు. చాలా స్కూళ్లల్లో 40 శాతం సిలబస్ కూడా పూర్తవ్వలేదు. దీంతో ఎన్నికల లోపు సిలబస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ సూచించింది. రాష్ట్రంలో దాదాపు 80 శాతం మంది టీచర్లు పోలింగ్ విధులకు హాజరవ్వాల్సి ఉంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి శిక్షణ కూడా ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. ఇప్పుడు జిల్లాల వారీగా శిక్షణ ఇస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత మండల స్థాయిలో టీచర్లకు శిక్షణ ఇస్తారు. అంటే మరో 15 రోజుల్లో ఉపాధ్యాయులు పూర్తిగా ఎన్నికల శిక్షణలోనే పెద్ద సంఖ్యలో పాల్గొనే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సిలబస్ పూర్తి చేసేందుకు కచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ముఖ్యంగా టెన్త్ పరీక్షలను దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. పబ్లిక్ పరీక్షలు కావడంతో సిలబస్ కోసం అదనపు క్లాసులు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఎన్నికల తర్వాత డిసెంబర్లో ఈ ప్రక్రియ చేపట్టే వీలుందని చెబుతున్నారు. దసరా వరకూ 70 శాతం సిలబస్ పూర్తవ్వాల్సి ఉంటుంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని, మిగిలిన సిలబస్‌ను డిసెంబర్లో ప్రత్యేక క్లాసుల ద్వారా చేపట్టాలని భావిస్తున్నారు. దశల వారీగా అల్పాహారం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి దసరా తర్వాత దీన్ని అమలు చేయాలని భావించినా, ఎన్నికల షెడ్యూల్డ్ వస్తుందని తెలియడంతో ముందే ప్రారంభించారు. పూర్తి స్థాయిలో అన్ని స్కూళ్ళల్లో దసరా తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని అనుకున్నారు. కానీ ఇందుకు అవసరమైన ప్రణాళిక పూర్తవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ప్రతీ స్కూలులో వంట సామాగ్రి, బడ్జెట్ అంశాలపై స్పష్టత లేదంటున్నారు. దీంతో తొలి రోజు మండలానికి ఒక స్కూల్లో సీఎం అల్పాహారం పథకం అమలు చేయాలనిఅధికారులు నిర్ణయించారు. ప్రతీ వారం ప్రతీమండలంలో ఒక్కో స్కూల్ చొప్పున, దశలవారీగా విస్తరించబోతున్నట్టు అధికారులు తెలిపారు. -
25 నుంచి 27 వరకు హైకోర్టుకు దసరా సెలవులు
సాక్షి, అమరావతి: హైకోర్టుకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సెలవులు ఇస్తూ హైకోర్టు రిజ్రిస్టార్ జనరల్ వై.లక్ష్మణరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హైకోర్టు కార్యకలాపాలు తిరిగి ఈ నెల 30న ప్రారంభమవుతాయి. ఈ సెలవుల్లో అత్యవసర కేసులను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి వెకేషన్ బెంచ్‌లను ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ ఏవీ రవీంద్ర బాబు, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి వెకేషన్ కోర్టు జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఇందులో జస్టిస్ వెంకటేశ్వర్లు, జస్టిస్ రవీంద్రబాబు ధర్మాసనంలో కేసులను విచారిస్తారు. జస్టిస్ జ్యోతిర్మయి సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. హెబియస్ కార్పస్, బెయిల్స్, ముందస్తు బెయిల్స్, ఇతర అత్యవసర వ్యాజ్యాలపై మాత్రమే వెకేషన్ జడ్జిలు విచారణ జరపాల్సి ఉంటుంది. ఈ సెలవుల్లో అత్యవసర కేసులు దాఖలు చేయాలనుకునే వారు ఈ నెల 25న దాఖలు చేయాల్సి ఉంటుంది. అలా దాఖలైన వ్యాజ్యాలను న్యాయమూర్తులు ఈ నెల 27న విచారిస్తారు. -
దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు
మంగళగిరి: రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ప్రకటించిన దసరా పండుగ సెలవుల నిబంధనలను అన్ని ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు తప్పని సరిగా పాటించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్ కేసలి అప్పారావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమిస్తే ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోమవారం మంగళగిరిలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కార్యాలయంలో మాట్లాడారు. ప్రభుత్వ నియమ నిబంధనలును కొన్ని ప్రైవేటు, కార్పోరెట్ పాఠశాలలు పాటించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని, మరికొన్ని విద్యా సంస్థలు మొబైల్ ఫోన్ ద్వారా హోమ్ వర్కులు చేయమని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడైనా పాఠశాలలు ప్రత్యేక తరగతులు లేదా ఆన్లైన్ తరగతులు లేదా ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తే apscpcr2018@gmail.com మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. మండల, జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి విశాఖ ఐటీ హబ్‌గా మారబోతోంది: సీఎం జగన్ -
AP Dussehra Holidays: నేటి నుంచి పాఠశాలలకు దసరా సెలవులు
చిలకలపూడి(మచిలీపట్నం): ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించినట్లు డీఈవో తాహెరాసుల్తానా శుక్రవారం తెలిపారు. మిషనరీ పాఠశాలకు ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సెలవులు ఇచ్చినట్లు చెప్పారు. జిల్లాలోని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సెలవు దినాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్లకు చెందిన పాఠశాలలు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. -
ఏపీలో రేపటి నుంచి దసరా సెలవులు
సాక్షి, విజయవాడ: ఏపీలోని పాఠశాలలకు శనివారం నుంచి దసరా సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. తిరిగి అక్టోబరు 25న పాఠశాలలు తెరుచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 11 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సారి విజయదశమి(దసరా) 5,500 ప్రత్యేక సర్వీసులను ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నడుపుతోంది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 26వ దాకా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు.. సాధారణ ఛార్జీలతోనే ఈ సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ నడిపిస్తోంది. ఎప్పుడు.. ఎక్కడి నుంచంటే.. 13 నుంచి 22 దాకా.. దసరా ముందు రోజులలో 2,700 బస్సుల్ని, అలాగే.. పండుగ దినాలైన 23వ తేదీ నుంచి 26 దాకా(పండుగ ముగిశాక కూడా) 2,800 బస్సుల్ని నడిపించనుంది. హైదరాబాద్ నుండి 2,050 బస్సులు, బెంగుళూరు నుండి 440 బస్సులు,చెన్నై నుండి 153 బస్సులువివిధపట్టణాలకు నడపబడతాయి.విశాఖపట్నం నుండి 480 బస్సులు,రాజమండ్రి నుండి 355 బస్సులు, విజయవాడ నుండి 885 బస్సులు, అదే విధంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి వివిధ ప్రాంతాలకు/ పల్లెలకు/ నగరాలకు 1,137 ప్రత్యేక బస్సుల కేటాయింపుతో రద్దీని తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. చదవండి: విద్యా సంస్కరణలపై వక్రభాష్యాలు -
రేపటి నుంచి దసరా సెలవులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దసరా సందడి మొదలైంది. సర్కార్, ప్రైవేట్ బడులకు రేపటి(అక్టోబర్ 13) నుంచి సెలవులు కావడంతో కోలాహలం నెలకొంది. ఇవాళ సాయంత్రం నుంచే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. దాదాపు అన్ని పాఠశాలల్లో నిన్నటి వరకు పరీక్షలు ముగిశాయి. ఈ రోజు స్కూల్స్, కాలేజీలలో పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. విద్యార్థినులు బతుకమ్మలతో స్కూళ్లు, కాలేజీలకు తరలి వచ్చారు. బొడ్డెమ్మ, బతుకమ్మ ఆడుకున్నారు. హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థులతో పాటు సొంతూళ్లకు జనాల ప్రయాణాలతో బస్సులు కిక్కిరిసిపోయాయి. మరోవైపు మరోవైపు జూనియర్ కాలేజీలకు ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. తిరిగి ఈ నెల 26న విద్యాసంస్థలన్నీ పునప్రారంభం అవుతాయి. ఇప్పటికే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా.. సాధారణ ఛార్జీలతో ఆర్టీసీ ఐదువేలకు పైగా స్పెషల్ సర్వీసులను నడపాలని నిర్ణయించుకుంది. అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. -
ఏపీలో 14 నుంచి దసరా సెలవులు
సాక్షి, అమరావతి: ఈ నెల 14 నుంచి 24 వరకు ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)–2 పరీక్షలు నిర్వహించనుంది. అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు. ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పాత పద్ధతిలోనే పరీక్షలు జరుగుతాయి. ప్రశ్నాపత్రాలను పరీక్ష జరిగే రోజు మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు పంపిస్తారు. పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల హెచ్ఎంలకు ప్రశ్నాపత్రాలు పంపాలని ఇప్పటికే ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 9, 10 తరగతుల విద్యార్థులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం సమయంలో. 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మద్యాహ్నం పరీక్షలు ఉంటాయి. ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొక పరీక్ష నిర్వహిస్తారు. 10వ తేదీలోగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్ధులకు అందిస్తారు. అలాగే ఆన్లైన్ పోర్టల్లోనూ మార్కులు నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తెలియజేయాలని సూచించింది. -
3 నుంచి ఎఫ్ఏ 2 పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)–2 పరీక్షలు నిర్వహించనుంది. అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు. ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పాత పద్ధతిలోనే పరీక్షలు జరుగుతాయి. ప్రశ్నాపత్రాలను పరీక్ష జరిగే రోజు మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు పంపిస్తారు. పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల హెచ్ఎంలకు ప్రశ్నాపత్రాలు పంపాలని ఇప్పటికే ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 9, 10 తరగతుల విద్యార్థులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మ«ద్యాహ్నం పరీక్షలు ఉంటాయి. ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొక పరీక్ష నిర్వహిస్తారు. 10వ తేదీలోగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్ధులకు అందిస్తారు. అలాగే ఆన్లైన్ పోర్టల్లోనూ మార్కులు నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తెలియజేయాలని సూచించింది. కాగా, ఈ నెల 14 నుంచి 24 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. -
తెలంగాణలో ఎల్లుండి ఆ స్కూళ్లకు హాలీడే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష ఈ నెల 15వ(శుక్రవారం) తేదీన జరగనుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటాయి. అయితే, ఎగ్జామ్ సెంటర్లుగా ఎంపిక చేసిన స్కూళ్లకు ఎల్లుండి పూర్తిగా హాలీడే ప్రకటించింది ప్రభుత్వం. అంతేకాదు.. రేపు(గురువారం కూడా) మధ్యాహ్నాం నుంచి సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదిలా ఉండగా.. టీఎస్ టెట్-2023 నోటిఫికేషన్ ఈ ఏడాది ఆగస్టు ఒకటిన విడుదలైంది. ఆగస్టు 2 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. 2,83,620 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. హల్ టికెట్లను అభ్యర్థుల కోసం అందుబాటులో ఉంచారు కూడా. టెట్ అభ్యర్థుల కోసం.. హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పూర్తి వివరాలను సరిచూసుకోవాలి. పేరులో స్వల్ప అక్షర దోషాలు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, జెండర్, డిసేబిలిటీ తదితర వివరాలు సరిగా లేకుంటే పరీక్ష హాలులో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలి. హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం సరిగ్గా లేకపోతే అభ్యర్థుల ఇటీవలి తాజా ఫొటోను అతికించి గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించుకోవాలి. ఆధార్ కార్డు, ఇతర ఐడీతో సంబంధిత జిల్లా డీఈవోను సంప్రదించాలి. డీఈవో పర్మిషన్ అనంతరమే పరీక్షకు అనుమతించడంలో తగు నిర్ణయం తీసుకుంటారు. పరీక్షాకేంద్రం చిరునామాను ఒకరోజు ముందుగానే సంప్రదించడం ఉత్తమం. హల్ టికెట్ ఇతర వివరాల కోసం https://tstet.cgg.gov.in/ క్లిక్ చేయండి -
వర్షం ఉంటే బడులకు సెలవులివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్కూళ్లను నడపాలా? వద్దా? అనే విషయాన్ని జిల్లా యంత్రాంగమే నిర్ణయించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి డీఈవోలకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ప్రాంతంలో వర్షం ప్రభావం ఒక్కోలా ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండగా, కొన్నిచోట్ల వర్ష ప్రభావం అంతగా ఉండటం లేదు. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించడం సరికాదని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. వాతావరణ శాఖ నివేదికను పరిగణనలోనికి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా సెలవులు ఇవ్వాలన్న ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌ను విద్యాశాఖ తిరస్కరించింది. హైదరాబాద్‌లో తీవ్ర స్థాయిలో వర్షం ఉన్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో వర్షం ఏమాత్రం లేదని అధికారులు చెబుతున్నారు. కొన్ని జిలా్లల్లో వర్షం కారణంగా స్కూళ్లు నడపలేని పరిస్థితి ఉన్నప్పుడు, మరికొన్ని జిల్లాల్లో సాధారణ పరిస్థితులు ఉంటున్నాయని గుర్తించారు. వర్షం తీవ్రంగా ఉండి, వరదలు, వాగులు పొంగడం వంటి పరిస్థితులు ఉన్నప్పుడు విద్యార్థులు స్కూళ్లకు రాలేరని విద్యాశాఖ భావిస్తోంది. అలాంటప్పుడు జిల్లావ్యాప్తంగా సెలవు ప్రకటించే అధికారం ఆ జిల్లా యంత్రాంగానికే ఉంటుందని, ఈ దిశగా స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నామని ఓ అధికారి తెలిపారు. వర్షాలతో ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చిన పక్షంలో ఇతర సా«దారణ సెలవులు తగ్గించి, సిలబస్ పూర్తికి చర్యలు తీసుకోవాలని, అవసరమైనప్పుడు ప్రత్యేక క్లాసులు కూడా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించింది. -
భారీ వర్షం.. హైదరాబాద్‌లో నేడు స్కూళ్లకు సెలవు
సాక్షి, హైదరాబాద్: భారీవర్షాల కారణంగా హైదరాబాద్‌లో స్కూళ్లకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. పొరుగున్న ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పాఠశాలలకు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానతో హైదరాబాద్‌లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. నాలాలు పొంగిపోర్లుతున్నాయి. రోడ్లపై పలు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ. మరో మూడు గంటల పాటు భారీ వర్షం కొనసాగవచ్చని తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో డీఆర్ఎఫ్ బృందాలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని నగర వాసులను అధికారులు సూచించారు. చదవండి: హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీ.. -
ప్రధాని మోదీ ఎన్ని సెలవులు తీసుకున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ మొత్తం ఎన్ని సెలవులు తీసుకున్నారంటూ పూణేకు చెందిన ఓ పౌర హక్కుల కార్యకర్త ఆర్టీఐకి దరఖాస్తు చేయగా ప్రధాని ఇంతవరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని ఆర్టీఐ ద్వారా ప్రధాని కార్యాలయం సమాధానమిచ్చింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ విషయాన్ని ఎక్స్(ట్విట్టర్)లో పొందుపరుస్తూ మా ప్రధాని మా గర్వకారణం అని రాశారు. పూణేకు చెందిన పౌర హక్కుల కార్యకర్త ప్రఫుల్ పి సర్దా ఆర్టీఐ ద్వారా ప్రధాని కార్యాలయానికి రెండు అంశాలపై ఆరా తీశారు. మొదటిది ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్ని రోజులు సెలవు తీసుకున్నారని? రెండవది ప్రధాని ఇంతవరకు విధులకు హాజరైన మొత్తం రోజులు, వివిధ కార్యక్రమాలకు హాజరైన దినాలు ఎన్ని? ఈ వివరాలు తెలపమని కోరారు. ప్రధాని కార్యాలయంలో ఆర్టీఐ అర్జీల వ్యవహారాలను సమీక్షించే కార్యాలయ సెక్రెటరీ పర్వేశ్ కుమార్ ఈ రెండు ప్రశ్నలకు బదులిస్తూ.. మొదటిగా ప్రధాని ఇంతవరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని రెండవదిగా ఆయన ప్రతిరోజూ విధులకు హాజరవుతూనే ఉన్నారని ఈ తొమ్మిదేళ్లలో సుమారు 3000 కార్యక్రమాలకు హాజరయ్యారని.. అంటే కనీసం రోజుకొక కార్యక్రమంలోనైనా ఆయన పాల్గొంటూ వస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టీఐ ద్వారా ప్రధాని కార్యాలయం తెలిపిన ఈ వివరాలను అస్సాం ముఖ్యమంత్రి తన అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. మరో కార్యక్రమంలో పాల్గొన్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ కూడా ఇదే విషయంపై స్పందిస్తూ ప్రధానితో కలిసి పనిచేయడాన్ని క్రికెట్ పరిభాషలో చెబుతూ.. కెప్టెన్ మోదీతో పని ఉదయాన్నే 6 గంటలకు మొదలై.. చాలా ఆలస్యంగా ముగుస్తుందని అన్నారు. ఆయన మనకు అవకాశమిస్తే మనము వికెట్ తీస్తామని ఆయన అంచనా వేస్తుంటారని అన్నారు. నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండటం మన దేశం చేసుకున్న అదృష్టమని.. ఆయన ప్రధాన మంత్రిగా ఉన్నారని గానీ ఆయన మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నానని గానీ నేను ఈ మాట చెప్పడంలేదన అన్నారు జయశంకర్. గతంలో కూడా 2016లో ప్రధాని సెలవుల గురించి మరొకరు ఇలాగే ఆర్టీఐ ద్వారా ఆరా తీశారు. అప్పుడు కూడా ప్రధాని కార్యాలయం ఇదే సమాధానాన్నిచ్చింది. #MyPmMyPride pic.twitter.com/EPpkMCnLke — Himanta Biswa Sarma (@himantabiswa) September 4, 2023 ఇది కూడా చదవండి: మీడియా తప్పుడు కథనాలు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ప్రభుత్వం -
ఆ మూడ్రోజులు ‘ఢిల్లీ’కి సెలవు..
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ జి–20 శిఖరాగ్ర సదస్సుకు సమాయత్తమవుతోంది. సెపె్టంబర్ 8, 9, 10వ తేదీల్లో జరిగే ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. సదస్సు దృష్ట్యా వచ్చే నెల 8 నుంచి మూడ్రోజుల పాటు ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సదస్సుకు హాజరవుతున్న భాగస్వామ్య దేశాల నేతల భద్రత దృష్ట్యా ఆ మూడు రోజులూ లుటియన్స్ ఢిల్లీలోని అన్ని మాల్స్, మార్కెట్లను మూసి ఉంచాలన్న పోలీసు శాఖ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా ఆమోదం తెలిపారు. అంతేకాకుండా, రాజధానిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు, దుకాణాలు, వాణిజ్య వ్యాపార సంస్థలను మూసివేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా సుప్రీంకోర్టు, సెంట్రల్ సెక్రటేరియట్ సహా కొన్ని మెట్రో స్టేషన్లు మూసివేయనున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నిర్దేశిత ప్రాంతాల్లో ప్రభుత్వ బస్సుల రాకపోకలను గణనీయంగా తగ్గించనున్నారు. సదస్సుకు 20 దేశాల అధినేతలు సహా 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరయ్యే అవకాశం ఉంది. హాజరయ్యే ముఖ్యుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, యూకే ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ల తదితరులున్నారు. హోటళ్లకు పెరిగిన గిరాకీ... జీ20 సదస్సు నేపథ్యంలో ఢిల్లీ సహా, గురుగ్రావ్, నోయిడాల్లోని పెద్ద హోటళ్లకు గిరాకీ పెరిగింది. ప్రపంచ నాయకులతో పాటు వారి ప్రతినిధి బృందాలు, భారీ రక్షణ, మీడియా బృందాలు ముందుగానే భారత్ చేరుకుంటుండటంతో టాప్ ఫైవ్ స్టార్ హోటళ్లలో బుకింగ్‌లు పెరిగాయి. సెపె్టంబర్ 6 నుంచి 12 మధ్య అన్ని ఫైవ్ స్టార్ హోటళ్లు పూర్తిగా బుక్ అయ్యాయని తెలుస్తోంది. హోటల్ గదుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలోని ఏరోసిటీలోని హోటల్లో ఉత్తమమైన సూట్ ఒక రాత్రికి రూ.20 లక్షల చొప్పున కోట్ చేశారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పార్లమెంట్‌కు కూతవేటు దూరంలోని జన్‌పథ్ సమీపంలోని ఒక హోటల్లో ప్రధాన సూట్‌కు ఒక్క రాత్రికి రూ.15 లక్షలకు బుక్ అయిందని అవి వెల్లడించాయి. -
ఈ–సేవ కేంద్రాన్ని ప్రజలు, న్యాయవాదులు వినియోగించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కోర్టుకు వచ్చే ప్రజలు, న్యాయవాదులు ఈ–సేవ కేంద్రం సేవలను వినియోగించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సూచించారు. అందరికీ న్యాయాన్ని చేరువ చేయడం, న్యాయ సేవలను విస్తరించాలన్న దృఢ సంకల్పంతో కేంద్రం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కక్షిదారులు ఇక్కడ కేసు స్థితిని కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. రాష్ట్ర హైకోర్టు ఆవరణలో ఈ–సేవ కేంద్రాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే శనివారం ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఈ–కమిటీ ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేస్తుంది. ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కోర్టు నుంచి ఏదైనా సాఫ్ట్‌కాపీ కావాలన్నా ఈ కేంద్రం నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, న్యాయవాదులు పాల్గొన్నారు. కాగా, కేసు స్థితి (ప్రస్తుత స్థితి, తదుపరి విచారణ తేదీ), ఈ–కోర్టు యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి జడ్జీల సెలవుల సమాచారం తెలుసుకోవడానికి, సర్టీఫైడ్ కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు, ఉచిత లీగల్ సర్విస్లు పొందడం వంటి వివరాలు, జైలులో ఉన్న వారిని కలిసేందుకు ఈ–ములాఖత్ అపాయింట్మెంట్ కోసం, కోర్టుకు సంబంధించిన అంశాల్లో ఈ–పేమెంట్స్ కోసం, ట్రాఫిక్ చలాన్లు, ఇతర నేరాల్లో చెల్లించాల్సిన నగదు చెల్లించడానికి.. ఇలా పలు రకాల సేవలను ఈ–సేవ కేంద్రం అందించనుంది. సిబ్బందితో మాట్లాడుతున్న సీజే జస్టిస్ అలోక్ అరాధే. చిత్రంలో న్యాయమూర్తులు జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ వినోద్‌కుమార్, జస్టిస్ సుధీర్‌కుమార్, జస్టిస్ సాంబశివరావు నాయుడు, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ శరత్, జస్టిస్ రాజేశ్వర్‌రావు, జస్టిస్ శ్రీనివాస్‌రావు, జస్టిస్ లక్ష్మీనారాయణ తదితరులు -
తడబడుతూ.. ముందుకు?!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైన్‌షాపుల నిర్వహణ కోసం రానున్న రెండేళ్ల కాలానికి లైసెన్సులు పొందేందుకు గాను చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియ గతంతో పోలిస్తే తడబడుతూ ముందుకెళుతోంది. 2023–25 సంవత్సరాలకు గాను వైన్‌షాపులకు లైసెన్సులను లాటరీ పద్ధతిలో కేటాయించేందుకు గాను ఈనెల 4వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, ఎనిమిదో రోజు శుక్రవారం ముగిసేనాటికి 15వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ గణాంకాలు చెపుతున్నాయి. అదే గత ఏడాది తొలి ఎనిమిది రోజుల్లో 14,500 వరకు దరఖాస్తులు రావడం గమనార్హం. తొలి ఏడు రోజుల్లో ఈసారి 8వేల వరకు దరఖాస్తులు రాగా, గతంలో 9వేల వరకు వచ్చాయి. గతంతో పోలిస్తే తొలి వారంలో దరఖాస్తుల సంఖ్య తగ్గినా, శుక్రవారం చివరి నిమిషంలో పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులతో ఎౖMð్సజ్ యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. అయితే, గతంలో షెడ్యూల్ ఇచ్చిన తర్వాత దరఖాస్తుల ప్రక్రియ కోసం 10 రోజులు సమయం ఇవ్వగా, ఈసారి 12 రోజులు సమయం ఇచ్చారు. రెండో శనివారం అయినప్పటికీ 12వ తేదీన కూడా దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఆదివారం, ఆగస్టు 15 సెలవు దినాలు కావడంతో మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో 16,17,18 తేదీల్లో భారీగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. గత రెండేళ్ల కాలానికి గాను మొత్తం 68 వేలకు పైగా దరఖాస్తులు రాగా, దరఖాస్తు రుసుంతో పాటు తొలి వాయిదా ఎక్సైజ్ ఫీజు కలిపి మొత్తం రూ.1,691 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అయితే, ఈసారి ఆ స్థాయిలో దరఖాస్తులు వస్తాయా రావా అన్న మీమాంసలో ఎక్సైజ్ వర్గాలుండడం గమనార్హం. రెండు పిల్లు, రెండు రిట్లు ఇక, మద్యం దుకాణాల కేటాయింపుపై గతం నుంచీ నాలుగు కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వైన్‌షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేయడంపై రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, మరో రెండు రిట్ పిటిషన్లు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనికి తోడు ఈసారి మరో రెండు కేసులు కోర్టుల్లో నమోదయ్యాయి. కొత్తగూడెం ఏరియాలోని కొన్ని దుకాణాలు షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నప్పటికీ గిరిజనులకు వాటికి కేటాయించకుండా జనరల్ కేటగిరీలో చూపెట్టారని ఒక పిటిషన్ దాఖలు కాగా, గిరిజనులకు రిజర్వేషన్లు కేటాయించడంలో రాష్ట్రమంతటా ఒకే విధానాన్ని పాటించడం లేదంటూ మరొక పిటిషన్ ఈసారి దాఖలు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కోర్టులు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తాయోననే ఆసక్తి కూడా అటు ఎక్సైజ్ వర్గాల్లోనూ, ఇటు మద్యం వ్యాపారుల్లోనూ వ్యక్తమవుతుండడం గమనార్హం. -
తెలంగాణలో రేపు అన్ని విద్యాసంస్థలకు సెలవు
-
భారీ వర్షాలు... పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు
-
వానలు తగ్గేదాకా..పరీక్షలన్నీ వాయిదా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, విద్యా సంస్థలకు వరుసగా సెలవులు ప్రకటించడం పరీక్షల నిర్వహణపై ప్రభావం చూపుతోంది. వర్షాలు తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అన్నిరకాల పరీక్షలను వాయిదా వేయాలని ఉన్నతాధికారులు యూని వర్సిటీలు, విద్యా సంస్థలకు సూచించారు. దీంతో ఇప్పటికే డిగ్రీ, ఇంజనీరింగ్‌లో ఇంటర్నల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. డిగ్రీ ప్రవేశాల తేదీల్లోనూ మార్పులు చేశారు. ఇంజనీరింగ్ సీట్లలో తొలివిడత చేరికలకు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలను పొడిగించారు. మలి విడత ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఈ నెల 27తో ఆప్షన్లు ఇచ్చే గడువు ముగుస్తుండటంతో.. ఈ గడువునూ మరికొంత పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు. బడుల్లో అంతర్గత పరీక్షలకు తిప్పలు పాఠశాలల్లోని విద్యార్థులకు జూలైలో జరగాల్సి ఉన్న ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ–1) పరీక్షలను వాయిదా వేయాలని అధికారులు భావిస్తున్నారు. వర్షాల మూలంగా వారం రోజులుగా సెలవులు ఇచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇటీవలి వరకు పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందలేదు. ఇప్పుడీ వర్షా లతో మళ్లీ అంతరాయం రావడంతో నిర్ణీత సిలబస్ పూర్తవలేదని.. ఎఫ్ఏ–1 పరీక్షలను వాయిదా వేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇంటర్ ప్రవేశాల తేదీ పొడిగింపు భారీ వర్షాలతో వరుస సెలవులు, ఇంటర్నెట్, ఇతర ఇబ్బందుల నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఈ నెల 25 నుంచి నెలాఖరు వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఇంకా లక్ష మందికిపైగా ఇంటర్లో చేరాల్సి ఉందని.. వానలు ఇలాగే కొనసాగితే గడువు పొడి గించాలని బోర్డ్ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. వర్సిటీల్లో పరీక్షలు వాయిదా.. దోస్త్ గడువు పెంపు ఉస్మానియా, జేఎన్టీయూహెచ్ సహా పలు యూని వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో అంతర్గత పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటిని ఈ నెలాఖరులో నిర్వ హించాలని భావించినా.. వానలు తగ్గే అవకాశం లేకపోవడంతో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు ఆలస్యం కాను న్నాయి. డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ కౌన్సెలింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీని ఈ నెల 28 వరకూ పొడిగించారు. ఇక ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్‌కు ఆప్షన్ల గడువు 27తో ముగియనుంది. ఈ నెల 31న సీట్ల కేటాయింపు ఉంటుందని సాంకేతిక విద్య కమిషనరేట్ తెలిపింది. వర్షాలు తగ్గకపోతే రెండో విడత చేరికల తేదీని పొడిగించే వీలుందని అధికారులు అంటున్నారు. -
భారీ వర్షాలు: తెలంగాణలో నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు
సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో బుధ, గురువారాలు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు. అనంతరం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్ని విద్యాసంస్థలకు బుధ, గురువారం సెలవులంటూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇది అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు వర్తిస్తుందని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థల పరిస్థితిపై ప్రభుత్వం ఆరా తీసింది. దీంతో ఉన్నతాధికారులు జిల్లాల నుంచి సమాచారం సేకరించారు. చదవండి: హైదరాబాద్ వర్షాలు.. ఆ ఏరియా వాళ్లు ఈ టైంకు ఆఫీస్‌లో లాగౌట్ చేయాల్సిందే అనేకచోట్ల విద్యార్థుల హాజరు తగ్గిందని, బడులకు వచ్చే అవకాశం లేదని జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు. దాదాపు 6 వేల బడుల్లో 30 శాతం హాజరు కూడా కన్పించలేదని తెలిసింది. వర్షాలు పడుతుండటంతో బడుల్లో మధ్యాహ్న భోజనం వండటానికీ అష్టకష్టాలు పడుతున్నారు. భోజనం వండే అవకాశం ఉండటం లేదని, తరగతి గదులకు సమీపంలోని వరండాల్లో వండటం వల్ల పొగతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని పలువురు హెచ్ఎంలు చెప్పారు. అన్నిచోట్ల రవాణా వ్యవస్థ స్తంభించిందని, రాకపోకలు నిలిచిపోతున్నాయని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితులను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించి సెలవులు ఇవ్వాలని మంత్రి సబితను ఆదేశించారు. -
భారీ వర్షాలు.. సెలవులు పొడిగింపు
-
విద్యాసంస్థలకు సెలవులు.. పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వానలు పడుతుండటంతో ప్రభుత్వం గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. వానలు తగ్గకపోతే శనివారం కూడా సెలవు ఇవ్వాలని క్షేత్రస్థాయిలో అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన పలు పరీక్షలను రద్దు చేశారు. అన్ని యూనివర్సిటీల పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగే ఇంటర్నల్ పరీక్షలను రద్దు చేశారు. వీటిని తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. ఇక ఇంజనీరింగ్ సహా వివిధ రకాల కౌన్సెలింగ్‌ల తేదీలను మార్చాలని విద్యార్థులు కోరుతున్నారు. అకస్మాత్తుగా సెలవు నిర్ణయంతో.. రెండు రోజులుగా వానలు పడుతుండటంతో విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలన్న విజ్ఞప్తులు వచ్చాయి. కానీ దీనిపై బుధవారం రాత్రి వరకు కూడా అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రెండు రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్టుగా గురువారం ఉదయం ప్రకటించారు. ఇది కూడా జిల్లా అధికారులకు మెసేజీల ద్వారా తెలిపారు. మీడియాకు సమాచారం ఇవ్వలేదు. దీనితో సెలవుల విషయం తెలిసేసరికే విద్యార్థులంతా వానలో ఇబ్బందిపడుతూనే స్కూళ్లకు చేరారు. కొన్నిచోట్ల అప్పటికప్పుడే విద్యార్థులను తిప్పి పంపేయగా.. మరికొన్ని విద్యా సంస్థలు ఒంటి గంట వరకు ఇళ్లకు పంపించాయి. ఆటోల్లో, సైకిళ్లపై, నడుచుకుంటూ బడులకు వచ్చే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సెలవు విషయం తెలియడంతో తల్లిదండ్రులు హడావుడిగా స్కూళ్ల వద్దకు వచ్చి పిల్లలను తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇంటర్నెట్ ఇబ్బందితో.. ఎంసెట్ తొలివిడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఇటీవలే మొదటి విడత సీట్ల కేటాయింపు జరిగింది. ఈ నెల 22 నాటికల్లా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంది. రెండు రోజులుగా వానలతో పలుచోట్ల విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్కు అంతరాయం ఏర్పడింది. దీనితో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నామని, సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఉన్నత విద్యా మండలి అధికారి ఒకరు తెలిపారు. ఇక గురువారం జరగాల్సిన టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు సాంకేతిక విద్యా మండలి ప్రకటించింది. హాస్టళ్ల నుంచి ఇళ్లకు.. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. చాలాచోట్ల హాస్టళ్ల చుట్టూ నీరు చేరడం, పలుచోట్ల పైకప్పుల నుంచి నీరు కారడంతో ఇబ్బందిగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో శుక్ర, శనివారాలు సెలవు ఎడతెరిపిలేని వానల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్నిరకాల విద్యాసంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా శుక్ర, శనివారాలు రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. వైద్యం, పాల సరఫరా వంటి అత్యవసర సేవలు కొనసాగుతాయని తెలిపింది. ప్రైవేటు సంస్థలు కూడా వారి కార్యాలయాలకు సెలవులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖను ఆదేశించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి జీహెచ్ఎంసీ పరిధిలో విద్యాసంస్థలు, ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాలకు రెండు రోజుల సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవులు 8 రోజులే..
వివిధ సెలవుల కారణంగా 2023 జూలైలో హైదరాబాద్‌లోని బ్యాంకులు ఎనిమిది రోజులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులకు సెలవులు ప్రకటించింది. ఆర్బీఐ ప్రకారం.. దేశంలోని వివిధ రాష్ట్రాలలో జూలై నెలలో ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కలిపి మొత్తం 15 సెలవులు ఉన్నాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రానికి, రాష్ట్రానికి మారవచ్చు. కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకూ మొత్తం 15 రోజులూ సెలవులు ఉండవు. హైదరాబాద్‌లో ఉండే బ్యాంకులు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు, అదనంగా మొహర్రం కారణంగా జూలై 29 న పనిచేయవు. బ్యాంకు శాఖలు మూసివేసినప్పటికీ కస్టమర్లు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కార్యకలాపాలను కొనసాగించవచ్చు. హైదరాబాద్‌లో బ్యాంకు సెలవులు జూలై 2: ఆదివారం జూలై 8: రెండో శనివారం జూలై 9 : ఆదివారం జూలై 16 : ఆదివారం జూలై 22 : నాలుగో శనివారం జూలై 23 : ఆదివారం జూలై 29: మొహర్రం జూలై 30: ఆదివారం ఇదీ చదవండి: July Deadlines: ఆధార్-పాన్ లింక్ ముగిసింది.. ఇక మిగతా డెడ్లైన్ల సంగతేంటి? -
రైలుబండి నడిపే వారెక్కడ?
సాధారణంగా ఏ సంస్థలోనైనా సరే వంద మంది సిబ్బంది అవసరమైన చోట కనీసం మరో 10 మందిని అదనంగా నియమించుకుంటారు. సంస్థ నిర్వహణలో ఆటంకాలు లేకుండా ఉండాలంటే అదనపు సిబ్బంది అవసరం. కానీ దక్షిణమధ్య రైల్వేలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. రైళ్లు నడిపేందుకు డ్రైవర్లు కరువవుతున్నారు. వాస్తవానికి రైళ్ల నిర్వహణకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు లోకోపైలెట్లు, అసిస్టెంట్ లొకోపైలెట్లు తదితర సిబ్బంది కనీసం 30 శాతం అదనంగా ఉండాలి. అదనపు సిబ్బంది సంగతి పక్కనపెడితే.. ఉండాల్సిన వారిలోనే 30 శాతం సిబ్బంది కొరత ఉంది. దీంతో పనిభారంతో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. చివరకు అనారోగ్యం ఉన్నా సెలవులు లభించడం లేదంటూ లోకోపైలెట్లు వాపోతున్నారు. –సాక్షి, హైదరాబాద్ విరామమెరుగని విధులు.. దక్షిణమధ్య రైల్వేలో రోజూ సుమారు 600 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. 10 లక్షల మందికిపైగా ప్రయాణం సాగిస్తుంటారు. అన్ని డివిజన్ల పరిధిలో 3,800 వరకు లోకో పైలెట్లు, సహాయ లోకోపైలెట్లు, షంటర్లు పని చేయవలసి ఉండగా ప్రస్తుతం 2384 మంది మాత్రమే ఉన్నారు.1,416 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే కనీసం వెయ్యి మంది అదనంగా ఉండాల్సిన చోట వెయ్యి మందికిపైగా కొరత ఉండడం గమనార్హం. కొంతకాలంగా లోకోపైలెట్ల భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో ఉన్నవాళ్లపైనే పనిభారం అధికమవుతోంది. ‘లింక్’ లేని డ్యూటీలు సాధారణంగా ఒక లోకోపైలెట్ తన విధి నిర్వహణలో 8 గంటలు పనిచేసి 6 గంటల విశ్రాంతి తీసుకోవాలి. తరువాత మరో 8 గంటలు పని ఉంటుంది. తిరిగి 6 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. డ్యూటీ ముగిసిన తరువాత 16 గంటల పాటు విశ్రాంతి ఉండాలి. ప్రతి 72 గంటలకు ఒక రోజు సెలవు చొప్పున, ప్రతి 14 రోజులకు ఒక 24 గంటల పూర్తి విశ్రాంతి చొప్పున లోకోపైలెట్ లింక్ (విధి నిర్వహణ) ఉండాలి. కానీ ఈ లింక్‌కు పూర్తి విరుద్ధంగా 6 గంటలకు బదులు 4 గంటల విశ్రాంతే లభిస్తోందని లోకోపైలెట్లు అంటున్నారు. వరుసగా రాత్రిళ్లు పని చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వారానికి ఒకరోజు రాత్రి పూర్తిగా విశ్రాంతి ఉండాలి. కానీ ప్రస్తుతం రాత్రి పూట నిద్రకు నోచని ఎంతోమంది తీవ్ర ఒత్తిళ్ల నడుమ పనిచేస్తున్నారు. ‘అనారోగ్యం కారణంగా కూడా సెలవులు లభించడం లేదు. లాలాగూడ రైల్వే ఆసుపత్రి డాక్టర్లు ఫోన్లోనే ఫిట్నెస్ సరి్టఫికెట్లు ఇచ్చేస్తున్నారు. బాగానే ఉన్నావు డ్యూటీకి వెళ్లొచ్చని చెబుతున్నారు.’.. అని సికింద్రాబాద్ డిపోకు చెందిన అసిస్టెంట్ లోకోపైలెట్ ఒకరు చెప్పారు. ‘సేఫ్టీ’ ఎలా.. సిగ్నల్స్ కనిపెట్టడం, కాషన్ ఆర్డర్స్‌ను అనుసరించడం, ట్రాక్‌లు మార్చడం, వేగాన్ని అదుపు చేయడం.. ఇలా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇందుకు లోకోపైలెట్లకు ఏకాగ్రత, ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి. కానీ ప్రతి క్షణం వెంటాడే ఒత్తిడి, నిద్ర లేమి వల్ల రైల్వే మాన్యువల్‌కు విరుద్ధమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నామని రైఅంటున్నారు. ఒత్తిడే ప్రమాదాలకు కారణం? తరచూ హెచ్చరిక సిగ్నళ్లను (సిగ్నల్ పాసింగ్ ఎట్ డేంజర్) సైతం ఉల్లంఘిస్తూ రైలు ప్రమాదాలకు కారణమవుతున్నారు. రైళ్లు పట్టాలు తప్పే సందర్భాల్లో ఇలాంటి ఒత్తిడే ప్రధాన కారణమవుతున్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సికింద్రాబాద్ డిపోలోనూ కొరత దక్షిణమధ్య రైల్వేలోనే కీలకమైన సికింద్రాబాద్ డిపోలో 578 మంది లోకోపైలెట్లు పని చేయవలసి ఉండగా 343 మంది మాత్రమే ఉన్నారు. 235 ఖాళీలు ఉన్నాయి. సిబ్బంది కొరతతో గూడ్స్ రైళ్లు నడపాల్సిన వాళ్లు ఎక్స్‌ప్రెస్‌లు, మెయిల్ సర్వీసులు నడుపుతున్నారు. షంటర్లు ఎంఎంటీఎస్‌లు, ప్యాసింజర్ రైళ్లు నడుపుతున్నారు. -
తెలంగాణ: స్కూల్స్ అకడమిక్ ఇయర్ క్యాలెండర్ రిలీజ్
సాక్షి, హైదరాబాద్: తరగతుల ప్రారంభానికి కంటే.. ఈ ఏడాది విద్యా సంవత్సరం షెడ్యూల్ ఖరారు చేసింది తెలంగాణ విద్యాశాఖ(ప్రాథమిక). 2023-24 పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్ విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్లుగా.. జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. అలాగే.. వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 24వ తేదీని చివరి పనిదినంగా నిర్ణయించింది. ► 2023-24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి. ► బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి ► 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి ► 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి ► అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు ► జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ► ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు ► 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్ ఇయర్ క్యాలెండర్లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ. -
ఏప్రిల్ 4 వరకు అక్కడ స్కూళ్లు బంద్.. కారణమిదే..!
పాట్నా: బిహార్ రోహ్తాస్ జిల్లాలో శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు అధికారులు 144 సెక్షన్ విధించారు. అలాగే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏప్రిల్ 4వరకు సెలవులు ప్రకటించారు. కోచింగ్ ఇనిస్టిట్యూట్లను కూడా తెరవొద్దని నిర్వాహకులకు తెలిపారు. కేంద్రహోమంత్రి అమిత్‌షా పర్యటనకు ముందు మార్చి 31న నలంద జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ముగ్గురికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఆ తర్వాత రోహ్తాస్ జిల్లాలోనూ గురువారం ఘర్షణలు చెలరేగాయి. శనివారం వరకు ఇవి కొనసాగాయి. ఈనేపథ్యంలోనే ప్రజలు శాంతియుతంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు. పోలీసు బలగాలను రంగంలోకి దించి పటిష్టభద్రతా ఏర్పాట్లు చేశారు. స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. ఘర్షణలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 50మందినిపైగా అరెస్టు చేశారు. పలుకేసులు నమోదు చేశారు. బిహార్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హోంమంత్రి అమిత్‌షా కూడా శాంతిభద్రతల దృష్ట్యా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. చదవండి: శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై దాడి.. జైలులో చితకబాదిన తోటి ఖైదీలు..! -
బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త! వారానికి రెండు రోజులు...
బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త ఇది. వారంలో ఐదు రోజులే పనిదినాలు ఉండాలన్న బ్యాంకు యూనియన్ల డిమాండ్‌ను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) పరిశీలిస్తోందని, ఇది అమలయితే వారికి త్వరలో రెండు రోజుల వీక్లీ ఆఫ్‌లు లభిస్తాయని న్యూస్ 18 కథనం పేర్కొంది. అయితే వారంలో ఐదు రోజుల పనిదినాల విధానం అమలైతే రోజువారీ పని గంటలను రోజుకు 50 నిమిషాలు పెంచవచ్చని తెలిపింది. ఈ విషయంలో ఐబీఏ, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (యూఎఫ్బీఈఎస్) మధ్య చర్చలు జరుగుతున్నాయి. అసోసియేషన్ ఐదు రోజుల పనిదినాల విధానానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. (ఇదీ చదవండి: ఆ నగరాల్లో చుక్కలనంటిన రియల్ ఎస్టేట్ ధరలు! రూ. 8 కోట్లకు ఎంత వస్తుందంటే..) నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం ప్రభుత్వం అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించాల్సి ఉంటుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్ నాగరాజన్ చెప్పినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులు రెండు, నాలుగో శనివారాల్లో మాత్రమే పని చేస్తున్నారు. కొత్త విధానంలో ఉద్యోగులు రోజూ ఉదయం 9.45 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అదనంగా 40 నిమిషాలు పని చేయాల్సి ఉండొచ్చని భావిస్తోంది. మార్చిలో 12 రోజులు బ్యాంకులు బంద్! మార్చి నెలలో రెండవ, నాలుగో శనివారాలు, ఆదివారాలతో సహా 12 రోజుల వరకు బ్యాంకులు మూత పడనున్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని బ్యాంకులకు సాధారణ సెలవులు ఉండగా మరికొన్నింటికి స్థానిక సెలవులు ఉన్నాయి. (ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!) -
జనవరిలో 15 రోజులు పని చేయని బ్యాంకులు, సెలవుల జాబితా ఇదే!
2023 జనవరికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు జనవరి 2023లో 15 రోజుల వరకు పని చేయవు( ఆ తేదిలలో బ్యాంకులకు సెలవు). ఈ సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు, అలాగే ఆదివారాలు కూడా ఉన్నాయి. కనుక కస్టమర్లు జనవరిలో ఏవైనా బ్యాంకు పనులుంటే దీనికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. జనవరి 2023లో దేశవ్యాప్తంగా బ్యాంకులు చాలా రోజులు మూసివేసి ఉంటాయి. ప్రతి నెల రెండు, నాలుగు మినహాయిస్తే తొలి, మూడవ శనివారం మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. సెలవుల్లో కొన్ని బ్యాంకులకు ప్రాంతీయ సెలవులుంటే..మరికొన్ని బ్యాంకులకు జాతీయ సెలవులున్నాయి. జనవరిలో ఏ తేదిన ఉన్నాయో ఓ లుక్కేద్దాం! సెలవుల జాబితా ఇదే 1 జనవరి 2023 ఆదివారం న్యూ ఇయర్ 2 జనవరి 2023 న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఐజ్వాల్‌లో సెలవు 3 జనవరి 2023 ఇంఫాల్‌లో సెలవు 4 జనవరి 2023 ఇంఫాల్‌లో గణ ఎన్గయీ సందర్భంగా సెలవు 8 జనవరి 2023 ఆదివారం 12 జనవరి 2023 స్వామి వివేకానంద జన్మదినం (కోల్‌కతాలో బ్యాంకులు పని చేయవు) 14 జనవరి 2023 రెండో శనివారం 15 జనవరి 2023 ఆదివారం 16 జనవరి 2023 తిరువల్లూర్ దినోత్సవం (చెన్నైలో సెలవు) 17 జనవరి 2023 ఉజ్ఞావార్ తిరునాళ్లు సందర్భంగా చెన్నైలో సెలవు 22 జనవరి 2023 ఆదివారం 23 జనవరి 2023 నేతాజీ జన్మ దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్లో సెలవు 26 జనవరి 2023 రిపబ్లిక్ డే (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు) 28 జనవరి 2023 నాలుగో శనివారం 29 జనవరి 2023 ఆదివారం -
సుప్రీంకోర్టుకు శీతాకాల సెలవులు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు డిసెంబర్ 17 నుంచి వచ్చే జనవరి ఒకటో తేదీ దాకా శీతాకాల సెలవులని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనాలేవీ పనిచేయవని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టుకు రోజుల తరబడి సెలవులు న్యాయార్థులకు ఏమాత్రం సౌకర్యవంతంగా లేదని ప్రజలు భావిస్తున్నారంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు గురువారం రాజ్యసభలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో సీజేఐ తాజా నిర్ణయం వెలువరించడం గమనార్హం. ఇదీ చదవండి: వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకే... మేమున్నది: సుప్రీంకోర్టు -
పండుగ ముగిసింది.. తిరుగు పయనం
బండెనక బండికట్టి పదహారు బండ్లు కట్టి పట్నం పోదాం.. అన్న విధంగా.. బారులు తీరిన వాహనాలు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జాతీయ రహదారిపై కనిపించాయి. దసరా సెలవులు ముగియడంతో హైదరాబాద్ జంట నగరాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారంతా తిరుగు పయనం కావడంతో వాహనాల రద్దీ ఏర్పడింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, యాదాద్రి భువనగిరి -
సెలవులు ముగియడంతో తిరిగి ప్రారంభం కానున్న స్కూళ్లు..
సాక్షి, హైదరాబాద్: దసరా సెలవుల తర్వాత విద్యా సంస్థలు సోమవారం నుంచి తిరిగి తెరుచుకోబోతున్నాయి. రెండు వారాల తర్వాత స్కూళ్లు, కాలేజీలు మళ్లీ సందడిగా మారనున్నాయి. గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 9 వరకూ ప్రభుత్వ పాఠశాలలకు దసరా సెలవులు ఇచ్చారు. ఆ తర్వా త కొద్ది రోజులకు కాలేజీలకు సెలవులి చ్చారు. సెలవులు రావడంతో విద్యార్థులంతా సొంతూళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు.. అన్ని ఖాళీ అయ్యాయి. ఉపాధ్యాయులు కూడా తమ ప్రాంతాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లారు. విద్యా సంస్థల పునః ప్రారంభంతో వీళ్లంతా తిరిగి తమ గూటికి చేరుకుంటున్నారు. దసరా సెలవుల తర్వాత జరిగే బోధన స్కూల్ విద్యార్థులకు కీలకమైంది. ఎఫ్ఏ–2 పరీక్షలు జరిగినా, పాఠశాల విద్యాశాఖ నిర్దేశించిన సిలబస్ మాత్రం పూర్తవ్వలేదు. ఈ ఏడాది ఇంగ్లిష్ మీడియంలో బోధన మొదలు పెట్టారు. దీంతో ద్విభాష పుస్తకాలు ముద్రించాల్సి వచ్చింది. పుస్త కాల బరువు పెరగకుండా వాటిని రెండు భాగా లుగా చేశారు. ఈ కారణంగా ముద్రణ ఆలస్యమైంది. కొన్నిచోట్ల సెప్టెంబర్ మొదటి వారం వరకూ పార్ట్–1 పుస్తకాలు అందలేదు. దీనికి తోడు కరోనా కారణంగా నష్టపోయిన అభ్యసనను తిరిగి దారి లోకి తెచ్చేందుకు బ్రిడ్జ్ కోర్సులు, తొలిమెట్టు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఇవన్నీ సిలబస్ ఆలస్యమవడానికి కారణమయ్యాయి. వాస్తవానికి పార్ట్–1 పుస్తకాల్లోని సిలబస్ దసరా సెలవుల కన్నా ముందే పూర్తవ్వాలి. ఇది సాధ్యం కాకపోవడంతో తిరిగి పార్ట్–1లోని పాఠాలు చెప్పాల్సి ఉంటుందని టీచర్లు అంటున్నారు. ఇది పూర్తయి, పార్ట్–2 ఎప్పు డు మొదలు పెడతారనేదానిపై ఉపాధ్యాయ వర్గా లు స్పష్టత ఇవ్వలేకపోతున్నాయి. ఇదిలా ఉంటే, పదోన్నతులు, బదిలీల డిమాండ్లతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. -
అక్టోబర్‌లో 3 నుంచి 9 వరకు బ్యాంకులు పని చేయని నగరాలు ఇవే!
అక్టోబరు నెల వస్తే బ్యాంక్ కస్టమర్లు వారి ఆర్థిక లావాదేవీలను ముందుగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ నెల దాదాపు పండుగలతో మనముందుకు వస్తుంది. ఈ ఏడాది పండుగలను పరిశీలిస్తే.. దసరా, దుర్గాపూజ, దీపావళి, ఛత్ పూజ వంటి అనేక ఇతర ముఖ్యమైన పండుగలు అక్టోబర్‌లోనే ఉన్నాయి. ఈ సెలవులు నెలలో వచ్చే పండుగలతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు వంటి రెగ్యులర్ హాలిడేస్ కూడా కలిపి ఎక్కువ రోజులే ఉన్నాయి. ఈ సారి అక్టోబర్ 3 నుంచి 7 రోజులు ఈ నగరాల్లో బ్యాంకులు పని చేయవు. ఈ విషయాన్ని గమనించి కస్టమర్లు బ్యాంకుల్లో అత్యవసర పనులు ఉంటే ముందుగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. అక్టోబర్ 3 నుంచి బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 1 సందర్భంగా బ్యాంకులు హాఫ్ ఇయర్లీ క్లోజింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ సందర్భంగా పని చేయలేదు. ఇక ఈరోజ అక్టోబర్ 2న కూడా గాంధీ జయంతి ఉంది. అలాగే ఆదివారం కూడా. అక్టోబర్ 3న దుర్గా పూజ సందర్భంగా బ్యాంకులకు పని చేయవు. అగర్తలా, భువనేశ్వర్, గువాహటి, ఇంపాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీలో ఈ సెలవు వర్తిస్తుంది. ఇక మిగతా ప్రాంతాల్లో బ్యాంకులు పని చేస్తాయని గుర్తించుకోవాలి. అక్టోబర్ 4: దుర్గాపూజ/దసరా (మహా నవమి)/ఆయుధ పూజ/ శ్రీమంత శంకరదేవుని జన్మోత్సవం సందర్భంగా.. అగర్తల, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురంలలో బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 5: దుర్గాపూజ/దసరా (విజయదశమి) సందర్భంగా.. ఆ రోజు ఇంఫాల్ మినహా భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 6: దుర్గా పూజ(దసైన్) సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు పని చేయవు. అక్టోబర్ 7: గ్యాంగ్‌టక్‌లో బ్యాంక్ హాలిడే ఉంది. అక్టోబర్ 8: రెండో శనివారం సందర్బంగా బ్యాంకులు పని చేయవు. అలాగే ఆ రోజు మహమ్మద్ ప్రవక్త జయంతి కూడా ఉంది. భోపాల్, జమ్మూ, కొచ్చి, శ్రీనగర్, తిరుపనంతపురంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 9: ఆదివారం రెగ్యులర్ సెలవు. కాగా బ్యాంక్ సెలవులనేవి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. అయితే కస్టమర్లలు బ్యాంక్ హాలిడేస్‌లో కూడా ఆన్లైన్ సేవలు.. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. చదవండి: కేంద్రం సంచలన నిర్ణయం.. గ్యాస్ సిలిండర్లపై కొత్త రూల్స్! -
‘సెలవులు ఇవ్వకపోవడం దారుణం.. ఉద్యోగులు విధులు బహిష్కరించండి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు బతుకమ్మ పండుగ సెలవులు ఇవ్వకపోవడం దారుణం. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులు విధులు బహిష్కరించాలి. బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలి. ప్రజలందరూ సంతోషంగా జరుపుకునే పండుగకు సెలవు ఇవ్వకుండా కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నాడు. తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ. అంతటి విశిష్టమైన బతుకమ్మ పండుగకు సెలవు ఇవ్వకపోవడాన్ని ఏమనుకోవాలి?. అసలు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రా? వేరే రాష్ట్రానికి సీఎంగా ఉన్నారా?. ఉద్యోగులు, తెలంగాణ ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. -
బ్యాంకు కస్టమర్లకు అలెర్ట్.. అక్టోబర్‌లో 21 రోజులు సెలవులు
-
ఆనందం మాటున పొంచి వున్న ప్రమాదాలు
రాజంపేట టౌన్ : గత రెండేళ్లుగా వేసవి, సంక్రాంతి, దసరా వంటి సెలవులు వచ్చినప్పటికీ.. కరోనా కారణంగా ప్రజలు ఎవరూ కూడా ఆనందంగా గడిపి ఆస్వాదించలేక పోయారు. ఇక విద్యార్థులు కూడా సెలవుల్లో ఆటలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు లేకపోవడంతో దసరా సెలవుల్లో విద్యార్థులు తమకు తోచిన రీతిలో ఆనందంగా గడపాలన్న ఉత్సుకతతో ఉంటారు. అయితే సంతోషం మాటునే కొన్ని ప్రమాదాలు కూడా పొంచి వుంటాయన్న విషయాన్ని ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా వుంది. పిల్లలు ఆనందంగా గడిపేందుకు వారికి స్వేచ్ఛను ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. అయితే వారిని ఒక కంటి కనిపెట్టి ఉంచాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులపై ఎంతైనా ఉందనే చెప్పాలి. సెలవుల్లో చాలా మంది గ్రామీణ ప్రాంతాలకు వెళుతుంటారు. మరికొంత మంది విహార యాత్రల పేరిట వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు నీటిలో దిగి ఈతకొట్టడం, బైక్ నడపడం నేర్చుకొని.. బైక్ నడిపేందుకు ఎంతో ఇష్టపడతారు. సెలవుల్లో ఈ విషయాలపైనే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుండాలి. లేకుంటే ఆనందమయం కావాల్సిన సెలవులు విషాదమయం కాగలవు. సెలవుల సందర్భంగా విద్యార్థులు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ సంఘటనలు అన్నమయ్య జిల్లాలో అనేకం ఉన్నాయి. పిల్లల పట్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ► ఆడుకోవడానికి ఎక్కువ దూరం పంపకూడదు. ► సమీపంలో ఉండే క్రీడామైదానాల్లోకి వెళ్లినా, వారి వెంట పెద్దలు ఎవరో ఒకరు వెళ్లాలి. ► క్రీడామైదానాల సమీపంలో, ఆడుకునే ప్రాంతాల సమీపంలో చెరువులు, బావులు, తక్కువ ఎత్తులో విద్యుత్ వైర్లు వంటివి ఉంటే పిల్లలను క్రీడా మైదానాలకు కూడా పంపక పోవడమే మంచిది. ► ఎత్తయిన భవనాల పైన, శిథిలావస్థలో ఉండే భవనాల్లో ఆటలు ఆడకుండా చూడాలి. ► యువకులు చిన్నపాటి వీధుల్లో కూడా బైక్‌లను వేగంగా నడుపుతుంటారు. అందువల్ల పిల్లలు వీధుల్లోని రోడ్లపై ఆడుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ► ఓ మోస్తారు పిల్లలు బైక్‌లను నడిపేందుకు ఎక్కువ ఇష్టపడతారు. అందువల్ల తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు బైక్‌లను తీసుకెళ్లి ప్రమాదాల బారిన పడే ప్రమాదముంది. అందువల్ల పిల్లలు బైక్‌లను తీసుకెళ్లకుండా ఉండేందుకు బైక్ తాళాలను పిల్లలకు అందుబాటులో ఉంచకుండా చూసుకోవాలి. ► ప్రస్తుతం చాలా మంది పిల్లలు సెల్‌ఫోన్‌కు బానిసలవుతున్నారు. సెలవుల్లో పిల్లలు సెల్‌ఫోన్‌ను ఎక్కువ చూసే అవకాశమున్నందున, సెల్‌ఫోన్‌పై వ్యాపకం లేకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలి. ఇలా చేస్తే మంచిది ► సెలవుల్లో విద్యార్థులు ఇంటి పట్టునే ఉండి ఆడుకునేందుకు క్యారమ్స్, చెస్, వంటి క్రీడలు ఆడుకునేలా తల్లిదండ్రులు ఏర్పాట్లు చేయాలి. ► ఇరుగు, పొరుగున ఉన్న పిల్లలందరికీ కూడా క్యారమ్, చెస్ బోర్డులను అందుబాటులో ఉంచితే పిల్లలు ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ఆడుకుంటూ ఉంటారు. అయినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి. ► తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకరికి సమయం ఉంటే పిల్లలను క్రీడా మైదానాలకు తీసుకెళ్లి క్రికెట్, కబడ్డీ, రన్నింగ్ వంటివి ప్రాక్టీస్ చేయిస్తే మరింత మంచిది. ఎందుకంటే ఈ క్రీడలు ఆరోగ్యాన్ని, మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి. ► ఈతకు వెళ్లడం, బైక్‌లను నడపడం వంటివి చేస్తే చోటు చేసుకునే ప్రమాదాలగురించి పిల్లలకు సున్నితంగా తెలియజేయాలి. ► పిల్లలను ఎగ్జిబిషన్, పార్కులు వంటి ప్రదేశాలకు తీసుకెళ్లాలి. సెలవుల్లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిన వారికి సమీపంలో ఉండే చారిత్రాత్మక ప్రదేశాలకు తీసుకెళ్లాలి. ఇలా చేయడం వల్ల ఒంటరిగా బయటకు వెళ్లాలన్న ఆలోచనలు రావు. ► జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన విషయాలను తెలియ చేయాలి. అలాగే పేదరికం నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్న వారి విజయగాధలను విషదీకరించి చెప్పాలి. ఇవి పిల్లల్లో స్ఫూర్తిని కలిగిస్తాయి. ► పడుకునే సమయంలో పిల్లలకు మంచి విషయాలను చెబుతుండాలి. పూర్వం ఉండిన ఉమ్మడి కుటుంబాలు, అప్పట్లో ఉన్న అనుబంధాలు, ఆప్యాయతలపై తెలియ చేయాలి. ఇవి సన్మార్గం వైపు నడిచేందుకు దోహద పడగలవు. (క్లిక్: విషాదయాత్రగా మారిన విహార యాత్ర.. 21 మంది విద్యార్థుల్లో..) తల్లిదండ్రులు స్నేహితుల్లా వ్యవహరించాలి తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహితుల్లా వుండాలి. అప్పుడే ఎక్కడికి వెళ్లినా, ఏమి చేసినా తల్లిదండ్రులకు నిర్భయంగా తెలపగలరు. అంతేకాక చెప్పిన విషయాలను కూడా చక్కగా ఆలకిస్తారు. ముఖ్యంగా సెలవుల సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. అప్పుడే పిల్లలు బయటికి వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వీలవుతుంది. సెలవుల సమయంలో పిల్లల గురించి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – శివభాస్కర్‌రెడ్డి, డీఎస్పీ, రాజంపేట -
Osmania University: ఓయూలో దసరా సెలవులు ఇలా
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకు దసరా సెలవులను ప్రకటించారు. వివిధ పీజీ కోర్సుల కాలేజీలకు శనివారం నుంచి వచ్చే నెల 9 వరకు, ఎల్ఎల్ఎం విద్యార్థులకు అక్టోబరు 2 నుంచి 8 వరకు సెలవులను ప్రకటించారు. పండుగ సెలవుల కారణంగా విద్యార్థులు లగేజితో హాస్టల్ గదులను ఖాళీ చేయాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 26న పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత ఆన్లైన్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు సీపీజీఈసెట్–2022 కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి శుక్రవారం తెలిపారు. ఓయూతో పాటు రాష్ట్రంలోని ఇతర వర్సిటీలలో 2022–23 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఈడీ, ఎంపీడీ, ఎంసీజే, లైబ్రరీ సైన్స్‌లతో పాటు ఐదేళ్ల పీజీ, పీజీ డిప్లొమాలో ప్రవేశాలకు మొదటి విడత ఆన్లైన్ కౌన్సెలింగ్ వచ్చే వారం నుంచి ప్రారంభంకానున్నట్లు వివరించారు. పీజీ ప్రవేశ పరీక్షలో (సీపీజీఈసెట్–2022) అర్హత సాధించిన విద్యార్థులు డిగ్రీ సర్టిఫికెట్లతో పాటు టీసీ, కులం, ఆదాయం సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. సర్టిఫికెట్లు లేని పక్షంలో అడ్మిషన్ తిరస్కరించనున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: టీహబ్–2లో 200 స్టార్టప్‌ల కార్యకలాపాలు ప్రారంభం) -
తల్లిదండ్రులుంటేనే పిల్లలు ఇంటికి!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకులాల్లో దసరా సెలవుల హడావుడి ప్రారంభమైంది. ఈనెల 25 నుంచి వచ్చే నెల 9 వరకు విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించారు. దీంతో పిల్లలంతా వారి తల్లిదండ్రులతో గడిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యార్థులను ఇళ్లకు పంపించేందుకు గురుకుల సొసైటీలు కొన్ని షరతులు విధించాయి. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ గురుకుల సొసైటీలు.. ప్రిన్సిపాళ్లకు పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేశాయి. పిల్లలను గురుకులం నుంచి ఇంటికి పంపాలంటే తప్పకుండా ఆ విద్యార్థి తల్లి లేదా తండ్రి లేకుంటే సంరక్షకుడు తప్పకుండా రావాల్సి ఉంటుంది. అలా వస్తేనే విద్యార్థులను ఇంటికి అనుమతించాలని గురుకుల సొసైటీలు నిర్ణయం తీసుకున్నాయి. స్నేహితులు, తోబుట్టువులు, ఇతర పరిచయస్తులతో పిల్లలను ఇంటికి అనుమతించవద్దని తేల్చిచెప్పాయి. ప్రిన్సిపాళ్లదే బాధ్యత.. విద్యార్థులను తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు కాకుండా ఇతరులకు అప్పగిస్తే తలెత్తే పరిణామాలకు ప్రిన్సిపాళ్లే బాధ్యత వహించాల్సి వస్తుందని సొసైటీ కార్యదర్శులు స్పష్టం చేశారు. బాలికల విషయంలో మరింత కఠినంగా నిబంధనలు పాటించాలని సూచించారు. పిల్లలను అప్పజెప్పే సమయంలో తల్లిదండ్రులు/సంరక్షకులు వచ్చినప్పటికీ వారు సరైన వ్యక్తులేనా అనే విషయాన్ని ధ్రువీకరించుకుని రిజిస్టర్లో ఎంట్రీ చేయాలని స్పష్టం చేశారు. దీంతో పిల్లల అప్పగింతకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంటుందని చెపుతున్నారు. తల్లిదండ్రులు సైతం కాస్త ఓర్పుతో ఉండాలని ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు. తల్లిదండ్రులకు పిల్లలను అప్పగించే సమయంలో విద్యార్థి చదువు గురించి సైతం వివరించాలని స్పష్టం చేయడంతో టీచర్లు ప్రోగ్రెస్ కార్డులను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, సెలవుల అనంతరం కూడా విద్యార్థులు తిరిగి వచ్చే సమయంలో వివరాలను పరిశీలించి నిర్ధారించుకోవాలని, వెంట తెచ్చుకున్న సరుకులు, సామగ్రిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే అనుమతించాలని సొసైటీ కార్యదర్శులు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
అక్టోబర్‌లో బ్యాంకు సెలవుల లిస్ట్.. ఏకంగా 21 రోజులు
సాక్షి, ముంబై: పండుగల సమీపిస్తున్న నేపథ్యంలో అక్టోబరు నెలలో ఏకంగా 21 రోజులు బ్యాంకులు పనిచేయవు. రెండు,నాలుగు శనివారాలు, ఆదివారాలు సహా మొత్తం 21 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు మూసి ఉంటాయి. అక్టోబరు నెలలో బ్యాంకులకు సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. దీని ప్రకారం, రాష్ట్రాన్ని బట్టి కొన్ని ప్రాంతీయ సెలవులతో అన్ని ప్రభుత్వ సెలవు దినాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. ప్రాంతీయ రాష్ట్రసెలవులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. సో కస్టమర్లు తమ సమీప బ్యాంకును సందర్శించే ముందు సెలవుల లిస్ట్‌ను చెక్ చేసుకోవచ్చు. అక్టోబర్ 2022 నెలలో బ్యాంక్ సెలవుల లిస్ట్ అక్టోబరు 1, 2022- బ్యాంకు ఖాతాల అర్ధ వార్షిక ముగింపు (గ్యాంగ్‌టక్) అక్టోబర్ 2, 2022- గాంధీ జయంతి, ఆదివారం అక్టోబర్ 3, 2022- దుర్గా పూజ (అగర్తలా, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ) అక్టోబర్ 4, 2022- దుర్గాపూజ/దసరా/ఆయుధ పూజ/శ్రీమంత శంకరదేవ (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్టక్, గౌహతి, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్ , తిరువనంతపురం) అక్టోబర్ 5, 2022- దుర్గాపూజ/దసరా/శ్రీమంత శంకరదేవుని జన్మోత్సవం అక్టోబర్ 6, 2022- దుర్గాపూజ (గ్యాంగ్‌టక్) అక్టోబర్ 7, 2022- దుర్గా పూజ (గ్యాంగ్‌టక్) అక్టోబర్ 8, 2022- రెండో శనివారం. మిలాద్-ఉల్-నబీ (భోపాల్, జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం) అక్టోబర్ 9, 2022- ఆదివారం అక్టోబర్ 13, 2022- కర్వా చౌత్ (సిమ్లా) అక్టోబర్ 14, 2022- ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ (జమ్మూ , శ్రీనగర్) అక్టోబర్ 16, 2022- ఆదివారం అక్టోబర్ 18, 2022- కటి బిహు (గౌహతి) అక్టోబర్ 22, 2022- నాల్గవ శనివారం అక్టోబర్ 23, 2022- ఆదివారం అక్టోబర్ 24, 2022- కాళీ పూజ/దీపావళి అక్టోబర్ 25, 2022- లక్ష్మీ పూజ/దీపావళి/గోవర్ధన్ పూజ (గ్యాంగ్‌టక్, హైదరాబాద్, ఇంఫాల్, జైపూర్) అక్టోబర్ 26, 2022- గోవర్ధన్ పూజ/భాయ్ దూజ్/దీపావళి/విక్రమ్ సంవంత్ న్యూ ఇయర్ డే (అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, డెహ్రాడూన్, గాంగ్టక్, జమ్ము, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, సిమ్లా, శ్రీనగర్) అక్టోబర్ 27, 2022- భాయ్ దూజ్/లక్ష్మీ పూజ/దీపావళి (గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్ మరియు లక్నో) అక్టోబర్ 30, 2022- ఆదివారం అక్టోబర్ 31, 2022- సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు/సూర్య పష్టి దాలా ఛత్/ఛత్ పూజ (అహ్మదాబాద్, పాట్నా, రాంచీ) 21 రోజుల పాటు బ్యాంకులు మూతపడినా ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి కాబట్టి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఈ సెలవు రోజుల్లో కస్టమర్లు బ్యాంక్ నుండి డబ్బును భౌతికంగా డిపాజిట్ చేయలేరు లేదా విత్‌డ్రా చేయలేరు. కానీ ఇతర ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవచ్చు. -
ఫెస్టివల్ సీజన్ కదా.. చిల్ అవ్వండి, ఉద్యోగులకు 11 రోజులు సెలవులిచ్చిన కంపెనీ!
నగర వాసుల డైలీ లైఫ్ అంటే ఉదయం నుంచి రాత్రి వరకు బిజీ బిజీగా గడిపేస్తుంటారు. వారమంతా తీరిక లేకుండా ఎవరి పనుల్లో వాళ్లు విశాంత్రి అనే మాట మరిచి వీకెండ్లో కాస్త చిల్ అవుతుంటారు. అయితే కొందరికి మాత్రం ఆ కాస్త రిలీఫ్ అయ్యే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని గమనించిన ఓ కంపెనీ తమ ఉద్యోగులు శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా ఉండాలని భావించింది. అందుకే ఫెస్టివల్ సమయంలో బిజీగా గడిపిన అనంతరం వారి విశ్రాంతి కోసం ప్రత్యేకంగా పనికి బ్రేక్ పేరుతో సెలవులు ఇచ్చింది. వరుస పండుగల్లో బిజీ విక్రయాలతో ప్రజలు తీరిక లేకుండా ఈ ఫెస్టివల్ సీజన్ గడుపుతారు. అందుకే తమ కంపెనీ తన ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే ప్రయత్నంలో, ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం మీషో వరుసగా రెండవ సంవత్సరం కూడా 11 రోజుల "రీసెట్ అండ్ రీఛార్జ్ విరామం"ని ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. అందులో.. "మేము వరుసగా రెండవ సంవత్సరం కంపెనీ-వ్యాప్తంగా 11-రోజుల విరామాన్ని ప్రకటించాం! రాబోయే పండుగ సీజన్‌తో పాటు వారి వర్క్ లైఫ్‌ని బ్యాలెన్స్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, మీషో ఉద్యోగులకు రీసెట్ & రీఛార్జ్ అనేది కొంత అవసరం కాబట్టి వారికి అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేసింది. We’ve announced an 11-day company-wide break for a second consecutive year! Keeping the upcoming festive season & the significance of #WorkLifeBalance in mind, Meeshoites will take some much-needed time off to Reset & Recharge from 22 Oct-1 Nov. Mental health is important. — Sanjeev Barnwal (@barnwalSanjeev) September 21, 2022 చదవండి: సగం సంపద ఆవిరైంది.. సంతోషంగా ఉందంటూ పోస్ట్ పెట్టిన మార్క్ జుకర్‌బర్గ్! -
Telangana: దసరా సెలవులు.. విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త
సాక్షి, వరంగల్: వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తున్న టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు చేరువయ్యేందుకు పరుగులు పెడుతోంది. బస్సుల వద్దకే ప్రయాణికులు రావడం కాదు.. ప్రయాణికుల వద్దకే బస్సును పంపే కార్యక్రమాన్ని చేపట్టింది. పాఠశాలలకు ఈ నెల 25 నుంచి బతుకమ్మ, దసరా పండుగ సెలవులు ఇస్తున్న క్రమంలో వారి వారి స్వగ్రామాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం హాస్టల్ వద్దకు ఆర్టీసీ బస్సులు పంపే ఏర్పాట్లు చేశారు. 30మందికి పైగా విద్యార్థులు ఒకే రూట్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ సౌకర్యం కల్పించడం ద్వారా విద్యార్థులు లగేజీ బరువుతో బస్టాండ్‌కు చేరుకునే ఇబ్బందులు తప్పుతాయి. ఆటో, ఇతర రవాణా ఖర్చులు తగ్గుతాయి. విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులు సమీపంలోని బస్ డిపోకు సమాచారం అందించాల్సి ఉంటుంది. సమాచారం ఇస్తే బస్సు పంపుతాం దసరా సెలవుల్లో స్వస్థలాలకు వెళ్ళే విద్యార్థుల సౌకర్యార్థం వారి వద్దకే బస్సులు పంపే ఏర్పాట్లు చేశాం. 30 మందికి పైగా విద్యార్థులుంటే సరిపోతుంది. బస్సు వారి ఆవాసం ఉంటున్న వసతి గృహం వద్దకు చేరుకుని విద్యార్థులను ఎక్కించుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతుంది. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, హాస్టల్ నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – వంగాల మోహన్ రావు, వరంగల్–1 డిపో మేనేజర్ చదవండి: తక్కువ ధరకే ఐఫోన్ వస్తుందని.. ఫోన్ పే ద్వారా రూ. లక్ష పంపించాడు.. చివరికి -
TS: దసరా సెలవులు కుదింపు వాస్తవమేనా?.. విద్యాశాఖ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని.. సెలవుల కుదింపుపై వస్తున్న వార్తలను తెలంగాణ విద్యాశాఖ ఖండిచింది. కుదింపుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 9 వరకు దసరా సెలవులు కొనసాగుతాయని విద్యాశాఖ ప్రకటించింది. అక్టోబర్ 10న పాఠశాలల పునఃప్రారంభమవుతాయని పేర్కొంది. చదవండి: నెహ్రూ జూపార్కులోనే ఓ చీతా ఉంది.. కావాలనుకుంటే వెళ్లి చూడొచ్చు! కాగా, విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా దసరా సెలవులను తగ్గించాలని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యు కేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్–ఎస్సీఈఆర్టీ) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి మంగళవారం.. పాఠశాల విద్య డైరెక్టర్‌కు ఓ లేఖ రాశారు. జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ నెల 11 నుంచి 16 రోజులపాటు సెలవులు, ఈ నెల 17న జాతీయ సమైక్యతాదినోత్సవాన్ని పురస్కరించుకుని మరో సెలవు.. ఇలా అనుకోకుండా వచ్చిన సెలవుల వల్ల స్కూళ్లు మూతపడ్డాయని పేర్కొన్నారు. -
Bank Holidays: ఆగస్టులో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే?
సాక్షి, ముంబై: ఆగస్టు మాసంలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) జాబితాను శనివారం విడుదల చేసింది. ఆగస్టు నెలలో శని, ఆదివారాలు కలిపి ఆరు సెలవులు. ఆగస్ట్‌లో ఆగస్ట్ 9 (మంగళవారం), స్వాతంత్య్ర దినోత్సవం,ఆగస్టు 19 (శుక్రవారం) జన్మాష్టమి ఆగస్టు 19 (శుక్రవారం) ఉన్నాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలలో మొత్తం 9 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు గెజిట్ సెలవులు, చట్టబద్ధమైన సెలవులు, ఆదివారాల్లో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు పనిచేయవు. అలాగే ప్రతీ నెల రెండో, నాల్గో శనివారాల్లో కూడా బ్యాంకులు పనిచేయవు. ఇవి కాకుండా వివిధ రాష్ట్రాల్లో పలు ప్రాంతీయ పండుగల సందర్భంగా కూడా ఆయా రాష్ట్రాల్లోని బ్యాంకుల స్థానిక శాఖలు బ్యాంకులు పనిచేయవు. దీని ప్రకారం ఆగస్టు నెలవారీ సెలవులు ఇలా ఉన్నాయి. అయితే సెలవు రోజుల్లో కూడా ఆన్లైన్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని గమనించాలి. జాతీయ, ప్రాంతీయ సెలవులు ఆగస్టు 1: ద్రుక్పా త్షే-జి (సిక్కిం) ఆగస్టు 8, 9: మోహర్రం ఆగస్టు 11, 12, శుక్ర, శని : రక్షా బంధన్ ఆగస్టు 13: దేశభక్తుల దినోత్సవం ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 16: పార్శీల నూతన సంవత్సరం (షాహెన్షాహి) ఆగస్టు 18,గురువారం: జన్మాష్టమి ఆగస్ట్ 19, శుక్రవారం: శ్రావణ వద్/కష్ణ జయంతి ఆగస్టు 20, శనివారం: శ్రీకష్ణాష్టమి ఆగస్టు 29, సోమవారం: శ్రీమంత శంకరదేవుని తిథి ఆగస్టు 31, బుధవారం వినాయక చవితి ఆగస్టు 7: ఆదివారం ఆగస్టు 13 : శనివారం ఆగస్టు 14: ఆదివారం ఆగస్టు 21: ఆదివారం ఆగస్ట్ 27: నాల్గో శనివారం ఆగస్టు 28: ఆదివారం ఇది కూడా చదవండి: Zomato: జొమాటోకు భారీ షాక్, ఎందుకంటే? -
తెలంగాణ: విద్యాసంస్థల సెలవులు పొడిగింపు
-
తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు శనివారం వరకు సెలవులను పొడిగిస్తున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, విద్యా సంస్థలు తిరిగి బడులు సోమవారం తెరుచుకోనున్నాయి. ఇక కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్.. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బుధవారం వరకు విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్టు తెలిపారు. కానీ, బుధవారం నుంచి కూడా మరో మూడు రోజుల పాటు తెలంగాణలోని 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో, సెలవులను మరోసారి మూడు రోజుల వరకు పొడిగించారు. -
CM KCR: భారీ వర్షాలు.. ప్రజలను హెచ్చరించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్.. తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాము. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాము. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా ప్రలజకు అందుబాటులో ఉండాలి. అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లను అప్రమత్తం చేశాము. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ రేపు ఉదయానికల్లా నిండుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశాము. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అవసరమైతే హెలికాప్టర్లను కూడా వాడుకోవాలని సూచించాము. మంత్రులు జిల్లా కేంద్రాల్లో ఉండి సమీక్షలు చేపట్లాలి. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. -
తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు..?
-
మార్చిలో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..!
Bank Holidays In March 2022 In Telangana: భారతదేశంలోని అతిపెద్ద పండుగలలో ఒకటైన హోలీ 2022లో మార్చి 18న వస్తుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా అన్నీ బ్యాంకులు మూసివేయనున్నారు. అలాగే, మహాశివరాత్రి సందర్భంగా మార్చి 1, 2022న అనేక రాష్ట్రాల్లోని బ్యాంకులు కూడా మూసివేస్తారు. మార్చి నెలలో మీకు బ్యాంకులో ఏదైనా పని ఉంటే ఈ వార్త మీకోసమే. వచ్చే నెలలో బ్యాంకులకు మొత్తం 11 రోజులు సెలవులు ఉంటాయి. అయితే, ఈ సెలవులు అనేవి ఇతర రాష్ట్రాలలోని పండుగలను కలుపుకొని ఉంటాయి. బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ఆర్బీఐ ప్రకారం వచ్చే నెలకు సంబంధించి సెలవుల జాబితాను విడుదల చేసింది. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 11 రోజులు సెలవులు ఉండకపోవచ్చు. ఎందుకంటే.. సెలవులను స్థానిక పండుగలు, ఇతర ప్రత్యేక దినాలను ఆధారంగా చేసుకుని నిర్ణయిస్తారు. మరి మార్చిలో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయొ ఇప్పుడు తెలుసుకుందాం. 2022 మార్చి బ్యాంక్ సెలవులు: మార్చి 1- మహాశివరాత్రి(దేశవ్యాప్తంగా) మార్చి 3- లోసర్ సిక్కిం మార్చి 4- చాప్ చర్ కుట్ (మిజోరం) మార్చి 6- ఆదివారం సాధారణ సెలవు మార్చి 12- రెండో శనివారం సాధారణ సెలవు మార్చి 13- ఆదివారం సాధారణ సెలవు మార్చి 18- హోలీ(దేశవ్యాప్తంగా) మార్చి 20- ఆదివారం సాధారణ సెలవు మార్చి 22- బిహార్ దివాస్ మార్చి 26- నాలుగో శనివారం మార్చి 27- ఆదివారం (చదవండి: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. రేపే చివరి తేదీ!) -
తెరిచేనా.. నడిచేనా..
సాక్షి, హైదరాబాద్: విద్యా సంస్థలకు ప్రభుత్వం ప్రకటించిన సెలవులు ఈ నెల 30తో ముగుస్తాయి. ఈ నేపథ్యంలో 31 నుంచి విద్యా సంస్థలను తెరుస్తారా? లేదా? అన్న ఉత్కంఠ అన్ని వర్గాల్లో కనిపిస్తోంది. ప్రభుత్వం మాత్రం దీనిపై ఇంత వరకూ ఎలాంటి స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించ లేదు. విద్య, వైద్య శాఖల నివేదికలు అందిన తర్వాతే ముఖ్యమంత్రి కార్యాలయం ఓ నిర్ణయం తీసుకునే వీలుందని అధికార వర్గాలు అంటున్నాయి. విద్యాశాఖ మాత్రం 31 నుంచి విద్యా సంస్థల పునఃప్రారంభం కష్టమనే అభిప్రా యంతో ఉన్నట్టు తెలుస్తోంది. ‘ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో పాఠశాలలను తెరిచేందుకు సిబ్బందిని, ఉపాధ్యాయులను సన్నద్ధం చేయలేదు’ అని పాఠశాల విద్యా శాఖాధికారి ఒకరు తెలిపారు. 50 శాతం ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది ఇప్పటికే విధులకు హాజరవుతున్నారు. ఒకవేళ ప్రత్యక్ష బోధన చేపట్టాల్సి వస్తే కోవిడ్ నిబంధనల మేరకు విద్యార్థులను అనుమతిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపైనే అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెరవడం సమస్యే.. ఈ నెల 8వ తేదీ నుంచి విద్యా సంస్థలు మూతపడ్డాయి. అప్పట్నుంచీ తరగతి గదులు, పాఠశాల ఆవరణ, మరుగుదొడ్ల పరిశుభ్రత గురించి పట్టించుకున్న నాథుడే లేడు. కనీసం రెండు రోజుల పాటు వాటిని రసాయనాలతో శుభ్రం చేసి వాడాల్సి ఉంటుందని పాఠశాల హెచ్ఎంలు అంటున్నారు. స్థానిక పారిశుధ్ధ్య సిబ్బంది సహకారం అంతంత మాత్రంగానే ఉందని క్షేత్రస్థాయి సిబ్బంది అంటున్నారు. ఈ నేపథ్యంలో 31 నుంచి పాఠశాలల పునఃప్రారంభం కష్టమేనని అధికారులు భావిస్తున్నారు. అదీగాక వైద్య ఆరోగ్య శాఖ నుంచీ స్పష్టమైన భరోసా లేదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థుల ఆరోగ్యం పరిశీలించాలి.. అవసరమైతే వైద్య పరీక్షలు చేయాలి. వైద్యశాఖ సమన్వయంతోనే ఇవన్నీ సాధ్యమని విద్యాశాఖ చెబుతోంది. ఆన్లైన్ అవకాశం విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించినా.. విద్యార్థులను పాఠశాలలకు పంపుతారా? అనే సందేహాలను ఉపాధ్యాయ వర్గాలు లేవనెత్తుతున్నాయి. దీని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల హాజరును తప్పనిసరి చేయకూడదనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘పునఃప్రారంభించినా పాఠశాలలకు వచ్చే వాళ్ళు వస్తారు.. రానివాళ్ళు టీ–శాట్, డీడీ ద్వారా పాఠాలు వినే వెసులుబాటు కల్పించడమే మంచిది’ అని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి. 63 శాతం వరకూ వీటిని వింటున్నారు. ఆన్లైన్ అందుబాటులో లేని విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరై, మిగతా వారిలో కొంతమంది ఆన్‌లైన్‌కే పరిమితమైనా... తరగతి గదిలో కోవిడ్ నిబంధనల మేరకు విద్యార్థులుండే వీలుందని అధికారులు అంటున్నారు. అన్ని వివరాలతో ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితిని తెలిపే నివేదిక పంపామని పాఠశాల విద్యా శాఖాధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు. -
ఏపీలో సెలవుల పొడిగింపుపై మంత్రి ఆదిమూలపు క్లారిటీ
No Plans to Extend Holidays For Schools in AP: రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు పొడిగింపు ఆలోచన లేదని ప్రకటించిన విధంగా యధావిధిగా పాఠశాలలు నడుస్తాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రత తో పాటు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశామని, 15 నుంచి 18 సంవత్సరాల వయసు విద్యార్థులకు కూడా దాదాపు 92 శాతం వ్యాక్సిన్ వేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలలను యధావిధిగా నడపాలని ఆలోచిస్తూనే వారి ఆరోగ్య భద్రత పై కూడా డేగ కన్నుతో నిఘా ఉంచడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలను నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తామని ఆయన చెప్పారు. చదవండి: (అఖిలేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 'వారిని పార్టీలోకి చేర్చుకునేది లేదు') -
తెలంగాణలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు
School Holidays Extended in Telangana Because Of Covid-19: తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల(జనవరి) 30 వరకు సెలవుల్ని పొడిగించినట్లు తెలంగాణ చీఫ్‌సెక్రటరీ ప్రకటించారు. కరోనా నేపథ్యంలోనే విద్యా సంస్థలకు సెలవులు పొడిగించినట్లు తెలిపారు. జనవరి తొలి వారంలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సంక్రాంతి సెలవులను మూడు రోజులు ముందుకు జరిపి ఈనెల 8వ తేదీ నుంచే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. సంక్రాతిని కలిపేసుకుని ఈనెల 16 వరకు సెలవులు ఉండగా.. 17 నుంచి విద్యా సంస్థలు తెరవాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో నెలాఖరు వరకు సెలవులు పొడిగించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. అన్ని విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయని స్పష్టత ఇచ్చింది సర్కార్. ఇక రాష్ట్రంలో కరోనా ఆంక్షలను 20వ తేదీకి వరకు ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో.. విద్యా సంస్థలకు సెలవులు కూడా పొడిగించాలని వైద్య,ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో తాజాగా ఒక్కరోజులో 1,963 కొత్త కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 22, 017గా ఉంది. -
మొత్తం నాలుగు రోజుల సెలవులు! అక్కడి ఉద్యోగులకు సర్కార్ బంపరాఫర్
సాధారణంగా చాలావరకు ప్రభుత్వ కార్యాలయాలకు రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు ఉంటాయనేది తెలిసిందే కదా. కానీ, ఆ రాష్ట్రంలో మాత్రం ఈ వారంలో ప్రభుత్వ ఉద్యోగులకు మరో రెండు రోజులు అదనపు సెలవులు ప్రకటించారు. ఎందుకో తెలుసా?.. అస్సాం(అసోం) ప్రభుత్వం ఉద్యోగుల కోసం అరుదైన ప్రకటన చేసింది. జనవరి 6, 7 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేక సెలవులు మంజూరు చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా వెల్లడించారు. కుటుంబ సభ్యులతో మనసారా గడిపేందుకు ఈ సమయం కేటాయించండంటూ ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అస్సాం సాధారణ పరిపాలక విభాగం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 6, 7 తేదీల్లో రెండు రోజులపాటు ప్రత్యేక సెలవులు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తాయి. ఆపై 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం.. కూడా సెలవు దినాలే. అంటే మొత్తం వరుసగా నాలుగు సెలవురోజులు వచ్చాయి. ఇక ప్రత్యేక సెలవుల కోసం ముందుగా ఉద్యోగులు తమ సీనియర్ అధికారులకు లీవ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సోమవారం(జనవరి 10వ తేదీ) తిరిగి విధుల్లోకి వచ్చేటప్పుడు.. ప్రత్యేక సెలవుల్లో(ఆ రెండురోజులపాటు) కుటుంబంతోనే గడిపినట్లు ఫొటోల్ని ఆధారాలుగా సమర్పించాల్సి ఉంటుంది. ప్రతీకాత్మక చిత్రం అంతేకాదు ఈ హాలీడేస్ ఫొటోల్ని ప్రభుత్వం నిర్వహించే పోర్టల్లోనూ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో ఆ ప్రత్యేక లీవులు కాస్త క్యాజువల్ లీవులుగా మారిపోతాయి. అంతేకాదు ప్రత్యేక సెలవుల్ని దుర్వినియోగం చేసినందుకు చర్యలు కూడా ఉంటాయి. To uphold ancient Indian values, I urge Assam Govt employees to spend quality time with their parents/in-laws on Jan 6 & 7, 2022 designated as spl leave. I request them to rededicate themselves to the cause of building a New Assam & New India with blessings of their parents. pic.twitter.com/hZ2iwbgKoB — Himanta Biswa Sarma (@himantabiswa) January 2, 2022 టాప్ సివిల్ సర్వెంట్ నుంచి ఫోర్త్ గ్రేడ్ ఉద్యోగుల దాకా.. అందరికీ ఈ సెలవులు వర్తిస్తాయి. ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. తల్లిదండ్రులు లేని ఉద్యోగులకు ఈ సెలవుల నిబంధన వర్తించదు. అలాగే ఆ లీవ్స్‌ను తర్వాత ఉపయోగించుకోవడానికి కూడా వీల్లేదు. ఉద్యోగులు తమ కుటుంబీకులతో సమయం గడిపేందుకు అవకాశం ఇచ్చిన హిమంత సర్కార్‌పై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. నవంబర్లోనే ఈ జీవోకు అస్సాం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చదవండి: టెస్లాలో మనోడు.. తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర -
Christmas-Sankranti Holidays: క్రిస్మస్, సంక్రాంతి సెలవులివే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 23 నుంచి క్రిస్మస్, జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆఈర్టీ) అకడమిక్ క్యాలెండర్లో పొందుపరిచింది. క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి 30వ తేదీ వరకు ఉంటాయి. క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి. చదవండి: Srisailam temple: దుకాణాల వేలంలో అందరూ పాల్గొనవచ్చు: సుప్రీం కోర్టు డిసెంబర్ 31న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఇక సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 15వ తేదీ వరకు ఉంటాయని ఎస్సీఈఆర్టీ వివరించింది. మిషనరీ పాఠశాలలకు మినహా తక్కిన పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి. 17వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. జనవరి 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం కావడంతో ఆ రెండు రోజులూ సెలవే. -
డిసెంబర్ నెలలో బ్యాంక్ హాలిడేస్..! ఎన్నంటే..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ నెలలో బ్యాంక్ హాలిడేస్‌ను ప్రకటించింది. ఆర్బీఐ ప్రకటనలో దేశంలో ఆయా ప్రాంతాల వారీగా డిసెంబర్ నెలలో మొత్తం 12రోజులు సెలవులు ఇస్తున్నట్లు ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. ఇక ప్రతి నెలలో ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం రోజున బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇవన్నీ కలుపుకుంటే..డిసెంబర్లో మొత్తంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ 12 రోజులలో..6 సాధారణ సెలవులు కాగా, మిగతా 6 సెలవులు ఆయా ప్రాంతాల్లో స్పెషల్ హాలిడేస్ ఆధారంగా ఉండనున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 6 రోజులు సాధారణ సెలవులు మాత్రమే ఉండనున్నాయి. డిసెంబర్ నెలలో బ్యాంక్ హాలీడేస్‌ను ఒకసారి చూద్దాం డిసెంబర్ 3.. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ సందర్భంగా పనాజీలో బ్యాంక్ హాలిడే డిసెంబర్ 5 - ఆదివారం (సెలవు) డిసెంబర్ 11- శనివారం (నెలలో రెండవ శనివారం) డిసెంబర్ 12- ఆదివారం (సెలవు) డిసెంబర్ 18- యు సో సో థామ్ వర్ధంతి (షిల్లాంగ్‌లో బ్యాంక్ హాలిడే) డిసెంబర్ 19- ఆదివారం (సెలవు) డిసెంబర్ 24- క్రిస్మస్ పండుగ (ఐజ్వాల్‌లో బ్యాంక్ హాలిడే) డిసెంబర్ 25- క్రిస్మస్ పండుగ, శనివారం(నెలలో నాల్గవ శనివారం) డిసెంబర్ 26- ఆదివారం (సెలవు) డిసెంబర్ 27- క్రిస్మస్ వేడుక (ఐజ్వాల్‌లో బ్యాంక్ హాలిడే) డిసెంబర్ 30- యు కియాంగ్ నోంగ్బా (షిల్లాంగ్‌లో బ్యాంక్ హాలిడే) డిసెంబర్ 31- నూతన సంవత్సర వేడుక (ఐజ్వాల్‌లో బ్యాంక్ హాలిడే) -
ఓయూకు దసరా సెలవులు.. ఉద్యోగులకు రెండు రోజులే
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకి గురువారం(అక్టోబర్ 13) నుంచి ఈ నెల 19 వరకు ఆరు రోజులపాటు దసరా సెలవులను ప్రకటించారు. క్యాంపస్ కాలేజీలతో పాటు అనుబంధ కాలేజీలకు ఈ సెలవులు వర్తిస్తాయని పీఆర్వో డాక్టర్ సుజాత తెలిపారు. ఎగ్జామినేషన్ బ్రాంచ్, పాలన భవనం కార్యాలయం, ఇతర కార్యాలయాలకు 14, 15 తేదీలలో (రెండు రోజులు) మాత్రమే దసరా సెలవులు వర్తిస్తాయన్నారు. ఈ నెల 20 నుంచి తిరిగి ఓయూ తెరుచుకోనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. ఓయూలో ఈ–ఆఫీస్ సిస్టమ్ ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వ కాలేజియోట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ చేతుల మీదుగా ఈ– ఆఫీస్, యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రారంభమయ్యాయి. మంగళవారం పాలన భవనంలో వీసీ ప్రొఫెసర్ రవీందర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ–ఆఫీస్‌తో పనులు తొందరగా జరుగుతాయని, యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగుల పూర్తి వివరాలతో పాటు వివిధ కార్యాలయాల సమాచారం అందుబాటులో ఉంటుందని పీఆర్వో డాక్టర్ సుజాత వివరించారు. 18న ఓయూ పీజీ ప్రవేశ పరీక్షల ఫలితాలు సీపీజీఈటీ– 2021లో భాగంగా నిర్వహించిన వివిధ పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షల ఫలితాలను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. వాల్యూయేషన్ల జాప్యంతో పాటు దసరా సెలవుల కారణంగా ఫలితాలను 18కి వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు. ఓయూ డిగ్రీ ఫస్టియర్ ఫలితాలు విడుదల ఓయూ పరిధిలో డిగ్రీ రెగ్యులర్ కోర్సుల ఫస్టియర్ (సీబీఎస్సీ) మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. ఫలితాలను ఉస్మానియా వెబ్సైట్లో చూసుకోవచ్చని సూచించారు. (చదవండి: నీట్ రద్దు.. మంత్రి కేటీఆర్‌తో డీఎంకే ఎంపీల భేటీ) -
తెలంగాణ హైకోర్టుకు దసరా సెలవులు
సాక్షి, హైదరాబాద్: దసరా పర్వదినం సందర్భంగా తెలంగాణ హైకోర్టుకు ఈ నెల 7 నుంచి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అనుపమా చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు. సెలవుల్లో అత్యవసరమైన కేసులను 8న దాఖలు చేసుకోవాలని, 11న వాటిని జస్టిస్ షమీమ్ అఖ్తర్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం, జస్టిస్ అభిషేక్‌రెడ్డి విచారిస్తారని తెలిపారు. 18న తిరిగి హైకోర్టు ప్రారంభమవుతుంది. చదవండి: తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ -
ఈ వారంలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులకు సెలవు
మీకు బ్యాంకులో ఏమైనా అత్యవసర పనులు ఉంటే? వెంటనే సెప్టెంబర్ 7 లోపు చేసుకోండి. ఎందుకంటే, సెప్టెంబర్ 8 బుధవారం నుంచి వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు. అయితే, ఈ బ్యాంకు సెలవులు రాష్ట్రాల వారీగా మారతాయి. పైన పేర్కొన్న పండుగలు అన్నీ జరుపుకునే రాష్ట్రాల్లో ఐదు రోజులు సెలవులు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో పై పండుగలు అన్నీ ముఖ్యమైనవి కావు. కాబట్టి, ఆ రాష్ట్రాల్లో ఏ పండుగ అయితే జరుపుకోరో ఆ రోజు ఆ రాష్ట్రంలో బ్యాంకులు పనిచేస్తాయి. ఈ వారంలో వరుసగా రానున్న సెలవులు ఈ క్రింద విధంగా ఉన్నాయి.(చదవండి: ఆకాశంలో ఒక్కసారిగా పేలిపోయిన రాకెట్....!) సెప్టెంబర్ 8 తిథి ఆఫ్ శ్రీమంత శంకర్దేవ(గువాహటి) సెప్టెంబర్ 9 తీజ్(హరిటలికా) (గ్యాంగ్‌టక్) సెప్టెంబర్ 10 వినాయక చవితి సెప్టెంబర్ 11 గణేశ్ చతుర్థి (రెండో శనివారం) సెప్టెంబర్ 12 ఆదివారం పై లిస్ట్‌లో కేవలం వినాయక చవితి పండుగ నాడు మాత్రమే దేశవ్యాప్తంగా బ్యాంక్ లావాదేవీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. మిగతా తేదీలలో రాష్ట్రాల వారీగా సెలవులు ఉంటాయి. అయితే, ఈ సెలవు సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాలకు ఎటువంటి అంతరాయం ఉండదు. -
సెప్టెంబర్‌లో 12 బ్యాంక్ హాలీడేస్!
Bank Holidays September 2021: వచ్చే నెలలో 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. రెండో, నాలుగో శనివారం, ఆదివారాలన్నీ కలిపి దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 12 క్లోజింగ్ డేస్ రానున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వీటిలో దాదాపు ఎక్కువగా మిగతా రాష్ట్రాల పండుగలే ఉండడం విశేషం. సెప్టెంబర్ 8 తిథి ఆఫ్ శ్రీమంత శంకర్దేవ సెప్టెంబర్ 9 తీజ్(హరిటలికా) సెప్టెంబర్ 10 వినాయక చవితి సెప్టెంబర్ 11 గణేశ్ చతుర్థి (2వరోజు) సెప్టెంబర్ 17 కర్మ పూజ సెప్టెంబర్ 20 ఇంద్రజాతర సెప్టెంబర్ 21 శ్రీ నారాయణ గురు సమాధి డే చదవండి: హ్యాండ్‌క్యాష్.. అయినా ఈఎంఐలే ఎందుకు? పై లిస్ట్‌లో కేవలం వినాయక చవితి పండుగ నాడు మాత్రమే దేశవ్యాప్తంగా బ్యాంక్ లావాదేవీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. తిథి ఆఫ్ శ్రీమంత శంకర్దేవకు గువాహటి, తీజ్ సందర్భంగా గ్యాంగ్‌టక్‌లోని అన్ని బ్యాంకులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 10న అగర్తల, ఐజ్వాల్, భోపాల్, డెహ్రాడూన్, ఐజ్వాల్, భోపాల్, చంఢీగఢ్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, కొత్త ఢిల్లీ, పట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురంలో తప్ప దాదాపు అన్ని రాష్ట్రాల్లో వినాయక చవితికి సెప్టెంబర్ 10న బ్యాంకులు మూతపడనున్నాయి. అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగపూర్, పనాజీ గణేష్చతుర్థి మొదటి రోజుకు, పనాజీలో రెండో రోజుకు కూడా బ్యాంక్ సెలవులు తీసుకోనున్నాయి. కర్మపూజకుగానూ పనాజీ, ఏప్రిల్ 17న కర్మపూజలో భాగంగా రాంచీ, ఇంద్రజాతర కోసం గ్యాంగ్‌టక్, శ్రీ నారాయణ గురు సమాధి డే కొచ్చి-తిరువంతపురంలో బ్యాంకులు సెలవు పాటించనున్నాయి. సెప్టెంబర్ 11 గణేశ్ చతుర్థి (2వరోజు) సెలవు.. రెండో శనివారం కారణంగా ఓవర్ లాప్స్ కానుంది. ఆర్బీఐ సాధారణంగా తన సెలవులను మూడు కేటగిరీలకు విభజిస్తుంది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, హాలీడే అండర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ యాక్ట్ ప్రకారం బ్యాంకులకు సెలవుల్ని నిర్ధారిస్తుంది ఆర్బీఐ. సెప్టెంబర్ 5 – ఆదివారం, సెప్టెంబర్ 11 – రెండవ శనివారం, సెప్టెంబర్ 12 – ఆదివారం, సెప్టెంబర్ 19 – ఆదివారం, సెప్టెంబర్ 25 – నాల్గవ శనివారం, సెప్టెంబర్ 26 – ఆదివారం.. బ్యాంకుల సాధారణ సెలవులు. -
పోలీసులకు డీజీపీ తీపికబురు.. వారంలో ఓరోజు వీక్లీ ఆఫ్.. బర్త్‌డేకూ..
సాక్షి, చెన్నై(తమిళనాడు): పోలీసులకు వారంలో ఓ రోజు తప్పనిసరిగా వీక్లీ ఆఫ్ ఇవ్వాల్సిందేనని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ శైలేంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. బర్త్‌డే, వివాహ వేడుక జరుపుకోదలచిన పోలీసులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలతో సెలవుకు ఆదేశించారు. విధి నిర్వహణలో పోలీసులకు పనిభారం పెరుగుతుండడాన్ని పరిగణించి వారంలో ఓరోజు సెలవు తప్పనిసరిగా అమలుకు డీజీపీ శైలేంద్రబాబు ఉత్తర్వులతో పోలీసు యంత్రాంగం శనివారం ప్రత్యేక ప్రకటన చేసింది. ఆమేరకు అన్నిస్టేషన్లు, వివిధ విభాగాల్లో, ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసులకు వారంలో ఓ రోజు వీక్లీ ఆఫ్ తప్పనిసరి చేశారు. ఎవరైనా పోలీసు బర్త్‌డే, వివాహ వేడుక జరుపుకోదలచిన పక్షంలో వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడమే కాకుండా, సెలవు మంజూ రుకు ఆదేశాల్ని ఆ ఉత్తర్వుల్లో వివరించారు. -
సెలవు పేరు.. ఏళ్లుగా గైర్హాజరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ వ్యాప్తంగా వందలమంది టీచర్లు విధులకు గైర్హాజరవుతున్నారు. కొంతమంది టీచర్లు ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని సెలవులు పెడితే, చాలామంది అనుమతి తీసుకోకుండానే విధులకు డుమ్మా కొడుతున్నారు. అధికారిక, అనధికారిక సెలవులు, డిప్యూటేషన్లతో ఒక్కో జిల్లాలో పదుల సంఖ్యలో టీచర్లు విధులకు గైర్హాజరవుతుండగా.. అవినీతి, అక్రమాలు, ఇతరత్రా కేసులతో పలువురు విధులకు హాజరు కావట్లేదు. దీంతో వారు పనిచేయాల్సిన పాఠశాలల్లో సంబంధిత టీచర్లు లేక విద్యాబోధన దెబ్బతింటోంది. విద్యార్థులు ఎక్కువగా ఉన్నచోట మాత్రం విద్యాశాఖ ఇతర ప్రాంతాల నుంచి టీచర్లను తీసుకొని సర్దుబాటు చేసినా, మిగితా పాఠశాలల్లో సర్దుబాటుకు ఇబ్బందులు తప్పట్లేదు. దీంతో విధులకు గైర్హాజరవుతున్న టీచర్లపై విద్యాశాఖ దృష్టిపెట్టింది. వారిపై చర్యలకు సిద్ధమవుతోంది. నోటీసులిచ్చి వదిలేస్తున్నారు.. రాష్ట్రంలో 2012 నుంచి విధులకు గైర్హాజరవుతున్న టీచర్లు ఉన్నారు. వారికి నోటీసులు జారీచేసి శాఖాపరమైన చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమైనట్లు విద్యాశాఖ గుర్తించింది. కొన్ని జిల్లాల్లో నోటీసులు ఇచ్చి వదిలేస్తే మరికొన్ని జిల్లాల్లో జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో అనధికారిక సెలవుల్లో ఉన్న టీచర్లపై చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు జారీచేసిన ఉత్తర్వుల (జీవో 128) ప్రకారం ఏడాదికన్నా ఎక్కువ కాలం ఏ ప్రభుత్వ ఉద్యోగి, అధికారైనా విధులకు గైర్హాజరైతే సదరు ఉద్యోగి ఉద్యోగానికి రాజీనామా చేసినట్టే. సెలవుపెట్టినా, పెట్టకపోయినా ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం విధులకు హాజరు కాకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటేషన్ మంజూరు చేసిన కాలానికంటే ఎక్కువ కాలం ఉన్నా.. రాజీనామా చేసినట్లుగానే పరిగణించాలి. ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన 56 మంది అధ్యాపకులను ఇంటర్మీడియట్ విద్యాశాఖ 2011లో తొలగించింది. పాఠశాల విద్యాశాఖలో మాత్రం అలాంటి చర్యల్లేవు. తాజా పరిణామాలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు.. గైర్హాజరు టీచర్లపై చర్యలకు సిద్ధమవుతున్నారు. కేసుల వివరాలు సేకరణ ఏయే జిల్లాల్లో ఎంతమంది టీచర్లపై కేసులున్నాయనేది విద్యాశాఖ సేకరిస్తోంది. ఎవరిపై ఎలాంటి కేసులున్నాయి,? ఎన్నాళ్లు సస్పెన్షన్‌లో ఉన్నారు?, ప్రస్తుత పరిస్థితి ఏంటి? అవినీతి, అక్రమాలు, ఇతరత్రా కేసుల కారణంగా ఎందరు టీచర్లు పాఠశాలలకు రావట్లేదన్న వివరాలు సేకరిస్తోంది. అలాంటి వారిపై ఇప్పటివరకు శాఖాపరంగా ఎలాంటి చర్యలు చేపట్టారనేది జిల్లాల నుంచి సేకరిస్తోంది. ఇప్పటివరకు సేకరించిన సమాచారం ప్రకారం వివిధ కేసుల్లో 700 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. వీరంతా ‘సెలవు’ల్లోనే.. ► జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక టీచర్ 2016 ఆగస్టు నుంచి 2017 ఏప్రిల్ వరకు వి«ధులకు గైర్హాజరయ్యారు. ఆపై విధుల్లో చేరారు. తరువాత మళ్లీ 2020 ఆగస్టు నుంచి ఇప్పటివరకు అనధికారిక సెలవులోనే ఉన్నారు. ► నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక టీచరైతే 2012 నుంచి విధులకు హాజరు కావట్లేదు. 2018 నుంచి మరికొందరు టీచర్లు విధులకు హాజరు కావట్లేదు. మొత్తంగా అక్కడ నలుగురు టీచర్లు అనధికారిక సెలవుల్లో ఉన్నట్లు సమాచారం. ► పెద్దపల్లి జిల్లాలో ఒక టీచర్ 2020 ఫిబ్రవరి నుంచి ఇప్పటికీ స్కూల్ మెట్లెక్కలేదు. ఇలాంటి టీచర్లు అక్కడ ముగ్గురు ఉన్నట్లు తేలింది. కామారెడ్డిలోనూ ఇదే పరిస్థితి ఉంది. ► సిద్దిపేటలో 8 మంది, జగిత్యాలలో ఆరుగురు, భద్రాద్రి కొత్తగూడెంలో ముగ్గురు ఏళ్ల తరబడి విధులకు గైర్హాజరవుతున్న జాబితాలో ఉన్నారు. -
రేపటి నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు చివరి పని దినాన్ని, వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటిం చింది. ఈనెల 26వ తేదీని ఆయా విద్యా సంస్థలకు చివరి పని దినంగా పేర్కొంది. 27వ తేదీ నుంచి మే 31 వరకు వేసవి సెలవులుగా ప్రకటించింది. పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు సెలవులపై ఆదివారం ఆన్లైన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, విద్యా శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించిన అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇప్పటికే పదో తరగతి విద్యార్థులకు పరీక్షలను రద్దు చేయగా, తాజాగా 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి పాఠశాలలు, జూనియర్ కాలేజీల ప్రారంభంపై జూన్ 1న సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వెనువెంటనే చివరి పని దినం, సెలవులపై ఇంటర్మీడియట్ బోరుŠడ్ కార్యదర్శి, పాఠశాల విద్య ఇంచార్జి డైరెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. పది రోజులుగా కోరుతున్న నేపథ్యంలో... రాష్ట్రంలో కరోనా కారణంగా గత ఏడాది సెప్టెంబరు 1 నుంచి ఆన్లైన్/డిజిటల్ విద్యా బోధనను ప్రారంభించిన ప్రభుత్వం గత ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులతోపాటు ఇంటర్మీడియట్, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనకు అనుమతించింది. అదే నెల 24వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధనకు ఓకే చెప్పింది. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్చి 24 నుంచి విద్యా సంస్థలన్నింటికీ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ప్రత్యక్ష విద్యా బోధనను నిలిపివేసింది. అంతేకాదు మే 1 నుంచి నిర్వహించాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలు, మే 17 నుంచి నిర్వహించాల్సిన టెన్త్ పరీక్షలపైనా ఈ నెల 15నే నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలను రద్దు చేయడంతోపాటు, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తమకు కూడా సెలవులు ఇవ్వాలని, పెరుగుతున్న కరోనా కేసుల వల్ల పాఠశాలలకు వెళ్లి రావాలంటే భయంగా ఉందని టీచర్లంతా వాపోయారు. తాము స్కూళ్లకు వెళ్లి చేసేదేమీ లేకపోగా, కరోనా మహమ్మారి బారిన పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు సెలవులు ఇస్తూ ఆదివారం నిర్ణయం తీసుకుంది. ఆ విద్యార్థులంతా పాస్: సబితా ఇంద్రారెడ్డి కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే టెన్త్ పరీక్షలు రద్దు చేసి, 5,46,865 మందిలో పరీక్ష ఫీజు చెల్లించిన 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇపుడు 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53,79,388 మంది విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసినట్లు తెలిపారు. వారికి పరీక్షలేమీ ఉండవని స్పష్టంచేశారు. మొత్తంగా 59,26,253 మంది విద్యార్థులు ఉన్నట్లు వివరించారు. తరగతుల వారీగా నమోదైన విద్యార్థులు తరగతి విద్యార్థుల సంఖ్య 1 60,5,586 2 6,23,571 3 6,37,563 4 6,28,572 5 6,14,862 6 5,86,231 7 5,77,412 8 5,60,417 9 5,45,174 10 5,46,865 -
హైకోర్టుకు వరుసగా 5 రోజుల సెలవులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టుకు వరుసగా ఐదు రోజులు సెలవులు వస్తున్నాయి. ఈనెల 12న సెలవు దినంగా ప్రకటించారు. హైకోర్టు నియంత్రణలో పనిచేసే హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ, లీగల్ సర్వీసెస్ కమిటీ, హైకోర్టు మీడియేషన్ సెంటర్లకు సైతం ఆరోజు సెలవు ప్రకటించారు. ఈనెల 10న రెండో శనివారం, 11న ఆదివారం, 13న ఉగాది, 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా హైకోర్టుకు సెలవులున్నాయి. 12న ఒక్క రోజు పని దినంగా ఉంది. ఆరోజు కూడా సెలవు ఇవ్వాలని, ఇందుకు బదులుగా మరో సెలవు రోజున పని చేసేందుకు సిద్ధమంటూ ప్రధాన న్యాయమూర్తికి హైకోర్టు ఉద్యోగుల సంఘం లిఖితపూర్వక అభ్యర్థన చేసింది. ఇందుకు ప్రధాన న్యాయమూర్తి సానుకూలంగా స్పందించి ఈనెల 12న సెలవు దినంగా ప్రకటించారు. దీంతో వరుసగా 5 రోజులు సెలవులు వస్తున్నాయి. 12న సెలవు దినంగా ప్రకటించినందున జూలై 24వ తేదీని కోర్టుకు పనిదినంగా నిర్ణయించారు. జాతీయ లోక్ అదాలత్ మే 8కి వాయిదా ఈనెల 10న జరగాల్సిన జాతీయ ఈ–లోక్ అదాలత్ వాయిదా పడింది. మే 8న జాతీయ ఈ–లోక్ అదాలత్ జరుగుతుంది. ఈ మేరకు లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి చిన్నంశెట్టి రాజు, లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశారు. -
బెంగళూరులో పాఠశాలలకు సెలవులు
యశవంతపుర: దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న జిల్లాల్లో ఒకటైన బెంగళూరు అర్బన్ జిల్లాలో 15 రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 15 రోజుల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సురేశ్‌కుమార్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. కరోనా నియంత్రణకు ఏర్పాటైన సాంకేతిక సలహా సమితి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, సెలవులు ఎప్పటినుంచి అనే విషయాన్ని శనివారం ప్రకటిస్తామన్నారు. 10వ తరగతి విద్యార్థులు తరగతులకు హాజరు కావడం తప్పనిసరి కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం కర్ణాటకలో 34,238 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో ఆరుగురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 9,59,400 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక్కడ చదవండి: బెంగళూరు డ్రగ్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు.. అసలు నా శాఖలో ముఖ్యమంత్రికి ఏం పని సర్? -
వామ్మో! బ్యాంక్‌లకు ఇన్ని రోజులు సెలువులా?
ఏప్రిల్‌లో మీకు బ్యాంకులో ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే ఒక గమనిక. ఏప్రిల్‌లో నెల మొత్తంలో బ్యాంకులకు 12 రోజులు సెలవులున్నాయి. అంటే ఏప్రిల్‌లో బ్యాంకులు పనిచేసేది కేవలం 18 రోజులే. మీరు ఈ సెలవులకు అనుగుణంగా ముఖ్యమైన పనులను పూర్తీ చేసుకుంటే మంచిది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) సెలవుల క్యాలెండర్ ప్రకారం ఏపీ, తెలంగాణలలో ఏప్రిల్ నెలలో బ్యాంకులు 12 రోజులు పాటు పనిచేయవు. ఈ 12 రోజులలో, 6 సాధారణ సెలవులు కాగా, మిగతా 6 సెలవులు గుడ్ ఫ్రైడే, ఉగాది, శ్రీరామ నవమితో పాటు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వంటివి ఉన్నాయి. ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవులు: ఏప్రిల్ 1: వార్షిక ఖాతాల మూసివేత ఏప్రిల్ 2: గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 4: ఆదివారం ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు ఏప్రిల్ 10: రెండవ శనివారం ఏప్రిల్ 11: ఆదివారం ఏప్రిల్ 13: ఉగాది పండుగ ఏప్రిల్ 14: డా.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 18: ఆదివారం ఏప్రిల్ 21: శ్రీరామ నవమి ఏప్రిల్ 24: నాల్గవ శనివారం ఏప్రిల్ 25: ఆదివారం చదవండి: పాన్-ఆధార్ లింకు స్టేటస్ చెక్ చేసుకోండిలా! శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్...! -
రేపటి నుంచి పనిలోకి రానమ్మా...
పనిమనిషి ‘కలితా మాఝీ’ తను పని చేసే ఇళ్లల్లో ఒక నెల సెలవు తీసుకుంది. ‘రేపటి నుంచి పనికి రానమ్మా... నెల తర్వాతే మళ్లీ’ అని ఎన్నికల బరిలో దిగింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్లలో పుర్బ బుర్ద్వాన్ జిల్లాలోని ఆస్గ్రామ్ నియోజకవర్గం నుంచి ఆమె బిజెపి అభ్యర్థిగా రంగంలో దిగింది. ‘ఊరి సమస్యలు పనిమనిషికి కాకపోతే ఇంకెవరికి తెలుస్తాయి’ అంటోంది. ఆమె ఓడితే సరే.. గెలిస్తే ఏం చేయాలా అని ఇప్పటి నుంచి వేరే పనిమనుషుల గురించి ఒక కన్నేసి పెడుతున్నారు ఆమె పని చేసే ఇళ్లవాళ్లు. ప్రజాస్వామ్యపు ఈ సదవకాశ కథ వినదగ్గది. వారం క్రితం కలితా మాఝీ ఇల్లు చేరుకునేసరికి ఆమె గుడిసె ముందు ఒకటే కోలాహలం. బిజెపి జెండాలు. పార్టీ నాయకులు. కార్యకర్తలు. ఏమైందో ఆమెకు అర్థం కాలేదు. ఎవరో వచ్చి మిఠాయి తినిపించి ‘నిన్ను ఆస్గ్రామ్ నియోజకవర్గం నుంచి బి.జె.పి అభ్యర్థిగా నిలబెట్టారు’ అని చెప్పారు. కలితా తబ్బిబ్బయ్యింది. ఎందుకంటే ఇది ఆమె ఎప్పటికీ ఊహించనిది. ఆమె నాలుగిళ్లల్లో పాచి పని చేసుకుని బతికే పనిమనిషి. నేడు– కేంద్రంలో అధికారంలో ఉన్న అతి పెద్ద బి.జె.పి పార్టీ అభ్యర్థి. ఈ వార్త తెలిసి ఆమెకు సంతోషం కలిగింది. అయితే చేసే పని కొన్నాళ్లు మానేస్తున్నానని ఇళ్ల యజమానులకు ఎలా చెప్పాలా అని బెంగ కూడా కలిగింది. నాలుగిళ్ల మనిషి ఆస్గ్రామ్ అనేది దాదాపు 5 వేల మంది ఉండే చిన్న గ్రామం. అదే గ్రామ కేంద్రంగా ఆస్గ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఇది పుర్బ బుర్వాన్ జిల్లాలో ఉంది. ఈ జిల్లాలో 74 శాతం మంది లోపలి పల్లెల్లోనే జీవిస్తుంటారు. నగర ఛాయలు తక్కువ. పట్టణ ఛాయలూ తక్కువే. బాగా వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో అనాదిగా సిపిఎం ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తూ వచ్చాయి. ఇప్పుడు బి.జె.పి అక్కడ తన జెండా ఎగురవేయ దలిచి కలితా మాఝీని రంగంలో దించింది. అయితే డబ్బు దస్కం పలుకుబడి ఉన్న ఇందరు ఉండగా కలితాను ఎందుకు దించింది? ఎందుకంటే ఆస్గ్రామ్ నియోజక వర్గం ఎస్.సి రిజర్వ్డ్ కనుక కూడా. ఆరు చీరల అభ్యర్థి కలితా మాఝీకి మొత్తం ఎంచితే ఆరు చీరలు ఉన్నాయి. అవే ఆమె ఆస్తి. 32 ఏళ్ల కలితాకు 8వ తరగతి చదివే కొడుకు ఉన్నాడు. భర్త çపంబ్లర్. ఒక నీటి కుంట పక్కన వీరి గుడిసె ఉంటుంది. ‘నేను నాలుగైదు ఇళ్లల్లో పని చేస్తాను. గిన్నెలు కడిగి, ఇంటి పని చేస్తే దాదాపు రెండున్నర వేలు వస్తాయి. ఇరవై ఏళ్ల నుంచి పని మనిషిగానే నా బతుకు నేను బతుకుతున్నాను’ అంటుంది కలితా. అయితే అయిదేళ్ల క్రితం ఆమె ‘అవసరం’ పార్టీలకు పడింది. పంచాయతీ ఎలక్షన్లలో ఆ స్థానం కూడా రిజర్వ్డ్ కాబట్టి ఆమెను నిలబెట్టారు. అయితే ఆమె ఓడిపోయింది. ఇప్పుడు ఏకంగా ఎం.ఎల్.ఏగానే బి.జె.పి టికెట్ ఇచ్చింది. ‘కలితా ఐదేళ్లుగా పార్టీకి పని చేసింది. కష్టపడి పని చేసేవారిని మా పార్టీ గుర్తిస్తుంది’ అని బి.జె.పి జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్ అన్నారు. హాస్పిటల్ తెస్తాను కలితా అభ్యర్థిత్వం జాతీయ స్థాయిలో చాలామందిని ఆకర్షించింది. ఆమె వార్తల్లోకి వచ్చింది. అయితే అవన్నీ పట్టని కలితా తాను పని చేసే ఇళ్ల యజమానుల దగ్గర నెల రోజుల సెలవు అడిగింది. ‘రేపటి నుంచి పనిలోకి రానమ్మా అని చెప్పేశాను’ అంది. ఆ మేరకు ఆమెకు ఈ నెల ఆదాయం పోయినట్టే. అయితే ఏమిటి? ఉత్సాహంగా తాను గెలవడానికి ప్రచారం మొదలెట్టింది. ‘నేను కష్టం తెలిసినదాన్ని. నాలుగిళ్లు తిరిగి కష్టం గమనించేదాన్ని. సమస్యలు నాకు కాక ఇంకెవరికి తెలుస్తాయి’ అంటూ కలితా ప్రచారం చేస్తోంది. ఆస్‌గ్రామ్‌లో ఎవరికైనా సీరియస్ అయితే గంటన్నర ప్రయాణం చేసి బుర్వాన్ టౌన్‌కు వెళ్లాలి. ‘ఈ బాధలు ఎంతకాలం. నేను గెలిస్తే మంచి ఆస్పత్రి మా ఊరికి తీసుకు వస్తాను’ అని కలితా అంటున్న మాటలు ఆ ప్రాంతం వారికి నచ్చుతున్నాయి. కలితా భర్త పార్థ మాఝీ, అత్తగారు సందా మాఝీ ఆమెకు పూర్తిస్థాయి మద్దతు తెలిపారు. ‘ఆమె గెలవాలి. అందుకు చేయగలిగిందల్లా చెయ్ అని చెప్పాను’ అన్నాడు భర్త. ‘నా కోడలు గెలిస్తేనా చూడండి ఎన్ని అద్భుతాలు చేస్తుందో’ అని అత్త అంటోంది. నిజానికి అన్ని వర్గాల ప్రజలు ఎన్నికలలో పాల్గొనడానికి మన ఎన్నికల వ్యవస్థలో చోటు ఉంది. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని గెలవాలి. గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే ‘తప్పనిసరి’ సందర్భాలలో మాత్రమే కొందరికి అవకాశాలు దక్కడాన్ని విమర్శించాలా ఈ తప్పనిసరి వల్లనైనా అవకాశం దక్కింది అని సంతోష పడాలా తెలియదు. గతంలో తెలుగులో ‘ముద్దమందారం’ అనే సినిమాలో రిజర్వ్డ్ స్థానానికి సినిమా టాకీసులో పని చేసుకు బతికే రాజేంద్రప్రసాద్‌ను నిలబెడతారు. కలితాది అలాంటి కథ కారాదని ఆమె గెలవాలని, ఎంఎల్ఏగా బాగా పని చేసి పేరు తెచ్చుకోవాలని కోరుకునే శ్రేయోభిలాషులు ఉంటారు. అయితే తృణమూల్‌కు, బిజెపికి హోరాహోరీగా పోరాటం జరుగుతున్న బెంగాల్లో చీపిరి వదిలి తడి చేతులు తుడుచుకుని అందరికీ నమస్కారం పెడుతూ ఓట్లు అభ్యర్థించే కలితా గెలుపు అవకాశాలు ఎన్ని అనేదే ఇప్పుడు ఉత్కంఠ. వేచి చూద్దాం. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం నిర్వహిస్తున్న కలితా మాఝీ – సాక్షి ఫ్యామిలీ -
అలర్ట్: బ్యాంకులకు వరుస సెలవులు
మీకు బ్యాంకులో ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే ఈ వారంలోపు పూర్తీ చేయండి. లేకపోతే మీరు బ్యాంకు పనుల కోసం ఏప్రిల్ 3 వరకు వేచి ఉండాల్సి వస్తుంది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 మధ్య కేవలం రెండు రోజులు మాత్రమే బ్యాంకు కార్యాలయము పనిచేస్తాయి. కాబట్టి, బ్యాంకులో ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే ఈ వారంలోపు పూర్తీ చేయండి. మార్చి 27న చివరి శనివారం, మార్చి 28న ఆదివారం, మార్చి 29న హోలీ పండుగ ఇలా మూడు రోజులు వరుస సెలవులు ఉన్నాయి. తర్వాత మార్చి 30న పాట్నాలో హాలిడే ఉంది. మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు కావడంతో బ్యాంకుల్లో కస్టమర్లకు సేవలు లభించవు. అలాగే ఏప్రిల్ 1న కూడా బ్యాంక్ సేవలు సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండవు. బ్యాంకులు వార్షిక ఖాతాల క్లోజింగ్ పనిలో ఉంటాయి. ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే. అంటే బ్యాంకులు 9 రోజుల్లో దాదాపు 7 రోజులు పని చేయవని చెప్పుకోవచ్చు. దీని వల్ల మీకు బ్యాంకులో పని ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవడం ఉత్తమం. ఇప్పటికే ఈ నెలలో చాలా సెలవులు వచ్చాయి. మార్చి 15-16 తేదీలలో బ్యాంకుల ప్రైవేటీ కరణకు నిరసనగా రెండు రోజులు పాటు బ్యాంకులు పనిచేయలేదు. చదవండి: మొబైల్ యూజర్లకు ఊరట! -
కాశ్మీరి అందాలను ఎంజాయ్ చేస్తోన్న హన్సిక
-
2021లో సాధారణ సెలవులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే సంవత్సరం (2021)లో 28 సాధారణ సెలవు దినాలు, 25 ఐచ్ఛిక సెలవు దినాలు ఉండనున్నాయి. ఈ మేరకు సాధారణ, ఐచ్ఛిక సెలవు దినాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఆదివారాలతో పాటు అన్ని రెండో శనివారాలు (ఫిబ్రవరి 13 మినహా) మూసి ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికారులకు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవడం ద్వారా 25 ఐచ్ఛిక సెలవుల్లో అయిదుకు మించకుండా వాడుకోవచ్చు. రాష్ట్రంలోని పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలకు, విద్యా సంస్థలు, పబ్లిక్ వర్క్స్ శాఖల ఉద్యోగులకు ఈ సాధారణ సెలవులు వర్తించవు. ఆయా పండుగలు/సందర్భాల్లో ఈ సంస్థలకు వర్తించనున్న సెలవులను ప్రకటిస్తూ సంబంధిత శాఖలు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. ఇక నెల వంక ఆధారంగా రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీ వంటి పర్వదినాల్లో ఏవైనా మార్పులు చేసుకుంటే ప్రభుత్వం ఆ మేరకు సెలవు దినాలను సైతం మార్చనుంది. ( ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి లింక్‌రోడ్లు ) -
మూడు రోజుల సెలవులు, భారీగా ట్రాఫిక్ జామ్
-
మూడు రోజుల సెలవులు, భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని కీసర టోల్ ప్లాజా వాహనాలతో కిటకిటలాడిపోతోంది. వేల సంఖ్యలో వాహనాలు రావటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. వరుసగా గాంధీ జయంతి, శనివారం, ఆదివారం మూడు రోజులు సెలవులు రావటంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు చాలా మంది ప్రయాణికులు తరలి వెళుతున్నారు. అధికంగా వాహనాలు రావడంతో కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాపిక్ జామ్ అయ్యింది. గంటలు తరబడి ట్రాఫిక్ స్థంభించిపోవటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. చదవండి: ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం -
వేసవి సెలవులు ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం
ఢిల్లీ : సాధారణంగా అయితే విద్యార్థులకు వేసవిలో సెలవులుంటాయి. కానీ ఈసారి మాత్రం కొంచెం భిన్నం. సెలవుల్లోనే వేసవి వచ్చింది. ఈ ఏడాది విద్యా సంవత్సరానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. ప్రతి ఏడాది మాదిరిగానే మే 11 నుంచి జూన్ 30 వరకు సమ్మర్ హాలీడేస్ ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆయా పాఠశాలల విద్యార్థులకు వాట్సాప్ లేదా ఇతర మాధ్యమాల ద్వారా సమాచారం అందివ్వాలని సూచించింది. ( జేఈఈ, నీట్ పరీక్షా తేదీలు ప్రకటించిన ప్రభుత్వం ) కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా మార్చి 23 నుంచి స్కూల్స్ మూతపడటంతో విద్యార్థులు నష్టపోకుండా అన్ని యాజమాన్యాలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా వేసవిలో వివిధ కోచింగ్ సెంటర్లు నడిచేవి. కానీ ఈసారి పరిస్థితి మారింది. కాబట్టి విద్యార్థులు ఎవరినీ క్లాసుల పేరిట కోచింగ్‌లు, ట్యూషన్లు అని పంపవద్దని ఆదేశించారు. అయితే ఆన్లైన్ క్లాసులు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. దేశ రాజధానిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 5100 కోవిడ్ కేసులు నమోదవగా, 64 మంది మరణించారు. -
ఇవే ప్రిపరేషన్ సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ తరువాత పరీక్షల నిర్వహణకు చర్యలు చేపడతామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. కరోనా అదుపులోకి వచ్చి లాక్డౌన్ ఎత్తివేయగానే వీలైనంత త్వరగా ప్రవేశ, వార్షిక పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన అంశాలపై ఆయన ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. విద్యార్థులు ఇళ్లల్లోనే ఉండి ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత ప్రత్యేకంగా శిక్షణ పొందే అవకాశం ఉండకపోవచ్చని, ఈ సమయాన్నే ప్రిపరేషన్ సెలవులుగా వినియోగించుకోవాలని సూచించారు. వచ్చే నెల 7నాటికి పరిస్థితి అదుపులోకి వస్తే మే చివరి నాటికి ఎంసెట్ పరీక్షలను ప్రారంభించే అవకాశం ఉంటుందన్నారు. దీనిపై ఆన్లైన్ పరీక్షల నిర్వహణ సంస్థతోనూ మాట్లాడతామన్నారు. ఎంసెట్ తరువాత వీలును బట్టి జూన్‌లో ఇతర ప్రవేశ పరీక్షలైన ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్‌ను నిర్వహించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. బీఏ, బీకాం, బీఎస్సీ వంటి డిగ్రీ, బీటెక్, పీజీ కోర్సులకు సంబంధించిన ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను కూడా లాక్డౌన్ ముగియగానే నిర్వహించేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు జూన్‌లో నిర్వహించాల్సి వచ్చినా ప్రవేశాల విషయంలో సమస్య ఉండబోదన్నారు. జూన్ నెలాఖరు నాటికి ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. -
కోర్టులకు వేసవి సెలవులు రద్దు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు, జిల్లా కోర్టులు ఈ నెల 30 వరకూ అత్యవసర కేసుల్ని మాత్రమే విచారించాలని ఫుల్ కోర్టు నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఈ నెల 14వరకూ లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర కేసుల్ని14వ తేదీ వరకు మాత్రమే విచారించాలని గతంలో హైకోర్టు నిర్ణయించింది. తాజాగా మంగళవారం న్యాయమూర్తులంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై ప్రస్తుత విధానాన్ని ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించాలని నిర్ణయించారు. ప్రతి సోమ, బుధ, శుక్రవారాలు అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫెరెన్స్ మాత్రమే విచారణ చేస్తున్న విధానం ఇక నెలాఖరు వరకూ కొనసాగుతుంది. కరోనా నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని కోర్టులకు వేసవి సెలవులను రద్దు చేయాలని కూడా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో హైకోర్టు, జిల్లా కోర్టులు, రాష్ట్రంలోని ఇతర అన్ని కోర్టులు మే1వ తేదీనుంచి జూన్ 5వ తేదీ వరకు పనిచేస్తాయి. హైకోర్టు న్యాయమూర్తులందరూ (ఫుల్‌కోర్టు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సమావేశమై ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
రేపటి నుంచి ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు
-
రేపటి నుంచి ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని నివారించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ప్రజలను ఆందోళనకు గురిచేయవద్దని సూచించారు. సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం.. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. గురువారం నుంచి ఏపీలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లకు సెలవులు ప్రకటించారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. గురువారం నుంచి రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్టు తెలిపారు. పదవ తరగతి పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని అన్నారు. హాస్టల్లో ఉన్న విద్యార్థులను దగ్గరుండి ఇళ్లకు పంపిస్తామని చెప్పారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులలో వారిని ఇంటికి చేర్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఏపీ ప్రభుత్వ చొరవతో స్వదేశానికి తెలుగు విద్యార్థులు.. కరోనా ఆందోళన నేపథ్యం మలేషియాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు బుధవారం రాత్రికి విశాఖపట్నం చేరుకున్నారు. ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్ చదువుతున్న విద్యార్ధులు ఇండియాకు వచ్చేందుకు బయలుదేరి మలేషియా చేరకున్నారు. అక్కడ కరోనా ఆందోళనతో వారు స్వదేశానికి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యార్థులు మలేషియాలో చిక్కుకుపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు విద్యార్థుల గోడును కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. తెలుగు విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపారు. చదవండి : ‘విదేశీ విమానాలను పూర్తిగా రద్దు చేయాలి’ కరోనా: తెర వెనుక హీరోపై ప్రశంసలు కరోనా : నిలిచిపోయిన ఆ చానల్ ప్రసారాలు -
పండగ రద్దీ: టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్
-
పండగ రద్దీ: టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జమ్ ఏర్పడుతోంది. సంక్రాంతి పండగ సెలవులు కావడంతో హైదరాబాద్ నగర వాసులు ఇటు తెలంగాణకు, అటు ఏపీకి పయనమవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలంగాణ, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వారికి నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్గేట్లో 8 టోల్ బూతులు తెరిచారు. బూత్‌లో ఫాస్ట్ ట్యాగ్ స్కానర్ పనిచేయకపోవడంతో పాత రేట్ల ప్రకారం డబ్బులు తీసుకొని వాహనాలను పంపుతున్నారు. ఫాస్ట్ టాగ్‌పై అవగాహన లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. టోల్గేట్ వద్ద ప్రత్యేకంగా ఫాస్ట్ టాగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులంతా ఫాస్ట్ టాగ్లను తీసుకుంటున్నారు. తెలంగాణలో రేపటి నుంచి విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయి. దీంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు, జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ బస్టాప్‌లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్లను గుర్తించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామ వద్ద రహదారులు అన్నీ రద్దీగా మారాయి. హైదరాబాద్, విజయవాడ 65 నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్ధీ పెరిగింది. కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరడంతో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. -
ఉద్యోగులకు సెలవుల్లేవు
సాక్షి, హైదరాబాద్: పురపోరు ముగిసేవరకు మున్సిపల్ ఉద్యోగులకు సెలవుల్లేవని, ఇప్పటికే సెలవులో వెళ్తే తక్షణమే వెనక్కి పిలిపించాలని పురపాలక శాఖను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది. సగటున ఒక్కో పోలింగ్స్టేషన్లో 800 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ఆ పరిధి దాటితే కచ్చితంగా రెండో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ స్టేషన్లనే పుర పాలక సంస్థల ఎన్నికలకూ వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉంటే పోటీకి అనర్హులన్న నిబంధన ఇప్పుడు లేదని స్పష్టం చేసింది. 2019 జనవరి 1 నాటికి కనీసం 18 ఏళ్ల వయసు నిండి, ఓటర్ల జాబితాలో పేరున్న వారు ఓటేసేందుకు అర్హులని, ఆ మేరకు జాబితాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఓటర్ల జాబితాల్లో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు పడాలని, వార్డు ఓటర్లు అదే వార్డులో వచ్చేలా రెండ్రోజుల్లో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించింది. టీ–పోల్ యాప్‌ను ఒకట్రెండు రోజుల్లో అప్డేట్ చేయనున్నట్లు పేర్కొంది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అభ్యర్థుల వ్యయం పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. వచ్చే నెల 7న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో మంగళవారం ఎస్ఈసీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లపై కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్, జిల్లాల కమిషనర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనవద్దు.. ఒక పోలింగ్ స్టేషన్ లో 800 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సూచించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని తెలిపారు. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో అధికారులు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని, ప్రభుత్వం తరఫున ఎలాంటి బ్యానర్లు పెట్టొద్దని సూచించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఈనెల 27న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్, 28న రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. చకచకా ఏర్పాట్లు.. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగా, జనవరి 7న ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో మిగిలిన ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో పోలిస్తే మున్సిపల్ ఓటర్ల సంఖ్య ఈ సారి భారీగా పెరగ్గా, ఒకే దశలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పా ట్లు చేస్తోంది. వార్డుల విభజన, ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తికావస్తోంది. వార్డుల రిజర్వేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు చేపట్టనున్నారు. మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్ల రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో చేపడతారు. -
ఐదు పండుగలు.. సెలవు రోజుల్లోనే
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది (2020)కి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవులను రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. వీటిలో ఐదు పండుగలు సెలవురోజులైన ఆదివారాలు, రెండో శనివారం రోజున రానుండడం విశేషం. వారాంతపు సెలవురోజుల్లో ఇవి రానుండడంతో ఆ మేరకు ఉద్యోగులు సెలవులు కోల్పోయినట్టే. ఆదివారం సెలవుల్లో రిపబ్లిక్ డే, బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి, మొహర్రం, విజయదశమి ఉండగా, దీపావళి పండుగ రెండో శనివారం వస్తోంది. ఇవే కాదు మరో ఐచ్ఛిక సెలవు(బసవ జయంతి) సైతం ఆదివారమే రానుంది. వచ్చే ఏడాది (2020)లో వచ్చే సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులతోపాటు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం కింద వచ్చే సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలివీ.. -
దీర్ఘకాలిక సెలవులో అశ్వత్థామరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెలో కీలకంగా వ్యవహరించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. గురువారం ఉదయం మహాత్మాగాంధీ బస్టాండులో విధుల్లో చేరి, ఆ వెంటనే 6 నెలల కాలానికి సెలవుకోసం దరఖాస్తు చేశారు. జేఏసీలో కీలకంగా వ్యవహరించిన రాజిరెడ్డి, థామస్‌రెడ్డి, సుధలు ఇప్పటికే విధుల్లో చేరారు. ఆర్టీసీ పోస్టుకు రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సన్నిహితులు పేర్కొంటున్నారు. ‘రెండేళ్ల వరకు గుర్తింపు సంఘం ఎన్నికలొద్దంటూ కార్మికులతో అధికారులు బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారు. ఇది చట్ట విరుద్ధం. దీనిపై కార్మికశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తాం. శుక్రవారం ధర్నాలు కొనసాగుతాయి’ అని అశ్వత్థామరెడ్డి అన్నారు. -
తెలంగాణలో దసరా సెలవులు పొడిగింపు
-
బ్యాంకులకు వరుస సెలవులు
సాక్షి, అమరావతి: ఆగస్టు నెల రెండవ వారంలో ఆరు రోజుల్లో బ్యాంకులు కేవలం రెండు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఆగస్టు 10 నుంచి 15వ తేదీలోపు నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు 10న రెండవ శనివారం, ఆగస్టు 11న ఆదివారం కాగా ఆగస్టు 12న బక్రీద్ రావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత రెండు రోజుల విరామం తర్వాత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో బ్యాంకులకు ఆ రోజున కూడా సెలవు. ఈ సెలవు దినాల్లో నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి ఆన్లైన్ చెల్లింపులు కూడా పనిచేయవు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా బ్యాంకర్లు సూచిస్తున్నారు. -
సెలవుపై వెళ్లిన ద్వివేదీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) గోపాల కృష్ణ ద్వివేదీ సెలవుపై వెళ్లారు. రేపటి నుంచి ఈ నెల 15 వరకు ద్వివేదీ సెలవులోనే ఉండనున్నారు. తిరిగి ఈ నెల 16న సచివాలయానికి ద్వివేదీ రానున్నారు. స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసిన క్యాబినేట్ అజెండాను కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈఓ ద్వివేదీ పంపారు. కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) నుంచి అనుమతి రావడానికి కనీసం రెండు రోజుల సమయం పట్టే అవకాశముంది. సోమవారం సాయంత్రానికి క్యాబినేట్‌పై సీఈసీ నుంచి స్పష్టత రావచ్చని అధికారులు భావిస్తున్నారు. గోపాల కృష్ణ ద్వివేదీ సెలవుపై వెళ్లనుండటంతో క్యాబినేట్ ఎజెండా మరింత ఆలస్యం అయ్యే అవకాశముంది. -
గత్యంతరం లేక విధుల్లోకి!
వరంగల్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌కు ఇటీవలే 32 ఏళ్లు నిండాయి. ఇప్పటికే ఎస్సై శారీరక పరీక్షలు పూర్తి చేసి, రాతపరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. డ్యూటీ చేస్తూనే.. రాతపరీక్షకు సిద్ధమవడం చాలా కష్టమని ఆవేదన వ్యక్తం చేశాడు కరీంనగర్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ పదేళ్ల కింద డిపార్ట్మెంట్లో చేరాడు. ఈ మధ్య డిగ్రీ పూర్తి చేసిన యువకులతో పోటీ పడాలంటే.. రాత పరీక్షలకు ఇపుడున్న తక్కువ సమయం సరిపోదంటున్నాడు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎస్సై రాత పరీక్షల కోసం సెలవు పెట్టి మరీ సిద్ధమవుతున్న కానిస్టేబుళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో విధుల్లో చేరారు. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సెలవులన్నీ రద్దుచేసిన డీజీ కార్యాలయం.. కానిస్టేబుళ్లంతా ఏప్రిల్ 1 నాటికి తప్పకుండా విధులకు హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో చేసేదిలేక ఇన్నిరోజులుగా ఇంటి దగ్గరే ఉంటూ రాతపరీక్షకు ప్రిపేరవుతున్న వారంతా.. డ్యూటీలో రిపోర్ట్ చేసి, విధులకు హాజరవుతున్నారు. అటు.. ఎస్సై రాతపరీక్షలకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే.. ఈ పరీక్షలను వాయిదా వేయాలని పోలీసుశాఖలోని కానిస్టేబుళ్లు, హోంగార్డులు వేడుకుంటూనే ఉన్నారు. గతేడాది ఎస్సై రాతపరీ క్షకు నోటిఫికేషన్ రాగా.. మార్చి చివరినాటికి శారీరక పరీక్షలు పూర్తయ్యాయి. ఇదీ.. కానిస్టేబుళ్ల ఆవేదన! వాస్తవానికి ప్రస్తుతం పోలీసుశాఖలో దాదాపుగా 3వేల మందికిపైగా కానిస్టేబుళ్లు ఎస్సై పరీక్షకు ప్రిపేరవుతున్నారు. ఏప్రిల్ 20, 21 తేదీల్లో తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వీరికి రాతపరీక్షలు నిర్వహించనుంది. అయితే, సమయం తక్కువగా ఉందని పరీక్షను వాయిదా వేయాలని డిపార్ట్మెంట్లోని కానిస్టేబుళ్లు, హోంగార్డులు అభ్యర్థిస్తున్నారు. దీనిపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. అయినా.. పరీక్షను వాయిదా వేసేది లేదంటూ హోంశాఖ స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల తర్వాత అనధికారికంగా సెలవుల్లో ఉన్న కానిస్టేబుళ్లందరికీ నోటీసులు పంపి, టెలిఫోన్లో వారికుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించింది. ఫలితంగా వారంతా ఏప్రిల్ 1లోపు అంతా రిపోర్టు చేసి విధుల్లో చేరారు. ఎస్సై కావాలని ఎన్నో ఏళ్లుగా కలలుగంటున్న తమకు.. తమ శాఖలోని అధికారులే కరుణించకపోతే ఎలాగని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాము రాత పరీక్షను రద్దు చేయమని అడగడం లేదని, కేవలం ప్రిపరేషన్ కోసం నెల రోజులు వాయిదా వేయమని మాత్రమే కోరుతున్నామంటున్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు, ఏప్రిల్ 14న ఏఆర్ కానిస్టేబుళ్లకు పదోన్నతి శిక్షణ ఉందని ఈ నేపథ్యంలో వాయిదా విషయాన్ని మానవతాకోణంలో పరిశీలించాలని విన్నవిస్తున్నారు. వాయిదా సమస్యేలేదు ఈ విషయంలో పోలీసుశాఖ పలుమార్లు తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది. ఎట్టిపరిస్థితుల్లో షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని రిక్రూట్మెంట్ బోర్డు చెప్పేసింది. ఇప్పటికే 2.17 లక్షల మందికి శారీరక పరీక్షలు నిర్వహించిన బోర్డు రాతపరీక్షలకు ఏర్పాట్లు చేస్తోంది. -
3 రోజులు సెలవులు.. నో నామినేషన్లు..
సాక్షి, మేడ్చల్ జిల్లా: లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేయటానికి ఈ నెల 25 వరకు గడువు ఉన్నప్పటికీ, ఇందులో మూడు సాధారణ సెలవురోజులు ఉన్నాయి. ఈ సాధారణ సెలవు రోజుల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉండదు. 21న హోలీ, 23న నాలుగో శనివారం, 24న ఆదివారం కావటంతో ఈ మూడు రోజుల్లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉండదనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలని అధికారులు సూచించారు. -
ఓ కళాఖండంతో మరో కళాఖండం
దక్షిణాదిలోనే అగ్రనటిగా వెలిగిపోతున్నారు కేరళ బ్యూటీ నయనతార. ఓ పక్క తనకంటే చిన్నహీరోలతో పాటు మరోపక్క హీరోయిన్ ఒరియెంటెడ్ చిత్రాలతో కూడా దూసుకుపోతుంది నయన్. వరుస షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికి.. మధ్యలో గ్యాప్ తీసుకుని బాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్‌శివన్‌ను తీసుకుని విదేశాలకు చెక్కేస్తోంది. న్యూయిర్ వేడుకల కోసం అమెరికా వెళ్లి ఎంజాయ్ చేసిన ఈ జంట.. ఈ నెల చివరిలో మరోసారి అమెరికాకు వెళ్లారు. అక్కడ జాలీగా ఎంజాయ్ చేస్తూ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక అందమైన యువతి పెయింటింగ్‌ను ఆసక్తిగా గమనిస్తోన్న నయనతార ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు విఘ్నేశ్‌శివన్. ఈ ఫోటో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ‘ఒక చిత్ర కళాఖండంతో మరో చిత్రకళాఖండం నిలబడిందే ఆహా ఏమి ఆశ్చర్యం’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram Graffiti & a beautiful painting 🥰😘 #nofilterneeded #pictures #photography #candid #losangeles #streetphotography #lowlights #shotoniphone A post shared by Vignesh Shivn (@wikkiofficial) on Jan 28, 2019 at 8:19pm PST -
ఆర్బీఐ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు వాయిదా
కోల్‌కతా: ఆర్బీఐ ఉద్యోగులు మూకుమ్మడిగా ఈ నెల 4, 5వ తేదీల్లో తలపెట్టిన సెలవుల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఆర్బీఐ ఉన్నత యాజమాన్యంతో పలు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం మూకుమ్మడి సెలవు కార్యక్రమాన్ని 2019 జనవరి మొదటి వారానికి వాయిదా వేసినట్టు రిజర్వ్ బ్యాంకు అధికారులు, ఉద్యోగుల ఐక్య సంఘం తెలిపింది. కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోని వారు పెన్షన్ పథకంలోకి మారే అవకాశం కల్పించాలన్నది ఉద్యోగుల డిమాండ్. -
ఏపీలో స్కూళ్లకు సెలవులు పొడగింపు
-
ఏపీలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు
-
బ్యాంకులకు 4రోజులు వరుస సెలవులు
బ్యాంకులకు రేపటి నుంచి మళ్లీ వరుస సెలవులు రాబోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు రేపటి(శనివారం) నుంచి మంగళవారం వరకు మూత పడబోతున్నాయి. ఏప్రిల్ 28 నాలుగో శనివారం కావడంతో యథావిథిగా బ్యాంకులు సెలవు పాటించనున్నాయి. ఏప్రిల్ 29 ఆదివారం, సోమవారం బుద్ధ పూర్ణిమ, మంగళవారం కార్మిక దినంతో బ్యాంకులు ఈ సెలవులను పాటిస్తున్నాయి. అయితే సోమవారం, మంగళవారం రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి బ్యాంకులు మూసివేయరు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం ఈ సెలవులను బ్యాంకులు పాటిస్తాయి. బుద్ధ పూర్ణిమ(సోమవారం) రోజు మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, హర్యానాలో బ్యాంకులు మూసివేయనున్నారు. లేబర్ డే(మంగళవారం) రోజు కేరళ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో, గోవాల్లో సెలవులను పాటించనున్నాయి. ఈ సెలవుల నేపథ్యంలో బ్యాంకులు మూత పడినా ఏటీఎంలు మాత్రం ఎప్పడికప్పుడూ నింపుతూనే ఉంటామని ఓ బ్యాంకర్ చెప్పారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి కార్యకలాపాలను కూడా యథావిథిగా కొనసాగించనున్నట్టు పేర్కొన్నారు. ఇటీవలే నగదు కొరతతో కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఈ సమస్య అంతగా మెరుగు పడలేదు. -
జర భద్రం..!
అసలే వేసవి కాలం.. ఆపై సెలవులు వచ్చేశాయి. ఇంకేముంది విహారయాత్రలే..! ఇలా అనుకుంటే సరిపోదు. ఇల్లు వదిలి వెళ్లే సమయంలో పలు జాగ్రత్తలు పాటిస్తే చోరీల నుంచి కాపాడుకోవచ్చు. ఇరుగుపొరుగు వారికో, పోలీసులకో సమాచారం ఇవ్వాలి. అలా చేయకుంటే ఇంటికొచ్చేసరికి ఇంకేముంది ఇల్లు గుల్లే..!! ఆధునిక సీసీ కెమెరాలు, అలారం ఏర్పాటు చేసుకుంటే కొంతైనా రక్షణ ఉంటుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగం కూడా కోరుతూనే ఉంది. మద్నూర్(జుక్కల్) : ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఇక పిల్లాపాపలతో ఊరెళ్తాం అనుకొని ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్తారు. హాయిగా అన్నీ చూసి వచ్చేసరికి ఇంట్లో దుండగులు పడి ఉన్నదంతా దోచుకుపోతారు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తారు. ఇది రోటీన్. ప్రతి ఏటా ఇలాంటి సంఘటనలు చాలానే చూస్తాం, వింటాం. తాళాలు వేసి ఉన్న ఇళ్లు పరిశీలించి యజమానులు ఉండరనుకునే దుండగులు ఆయా ఇళ్లలో నేరాలకు పాల్పడుతుంటారు. అందుకే వేసవిలో ఊరేళ్లాలంటేనే కొందరు హడలెత్తుతారు. అవగాహన అవసరం.. ఇల్లు విడిచి వెళ్లేటప్పుడు తీసుకోవాలసిన కనీస జాగ్రత్తలు పాటిస్తే చోరీల నుంచి కాపాడుకోవచ్చు. ఇంటికి తాళం వేయడంతో పాటు పక్కనే ఉన్న ఇంటివారికి తాము ఎన్ని రోజులు రాలేరో తెలియజేయాలి. ఎప్పటికప్పుడు ఇంటిని గమనించాలని కోరాలి. అవసరమైతే వారికి తమ ఫోన్ నంబర్ ఇవ్వాలి. అలాగే సమీప పోలీస్‌స్టేషన్‌కు తాము ఊరు వెళ్తున్నట్టు సమాచారం ఇవ్వాలి. తద్వారా పోలీసులు ఆ ఇంటికి ప్రతి రోజు బీట్ కానిస్టేబుళ్లను పంపుతారు. ఇలా అవగాహన కలిగి ఉంటే ప్రయాణాలు ఎక్కడికైనా చేయవచ్చు. భరోసా కరువు.. ఊరెళ్లేవారి పరిస్థితి ఇలా ఉంటే వేసవిలో ఇంట్లో వేడి కారణంగా ఆరుబయట నిద్రించేవారి పరిస్థితి మరో విధంగా ఉంటుంది. దుండగులు దీన్ని అదనుగా తీసుకుని ఇళ్లలోకి ప్రవేశించి దోపిడీ చేసేస్తారు. అలికిడి వచ్చి ఎవరైనా మేలుకుంటే వారిపై దాడికి పాల్పడుతారు. ఇలాంటిప్పుడు రక్షణకు భరోసా కరువు అవుతుంది. ఇక్కడ కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇంట్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటే ఇంటికి తాళం వేసి బయట పడుకోవాలే కాని తలుపులు దగ్గరికి వేసి నిద్రకు ఉపక్రమిస్తే అంతే సంగతులు. అలాగే దుండగులు ప్రవేశిస్తే వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేయాలి. గట్టిగా కేకలు వేయడం ద్వారా కాపాడేందుకు రావాలని ప్రజలను కోరాలి. ఏ సెల్నుంచైనా 100కు ఫోన్ చేసి పరిస్థితి వివరించాలి. త్వరగా పోలీసులు అక్కడికి చేరే అవకాశం ఉంటుంది. ఇంట్లో అలారం ఏర్పాట్లు.. ఇతర గ్రామాలకు వెళ్లేవారు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు లాక్ అలారం అందుబాటులోకి వచ్చింది. ఇంట్లో తాళం వేసిన అనంతరం ఈ అలారం ఏర్పాటు చేస్తే ఎవరైనా లోపలికి ప్రవేశిస్తే అలారం వెలుగుతుంది. దీని ద్వారా సమీపంలోని ప్రజలు గుర్తించి అక్కడికి చేరే అవకాశం ఉంటుంది. అలాగే నైట్ మోడ్ వీడియో సీసీ కేమెరాలు మార్కెట్లో లభిస్తున్నాయి. అవి ఏర్పాటు చేస్తే నేరం జరిగిన తీరు తెలియడమే కాకుండా పోలీసులకు దుండగులను త్వరగా పట్టుకునే వీలుంటుంది. అప్రమత్తంగా ఉండాలి.. చోరీలు కాకుండా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి. వేరే గ్రామాలకు వెళ్తేవారు వారి ఇంటి చిరునామా, ఫోన్‌నంబర్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అందించాలి. ప్రతిరోజు ఆయా ఇళ్లవద్ద గస్తీ ఏర్పాటు చేస్తం. అనుమానితులు, అపరిచితులు తారసపడితే వెంటనే ప్రశ్నించాలి. అనుమానం వస్తే పోలీసులకు సమాచారమివ్వాలి. అప్రమత్తతతో నేరాలు అదుపులోకి వస్తాయి. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలు పరిరక్షించగలుగుతాం. ఈ వేసవిలో చోరీలు కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. –మహమ్మద్ సాజిద్, ఎస్ఐ, మద్నూర్ -
స్టాక్‌మార్కెట్లకు వరుస సెలవులు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లకు లాంగ్ వీకెండ్ ఇది. వరుసగా నాలుగు రోజుల పాటు స్టాక్ మార్కెట్లకు సెలవులొచ్చాయి. గురువారం మహావీర్ జయంతి, శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్, మనీ మార్కెట్లు సెలవును పాటిస్తున్నాయి. ఇక శని, ఆదివారాలు మార్కెట్లకు సెలవు. ఈ నేపథ్యంలో దేశీ ఈక్విటీ, ఫారెక్స్ మార్కెట్లు తిరిగి సోమవారం( ఏప్రిల్, 2) యథావిధిగా పనిచేస్తాయి. -
బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయా..?
చెన్నై: బ్యాంకులకు వరుస సెలవలు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో అధికారులు స్పందించారు. అదంతా అసత్య ప్రచారమని, ఇందులో వాస్తవం లేదని తోసిపుచ్చారు. బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు అనేది తప్పుడు సమాచారమని బ్యాంకు యూనియన్ నాయకుడొకరు చెప్పారు. బ్యాంకులకు మార్చి 31 రోజున పనిదినమని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్పడరేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ థామస్ ప్రాంకో రాజేంద్రదేవ్ తెలిపారు. మహవీర్ జయంతి, గుడ్ ప్రైడేలు గురు, శుక్రవారాల్లో వస్తుండటంతో ఆ రెండు రోజులు బ్యాంకులకు సెలవు ప్రకటించారని తెలిపారు. మార్చి 31వ తారీఖు నెలలో ఐదో శనివారం కావడంతో బ్యాంకులు తెరిచే ఉంటాయని, కేవలం రెండు, నాలుగో శనివారాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవని చెప్పారు. ఏప్రిల్ 2న వార్షిక ముగింపు ఖాతాల కోసం బ్యాంకులను మూసివేస్తారని వివరించారు. -
ఒంటి పూట బడి.. జర జాగ్రత్త..!
నిడమర్రు: వేసవి కాలం వచ్చిందంటే.. పిల్లల్లో చెప్పలేని ఉత్సాహం. ఒంటి పూట బడుల కారణంగా సమయం ముగిసిందంటే మధ్యాహ్నం ఆటపాటల్లో విద్యార్థులంతా సరదాగా గడిపేందుకే ఉత్సాహం చూపిస్తుంటారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు చెరువులు, కాలువలు, వ్యవసాయ బావుల్లో ఈత కొడుతూ ఎండ వేడిమి నుంచి ఉపసమయం పొందుతుంటారు. ఆటలు, ఈత శారీరక వ్యాయామంగా మంచిదే అయినప్పటికీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరదామాటున ప్రమాదాలు పొంచి ఉంటాయని తల్లిదండ్రులు గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉష్ణతాపం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పిల్లలకు అవగాహన కల్పించాలని వైద్యులు చెపుతున్నారు. ఒంటి పూట బడులు వచ్చే నెల 23వ తేదీ వరకూ కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో చిన్నారుల సంరక్షణలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.. మధ్యాహ్నం సూర్యరశ్మికిరణాలతో ప్రమాదం ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూర్య కిరణాలు నిటారుగా భూమిపై పడతాయి. ఆసమయంలో ఎక్కువగా బయట తిరిగితే అతినీలలోహిత కిరణాలు నేరుగా చర్మంపై పడి చర్మాన్ని దెబ్బతీస్తాయి. మరో వైపు అంతర్గతంగా కూడా ఈ కిరణాల ప్రభావం ఉంటుందని వైద్యులు చెపుతున్నారు. ఒంటి పూట బడి అవగానే ఇంటికి వచ్చిన పిల్లలను తప్పనిసరిగా అయితే తప్ప ఎండపూట బయటకు వెళ్లనివ్వకూడదు. చిన్నారుల విషయంలో ఇలా ♦ చిన్నపిల్లలను పాఠశాల నుంచి ఇంటికి తీసుకువచ్చే సమయంలో గొడుగు వాడాలి. ♦ ప్రయాణాల సమయంలో ద్విచక్ర వాహనంపై పిల్లలను మధ్యాహ్నం పూట ముందు భాగంలో కూర్చోపెట్టుకుంటే వడ గాలులు నేరుగా తగిలి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వారిని వెనుక కూర్చోబెట్టుకోవాలి ♦ పిల్లలు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సివస్తే టోపీ పెట్టుకునేలా ప్రోత్సహించాలి. తల, ముఖభాగం పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రం కట్టుకుంటే ఇంకా మంచిది. బోర్ ఫీలవకుండా ఇంట్లో ఖాళీగా ఉంటే పిల్లలు బోర్‌గా ఫీలయ్యే అవకాశం ఉన్నందున వారికి కొత్త ఆటలు గాని విజ్ఞానాన్ని పంచే అంశాలపై దృష్టి సారించేలా చూడాలి. వీలైనంత మేర తల్లిదండ్రులు తమ పిల్లలతో గడిపేందుకు ప్రయత్నించాలి. పాఠశాలల్లో ఇచ్చిన హోమ్‌వర్క్ మధ్యాహ్నం చేసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. దీని ద్వారా సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత అడుకునే వెసులుబాటు కలుగుతుంది. వేసవి తాపం కారణంగా పిల్లలు తొందరగా అలిసిపోయే అవకాశం ఉన్నందున మధ్యాహ్నం కొంత సమయం విశ్రాంతి తీసుకునేలా చూడాలి. స్నేహితుల విషయంలో ఒంటి పూట బడుల కారణంగా బడికి వెళ్లే పిల్లలు మధ్యాహ్నం ఖాళీగా ఉండటం ఇష్టం లేక వీలైనంద వరకు తోటి స్నేహితులతో సరదాగా కాలం గడపాలని చూస్తారు. పిల్లలకు వేసవిలో కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఒంటిపూట బడులు నిర్వహిస్తుందని గమనించాలి. నిర్లక్ష్యం చేస్తే తెలిసీ తెలియని వయస్సులో ఉన్న పిల్లల ఆరోగ్యంతోపాటు వారి ప్రాణాలపై ప్రభావం పడుతుందనే విషయం తల్లిదండ్రులు గమనించాలి. వేసవిలో సేదతీరేందుకు వేసవి తాపాన్ని తట్టుకోవడం కోసం మధ్యాహ్నం పూట పిల్లలు చెరువులు, పంట కాలువలు, వ్యవసాయ బోరు బావుల్లో ఈతకని వెళ్లి ప్రమాదాలు బారిన పడిన విషాధకర సంఘటనలు ఏటా ఎన్నో జరుగుతున్నాయి. ఈత నేర్చుకకోవడం మంచిదే అయినప్పటికీ పెద్దలు, అనుభవజ్ఞుల సమక్షంలో చేసే ఫలితం ఉంటుందని తల్లిదండ్రులు గమనించాలి. పెద్దల సమక్షంలో శిక్షణ సైకిల్ తొక్కడం, ద్విచక్రవాహనాలు నడపడం నేర్చుకోవాలన్న కోరిక పిల్లల్లో సహజంగానే ఉంటుంది. వారి వయస్సు ఆధారంగా సైకిల్గాని, ద్విచక్రవాహనం నడిపేందుకు శిక్షణ తోటి మిత్రుల ఆధ్వర్యంలో కాకుండా పెద్దలు సమక్షంలో జనం సంచారం లేని చోట జరిగేలా చిన్నారులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. సెలవుల్లో కొత్త స్నేహాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. పి ల్లల స్నేహితులు ఎవరో, వారు ఎక్కడికి వెళ్తున్నారో ఎప్పటికప్పుడు గమనించాలి. వారు ఎక్కడికి ఎందుకు వెళుతున్నారో పక్కా సమాచారం తల్లిదండ్రుల వద్ద ఉండేలా బాధ్యత వహించాలి. ఆరోగ్యంపై ఉష్ణోగ్రతల ప్రభావం వేసవిలో సాధ్యమైనంత వరకు పిల్లలను మధ్యాహ్నం పూట ఎండలోకి వెళ్లకుండా తల్లిదుండ్రులు చర్యలు తీసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సివస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ తగలకుండా బయటకు వెళ్లే సమయంలో ఎక్కువ నీరు తాగాలి. శీతల పానియాల బదులు కొబ్బరి బొండాం, పండ్ల రసాలు తీసుకోవాలి. వడ దెబ్బతగిలితే ఓఆర్ఎస్ తాగించాలి. దగ్గరలో ఉన్న పీహెచ్‌సీకి తీసుకు వెళ్లి వైద్యం అందించాలి.– డాక్టర్ కె. శంకరరావు పిల్లల వైద్యనిపుణుడు, జిల్లా అసుపత్రుల సమన్వయ అధికారి -
అంతా మా ఇష్టం!
కాగజ్‌నగర్‌టౌన్: అధికారుల పర్యవేక్షణలోపం..రాజకీయ నాయకుల అండదండలతో జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి సొంత ఎజెండాను అమలు చేస్తున్నాయి. డోనేషన్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. సెలవు దినాల్లోనూ పాఠశాలలు నిర్వహిస్తూ విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. కాగజ్‌నగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నాగోబా జాతర రోజు పాఠశాల కొనసాగించారని డీఈవో మెమో జారీ చేశారు. కాని రాజకీయ అండదండలు, పలుకుబడితో మేనేజ్ చేసినట్లు సమాచారం. విద్యతోపాటు పాఠశాలల్లో క్రీడలు ఉండాలి. కాని చాలా పాఠశాలల్లో మైదానాలే లేవు. అంతే కాకుండా పైఅంతస్తులో పాఠశాల నిర్వహిస్తే అదనంగా అగ్నిమాపక శాఖ అనుమతులు తీసుకోవాలి. కాని కొన్ని పాఠశాలలకు అనుమతులు కూడా లేవని తెలుస్తోంది. జిల్లాలో 104 ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 20వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే ప్రైవేటు పాఠశాలల్లో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులకు కనీసం ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కూడా లేదు. ఇలాంటి సౌకర్యాలు కల్పించని పాఠశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జనవరి 31న ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని ప్రైవేటు ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి ఒక చోట, నిర్వహణ మరోచోట.. అనుమతి తీసుకున్న చోటనే ప్రైవేటు పాఠశాలలు కొనసాగించాలి. కాని కాగజ్‌నగర్ పట్టణంలో ఇటీవల రెండు ప్రైవేటు పాఠశాలలకు అనుమతి ఒకచోట ఉంటే వాటిని మరోచోటకు తరలించారు. ఇలా స్కూల్‌ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తే అనుమతి తప్పనిసరిగా తీసుకోవల్సి ఉంటుంది. ఇందుకు యాజమాన్యాలకు రూ.1.50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీనిని ఎగ్గొంటేందుకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలను తుంగలో తొక్కాయి. ఇలాంటి వాటిపై స్థానిక అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు సమాచారం ఉన్నా, ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఫిర్యాదుదారుల ఒత్తళ్ల మేరకు ఉన్నతాధికారులు యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఉపాధ్యాయులకు తక్కువ జీతాలు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు యాజమాన్యాలు అతితక్కువ జీతాలు చెల్లిస్తున్నాయి. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజు మొత్తంలో 50 శాతం జీతాలు చెల్లించాలని నిబంధనలు ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. నిబంధనల ప్రకారం 12 నెలల జీతాలు చెల్లించాల్సి ఉండగా కేవలం 10 నెలల జీతాలు మాత్రమే చెల్లిస్తున్నారు. అవి కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. విద్యార్థులపై ఒత్తిడి ప్రైవేటు పాఠశాలలు సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలు రోజుకు ఏడు గంటలు కొనసాగాలి. మధ్యాహ్న భోజన విరామం, స్వల్ప విరామాలు కలుపుకొని ఏడు గంటలు ఉండాలి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 7:15 నిమిషాలు కొనసాగాలి. ఎక్కువ గంటలు పాఠశాలల్లో విద్యార్థులను ఉంచకూడదు. కాని 9 నుంచి 10 గంటల వరకు విద్యార్థులను పాఠశాలల్లో ఉంచుకొని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. మండల కమిటీల పర్యవేక్షణ కరువు ప్రైవేటు పాఠశాలల్లో మండల స్థాయి అధికారులతో కూడిన కమిటీ పర్యవేక్షించాల్సి ఉంటుంది. పాఠశాలల్లో వసతులు, సమస్యలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించాలి. ప్రతీ మండలంలో తహసీల్దార్ చైర్మన్, ఎంఈవో కన్వీనర్, ఎంపీడీవోతోపాటు సీఐ, ఎస్సైలు సభ్యులుగా ఉంటారు. కాని ఈ కమిటీలు ప్రైవేటు పాఠశాలల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో ప్రైవేటు పాఠశాలల్లోని సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. నిబంధనలు పాటించడం లేదు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం తరఫున ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. టీచర్లకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించడం లేదు. -ఎండీ.ఆసీఫ్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పట్టించుకుంట లేరు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు చాలా మంది ప్రమాదకరంగా ఆటోల్లో వెళ్తున్నారు. దీనిపై డీఈవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే అధికారులే బాధ్యత వహించాలి. తేజశ్విని, టీపీటీఎఫ్ జిల్లా జనరల్ సెక్రెటరీ -
ఆర్టీసీలో మహిళా కండక్టర్లకు అష్టకష్టాలు
పాతగుంటూరు(గుంటూరు): ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఎంత సురక్షితమో..ఉద్యోగులకు విధుల నిర్వహణ అంతే కష్టం. అందులో మహిళా కండక్టర్ల పరిస్ధితి మరీ దారుణం. పేరుకు కండక్టర్ ఉద్యోగం, చెప్పుకోవడానికి ప్రయాణం చేస్తూ సాఫీగా సాగుతుందనుకుంటారు. కానీ అంత సులువేమీ కాదు. తెల్లారేసరికి ఇంట్లో పనులు చూసుకుని, పిల్లలను స్కూలుకు సిద్ధం చేసి విధులకు గంట ముందుగానే బస్టాండ్‌కు చేరుకోవాలి. గతుకుల దారిలో వేగంగా వెళుతున్న బస్సులో టిక్కెట్లు ఇవ్వాలి. ఓ వైపు ప్రయాణికుల కస్సు బుస్సులు..ఆకతాయిల వెకిలి చేష్టలు..మరో వైపు అధికారుల వేధింపులు..మానసిక ఒత్తిడిలోనూ రైట్..రైట్ అంటూ విజయవంతంగా రాణిస్తున్నారు. విధి నిర్వహణలో చికాకు, కోపాన్ని అణచివేస్తూ..ఎదురయ్యే సమస్యలు, కష్టాలను అధిగమిస్తూ టికెట్లు కొడుతూ ..విజిల్ వేస్తూ కష్టమైన జీవితాన్ని గడుపుతున్న మహిళా కండక్టర్లపై సాక్షి ప్రత్యేక కధనం... కండక్టర్ విధులంటే ఆషామాషీ కాదు. ప్రయాణికులను ఎక్కించుకుని బస్సు కదలగానే టిక్కెట్ ఇవ్వాలి. స్టేజి ఉన్నా, లేకపోయినా ప్రయాణికులు చెయ్యేత్తిన చోట ఆపాలి. కోరిన చోట దించాలి. ప్రయాణికులను లెక్కించుకుని స్టాటికల్ రిపోర్టు(ఎస్ఆర్)రాయాలి. చెప్పడానికి ఇది సులువుగా వున్నా, చేయడానికి ఎంతో కష్టం. పురుషులే ఈ డ్యూటీలు చేయలేక చికాకు పడుతున్న సందర్భాలుంటాయి. కానీ మహిళలు వారితో సమానంగా సత్తా చాటుతున్నారు. 1997 కంటే ముందు పురుషులు మాత్రమే కండక్టర్లుగా విధులు నిర్వహించారు. మహిళా కండక్టర్లు ప్రారంభంలో రోజుకు రూ.65 చొప్పున పని చేసిన రోజులకు జీతం ఇచ్చేవారు. జిల్లాలోని 13 డిపోల్లో 584 మంది మహిళా కండక్టర్లు ఉన్నారు. గుంటూరు 1డిపోలో 78 మంది,2 డిపోలో 54, రేపల్లె 36, తెనాలి 67,మంగళగిరి 28, పొన్నూరు 39, బాపట్ల 30, నర్సరావేపేట 45, మాచర్ల 46, చిలుకలూరిపేట 39, సత్తెనపల్లి 28 మంది మహిళా కండక్టర్లు పని చేస్తున్నారు. విధుల్లో ఇబ్బందులు... విధుల్లో మహిళా కండక్టర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు చెప్పిన డ్యూటీలు చేయకపోతే వేధింపులకు గురికావాల్సిందేననే విమర్శలు వినిపిస్తున్నాయి. డిపోలలో మౌలిక వసతులు సక్రమంగా లేకపోయినా తప్పని పరిస్ధితుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఏదైనా అడిగినా, ఓ చిన్న తప్పు దొరికినా మూడు నెలల పాటు ఇంక్రిమెంట్లు తగ్గిస్తున్నట్లు సమాచారం. డ్యూటీ సమయానికి నిమిషం ఆలస్యమైనా గైర్హాజరు వేస్తారు. అంతేకాక డిపో స్పేరులో పెట్టడం, సస్పెండ్ చేయడం చేస్తుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో బస్సుల సంఖ్య తగ్గడంతో బస్సులలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఉదయం 4 గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల (8 గంటల ప్రకారం) వరకు డ్యూటీ చేయిస్తున్నట్లు తెలిసింది. డిమాండ్లు... .మహిళా కండక్టర్లకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు పూర్తయ్యే డ్యూటీలు వేయాలి..ప్రతి డిపోలోనూ విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలి.డ్యూటీ టర్మినల్ పాయింట్లలో తాగునీరు, మూత్రశాల వసతులు కల్పించాలి..ప్రత్యేకంగా నెలకు మూడు రోజుల సెలవులు ఇవ్వాలి.అధికారుల ఒత్తిళ్లు, వేధింపులు అరికట్టాలి.అత్యవసర సమయాల్లో సెలవులు ఇవ్వాలి.22 ఏళ్లుగా పనిచేస్తున్న మహిళా కండక్టర్లకు పదోన్నతులు కల్పించాలి. సెలవులు లేవు అవసరానికి తగినట్లుగా సెలవులు ఉండటంలేదు. అందరితో పాటే విధులకు హాజరుకాలి. ఉదయం 6 గంటల నుంచి మహిళలకు పని వేళలు మార్చేలా చర్యలు తీసుకోవాలి. ఉదయం 4 గంటలకు మహిళలు డ్యూటీకి రావాలంటే ఇబ్బందిగా ఉంది. లక్ష్మీ,పొన్నూరు డిపో మహిళల సమస్యలను పరిష్కరించండి జిల్లాలోని 13 డిపోలలో మహిళా కండక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. మూడురోజులు సెలవుపై డిపో మేనేజర్లను ఆదేశించారు. సెలవు ఇవ్వకపోతే తనకు ఫోన్లో చెప్పాలి. గుంటూరు ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి ప్రమోషన్లు లేవు 21 సంవత్సరాలుగా కండక్టరుగా విధులు నిర్వహిస్తున్నా. సర్వీసు ప్రకారం ప్రమోషన్లు లేవు. డ్యూటీ సమయంలో పలు ఇబ్బందులు తప్పడంలేదు. రద్దీ పెరిగినపుడు చిల్లర సమస్య తలెత్తుతోంది. కాశమ్మ, కండక్టర్, తెనాలి డిపో -
గోదారి పల్లెల్లో సం‘క్రాంతి’
అమలాపురం:గోదారి పల్లెలు సం‘క్రాంతి’తో ముస్తాబయ్యాయి. ఆరుగాలం కష్టపడి పంట పండించే.. జనం పొట్టలు నింపే అన్నదాతల పెద్ద పండుగ సంక్రాంతి సందడి జిల్లా నలు మూలలా కనిపిస్తోంది. కోనసీమ నుంచి మన్యం వరకు.. రాజమహేంద్రవరం నుంచి తుని వరకు అటు పట్టణాలు.. ఇటు పల్లెల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పొట్టచేతపట్టుకుని కూలీ పనులకు పోయిన వలస కూలీల దగ్గర నుంచి.. ఊళ్లకు దూరంగా ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు.. ఉన్నత కొలువుల కోసం విదేశాలు వెళ్లిన ఎన్ఆర్ఐలు పండుగకు రెక్కలు కట్టుకుని వాలిపోయారు. రంగులు వేసిన పెద్దిళ్లు, పేడతో అలికి పూరిళ్లు.. వాటిపై మేలుకొల్పు ముగ్గులు.. ఇల్లు ఏదైతేనేం... పండగకు రంగు పడింది. వాకిట్లో ముత్యాల ముగ్గులు కొలువుదీరాయి. ఇళ్లను ముస్తాబు చేసి ముత్తయిదువులు గుమ్మాలకు మామిడాకులు కట్టి గడపలకు పసుపు రాసి బొట్టులు పెట్టారు. పరుగో... పరుగు... ఉమ్మడి రాజధాని హైదరాబాద్...కొత్త రాజధాని ప్రాంతం విజయవాడ, గుంటూరుల నుంచి ఐటీ ఉద్యోగులకు కొలువైన బెంగళూరు, చెన్నైల నుంచి స్థానికులు తరలివచ్చారు. అమెరికా వంటి దేశాల్లో కూడా ఉన్నవారు సైతం పండుగ సమయంలో సెలవులు చూసుకుని వచ్చారు. హైదరాబాద్ నుంచి సాధారణ రోజుల్లో రూ.700 వరకు ఉండే బస్సు టిక్కెట్ ధర రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు పలికినా లెక్క చేయలేదు. పండుగ సొంత ఇంటిలో చేసుకోవాలని కుటుంబ సమేతంగా వచ్చారు. సొంతంగా కార్లు ఉన్నవారు వ్యయప్రయాసలైనా కుటుంబంతో సహా వచ్చివాలిపోయారు. చాలా మంది శనివారమే రాగా, ఆదివారం భోగి రోజు ఉదయం వచ్చేవారు కూడా ఉన్నారు. కొడుకులు.. కోడళ్లు, మనుమలు.. మనుమరాండ్లు, ముని మనుమలు, బాబాయ్.. పిన్నెలు, అత్తలు.. మామలు, అక్కలు.. బావలు రావడంతో స్థానికుల్లో పండుగ హుషారు వచ్చింది. ఇక కొత్త అల్లుళ్ల సందడి సరాసరే. అమ్మలతో కలిసి అత్తారింటి వద్ద వాలిపోయారు. కొత్త అల్లుళ్లకు ఇచ్చే బహుమతుల కోసం మామలు హైరానా పడుతున్నారు. భోగి మంటల కోసం పిల్లలు, యువకులు భోగి పిడకలు, కమ్మలు, డొక్కలు, చెట్ల మోడులు తెచ్చి భోగిమంటల్లో వేసి సందడి చేశారు. చిన్నారులు భోగి దండలు గుచ్చే పనిలో పడ్డారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల హడావిడి అంతాఇంతా కాదు. ప్రభల తీర్థాలకు తరలించే ప్రభల తయారీకి నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఆతిథ్యంలో గోదావరి జిల్లాకు పెట్టింది పేరు. ఇక్కడ తయారు చేసే పిండివంటలు సున్నుండలు, పోకుండలు, జంతికులు, ఇలంబీకాయలు, కొబ్బరినూజు, వెన్నప్పాలు, గోరుమీఠీలు, పొంగడాలను ఇప్పటికే తయారు చేశారు. నాటుకోడి ఇగురు, రొయ్యలు, చేపలతో తయారు చేసే కూరలకు లెక్కేలేదు. మాంసాహారుల జిహ్వను సంతృప్తి పరిచేవిధంగా ‘కోస’లు ఈ మూడు రోజులూ ఘుమఘుమలాడనున్నాయి. ధాన్యం అమ్మకం సొమ్ములు సకాలంలో రాకున్నా.. బ్యాంకుల్లోను, ఏటీఎంలలో సొమ్ములు లేకున్నా.. ఏడాదికొక మారు జరిగే సంక్రాంతి కోసం అప్పోసొప్పో చేసి రైతులు పెద్ద పండుగ చేసుకుంటున్నారు. -
ప్రైవేట్ ఉద్యోగులూ ...మీ సెలవులు ఇలా
కడప : ఎవరికైనా ఉద్యోగంతో పాటు వ్యక్తిగత జీవితం ముఖ్యమే. వ్యక్తిగత కుటుంబ అవసరాలకు కూడా ఉద్యోగి తగినంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అందుకోసమే ఉద్యోగులకు సెలవుల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఫాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 ప్రకారం ప్రైవేట్ సంస్థల్లో కొన్ని రకాల సెలవులను అమలు చేయాల్సి ఉంటుంది. కనీసం ఏడాదిలో ఏడు రోజులను జాతీయ దినాలు, పర్వదినాలు కింద సెలవులు ఇవ్వాలని చట్టం చెబుతోంది. వాటిలో గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతికి తప్పని సరిగా సెలవులు ఇవ్వాలి. జాతీయ దినాలు జనవరి26, ఆగష్ట్ 15, అక్టోబర్ 2 వారాంతపు సెలవులు: వారంలో ఏడు రోజులకు గాను ఒకటి లేదా రెండు రోజులు సెలవుగా ఇస్తుంటారు. కంపెనీ పాలసీని బట్టి ఒకటా, రెండా అన్నది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ శాతం ఒక్క రోజే సెలవుగా ఉంటుంది. పండుగ దినాలు: వివిధ మతాలకు సంబంధించి ముఖ్యమైన పండగ రోజులోనూ సెలవులు ఉంటాయి. ఎర్న్డ్ లీవ్స్–ప్రివిలేజ్ లీవ్స్: ప్రతి ఉద్యోగికి ఏడాదిలో ఇన్ని రోజులు అంటూ ఈఎల్స్ అంటూ ఉంటాయి. గడిచిన ఏడాదిలో ఎన్ని పని దినాలు ఉద్యోగి పని చేశాడన్న దానిపై ఆధారపడి ఈ సెలవులు ఉంటాయి. ఈఎల్స్‌ను వాడుకోనట్టయితే దాని కింద అదనపు వేతనాన్ని పొందవచ్చు. ఈ సెలవులు వాడుకుంటే ఆ రోజుల్లో వేతనాన్ని ( మూలవేతనం ప్రకారం ) యథావిధిగా పొందవచ్చు. అయితే సెలవు తీసుకోవాలా, లేక పని చేసి వేతనాన్ని పొందాలా అన్నది కంపెనీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. క్యాజువల్ లీవ్: ఏడాదిలో 12 రోజులు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. నెలలో ఇన్ని రోజుల పాటు క్యాజువల్ లీవ్ అని ఇస్తుంటారు. గరిష్టంగా మూడు రోజుల వరకు ఉంటుంది. కొన్ని సంస్థల్లో నెలకు ఒక్కటే క్యాజువల్ లీవ్ ఆప్లయి అవుతుంది. సిక్‌లీవ్ , మెడికల్ లీవ్: కార్యాలయానికి రాలేని అనారోగ్యానికి గురైన పరిస్థితుల్లో వాడుకునేందుకు నెలకు ఒక్క రోజైనా సిక్ లీవ్ ఉంటుంది. ఒక్క నెలలో వాడుకోకపోతే అవసరం వచ్చినప్పుడు ఒకటికి మించి వాడుకోవచ్చు, ఈ లీవ్ కింద ఎన్ని రోజులు సెలవులు ఇవ్వాలన్న విషయాన్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు నిర్దేశిస్తున్నాయి. కాంపెన్సేటరీ ఆఫ్ (సీఆఫ్): సెలవు రోజుల్లో కూడా వచ్చి పని చేసినట్టయితే అందుకుగాను వేతనం చెల్లిస్తారు. లేదా ఒక రోజు సెలవు ఇస్తారు. ఈ సెలవునే ఆఫ్ లీవ్ అంటారు. మెటర్నిటీ లీవ్: మహిళా ఉద్యోగుల సంతాన అవసరం కోసం (గర్బధారణ నుంచి డెలివరీ వరకు లేదా మరికొంత కాలం మెటర్నిటీ లీవ్ ఇస్తారు. కాకపోతే తక్కువ రోజుల పాటు ఉంటుంది. 1988 ఏపీ యాక్ట్ ప్రకారం కనీస డెలివరీకి ముందు ఆరువారాలు డెలివరీ తర్వాత ఆరువారాలు మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి. పేటర్నిటీ లీవ్: పైన చెప్పుకున్న తరహాలో ఉద్యోగి భార్య డెలివరీ అయిన సందర్భంలో వారి అవసరాలు చూసుకునేందుకు వీలుగా కొన్ని రోజుల పాటు ఉద్యోగులకు ఈ సెలవులు ఇస్తుంటారు. క్యారంటైన్ లీవ్: ఇన్ఫెక్షన్ సంబంధిత వ్యాధికి లోనైన ఉద్యోగి వల్ల ఆ వ్యాధి కంపెనీలో ఇతర ఉద్యోగులకు కూడా వచ్చే ప్రమాదం ఉన్న పరిస్థితుల్లో సదరు ఉద్యోగికి ఈ సెలవు ఇస్తారు. స్టడీ లీవ్: ఉద్యోగి ఉన్నత చదువులు , వృత్తిపరమైన నాలెడ్జ్ పెంచుకునేందుకు గాను ఈ సెలవు ఇస్తారు. ఈ సెలవులో వేతనం ఉండదు. అంటే ఉద్యోగం విడిచి పెట్టకుండా కొంతకాలం పాటు సెలవు తీసుకొని చదవుకోవచ్చు. ఇవే కాకుండా వివిధ రంగాలు కంపెనీలను బట్టి చైల్డ్‌కేర్ లీవ్, హాస్పిటల్ లీవ్, స్పెషల్ డిజెబిలిటీ లీవ్, లాస్‌ఆఫ్ పే (వేతనం లేకుండా తీసుకునే సెలవు) ఇలా భిన్న రకాలు సెలవులు కూడా ఉన్నాయి. -
12 నుంచి 16 దాకా సంక్రాంతి సెలవులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 12 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులుంటాయని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. జనవరి 17న తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ మేరకు జిల్లాల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. -
కేంద్ర ఉద్యోగులకు ‘ఆన్లైన్’ సేవలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై సెలవులు, అధికారిక పర్యటనల కోసం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునేలా కొత్త వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్‌గా పిలిచే ఈ వ్యవస్థను కేంద్ర సిబ్బంది, శిక్షణశాఖ మంత్రి జితేంద్ర సింగ్ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా సోమవారం నాడిక్కడ ఆవిష్కరించారు. ఈ వ్యవస్థలో భాగంగా 5 మాడ్యుల్స్లో 25 అప్లికేషన్లను ప్రారంభించారు. ‘ఈ–హెచ్ఆర్ఎంఎస్తో సర్వీస్ బుక్, జీపీఎఫ్, జీతం వివరాలను చూడటంతో పాటు సెలవులు, పలురకాల క్లెయిమ్‌లు, రీయింబర్స్మెంట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. లోన్లు, అడ్వాన్సులు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఎల్టీసీ అడ్వాన్సులు వంటి అన్ని సేవలను ఒకేచోట పొందవచ్చు’ అని మంత్రిత్వశాఖ తెలిపింది. ఆన్లైన్లో ఉద్యోగుల పూర్తి సమాచారం అందుబాటులో ఉండటం వల్ల సంబంధిత విభాగాలు రిక్రూట్మెంట్, ట్రాన్స్ఫర్, పోస్టింగుల విషయంలో సులభంగా నిర్ణయాలు తీసుకోవచ్చని వెల్లడించింది. -
పుణ్యక్షేత్రాల్లో పెరిగిన భక్తుల రద్దీ
యాదాద్రి/వేములవాడ: వరుస సెలవులు రావడంతో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదాద్రి, వేములవాడల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలపైగా సమయం పడుతున్నది. కొండపైన తగినంత పార్కింగ్ స్థలం లేకపోవడంతో భక్తుల వాహనాలను తులసి కాటేజ్ వద్ద నిలిపివేశారు. వేములవాడలో... వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. దీంతో సర్వ దర్శనానికి 5 గంటల సమయం పడుతున్నది. భక్తుల రద్దీతో ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఆలయంలో శీఘ్ర దర్శనాన్ని అధికారులు అమలు చేశారు. -
సిగరెట్ మానేస్తే.. 6 అదనపు సెలవులు..
ప్రతి కంపెనీలో సిగరెట్ తాగే వారు ఉంటారు.. తాగని వారూ ఉంటారు. కానీ మీరు పనిచేసే కంపెనీ ఎప్పుడైనా మీ సిగరెట్ అలవాటును మాన్పించేందుకు ప్రయత్నించిందా?? దాదాపుగా వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉండే ప్రతి కంపెనీ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోకపోవచ్చు. కానీ జపాన్‌లోని టోక్యోకు చెందిన ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యమని భావించింది. అందుకే ఎవరైతే పొగ తాగడం మానేస్తారో వారికి ఏడాదిలో ఆరు పని దినాలను అదనంగా సెలవులుగా మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కంపెనీ పేరు పియాలా.ఐఎన్‌సీ... కంపెనీ కేంద్ర కార్యాలయం బిల్డింగ్‌లోని 29వ ఫ్లోర్లో ఉంటుంది. అంత పైనుంచి ఉద్యోగులు బిల్డింగ్ బేస్మెంట్లోకి వచ్చి సిగరెట్ తాగి వెళ్లడం వలన సుమారు 15 నిమిషాల సమయం వ్యర్థమైపోతోంది. దీనివల్ల పనిలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని సిగరెట్ తాగని ఒక ఉద్యోగి పేపర్‌పై రాసి సలహాల పెట్టెలో వేశాడు. దీన్ని చదివిన కంపెనీ సీఈవో పొగతాగని వారి కోసం ఆరు అదనపు సెలవులను ఇస్తే బాగుంటుందని భావించాడు. అంతేకాకుండా ప్రాణాన్ని హరించే ఆ మహమ్మారి నుంచి ఉద్యోగులను కాపాడవచ్చని నిర్ణయించాడు. దీంతో వెంటనే ఈ ఆరు సెలవు దినాల కాన్సెప్ట్‌ను ప్రారంభించాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. 120 మంది ఉద్యోగుల్లో సుమారు 30 మంది ఆ కాన్సెప్ట్‌ను అందిపుచ్చుకుని ఇప్పటికే లబ్ధి పొందారు కూడా. కనీసం నలుగురినైనా సిగరెట్ అలవాటు నుంచి దూరం చేయాలని కంపెనీ ఉద్దేశాన్ని ప్రస్తుతం అక్కడి వారు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. -
కొత్త సంవత్సరం సెలవులు ఇవే
హైదరాబాద్: నూతన సంవత్సరం(2018)లో ప్రభుత్వ సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలకు 24 సాధారణ సెలవులు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే 17 రోజులు ఐచ్ఛిక (ఆప్షనల్) సెలవులు ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేతనంతో కూడిన సెలవు(నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్) రోజులు 21గా ఖరారు చేసింది. ఇవిగాక తాము ప్రకటించిన ఐచ్ఛిక సెలవు రోజులలో ఐదింటిని ఉద్యోగులు వాడుకునేందుకు అనుమతించింది. దానికి అధీకృత ఉన్నతాధికారి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరని సూచించింది. పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రజాపనుల శాఖలు, విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తించబోవని, వాటికి సంబంధిత శాఖలు ప్రత్యేకంగా సెలవుల జాబితాను విడుదల చేస్తాయని తెలిపింది. ఈదుల్ ఫితర్, ఈదుల్ జుహా, మొహర్రం, ఈద్-ఇ-మిలాద్లలో మార్పులు జరిగితే అందుకనుగుణంగా సెలవు తేదీలు మారుతాయని పేర్కొంది. -
మీ ఇళ్లల్లో పెళ్లి జరిగితే సెలవులిచ్చేస్తారా?
సాక్షి, అమరావతి : ‘‘మా దళితుల ఇళ్లల్లో వివాహానికి ఎవరినీ రానివ్వరు. అదే మీ వాళ్ల ఇళ్లల్లో పెళ్లి జరుగుతుంటే మాత్రం ఏకంగా శాసనసభ, శాసనమండలి సమావేశాలనే నిలిపేస్తారా? ఏకంగా సెలవులు ఇచ్చేస్తారా?’’ అని మంత్రి యనమల రామకృష్ణుడిపై శాసన మండలి సభ్యురాలు శమంతకమణి విరుచుకుపడ్డారు. బుధవారం శాసనసభ, శాసనమండలి సమావేశాలు ముగిసిన తరువాత లాబీల్లో యనమల, శమంతకమణి పరస్పరం ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా యనమలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ‘‘ఏమయ్యా.. మా దళితులకు ఎలాగూ పదవులు ఇవ్వరు. గౌరవం ఎటూ లేదు. కనీసం మా ఇంట్లో వివాహం జరుగుతుంటే ఎవరినీ రానివ్వకుండా చేశారు. అదేపనిగా అందరినీ పోలవరం ప్రాజెక్టు వద్దకు అంటూ తీసుకెళ్లారు. మా మనవరాలి (శింగనమల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినిబాల కుమార్తె) పెళ్లి ఈ నెల 16న అనంతపురంలో జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ ఆహ్వానించినా వారిని రానివ్వకుండా పోలవరానికి తీసుకుపోయారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సోదరుడు శ్రీనివాస్ కుమార్తె పెళ్లి 23వ తేదీన అనంతపురంలో జరుగుతుందని ఏకంగా రెండు సభలకు వరుసగా మూడు రోజులు సెలవులు ఇచ్చేస్తారా? ఏం.. మా ఇళ్లల్లో శుభకార్యాలకు ఎవరూ రాకూడదా? ఇదేం న్యాయమయ్యా మీకు?’’ అని నిలదీశారు. దీనికి సమాధానం చెప్పలేక యనమల మౌనంగా ఉండిపోయారు. పయ్యావుల కేశవ్ సోదరుడి కుమార్తె వివాహం కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ కుమారుడితో గురువారం అనంతపురంలో జరగనుంది. -
దీపావళి వేళ.. వరుస సెలవుల ఎఫెక్ట్
సాక్షి, అమరావతి : దీపావళి పండుగ నేపథ్యంలో ఉద్యోగుల వరుస సెలవులతో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోనున్నాయి. పండుగను పురస్కరించుకుని అధికారులు, ఉద్యోగులు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. ఈ నెల 19(గురువారం)న దీపావళి సందర్భంగా సెలవు. దీంతో పలువురు ఉద్యోగులు బుధవారం ఆప్షనల్ సెలవును వినియోగించుకుంటున్నారు. ఇక శుక్రవారం సాధారణ (క్యాజువల్) సెలవు పెట్టుకుంటున్నారు. ఇక శని, ఆదివారాలూ ఎలాగూ సెలవే. ఫలితంగా మొత్తం ఐదురోజుల సెలవు కలిసొచ్చినట్టయింది. సాధారణంగా ఒక ఉద్యోగి సంవత్సరంలో ఐదు ఆప్షనల్ సెలవుల్ని తీసుకోవచ్చు. జనవరి 1 నుంచి డిసెంబర్ 31లోగా వీటిని ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఈ సెలవునే బుధవారం వాడుకుంటున్నారు. హైదరాబాద్ బస్సులు కిటకిట.. ఇదిలా ఉండగా మెజారిటీ ఉద్యోగుల కుటుంబాలు ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వారి పిల్లలు హైదరాబాద్‌లోనే చదువుకుంటున్నారు. ఇలా వరుస సెలవులు కలసిరావడంతో ఉద్యోగులు భారీగా హైదరాబాద్‌కు తరలివెళుతున్నారు. దీంతో మంగళవారం రాత్రి నుంచే హైదరాబాద్‌కు వెళ్లేవారితో విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతోంది. ఇక ప్రైవేటు ట్రావెల్స్‌లోనూ రద్దీ ఎక్కువగా ఉంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు చెందినవారు హైదరాబాద్‌కున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. బుధవారమూ విజయవాడ బస్టాండ్‌లో రద్దీ కొనసాగేలా కనిపిస్తోంది. ఉద్యోగుల సంగతి అటుంచితే సాధారణ ప్రయాణికులూ దీపావళి వేళ ఊళ్లకు పయనమయ్యారు. నాలుగు రోజులపాటు సొంతవూర్లో బంధువులతో గడిపి పండుగను జరుపుకునేందుకు మంగళవారం రాత్రి నుంచే బయల్దేరుతున్నారు. -
కిటకిటలాడుతున్న టోల్గేట్లు..
సాక్షి, నల్గొండ: పండుగ సంబరం ముగిసింది. వరుస సెలవులతో పల్లెలకు పరుగులు పెట్టిన ప్రజలు తిరిగి భాగ్యనగరంవైపు అడుగులు వేస్తున్నారు. దసరా సెలవులు కావడంతో సుమారు 15లక్షల మందిపైగా హైదరాబాద్ విడిచి స్వస్థలాలకు వెళ్లారు. సెలవుల అనంతరం నగరానికి తిరిగి పయనమయ్యారు. వర్షాలు కురుస్తున్నా హైదరాబాద్‌కు క్యూ కట్టారు. దీంతో నగరానికి వచ్చే దారులన్నీ రద్దీతో నిండిపోయాయి. టోల్గేల్లు అన్నీ వాహనాలతో నిండిపోయాయి. నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. దసరా విడిది కోసం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన వారు నగరానికి తిరుగు ప్రయాణం అవ్వడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. కార్లు, బస్సులు కిలోమీటర్ల పొడవునా నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నందిగామ వద్దకూడా వాహనాలు బారులు తీరాయి. -
రేపటి నుంచి దసరా సెలవులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు పాఠశాల విద్యా శాఖ, ఇంటర్ బోర్డులు దసరా సెలవులు ప్రకటించాయి. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 4 వరకు సెలవులని పాఠశాల విద్యాశాఖ పేర్కొనగా, జూనియర్ కాలేజీలకు 20 నుంచి 2 వరకు సెలవులని ఇంటర్మీడియెట్ బోర్డు తెలిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని స్కూళ్లు, కాలేజీలకు ఈ సెలవులు వర్తిస్తాయని ఆయా శాఖల అధికారులు వెల్లడించారు. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 3న, పాఠశాలలకు 5న తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. సెలవుల్లో తరగతులు నిర్వహించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు సెలవుల రద్దు
- భారీ వర్షం హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ నిర్ణయం ఒంగోలు: రుతుపవనాల ప్రభావం కారణంగా జిల్లాలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ వి.వినయ్‌చంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణశాఖ హెచ్చరికల దృష్ట్యా అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కోస్తా తీర ప్రాంత అధికారులతో పాటు అన్ని మండల స్థాయి అధికారులు మండల కేంద్రాల్లో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాజ్‌వేలు, లో లెవల్ బ్రిడ్జిల వద్ద పరిస్థితులను గమనించి ప్రయాణాలు కొనసాగించాలని సూచించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు, సాయం పొందేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ 1077 లేదా ల్యాండ్ లైన్ నంబర్ 08592 – 281400కు ఫోన్ చేయాలని కలెక్టర్ సూచించారు. -
వరుస సెలవులు: టోల్‌ప్లాజాల వద్ద రద్దీ
-
వరుస సెలవులు: టోల్‌ప్లాజాల వద్ద రద్దీ
హైదరాబాద్: వరుస సెలవులతో హైదరాబాద్ జనం ఊళ్ల బాట పట్టారు. హైదరాబాద్ నుంచి జనం సొంతూర్లకు బయలుదేరడంతో జాతీయ రహదారులు రద్దీగా మారాయి. నల్గొండ జిల్లాలోని పంథంగి, కేతేపల్లి టోల్‌ప్లాజాల వద్ద శనివారం ఉదయం భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు టోల్‌ప్లాజా దాటడానికి అరగంటకు పైగా సమయం పడుతోంది. -
ఆగస్టులో సెలవులే సెలవులు..
హైదరాబాద్ : ఆగస్టు నెలలో ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. ఆగస్టు 12న రెండో శనివారం, 13 ఆదివారం, 14 కృష్ణాష్టమి, 15న స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు వరుసగా నాలుగు రోజులు పని చేయవు. అయితే ఆగస్టు 14న కృష్ణాష్టమికి బ్యాంకులకు సెలవు లేదు. అదే విధంగా ఆగస్టు 25న వినాయకచవితి, 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో బ్యాంకులు వరుసగా మూడురోజులు పనిచేయవు. శ్రావణమాసం శుభ కార్యాలకు తోడు వరుస సెలవులు తోడవ్వడంతో బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సందడిలో సడేమియాలా ప్రయివేట్ ట్రావెల్స్ అమాంతం టికెట్ ధరలు పెంచేశాయి. -
12న స్కూళ్లు పునఃప్రారంభం
కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన స్కూళ్లు .. ఈ నెల 12వ తేదీన పునఃప్రారంభం కానున్నట్లు డీఈఓ తాహెరా సుల్తానా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి సెలవులు ముగియడంతో పునఃప్రారంభం అవుతున్నందున ప్రతి టీచర్ మొదటి రోజు హాజరుకావాలని పేర్కొన్నారు. ఉర్దూ మీడియం స్కూల్స్ మాత్రం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నెల12 నుంచి 26వ తేదీ వరకు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నడుస్తాయని తెలిపారు. -
శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం : ప్రముఖ శ్రీరాఘవేంద్రస్వామి మఠం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. శని, ఆదివారాలు సెలవులు కలిసిరావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. రాఘవేంద్రుల బృందావన దర్శన, పరిమళ ప్రసాదం, అన్నపూర్ణభోజనశాల, పంచామృతం క్యూలు భక్తులతో కిక్కిరిశాయి. భక్తులు నదీతీరంలో స్నానాలు ఆచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. రాఘవేంద్రుల మూలబృందావన దర్శించుకుని పీఠాధిపతి సభుదేంద్రతీర్థుల మూలరాముల పూజలో తరించారు. యాగశాలలో కలశ పునఃప్రతిష్ఠాపన సందర్భంగా మృత్యుంజయ, శాంతి హోమాలు కొనసాగాయి. మఠం మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
సీఎం యోగి బాటలో ఢిల్లీ సర్కార్
ఢిల్లీ: రాజకీయాల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రత్యర్థులు. ఒక పార్టీ అంటే మరో పార్టీకి పడదు. కాగా బీజేపీ ఫైర్ బ్రాండ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాటలో ఢిల్లీ సర్కార్ నడవనుంది. ప్రముఖుల జయంతి, వర్ధంతి సందర్భంగా ప్రస్తుతం ఉన్న సెలవులను రద్దు చేయనున్నట్టు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు. ఆయా రోజుల్లో సెలవులు ఉండవని, పనిదినాలుగా పరిగణిస్తామని తెలిపారు. యూపీలో ప్రముఖుల జయంతులు, వర్ధంతుల సందర్భంగా ఇస్తున్న సెలవుల్లో 15 రద్దు చేస్తున్నట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖుల జయంతులప్పుడు స్కూళ్లకు సెలవులు ఇవ్వొద్దని, ఆ రోజు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి వాళ్ల గొప్పదనం గురించి రెండు గంటల పాటు పిల్లలకు చెప్పాలని చెప్పారు. -
రిటైల్ షాపులకు వారాంతపు సెలవుల్లేవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రిటైల్ షాపులకు వారంలో ఒక రోజు సెలవు ప్రకటించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. గతంలో వారానికి ఒక రోజు సెలవు ప్రకటించాలని నిర్ణయం తీసుకోగా, తాజాగా ప్రస్తుతం అమలులో ఉన్న వారం రోజులు పని చేసే నిబంధననే మరో రెండేళ్లు పొడిగిస్తూ ఆదేశాలి చ్చింది. ఈమేరకు బుధవారం కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కార్మికుల నిబంధనల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని తెలిపింది. రోజుకు ఎనిమిది గంటల చొప్పున, 48 గంటలు పని పూర్తి చేసిన వారికి తప్పనిసరిగా వారాంతపు సెలవు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. -
బడికి బైబై
- నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు - జూన్ 12న పునఃప్రారంభం - సెలవు రోజుల్లో స్కూళ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు - నేటికీ పూర్తికాని ముల్యాంకన ప్రక్రియ - విద్యార్థులకు అందని ప్రోగ్రెస్ రిపోర్ట్లు కర్నూలు సిటీ: అన్ని యాజమాన్యాల పరిధిలోని స్కూళ్లకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. ఏటా ఏప్రిల్ 23వరకు స్కూళ్లు పని చేసి 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు సెలవులు ఇచ్చేవారు. అయితే ఈ ఏడాది 23వ తేదీ ఆదివారం కావడంతో శనివారమే స్కూళ్లకు చివరి పనిదినమైంది. ప్రయివేటు స్కూల్స్ యాజమాన్యాలు సెలవురోజుల్లో తరగతులు నిర్వహిస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు. తిరిగి జూన్ 12వ తేదీ స్కూళ్లను పునఃప్రారంభించనున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ముందుగానే సమ్మేటివ్-3 పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత పై తరగతికి సన్నద్దులను చేసేందుకు సవరణాత్మక బోధన చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే విద్యార్థులకుగానీ, టీచర్లకుగానీ ఎలాంటి పుస్తకాలు ఇవ్వకపోవడంతో పాత పాఠ్య పుస్తకాల్లోని అంశాలనే బోధించారు. అలాగే స్కూళ్లకు సెలవులు ప్రకటించే నాటికే ముల్యాంకనాన్ని పూర్తి చేసి, చివరి పనిదినాన విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ముల్యాంకనమే పూర్తికాకపోవడం గమనార్హం. దీనికి తోడు ఈ ఏడాది నుంచి విద్యార్థుల మార్కులను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ముల్యాంకనం పూర్తికాకుండా స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో ఆన్లైన్ నమోదు ఎలా చేయాలో అర్థంకాక హెచ్ఎంలు తలలు పట్టుకుంటున్నారు. -
బడికి సెలవు.. బతుకులో కూడా ..
వేసవి సెలవులకు ఇంటికి వస్తూ మృత్యుఒడికి రోడ్డు ప్రమాదంలో గిరిజన విద్యార్థి దుర్మరణం బడికి సెలవులిచ్చేశారు.. ఇంటికెళ్లి అమ్మ చేతి వంట కడుపారా తిని, చెల్లితో సరదాగా ఆడుకోవాలి అనుకుంటూ ఆ బాలుడు ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు నాన్న వస్తాడా.. ఇంటికెళ్లిపోదామా అనుకుంటూ మనసునిండా ఆనందంతో ఉబ్బితబి్బబ్బవుతున్నాడు. నాన్న రానే వచ్చాడు..ఇంటికి బయలుదేరాడు.. ఇంతలో ప్రమాదం ఆ బాలుడిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లిపోయింది. ఈ విషాదకర ఘటన రాజవొమ్మంగి మండలం మర్రిపాలెం వద్ద శనివారం సంభవించింది. ఈ హృదయ విదారక ఘటన చూసిన వారిని కలచివేసింది. – రాజవొమ్మంగి (రంపచోడవరం) రాజవొమ్మంగి మండలం చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన గూడెం గణేశ్‌కుమార్ (13) అడ్డతీగల గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. శనివారం నుంచి వేసవి సెలవులు ఇవ్వడంతో కుమారుడిని తీసుకువచ్చేందుకు తండ్రి రాజబాబు పాఠశాలకు వెళ్లాడు. అదే సమయంలో తమ గ్రామానికి చెందిన మరో వ్యక్తి అతడి కుమారుడిని తీసుకెళ్లేందుకు అదే పాఠశాలకు వచ్చాడు. ‘ మా కుమారుడిని కూడా మీతో పాటు తీసుకెళ్లండి, నేను వెనకాల ఆటోలో వస్తానని రాజబాబు చెప్పాడు. ఆ వ్యక్తి అతడి కుమారుడితో పాటు గణేష్‌కుమార్‌ను కూడా మోటారు సైకిల్ ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాడు. మర్రిపాలెం ప్రధాన రోడ్డు వద్దకు వచ్చేసరికి అక్కడ ఆర్అండ్బీ ఆధ్వర్యంలో బీటీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. తారుపరిచే యంత్రాన్ని తప్పించే క్రమంలో మోటారు సైకిల్ అదుపుతప్పింది. ముగ్గురూ కిందపడిపోయారు. మోటార్‌సైకిల్ వెనుక భాగంలో కూర్చున్న గణేష్‌కుమార్ తూలి తారుపరిచే యంత్రం దిగువన ఉండే ఇనుప కన్వేయర్ బెల్టు కింద పడిపోయాడు. అతడి తలపై నుంచి యంత్రం బెల్ట్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గణేష్‌కుమార్ వస్తాడని ఇంటి వద్ద ఎదురుచూస్తున్న తల్లి కాసులమ్మతో పాటు చెల్లి లోవ, నానమ్మ, తాతయ్యలకు ప్రమాదం వార్త తెలియడంతో వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఆ వెనుకనే వస్తున్న తండ్రి రాజబాబు కుమారుడి మృతదేహం వద్దకు చేరుకుని గుండెలవిసేలా రోదించాడు. మోటారు సైకిల్‌పై ఉన్న మరో విద్యార్థి శివశంకర్‌కు కూడా తీవ్రగాయాలు కావడంతో జడ్డంగి పీహెచ్‌సీకి తరలించారు. ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు డీడీ సుజాత, ఎంపీడీవో కేఆర్ విజయ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోలీసులు అడ్డతీగల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జడ్డంగి సర్పంచ్ కొంగర మురళీకృష్ణ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సింగిరెడ్డి రామకృష్ణ, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు కోటం రవిలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జడ్డంగి హెచ్‌సీ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేసవి సెలవులిచ్చారోచ్..
నేటి నుంచి జూన్ 11 వరకూ విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఆనందం వేసవి సెలవులు వచ్చేశాయి.. బడిగంటకు విరామం దొరికింది.. విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. సెలవుల తర్వాత మళ్లీ కలుద్దామంటూ మిత్రులు వీడ్కోలు చెప్పుకున్నారు. రాయవరం : పరీక్షలు ముగిశాయి..ఫలితాలు ప్రకటించారు..ప్రోగ్రెస్ కార్డులు చేతపట్టుకొని ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు విద్యార్థులు వేసవి సెలవులిచ్చారంటూ ఆనందంగా ఇళ్లబాట పట్టారు. పొరుగు గ్రామాల స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ శనివారం మధ్యాహ్నం వరకూ పాఠశాలలో గడిపారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు పెట్టే, బేడా సర్దుకొని స్వగ్రామాలకు బయల్దేరారు. సాధారణంగా ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 23 ఆదివారం కావడంతో 22 చివరి పనిదినమైంది. 23 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ ఏడాది ప్రస్తుత విద్యా సంవత్సరం ( 2016–17) ముగియగానే కొత్త విద్యా సంవత్సరం (2017–18 ) ప్రారంభించారు. గత నెల 10 నుంచి 20వ తేదీ వరకు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పరీక్షలు జరిగాయి. జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల కింద 4,412 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 1,506 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలల్లో ఎనిమిది లక్షల మంది చదువుకుంటున్నారు. వీరందరికీ నేటి నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. దాంతో ఏడాది పాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు పట్టరాని సంతోషం కలిగింది. పాఠశాలలకు చివరి పనిదినం కావడంతో ఉపాధ్యాయులు పలు చోట్ల విద్యార్థులకు స్వీటు, హాట్‌తో పాటు రస్నా అందజేశారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని సూచనలిచ్చారు. విద్యార్థులకు సెలవులు ఇచ్చినా ఉపాధ్యాయులు మాత్రం ప్రమోషన్ జాబితా తయారీలో తలమునకలయ్యారు. -
పరీక్షలయ్యాక బడికెళ్లాల్సిందే
నల్లజర్ల : వార్షిక పరీక్షలు పూర్తవ్వగానే వేసవి సెలవులు వచ్చేసేవి. ఇకపై ఆ పరిస్థితి లేదు. షెడ్యూల్ ప్రకారమే వేసవి సెలవులు ఇచ్చేందుకు నిర్ణయించినా.. పరీక్షల షెడ్యూల్ మాత్రం మారింది. మరోవైపు వేసవి సెలవులకు నెల రోజుల ముందుగానే విద్యార్థులకు పై తరగతిలో ప్రవేశం కల్పించి.. ఆ పాఠాలను బోధించనున్నారు. ఈ విధానం ఈ ఏడాది నుంచే అమల్లోకి వస్తోంది. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి జి.గంగాభవాని తెలిపారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. విద్యావిధానంలో కొత్త పద్ధతులు అమల్లోకి రానున్నాయని..ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నాయని చెప్పారు. విద్యార్థుల్లో అభ్యసన లోపాలను సరిచేసి నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దే దిశగా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షల అనంతరం కూడా తరగతులు కొనసాగుతాయన్నారు. ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యా సంవత్సరం చివరి నెల రోజుల్లో రెండో తరగతి పాఠ్యాంశాలు బోధిస్తామని, ఇలా 1నుంచి 9వ తరగతి విద్యార్థులందరికీ పై పాఠాల బోధన ఉంటుందని వివరించారు. దీనివల్ల విద్యార్థులు పై తరగతిలోకి వెళ్లేసరికి వారికి పాఠ్యాం శాలు కొట్టిన పిండిలా మారతాయన్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 22వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినమని, అప్పటివరకు దాదాపు నెల రోజులపాటు సంసిద్ధత తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమయంలో తదుపరి తరగతులకు సన్నద్ధం చేస్తూ చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నామన్నారు. సీబీఎస్ఈ విధానంలోనూ ఇదే పద్ధతి అమల్లోకి వస్తుందన్నారు. తొలిసారి సమగ్ర మూల్యాంకనం 10వ తరగతి వార్షిక పరీక్షల్లో తొలిసారి నిరంతర సమగ్ర మూల్యాంకనం చేపట్టేందుకు రంగం సిద్ధమైందని డీఈఓ చెప్పారు. 10వ తరగతి వార్షిక పరీక్షలలో అన్ని సబ్జెక్ట్‌లకు 80 మార్కులకే ప్రశ్నపత్రాలు ఉంటాయన్నారు. మిగిలిన 20 మార్కులకు విద్యార్థులు అంతకు ముందు రాసిన పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్నెల్ మార్కులు కలపనున్నట్టు చెప్పారు. వీటన్నింటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తుండటం వల్ల ఎటువంటి అవకతవకలకు అవకాశం ఉండబోదన్నారు. టెన్త పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు జిల్లాలో ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు డీఈఓ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 246 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని, కలెక్టర్ ఆదేశాల మేరకు అన్నిచోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. జిల్లాలో దాదాపు 60వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతారన్నారు. పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. ఆమె వెంట కొయ్యలగూడెం డీవైఈవో తిరుమల దాసు ఉన్నారు. -
సాగర తీరంలో ఒబామా షికారు
అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు ముగిసిన వెంటనే బరాక్ ఒబామా సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు. తన భార్య మిషెల్ తో కలిసి సముద్ర తీరంలో సెలవులు గడుపుతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్, మరికొంత మందిలో కలిసి ఒబామా దంపతులు సరదాగా గడుపుతున్న దృశ్యాలు, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. నలుపు రంగు టీ-షర్ట్, షార్ట్ ధరించి భార్యతో కలిసి బీచ్ లో ఒబామా నడుస్తున్న ఫొటోలు, దృశ్యాలు చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఒబామా ఆహార్యం చూసి ఆశ్చర్యపోతున్నారు. సాధారణ దుస్తుల్లో ఒబామా చాలా బాగున్నారని, ఆయన స్టైల్ అదిరిందని కామెంట్లు పెట్టారు. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రారని కొంత మంది పేర్కొన్నారు. ట్విటర్ లో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఫిబ్రవరి 1న షేర్ చేసిన ఈ వీడియోకు 1.5 లక్షల లైకులు వచ్చాయి. 78 వేల మందిపైగా రీట్వీట్ చేశారు. కాగా, ఒబామా మళ్లీ అమెరికా అధ్యక్షుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు పబ్లిక్ పాలసీ పోలింగ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. -
ఊరు పిలిచింది
సిటీబ్యూరో: సంక్రాంతి రద్దీ పోటెత్తింది. బస్సైనా..రైలైనా.. సీటున్నా.. లేకున్నా.. రిజర్వేషన్ ఉన్నా..జనరల్ బోగీ అయినా సరే తప్పదు అన్నట్లుగా నగరం నుంచి లక్షలాది మంది సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. బుధవారం నుంచి పిల్లలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో భారీ ఎత్తున బయలుదేరారు. రైళ్లు, బస్సులు కిటకిటలాడాయి. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లతో పాటు, ఎల్బీనగర్, ఉప్పల్, మెహిదీపట్నం, బాలానగర్ తదితర ప్రాంతాల్లోని కూడళ్లు దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి. సాధారణ రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే 3500 బస్సులకు తోడు మరో 500 బస్సులను బుధవారం అదనంగా ఏర్పాటు చేశారు. మరోవైపు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి బయలుదేరే వందకు పైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. రిజర్వేషన్లు లభించని వాళ్లు జనరల్ బోగీలను ఆశ్రయించారు. యథావిధిగా చార్జీల దోపిడీ కొనసాగింది.