Seat allocation
-
Supreme Court: ఆ విద్యార్థికి ఐఐటీ సీటివ్వండి
న్యూఢిల్లీ: నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివినా సమయానికి ప్రవేశరుసుం కట్టలేక ప్రతిష్టాత్మక ఐఐటీ ధన్బాద్లో సీటు కోల్పోయిన దళిత విద్యార్థికి సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. వెంటనే ఆ విద్యార్థి అతుల్ కుమార్‌కు సీటు ఇవ్వాలని ఐఐటీ ధన్‌బాద్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సోమవారం ఆదేశించింది. జూన్ 24వ తేదీ సాయంత్రం ఐదింటిలోపు అడ్మిషన్ ఫీజు రూ.17,500 కట్టలేకపోవడంతో బీటెక్ సీటు కోల్పోయిన తనకు న్యాయం చేయాలంటూ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. ‘‘ విద్యార్థి ఆరోజు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు కోసం మధ్యాహ్నం మూడు గంటలకే లాగిన్ అయ్యాడు. తర్వాత పదేపదే ఎస్ఎంఎస్లు, వాట్సాప్‌లో రిమైండ్లతో గడువును గుర్తుచేశాం’’ అని ఐఐటీ సీట్ల కేటాయింపు విభాగం వాదించింది. దీంతో సీజేఐ కలగజేసుకుని ‘‘మీరెందుకంతగా వ్యతిరేకిస్తున్నారు?. ఈ పిల్లాడికి ఏమైనా చేయగలవేమో చూడండి. ఆ డబ్బులే ఉంటే కట్టకుండా ఎందుకుంటాడు? అణగారిన వర్గాలకు చెందిన రోజువారీ కూలీ కుమారుడు. పైగా అతనిదిదారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబం. ఐఐటీలో సీటు కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. ప్రతిభగల ఇలాంటి విద్యార్థిని మనం ఊరకనే వదిలేయలేం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టుకు సంక్రమించిన అసాధారణ అధికారంతో మిమ్మల్ని ఆదేశిస్తున్నాం. ఇదే ఏడాది అదే బ్యాచ్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కోర్సులో విద్యార్థికి సీటివ్వండి. హాస్టల్ వసతి సహా అర్హతగల అన్ని ప్రయోజనాలు అతనికి అందేలా చూడండి’’ అని ఐఐటీ కాలేజీ విభాగాన్ని కోర్టు ఆదేశించింది. కిక్కిరిసిన కోర్టు హాలులో అంతసేపూ చేతులు కట్టుకుని నిలబడిన విద్యార్థితో ‘‘ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకో’’ అని సీజేఐ అన్నారు. బాగా చదువుతూ ఇంజనీరింగ్ చేస్తున్న అతని ఇద్దరు అన్నల బాగోగులు తదితరాల గురించి కూడా ఆయన ఆరాతీశారు.ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌జిల్లా టిటోరా గ్రామానికి చెందిన అతుల్ ఐఐటీ ధన్బాద్లో సీటు వచ్చినా పేదరికం కారణంగా డబ్బులు కట్టలేక నిస్సహాయుడయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తలో చేయి వేసి నగదు సర్దినా చివరి నిమిషంలో ఆన్లైన్ చెల్లింపు విఫలమై ఫీజు కట్టలేకపోయాడు. జార్ఖండ్ హైకోర్టు లీగ్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించగా పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహించినందున మద్రాస్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణ నెమ్మదించడంతో ఈసారి నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. -
దళిత విద్యార్ధికి అండగా సుప్రీంకోర్టు.. సీటు ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ: గడువు తేదీలోగా ఫీజు కట్టలేకపోయిన ఓ పేద విద్యార్థికి అడ్మిషన్ ఇవ్వాలని ఐఐటీ ధన్‌బాద్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతిభ గల విద్యార్థిని ఫీజు విషయంలో సీటుకు దూరం చేయడాన్ని అనుమతించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.అసలేం జరిగిందంటే..ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా టిటోరా గ్రామానికి చెందిన 18 ఏళ్ల అతుల్‌కుమార్ ఐఐటీ ధన్బాద్లో ఎలక్టానిక్ ఇంజనీరింగ్‌లో సీటు సాధించాడు. సీటు ఖరారు చేసేందుకు జూన్ 24 లోపు రూ.17,500 ఫీజు కట్టాల్సి ఉండగా,అతడి తల్లిదండ్రులు గడువులోగా ఫీజు కట్టలేకపోయారు. తండ్రి రోజుకు 450 సంపాదించే కూలీ అవ్వడంతో..వారి నిస్సహాయతను చూసిన టిటోడా గ్రామస్థులు విరాళాలు వేసుకొని ఆ మొత్తం సమకూర్చారు. అయితే అప్పటికే గడువు తేదీ దగ్గర పడటంతో.. చివరిరోజుసాంకేతిక కారణాలతో ధన్‌బాద్ ఐఐటీ ఆన్లైన్ పోర్టల్ పనిచేయక అతుల్ ఆ మొత్తాన్ని సకాలంలో కట్టలేకపోయాడు. సీటు వచ్చినట్టే వచ్చి చేజారింది.దీంతో విద్యార్ధి తనకు న్యాయం చేయాలని కోరుతూ తొలుత జార్ఖండ్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి.ఆ తర్వాత చెన్నై లీగల్ సర్వీసెస్‌కు వెళ్లాడు. అయిన ప్రయోజనం లేకపోవడంతో మద్రాస్ హైకోర్టును అశ్రయించాడు. మద్రాస్ హైకోర్టు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కోరింది. తాజాగా నేడు సుప్రీంకోర్టులో విచారణకు రాగా.. ‘ విద్యార్థి చాలా తెలివైన వాడు. కేవలం రూ. 17,000 కట్టలేని కారణంగా అతని చదువును కోల్పోయాడు. ప్రతిభావంతుడైన వ్యక్తి ఫీజు కట్టని విషయంలో వదిలివేలయం. అతుల్ కుమార్‌ను అదే బ్యాచ్‌లో చేర్చుకోవాలి. మరే ఇతర విద్యార్థి అభ్యర్థిత్వానికి భంగం కలగకుండా సూపర్‌న్యూమరీ సీటు సృష్టించాలి. అతనికి సీటు కల్పించాలి’ అని ఐఐటీ ధన్‌బాద్‌ను ఆదేశించింది -
Haryana: అందరి దృష్టి ఆ సీటుపైనే..
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల తేదీలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ ఒకటిన పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాష్ట్రంలోని 90 స్థానాల్లో ఒకటైన బధ్రా అసెంబ్లీ స్థానంపై అందరి దృష్టి నిలిచింది . ఈ సీటు హర్యానాలోని కీలకమైన సీట్లలో ఒకటి.బధ్రా అసెంబ్లీ స్థానం భివానీ మహేంద్రగఢ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ సీటులో మొత్తం 1.5 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 97,247, మహిళా ఓటర్ల సంఖ్య 86,708. ఈ స్థానంలో జాట్ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ సీటుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి నుంచి ఒకసారి ఎన్నికల్లో గెలిచిన వారు మరోమారు విజయం సాధించలేదు.2019 అసెంబ్లీ ఎన్నికల్లో బధ్రా అసెంబ్లీ స్థానం నుంచి జననాయక్ జనతా పార్టీ నేత నైనా చౌతాలా భారీ విజయాన్ని దక్కించుకున్నారు. నైనాకు 52,543 ఓట్లు వచ్చాయి. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రణబీర్ సింగ్ మహేంద్రకు 38,898 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సుఖ్వీందర్‌కు 32,685 ఓట్లు వచ్చాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన సుఖ్విందర్ మాంధీ విజయం సాధించగా, 2009లో ఐఎన్ఎల్డీ నేత కల్నల్ రఘ్బీర్ సింగ్ బధ్రా ఎన్నికల్లో విజయం సాధించారు. -
Maharashtra: మహాయుతి సీట్ల సద్దుబాటు ఫార్ములా ఇదే..
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనప్పటికీ, రాష్ట్రంలో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. సీట్ల సద్దుబాటుకు సంబంధించి మహాయుతి (బీజేపీ, శివసేన, ఎస్సీపీల కూటిమి)లో రాజకీయ గందరగోళం నెలకొన్నదనే వార్తలు వస్తున్న తరుణంలో మరో ఆస్తకికర పరిణామం చోటుచేసుకుంది.రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల సద్దుబాటు ఫార్ములాను ఆగస్టు 15 నాటికి మహాయుతి ఖరారు చేయనుంది. కూటమిలోని వివిధ పార్టీల ఎమ్మెల్యేలు గతంలో గెలిచిన స్థానాలలోనే తిరిగి పోటీ చేసేలా ఫార్ములా రూపొందించనున్నట్లు ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు.ఈ ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే స్పందిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో బీజేపీ వారైనా, షిండే లేదా అజిత్ పవార్ వర్గం వారైనా వారి మనోభావాలను గౌరవిస్తామన్నారు. అయితే అక్కడక్కడ ఒకటి లేదా రెండు సీట్ల కేటాయింపులలో తేడా ఉండవచ్చన్నారు. పొత్తు విషయంలో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ మధ్య చర్చలు జరగాలని ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారన్నారు. -
‘తిక్క తీరింది బిడ్డకు’..! పగలబడి నవ్వుతారు: వైరల్ వీడియో
ప్రయాణాల్లో గర్భంతో ఉన్న మహిళను చూస్తే ఎవరికైనా లేచి సీటు ఇవ్వాలనిపిస్తుంది. నిజానికి అది కనీస ధర్మం కూడా. కానీ చాలామంది యువకులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఆడవాళ్లను, అందులోనూ గర్భిణీలను గౌరవించాలనే కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారు. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఒక బస్సులో గర్భిణీ స్వయంగా వచ్చి సీటు అడిగినా ఇవ్వలేదు ఒక యువకుడు. సరికదా... అసభ్యంగా ప్రవర్తించాడు. తన ఒళ్ళో కూచోమన్నట్టుగా సైగ చేశాడు. దీంతో వెనక కూర్చున్న పెద్దాయనకు ఒళ్లు మండింది. వీడికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించు కున్నాడు. ఇక క్షణం ఆలస్యం చేయకుండా..వెంటనే లేచి ఆ మహిళను తన సీట్లో కూర్చోమని చెప్పి, ఠపీమని ఆ పోరగాడి ఓళ్లో కూచున్నాడు. అటు వాడి తిక్క తీరింది. లబోదిబోమన్నాడు. దీంతో ఆ మహిళతో సహా, బస్సులోని వాళ్లందరూ నవ్వుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వేలకొద్దీ కామెంట్లు, రీషేర్లతో నెట్టింట్ వైరల్‌గా మారింది.😂😂pic.twitter.com/yp5QDTfMVc— Figen (@TheFigen_) June 19, 2024 తిక్క తీరింది బిడ్డకు.. లేకపోతే.. ఏంటా యాటిట్యూడ్ అంటూ నెటిజన్లు కమెంట్స్ చేశారు. ‘బుర్రా..బుద్ధీ ఉండాలి కదరా! మారండిరా’ అని మరి కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్‌లో షేర్ అయిన ఈ వీడియో ఇప్పటికే కోటి 1.30 కోట్లకు పైగా వ్యూస్‌ను దక్కించుఉంది. -
శ్రీనగర్‌లో నువ్వా? నేనా? అంటున్న ఎన్సీ, పీడీపీ?
దేశంలో ఎన్నికల పండుగ జరుగుతోంది. ఈ నేపధ్యంలో శ్రీనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం మే 13న ఆసక్తికర పోటీకి సిద్ధమైంది. మొత్తం 17,43,845 మంది ఓటర్లు.. బరిలో ఉన్న 24 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా రెండు లక్షల మంది ఓటు వేయనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగించి, కేంద్ర పాలిత ప్రాంత హోదాను కల్పించారు. ఈ ప్రకియ తరువాత ఇప్పుడు తొలిసారిగా ఇక్కడ ఎన్నికల పోరు జరుగుతోంది. కశ్మీర్‌లోని ఐదు జిల్లాల్లో విస్తరించి ఉన్న శ్రీనగర్ నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ నెలకొంది. ఇక్కడ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేందుకు 17,43,845 మంది ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. వీరిలో 8,73,426 మంది పురుషులు, 8,70,368 మంది మహిళలు కాగా, 51 మంది ట్రాన్స్జెండర్లు.భారత ఎన్నికల కమిషన్ అందించిన డేటా ప్రకారం శ్రీనగర్, గందర్బాల్, బుద్గాం, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో మొత్తం 2,135 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నుండి అఘా సయ్యద్ రుహుల్లా మెహదీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) నుండి వహీద్-ఉర్-రెహ్మాన్ పర్రా ప్రధాన పోటీదారులుగా నిలిచారు. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్‌కు అమీర్ భట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీనగర్ లోక్‌సభ స్థానంపై నేషనల్ కాన్ఫరెన్స్‌కు మంచి పట్టు ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ 2014 మినహా 1977 నుండి 2019 వరకు నిరంతరం ఈ స్థానాన్ని గెలుచుకుంటూ వస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఫరూక్ అబ్దుల్లా 1,06,596 ఓట్లతో విజయం సాధించారు. అయితే 2014లో పీడీపీ అభ్యర్థి తారిఖ్ హమీద్ కర్రా 1,57,923 ఓట్లతో గెలుపొందడంతో పరిస్థితి మారిపోయింది. కశ్మీర్‌లోని ఐదు స్థానాల్లో మూడింటిని ఎన్సీ కైవసం చేసుకుంది.జమ్మూ కాశ్మీర్లో మొత్తం ఐదు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో మూడు నేషనల్ కాన్ఫరెన్స్, రెండు బీజేపీ చేతిలో ఉన్నాయి. శ్రీనగర్ లోక్‌సభ స్థానం నేషనల్ కాన్ఫరెన్స్‌కు బలమైన కోటగా ఉంది. పార్టీ 1947 నుండి 15 పార్లమెంటరీ ఎన్నికల్లో 12 సార్లు ఈ సీటును దక్కించుకుంది.శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో అబ్దుల్లా కుటుంబ ఆధిపత్యం మొదటి నుంచి ఉంది. అయితే ఈ సారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. శ్రీనగర్ లోక్‌సభ స్థానాన్ని సున్నితమైన స్థానంగా పరిగణిస్తారు. గత 35 ఏళ్లలో వేర్పాటువాదం, హింసాయుత ఘటనల కారణంగా ఈ ప్రాంతంలో తక్కువ శాతం ఓటింగ్ జరుగుతూ వస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈసారి ఇక్కడి ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. -
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి నటి కంగనా రనౌత్ బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై పోటీ చేస్తున్నారు. హిమాచల్‌లో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం మండీలో విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ ఎంపీగా ఉన్నారు.హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇక్కడి నుంచి పోటీ చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. కాగా కంగనా రనౌత్ తన ఎన్నికల ప్రచారంలో సంప్రదాయ దుస్తులతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ఇటీవల కంగనా ధరిస్తున్న సంప్రదాయ దుస్తులపై కామెంట్ చేశారు. ఆమె ప్రజలను ఆకట్టుకునేలాంటి దుస్తులను తరచూ ధరిస్తున్నారని విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు.కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని భంబ్లా పరిధిలోగల జాహు నివాసి. మండిలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో కంగనా రనౌత్ సంప్రదాయ చీరలు, స్థానిక దుస్తులతో కనిపిస్తున్నారు. ఆమె కులులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు కుల్లవి వేషధారణలో కనిపించారు. ఇక్కడ ఈ తరహా దుస్తులకు ఎంతో ఆదరణ ఉంది.ఆమె చంబాలోని భర్మౌర్ను సందర్శించినప్పుడు శామ్ చౌరాసి దేవాలయంలో పూజలు చేశారు. ఈ సమయంలో కంగనా చంబా సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. ఆ సమయంలో ఆమె తీయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కిన్నౌర్ జిల్లాలో ఆమె ప్రచారంలో పాల్గొన్నప్పుడు కిన్నౌరి శాలువా కప్పుకుని అందరికీ కనిపించారు. ఆ వీడియోను కంగన సోషల్ మీడియాలో షేర్ చేశారు.సిమ్లాలోని రాంపూర్‌లో ప్రచారం సాగించినప్పుడు ఆమె అక్కడి ప్రసిద్ధ భీమాకాళి ఆలయంలో పూజలు చేసి, బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆమె స్థానిక సంప్రదాయ దుస్తులలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సిమ్లా సంప్రదాయ దుస్తుల్లో కంగనా మెరుపు తీగలా ఉన్నారనే కామెంట్ వినిపించింది. ఇదిలా ఉండగా కంగనా రనౌత్ ప్రచార సభల్లో పాల్గొనేటప్పుడు డిఫరెంట్ డ్రెస్సుల్లో కనిపిస్తూ, అందరినీ ఆకట్టకుంటున్నారని విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు. ఆమె ప్రచార సభలను చూస్తుంటే ఆమె ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు అనిపిస్తోందని విక్రమాదిత్య వ్యాఖ్యానించారు. -
రాయ్‌బరేలీ నుంచి రాహుల్? ప్రియాంకపై వీడని ఉత్కంఠ?
యూపీలోని అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల నుంచి కాంగ్రెస్ ఎవరిని ఎన్నికల బరిలోకి దింపుతున్నదనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. అయితే రాహుల్ గాంధీ అమేథీ నుండి కాకుండా రాయ్‌బరేలీ నుండి ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే వార్త తాజాగా వినిపిస్తోంది. అదేవిధంగా ప్రియాంక గాంధీని ఎన్నికల పోరులో నిలబెట్టే ఆలోచన కాంగ్రెస్‌కు లేదని కూడా అంటున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. కాగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ వాద్రా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ అవినాష్ పాండే, లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ఆరాధన మిశ్రా అధినాయకత్వాన్ని కోరినట్లు సమాచారం.రాహుల్ గాంధీ 2004 నుంచి 2019 వరకు అమేథీ లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు.కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈసారి రాయ్‌బరేలీ నుండి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆమె రాజస్థాన్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సోనియా రెండు దశాబ్దాల పాటు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ ఈ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తోంది. కొద్దిసేపటిలో కాంగ్రెస్ అమెథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలు అభ్యర్థుల పేర్లను వెల్లడించనుంది. దీంతో ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది. -
Lok sabha elections 2024: కాంగ్రెస్‌లో ప్రియాంకం
ప్రియాంకా గాంధీ వాద్రా. తండ్రి రాజీవ్ హత్యకు గురైనప్పుడు సమాజంతో పాటు మొత్తం ప్రపంచంపైనే కోపం పెంచుకున్న అమ్మాయి. ఎదిగే కొద్దీ క్షమాగుణం విలువను తెలుసుకున్నారు. ప్రధాని పదవి స్వీకరించాలని తల్లి సోనియాను కాంగ్రెస్ నేతలంతా కోరితే తననూ హత్య చేస్తారని భయపడి ఏడ్చిన సగటు యువతి. ఇప్పుడదే కాంగ్రెస్‌కు ట్రబుల్ షూటర్‌గా మారారు. అచ్చం నానమ్మ ఇందిర పోలికలను పుణికిపుచ్చుకున్న ప్రియాంక రాజకీయాల్లోకి వస్తారా, రారా అన్న చర్చ ఆమె పద్నాలుగో ఏట నుంచే మొదలైంది! తనకు రాజకీయాలు సరిపడవని మొదట్లో గట్టిగా నమ్మారామె. అలాంటిది ఇప్పుడు రాజకీయాల్లో పూర్తిగా తలమునకలయ్యారు. గాంధీల కంచుకోటైన యూపీలోని రాయ్‌బరేలీలో తల్లికి బదులుగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారంటూ ప్రచారమూ జరుగుతోంది. రాజకీయ జీవితం ప్రియాంక తొలుత క్రియాశీల రాజకీయాల్లో అంతగా పాల్గొనలేదు. తల్లి, సోదరుల లోక్‌సభ నియోజకవర్గాలైన రాయ్‌బరేలీ, అమేథీలకు వెళ్లేవారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో సోనియాకు ప్రచార నిర్వాహకురాలిగా వ్యవహరించారు. రాహుల్ ప్రచారాన్ని కూడా పర్యవేక్షించారు. 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని పది అసెంబ్లీ సీట్లలో ప్రచారం మొదలుకుని సీట్ల కేటాయింపులు, అంతర్గత పోరును పరిష్కరించడం దాకా అన్నీ తానై వ్యవహరించారు. 2019లో యూఈ తూర్పు భాగానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తర్వాత యూపీ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను తీసుకున్నారు. మహిళలకు 40 శాతం టికెట్ల డిమాండ్‌తో ‘లడ్కీ హూ, లడ్ సక్తీ హూ’ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే చవిచూసింది. ఆ అనుభవం తన జీవితంలో స్థితప్రజ్ఞత తీసుకొచి్చందంటారు ప్రియాంక. అయితే 2022 హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారానికి సారథ్యం వహించి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లోనూ క్రియాశీల పాత్ర పోషించారు. హిందీ సాహిత్యం.. బౌద్ధం... ప్రియాంక 1972 జనవరి 12న జని్మంచారు. డెహ్రాడూన్ వెల్హామ్ బాలికల పాఠశాలలో చదివారు. తర్వాత భద్రతా కారణాలతో రాహుల్‌తో పాటు ఢిల్లీలోని డే స్కూల్‌కు మారారు. ఇందిర హత్యానంతరం ఇద్దరూ ఇంట్లోనే చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ కాలేజీ జీసస్ అండ్ మేరీ నుంచి ప్రియాంక సైకాలజీలో డిగ్రీ చేశారు. బౌద్ధ అధ్యయనంలో మాస్టర్స్ చేశారు. నానమ్మను అత్యంత శక్తివంతమైన మహిళగా చెబుతారు. బాల్యంలో నానమ్మతో రాహులే ఎక్కువగా గడపడం చూసి ఈర‡్ష్య పడేదాన్నంటూ నవ్వేస్తారు. ప్రియాంక బాల్యం ఎక్కువగా బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తల్లి తేజీ బచ్చన్‌తో గడిచింది. అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ కవిత్వం చదివి హిందీ సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ప్రేమ్‌చంద్ సాహిత్యాన్ని ఇష్టపడతారు. ఖాళీ దొరికితే పుస్తకాలు పట్టుకుంటారు. బౌద్ధ తత్వశా్రస్తాన్ని ఆచరిస్తారు. 1999లో రాజకీయాల్లోకి రావాల్సి వచి్చనప్పుడు పది రోజులపాటు మెడిటేషన్ చేసి నిర్ణయం తీసుకున్నారు. 1997లో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను పెళ్లాడారు. వారికిద్దరు పిల్లలు. ప్రియాంక రేడియో ఆపరేటర్ కూడా! -
రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ? త్వరలో అధికారిక ప్రకటన?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తర్వాత యూపీలోని రాయ్‌బరేలీ ఎవరిది? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ హైకమాండ్ త్వరలోనే జవాబు చెప్పనుంది. తాజాగా రాయ్‌బరేలీ ఎన్నికల బరిలో ప్రియాంక ప్రవేశానికి సంబంధించిన సూచనలు హై కమాండ్ నుంచి జిల్లా కార్యనిర్వాహకవర్గానికి అందిందనట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందట. ప్రియాంకా గాంధీ రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరేందుకు జిల్లా కమిటీ అధికారులు ఫిబ్రవరిలో ఆమెను కలుసుకున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రాయ్‌బరేలీ సీటు ఎంతో కీలకం. సమాజ్‌వాదీతో పొత్తు కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 17 సీట్లు దక్కాయి. ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తే రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు మంచి సందేశం అందుతుందని, అది భారత కూటమికి మేలు చేస్తుందని కాంగ్రెస్ థింక్ ట్యాంక్ నమ్ముతోంది. రాయ్‌బరేలీలో ప్రియాంక గాంధీకి.. ఆమె అమ్మమ్మ ఇందిరా గాంధీ, తల్లి సోనియా గాంధీకి ఉన్నంత ఆదరణ ఉంది. ప్రియాంక తొలిసారి 1999 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాయ్‌బరేలీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి కెప్టెన్ సతీష్ శర్మ గెలుపు బాధ్యతను ప్రియాంక విజయవంతం చేశారు. రాయ్‌బరేలీ రాజకీయాలపై ప్రియాంకకు మంచి అవగాహన ఉందని విశ్లేషకులు చెబుతుంటారు. -
లోక్‌సభ ఎన్నికలకు అఖిలేష్ దూరం?
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే వార్త వినిపిస్తోంది. దీంతో ఇంతకాలం ఆయన ఆయన కన్నౌజ్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. ఆయన ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని, అయితే కన్నౌజ్ సీటు నుంచి ఎవరిని నిలపాలనే దానిపై పార్టీ నేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఆయన కన్నౌజ్‌లోని బూత్ ఇన్‌ఛార్జ్‌లతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో కన్నౌజ్ అభ్యర్థిపై చర్చించే అవకాశాలున్నాయంటున్నారు. కన్నౌజ్ సీటు నుంచి అతని బంధువు తేజ్ ప్రతాప్‌కు టిక్కెట్ కేటాయించవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్నౌజ్‌లో ఎన్నికల ఇన్ఛార్జ్తో జరిగే సమావేశం అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కన్నౌజ్ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఆమె బీజేపీకి చెందిన సుబ్రతా పాఠక్ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత ములాయం సింగ్ మరణానంతరం మెయిన్‌పురి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమె గెలిచి ఎంపీ అయ్యారు. కాగా రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను అఖిలేష్ యాదవ్ పోటీకి దించవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆజం ఖాన్ అందుకు సిద్ధంగా లేరని సమాచారం. కన్నౌజ్‌లో సమాజ్‌వాదీ నేతలు అఖిలేష్ యాదవ్ ఇక్కడ నుండి పోటీ చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ సోదరుడు రాజ్వీర్ సింగ్ యాదవ్ కుమారుడు. 2014లో మెయిన్‌పురి స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అతనికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. తేజ్ ప్రతాప్‌కు ఆర్జేడీ నేత లాలూ యాదవ్‌తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. లాలూకు తేజ్ ప్రతాప్ అల్లుడు. లాలూ యాదవ్ కుమార్తె రాజలక్ష్మి యాదవ్‌ను తేజ్ ప్రతాప్ వివాహం చేసుకున్నారు. -
ఆ సీటుకు కాంగ్రెస్ Vs కాంగ్రెస్?
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. ముఖ్యంగా కోలార్ సీటు విషయంలో పార్టీలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. కోలార్ సీటును ఆ మాజీ ఎంపీ అల్లుడికి ఇస్తే రాజీనామా చేస్తామంటూ ఐదుగురు పార్టీ ఎమ్మెల్యేలు అధిష్ఠానాన్ని బెదిరించారు. పార్టీ సీనియర్ నేత, మంత్రి కె. హెచ్.మునియప్ప అల్లుడు చిక్క పెద్దన్నకు లోక్‌సభ ఎన్నికల్లో కోలార్ నుంచి టికెట్ ఇస్తే రాజీనామా చేస్తామంటూ ఐదుగురు ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతంలో పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కోలార్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కెహెచ్ మునియప్ప గెలుపొందారు. ఆయన ఇప్పుడు తన అల్లుడు చిక్కా పెద్దన్నకు ఈ ప్రాంతపు టిక్కెట్ అడుగుతున్నారు. పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించనప్పటికీ, కోలార్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు శాసన మండలి (ఎమ్మెల్సీ) సభ్యులు, ఒక మంత్రి తదితరులు చిక్కా పెద్దన్నకు టిక్కెట్ ఇస్తే తాము పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. పెద్దన్నకు టికెట్ ఇస్తే షెడ్యూల్డ్ కులాల వామపక్ష వర్గానికి ప్రాతినిధ్యం దక్కుతుందని పార్టీ భావిస్తోంది. అయితే కోలార్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కోలార్ కొత్తూర్జి మంజునాథ్, కే. వై. నంజేగౌడ, ఎంసీ శాసనమండలి సభ్యులు అనిల్‌కుమార్, నసీర్ అహ్మద్ తదితరులు ఈ సీటును షెడ్యూల్డ్ కులానికి చెందిన రైట్‌వింగ్ అభ్యర్థికే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పార్టీ అధిష్ఠానం ఎటూ తేల్చుకోలేకపోతున్నదని సమాచారం. -
ఆజంఖాన్ కంచుకోటను అఖిలేష్ కాపాడతారా?
ఉత్తరప్రదేశ్‌లోని పలు లోక్‌సభ స్థానాలకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే పార్టీ నేత ఆజం ఖాన్‌కు కంచుకోటగా ఉన్న రాంపూర్‌పై పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఈసారి ఆజం స్థానంలో ఎవరిని రంగంలోకి దింపాలనే ప్రశ్న ఎస్పీని కలవరపెడుతోంది. ఈ సీటు నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని సమాచారం. అఖిలేష్ రామ్‌పూర్ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని అజం ఖాన్ స్వయంగా కోరారట. అయితే ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఇందుకు సిద్ధంగా లేరట. మరోవైపు అఖిలేష్ కుటుంబం నుండి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను రాంపూర్ నుండి పోటీ చేయించాలని పార్టీ భావిస్తోందని సమాచారం.. అధికారికంగా అఖిలేష్ ఇంకా ప్రకటించనప్పటికీ తేజ్ ప్రతాప్ యాదవ్‌కు టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయని కొందరు అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. దీంతో యూపీలో సమాజ్‌వాదీ పార్టీ 63 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌కు 17 సీట్లు మిగిలాయి. ఇటీవల యూపీలోని కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. వారణాసి నుంచి అజయ్ సింగ్‌కు, రాజ్‌గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్‌కు అవకాశం కల్పించారు. -
ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె!
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యా రాణి ఏప్రిల్ 19న తమిళనాడులో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళ్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ నామ్ తమిజర్ కచ్చి (ఎన్టీసీ) టికెట్‌పై ఆమె కృష్ణగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్యా రాణి జూలై 2020లో భారతీయ జనతా పార్టీలో చేరారు. తమిళనాడు బీజేపీ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు. ఇటీవల ఆమె నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని ఎన్టీకే పార్టీలో చేరారు తమిళనాడు, పుదుచ్చేరిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న 40 మంది అభ్యర్థులను ఎన్టీకే నేత సీమాన్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణగిరి నుంచి ఎన్టీకే అభ్యర్థిగా విద్యా రాణి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, మొత్తం 40 మంది ఎన్టీకే అభ్యర్థుల్లో సగం మంది మహిళలేని తెలిపారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్యా రాణి కృష్ణగిరిలో ఒక పాఠశాలను నడుపుతున్నారు. ఆమె తన తండ్రి వీరప్పన్‌ను ఒకే ఒక్కసారి కలిశారట. తన తండ్రి వీరప్పన్ తన జీవితానికి కొత్త దిశానిర్దేశం చేశారని విద్యా రాణి తెలిపారు. తాను మూడో తరగతి చదువుతున్నప్పుడు తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని గోపీనాథమ్లోని తాతయ్య ఇంట్లో తన తండ్రిని మొదటిసారిగా, చివరిసారిగా చూశానని తెలిపారు. -
ప్రధాని మోదీ ప్రత్యర్థి రాయ్ బలాబలాలేమిటి?
2024 లోక్‌సభ ఎన్నికలకు 46 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన నాలుగో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. వీటిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్. యూపీలోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై అజయ్‌రాయ్‌ను కాంగ్రెస్ మూడోసారి అభ్యర్థిగా నిలబెట్టింది. వారణాసి నుంచి తనకు అవకాశం కల్పించినందుకు రాయ్ కాంగ్రెస్ హైకమాండ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి స్థానం నుండి బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పోటీ చేశారు. 2014లో అజయ్‌రాయ్‌కు 75,614 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీపై 5,05,408 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అజయ్ రాయ్ 1,52,548 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో రాయ్ ఓట్ల శాతం పెరిగింది. ఈ ఎన్నికల్లో ఆయన 5,22,116 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అజయ్ రాయ్ 1996, 2002, 2007లలో వారణాసిలోని కొలాస్లా అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2007లో బీజేపీని వీడిన అజయ్ రాయ్ 2009లో స్వతంత్ర అభ్యర్థిగా కొలాస్లా ఉపఎన్నికల్లో గెలిచి నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2012లో వారణాసిలోని పింద్రా స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. అప్పుడు కూడా గెలుపొంది, ఐదోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 2017, 2022లో వారణాసిలోని పింద్రా స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. అయితే ఈ రెండు సార్లూ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అజయ్ రాయ్ ఘాజీపూర్ జిల్లాకు చెందిన భూమిహార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారణాసిలో స్థిరపడ్డారు. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం అయిన ఏబీవీపీ నుండి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. వారణాసి నుంచి లోక్‌సభ టిక్కెట్ రాలేదనే కారణంతో అజయ్ రాయ్ బీజేపీని వీడారు. అయితే ఆయనకు బీజేపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటుంటారు. అజయ్ రాయ్‌పై పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. పూర్వాంచల్‌లోని పేరుమోసిన మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ, అతని అనుచరులు 1994లో అజయ్ రాయ్ సోదరుడు అవధేష్ రాయ్‌ను కాల్చి చంపారు. అప్పటి నుంచి అజయ్‌రాయ్, అన్సారీ కుటుంబీకుల మధ్య శత్రుత్వం కొనసాగుతోందని అంటారు. -
జేడీయూ సిట్టింగ్ ఎంపీలకు మొండిచెయ్యి?
లోక్‌సభ ఎన్నికలకు బీహార్‌లోని జనతాదళ్యునైటెడ్ (జేడీయూ) అభ్యర్థుల పేర్లు ఇవేనంటూ కొన్ని లీకులు బయటకు వస్తున్నాయి. వీటి ప్రకారం చూస్తే ఈ ఎన్నికల్లో జేడీయూ పాతవారికి చెక్ పెట్టి, కొత్తవారికి అవకాశం కల్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ టిక్కెట్లు దక్కనివారిలో కొంతమంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారని సమాచారం. సీట్ల పంపకంలో జేడీయూ తమ సిట్టింగ్ ఎంపీల టిక్కెట్లకు కోతపెట్టి, వాటిని మిత్ర పక్షాలకు కట్టబెట్టినట్లు సమాచారం. మీడియాకు అందిన వివరాల ప్రకారం సీట్ల పంపకంలో కరకట్ ఎంపీ మహాబలి సింగ్, గయ ఎంపీ విజయ్ మాంఝీ, సివాన్ ఎంపీ కవితా సింగ్, సీతామర్హి ఎంపీ సునీల్ కుమార్ పింటూలకు టిక్కెట్లు దక్కలేదని తెలుస్తోంది. అయితే శివహార్ నుంచి లవ్లీ ఆనంద్, సీతామర్హి నుంచి దేవేశ్ చంద్ర ఠాకూర్, శివన్ నుంచి రాజలక్ష్మి కుష్వాహా, కిషన్‌గంజ్ నుంచి మాస్టర్ ముజాహిద్ పేర్లను జేడీయూ ఖరారు చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పేర్లను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బీహార్‌లో జేడీయూకు 16 సీట్లు దక్కాయి. వాల్మీకినగర్ నుండి సునీల్ కుమార్, భాగల్పూర్ నుండి అజయ్ మండల్, మాధేపురా నుండి దినేష్ చంద్ర యాదవ్, ఝంఝార్పూర్ నుండి రాంప్రీత్ మండల్, సుపాల్ నుండి దిలేశ్వర్ కామత్, జెహానాబాద్ నుండి చండేశ్వర్ చంద్రవంశీ తదితరులు జేడీయూ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. -
Lok Sabha elections 2024: నాలుగు రాష్ట్రాల్లో పొత్తు కాంగ్రెస్, ఆప్ ఒప్పందం
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ సహా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు ఖరారైంది. ఢిల్లీ, గుజరాత్, గోవా, హరియాణాల్లో సీట్ల పంపకం పూర్తయింది. ఢిల్లీలో కాంగ్రెస్ 4, ఆప్ 3 చోట్ల బరిలో దిగుతాయి. న్యూఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ స్థానాల్లో ఆప్, చాందినీ చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ సీట్లలో కాంగ్రెస్ బరిలో ఉంటాయి. గుజరాత్లో 24 స్థానాల్లో కాంగ్రెస్, రెండు స్థానాల్లో (భావ్‌నగర్, భరూచ్) ఆప్ పోటీ చేస్తాయి. హరియాణాలో కురుక్షేత్ర స్థానంలో ఆప్, మిగతా 9 చోట్లా కాంగ్రెస్ బరిలో ఉంటాయి. గోవాలో మొత్తం రెండు సీట్లతో పాటు చండీగఢ్ లోక్‌సభ స్థానంలోనూ కాంగ్రెసే పోటీ చేస్తుంది. కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్, ఆప్ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ శనివారం ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. పంజాబ్‌లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తుతో సంబంధం లేకుండా అక్కడి 13 స్థానాల్లో విడిగానే పోటీ చేయాలని రెండు పారీ్టలూ నిర్ణయించాయి. గుజరాత్లో భరూచ్ స్థానాన్ని ఆప్‌కు కేటాయించడాన్ని దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడ అహ్మద్ పటేల్ పలుమార్లు గెలిచారు. ఈసారి కూడా కాంగ్రెస్ టికెట్‌పై తాను పోటీ చేస్తానని, దీనిపై పార్టీ అధిష్టానాన్ని కలిసి చర్చిస్తానని ఫైజల్ చెప్పారు. -
పొత్తు.. టీడీపీ సీనియర్లు చిత్తు
సాక్షి, అమరావతి : ప్రజల్లో ఆదరణ కోల్పోయినా, పొత్తుల ద్వారా గట్టెక్కుదామనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి అవి కూడా శరాఘాతాల్లా మారాయి. పొత్తులో భారీగా సీట్లు కోల్పోయే పరిస్థితి నెలకొనడంతో చాలా మంది సీనియర్ల మెడపై కత్తులు వేలాడుతున్నాయి. దీంతో వారి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 67 పేర్లతో జాబితాను చంద్రబాబుకు ఇచ్చారు. వాటిలో కనీసం 50కి పైగా సీట్లు తమకు కేటాయించాలని కోరుతున్నారు. తాజాగా బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతుండడంతో ఆ పార్టీకి ఆరు ఎంపీ, 25 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వక తప్పదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ పొత్తులు ఖరారైతే బీజేపీ, జనసేనకు 75 ఎమ్మెల్యే, 10 ఎంపీ స్థానాలు వదులుకోక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో అనేక మంది సీనియర్ల సీట్లు గల్లంతవుతున్నాయి. పొత్తులతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని సీనియర్ నేతలు లబోదిబోమంటున్నారు. అన్ని సీట్లు వదులుకుంటే పార్టీ అధికారంలోకి రావడం అటుంచి అసలు విలువే లేకుండా పోతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది నిజమే అయినా పొత్తులు లేకపోతే దిగజారిపోయిన పార్టీ మనుగడే కష్టమైపోతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్, బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. తద్వారా పార్టీని రేసులోనైనా నిలపవచ్చని భావిస్తున్నారు. అయితే దీనివల్ల అనేక మంది సీనియర్ నాయకుల రాజకీయ జీవితాలకు ముగింపు తప్పదని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్ర కకావికలం ఈ పొత్తులు ఖరారైతే ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నేతలు కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, గౌతు శిరీష, బండారు సత్యనారాయణమూర్తి, గండి బాబ్జి, గంటా శ్రీనివాసరావు, పీలా గోవింద్, పల్లా శ్రీనివాసరావు తదితర నేతల పేర్లు గల్లంతవనున్నాయి. ఎచ్చెర్లపై ఎన్నో అశలు పెట్టుకున్న కళా వెంకట్రావు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. విశాఖలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సీటు ఎగిరిపోనుంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అశోక్‌గజపతిరాజు వంటి సీనియర్ తన కుమార్తెకు సీటు ఇప్పించుకోలేక సతమతమవుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలకు తప్పని పొత్తు పోట్లు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కీలకమైన సీనియర్లకు పొత్తు పోట్లు తప్పేలా లేవు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, బొండా ఉమామహేశ్వరరావులను పక్కన పెట్టే పరిస్థితి ఏర్పడనుంది. అవనిగడ్డలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, పెడనలో కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెనాలిలో ఆలపాటి రాజా, నక్కా ఆనంద్‌బాబు వంటి నేతలకు షాక్ తగలనుంది. ఆలపాటి రాజా ఇప్పటికే తన సీటు పోతే ఒప్పుకునేది లేదని అనుచరులను ముందుపెట్టి హడావుడి చేస్తున్నారు. పరిటాల శ్రీరామ్, భూమా అఖిలప్రియకు టాటా నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో పలువురు కీలక నాయకులు పొత్తుతో రాజకీయంగా కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సత్యసాయి జిల్లా ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, అనంతపురంలో ప్రభాకర్ చౌదరి, నగరిలో గాలి భానుప్రకాష్, తిరుపతిలో సుగుణమ్మ, శ్రీకాళహస్తిలో బొజ్జల సుదీర్‌రెడ్డి, రాజంపేటలో బత్యాల చెంగల్రాయుడు, జమ్మలమడుగులో భూపే‹Ùరెడ్డి వంటి నేతలు పోటీ నుంచి తప్పుకోక తప్పదంటున్నారు. పొత్తులో బీజేపీ విశాఖ, విజయవాడ, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట పార్లమెంట్ సీట్లు ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖ నుంచి గత ఎన్నికల్లో లోకేశ్ తోడల్లుడు భరత్ పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అక్కడి నుంచి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో ఆ సీటు బీజేపీకి పోతే ఆయన భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. విజయవాడ సీటును సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని కాదని ఆయన సోదరుడు కేశినేని చిన్నికి ఇస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తులో అక్కడి నుంచి బీజేపీ తరఫున సుజనా చౌదరి పోటీ చేయాలని చూస్తున్నారు. దీంతో కేశినేని చిన్నికి సీటు పోయినట్లేనని భావిస్తున్నారు. జనసేన కోరుతున్న నియోజకవర్గాలు ♦ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పలాస ♦ ఉమ్మడి విజయనగరం జిల్లా: విజయనగరం, నెల్లిమర్ల. ♦ ఉమ్మడి విశాఖ పట్నం జిల్లా: పెందుర్తి, యలమంచిలి, చోడవరం, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం ఉత్తరం, భీమిలి, అనకాపల్లి, గాజువాక. ♦ ఉమ్మడి తూర్పు గోదావరి: పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ముమ్మడివరం, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొత్తపేట, అమలాపురం, రామచంద్రాపురం, రాజోలు, పి.గన్నవరం. ♦ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా: నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, పోలవరం, ఆచంట. ♦ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా: విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, అవనిగడ్డ, పెడన, నూజివీడు, మచిలీపట్నం, కైకలూరు, పెనమలూరు, తెనాలి, గుంటూరు వెస్ట్, పెదకూరపాడు, తాడికొండ, పొన్నూరు, వేమూరు, గుంటూరు తూర్పు. ♦ ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలు : దర్శి, గిద్దలూరు, నెల్లూరు సిటీ, కోవూరు, కావలి, తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, నగరి, ఆళ్లగడ్డ, నంద్యాల, గుంతకల్లు, బద్వేలు, రైల్వే కోడూరు, రాజంపేట, పుట్టపర్తి, ధర్మవరం. గోదావరి జిల్లాల్లో సీనియర్ల సీట్లు గల్లంతే గోదావరి జిల్లాల్లోనూ చాలా మంది ముఖ్య నాయకుల మెడపై కత్తి వేలాడుతోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గొల్లపల్లి సూర్యారావు, తోట సీతారామలక్ష్మి, కేఎస్ జవహర్, ఎస్వీఎస్ వర్మ వంటి వారు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోనున్నారు. బుచ్చయ్యచౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాబట్టి తన సీటు ఉంటుందని చెప్పుకుంటున్నా దానికి గ్యారంటీ లేదు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు సీటు ఇప్పటికే ఎగిరి పోయింది. రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి భీమవరం సీటును నిరాకరిస్తుండడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం సీటు జనసేనకు పోతుండడంతో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ఇప్పటికే తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. వీరు కాకుండా నర్సాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, కాకినాడ వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ పిల్లి అనంతక్ష్మి, ఐతాబత్తుల ఆనందరావు, బూరుగుపల్లి శేషారావు, గన్ని వీరాంజనేయులు వంటి నేతలకు టికెట్లు గల్లంతవనున్నాయి. -
రాహుల్ వయనాడ్ సీటును వదులుతారా? సీపీఐకి ఏం కావాలి?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో న్యాయ యాత్ర చేపడుతున్నారు. ఇదిలావుంటే మమతా బెనర్జీ, నితీష్ కుమార్ల తర్వాత వామపక్షాలు కూడా కాంగ్రెస్‌కు పట్టం కట్టాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌కు సవాళ్లు పెరుగుతున్నాయి. కేరళలోని రాహుల్ గాంధీ స్థానమైన వయనాడ్‌పై సీపీఐ తన వాదనలు వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఈ సీటును వదులుకునే పరిస్థితి లేదని చెబుతున్నప్పటికీ, సంకీర్ణ రాజకీయాల కారణంగా రాహుల్ ఈ సీటును వదిలిపెట్టే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. సీపీఐ చూపు ఇప్పుడు రాహుల్‌కు చెందిన వయనాడ్ సీటుపై పడింది. వయనాడ్ ఎప్పటి నుంచో లెఫ్ట్ సీటు అని, కాబట్టి రాహుల్ నిజంగా బీజేపీని సవాలు చేయాలనుకుంటే ఉత్తర భారతదేశంలోని ఏదైనా స్థానం నుండి పోటీ చేయాలని సీపీఐ చెబుతోంది. కాగా సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం మాట్లాడుతూ రాహుల్ స్థాయి వ్యక్తులు వాయనాడ్‌ను ఎన్నుకునేందుకు బదులుగా ఉత్తరాదితో పోరాడాలి. ఉత్తరాదిలో బీజేపీతో ప్రధాన పోరు ఉంది. అక్కడ ఎక్కువ సీట్లు ఉన్నాయి. అయితే ఈ విషయంలో కాంగ్రెస్‌లో కాన్ఫిడెన్స్ లేదని అనిపిస్తున్నదని పేర్కొన్నారు. అయితే రాహుల్‌కి వయనాడ్ సీటు సేఫ్ అనే వాదన వినిపిస్తుంటుంది. 2019లో రాహుల్ వయనాడ్‌లో సీపీఎం అభ్యర్థిని నాలుగు లక్షలకు పైగా ఓట్లతో ఓడించారు. అయితే అమేథీలో ఓడిపోయారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా రాహుల్‌కు మద్దతు నివ్వాలని కాంగ్రెస్ వామపక్షాలను అభ్యర్థిస్తోంది. సీపీఐ, సీపీఎం తదితర వామపక్షాలు రాహుల్‌కు మద్దతివ్వాలని తాము కోరుతున్నామని కాంగ్రెస్ ఎంపీ కె.సురేష్ అన్నారు. కేరళ ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారని, రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయాలని కేరళ ప్రజలు, కార్యకర్తలు కోరుకుంటున్నారని కూడా సురేష్ పేర్కొన్నారు. అయితే వయనాడ్ సీటు విషయంలో రెండు పార్టీలు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇండియా కూటమికి చెందిన ఈ రెండు పక్షాలు వయనాడ్ సీటు విషయంలో తమ వాదనలపై గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. -
YSRCP: సరికొత్త సామాజిక విప్లవం..
ఏపార్టీ అయినా కానీ బాసూ.. అక్కడ మాత్రం ఆ కులానికే సీట్ ఇవ్వాలి.. ఎవరేమనుకున్నా కానీ ఈ ఎంపీ, ఎమ్మెల్యే సీట్ మాత్రం వాళ్ళకే ఇస్తారు. అయినా కోట్లు లేకుండా టిక్కట్ ఎలా దక్కుతుంది గురూ.. డబ్బుల్లేకుండా ఎలా గెలుస్తారు? ఇవీ గత కొన్నేళ్ళక్రితం వరకూ ప్రజల్లో ఉన్న అభిప్రాయం.. కానీ, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సరికొత్తగా సామాజిక విప్లవానికి నాంది పలికారు. ఇన్నాళ్లూ ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు పోగా మిగిలిన జనరల్ సీట్లలో ఆ ఎంపీ సీటు ఆ కులానిది.. ఈ ఎమ్మెల్యే సీటు ఆ వర్గానిది అంటూ అనధికారిక రిజర్వేషన్లు ఉండేవి. అంటే ఆ ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు ఏ పార్టీ వాళ్ళయినా ఫలానా కులానికి ఇవ్వాలన్నది ఒక అలిఖిత నిబంధన.. కొనసాగుతూ వస్తోంది. కానీ, సీఎం జగన్ ఆ నిబంధనల సంకెళ్లు తెంచేసి.. ఎస్సీ, ఎస్టీ సీట్లు మినహా మిగతా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు సరికొత్త ఫార్ములాను రూపొందించారు. అగ్రకులాలు అంటే రెడ్డి, కమ్మ.. కాపు.. క్షత్రియ నాయకులు ఏలిన స్థానాల్లో సైతం ఇప్పుడు బీసీ అభ్యర్థులకు స్థానం కల్పిస్తూ సరికొత్త సామజిక విప్లవానికి ముఖ్యమంత్రి జగన్ బీజం వేశారు. నెల్లూరు సిటీ స్థానాన్ని గతంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా ముస్లింలకు ఇవ్వడం ద్వారా.. అక్కడ ఆ వర్గాన్ని దగ్గర చేసుకున్నారు. నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం మొదటి నుంచీ క్షత్రియులు లేదా కాపులకు రిజర్వ్ చేయబడిన సెగ్మెంట్. కృష్ణంరాజు.. చేగొండి హరిరామజోగయ్య.. భూపతిరాజు విజయకుమార్ రాజు వంటి పెద్ద నాయకులు ఎంపీగా గెలిచిన చోటు అది. దానికితోడు భారీగా ఖర్చు కూడా పెట్టగలిగే వాళ్ళు అక్కడ పోటీ చేస్తారు. ఆ ప్రాంతానికి ఉన్న పొటెన్సీ అలాంటిది. అలాంటి నర్సాపురం ఎంపీగా బీసీ శెట్టిబలిజ కులానికి చెందిన సాధారణ అడ్వకేట్ ఉమాబాలకు కేటాయించి సీఎం జగన్ ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే ఏలూరు.. కాకినాడ.. శ్రీకాకుళం.. విజయనగరం.. నర్సరావుపేట, అనంతపురం.. హిందూపురం.. కర్నూల్.. విశాఖ వంటి ఎంపీ స్థానాలు బీసీలకు కేటాయించారు. తద్వారా ఆయా నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఓటర్లుగానే ఉంటూ వస్తున్నా కులాలకు నాయకత్వాన్ని అప్పగించే సరికొత్త విధానానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాటలు వేస్తున్నారు. అయితే, ఈ నిర్ణయాల పట్ల కొందరు పుల్లవిరుపు మాటలు, వ్యంగ్యపు కామెంట్లు చేస్తున్నారు. అనామకులనుకున్నవాళ్ళే అసామాన్యులయ్యారు.. వీళ్ళు ఎంపీలా?, వీళ్ళు ఎమ్మెల్యేల అంటూ అప్పట్లో చాలామంది మీద ఇలాంటి కామెంట్స్ వినిపించాయి. కానీ, ఆ ఫలితాలు చూసాక వాళ్ళే వారెవ్వా ఇదీ జగనన్న స్కెచ్ అన్నారు.. ఉదాహరణకు.. # పార్వతీపురం(ఎస్టీ) నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రిగా చేసిన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తపల్లి గీత, గొట్టేటి మాధవి అనే సాధారణ కార్యకర్తల చేతిలో రెండు సార్లు ఓడిపోయారు # కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనే సీనియర్ నేత అనామకుడైన సంజీవ్ కుమార్ చేతిలో ఓడిపోయారు # రాయపాటి సాంబశివరావు అనే సీనియర్ నాయకుడు.. లావు కృష్ణదేవరాయలు అనే యువకుడి చేతిలో గుంటూరులో ఓటమి చవిచూశారు # సినీ నటుడు.. డబ్బున్న నాయకుడు అయినా మురళీమోహన్ కోడలు మాగంటి రూప కాస్తా రాజమండ్రిలో కొత్తవాడైన మార్గాని భరత్ చేతిలో ఓడిపోయారు. # విజయనగరం రాజకుటుంబీకుడు పలుమార్లు రాష్ట్ర.. కేంద్ర మంత్రిగా చేసిన అశోక్ గజపతిరాజు కాస్తా కొత్తవాడైన బెల్లాన చంద్రశేఖర్ చేతిలో మట్టి కరిచారు. ఇలా చూసుకుంటూ పొతే జగనన్న వేసిన ప్లాన్ ఎంతోమంది సాధారణ కార్యకర్తలను రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులుగా మార్చింది. -సిమ్మాదిరప్పన్న -
India alliance: సీట్ల సర్దుబాటు కింద 11 స్థానాలిస్తాం
లక్నో: విపక్షాల ‘ఇండియా’ కూటమి భాగస్వామి పారీ్టగా భావిస్తూ 11 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌కు ఇస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ శనివారం ప్రకటించింది. ఈ కేటాయింపుతో విపక్షాల కూటమిలో సీట్ల సర్దుబాటు పర్వానికి చక్కటి శుభారంభం లభించిందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ‘ ఈ పంథా గెలుపు సమీకరణాలతో మరింత ముందుకెళ్తుంది. వెనుకబడిన, దళిత, అల్పసంఖ్యాల వర్గాల ఫార్ములాతో ఇండియా కూటమి చరిత్ర సృష్టించనుంది’’ అని అఖిలేశ్ అభిలíÙంచారు. ‘‘ కాంగ్రెస్‌కు ఇస్తామన్న సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండబోదు’’ అని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి స్పష్టంచేశారు. ‘‘ యూపీలో సీట్ల సర్దుబాటులో భాగంగా మేం కాంగ్రెస్‌కు 11, రా్రïÙ్టయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ)కి ఏడు సీట్లు ఇస్తాం. మిగతా మొత్తం 62 స్థానాల్లో మేమే పోటీచేస్తాం’’ అని వివరించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ స్పందించారు. ‘‘ మిత్ర పక్షం ఎస్పీ చేసిన ప్రతిపాదనపై తుది నిర్ణయం కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని కమిటీ తీసుకోనుంది’ అని అన్నారు. -
‘ఇండియా’లో పొత్తు చిచ్చు!
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఇతర విపక్షాలతో కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌కు సీట్ల సర్దుబాటు కత్తిమీద సాములా మారుతోంది. సీట్ల పంపకాల విషయంలో సొంత పార్టీ నేతల నుంచే భిన్నాభిప్రాయాలు ఒకవైపు, భాగస్వామ్య పక్షాలు అధిక సీట్లు డిమాండ్ చేస్తుండటం మరోవైపు తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, పశి్చమబెంగాల్, బిహార్, జమ్మూ కశీ్మర్లలో సీట్ల పంపకాల అంశం కాంగ్రెస్‌కు పరీక్ష పెడుతోంది...! బెంగాల్లో బెంబేలు... సీట్ల సర్దుబాటుపై ముందు సొంత పార్టీ నేతల నుంచి కాంగ్రెస్ అభిప్రాయ సేకరణ చేస్తోంది. దీనిపై ముకుల్ వాస్నిక్, అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘెల్, సల్మాన్ ఖుర్షీద్, మోహన్ ప్రకాశ్‌లతో ఏర్పాటైన ఐదుగురు సభ్యుల ఏఐసీసీ బృందం రాష్ట్రాలవారీగా నేతలతో భేటీ అవుతోంది. ముఖ్యంగా 10 రాష్ట్రాల్లో కూటమి పక్షాలతో సీట్ల పంపకాలపై వారి అభిప్రాయాలు స్వీకరిస్తోంది. పశి్చమబెంగాల్లో 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా కాంగ్రెస్‌కు రెండే ఎంపీ సీట్లిస్తామని అధికార తృణముల్ కాంగ్రెస్ ఇప్పటికే తేల్చిచెప్పింది. మిగతా 40 చోట్ల తామే పోటీ చేస్తామంటోంది. ఈ మాత్రానికి తృణముల్‌తో పొత్తెందుకని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రశి్నస్తున్నారు. వామపక్షాలతో పొత్తు పెట్టుకొని ఎక్కువ సీట్లలో కాంగ్రెసే పోటీ చేయాలంటున్నారు. అసలు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా రాష్ట్రంలో అన్ని సీట్లలోనూ తామే పోటీ చేయాలని తృణమూల్ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భావిస్తున్నట్టు సమాచారం. ఢిల్లీలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌దీ ఇదే అభిప్రాయమని కూడా చెబుతున్నారు! బిహార్‌లో పీటముడి! బిహార్‌లోని 40 లోక్‌సభ స్థానాల్లో 2019లో ఆర్జేడీ సహా చిన్నా చితక పారీ్టలతో కాంగ్రెస్ జత కట్టి పోటీ చేసింది. ఈసారి జేడీ(యూ) కూడా జత కూడుతుండటంతో సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయి. 2019లో ఆర్జేడీ 20, కాంగ్రెస్ 9, ఆర్ఎల్ఎస్పీ 5, హిందుస్థానీ అవామ్ మోర్చా (హమ్), వీఐపీ చెరో మూడు చోట్ల పోటీ చేశాయి. కాంగ్రెస్ కేవలం ఒక సీటు గెలవగా, అప్పట్లో బీజేపీతో పొత్తున్న జేడీ(యూ) 16 సీట్లు నెగ్గింది! బీజేపీ 17, లోక్ జనశక్తి పార్టీ 6 సీట్లు గెలిచాయి. ఈసారి కాంగ్రెస్‌కు భాగంగా కాంగ్రెస్‌కు 6 సీట్లే ఇస్తామని జేడీ(యూ) చీఫ్ నితీశ్‌కుమార్ అంటుండటం పార్టీ పెద్దలకు మింగుడు పడటం లేదు! జేడీ(యూ) 23, ఆర్జేడీ 9 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నాయి. మహారాష్ట్రలో ఐదు సీట్లే! 48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్రలోనూ శివసేన (ఉధ్దవ్) పార్టీ ఏకంగా 23, మరో మిత్రపక్షం ఎన్సీపీ 20 సీట్లు కోరుతున్నాయి. అదే జరిగితే కాంగ్రెస్‌కు దక్కేవి ఐదే సీట్లు! ఇది ఆ మూడు పారీ్టలతో కూడిన ఎంవీఏ కూటమిలో చిచ్చు రాజేస్తోంది. ఇక ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీతో పొత్తు మాటెత్తితేనే స్థానిక కాంగ్రెస్ భగ్గుమంటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఆప్‌తో పోరాడుతున్న తమకు పొత్తుల పేరిట అన్యాయం చేయొద్దంటున్నారు. కశీ్మర్లో కూడా మెజార్టీ సీట్లలో కాంగ్రెసే పోటీ చేయాలని, నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఎక్కువ సీట్లు వద్దని అక్కడి నేతలంటున్నారు. జనవరి మూడో వారానికల్లా సీట్ల సర్దుబాటును పూర్తి చేయాలని భావిస్తున్న కాంగ్రెస్‌ను ఈ సమస్యలు చీకాకు పరుస్తున్నాయి. -
‘సమోసాకు డబ్బుల్లేక.. చాయ్‌తో సరిపెట్టారు’
న్యూఢిల్లీ: ఢిల్లీలో మంగళవారం విపక్షాల ‘ఇండియా’ కూటమి భేటీలో ప్రస్తావనకు వచ్చిన కీలకాంశాలపై ఓ వైపు చర్చ జరుగుతుంటే అక్కడ సమోసాలు ఇవ్వలేదంటూ జేడీ(యూ) సీనియర్ నేత సునీల్ కుమార్ పింటూ కాంగ్రెస్‌నుద్దేశిస్తూ చులకనగా మాట్లాడారు. డబ్బుల్లేక కాంగ్రెస్ కనీసం సమోసాలు కూడా వడ్డించలేదని వ్యాఖ్యానించారు. ‘‘ నిన్నటి సమావేశానికి భాగస్వామ్య పార్టీల అగ్రనేతలంతా విచ్చేశారు. సీట్ల పంపకాలపై చర్చించాలనుకున్నా అది టీ, బిస్కెట్లకే పరిమితం అయింది. ఎందుకంటే కాంగ్రెస్ దగ్గర నిధులు నిండుకున్నాయి. రూ.138, రూ.1,380, రూ.13,800 ఇలా చిన్న చిన్న మొత్తాలను ఆ పార్టీ విరాళంగా సేకరిస్తోంది. ఇంకా విరాళాలు రావాల్సి ఉంది. అప్పటిదాకా సమోసాలుండవు. టీ, బిస్కెట్లతో సరిపెట్టుకోవాలి. సమోసాలు లేకుండా ఎలాంటి తీవ్రమైన చర్చలు జరగబోవు’’ అని సునీల్ పింటూ వెటకారంగా అన్నారు. సంబంధిత వీడియోను బీజేపీ నేత అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేశారు. JDU सांसद सुनील कुमार पिंटू का बड़ा बयान। I.N.D.I. अलायंस की बैठक को बताया टांय-टांय फिस्स। pic.twitter.com/saHVMze4bJ — News18 Bihar (@News18Bihar) December 20, 2023 Video Credits:News18 Bihar ఆయ్.. హిందీ తెలియాల్సిందే విపక్షాల కూటమి సమావేశంలో నితీశ్ కుమార్ ప్రసంగిస్తుండగా డీఎంకే నేత టీఆర్ బాలు బాగా ఇబ్బంది పడ్డారు. హిందీరాని బాలుకు నితీశ్ హిందీ ప్రసంగం అర్ధంకాలేదు. అర్ధంచేసుకునేందుకు తన పక్కనే కూర్చున్న రా్రïÙ్టయ జనతాదళ్ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝాను సాయంకోరారు. ‘మీ ప్రసంగాన్ని ఆయనకు అర్ధమయ్యేలా అనువాదం చేయొచ్చా?’ అని నితీశ్‌ను ఝా కోరారు. దీంతో ఆగ్రహించిన నితీశ్.. ‘ హిందీ మన జాతీయ భాష. అందుకే మన దేశాన్ని హిందుస్తాన్‌గా పిలుచుకుంటాం. హిందీ అందరి భాష. అలాంటి హిందీ తెలియాల్సిందే. నేర్చుకుని అర్ధంచేసుకోవాలి. మీరు అనువాదాలు ఏవీ చేయకండి’’ అని ఝాను వారించారు. -
ఏ ర్యాంక్‌కు ఎక్కడ మెడికల్ సీటొస్తుంది?
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ–2023 ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది రాష్ట్రంలో 68,578 మంది విద్యార్థులు నీట్ రాయగా 42,836 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఏ ర్యాంక్ వస్తుంది? గత ఏడాది ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో పోల్చుకొని, ఈసారి ఏ కాలేజిలో సీటు వచ్చే అవకాశాలున్నాయో అంచనా వేసుకొంటున్నారు. కాలేజీల ప్రాధాన్యతక్రమం ఏ విధంగా ఉండాలో కసరత్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు, రెండు మైనారిటీ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఉన్నాయి. వీటిలో 5,360 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో 2,185 సీట్లు 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించినవి. ఈ విద్యా సంవత్సరం నుంచి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలల్లో కొత్తగా నిర్మించిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభంకానున్నాయి. వీటిలో ఒక్కో కాలేజిలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ఇది విద్యార్థులకు వరమే. వీటితో కలుపుకొంటే ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు 2,935కు పెరుగుతాయి. వీటిలో 15 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలినవి రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. మరోవైపు గత ఏడాది నుంచి బీ కేటగిరిలో 85 శాతం సీట్లలో మన విద్యార్థులకే ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఆంధ్ర వైద్య కళాశాలలో ఇలా సాధారణంగా రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసించే విద్యార్థుల మొదటి చాయిస్ ఆంధ్ర వైద్య కళాశాలే. ఈ కాలేజిలో సీటు రావడమే అదృష్టంగా భావిస్తారు. ఈ కాలేజిలో గత ఏడాది (2022–23) ఎస్టీ విభాగంలో 456 స్కోర్‌తో 120176 ర్యాంక్ సాధించిన విద్యార్థికి చివరి సీటు వచ్చింది. ఎస్సీ విభాగంలో 76695 ర్యాంక్, బీసీ–ఏలో 25137, బీసీ–బిలో 31874, బీసీ–సిలో 26291, బీసీ–డిలో 17632, బీసీ–ఈలో 68801, ఓసీ కేటగిరీలో 15652, ఈడబ్ల్యూఎస్‌లో 19907 ర్యాంక్ వారికి చివరి సీట్లు వచ్చాయి. దాని తర్వాతి స్థానాల్లో గుంటూరు, కర్నూలు, కాకినాడ తదితర ప్రభుత్వ కళాశాలలు ఉంటాయి. గుంటూరు వైద్య కళాశాలలో ఓసీ విభాగంలో 22531, ఈడబ్ల్యూఎస్‌లో 26162, బీసీ–ఎలో 46529, బీసీ–బిలో 36192, బీసీ–సిలో 42535, బీసీ–డిలో 32830, బీసీ–ఈలో 65595, ఎస్సీలో 94801, ఎస్టీ విభాగంలో 132580 ర్యాంక్ వరకూ సీట్లు వచ్చాయి. కర్నూలు వైద్య కళాశాలలో ఓసీ కేటగిరీలో 20419, బీసీ–ఎలో 46268, బీసీ–బిలో 34676, బీసీ–సిలో 32239, బీసీ–డిలో 45304, బీసీ–ఈలో 36371, ఈడబ్ల్యూఎస్‌లో 26954, ఎస్సీలో 91270, ఎస్టీ విభాగంలో 115105 ర్యాంక్ వరకు విద్యార్థులు సీట్లు సాధించారు. కాకినాడ రంగరాయలో ఓసీ విభాగంలో 25622, బీసీ–ఎలో 48837, బీసీ–బిలో 47893, బీసీ–సిలో 44104, బీసీ–డిలో 31589, బీసీ–ఈలో 89637, ఈడబ్ల్యూఎస్‌లో 31333, ఎస్సీలో 97913, ఎస్టీ కేటగిరీలో 143288 ర్యాంక్‌ల వరకూ సీట్లు లభించాయి. -
55,000 వరకు నేషనల్ లెవల్
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు కోసం ఈ నెల 15 వరకు జరిగిన జేఈఈ మెయిన్ ఎంట్రన్స్ ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో తమకు ఏ ర్యాంకు వస్తుంది? ఎక్కడ, ఏ బ్రాంచీలో సీటు వస్తుందనే ఉత్సుకత విద్యార్థుల్లో నెలకొంది. గతేడాది జేఈఈ అంచనాలు, ఈసారి పేపర్ విధానాన్ని పరిశీలిస్తే జేఈఈ మెయిన్‌లో 55 వేల వరకు ర్యాంకు వచ్చిన వాళ్లకు కూడా జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏదో ఒక కోర్సులో, ఎక్కడో ఒకచోట సీటు ఖాయమని తెలుస్తోంది. ఈడబ్ల్యూఎస్‌కు 60 వేలు, ఓబీసీలకు 65 వేలు, ఎస్సీలకు 1.20 లక్షలు, ఎస్టీలకు 3 లక్షలు, పీడబ్ల్యూడీలకు 8 లక్షల ర్యాంకు వచ్చినా జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు పొందే వీలుంది. అయితే కంప్యూటర్ సైన్స్, నచ్చిన కాలేజీలో సీటు కోసం మాత్రం పోటీ ఎక్కువే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వరంగల్, సూర్తాల్, తిరుచాపల్లి వంటి ఎన్ఐటీ కాలేజీల్లో సీటు రావాలంటే జేఈఈ మెయిన్‌లో 5 వేలలోపు ర్యాంకు వరకే ఆశలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. 30 నుంచి దరఖాస్తులకు అవకాశం... ఈ నెల 30 నుంచి జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఉమ్మడి ప్రవేశాల అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ నిర్వహిస్తుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. ఈసారి జేఈఈ మెయిన్ ప్రవేశపరీక్షను దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది రాశారు. వారిలో 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించనున్నారు. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారు ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే కాలేజీలతోపాటు రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో బీ–కేటగిరీ సీట్లలో ప్రాధాన్యం పొందుతారు. దేశవ్యాప్తంగా ఈసారి 10 వేల ఇంజనీరింగ్ సీట్లు పెరిగే వీలుంది. కొత్త కోర్సులకు అనుమతించడం, కొన్ని కాలేజీల్లో సీట్లు పెంచడమే దీనికి కారణం. ఐఐటీల్లో 16,053 సీట్లు, ఎన్ఐటీల్లో 24 వేలు, ట్రిపుల్ ఐటీల్లో 16 వేలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో 6,078 సీట్లున్నాయి. గతేడాది పర్సంటైల్‌ను పరిశీలిస్తే జనరల్ కేటగిరీలో 88.41 పర్సంటేల్ వస్తే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపికయ్యారు. ఓబీసీ ఎన్‌సీఎల్‌కు 67.00, ఈడబ్ల్యూఎస్‌కు 63.11, ఎస్సీలకు 43.08, ఎస్టీలకు 26.77, పీడబ్ల్యూడీలకు 0.003 పర్సంటేల్తో అడ్వాన్స్డ్ కటాఫ్ ఖరారైంది. ఈసారి కూడా పోటీని బట్టి కటాఫ్ గతేడాదికి కొంచెం అటుఇటుగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆలోచించి అడుగేయాలి.. జేఈఈ మెయిన్‌లో టాప్ పర్సంటైల్ వచ్చిన వారు సాధారణంగా అడ్వాన్స్‌డ్‌కు వెళ్తారు. మెయిన్‌లో అర్హత పొంది, 55 వేల ర్యాంకు వరకు వస్తే మాత్రం ఎన్ఐటీ కాలేజీల్లో సీటు పొందే వీలుంది. ర్యాంకు ఎంతో తెలిశాక ఆచితూచి అడుగేయాలి. కాలేజీతో ప్రాధాన్యం లేదనుకుంటే ఇప్పటివరకు వస్తున్న ర్యాంకులను బట్టి ముందుకెళ్లాలి. కోరుకున్న కోర్సు, కాలేజీనే కావాలనుకుంటే వచ్చిన ర్యాంకును బట్టి సీటు వస్తుందో లేదో చూసుకోవాలి. లేకుంటే లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకొని వచ్చే ఏడాది మంచి ర్యాంకు సాధించేందుకు ప్రయత్నించడమే మంచిది. – ఎంఎన్ రావు, జేఈఈ మెయిన్ బోధన నిపుణుడు -
ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ తుది దశ సీట్ల కేటాయింపు గురువారం పూర్తయింది. మొత్తం 83 శాతం సీట్లు కేటాయించినట్టు సాంకేతిక విద్యావిభాగం ప్రకటించింది. ఐసెట్‌లో మొత్తం 61, 613మంది అర్హత సాధించారు. 19,666 మంది 3,60,435 ఆప్షన్లు ఇచ్చారు. ఎంబీఏలో 24,278 సీట్లు, ఎంసీఏలో 2865 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంబీఏలో 21,983 సీట్లు కేటాయించగా, ఇంకా 2295 సీట్లు మిగిలిపోయాయి. ఎంసీఏలో 2865 (వంద శాతం) సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 31లోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సాంకేతిక విద్యావిభాగం సూచించింది. -
జేఈఈ టాపర్స్ దృష్టి... ఐఐటీ బాంబే వైపే
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), బాంబే హవా కొనసాగుతోంది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్–2022లో టాప్–100 ర్యాంకర్లలో 93 మంది ఐఐటీ బాంబేను మొదటి ప్రాథామ్యంగా ఎంపిక చేసుకున్నారు. వీరిలో 69 మంది బాంబే ఐఐటీలో సీటు సాధించారు. ఇందులో 68 మంది మొదటి విడత కౌన్సిలింగ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సును ప్రథమ ప్రాథామ్యంగా ఎంపిక చేసుకోగా ఒక్కరు ఇంజినీరింగ్ ఫిజిక్స్‌ను తీసుకున్నారు. టాప్–100 ర్యాంకర్లలో 28 మంది ఐఐటీ ఢిల్లీలోనూ ముగ్గురు ఐఐటీ మద్రాస్‌లోనూ జాయినయ్యారు. జాయింట్ సీట్ ఎలొకేషన్ అథారిటీ ఈ వివరాలను అందించింది. గత ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో టాప్–100 ర్యాంకర్లలో 62 మంది, 2020లో 58 ఐఐటీ బాంబేలో ప్రవేశం పొందగా 2019లో టాప్–100 ర్యాంకర్లలో 62 మంది, 2018లో 59 మంది ఇక్కడే సీటు సాధించారు. టాప్–500 ర్యాంకర్లకూ బాంబే ఐఐటీనే మొదటి ప్రాథామ్యంగా ఉంది. టాప్–500 ర్యాంకర్లలో 173 మంది ఇక్కడ, 127 మంది ఢిల్లీ ఐఐటీలో స్థానం సంపాదించారు. టాప్–500 ర్యాంకర్లలో మద్రాస్, ఖరగ్‌పూర్, కాన్పూర్ ఐఐటీల్లో సీట్లు సాధించిన వారి సంఖ్య 50 మంది లోపే. -
మహిళా ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లలో వారికోసం..
భారతీయ రైల్వే.. ప్రతీ రోజు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తూ ప్రజలతో విడదీయరాని బంధం ఏర్పరుచుకుంది. తక్కువ ఖర్చుతో ప్రయాణమే గాకా వివిధ సేవలను ప్యాసింజర్లకు అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం మహిళల కోసం రైల్వేశాఖ పెద్ద ప్రకటనే చేసింది. మహిళలు ఇకపై రైలులో సీటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ తెలిపింది. బస్సు, మెట్రో తరహాలో ఇకపై భారతీయ రైళ్లలో మహిళలకు ప్రత్యేక సీట్లను రిజర్వ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మహిళలకు ప్రత్యేకంగా సీటు రిజర్వ్ సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మహిళల కోసం.. భారతీయ రైల్వే ప్రత్యేక బెర్త్‌లను కేటాయించనున్నారు. దీంతో పాటు మహిళల భద్రతకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనిపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రైళ్లలో మహిళల సౌకర్యార్థం రిజర్వ్ బెర్త్‌ల ఏర్పాటుతో పాటు అనేక సౌకర్యాలను ప్రారంభించినట్లు తెలిపారు. స్లీపర్ క్లాస్‌లో ఆరు బెర్త్‌లు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాస్‌లోని మహిళలకు ఆరు బెర్త్‌లను రిజర్వ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. రాజధాని ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, దురంతో సహా పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో థర్డ్ ఏసీ (3ఏసీ క్లాస్)లో ఆరు బెర్త్‌లు మహిళల కోసం రిజర్వ్ చేస్తున్నట్లు చెప్పారు. రైలులోని ఒక్కో స్లీపర్ కోచ్‌లో ఆరు లోయర్ బెర్త్‌లు, 3 టైర్ ఏసీ కోచ్‌లో నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్త్‌లు, 2 టైర్ ఏసీ సీనియర్ సిటిజన్లలో మూడు నుంచి నాలుగు లోయర్ బెర్త్‌లు, 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు, గర్భిణీ స్త్రీలకు రిజర్వు చేస్తున్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), జీఆర్పీ, జిల్లా పోలీసులతో భద్రత కల్పిస్తారు. చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు! -
ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ వైపే..
సాక్షి, హైదరాబాద్: ఈసెట్ ర్యాంకు ఆధారంగా ఇంజనీరింగ్ సెకండియర్‌లో 89 శాతం మందికి సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. తొలిదశ సీట్ల కేటాయింపు పూర్తి చేసినట్టు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈసెట్ కౌన్సెలింగ్‌లోనూ కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులనే విద్యార్థులు ఎక్కువగా ఎంచుకున్నట్టు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 19,558 మంది ఈసెట్‌లో అర్హత సాధించగా తొలి దశ కౌన్సెలింగ్‌కు 13,429 మంది ఆప్షన్లు ఇచ్చినట్టు చెప్పారు. రాష్ట్రంలో రెండో ఏడాదిలో ప్రవేశానికి 11,260 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా, 9,968 సీట్లు కేటాయించినట్టు తెలిపారు. ఫార్మసీలో 1,174 సీట్లు అందుబాటులో ఉంటే, 50 సీట్లు కేటాయించామన్నారు. సీట్లు దక్కించుకున్న అభ్య ర్థులు ఈ నెల 22లోగా ఆన్లైన్ చెల్లింపు ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని, వచ్చే నెల 10లోగా అన్ని ధ్రువపత్రాలతో కాలేజీలో నేరుగా రిపోర్టు చేయాలని తెలిపారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీట్లు 19 భర్తీ అయ్యాయి. ఏఐఎంఎల్‌లో 127 సీట్లు ఉంటే, 105 కేటాయించారు. డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సుకు 80 శాతంపైనే ఆప్షన్లు ఇచ్చారు. కంప్యూటర్ సైన్స్‌లో 2,643 సీట్లు ఉంటే, 2470 సీట్లు కేటాయించారు. ఈసీఈలోనూ 2,060 సీట్లకు 1853 భర్తీ అయ్యాయి. ఈఈఈలో 1,096 సీట్లకు 1,066 కేటాయించారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో 886 సీట్లకు 860, సివిల్ ఇంజనీరింగ్‌లో 905 సీట్లకు 900 కేటాయించారు. -
తొలివిడత వదిలేస్తే మలివిడతలో చాన్స్
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ సైన్స్ కోర్సులో పెరగబోయే సీట్లు తొలివిడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై ప్రభావం చూపాయి. చాలా మంది విద్యార్థులు తొలివిడత కౌన్సెలింగ్‌లో ఆయా కోర్సుల్లో సీటు వదిలేస్తే, మలివిడతలో నచ్చిన సీటు వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. కాలేజీల విషయంలోనూ ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు కన్పిస్తోంది. సీట్లు పెరగడంతో మరో కాలేజీలో ఈసారి సీటు వస్తుందనే ఆశ వారిలో కన్పిస్తోంది. అదీకాక ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందినవారు ఎంసెట్ కౌన్సెలింగ్ నుంచి తప్పుకునే వీలుంది. ఈ రకంగానూ కొంత సానుకూల వాతావరణం ఉంటుందని విద్యార్థులు ఆలోచిస్తున్నారు. ఈసారి అదృష్టం పరీక్షిద్దాం రాష్ట్రంలో తొలివిడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు అన్ని రకాల కోర్సులకు కలిపి మొత్తం 71,286 సీట్లు కన్వీనర్ కోటా కింద సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో 60,208 సీట్లు కేటాయించారు. ఈ నెల 13 నాటికి కేవలం 43 వేలమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. 17 వేల మందికి సీట్లు వచ్చినా అది తమకు నచ్చలేదని భావించి రిపోర్టింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇలాంటివారిలో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ, ఆఖరుకు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో సీట్లు ఆశపడుతున్నవారే. తొలి దశలో పెంచిన కంప్యూటర్ సైన్స్ కోర్సు సీట్లు 9,240 అందుబాటులోకి రాలేదు. 25 వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా మెరుగైన కాలేజీ, సీటు కోసం తొలి దశలో వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టారు. కొంతమంది కంప్యూటర్ సైన్స్(సీఎస్సీ)లో సీటు వచ్చినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి కోర్సుల కోసం ఎదురుచూస్తూ మొదటి విడతలో చేరలేదు. ఆప్షన్ల ఎంపికలో సానుకూలత రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 28న మొదలవుతుంది. కొత్తగా 12 వేలకుపైగా సీట్లు పెర గడం, జేఈఈ ర్యాంకర్లు ఈసారి ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పెద్దగా పోటీ పడకపోవడం వల్ల రా ష్ట్రస్థాయి విద్యార్థులకు అవకాశాలు కలిసి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 40 వేలలోపు ర్యాంకు విద్యార్థులు ఆచితూచి ఆప్షన్లు ఇచ్చుకోవడం మంచిదని అంటున్నారు. 5 వేలలోపు ర్యాంకుల్లో ఉన్న విద్యార్థులు ఎక్కువమంది ఈసారి పోటీలో ఉండరని, 10 వేల లోపు ర్యాంకు విద్యార్థుల్లో 50 శాతం మాత్రమే పోటీ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కాబట్టి 40 వేల లోపు ర్యాంకు విద్యార్థులు కోరిన కాలేజీ, సీటు కోసం పోటీపడేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ఆ పై ర్యాంకు విద్యార్థులు కాలేజీ విషయం పక్కన పెట్టినా, కోరుకున్న సీటును ఎక్కడైనా పొందేందుకు ప్రయత్నించి సఫలం కావచ్చని చెబుతున్నారు. -
ట్రిపుల్ ఐటీ.. ట్రబుల్ లేకుండా ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్లో చేరిన విద్యార్థుల్లో చాలా మంది జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు సాధించడంపై దృష్టిపెడతారు. ఆ లక్ష్యంతోనే చివరి వరకూ జేఈఈపై పట్టుకోసం ప్రయత్నిస్తారు. కొందరు సఫలమవుతారు. సాధారణంగా జేఈఈ మెయిన్స్ ర్యాంకు సాధించిన ప్రతీ ఒక్కరూ ఐఐటీ తర్వాత ఎన్ఐటీల్లో సీట్లు కోరుకుంటారు. ఆ తర్వాత ప్రాధాన్యమిచ్చేది ట్రిపుల్ ఐటీ (ఐఐఐటీ)లకే. వీటిల్లో ఎంత వరకు ర్యాంకువారికి సీటొస్తుంది? ఏ బ్రాంచ్‌కు ఎంత ర్యాంకు వరకు ప్రాధాన్యత ఇవ్వొచ్చనే సందేహాలు చాలా మంది విద్యార్థుల్లో ఉంటున్నాయి. ప్రాథమిక ర్యాంకుల అంచనాను ఎన్టీఏ వెల్లడించకపోవడం కూడా విద్యార్థుల గందరగోళానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్నేళ్లుగా ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీ ర్యాంకుల కటాఫ్‌లను గమనిస్తే సులువుగా అవగాహన వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎంత వరకు అవకాశం? దేశవ్యాప్తంగా 11 ట్రిపుల్ ఐటీలు జేఈఈ ర్యాంకు ద్వారా సీట్లు కేటాయిస్తున్నాయి. వీటన్నింటిలో కలిపి మొత్తం 6,146 ఇంజనీరింగ్ సీట్లున్నాయి. బాలికలకు ప్రత్యేకంగా కేటాయించే సూపర్ న్యూమరరీ సీట్లు మరో 305 వరకు ఉంటాయి. మొత్తంగా రిజర్వేషన్లను అనుసరించి సీట్లు కేటాయిస్తారు. గత ఏడాది ఓపెన్ కేటగిరీలో బాలురకు 35వేల ర్యాంకు వరకు, బాలికలకు 40వేల ర్యాంకు వరకు సీట్లు దక్కాయి. ఓబీసీ, నాన్ క్రీమీలేయర్ కేటగిరీలో 60వేల ర్యాంకు వరకు సీఎస్సీలో, 65వేల ర్యాంకు వరకు ఈసీఈలో సీట్లు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 2.5లక్షల ర్యాంకు వరకు ట్రిపుల్ ఐటీల్లో సీట్లు లభించాయి. ఆప్షన్ల ఎంపికే కీలకం జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సెప్టెంబర్ 12 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ సమయంలో ఆప్షన్ల ఎంపికే కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. నిట్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సంస్థల్లో ఏ ర్యాంకు వరకూ సీటు వస్తుందనే అవగాహనతోపాటు ట్రిపుల్ ఐటీల్లో సీటుకు కావాల్సిన ర్యాంకులను తెలుసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఆ ర్యాంకులకు అనుగుణంగా ఆప్షన్లు ఇచ్చుకుంటే.. సులువుగా సీటు పొందే వీలు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. వచ్చిన ర్యాంకుకు తగిన చోట సీటు లభించే ఆప్షన్లను ముందుగా ఎంచుకోవాలని.. లేకుంటే సీటు నష్టపోయే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. తగిన వ్యూహం అవసరం ట్రిపుల్ ఐటీ సీట్లు పొందాలనుకునే వారు ర్యాంకుల ఆధారంగా ఆప్షన్లు ఇవ్వడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. జేఈఈ మెయిన్స్ అర్హులంతా ట్రిపుల్ ఐటీ బరిలో ఉండటం సహజమే. అయితే వచ్చిన ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుందనే అంచనాకు రాగలితే ప్రయోజనకరంగా ఉంటుంది. – ఎంఎన్ రావు, గణిత శాస్త్ర నిపుణుడు -
పాలిటెక్నిక్ కాలేజీల్లో 72.5% సీట్లు భర్తీ
సాక్షి, హైదరాబాద్: టెన్త్ తర్వాత డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన పాలిసెట్–2022 కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 118 పాలిటెక్నిక్ కాలేజీల్లోని దాదాపు 25 బ్రాంచీల్లో 28,562 సీట్ల భర్తీకి చేపట్టిన కౌన్సెలింగ్‌లో 20,709 సీట్లు (72.51%) నిండాయని సెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. 21 ప్రభుత్వ కాలేజీలు, 3 ప్రైవేటు కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 10 నాటికి లాగిన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీటును నిర్ధారించుకొని కాలేజీలో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే సీటు రద్దవుతుందన్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో సోమవారం నుంచి అకడమిక్ సెషన్ ప్రారంభం కానుండగా 16వ తేదీ వరకు ఓరియంటేషన్, ఈ నెల 17 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. 8 బ్రాంచీల్లో సీట్లన్నీ ఫుల్... పాలిటెక్నిక్ కోర్సుల్లో 8 బ్రాంచీల్లో 100% సీట్లు భర్తీ అయ్యాయి. ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, బయో మెడికల్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, కెమికల్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్ బ్రాంచీల్లో సీట్లన్నీ నిండాయి. టెక్స్టైల్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్‌వేర్ టెక్నాలజీ, మెటర్లాజికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో అతితక్కువగా సీట్లు భర్తీ అయ్యాయి. -
1.12 లక్షల మందికి డిగ్రీలో ప్రవేశాలు!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్–2022 తొలివిడత సీట్ల కేటాయింపు పూర్తయింది. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన 1,12,683 మంది విద్యార్థులకు ప్రాధాన్యతాక్రమంలో సీట్లు కేటాయించారు. ఈ మేరకు దోస్త్–2022 కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌తో కలసి శనివారం వివరాలను విడుదల చేశారు. దోస్త్–2022 ఫేజ్–1లో మొత్తం 1,44,300 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 1,18,898 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. 6,215 మంది విద్యార్థులు సరైనవిధంగా ఆప్షన్లు ఇవ్వకపోవడంతో వారికి సీట్లు రాలేదు. కామర్స్, ఆర్ట్స్ గ్రూపుల్లో అధికంగా... దోస్త్–2022 తొలివిడతలో సీట్లు పొందిన 1,12,683 మంది విద్యార్థుల్లో పురుషులు 45,743(40.59%), మహిళలు 66,940(59.41%) ఉన్నారు. అడ్మిషన్లు పొందినవారిలో అత్యధికంగా ఆర్ట్స్, కామర్స్ గ్రూపులవారే ఉన్నారు. సైన్స్ గ్రూప్‌ల అడ్మిషన్లు రెండోస్థానంలో ఉన్నాయి. మీడియాలవారీగా పరిశీలిస్తే ఇంగ్లిష్ మీడియంలో 1,02,418 మంది విద్యార్థులు, తెలుగు మీడియంలో 9,304, ఉర్దూ మీడియంలో 10, హిందీ మీడియంలో 951 మందికి సీట్లు కేటాయించారు. దోస్త్–2022లో మొత్తం 978 కాలేజీల్లో 510 కోర్సులున్నాయి. మొత్తం 4,20,318 సీట్లలో తొలివిడత 1,12,683 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు, ఇంజనీరింగ్, మెడికల్ సీట్లకు కౌన్సెలింగ్ పూర్తయ్యాక డిగ్రీ ప్రవేశాల వేగం పుంజుకుంటుందని నవీన్ మిట్టల్ తెలిపారు. ఇప్పటివరకు 51 కాలేజీల్లో ఎలాంటి ప్రవేశాలు జరగలేదు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే సీటు డిగ్రీ కోర్సుల్లో సీట్లు పొందిన విద్యార్థులు లాగిన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియతో సీటు రిజర్వ్ చేసుకోవాలి. ప్రభుత్వకాలేజీల్లో సీటుపొంది ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉన్న విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలతో ఉచితంగా, మిగతా విద్యార్థులు రూ.500 లేదా రూ.1,000 చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్‌తో సీటు రిజర్వ్ చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్‌లో విఫలమైతే సీటు రద్దవుతుంది. దోస్త్–2022 ఫేజ్–2 రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 7 నుంచి 22వ తేదీ వరకు కొనసాగుతుంది. -
సర్కారీ పాలిటెక్నిక్కే సై
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఎక్కువగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలనే ఎంచుకున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీలు 55 ఉండగా, వీటిల్లో 91.69 శాతం సీట్లు కేటాయించారు. 63 ప్రైవేటు కాలేజీల్లో కేవలం ఐదింటికి మాత్రమే విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. దీంతో 60.34 శాతం మాత్రమే సీట్లు కేటాయించారు. టెన్త్ తర్వాత పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన పాలిసెట్‌కు 79,051 మంది అర్హత సాధించారు. తొలిదశ కౌన్సెలింగ్‌లో 25,146 మంది 5,96,613 ఆప్షన్లు ఇచ్చారు. వీటిని పరిశీలించిన పాలిసెట్ విభాగం గురువారం మొదటి విడత సీట్లను కేటాయించింది. డిప్లొమా దశలోనూ కంప్యూటర్ కోర్సుల వైపే.. పాలిటెక్నిక్‌లో దాదాపు 25 బ్రాంచీలున్నాయి. వీటిల్లో 28,083 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొలివిడత ఆప్షన్లకు అనుగుణంగా 20,695 (73.69 శాతం) సీట్లు కేటాయించారు. ఇందులో విద్యార్థులు అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ కోర్సులకే ప్రాధాన్యం ఇచ్చారు. కంప్యూటర్స్‌లో 4,110 సీట్లు ఉండగా వందశాతం కేటాయించారు. దీనికి అనుబంధ కోర్సుగా చెప్పుకునే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్‌లో మొత్తం 178 సీట్ల(వంద శాతం)కూ విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీలో ఉన్న 59 సీట్లూ తొలి కౌన్సెలింగ్‌లోనే భర్తీ అయ్యాయి. క్లౌడ్ కంప్యూటింగ్ (100 శాతం) వైపు విద్యార్థులు ఆసక్తి చూపారు. సంప్రదాయ కోర్సులైన సివిల్ ఇంజనీరింగ్ (67.7 శాతం), మెకానికల్ (48.63 శాతం) మాత్రమే విద్యార్థులు ఎంచుకున్నారు. నెలాఖరులోగా రిపోర్టింగ్ తొలి విడత కేటాయింపులో సీటు దక్కించుకున్న అభ్యర్థులు ఈ నెలాఖ రులోగా సెల్ఫ్ రిపోర్టి్టంగ్ చేయాల్సి ఉంటుంది. tspolycet.nic.in అనే వెబ్‌సైట్‌కు లాగిన్ అయి, అలాట్మెంట్ ఆర్డర్‌తోపాటు అవసరమైన ధ్రువపత్రాలు అప్లోడ్ చేసి, నిర్ధారించిన ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు. తుదిదశ వరకూ అభ్యర్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనే చాన్స్ ఉంటుంది. -
కన్నడనాట కాంగ్రెస్‌కు భారీ షాక్?
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కర్ణాటకలో రాజకీయ వేడి మొదలు కాబోతోంది. అధికారం నిలబెట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీ నేతలకు ఆహ్వానం పలుకుతోంది. ఇందులో భాగంగా కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు బీజేపీ గాలం వేసినట్లు తెలిసింది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయం కూడా చర్చించినట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విధానసభ ఎన్నికల్లో తన వర్గానికి మొత్తం 20 అసెంబ్లీ సీట్లు కావాలని సిద్ధరామయ్య అడిగారట. దీనిపై బీజేపీ అధిష్టానం పునరాలోచిస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే సిద్ధరామయ్య కమలం గూటికి చేరడం ఖాయమనిపిస్తోంది. మంత్రివర్గంలో సిద్ధూ అనుచరులు కర్ణాటక కేబినెట్లో ఇప్పటికే సుమారు 15 మంది మంత్రులు సిద్ధూ అనుచరులు అని చెప్పవచ్చు. కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణంలో అమాత్యగిరి దక్కలేదని అసమ్మతి వ్యక్తం చేస్తూ బీజేపీలో చేరిన వారంతా సిద్ధూ అనుచరులుగానే చెబుతారు. వారందరిలో ఒకరిద్దరు మినహా అందరికీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు లభించాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికలవేళకి సిద్ధరామయ్య కూడా కమలం గూటికి చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు తేలకపోవడంతో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. 20 స్థానాలపై సిద్ధూ పట్టు బీజేపీ నేతల ఆహ్వానానికి ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తన వర్గానికి సుమారు 20 అసెంబ్లీ స్థానాల టికెట్లు ఇవ్వాలని పట్టుబట్టారు. వరుణ, చాముండేశ్వరి, హుణసూరు, హెబ్బాళ, చామరాజపేటె, కోలారు తదితర స్థానాలను సిద్ధూ ఆశించారు. మైసూరు జిల్లా హుణసూరు నుంచి సిద్ధూ పోటీ చేసినా తనకు ఇష్టమే అని మాజీ మంత్రి హెచ్.విశ్వనాథ్ అన్నారు. సిద్ధరామయ్య కోసం తన సీటును వదులుకుంటానని స్పష్టం చేశారు. పాత మైసూరుపై పట్టు కోసమే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సొంతబలంతో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ ప్రాబల్యం లేని పాత మైసూరు ప్రాంతంలో పట్టు సాధించేందుకు అక్కడి నేతలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మాజీ సీఎం సిద్ధరామయ్యను బీజేపీలో చేర్చుకునేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. పాత మైసూరు ప్రాంతంలో మొత్తం 89 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 10 చోట్ల మాత్రమే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. త్వరలోనే కాంగ్రెస్‌కు సిద్ధూ గుడ్‌బై: మరి కొన్ని రోజుల్లో మాజీ సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. బీజేపీలో చేరుతారని రాష్ట్ర మంత్రి ఆర్.మునిరత్న వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విధానసౌధలో మీడియాతో మాట్లాడారు. వచ్చే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. గతంలో రామకృష్ణ హెగ్డేకు వచ్చిన పరిస్థితే.. ఇప్పుడు సిద్ధరామయ్యకు వస్తుందన్నారు. అదేవిధంగా మండ్య ఎంపీ సుమలతను బీజేపీలో చేర్చుకునే అంశంపై పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ స్థానాలు – 224+1 (నామినేటెడ్), బీజేపీ – 122 (స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరితో కలిపి) కాంగ్రెస్ – 69 జేడీఎస్ – 32 స్వతం్రత్రులు– 2 -
వైరల్: ట్రైన్లో సీట్ దొరకలేదు.. ఏం పర్లేదు, ఇలా హాయిగా పడుకోవచ్చు
వీకెండ్స్‌లో, పండుగ సమయాల్లో రైలు, బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. నెల రోజుల ముందు టికెన్ రిజర్వేషన్ చేసుకుంటే గానీ సీట్ కన్ఫర్మ్ అవ్వదు. ఇక అకస్మికంగా ఊరేళ్లాలనుకుంటే బస్సులో సీట్ దొరుకుతుందేమో కానీ రైల్లో అయితే కష్టం. జనరల్ టికెట్ తీసుకొని నిల్చొని ప్రయాణం చేయాల్సిందే. మనలో చాలామంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటాం. కానీ ఇప్పుడు చెప్పబోయే ఓ వ్యక్తి మాత్రం ఇబ్బందులను దాటుకొని వినూత్న ఆలోచన చేశాడు. రైలులో తనకంటూ ప్రతేక సీట్‌ను ఏర్పాటు చేసుకొని హాయిగా పడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని రోజుల క్రితం మీమ్స్ పేజ్ షేర్ చేసింది. చదవండి: వెర్రి వేయి రకాలు.. కుక్కని బుక్ చేసేందుకు...మరీ అలా చేయాలా? ‘భారతీయుల తెలివితో మీరెప్పుడూ సరిపోలేరు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. లక్షల్లో వ్యూవ్స్, వేలల్లో లైకులు వచ్చి చేరుతున్నాయి. దీనిలో అసలేముందంటే.. రైలులో కోచ్ పూర్తిగా నిండిపోవడంతో ఓ వ్యక్తికి సీట్ దొరకలేదు. అయితే రాత్రి పడుకోడానికి అతనికి నేల తప్ప మరెక్కడ చోటు లేకపోయింది. ఈ క్రమంలో ఆ వ్యక్తికి అద్భుతమైన ఆలోచన తట్టింది. తన దగ్గరున్న బెడ్‌షీట్‌ను తీసుకొని ఒక చివర లగేజ్ హోల్డర్‌కు, మరో సీటుకు కలిపి గట్టిగా కట్టాడు. దీంతో కోచ్ మధ్యలో ఊయల లాగా ఏర్పడింది. వెంటనే పెక్కి ఎక్కి ఆ ఊయలలో హాయిగా పడుకుంటాడు. చదవండి: ఆ ఆహ్వానం నచ్చింది... అందుకే ఈ రాత్రికి అక్కడికి వెళ్తా!! View this post on Instagram A post shared by MEMES.BKS🤟🙂 (@memes.bks) దీనిని చూసిన తోటి ప్రయాణికులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ.. అతడి తెలివిని తలుచుకొని నవ్వుకుంటారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఇలా అయితే ట్రైన్ టికెట్ కూడా అవసరం లేదు. ఇతనికి తెలివి బాగా ఉంది. ఇలా పడుకుంటే హాయిగా నిద్రపోవచ్చు. ఇంకోసారి ట్రైన్లో వెళ్లేటప్పుడు నేను కూడా ఇలాగే చేస్తాను’ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. -
‘ఆ కుర్రాడికి సీటు ఇవ్వకుంటే న్యాయాన్ని అపహాస్యం చేసినట్లే!’
Dalit Boy IIT Seat Case: విద్యార్హతలున్నవాళ్లకు అవకాశాలు దక్కడంలో అవాంతరాలు ఎదురైతే తాము చూస్తూ ఊరుకోబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. యూపీకి చెందిన ఓ దళిత బాలుడికి సాంకేతిక కారణాలతో ఐఐటీలో సీటు దక్కకపోవడం, కింది న్యాయస్థానంలో పిటిషన్ తిరస్కరణకు గురికావడంపై విచారం వ్యక్తం చేసిన కోర్టు.. అతనికి సీటు ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ బెంచ్ మార్క్ తీర్పుపై ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన 17 ఏళ్ల ప్రిన్స్ జైబీర్‌సింగ్.. 2021 ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో 25, 894వ ర్యాంక్(ఎస్సీ కేటగిరీలో 864) సాధించాడు. కౌన్సెలింగ్‌లో బాంబే ఐఐటీలో సీటు కోసం ఆప్షన్ పెట్టుకున్నాడు. ఆ కుటుంబం నుంచి ఉన్నత విద్యకు వెళ్తున్న మొదటి వ్యక్తి కూడా ఈ కుర్రాడే. దీంతో ఆ కుటుంబం సంబురాలు చేసుకుంది. అయితే ఆర్థిక ఇబ్బందులతో సీటు పేమెంట్ రూ. 15వేలను చివరి నిమిషంలో చెల్లించాడతను. తీరా ఆ సమయానికి సాంకేతిక కారణాల వల్ల పేమెంట్ జరగకపోవడంతో అతనికి సీటు అలాట్ కాలేదు. ఈ సమస్యపై కౌన్సిలింగ్ జరిగిన ఖరగ్‌పూర్ ఐఐటీని వెంటనే ఆశ్రయించిన లాభం లేకపోయింది. బాంబే ఐఐటీ దీంతో ప్రిన్స్, బాంబే హైకోర్టు లో ప్లీ దాఖలు చేయగా.. కోర్టు అతని అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ బోపన్న ఆధ్వర్యంలోని ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ అభ్యర్థన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. సోమవారం ఈ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘జరిగింది సాంకేతిక తప్పిదం. విద్యార్థి తప్పేం లేదు. పైగా మంచి భవిష్యత్తు ఉన్న ఓ యువ దళిత విద్యార్థికి ఫీజు కారణంగా సీటు నిరాకరించడం బాధాకరం. ఒకవేళ అతనికి ఇక్కడ కూడా అతనికి న్యాయం జరగకపోతే.. న్యాయ్యాన్నే అపహాస్యం చేసిన వాళ్లం అవుతాం. తక్షణమే బాంబే ఐఐటీలో అతనికి సీటు కేటాయించాలి. మిగతా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా.. అవసరమైతే ఇతని కోసం ఓ సీటును సృష్టించండి. 48 గంటల్లో అందుకు సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించాలి ’’ అని Joint Seat Allocation Authority (JOSAA)ని ఆదేశిస్తూ తీర్పు వెల్లడించింది. మానవతా దృక్ఫథంతో ఒక్కోసారి న్యాయ పరిధిని దాటి ఆలోచించాల్సి వస్తుందని, ఈ కేసులోనూ విద్యార్థి కోసం తాము అదే కోణంలో తీర్పు ఇస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక రాజ్యాంగంలోని 142 ఆర్టికల్ అంటే.. పూర్తి న్యాయం జరిగేలా చూడడం కోసం తమ విచక్షణాధికారాన్ని సుప్రీం కోర్టు ఉపయోగించి ఆదేశాలు జారీ చేయొచ్చు.. అవి పాటించి తీరాల్సిందే!(కొన్ని సందర్భాలు మినహాయించి). ఈ ఆర్టికల్‌ను తెరపైకి తెచ్చిన బెంచ్.. తక్షణమే ఆదేశాలు అమలయ్యేలా చూడాలని ఆల్లోకేషన్ ఆథారిటీని ఆదేశించింది. ఇక కౌన్సిలింగ్‌ల సమయంలో టెక్నికల్ సమస్యలతో ఎంతో మంది విద్యార్థులు మంచి మంచి అవకాశాలు కోల్పోతున్న సందర్భాలు చూస్తుంటాం. అలాంటిది ఇలాంటి తీర్పులు అర్హత ఉన్న కొందరికైనా న్యాయం అందేలా చూస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది ఇప్పుడు. -
డీఎంకే–కాంగ్రెస్ కూటమికి బీటలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకేతో వియ్యమందుకున్న కాంగ్రెస్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కయ్యానికి దిగింది. యూపీఏ కూటమిలో పదేళ్లకు పైగా కొనసాగిన డీఎంకేతో తెగదెంపులు చేసుకునేందుకు తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమైంది. తుది నిర్ణయం బాధ్యతను ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్‌గాంధీపై మోపింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో సయోధ్య కుదరక పోవడమే ఇందుకు కారణం. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ సీట్ల కేటాయింపుపై ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వలెనే ఈసారి కూడా 41 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే 41లో కేవలం 8 సీట్లు గెలుపొందడం వల్లనే 2016 ఎన్నికల్లో అధికారం దక్కలేదని డీఎంకే గుర్రుగా ఉంది. ఈసారి 18 స్థానాలకు మించి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఆరంభంలో అలానే ఉంటుంది, రానురానూ డీఎంకే తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ అంచనా వేసింది. ప్రజాబలం, పెద్దగా ఓటు బ్యాంకు లేని కాంగ్రెస్‌కు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో సీట్లను కేటాయిస్తే మరోమారు నష్టపోతామని డీఎంకే పట్టుదలతో ఉంది. ఐ–ప్యాక్ అనే సంస్థతో సర్వే చేయించిన సర్వేలో కూడా కాంగ్రెస్ బలహీనం బయటపడడంతో డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ మెట్టుదిగనందున చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. మరీ తక్కువ సీట్లలో పోటీచేస్తే కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బతింటుందని అగ్రనేతలు భావించారు. దీంతో నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను స్వీకరించాలని నిర్ణయించి అత్యవసరంగా సమావేశమయ్యారు. డీఎంకే చర్చల్లో తనకు ఎదురైన అనుభవాలను టీఎన్‌సీసీ అ«ధ్యక్షులు కేఎస్ అళగిరి పార్టీ శ్రేణులతో పంచుకుంటూ కన్నీరుపెట్టుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో పార్టీ నేతలు తల్లడిల్లిపోయారు. కూటమిలో కొనసాగడమా, వద్దా అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగినపుడు ‘30 సీట్లిస్తే సరే లేకుంటే ఒంటరి పోటీకి దిగుదాం’అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు కమల్‌హాసన్ నేతృత్వంలోని ‘మక్కల్ నీది మయ్యం’తో కలిసి కూటమి ఏర్పాటు చేద్దామని సలహా ఇచ్చారు. దీంతో అగ్రనేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ‘కరుణానిధి కాలం నుంచి డీఎంకే కూటమిలో కొనసాగుతున్నాం, చర్చలకు వచ్చినపుడు కాంగ్రెస్ నేతలకు కరుణానిధి ఎంతో మర్యాద ఇచ్చేవారు. అయితే ఈసారి కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు ఉమన్‌చాందీ వస్తే కనీస స్థాయిలో ఎవ్వరూ పట్టించుకోలేదు. అంతేగాక చర్చల్లో తీవ్ర అవమానాలకు గురయ్యామ’ని కాంగ్రెస్ నేతలు బాధపడ్డారు. పైగా మలివిడత చర్చలకు రమ్మని డీఎంకే నుంచి ఆహ్వానం రాలేదని వాపోయారు. ఈ పరిస్థితులను రాహుల్‌గాంధీకి వివరించేందుకు కర్ణాటకు చెందిన కాంగ్రెస్ అగ్రనేత వీరప్పమెయిలీ శనివారం ఢిల్లీ పయనమయ్యారు. డీఎంకే కూటమిలో కొనసాగడం ఇష్టం లేదు, అయితే రాహుల్ ఆదేశాలను అనుసరించి నడుచుకుంటామని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ సీట్లు కేటాయిస్తే ఒప్పుకోవద్దని తమిళనాడులో ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలో రాహుల్‌గాంధీ చెప్పినట్లు సమాచారం. డీఎంకేతో వికటిస్తే కాంగ్రెస్‌ను కలుపుకుని పోయేందుకు కమల్‌హాసన్ సిద్ధంగా ఉన్నారు. తన పార్టీ నేతలను ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతల వద్దకు రాయబారం పంపారు. బీజేపీతో డీఎంకే రహస్య ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రాల వారీగా కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేస్తోందని, ఇందుకు ఇటీవల పుదుచ్చేరీలో కాంగ్రెస్ పతనం, తరువాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలే నిదర్శనమని కమల్ శనివారం నాటి ప్రచారంలో కొత్త కోణాన్ని అందుకున్నారు. -
సిద్ధాంత్‌కు సీటివ్వండి!
న్యూఢిల్లీ: జేఈఈ పరీక్షలో మంచి ర్యాంకు సంపాదించినా ఒక్క రాంగ్ క్లిక్‌తో ఐఐటీ సీటు కోల్పోయిన సిద్ధాంత్ బత్రాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బత్రాకు మధ్యంతర ప్రవేశం కల్పించాలని కోర్టు ఐఐటీ బాంబేని ఆదేశించింది. జస్టిస్ ఎస్కే కౌల్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ కేసును విచారించింది. ముందుగా బత్రాకు అడ్మిషన్ ఇవ్వాల్సిందిగా ఐఐటీని ఆదేశించి తదుపరి విచారణను శీతాకాలం సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. ప్రస్తుతం బత్రాకు ఇచ్చే అడ్మిషన్ తుది తీర్పునకు లోబడి ఉంటుందని తెలిపింది. ఆగ్రాకు చెందిన సిద్ధాంత్ బత్రాకు జేఈఈలో 270వ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సీటు సంపాదించాడు. అయితే అక్టోబర్ 31న తన రోల్ నంబర్‌పై అప్డేట్ల కోసం నెట్లో బ్రౌజ్ చేస్తుండగా ఒక లింక్‌ను అనుకోకుండా క్లిక్ చేశాడు. ‘‘విత్ డ్రా ఫ్రం సీట్ అలకేషన్ అండ్ ఫర్దర్ రౌండ్స్’ అని ఉన్న లింక్‌ను తను క్లిక్ చేశాడు. ఇప్పటికే తనకు సీటు దొరికినందున ఇకపై ఎలాంటి అడ్మిషన్ రౌండ్లు ఉండవన్న నమ్మకంతో ఈ లింక్‌ను క్లిక్ చేసినట్లు బత్రా చెప్పారు. అయితే నవంబర్ 10న విడుదలైన 93మంది విద్యార్దుల తుది జాబితాలో బత్రా పేరు లేదు. దీంతో ఆయన బొంబాయి హైకోర్టులో పిటీషన్ వేశారు. 19న పిటిషన్ విచారించిన కోర్టు రెండురోజుల్లో బత్రా పిటిషన్‌ను ఆయన విజ్ఞాపనగా పరిగణించమని ఐఐటీని ఆదేశించింది. అయితే విత్‌డ్రా లెటర్‌ను రద్దు చేసే అధికారం తమకు లేదంటూ ఐఐటీ గత నెల 23న బత్రా అప్పీలును తిరస్కరించింది. నిబంధనలు అతిక్రమించి ఏమీ చేయలేమని తెలిపింది. అడ్మిçషన్లన్నీ జేఒఎస్‌ఎస్‌ఏ చూసుకుంటుందని ఐఐటీ రిజిస్ట్రార్ చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద ఖాళీ సీటు లేదన్నారు. వచ్చేఏడాది జేఈఈకి బత్రా అప్లై చేసుకోవచ్చన్నారు. ఐఐటీ వాదనతో ఏకీభవించిన బాంబే హైకోర్టు తన అభ్యర్థనను కొట్టివేయడంతో బత్రా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన అభ్యర్థనను మానవతా ధృక్పథంతో పరిశీలించాలని, తనకోసం అదనపు సీటు సృష్టించాలని విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు విద్యార్ధికి అడ్మిషన్ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. -
ఆర్జేడీకి 144, కాంగ్రెస్‌కు 70 సీట్లు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బహుళ పార్టీల మహాకూటమిలో సీట్ల పంపకం శనివారం దాదాపు పూర్తయ్యింది. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) చీఫ్ తేజస్వీ యాదవ్‌ను కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీట్ల పంపకంలోనూ ఆ పార్టీకే అగ్రస్థానం దక్కింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా, ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేయనుంది. కాంగ్రెస్‌కు 70 సీట్లు, సీపీఐ(ఎంఎల్)కు 19, సీపీఐకి 6, సీపీఎంకు 4 సీట్లు కేటాయించారు. వాల్మీకీ నగర్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 7న జరగనున్న ఉలప ఎన్నికలో మహా కూటమి తరపున కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలిపేలా ఒప్పందం కుదిరింది. తమ పార్టీకి దక్కిన 144 సీట్లలో కొన్ని స్థానాలను వికాశీల్ ఇన్సాస్ పార్టీకి(వీఐపీ), జేఎంఎంకు కేటాయిస్తామని ఆర్జేడీ ప్రకటించింది. సీట్ల పంపకంలో తీమకు అన్యాయం జరిగింది, ఇతర పార్టీల నేతలు వెన్నుపోటు పొడిచారని, మహా కూటమి నుంచి తాము తప్పుకుంటున్నట్లు వికాశీల్ ఇన్సాస్ పార్టీ అధినేత ముకేశ్ సాహ్నీ ప్రకటించారు. బిహార్ బీఎస్పీ చీఫ్ రాజీనామా బీఎస్పీ అధినేత మాయావతికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ బిహార్ శాఖ అధ్యక్షుడు భరత్ బింద్ శనివారం బీఎస్పీకి రాజీనామా చేసి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరారు. ఆర్జేడీ నేత తేజస్వీ ఆయనకు పార్టీ సభ్యత్వం అందజేశారు. సరికొత్త బిహార్ నిర్మాణానికి, యువజన వ్యతిరేకి అయిన ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి భరత్ తమ పార్టీలో చేరారని తేజస్వీ ట్వీట్‌చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీ, జనతాంత్రిక్ పార్టీ(సోషలిస్టు) కలిసి మహాకూటమిగా ఏర్పడి బరిలో దిగడం తెల్సిందే. -
కలిసే పోటీచేస్తాం: జేపీ నడ్డా
పట్నా: రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల సీట్ల ఒప్పందంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ల మధ్య కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సీట్ల పంపకంపై చర్చించారు. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను నితీష్ కుమార్ నాయకత్వంలో ఐక్యంగా ఎదుర్కొంటామని, భారీ మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంటామని ప్రకాష్ నడ్డా తేల్చి చెప్పారు. ఇటీవల రాంవిలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని ఎల్జేపీ, జేడీయూపై వివిధ అంశాలపై తీవ్రంగా విభేదిస్తూ, జేడీయూతో కలిసి పోటీచేయలేమని ప్రకటించింది. ఎల్జేపీతో, జేడీయూకి తలెత్తిన విభేదాలను పరిష్కరించడంలో బీజేపీ చొరవ తీసుకుంటుందని నితీష్ కుమార్‌కి హామీయిచ్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ని ఎన్నికల కమిషన్ త్వరలోనే ప్రకటించనుంది. లాలూతో జార్ఖండ్ సీఎం హేమంత్ భేటీ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌తో రాంచీలో భేటీ అయ్యారు. రానున్న బిహార్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఎన్నికల్లో జేఎంఎం 12 స్థానాలను డిమాండ్ చేయగా, ఆర్జేడీ దాదాపు 3 సీట్లే ఇవ్వగలమని చెప్పినట్లు తెలుస్తోంది. -
సీటు కోసం ప్రజ్ఞాఠాకూర్ పేచీ
న్యూఢిల్లీ: తనకు సీటు కేటాయించడంలో విమాన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ ఆరోపించారు. ఈ కారణంగా ఢిల్లీ–భోపాల్ విమానం 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంపీ ప్రజ్ఞా భోపాల్‌కు ప్రయాణించేందుకు స్పైస్‌జెట్ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే ఆమె వీల్ చైర్లో రావడంతో విమానం ముందువరసలోని 1–ఏ సీటును కేటాయించేందుకు విమాన సిబ్బంది నిరాకరించారు. వెనుక సీటుకు మారాలని కోరగా ఆమె తిరస్కరించారు. వాదోపవాదాల అనంతరం ఆమె వెనుక సీటుకు వెళ్లేందుకు అంగీకరించారు. దీంతో విమానం 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. ఈ విషయంపై ఎంపీ ప్రజ్ఞా భోపాల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. భద్రతా కారణాల కారణంగానే ఆమెకు వెనుక సీటు కేటాయించినట్లు స్పైస్ జెట్ ప్రతినిధి తెలిపారు. -
టీడీపీలో తేలని సీట్ల పంచాయతీ
సాక్షి, అమరావతి: టీడీపీలో టికెట్ల పంచాయతీ తెలడం లేదు. చాలా చోట్ల సిట్టింగ్‌లకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే ఆందోళనకు దిగడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. గత పదిహేను రోజులుగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమీక్ష జరుపుతున్నప్పటికీ.. నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో చాలా వరకు ఆ సమావేశాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. సీట్ల కోసం నేతల మధ్య వివాదాలు పరిష్కరించడాని చంద్రబాబు సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే నేతల మధ్య సయోధ్య కుదర్చడంలో సమన్వయ కమిటీ విఫలమైనట్టుగా తెలుస్తోంది. కొవ్వురులో మంత్రి జవహర్, నిడదవోలులో శేషారావుపై స్థానిక నేతల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. మరోవైపు పాయకరావుపేట, పాతపట్నంలలో సిట్టింగ్‌లుగా ఉన్న అనిత, కలమట వెంకటరమణకు సీటు ఇవ్వవద్దని అసంతృప్త నేతలు పార్టీ అధిష్టానానికి తెలిపాయి. అవనిగడ్డలో మండలి బుద్దప్రసాద్‌ను, మంగళగిరిలో సునీల్‌ను నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గుడివాడ, చీపురుపల్లి, మంగళగిరిలో స్థానిక నేతలకే సీట్లు ఇవ్వాలని అక్కడి నేతలు పట్టుబడుతున్నారు. సొంత పార్టీ నేతల మధ్య పోరు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. -
జైపాల్‌రెడ్డి,డీకే అరుణ మధ్య ముదిరిన వివాదం
-
గ్రుపుల పేరు చెప్పి సీట్లు అమ్ముకున్నారు
-
బీజేపీలో టికెట్ల లొల్లి
-
ట్విస్ట్: 12 స్థానాల్లో టీజేఎస్ పోటీ
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల పంపకంలో గందరగోళం కొనసాగుతుంది. తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) ప్రకటించింది. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. టీజేఎస్ కార్యాలయంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పిఎల్ విశ్వేశ్వర రావు తాము పోటీ చేసే నియోజకవర్గాల పేర్లు ప్రకటించారు. దుబ్బాక, మెదక్, మల్కాజిగిరి, అంబర్ పేట, సిద్దిపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, అసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్, జనగాం, మహబూబ్‌నగర్, మిర్యాలగూడ నుంచి పోటీకి దిగనున్నట్టు ప్రకటించారు. టీజేఎస్‌కు 8 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. జనగాం మాదే: టీజేఎస్ కాంగ్రెస్ పార్టీతో జనగాం సీటుపై పంచాయతీ తేలకుండానే ఇక్కడి నుంచి తామే పోటీ చేస్తామని టీజేఎస్ ప్రకటించడం విశేషం. మరోవైపు జనగాం సీటు తనదేనని పొన్నాల లక్ష్మయ్య విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో మకాం వేసి తన సీటును కాపాడుకునేందుకు ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్లిన మహబూబ్‌నగర్ స్థానంలోనూ పోటీ చేస్తామని టీజేఎస్ ప్రకటించడంతో మళ్లీ గందరగోళం రేగింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన అసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్‌లోనూ బరిలోకి దిగుతామని ప్రకటించింది. కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకేనా? మహాకూటమిలో తమకు కేటాయించిన 8 స్థానాలకు మించి టీజేఎస్ అభ్యర్థులను ప్రకటించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్, మహబూబ్‌నగర్‌లో తాము బలంగా ఉన్నామని, కచ్చితంగా గెలుస్తామని టీజేఎస్ చెబుతోంది. ఇక్కడి అభ్యర్థులను ఉపసంహరించుకునేలా కాంగ్రెస్, టీడీపీలను ఒప్పిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఎక్కడా స్నేహపూరక పోటీ ఉండదని చెబుతూనే, తాము మాత్రం వెనక్కు తగ్గబోమన్న సంకేతాలు ఇచ్చింది. కూటమిలో పట్టువిడుపులు ఉండాలని, తాము బలంగా ఉన్న సీట్లను మాత్రమే కోరుతున్నామని తెలిపింది. కాంగ్రెస్ హైకమాండ్‌తో తమ పార్టీ అధ్యక్షుడు కోదండరాం జరుపుతున్న చర్చలు ఫలిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచింది. అయితే ఆశావహులను బుజ్జగించే ప్రయత్నంలోనే టీజేఎస్ ఈ ఎత్తుగడ వేసిందన్న వాదనలు లేకపోలేదు. మహాకూటమిలో కొనసాగుతామని టీజేఎస్ స్పష్టం చేసింది. -
ఒంటరి పోరుకే సీపీఐ మొగ్గు
-
‘హస్త’వాసి ఎవరికో..?
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్: మహాకూటమి పొత్తుల లెక్కలు తేలకపోయినా... కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఉమ్మడి జిల్లా పర్యటన మాత్రం ఖరారైంది. నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, కో చైర్పర్సన్ డీకే.అరుణ, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ప్రచారం సాగనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముథోల్‌లలో మినహా ఎనిమిది నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. భైంసాలో ఇటీవలే రాహుల్‌గాంధీ ప్రచారసభను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో ముథోల్, నిర్మల్ మినహా మిగతా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని సాగించనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ కూడా తయారైంది. అయితే ఇప్పటివరకు మహాకూటమిలో పొత్తులపైన స్పష్టత లేకపోవడం కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. నవంబర్ ఫస్ట్‌కు ముందే స్పష్టత! మహాకూటమిలో పొత్తుల అంశాన్ని నెలరోజులుగా నానుస్తూ వస్తున్న కాంగ్రెస్ వైఖరి పట్ల ఇప్పటికే టీజేఎస్, సీపీఐ తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ మరో అడుగు ముందుకేసి రెండురోజుల్లో తేల్చకపోతే మొదటి విడతగా తమ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తానని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. పొత్తుల్లో తమకు కేటాయించే సీట్ల సంఖ్య తగ్గితే ఒప్పుకోమని, పార్టీ గుర్తుల మీద పోటీ చేస్తారని సీపీఐ కూడా హెచ్చరించింది. అయినా కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ, కోర్ కమిటీ సమావేశాలతోనే కాలం వెల్లుబుచ్చుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. సోమవారం కూడా స్క్రీనింగ్ కమిటీతో కోర్ కమిటీ భేటీ అయింది. ఇప్పటికే ఖరారు చేసిన జాబితాను ప్రకటించాలని కోర్ కమిటీలో నేతలు కోరగా, పొత్తులు ఖరారు కాకుండా అభ్యర్థులను ప్రకటించడం వీలుకాదని స్క్రీనింగ్ కమిటీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లోనే పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా భట్టి వర్గంలో జోష్ పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అండదండలతో పార్టీ టికెట్టు ఆశిస్తున్న వారంతా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గంగా ఉండగా, మహేశ్వర్‌రెడ్డిని వ్యతిరేకించే వారంతా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నాయకత్వంలో భట్టి విక్రమార్క వర్గంగా టికెట్లు ఆశిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్, కో చైర్‌పర్సన్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే భట్టి, డీకేలకే అవకాశం లభించడం ఉమ్మడి జిల్లాలోని ప్రేంసాగర్‌రావు వర్గానికి ఊపునిచ్చింది. నవం»బర్ ఒకటి నుంచి నాలుగోతేదీ వరకు సాగే పర్యటనలో భట్టి వర్గీయులే ప్రముఖంగా కనిపించే అవకాశం ఉంది. అయితే ప్రచార కమిటీ పర్యటన కాబట్టి నాయకులంతా హాజరవుతారని, గ్రూపులతో సంబంధం ఉండదని ప్రేంసాగర్‌రావు సాక్షితో మాట్లాడుతూ చెప్పారు. హస్తవాసి దక్కేదెవరికో... పొత్తుల లెక్కలు తేలకపోయినా పది నియోజకవర్గాలలో కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువే ఉంది. అయితే డీసీసీ, పీసీసీల స్థాయిలో వడబోత ముగిసింది. స్క్రీనింగ్ కమిటీ కూడా వేర్వేరు సర్వేలు, సలహాలు, సూచనలతో పాటు వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం కోర్‌కమిటీ సమావేశం తరువాత ఏఐసీసీకి అభ్యర్థుల జాబితాను పంపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు మినహా ఎవరూ ఆశావహులు లేరు. ముథోల్‌లో రామారావు పటేల్, నారా యణరావు పటేల్‌తో పాటు ఎన్నారై పి.విజయ్‌కుమార్‌రెడ్డి కూడా టికెట్టు రేసులో ఉన్నారు. వీరిలో ప్రజలతో సంబంధాలు మెరుగ్గా ఉన్న నేతనే స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థిత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. బోథ్‌లో సోయం బాపూరావు, అనిల్‌జాదవ్‌లలో ఎస్టీల్లోని రెండు వర్గాలను సమతుల్యం చేసే ప్రక్రియలోనే అభ్యర్థి ఖరారు కానున్నారు. ఆదిలాబాద్‌లో సామాజిక సర్థుబాటుతో పాటు మంత్రి రామన్నకు గట్టి పోటీనిచ్చే మహిళా అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తే గండ్రత్ సుజా తకు అవకాశం దక్కనుంది. ఖానాపూర్‌లో రాథోడ్ రమేష్ అభ్యర్థిత్వంపై హామీతోనే కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో ఆయనకే సీటు ఖాయమనే ప్రచారం ఉంది. సిర్పూరులో హరీష్‌బాబు, రావి శ్రీనివాస్ మధ్య పోటీలో హరీష్ వైపే స్క్రీనింగ్ కమిటీ మొగ్గు చూపినట్లు సమాచారం. చెన్నూరులో బోర్లకుంట వెంకటేష్ నేత, మాజీ మంత్రి బోడ జనార్దన్ ఎవరికి వారే ప్రయత్నాలు చేసినా, స్క్రీనింగ్ కమిటీ వెంకటేశ్ నేతను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బెల్లంపల్లిలో గద్దర్ తనయుడు సూర్యకిరణ్‌ను తెరపైకి తెచ్చినా, సీపీఐ పొత్తులో సీటు గల్లంతయ్యే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మంచిర్యాలలో టికెట్టు తనదేనని కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ధీమాతో ఉన్నారు. అయితే స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసిన వారే అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. రెండు రోజుల్లో జాబితా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
ఎంతకాలం ఈ సాగదీత?
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయమై జరుగుతున్న సాగదీత వైఖరిపై తెలంగాణ జనసమితి అసహనం వ్యక్తం చేసింది. టీజేఎస్ అధ్యక్షుడు ఎం. కోదండరాం నేతృత్వంలో పార్టీ కోర్ కమిటీ సోమవారం సమావేశమైంది. సీట్ల సర్దుబాటు, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై ఈ సమావేశంలో నేతలు చర్చించారు. పార్టీ కార్యాలయంలోనే జరిగిన అంతర్గత సమావేశంలో సీట్ల సర్దుబాటును పూర్తి చేయకుండా కాంగ్రెస్ సాగదీయడంపై పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక ఆలస్యం చేయకుండా సీట్ల పంపకాలను తేల్చేవిధంగా ఒత్తిడి చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. సీట్ల సర్దుబాటు వ్యవహారం సత్వరమే పూర్తయ్యేలా మిత్రపక్షాలైన టీటీడీపీ, సీపీఐతో కలసి కాంగ్రెస్‌పై ఒత్తిడి తేవాలని పలువురు ముఖ్యులు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఇదే వైఖరితో ఉంటే రాష్ట్రంలో పట్టున్న ముఖ్యమైన 15 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించి ముందుకు వెళ్దామని కొందరు టీజేఎస్ ముఖ్య నేతలు ప్రతిపాదించినట్లు తెలిసింది. టీజేఎస్‌కు కేటాయించే సీట్ల విషయంలో కాంగ్రెస్ ఎక్కడా స్పష్టత ఇవ్వకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం పెరుగుతోందని, ఈ నేపథ్యంలో పొత్తుల విషయమై తాడోపేడో తేల్చాలని కోదండరాంపై పలువురు నేతలు ఒత్తిడి తెచ్చినట్లు తెలియవచ్చింది. కోదండరాంతో రమణ, చాడ భేటీ... తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం. కోదండరాంతో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆదివారం రాత్రి, సోమవారం సమావేశమయ్యారు. టీజేఎస్‌కు 12 సీట్లు ఇవ్వాలని కోదండరాం కోరుతుండగా సీపీఐ కనీసం 6 స్థానాలకు తగ్గకుండా ఇవ్వాలని పట్టుబడుతోంది. ఇప్పటిదాకా టీజేఎస్‌కు 8 సీట్లను ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించినట్లు తెలుస్తోంది. సీపీఐ కూడా సీట్ల సర్దుబాటుపై అసహనం వ్యక్తం చేస్తోంది. బెల్లంపల్లి, కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, దేవరకొండ, మునుగోడు స్థానాల కోసం సీపీఐ పట్టుబడుతోంది. -
45 సీట్లు కావాలి..!
సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం ప్రాతిపదికన తమకు 45 స్థానాల్లో పోటీచేసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌లోని బీసీ నేతలు కోరుతున్నారు. ఈ మేరకు పార్టీలోని బీసీ నేతలు ఏఐసీసీ పెద్దలను కలసి విన్నవించినట్లు సమాచారం. ఇప్పటికే ఏఐసీసీ నియమించిన భక్తచరణ్‌దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీని కలసి వెనుకబడిన వర్గాలకు చెందిన నేతలు పోటీ చేయాలనుకుంటున్న, విజయావకాశాలున్న స్థానాల జాబితాను కూడా అందజేశారు. కానీ, 45 స్థానాల కేటాయింపు సాధ్యం కాదనే అంచనాల నేపథ్యంలో కనీసం పార్లమెంట్ స్థానానికి 2 సీట్లయినా బీసీలకు కేటాయించాలనే వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. అలా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా 34 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం బీసీ నేతలకు వస్తుందని అంటున్నారు. అయితే, రాష్ట్ర పార్టీలోని బీసీ నేతల ప్రతిపాదనలను ఏఐసీసీ వర్గాలు సీరియస్‌గానే తీసుకున్నాయని, సామాజిక న్యాయం కోణంలో కనీసం 30 స్థానాలకు తగ్గకుండా బీసీలకు కేటాయించే అవకాశాలున్నాయని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. కొన్ని క్లియర్.. మరికొన్ని డౌటే... బీసీ నేతలు కోరుతున్న విధంగా సీట్ల కేటాయింపులకు సంబంధించి టీపీసీసీలో కూడా కొంత స్పష్టత ఉంది. కనీసం 25 స్థానాల్లో బీసీ నేతలకు కచ్చితంగా గెలిచే అవకాశాలున్నందున వారికి అవకాశమివ్వాలని టీపీసీసీ ముఖ్యులు యోచిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశాల్లోనూ ఆ 25 స్థానాలకు బీసీ నేతల పేర్లే మొదటి పేరుగా సూచించినట్లు సమాచారం. మిగిలిన చోట్ల కూడా కొన్ని స్థానాల్లో బీసీ నేతలను ప్రతిపాదించారని, వాటిలో కూడా బీసీ అభ్యర్థులకు అవకాశం వస్తుందని నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా ఆలేరు, జనగామ, పరకాల, ముషీరాబాద్, గోషామహల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, బాల్కొండ, మునుగోడు, అంబర్‌పేట, కరీంనగర్, నిజామాబాద్ (టౌన్), ఆర్మూర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, పటాన్చెరు, సిద్దిపేట, మహబూబ్‌నగర్, జడ్చర్ల, హుస్నాబాద్, వేములవాడ, ఎల్లారెడ్డి, కొత్తగూడెం, రామగుండం, భువనగిరి, వరంగల్ (ఈస్ట్), ఖమ్మం లాంటి నియోజకవర్గాల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించాలని టీపీసీసీ బీసీ నేతలు పార్టీ అ«ధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన.. రిజర్వుడు నియోజకవర్గాల్లో ఎస్సీలకు రిజర్వ్ చేసిన చోట్ల జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఎస్సీల్లోని ప్రధాన కులాలయిన మాదిగ, మాలలతో పాటు ఇతర ఉపకులాలకు చెందిన నేతలు బరిలో దిగే అవకాశమున్న నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన ఆయా వర్గాలకు సీట్లు కేటాయించాలనే డిమాండ్ వస్తోంది. ఇదే విషయమై మాజీ ఎంపీ వి.హనుమంతరావు కూడా ఇటీవల బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ నేతలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో కూడా ఇదే సూత్రాన్ని పాటించారని, తాము కూడా అదే కోవలో ముందుకు వెళ్లాల్సి వస్తుందని టీపీసీసీ చెందిన ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఇంజనీరింగ్‌లో 27 వేల మందికి సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా ఎంసెట్ రెండో దశ సీట్ల కేటాయింపును ప్రవేశాల కమిటీ గురువారం ప్రకటించింది. కొత్తగా 13,206 మందికి సీట్లు లభించగా, తొలి కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చినా కాలేజీ మార్పు కోసం స్లైడింగ్‌లో ఆప్షన్లు ఇచ్చుకున్న మరో 14,595 మందికి సీట్లు లభించాయి. మొత్తంగా రెండో దశలో 27 వేలమందికిపైగా సీట్లను కేటాయించింది. సీట్లు పొందిన విద్యార్థులు అలాట్మెంట్లెటర్లను https://tseamcet.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో 52వేలమందికి సీట్లను కేటాయించినా, 38 వేల మందే కాలేజీల్లో చేరారు. మిగతా విద్యార్థులు కాలేజీల్లో చేరకుండా రెండో విడత కౌన్సెలింగ్‌లో ఇతర కాలేజీలను ఎంపిక చేసుకున్నారు. ఎంసెట్‌లో అర్హత సాధించినవారు 1,02,615 మంది ఉండగా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైనవారు 62,901 మంది ఉన్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో కొత్తగా వెరిఫికేషన్‌కు హాజరైనవారు 4,594 మంది ఉన్నారు. 17,876 సీట్లు ఖాళీ.. ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఫార్మ్–డి కోర్సులను నిర్వహిస్తున్న 302 కాలేజీల్లో 69,221 సీట్లు ఉండగా, అందు లో 51,345 మందికి సీట్లను (74.18%) కేటాయించింది. మరో 17,876 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇంజనీరింగ్ కాలేజీలు 189 ఉండగా, వాటిల్లో 65,648 సీట్లు ఉన్నాయి. అందులో 51,157 సీట్ల (77.93%)ను ప్రవేశాల కమిటీ విద్యార్థులకు కేటా యించగా, 14,491 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇక 1,856 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నా సీట్లు లభించలేదు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐలలో ప్రవేశాల కౌన్సెలింగ్ ఈ నెల 19తో ముగియనుంది. ఆ తర్వాత మరో విడత కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు కమిటీ కసరత్తు చేస్తోంది. 24 కాలేజీల్లో 50 మందిలోపే..: రాష్ట్రంలో 189 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే.. అందులో 2 కాలేజీల్లో ఒక్క విద్యార్థీ చేరలేదు. మరో 7 కాలేజీల్లో 9 మందిలోపే చేరగా, 24 కాలేజీల్లో 50 మందిలోపే చేరారు. మరో 43 కాలేజీల్లో 100 మందిలోపు చేరారు. 60 కాలేజీల్లో మాత్రం 100% కన్వీనర్ కోటా సీట్లు భర్తీ అయ్యాయి. అందులో 48 ప్రైవేటు కాలేజీలు ఉండగా, 12 వర్సిటీ కాలేజీలు ఉన్నాయి. ఈ నెల 15లోగా ఫీజు చెల్లించండి.. సీట్లు లభించిన విద్యార్థులు అలాట్ మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని ఈ నెల 15లోగా ట్యూషన్ ఫీజు చెల్లించి(వర్తించేవారు), సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని, కాలేజీలో రిపోర్టు చేయనివారి సీటు రద్దవుతుందన్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వారు 16లోగా కాలేజీల్లో ఒక సెట్ జిరాక్స్ కాపీలు ఇవ్వాలని, చివరి దశ కౌన్సెలింగ్ పూర్తయ్యాకే ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు. డిగ్రీలోనూ మరో విడత కౌన్సెలింగ్..: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా ఒకట్రెండు రోజుల్లో ప్రత్యేక విడత సీట్ల కేటాయింపును ప్రకటించనున్న డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్ ) మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తోంది. ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ ప్రవేశాలు, ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ పూర్తయ్యాక దీనిని నిర్వహించాలని భావిస్తోంది. -
‘ఫిరాయింపు’ లెక్కలున్నాయ్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘పార్టీ మారే సమయంలో మీకు ఏమిచ్చామో, ఆ తర్వాత ఏ కాంట్రాక్టు పనుల ద్వారా ఎంత ఆదాయం వచ్చేలా చేశామో అన్ని లెక్కలూ నావద్ద ఉన్నాయి. ఎంతో నష్టపోయామంటూ నావద్ద మాటలు చెప్పొద్దు. మీకు చేసిన ప్రతి పని వివరాల చిట్టా నావద్ద ఉంది’’ అంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఏం చేశామనే వివరాలన్నీ తన వద్ద ఉన్నాయంటూ చంద్రబాబు చెప్పడం వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పార్టీ మారిన సమయంలో ఎంత ఇచ్చాం? కాంట్రాక్టు పనులు, నీరు–చెట్టు పనులు ఏవి ఇచ్చామనే వివరాలతోపాటు సదరు ఎమ్మెల్యే సిఫారసుతో చేసిన అధికారుల బదిలీలు, ఎమ్మెల్యే కమీషన్ల వివరాలతో చంద్రబాబు సమాచారాన్ని సిద్ధం చేసుకోవడం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పార్టీ మారి నష్టపోయామన్న ఫిరాయింపు ఎమ్మెల్యే కర్నూలు జిల్లాకు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యే ఒకరు తన అనుచరుడికి కనీసం చివరి ఏడాదైనా జిల్లా పరిషత్ చైర్మన్ పోస్టు ఇప్పించాలంటూ తాజాగా చంద్రబాబు వద్దకు వెళ్లినప్పుడు ఆయన సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అది కుదరదని చంద్రబాబు చెప్పడంతో అసంతృప్తికి గురైన ఫిరాయింపు ఎమ్మెల్యే పార్టీ మారి తాను, తన కేడర్ ఎంతో నష్టపోయామని వ్యాఖ్యానించారు. దీంతో సదరు ఎమ్మెల్యే పనుల చిట్టాను చంద్రబాబు విప్పినట్టు సమాచారం. పార్టీ మారే సమయంలో ఏ పనులు చేయించుకున్నారు, ఎంత సంపాదించారనే మొత్తం వివరాలు ఉన్నాయంటూ సీఎం ఆగ్రహంగానే స్పందించినట్లు తెలిసింది. దీంతో సదరు ఎమ్మెల్యేతో పాటు ఆయన వెంట వెళ్లిన అనుచరులకు కూడా షాక్ తగిలింది. చంద్రబాబు వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో సీటు విషయం కూడా గట్టిగా అడగలేని పరిస్థితికి చేరుకున్నామని ఫిరాయింపు ఎమ్మెల్యేలు మథనపడుతున్నట్లు సమాచారం. పార్టీ మారిన తర్వాత తమ ఆదాయ వివరాలను బేరీజు వేసి సమాచారం సిద్ధం చేసిన విషయం తెలియడంతో కలవరపాటుకు గురవుతున్నారు. 22 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు భారీ మొత్తం చెల్లించి టీడీపీ కొనుగోలు చేసిందన్న ఆరోపణలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. పలువురికి సీట్లు ఇవ్వనట్లే! పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కలిగిన లబ్ధి వివరాలను చంద్రబాబు తన వద్ద ఉంచుకోవడం వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన ఆశ చూపించి పలువురిని పార్టీలో చేర్చుకున్నారు. తీరా సీట్లు పెరగకపోవడంతో చంద్రబాబు రూటు మార్చారు. సీట్ల కేటాయింపు విషయంలో తేడా వచ్చి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగితే ఈ మొత్తం చిట్టాను చూపించి దారికి తెచ్చుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఫిరాయింపుదారుల్లో పలువురికి సీట్లు కేటాయించే అవకాశం లేదని, సర్వే ప్రకారమే సీట్లు కేటాయిస్తానని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. మంత్రి అఖిలప్రియ ప్రాతినిధ్యం వహించే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూడా సర్వే ప్రకారమే సీటు ఇస్తానని చంద్రబాబు కుండబద్దలు కొట్టిచెప్పారు. -
ఆదర్శ పాఠశాలలకు అదనపు సీట్లు
శ్రీకాకుళం: వెనుకబడిన ప్రాంతాల్లో విద్యను అభివృద్ధి చేసేందుకు 2012–13 విద్యా సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసి, తరగతులు నిర్వహిస్తున్నారు. 6,7 తరగతులతోనే మొదలైన ఆదర్శ పాఠశాలల్లో ప్రస్తుతం ఇంటర్మీడియెట్ వరకు విద్య అందిస్తున్నారు. ఏపీ మోడల్ స్కూళ్లు వచ్చి న రెండు, మూడేళ్ల వరకు కూడా సరైన ప్రచారం లేకపోవడంతో ఎలా చేర్పించాలో తెలిసేది కాదు. వరుసగా అధిక ఫలితాలు సాధిస్తుండడంతో ఎలా గైనా చేర్పించాలనే ఆసక్తితో రాజకీ య నాయకులను సైతం కలుస్తున్నారు. గత ఏడాది నుంచి 6వ తరగతిలో చేరేందుకు భారీగా దరఖాస్తులు రావడం, ఈ ఏడాది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు రావడంతో విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం ఉన్న సీట్లకు 25 శాతం అదనంగా పెంచారు. దీనికి సంబంధించి రెండు రోజుల కిందట జిల్లాకు ఉత్తర్వులు చేరాయి. దీంతో ఇప్పటివరకు ఒక్కో తరగతిలో 80 సీట్లు ఉండగా అవికాస్తా 100కు చేరాయి. జిల్లాలో 14 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. రెండేళ్ల కిందటి వరకు పదో తరగతి వరకు మాత్రమే నిర్వహించేవారు. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ వరకు మోడల్ స్కూళ్లను నిర్వహిస్తున్నారు. రెసిడెన్షియల్ తరహాలో మోడల్ స్కూళ్లను నిర్వహించాలన్న లక్ష్యంతో వీటిని ప్రారంభించారు. ఏ కారణంగానో గత ఏడాది వరకు వసతి గృహాలు ప్రారంభం కాలేదు. గత ఏడాది ఆరు మోడల్ స్కూళ్లలో బాలికల వసతి గృహాలను ప్రారంభించారు. ఈ ఏడాది మిగిలి ఉన్న 8 వసతి గృహాల్లో బాలికల వసతి గృహాలను ప్రారంభిస్తున్నారు. ప్రతి వసతి గృహంలోను ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే వంద మంది బాలికలకు అవకాశం కల్పిస్తారు. బాలురకు మాత్రం వసతి సౌకర్యం కల్పించలేదు. అయితే ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుండడం వల్ల మోడల్ స్కూళ్లకు డిమాండ్ పెరిగింది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం 25 శాతం సీట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే ఇక్కడో కొత్త మెలికను కూడా ఉత్తర్వుల్లో పొందుపరిచారు. సీట్లు పెంచినా బడ్జెట్‌ను గానీ, ఫర్నిచర్, బోధన సిబ్బంది సంఖ్యను పెంచేది లేదని పేర్కొన్నారు. అర్హత మార్కులు తగ్గించే ఆలోచన.. ఈ ఏడాది ఆరో తరగతి ప్రవేశ పరీక్షల్లో తక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించడం, ప్రశ్నపత్రం కాస్త కఠినంగా రావడంతోనే ఎక్కువ మంది అర్హత సాధించలేదు. దీంతో అర్హత మార్కులను తగ్గించి ఎక్కువ మంది విద్యార్థులను చేర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనికితోడు 7, 8 తరగతుల్లో చేరేందుకు ఆసక్తి చూపే వారికి సైతం అడ్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ప్రవేశ పరీక్ష నిర్వహించాలా, వచ్చిన విద్యార్థులకు రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయించాలా అనేది ఆయా స్కూళ్ల ప్రిన్సిపాళ్లకే అప్పగించారు. ప్రచారం కరువు జిల్లాలో మోడల్ స్కూళ్లకు విశేష ఆదరణ ఉన్నా సీట్లు పెంచిన విషయాన్ని ప్రచారం చేయకపోవడంతో ఈ విషయం ప్రజలకు తెలియకుండా పోయింది. మోడల్ స్కూళ్లకు ఇన్చార్జిగా ఉన్న అధికారి స్థానికంగా కాకుండా నిత్యం దూర ప్రాంతం నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో ఆయన పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ఇదే అధికారి డీఈఓ కార్యాలయ ఏడీగా కూడా పనిచేస్తుండడంతో మోడల్ స్కూళ్లను అదనపు భారంగానే భావిస్తున్నట్లుగా అవగతమవుతోంది. మోడల్ స్కూళ్లలో ప్రవేశాలపై ఇప్పటివరకు స్పష్టతను ఇచ్చే ప్రకటన చేయలేదు. డీఈఓ కూడా దీనిపై దృష్టి సారించే పరిస్థితి లేకుండా పోయింది. ఉప విద్యాశాఖాధికారులను తొలగించడంతో అన్ని వ్యవహారాలు డీఈఓ చూసుకోవాల్సి వస్తోంది. ఉన్న ముగ్గురు ఏడీల్లో ఇద్దరు స్థానికంగా ఉండకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుండడం, మూడో ఏడీకి పాలనాపరమైన అనుభవం కాస్త తక్కువగా ఉండడంతో వారి సహకారం కూడా డీఈఓకు లేకుండా పోయింది. ఆదేశాలు అందాయి ఏపీ ఆదర్శ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు చాలామంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఈ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంతోపాటు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నందుకే మంచి స్పందన వస్తోంది. డిమాండ్‌ను బట్టి ఒక్కో స్కూల్‌కు 25 శాతం అదనంగా సీట్లు కేటాయించేందుకు కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. 6, 7, 8 తరగతులతోపాటు ఇంటర్మీడియెట్ వరకు అదనపు సీట్ల పెంపు వర్తిస్తుంది. మోడల్ స్కూళ్లు ఉన్న ప్రాంతాల్లో సీట్లు పెంపుపై ప్రచారం చేశాం. సోమవారం నుంచి మరింత ప్రచారం చేసి పెరిగిన సీట్లన్నీ భర్తీ అయ్యేలా చూస్తాం.– ఎం. సాయిరాం, జిల్లా విద్యాశాఖాధికారి -
‘డేంజర్ జోన్’లో ఎవరో..?!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : ‘మీ నియోజకవర్గాల్లో మీకు విపత్కర పరిస్థితులు ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఇలాగే ఉంటే మిమ్మల్సి ఎవరూ రక్షించలేరు’ అంటూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించిన చేసిన ఎమ్మెల్యేలు ఎవరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 మందిలో కొందరు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారన్న ఆ ఐదుగురు ఎవరు? మూడు విడతల సర్వేలో వారి పనితీరును కళ్లకు కట్టిన అధినేత ఈసారి గట్టిగానే మందలించారా? ఒక సందర్భంలో ‘సిట్టింగ్’లకే మళ్లీ అవకాశం ఇస్తామన్న ఆయన తాజా సర్వేలతో వైఖరి మార్చుకోనున్నారా? ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ‘డేంజర్ జోన్’ ఎమ్మెల్యేలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనక తప్పదా? అనే అంశాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చగా మారాయి. తాజాగా గులాబీ దళపతి కేసీఆర్ 39 నియోజకవర్గాల్లో అక్కడినుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు విపత్కర పరిస్థితులు ఉన్నాయం టూ హెచ్చరించిన ట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలకుగాను జగిత్యాల మినహా 12 స్థానాల నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. ఇందులో ఐదుగురి పేర్లు డేంజర్ జోన్లో ఉన్నట్లు వినిపిస్తుండగా.. కొంద రు ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడిన కేసీఆర్.. మరికొందరు ఎమ్మెల్యేలకు మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్‌తో చెప్పించినట్లు సమాచారం. దీంతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడున్న స్థానాలన్నింటినీ కైవసం చేసుకోవాలన్న వ్యూహంతో ఉన్న కేసీఆర్ ‘డేంజర్ జోన్’ ఎమ్మెల్యేలకు క్లాస్ ఇస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ తాజా పరిణామాలు ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, అటు కేడర్‌లో హాట్‌టాఫిక్‌గా మారాయి. ప్రామాణికంగా మూడు విడతల సర్వేలు టీఆర్ఎస్ శాసనసభ్యులుగా ఎన్నికైన తరువాత 2015–16లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ మొదట సర్వే జరిపించారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి వరకూ మరో రెండు విడతల సర్వే నిర్వహించారు. మొదటి, రెండో విడతల ఫలితా లు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఆ సమావేశంలోనే ర్యాంకులు, మార్కులను ప్రకటించారు. తొలి సర్వేలో మంచి మార్కులు కొట్టేసిన వారు కూడా రెండో, మూడో సర్వే నాటికి వెనుకబడిపోగా.. మరికొందరు మెరుగుపర్చుకున్నట్లు తేల్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన ఈ సర్వేలో హుజూరా బాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రజలు ఫస్ట్ ర్యాంకు ఇచ్చారు. తొలి సర్వేలో మంత్రి 73.50 శాతంగా ఉంటే... రెండో సర్వే నాటికి ఆయన పనితీరు 89.90 శాతానికి పెరిగింది. ఆ తర్వాత ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ తొలి సర్వేలో 42.60 శాతం మార్కులు రాగా, రెండో సర్వేలో 47.30కి పెరిగింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ 70.60 శాతం నుంచి 60.40కు పడిపోయింది. తొలి, రెండో సర్వేలతో పోలిస్తే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నాలుగు శాతం పెరగగా.. మిగతా ఎమ్మెల్యేల్లో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు మార్కులు తగ్గాయి. అదే వరుసలో రామగుండం ఎమ్మె ల్యే సోమారపు సత్యనారాయణ, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, ఆ తర్వాత కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఉన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే శోభ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి భారీగా తగ్గారు. మూడో విడత సర్వే కూడా జరిగినప్పటికీ గోప్యంగా వ్యవహరించిన అధినేత... సర్వే ఫలితాలను ఒక్కొక్కరికీ వ్యక్తిగతంగా వివరించినట్లు అప్పట్లో పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ‘రైతుబంధు’ తర్వాత జరిగిన కీలక సర్వే రైతుబంధు పథకం అమలు తర్వాత జరిగిన సర్వేలు, వివిధ మార్గాల ద్వారా తెప్పించుకున్న నివేదికల్లో వచ్చిన సమాచారం ఇప్పుడు కీలకంగా మారింది. ఈ సర్వేలలో వచ్చిన ఫలితాలతో ఒక దశలో సీఎం కేసీఆర్ షాక్‌కు గురయినట్టు కూడా ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని, ప్రత్యర్థి పార్టీలకు కనీసం పోలింగ్ ఏజెంట్లు కూడా లేరని కేసీఆర్ చుట్టున్న నాయకులు చెప్పుకుంటున్న తరుణంలో సర్వేలు భిన్నంగా రావడంపై తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్కు ఉన్న 90 మందిలో 39 మంది డేంజర్ జోన్లో ఉన్నారంటూ నివేదికలు అందడం.. ఉమ్మడి జిల్లాలో ఐదుగురి పేర్లు ప్రచారంలోకి రావడం ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారింది. మొదటి విడత సర్వేకు.. రెండు, మూడు సర్వేలకు తేడా పోలిస్తే మెరుగ్గా ఉన్నవారితోపాటు గ్రాఫ్ తగ్గిన పలువురి పరిస్థితి కూడా మెరుగైనట్లు తేలింది. ఈ నేపథ్యంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించిన కేసీఆర్ ఒకటి, అర మినహాయిస్తే ‘సిట్టింగ్’లు అందరికీ టిక్కెట్లు ఇస్తామనే చెప్పారు. మూడేళ్ల కాలంలో నిర్వహించిన మూడు సర్వేలతోపాటు, రైతుబంధు తర్వాత తెప్పించుకున్న నివేదికల వరకు పరిస్థితి మెరుగుపడని వారిని అధినేత ‘డేంజర్ జోన్’లో చేర్చినట్లు చెప్తున్నారు. ఈ కేటగిరి కింద ఐదుగురు ఎమ్మెల్యేలు వస్తున్నారని, ఆ ఐదుగురిలో కొందరితో నేరుగా మాట్లాడిన ముఖ్యమంత్రి, మరికొందరితో మంత్రులు రాజేందర్, కేటీఆర్ మాట్లాడాలని సూచించినట్లు సమాచారం. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు ఎవరన్న చర్చ ఇటూ పార్టీ వర్గాల్లో, అటు రాజకీయ విశ్లేషకుల్లో కలకలం రేపుతోంది. ఇంత జరిగినా వారి పరిస్థితి మారకపోతే త్వరలోనే ఆ వివరాలు కూడా వెల్లడి కావచ్చన్న చర్చ జరుగుతోంది. -
డిగ్రీలో 1.21 లక్షల మందికి సీట్లు
సాక్షి, హైదరాబాద్ : డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు సోమవారం తెలంగాణ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ (దోస్త్) సీట్లను కేటాయించింది. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి సీట్ల కేటాయింపు వివరాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ప్రవేశాల కోసం 1,37,874 మంది రిజిస్టర్ చేసుకోగా, అందులో 1,29,790 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. కాగా వారిలో మొదటి దశలో 1,21,307 మంది సీట్లు లభించినట్లు వెల్లడించారు. ఆప్షన్లు ఇచ్చిన వారిలో 8,483 మందికి మొదటి దశలో సీట్లు లభించలేదు. ఇక విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం వారు ఇచ్చుకున్న మొదటి ప్రాధాన్యం (ఆప్షన్) ప్రకారమే 84,870 మందికి సీట్లు లభించాయి. మొదటి ఆప్షన్ ప్రకారమే వారికి సీట్లు వచ్చాయి కనుక వారు రెండో దశ కౌన్సెలింగ్‌కు వెళ్లే అవకా«శం ఉండదని, వారంతా నేరుగా వెంటనే కాలేజీల్లో చేరాలని కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఇక ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఈ నెల 8న ఉన్నందున ఇంజనీరింగ్‌లో సీట్లు వచ్చిన వారికి డిగ్రీలో సీటు వచ్చి ఉంటే వారి అభిప్రాయాన్ని తెలుసుకొని డిగ్రీ సీటు వద్దని అనుకుంటే ఆప్షన్ ఇవ్వాలని, దాంతో వారి డిగ్రీ సీటు ఆటోమెటిక్‌గా రద్దు అవుతుందని వివరించారు. ఇక డిగ్రీలో చేరేందుకు బాలుర కంటే బాలికలే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. సీట్లు పొందిన 1,21,307 మందిలో బాలికలు 72,859 మంది ఉంటే బాలురు 48,448 మంది ఉన్నారు. నేటి నుంచి రెండో దశ కోసం రిజిస్ట్రేషన్లు.. రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహణకు ఈ నెల 5 నుంచే చర్యలు చేపడుతున్నట్లు కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. మొదటి దశలో సీట్లు రాని వారితోపాటు త్వరలోనే విడుదల కానున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులయ్యే వారికి రెండో దశ కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో పాస్ అయ్యేవారు, ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు కూడా ఇపుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించారు. వారు రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలన్నారు. మొదటి ఆప్షన్ల ప్రకారం సీట్లు పొందిన వారు మినహా మిగతా వారు ఇంప్రూవ్మెంట్ రౌండ్ కింద ఆప్షన్లను ఇచ్చుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు ఈ నెల 12 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేలా, 14 వరకు ఆప్షన్లు ఇచ్చుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వారికి 19న సీట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనే వారు జనరల్ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్సీ, బీసీలు రూ.500 చెల్లించాలని, ఆ మొత్తం తరువాత ఫీజులో సర్దుబాటు చేస్తామని, కాలేజీల్లో చేరని వారికి వెనక్కి తిరిగి ఇచ్చేస్తామన్నారు. మరోవైపు మూడో దశ కౌన్సెలింగ్‌ను కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని, జూలై 2 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. జూలై 5 నుంచి 7 వరకు కాలేజీ పరి«ధిలోనే ఇంటర్నల్ స్లైడింగ్‌కు అవకాశం కల్పిస్తామని వాటి కేటాయింపును జూలై 10న ప్రకటిస్తామని వివరించారు. -
పేదింటి ఆణిముత్యం
నీట్లో పేదింటి విద్యార్థిని సత్తా చాటింది. ఎంబీబీఎస్‌లో పీజీ(ఎండీ జనరల్ మెడిషన్) సీటు సాధించింది. చదువుకు పేదరికం అడ్డురాదని నిరూపించి పదిమందికి ఆదర్శంగా నిలిచిన విద్యార్థిని సుప్రజ ఆశయం.. కుటుంబ నేపథ్యంపై ప్రత్యేక కథనం. కోవెలకుంట్ల: కోవెలకుంట్లకు చెందిన ఓబుళపు సూర్యనారాయణరెడ్డి, రాజేశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో గౌండ వృత్తి నిర్వíßహించుకుంటూ పిల్లలను ప్రయోజకుల్ని చేయాలన్న ఉద్దేశంతో ఉన్నత చదువులు చదివిస్తున్నారు. పెద్దకుమార్తె సుప్రజ పదవ తరగతి వరకు పెండేకంటి పబ్లిక్ పాఠశాలలో, విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేసుకుని 2011వ సంవత్సరంలో ఎంసెట్‌లో ర్యాంకు సాధించి రాయచూర్‌లోని నవోదయ మెడికల్ కళాశాలలో ఎంబీసీబీఎస్ పూర్తి చేసింది. ఈ ఏడాది నిర్వహించిన నీట్పరీక్షలో 5వేలు ర్యాంకు పొంది బెంగుళూరులోని వైదేహి మెడికల్ కళాశాలలో పీజీ సీటు దక్కించుకుంది. చిన్నకుమార్తె ఇందిర ఇంజినీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని నీట్లో ప్రతిభ కనబరిచి జనరల్ మెడిషన్ సీటు సాధించడంతో ఆ విద్యార్థినికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రోటరీక్లబ్ మాజీ అధ్యక్షులు బాలాంజనేయరెడ్డి, మోహనమూర్తి, సుబ్బయ్య, శివ, తదితరులు ఆ విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు. పేదలకు సేవచేయాలన్న తపన: సుప్రజ పేదల కష్టాలను చాలా దగ్గరగా చూశాను. పూట గడవటమే కష్టంగా ఉన్న పేద కుటుంబాల్లోని వ్యక్తులు జబ్బు పడితే వైద్యం చేయించుకోలేని పరిస్థితి. తల్లిదండ్రులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉన్నత చదువులు చదివి ఈ స్థాయికి చేరాను. బెంగుళూరులో పీజీ కోర్సు పూర్తి అయ్యాక డాక్టర్‌గా స్థిరపడి పేద ప్రజలకు సేవ చేయాలన్నదే నా ముందున్న లక్ష్యం. -
రైలులో సీటు కోసం డిష్యుం డిష్యుం
కమలాపురం: ఆస్తి పాస్తుల కోసమో.. డబ్బు కోసమో ఘర్షణ పడి పోలీస్ స్టేషన్ వరకు వచ్చే వారిని చూస్తుంటాం. కానీ రైలులో ప్రయాణిస్తూ సీటు కోసం ఘర్షణ పడి పోలీస్ స్టేషన్‌కు చేరిన సంఘటన కమలాపురంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ప్రకాశం జిల్లా, సీఎస్ పురం మండలం, చెర్లోపల్లెకు చెందిన రామనబోయిన సుబ్బయ్య, రామయ్య, సుధూర్, ఇండ్ల వెంకటేష్ తదితరులు వారి కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పుణేలో జరుగుతున్న వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు సాయంత్రం రేణిగుంటలో దాదర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. అలాగే వేంపల్లెకు చెందిన నామా శ్రీనివాసులు, హేమంత్, కశెట్టి నరసింహులు తమ కుటుంబ సభ్యులతో తిరుపతిలో మలుపెళ్లి చూసుకొని రేణిగుంటలో రైలు ఎక్కారు. కడప వరకు వారి ప్రయాణం సజావుగా సాగింది. కడప రైల్వే స్టేషన్ దాటాక ఆ రెండు కుటుంబాల వారు సీటు కోసం ఘర్షణకు దిగారు. మాటా మాటా పెరిగి కొట్టుకున్నారు. అయితే ప్రకాశం జిల్లా వాసులు ఎక్కువ మంది ఉండటంతో వేంపల్లె వారిని గాయ పడే విధంగా కొట్టారు. ఈ విషయాన్ని గమనించిన రైల్వే పోలీసులు వారిని కమలాపురం పోలీస్ స్టేషన్లో దించి వేశారు. దీంతో వారు కమలాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే కమలాపురం పోలీసులు రైలులో జరిగిన ఘర్షణతో తమకు సంబంధం ఉండదని, కడప రైల్వే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసుకోవాలని సూచించడంతో వారు కడప రైల్వే పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. -
మంత్రి సీటుకు అనుచరుల ఎసరు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నగర టీడీపీలో ఎత్తుగడ రాజకీయాలకు పూర్తి స్థాయిలో తెరలేచాయి. నిత్యం మంత్రి నారాయణ వెంట ఉండే కీలక అనుచరగణమే ఆయన సీటుకు ఎసరు పెట్టాయి. అదే స్థానం కోరుతూ పలువురు నేతలు కీలక లాబీయింగ్‌కు తెరతీసి సరికొత్త సమీకరణాలు తెరపైకి తెచ్చి సీటు హామీ వచ్చిందని ప్రచారం చేసుకుంటూ హడావుడి చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే మంత్రి నారాయణ చుట్టూ ఉన్న ప్రథమ శ్రేణి నేతలు అంతా టికెట్ కోసం ప్రయత్నిస్తూ గురువుకే సున్నం పెడుతున్నారు. వీరిలో ఒకరైతే మరో అడుగు ముందుకు వేసి సీటు తనకి వస్తే ఖర్చు మంత్రిగారే పెట్టుకుంటానని చెప్పారనే ప్రచారానికి తెరతీశారు. ఈ పరిణామాల క్రమంలో మంత్రి నారాయణ జిల్లాలో మరో నియోజకవర్గం సీటుపై దృష్టి సారించి అక్కడ రాజకీయ పనులు మొదలుపెట్టినట్లు సమాచారం. ఇప్పటికే నగర టీడీపీ చుక్కాని లేని నావలా తయారైంది. నేతలు పదుల సంఖ్యలో ఉన్నప్పటికీ వారి వ్యక్తిగత కార్యక్రమాలు మినహా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాఖలాల్లేవు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం పలుమార్లు నేతలు అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పినా అది ఎవరూ పట్టించుకోని పరిస్థితి. దీంతో నగర టీడీపీలో గందరగోళం నెలకొంది. పాత, కొత్త నేతల వివాదాలు, గొడవలు, ఆదిపత్య పోరు నిత్య కృత్యంగా సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడే అసెంబ్లీ టికెట్ ఫైట్‌కు అధికార పార్టీలో తెర లేచింది. సార్వత్రిక ఎన్నికలకు మరో 10 నెలలు సమయం ఉన్నా అధికార పార్టీలో మాత్రం టికెట్ హడావుడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా గత ఏడాది కాలంగా అయితే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నెల్లూరు నగరం నుంచి తాను పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో ప్రకటించుకున్నారు. దీనికి అనుగుణంగా నగరంలో కార్యక్రమాలు చేస్తున్నారు. కనీసం వారంలో రెండు రోజుల పాటు నగరంలో పర్యటనలు నిర్వహించటం, అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు నగరంలో అధికార పార్టీ కార్పొరేటర్లందరినీ తనవైపు మరల్చుకోవడానికి వీలుగా అందరికీ పనులు చేయించటం, ఆయా డివిజన్లకు నిధులు కేటాయించి నేరుగా తనతోనే మాట్లాడాలని ఆదేశాలు ఇచ్చి నగరంలో బలంగా వర్గం ఏర్పాటు చేసుకునే యత్నాలు సాగించారు. అయితే అవి కొంతమేరకే ఫలించాయి. ఈ క్రమంలో మంత్రి కోటరీలో కీలక వ్యక్తులుగా ఉన్న నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర టీడీపీ ఇన్చార్జి మంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి. టీడీపీ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధలు టికెట్ రేసులోకి వచ్చారు. అలాగే నుడా చైర్మన్, నగర టీడీపీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా సీటు కోసం తన లాబీయింగ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఎవరికీ వారు కార్యక్రమాలు నిర్వహించి హడావుడి చేస్తున్నారు. అయితే అంతిమంగా మాత్రం ఎవరు పార్టీ కార్యక్రమాలు నిర్వహించని పరిస్థితి. దీంతో నగరంలో ఆధిపత్యం విషయమై నేతల మధ్య పలుమార్లు అంతర్గత వివాదాలు రేగి మంత్రి వద్దే పంచాయితీలు జరిగాయి. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత 1983లో ఆనం రామనారాయణరెడ్డి, ఆ తర్వాత 1994లో తాళ్లపాక రమేష్‌రెడ్డి మాత్రమే అధికార పార్టీ నుంచి ఇక్కడ గెలుపొందారు. 1994లో రమేష్‌రెడ్డి గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. దీంతో స్వతహాగానే నగరంలో పార్టీకి పట్టు తక్కువ. ఈ క్రమంలో 2014 నుంచి భారీగా వలస వచ్చిన నేతలు కూడా ఎక్కువ అయ్యారు. నేతలు ఎక్కువ, కార్యకర్తలు తక్కువ అన్న రీతిలో నగరంలో పరిస్థితి ఉంది. మైనార్టీ కోటాలో అజీజ్ హడావుడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మేయర్‌గా గెలుపొందిన అబ్దుల్ అజీజ్ పార్టీ ఫిరాయించారు. ఈయన నెల్లూరు టికెట్ తనకే దక్కుతుందని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే టికెట్ హామీతోనే పార్టీ ఫిరాయించానని, మంత్రి నారాయణతో పాటు లోకేశ్, చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని చెబుతుండటంతో పాటు రెండు నెలలుగా మైనార్టీ ఆత్మీయ సమావేశాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించి టికెట్ డిమాండ్‌ను బలపరుచుకునేలా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇన్చార్జి ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి టికెట్ తనకే వస్తుందని బలంగా చెప్పుకుంటూ పనిచేస్తున్నారు. మరోవైపు నగర టీడీపీ ఇన్చార్జీ హోదాలో నగరంతో పాటు రాజధానిలోనూ మంత్రి సహకారంతో భారీగా కాంట్రాక్ట్ వర్కులు తీసుకుంటు మందస్తు సన్నాహాల్లో ఉన్నారు. ఇక తాళ్లపాక అనురాధ కూడా టికెట్ కోసం ఆశిస్తూ తనకి టికెట్ వస్తే పార్టీ, మంత్రి నారాయణ ఖర్చు పెడతరానే ప్రచారం చేసుకుంటున్నారు. ఇక నుడా చైర్మన్ కోటంరెడ్డి యథావిధిగా బాలయ్య కోటాలో టికెట్ వస్తుందనే ఆశలో ఉన్నారు. నగర నేతలను ఏకతాటిపైకి తీసుకురావాలని మంత్రి రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో నగరంలో తలనొప్పులు పడటం కష్టమనే భావనతో కొత్త నియోజకవర్గంపై దృష్టి సారించారు. మొత్తం మీద నగరం టీడీపీలో కొనసాగుతున్న టికెట్ ఫైట్ మంత్రికే తలనొప్పిగా మారటం విశేషం. -
2019 ఎన్నికల్లో 12 సీట్లల్లో 6 సీట్లు ఇవ్వాలి
మిర్యాలగూడ టౌన్ : వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు సముచిత స్థానం కల్పించకుంటే తగిన బుద్ధి చెప్పుతామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ కమిటీ ప్రె సిడెంట్ మేకల వెంకన్న, తెలం గాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బీసీ కులాల సంఘాల సమావేశానికి అతిథిగా హాజరయ్యారు. 2019 ఎన్నికల్లో 12 సీట్లల్లో 6 సీట్లు బీసీ జనా భా ప్రాతిపదికన సీట్లు పార్టీలు కేటాయిం చాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా బీసీకి ఎమ్మెల్యే టికెట్‌ను కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో అంజి, శ్రీను గిరి, సత్యనారాయణ, లక్ష్మినారాయణ, కృష్ణ, , పుప్పాల సత్యం, రాచూరి మహేష్, పందిరి వేణు, కంచి సత్యనారాయణ, లోహిత్, ఆనంద్, ప్రశాంత్ ఉన్నారు. -
స్టాక్స్ వ్యూ
సియట్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.1,695 ; టార్గెట్ ధర: రూ.2,029 ఎందుకంటే: ఆర్పీజీ గోయంకా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ... ఆదాయం పరంగా భారత్‌లో నాలుగో అతి పెద్ద టైర్ల కంపెనీ. రోజుకు 95 వేల టైర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా పటిష్టమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆదాయం అంచనాలకు అనుగుణంగా ఉండగా, నికర లాభం, ఇబిటా అంచనాలను అందుకోలేకపోయాయి. ఆదాయం 1% క్షీణించి రూ.1,628 కోట్లకు తగ్గింది. ముడిపదార్ధాల వ్యయాలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగడంతో గత క్యూ1లో రూ.185 కోట్లుగా ఉన్న ఇబిటా ఈ క్యూ1లో రూ.55 కోట్లకు తగ్గింది. ఫలితంగా నికర లాభం రూ.104 కోట్ల నుంచి 99% క్షీణించి రూ.కోటికి పడిపోయింది. సహజ రబ్బరు ధరలు 30%, సింథటిక్ రబ్బర్ ధరలు 50% పెరగడం బాగా ప్రభావం చూపించింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఇప్పటికే సగటు ముడి పదార్ధాల వ్యయాలు 10% తగ్గాయి. ఇవి మరింతగా తగ్గే అవకాశాలున్నాయి. దీంతో మార్జిన్లు పుంజుకుంటాయని భావిస్తున్నాం. పంక్చర్ లెస్, మైలేజీ అధికంగా ఇచ్చే వంటి వినూత్నమైన టైర్లను మార్కెట్లోకి తెస్తుండటంతో ప్రయాణికుల సెగ్మెంట్ టైర్ల అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. గత ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి తెచ్చిన ట్రక్, బస్ రేడియల్(టీబీఆర్) టైర్ల సెగ్మెంట్ 70–80 % వృద్ధి సాధించగా, భవిష్యత్తులో మరో 10–15% వృద్ధికి అవకాశాలున్నాయని కంపెనీ అంచనా వేస్తోంది. ముడి పదార్ధాలు ధరలు తగ్గుతుండడం, జీఎస్టీ అమలు తర్వాత రికవరీ జరిగే అవకాశాలు, చైనా నుంచి దిగుమతయ్యే టైర్లపై యాంటీ డంపింగ్ సుంకం విధింపు కారణంగా దేశీయ టైర్ల కంపెనీల మార్కెట్ వాటా పెరిగే అవకాశాలు.. ఇవన్నీ సానుకూలాంశాలు. రెండేళ్లలో ఆదాయం 8 శాతం, నికర లాభం 17% చొప్పున చక్రగతిన వృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఫ్యూచర్ రిటైల్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.443 ; టార్గెట్ ధర: రూ.560 ఎందుకంటే: ఫ్యూచర్ రిటైల్ సంస్థ–బిగ్‌బజార్, ఫుడ్‌హాల్, ఫుడ్ బజార్, ఈజీ డే ఫార్మాట్ స్టోర్స్‌ను, ఎఫ్‌బీబీ, హోమ్ టౌన్(హోమ్ అండ్ ఫర్నిషింగ్స్), ఈజోన్(ఎలక్ట్రానిక్స్ రిటైల్) స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. 2005–10 కాలంలో భారీగా విస్తరించడం, సంబంధం లేని వ్యాపారాల్లోకి ప్రవేశించిండం వంటి కారణాల వల్ల కంపెనీ రుణ భారం పెరిగిపోయింది. 2011–12 ఏడాది నుంచి పునర్వ్యస్థీకరణ చేపట్టింది. పాంటలూన్స్ సంస్థను విక్రయించింది. బిగ్‌బజార్ స్టోర్స్‌ను పునర్వ్యస్థీకరించింది. వీటన్నింటి ఫలితంగా ఆరోగ్యకరమైన ఆర్థిక స్థితిగతులతో.. భారత్‌లో అగ్రస్థాయి మల్టీ ఫార్మాట్ రిటైలర్ కంపెనీగా అవతరించింది. చౌక ధరల్లో ఉత్పత్తులందించే రిటైల్ చెయిన్‌గా 2001లో ప్రారంభమైన బిగ్‌బజార్‌ను పూర్తి స్థాయి వెరైటీ డిపార్టమెంటల్ స్టోర్‌గా పునర్వ్యస్థీకరించింది. యువతను ఆకర్షించేందుకు బిగ్‌బజార్ జెన్ నెక్స్ట్ పేరుతో కొత్త స్టోర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫ్యాషన్ బిగ్ బజార్(ఎఫ్‌బీబీ)ను కూడా మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్‌కు అనుగుణంగా మార్పుచేర్పులు చేసింది. ఈజీ డే, హెరిటేజ్ రిటైల్ స్టోర్స్‌ను కొనుగోలు చేసి, స్మాల్ ఫార్మాట్ స్టోర్ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకుంది. స్వంత బ్రాండ్ కొర్యొ ఉత్పత్తుల విక్రయాల పెంపుపై దృష్టి సారిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,100 కోట్లుగా ఉన్న నికర రుణ భారం వచ్చే ఏడాది కల్లా పూర్తిగా తగ్గిపోగలదన్న అంచనాలున్నాయి. పాంటలూన్స్లో మెజారిటీ వాటాను విక్రయించడం, క్యాపిటల్ ఫస్ట్‌లో పూర్తి వాటాను అమ్మేయడం, జెనరాలి సంస్థతో ఏర్పాటు చేసిన రెండు బీమా జేవీల్లో వాటాలను కూడా విక్రయించి రుణభారాన్ని తగ్గించుకుంది. హోమ్, ఫర్నిషింగ్స్ విభాగం హోమ్ టౌన్‌ను డీమెర్జ్ చేయాలని యోచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 3.4 శాతంగా ఉన్న ఆపరేటింగ్ మార్జిన్ 2021–22 ఆర్థిక సంవత్సరానికి 5.5 శాతానికి పెరగగలదని అంచనా వేస్తున్నాం. -
కాపు కులస్థులకే మేయర్ పీఠం
భానుగుడి (కాకినాడ): కాకినాడ నగర మేయర్ పీఠాన్ని కాపు కులస్తులకే ఇవ్వాలని అ««ధిష్టానం నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 48వ వార్డుల్లో పోటీచేసే తేదేపా అభ్యర్థుల జాబితాను జిల్లా పార్టీ కార్యవర్గం సిద్ధం చేసిందని, పరిశీలనకు అధిష్టానానికి పంపినట్లు పేర్కొన్నారు. ఆమోదముద్ర పడగానే జాబితాను విడుదల చేస్తామని రాజప్ప ప్రకటించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కళా వెంకట్రావు ఎన్నికలకు సంబంధించి సంధానకర్తగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కాకినాడ నగర పార్టీలో కాపు వర్గీయులకు–ఎమ్మెల్యేకు మధ్య ఉన్న పొరపొచ్చాలను విలేకరులు ప్రశ్నించగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించి ముందుకెళతామన్నారు. ముద్రగడ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుందని ప్రశ్నించిన విలేకరులపై విరుచుకుపడ్డారు. కాపులకు ఎప్పుడూ పార్టీలో గుర్తింపు ఉందని, ముద్రగడ గేటువరకు వచ్చి డబ్బు కొట్టి వెనక్కి వెళుతున్నారని, ఇదేం పద్ధతో అర్థం కావడం లేదని ముద్రగడ ఆందోళనను అవహేళన చేసేలా మాట్లాడారు. సమావేశంలో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, జిల్లా తెదేపా అధ్యక్షుడు నామన రాంబాబు, జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్, ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఎంసెట్ తుది దశ కౌన్సెలింగ్
♦ 12,264 ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ ♦ యూనివర్సిటీ కాలేజీల్లో 99.4 శాతం సీట్లు భర్తీ ♦ ప్రైవేటు కాలేజీల్లో 80.8 శాతమే ♦ ఎంపీసీ కోటా ఫార్మా సీట్ల భర్తీ 4.9 శాతమే సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. తుది దశ కౌన్సెలింగ్‌కు సంబంధించి సీట్ల కేటాయింపు శనివారం నాటితో పూర్తయింది. ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఫార్మాడీ కేటగిరీలో 77.8 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈ మూడు కేటగిరీల్లో 317 కాలేజీల్లో 70,427 సీట్లు కన్వీనర్ కోటాలో ఉండగా.. 54,784 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం నాటితో పూర్తి కావడంతో మూడు కేటగిరీల్లో 15,643 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇందులో ఇంజనీరింగ్ కేటగిరీలో 12,264 సీట్లు ఖాళీగా ఉండగా.. బీ ఫార్మసీలో 2,925 సీట్లు, ఫార్మాడీలో 454 సీట్లు మిగిలాయి. 2,015 మందికి దక్కని సీట్లు.. తుది దశ కౌన్సెలింగ్‌లో మొత్తంగా 1,06,200 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోగా 65,745 మంది విద్యార్థులు మాత్రమే అర్హులుగా తేలారు. వీరిలో తొలి దశలో 63,588 మంది ఆప్షన్లు ఇచ్చుకోగా, తుది దశలో 38,661 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. మొత్తం 54,784 సీట్లు భర్తీ కాగా.. 2,015 మంది విద్యార్థులకు సీట్లు అలాట్ కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక్క సీటు కూడా అలాట్ కాకపోగా.. 76 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇంజనీరింగ్ కోటాలో 14 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో 99.4 శాతం సీట్లు భర్తీ కాగా.. 187 ప్రైవేటు కాలేజీల్లో 80.8 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఫార్మాసీ కాలేజీలు వెలవెల.. ఈ ఏడాది ఎంపీసీ కోటా విద్యార్థులు ఫార్మసీ కోర్సులపై అనాసక్తి చూపారు. ఎంపీసీ కోటాలో 3 యూనివర్సిటీ కాలేజీల్లో 80 సీట్లు ఉండగా.. కేవలం 24 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 113 ప్రైవేటు కాలేజీల్లో 2,997 సీట్లు ఉండగా.. వీటిలో 128 సీట్లు మాత్రమే అభ్యర్థులు దక్కించుకున్నారు. ఫలితంగా 2,869 సీట్లు మిగిలిపోయాయి. అలాగే ఎంపీసీ కోటాలో ఫార్మాడీ కేటగిరీలో 51 ప్రైవేటు కాలేజీల్లో 503 సీట్లు ఉండగా.. వీటిలో 49 మందికి మాత్రమే సీట్లు కేటాయించారు. దాంతో 454 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. 29లోగా రిపోర్ట్ చేయాలి.. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్ పద్ధతిలో లేదా నగదు రూపంలో నిర్దేశిత బ్యాంకులో చలానా ద్వారా ఫీజు చెల్లించాలి. అనంతరం చలానా నంబర్ ఆధారంగా వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ నింపాలి. విద్యార్థులు ఈ నెల 28లోగా ఈ పేమెంట్ ప్రక్రియ పూర్తి చేసి.. 29లోగా కాలేజీలో రిపోర్టు చేయాలని ఎంసెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో తెలి పారు. ఫీజు రీయింబర్స్మెంట్ పొందే అభ్యర్థులు ఈ నెల 27లోగా ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని హెల్ప్‌లైన్ సెంటర్లో సమర్పించాల్సి ఉంటుంది. -
నోటుకు సీటు!
ఆదర్శ పాఠశాలలో మెరిట్ ముసుగులో సీట్ల అమ్మకం - రూ.10వేల నుంచి రూ.15వేలు వసూలు - ఒప్పందం మేరకు వాట్సాప్‌లో ప్రశ్న, జవాబు పత్రాలు - ప్రిన్సిపాల్, మరో ఇద్దరు ఉపాధ్యాయుల పాత్ర - వేకెన్సీ సీట్ల భర్తీలో రిజరేషన్కు పాతర - అమ్ముడుపోయిన సుమారు 70 సీట్లు - ‘సాక్షి’ నిఘాలో బట్టబయలు ఆదర్శం అభాసు పాలయింది. విద్యార్థులకు తప్పొప్పులు తెలియజెప్పాల్సిన ఉపాధ్యాయులే తప్పటడుగులు వేశారు. జీవితం సాఫీగా సాగిపోయేందుకు అవసరమైన జీతం వస్తున్నా.. గీతం కోసం అర్హులైన విద్యార్థులకు వెన్నుపోటు పొడిచారు. ప్రయివేట్ పాఠశాలలను కాదని.. ఆదర్శ పాఠశాలల్లోనే తమ పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఆశించిన తల్లిదండ్రుల కలనూ కాలరాశారు. మెరిట్.. రిజర్వేషన్ ప్రాతిపదికన భర్తీ చేయాల్సిన సీట్లను అమ్మకానికి పెట్టడంతో సరస్వతీ మాత కన్నీరు పెడుతోంది. రాయదుర్గం అర్బన్ : పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో సీటుకు బాగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో పరీక్ష తప్పనిసరి చేశారు. ఆరో తరగతిలో 80 సీట్ల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షలో దాదాపు 400 మంది విద్యార్థులు హాజరువుతుండటం చూస్తే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక్కో తరగతికి 80 సీట్ల చొప్పున మంజూరు చేయగా, గత ఏడాది ప్రజాప్రతినిధులపై విపరీతమైన ఒత్తిడి రావడంతో ఆరో తరగతికి అదనంగా మరో 80 సీట్లను మంజూరు చేశారు. ఒకసారి ఆరో తరగతిలో చేరిలో ఇంటర్మీడియట్ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే అభిప్రాయం తల్లిదండుల్లో ఉంది. కాన్వెంట్లలో చదివించే తల్లిదండ్రులు కూడా ఆదర్శ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో దళారులు, ఇద్దరు ఉపాధ్యాయులు సొమ్ము చేసుకునేందుకు సిద్ధపడ్డారు. సీటుకు రూ.10వేల నుంచి రూ.15వేల చొప్పున సుమారు 70 సీట్లను అమ్మకున్నట్లు తెలిసింది. డబ్బిచ్చిన వారికి వాట్సాప్‌లో ముందుగానే ప్రశ్న, జవాబు పత్రాలు పంపుతున్నారు. అది కూడా రాయలేని వారికి వారే దిద్దుబాట్లు చేసి పంపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కారణంగా మెరిట్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఎవరైనా గుర్తించి ప్రశ్నిస్తే నిబంధనలకు విరుద్ధంగా సీట్లు కేటాయించి నోరు మూయిస్తున్నట్లు తెలుస్తోంది. వెలుగులోకి వచ్చిందిలా.. ఆదర్శ పాఠశాలలో పెద్ద ఎత్తున సీట్ల కోసం డబ్బు వసూలు చేస్తున్నారనే విషయమై బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ దృష్టి సారించగా వాయిస్ రికార్డులతో పాటు, రిజర్వేషన్ రోస్టర్ వెల్లడితో అడ్డంగా దొరికిపోయారు. వివిధ తరగతుల్లో ఖాళీగా ఉన్న 13 సీట్లను భర్తీ చేయడానికి గత నెల 24న రిజర్వేషన్ రోస్టర్‌ను ప్రిన్సిపాల్ ప్రకటించారు. జాబితా ప్రకారం ఏడో తరగతిలో ఆరు సీట్లు, ఎమిమిదో తరగతిలో మూడు సీట్లు, తొమ్మిదో తరగతిలో 4 సీట్లు ఉన్నాయి. వీటికి దరఖాస్తులు స్వీకరించారు. జాబితాలో పదో తరగతిలో సీట్లు చూపకపోయినప్పటికీ దరఖాస్తులు స్వీకరించారు. కేవలం రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం దరఖాస్తులు స్వీకరించకుండా, అందరితోనూ దరఖాస్తులు స్వీకరించడం చర్చనీయాంశమైంది. వీరికి ఈ నెల 5వ తేదీన పరీక్షలు నిర్వహించారు. డబ్బు ఇచ్చిన వారికి ముందుగానే వాట్సాప్‌లో ప్రశ్నాపత్రాన్ని, జవాబు పత్రాన్ని పంపించారు. నాలుగో తేదీ సాయంత్రం 4.25 గంటలకు ఒక వ్యక్తికి ç ప్రశ్నాపత్రం పంపగా, 5వ తేదీ ఉదయం 7.34 గంటలకు అదే వ్యక్తికి జవాబు పత్రం కూడా ప్రిన్సిపాల్ సెల్ నుంచి వెళ్లింది. ఖాళీ సీట్ల భర్తీకి పాటించాల్సిన రిజర్వేషన్ వివరాలివీ.. నోటిఫికేషన్ ప్రకారం గత నెల 24న ప్రకటించిన ఖాళీలకు రిజర్వేషన్ వివరాలను ప్రిన్సిపాల్ విడుదల చేశారు. ఏడో తరగతిలో ఉన్న ఆరు సీట్లలో ఒకసీటు ఎస్సీ జనరల్ , మూడు సీట్లు ఎస్సీ ఉమెన్, ఒక సీటు ఎస్టీ ఉమెన్, ఒక సీటు బీసీ–బీ ఉమెన్‌కు కేటాయించారు. ఎనిమిదో తరగతిలోని మూడు సీట్లలో ఓసీ ఉమెన్‌కు ఒకటి, ఎస్సీ ఉమెన్‌కు ఒక సీటు, బీసీ–డీ జనరల్‌కు ఒక సీటు కేటాయించారు. తొమ్మిదో తరగతిలోని నాలుగు సీట్లలో ఎస్సీ జనరల్‌కు ఒక సీటు, ఎస్సీ ఉమెన్‌కు ఒక సీటు, ఎస్టీ ఉమెన్‌కు ఒక సీటు, బీసీ–డీ ఉమెన్‌కు ఒక సీటు కేటాయించారు. ఈ సీట్లకు 178 మంది దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థుల ఎంపిక చేశారిలా.. ఈనెల 12న వేకెన్సీ సీట్ల భర్తీకి సంబంధించిన ఫలితాలను వెల్లడించారు. అయితే రిజర్వేషన్‌కు, ఫలితాలకు పొంతన లేకుండా పోయింది. ఏడో తరగతిలో ఆరు సీట్లకు గాను ఓసీ కేటగిరీ కింద ఇద్దరు బాలురు, బీసీ–బీ కింద ఒక బాలుడు, బీసీ–డీ కింద ఒక బాలుడు, ఒక బాలికను, బీసీ–ఏ కింద ఒక బాలుడిని ఎంపిక చేశారు. 8వ తరగతికి ఎంపిక చేసిన ముగ్గురిలో బీసీ–బీ కింద ఇద్దరు బాలురు, ఓసీ కింద బాలికను ఎంపిక చేశారు. 9వ తరగతిలో బీసీ–బీ కింద ఇద్దరు బాలురు, ఒక బాలికను, బీసీ–డీ కింద ఒక బాలికను ఎంపిక చేశారు. 10వ తరగతికి వేకెన్సీలో చూపకపోయినప్పటికీ ఒక సీటు ఖాళీగా ఉందంటూ ఓసీకి చెందిన బాలుడిని ఎంపిక చేశారు. ఫలితాల్లో రిజర్వేషన్లకు తిలోదకాలు వేకెన్సీ సీట్ల కోసం ఈ నెల 5వ తేదీన 176 మంది పరీక్ష రాయగా, 13 మందిని ఎంపిక చేశారు. అయితే రిజర్వేషన్లకు తిలోదకాలు ఇవ్వడంతో వ్యవహారం బట్టబయలైంది. విషయాన్ని పసిగట్టిన ‘సాక్షి’ లోతుగా అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రిన్సిపాల్.. ప్రస్తుతం, అంతకు ముందు ఎంపికైన ఆరవ తరగతి విద్యార్థులతో స్థానిక ఎమ్మెల్యేల రెకమండేషన్ లెటర్ తీసుకురావాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఎవరితోనూ డబ్బు తీసుకోలేదు మెరిట్ ప్రాతిపదికనే ఎంపిక ప్రక్రియ చేపడుతున్నాం. సీట్ల కోసం ఎవరితోనూ డబ్బు తీసుకోలేదు. మంచి మార్కులు వచ్చిన వారికే అవకాశం కల్పించాం. రిజర్వేషన్ రోస్టర్ ప్రకటించకుండా ఉండాల్సింది. - ప్రకాశ్‌నాయుడు, ప్రిన్సిపాల్, ఆదర్శ పాఠశాల, రాయదుర్గం -
ఆసక్తి చూపని విద్యార్థులు!
– 214 సీట్లకు 93 మంది హాజరు – ఇదీ కార్పొరేట్ విద్య పథకం దుస్థితి అనంతపురం ఎడ్యుకేషన్ : భర్తీ చేయాల్సిన సీట్లు 232. వచ్చిన దరఖాస్తులు 1960. చివరగా కౌన్సెలింగ్ హాజరైన విద్యార్థులు 93 మంది ... ఇదీ కార్పొరేట్ విద్య పథకం దుస్థితి. దీన్నిబట్టి చూస్తుంటే ఏడాదికి రూ.35 వేలు ఖర్చు చేసి ఉచితంగా చదివిస్తామంటే కూడా పిల్లలు ఆసక్తి చూపడం లేదనేది స్పష్టమవుతోంది. మరోవైపు ప్రభుత్వ అలసత్వం కారణంగానే ఈ దుస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలకు ఫీజు చెల్లించలేక చదువు మానేసిన కుటుంబాలు జిల్లాలో అనేకం. ఇలాంటి జిల్లాకు వరంగా మారిన కార్పొరేట్ విద్య పథకం చతికిల పడింది. 232 సీట్లు భర్తీ చేయాల్సి ఉండగా తొలివిడతా 214 సీట్ల ప్రవేశాలకు గురువారం స్థానిక ఎస్సీ నంబర్ 4 వసతి గృహంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయా కళాశాలలకు విద్యార్థులను కేటాయిస్తూ ప్రవేశ పత్రాలు అందజేశారు. అయితే 214 సీట్లకు గానూ కేవలం 93 మంది మాత్రమే హాజరయ్యారంటే ఈ పథకం ఉపయోగం అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ విద్యార్థులు 103 మందికి 56, మైనార్టీ విద్యార్థులు 15 మందికి 6, బీసీ విద్యార్థులు 54 మందికి 13, ఈబీసీ విద్యార్థులు 11 మందికి 4, ఎస్టీ విద్యార్థులు 28 మందికి 14 మంది హాజరయ్యారు. ఇక బీసీసీ విద్యార్థులు ముగ్గురికి కూడా ఒక్కరూ హాజరుకాలేదు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రోశన్న, బీసీ సంక్షేమశాఖ డీడీ రమాభార్గవి, గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి కొండలరావు, సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి లక్ష్మానాయక్ తదితరులు కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. ఆలస్యమే ప్రధాన కారణం : ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదివి పదో తరగతిలో బాగా ప్రతిభ చాటి ఆర్థిక ఇబ్బందిగా ఉన్న కుటుంబాలకు కార్పొరేట్ విద్య పథకం చాలా ఉపయోగకరం. అయితే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల చాలామందికి ఉపయోగం లేకుండాపోయింది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ. 35 వేలు ఫీజు చెల్లించడంతో పాటు విద్యార్థి ఖర్చుకు రూ. 3 వేలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. జూన్ 1 నుంచే ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. సరిగ్గా 35 రోజుల తర్వాత ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో ఇప్పటికే చాలామంది వారికి అనుకూలమైన కళాశాలల్లో అప్పుసప్పులు చేసి చేరిపోయారు. దీనికితోడు పేరుకు కార్పొరేట్ పథకం అని ఉన్నా...జాబితాలో అన్నీ లోకల్ కళాశాలల పేర్లే ఉండటం కూడా విద్యార్థులు చేరకపోవడానికి మరో కారణమంటూ విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. -
‘దేశం’లో కుర్చీలాట
- జెడ్పీ పీఠంపై వీడని ఉత్కంఠ - సమన్వయ సమావేశంలో తేలని రచ్చ - మధ్యలో వచ్చే వారికి పదవులిస్తే ఎలా అంటున్న నామన వర్గం - పట్టు సడలించని జ్యోతుల వర్గం - నేడు సీఎం సమక్షంలో భేటీ సాక్షి ప్రతినిధి, కాకినాడ : తెలుగుదేశం పార్టీలో రెండు పీఠాలు చిచ్చురేపుతున్నాయి. ఒకటి ఏడాదికిపైనే ఖాళీగా ఉంటే మరొకటి కావాలని ఖాళీ చేస్తున్నారు. ఈ రెండు పీఠాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటంతో నేతలు రెంగు గ్రూపులు కడుతున్నారు. ‘కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకున్న’ సామెత మాదిరిగా నేతల తీరు ఉండటంతో భర్తీ ప్రక్రియను ఏకాభిప్రాయంతో ముగింపు పలకలేక చేతులెత్తేశారు. పర్వత చిట్టిబాబు ఆకస్మిక మరణం తరువాత నుంచి పార్టీ జిల్లా అ«ధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. ఈ పీఠం భర్తీ చేయాలని పార్టీలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతలో జగ్గంపేట, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావులు నమ్మి ఓటేసిన జనాన్ని గాలికొదిలేసి టీడీపీ గూటికి చేరడం, బాబు ఇచ్చిన హామీ కేబినెట్లో నెహ్రూకు చుక్కెదురవడం తెలిసిందే. నెహ్రూకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తనయుడు, జెడ్పీటీసీ సభ్యుడు జ్యోతుల నవీన్‌కు చైర్మన్ ఇస్తారనే ప్రచారం అప్పటి నుంచి నడుస్తున్నదే. నవీన్‌ను చైర్మన్‌ను చేయాలంటే ఇప్పుడున్న చైర్మన్ నామన రాంబాబుకు ఉద్వాసన పలకాల్సిందే. నామనను చైర్మన్‌గా తప్పించి పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించాలని గత కొంతకాలంగా పార్టీలో ఆలోచన చేస్తున్నారు. జతకలని మనసులు.... ఇదే విషయమై రెండు రోజుల కిందట కాకినాడలో జరిగిన పార్టీ సమన్వయ సమావేశంలో సైతం చర్చించినా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ముగించేశారు. వివాదరహితుడిగా పేరున్న నామనను జ్యోతుల కోసం తప్పించడం సహేతుకం కాదని జ్యోతుల వైరివర్గం బలమైన వాదన వినిపిస్తోంది. మొదటి నుంచీ పార్టీలో ఉన్నా ఇటీవలే తిరిగొచ్చిన వారికి పదవులు ఇస్తే పార్టీ కేడర్‌కు ఏమని సంకేతాలు పంపిస్తారని పలువురు అంతర్గత సంభాషణల్లో సీనయర్ల దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. రెండేళ్లు మాత్రమే మిగిలి ఉండగా ఇప్పుడు తప్పిస్తే తానేదో తప్పు చేసినట్టు, సమర్థంగా పనిచేయలేకపోయానని జనం ముద్రవేస్తారని మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప వద్ద ఇటీవల నామన గోడు వెళ్లబోసుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. మంత్రి పదవి దక్కని జ్యోతులకు టీటీడీ లేదా, కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఒకటి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇవ్వకూడదని విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టు సీఎం చంద్రబాబు తేల్చిచెప్పడం తెలిసిందే. రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ టీటీడీ చైర్మన్ కోసం అభ్యర్థించిన సందర్భంలో బాబు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బాబు ప్రకటనతో నెహ్రూకు వస్తాదనుకున్న ఆ ఛాన్స్ కూడా లేదని తేలిపోయింది. ఇటువంటి తరుణంలో రాజకీయ వారసుడిగా నవీన్‌ను చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా పార్టీలో ఒక స్థాయి కల్పించాలని నెహ్రూతోపాటు అతని వర్గీయులకు బలమైన కోరిక లేకపోలేదు. అందునా మెట్ట ప్రాంతంలో రాజకీయంగా తన తరువాత చక్రం తిప్పే నేతగా పైకి తీసుకురావాలని ఏ తండ్రికి మాత్రం ఉండదు. కానీ చిక్కల్లా ఆది నుంచి రాజకీయంగా వైరం కలిగిన మంత్రి యనమల వర్గీయులు అంతర్గతంగా ఇందుకు అడ్డుచక్రం వేస్తున్నారనే సమాచారమే జ్యోతుల వర్గంలో గుబులు రేపుతోంది. నెహ్రూకు ఎలాగూ నామినేటెడ్ అవకాశం లేదని తేలిపోవడంతో నవీన్‌కు జెడ్పీ చైర్మన్ ఇచ్చి, నామనకు నామినేటెడ్ పోస్టు ఇవ్వాలనే ప్రతిపాదన ఆది నుంచి ఉన్నదే. తన చైర్మన్ పీఠం అలానే ఉంచి ఆ నామినేటెడ్ పోస్టు ఏదో నవీన్‌కే ఇస్తే ఎవరికీ ఇబ్బంది కలగదని నామన పార్టీ సీనియర్ల ముందు చెప్పుకున్నారని, వారు కూడా ఇందుకు మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. పీఠం కాపాడుకునే ప్రయత్నంలో నామన... తాజా పరిణామాల నేపథ్యంలో నామన తన పీఠాన్ని కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి దివంగత బాలయోగి, యనమలతో కలిసి ఉన్న పరిచయాలను ఈ సందర్భగా ఆయన వినియోగించుకుంటున్నట్టు కనిపిస్తోంది. నెహ్రూ అంటే పడని వర్గం ఎక్కడా బయటపడకుండా తెరవెనుక నామనకు మద్ధతు పలుకుతున్నారని సమాచారం. మరోపక్క జిల్లా పగ్గాల కోసం ఎప్పటి నుంచో రేసులో ఉన్న కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరరావు తన ప్రయత్నాల్లో తానున్నారు. పార్టీ పరంగా సీనియరే అయినా, పార్టీ వీడి బయటకు వెళ్లి తిరిగి రావడం బండారుకు మైనస్ అంటున్నారు. అలాగే కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జిల్లా అంతటా పార్టీని ఎలా సమన్వయపరుస్తారనేది కూడా చర్చకు దారితీస్తోంది. బండారును కోనసీమ నుంచి మంత్రి చినరాజప్ప వర్గీయులు వ్యతిరేకిస్తున్నారంటున్నారు. అలా అనుకుంటే బండారు కంటే నియోజకవర్గ బాధ్యతలు లేని డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా, జగ్గంపేట నుంచి పోటీచేసి రెండుసార్లు కోట్ల రూపాయలు తగలేసుకుని ఓడిపోయిన జ్యోతుల చంటిబాబు, కోనసీమ నుంచి మాజీ మంత్రి దివంగత మెట్ల సత్యనారాయణరావు తనయుడు రమణబాబు పేర్లు విషయంలో కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ విషయాలన్నింటిపైనా వీలునుబట్టి మంత్రులు యనమల, నిమ్మకాయల, శాసనమండలి డిప్యుటీ చైర్మన్ ఆర్ఎస్ తదితరులు మంగళవారం విజయవాడలో సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఆ సమయానికి జెడ్పీ చైర్మన్ నామనను కూడా అక్కడకు రావాలని పిలుపు వచ్చింది. ఆ భేటీ తరువాత జెడ్పీ చైర్మన్, జిల్లా పగ్గాలు విషయంపై కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
సీటు బెల్టు ధరిస్తేనే సురక్షితం
అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం రూరల్) : ప్రస్తుతం సీటు బెల్టు ధరించకపోవడం వలన తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అందువల్ల వాహనదారులు తప్పనిసరిగా ధరించాలని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ ఎన్.సాంబశివరావు ఆదేశాల మేరకు శనివారం అర్బన్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి ముఖ్య కూడళ్లలో, నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ ఇతర ముఖ్య ప్రదేశాల్లో సీటుబెల్టు వాడకంపై అవగాహన కల్పించారు. మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు అర్బన్ ఎస్పీ రాజకుమారి ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది కారులో సీటు బెల్టు ధరించని వారికి అవగాహన కల్పించారు. మోరంపూడి జాతీయ రహదారి వద్ద సీటు బెల్టు ధరించిన వారికి తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు, ఇన్స్పెక్టర్ కనకారావులు గులాబీ పువ్వులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో 3,413 కార్లను ఆపి అవగాహన కల్పించారు. అర్బన్ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఎం.రజనీకాంత్, ఆర్.గంగాధర్, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రవాణా శాఖాధికారుల సైతం మోరంపూడి జాతీయరహదారి కూడలిలో రవాణాశాఖాధికారులు సీటు బెల్టుధరించడంపై అవగాహన కల్పించారు. మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు కార్లను ఆపి సీటు బెల్టు ధరించాలని సూచించారు. -
పీఠం కదులుతోంది!
తెరపైకి జెడ్పీ చైర్మన్ మార్పు – పావులు కదుపుతున్న టీడీపీలోని ఓ వర్గం – స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించలేదని మరో వర్గం ఫిర్యాదు – జెడ్పీ పీఠంపై పలువురి గురి - అధికార పార్టీలో కొత్త ముసలం సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లా పరిషత్ చైర్మన్‌గిరి మరోసారి రచ్చకెక్కుతోంది. ఇప్పటికే చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు చేరో రెండున్నర సంవత్సరాలు చైర్మన్‌గా ఉండాలనే అంశాన్ని ఓ వర్గం తెరపైకి తీసుకొచ్చింది. తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు సహకరించలేదని నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో చైర్మన్‌గా ఆయన్ను తొలగించాలని అధికార పార్టీలోని మరో వర్గం కోరుతోంది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు వైస్–చైర్మన్ పుష్పావతి విశ్వప్రయత్నాలు చేస్తుండగా.. తమకు ఎన్నికల్లో సహకరించనందుకు ఆయన్ను తొలగించాలని మరో వర్గం కోరుతోంది. ఈ ఇరువర్గాల టార్గెట్ కూడా జెడ్పీ చైర్మన్ కావడంతో ఆయన తొలగింపు లాంఛనమేనన్న చర్చ సాగుతోంది. అయితే, కేవలం పుష్పావతే కాకుండా.. పలువురు జెడ్పీటీసీలు కూడా రేసుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అనంత మార్పిడి తర్వాత..! వాస్తవానికి కర్నూలు జెడ్పీ చైర్మన్ పీఠంపై టీడీపీలోని ఒక వర్గం ఎప్పటి నుంచో కన్నేసింది. ఇందులో భాగంగా అధికార పీఠాన్ని చెరో రెండున్నర సంవత్సరాల పాటు పంచుకుందామనే ఒప్పందం ఉందని కూడా ఈ వర్గం పేర్కొంటోంది. ఆ ప్రకారం తమకు ఇప్పటికే పీఠం దక్కాల్సి ఉందనేది వీరి వాదన. ఇందుకోసం ఒప్పందం అమలు చేయాలంటూ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎంపీ టీజీ వెంకటేష్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్లతో జిల్లాలోని ఎమ్మెల్యేలందరినీ ఈ వర్గం నేతలు కలిసి విన్నవిస్తున్నారు. తమకు చైర్మన్ పీఠం దక్కేందుకు సహకరించాలని కోరుతున్నారు. అయితే, ఇన్ని రోజులుగా ఈ వ్యవహారం అంతకు మించి ముందుకు కదల్లేదు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి సహకరించలేదనే ఫిర్యాదులు కూడా చైర్మన్‌పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్పు తప్పదనే ధీమా వైరివర్గంలో వ్యక్తమవుతోంది. అనంతపురం జిల్లాలో కూడా జెడ్పీ చైర్మన్ పీఠం మార్పు చేయనున్నారని.. ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే కర్నూలు జిల్లాలోనూ మార్పు తప్పకుండా జరుగుతుందని ఈ వర్గం నొక్కిచెబుతోంది. అందని ఆహ్వానం తన పీఠానికి వచ్చిన ఇబ్బంది లేదని చైర్మన్ ధీమాగా చెబుతున్నప్పటికీ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన పరిణామాలను పరిశీలిస్తే చైర్మన్‌కు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పీఠాన్ని గెలుచుకున్న తర్వాత జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలతో పాటు ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి కూడా వెళ్లారు. అయితే, ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్‌కు కనీసం ఆహ్వానం కూడా అందలేదని తెలిసింది. జిల్లాలోని నేతలందరినీ పిలిచిన జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి.. చైర్మన్‌ను ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని సమాచారం. అంతేకాకుండా తనకు చైర్మన్ సహకరించలేదని కూడా నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో జెడ్పీ చైర్మన్ పీఠానికి ఎసరు తప్పదనే ప్రచారం అధికార పార్టీలో జరుగుతోంది. ఏదేమైనప్పటికీ జిల్లా జెడ్పీ చైర్మన్ పీఠం వ్యవహారం ఇప్పుడు అధికారపార్టీలో కొత్త వార్‌కు తెరలేపిందని చెప్పవచ్చు. -
అనిల్ అంబానీకి అంతర్జాతీయ గౌరవం
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ అంతర్జాతీయ గౌరవం దక్కింది. అమెరికాలోని అట్లాంటిక్ కౌన్సిల్ బోర్డు సభ్యుడిగా ఎంపిక అయ్యారు. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ప్రపంచ థింక్ ట్యాంక్ అట్లాంటా కౌన్సిల్ తన అంతర్జాతీయ సలహా బోర్డులో సభ్యుడిగా చేరాలని ఆహ్వానించింది. భారతదేశానికి ప్రముఖ వ్యాపారవేత్తను అనిల్ అంబానీని అట్లాంటిక్ కౌన్సిల్ లోకి తీసుకున్నట్టు అట్లాంటా కౌన్సిల్ మంగళవారం వెల్లడించింది. సౌత్ ఆసియాలో ముఖ్యంగా వేగంగా వృద్ధి చెందుతున్న భారత్ నుంచి అనిల్ అంబానీని ఎంపిక చేయడం సంతోషమని సంస్థ చైర్మన్ జాన్.ఎం. హంట్స్ మాన్ పేర్కొన్నారు. గ్లోబల్ కార్పొరేట్లను, రాజకీయ వేత్తలను అడ్వైజరీ బోర్డులోకి ఆహ్వానిస్తుంది అట్లాంటా కౌన్సిల్. ఈక్రమంలో న్యూస్ కార్పొరేషన్ చైర్మన్ రుపర్ట్ ముర్డోచ్, మాజీ స్పానిష్ ప్రధాన మంత్రి జోస్ మరియా అజ్నర్, ఎయిర్ బస్ సీఈవో థామస్ ఎండర్స్ , మాజీ ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి కెవిన్ రుద్ కూడా కౌన్సిల్లో చేరినట్టు అట్లాంటా కౌన్సిల్ య ఒక ప్రకటలో ప్రకటించింది. మరోవైపు అట్లాంటిక్ కౌన్సిల్ కి ఎంపిక కావడంపై అనిల్అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. అమెరికా అగ్రగామి సంస్థ ప్రపంచ వ్యూహాత్మక వ్యవహారాల మీద అత్యంత ప్రభావవంతమైన మేధావుల అట్లాంటిక్ కౌన్సిల్ సలహా బోర్డులో చేరడం ఆనందదాయకమన్నారు. ప్రధాన మంత్రి మోదీ దార్శనికతకు ఆయన నాయకత్వంలో సాగుతున్నకృషికి ఇది స్పష్టమైన గుర్తింపు అని వ్యాఖ్యానించారు. -
వచ్చినట్లే వచ్చి పోయింది!
‘సీటొచ్చింది చేరిపొండి’ అని ఈమెయిల్స్ పంపింది కొలంబియా యూనివర్శిటీ. ఆ వెంటనే కొన్ని గంటల తర్వాత ... ‘అయ్యయ్యో.. సారీ, టెక్నికల్ మిస్టేక్ ఏదో జరిగింది. మీకు సీటు రాలేదు అని చెప్పడానికి చింతిస్తున్నాం’ అని 277 మంది విద్యార్థులకు అపాలజీ మెయిల్స్ పంపింది. కొలంబియాలో సీటంటే మామూలు సంగతేం కాదు. అదృష్టం ఇలా వచ్చి, అలా చేజారినందుకు ఎంత బాధపడిపోతుంటారో ఊహించిన యూనివర్శిటీ వైస్ డీన్ జూలీ కార్న్ఫెల్డ్... ‘కొలంబియా డీప్లీ అపాలజైజస్’ అని మెసేజ్ పంపారు. -
తెలుగుదేశంలో సంకుల సమరం
- అమాత్యుల ఓటు ‘బొడ్డు’కే - ‘హోం’పై సామాజిక వర్గం నిప్పులు - రేసులో చిక్కాల, గన్ని, మెట్ల స్వపక్షంలోనే విపక్షం ... సొంత గూట్లోనే పొగ ... తెలుగు తమ్ముళ్లలో కలకలం ... క్యాడర్లో అయోమయం. ఇదీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పెడుతున్న చిచ్చు. దీంతో తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో ఇద్దరు మంత్రులతోపాటు ఎమ్మెల్యేల్లో అంతర్గత కుమ్ములాటలకు దారితీస్తోంది. ఒకే కుర్చీ కోసం పోటాపోటీ తయారైంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం టీడీపీలో సంకుల సమరానికి తెరలేచింది. నామినేషన్ల గడువు దగ్గర పడేకొద్దీ పార్టీలో ఆశావహుల మధ్య పోరు తీవ్రమవుతోంది. ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీ సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో మెజార్టీ టీడీపీకి ఉన్న నేపథ్యంలో గెలుపు సునాయాసమనే విశ్వాసంతో రేసులో ఉన్న వారి సంఖ్య చాంతాడును తలపిస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు పదవీ కాలం మే ఒకటో తేదీతో ముగియనుండటంతో ఆ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. సిటింగ్ ఎమ్మెల్సీ భాస్కర రామారావు రెండోసారి బరిలో నిలుస్తున్నట్టు ఆయన అనుచరగణం ఇప్పటికే విస్తృతమైన ప్రచారం చేస్తోంది. మంగళవారం విజయవాడలో సీఎం చంద్రబాబుతో మాట్లాడేందుకు వెళ్లడం అందులో భాగమేనంటున్నారు. విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగానే ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడం తెలిసిందే. రెండోసారి బరిలో నిలిచేందుకు భాస్క ర రామారావు ప్రయత్నాలపై ప్రత్యర్థి వర్గం నీళ్లు చల్లేం దుకు పావులుకదుపుతోంది. పార్టీని కాదని విడిచి వెళ్లిపోయి తిరిగొచ్చిన వారికి రెండోసారి అవకాశం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. సిటింగ్ ఎమ్మెల్సీకి రాజకీయంగా బద్ధవిరోధి అయిన ప్రత్యర్థి వర్గానికి చెందిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తండ్రి మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి వంటి నేతలు భాస్కర రామారావు వ్యతిరేకులందరినీ ఏకం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకు వ్యూహాత్మకంగానే కేబినెట్ విస్తరణలో అవకాశం లభిస్తుదంటున్న చంద్రబాబు తనయుడు లోకేష్‌ను ప్రతిపాదించారు. ఇక్కడ పార్టీకి మెజార్టీ ఓటింగ్ ఉండటాన్ని చూపించగా మొదట్లో బాబు కూడా సానుకూలత ప్రదర్శించారు. ఇంతలో ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ఉండటంతో ఇక్కడ నుంచి పోటీ చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంతోనే భాస్కర రామారావుకు తిరిగి అవకాశం కల్పించే విషయంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గ్రీ¯ŒS సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. కాపుల వైపు చూపు... రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న కాపు ఉద్యమంలో జిల్లా నుంచి ముద్రగడ పద్మనాభం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న క్రమంలో ఈసారి ఆ సామాజిక వర్గానికి కేటాయించాలనే ప్రతిపాదన వచ్చింది. పార్టీలో సీనియర్ అయిన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు లేదా, కోనసీమ కేంద్రం అమలాపురం నుంచి దివంగత మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు తనయుడు మెట్ల రమణబాబు పేర్లు ప్రముఖంగా ఆ సామాజికవర్గ నేతలు బాబు వద్ద పరిశీలనలోకి తీసుకువెళ్లారు. ఈ రెండు పేర్లు పరిగణనలోకి తీసుకోవాలని ఆ సామాజికవర్గానికి చెందిన ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధినేత దృష్టికి తీసుకువెళ్లారంటున్నారు. వీరితో పాటు 24 ఏళ్లుగా పార్టీలో ఎటువంటి పదవులు ఆశించలేదంటూ తాళ్లరేవు మండలం మల్లవరానికి చెందిన దూళిపూడి బాబి యువత కోటాలో పరిగణనలోకి తీసుకోవాలని సీనియర్లను అభ్యర్థిస్తున్నారు. అయోమయంలో చిన రాజప్ప రమణబాబు, చిక్కాల విషయంలో మొదట సానుకూలత వ్యక్తం చేసిన చినరాజప్ప తాజా రాజకీయ సమీకరణల్లో భాస్కర రామారావు వైపే మొగ్గుచూపుతున్నారని సమాచారం. ప్రధానంగా రెండు కారణాలను ఇందుకు నేతలు విశ్లేషిస్తున్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆర్థిక మంత్రి యనమల చాలాకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. అటువంటి యనమలకు విరోధి అయిన ఎంపీ తోట ప్రతిపాదిస్తున్న అతని బావమరిది రమణబాబుకు సానుకూలంగా ఉంటే, భాస్కర రామారావుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యనమలతో దూరం ఏర్పడుతుందని చినరాజప్ప మనసు మార్చుకున్నారంటున్నారు. రెండోది తన రాజకీయ భవిష్యత్తు ఒకప్పుడు పెద్దాపురం బొడ్డు భాస్కర రామారావుకు పెట్టనికోట. ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చినరాజప్ప 2019 ఎన్నికల్లో తిరిగి అక్కడి నుంచే అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తే వచ్చే ఎన్నికల్లో పెద్దాపురంలో ‘బొడ్డు’ అడ్డు ఉండదనే ముందుచూపుతోనే చినరాజప్ప ప్లేటు ఫిరాయించారంటున్నారు. ఇది చినరాజప్ప రాజకీయ భవిష్యత్తుకు ఎంతవరకు ఉపకరిస్తుందో ఇప్పుడే అంచనాకు రావడం పొరపాటే అవుతుంది. కానీ జిల్లాలో పోలీసుల సాయంతో కాపు ఉద్యమంపై ఉక్కుపాదం మోపిన చినరాజప్పపై ఆ సామాజికవర్గం ఇప్పటికే ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇప్పుడు తమ సామాజిక వర్గానికి వచ్చే అవకాశాన్ని కూడా తన రాజకీయ భవిష్యత్తు కోసం పణంగా పెడుతున్నారని టీడీపీలోని కాపు వర్గీయులు కూడా రాజప్పపై మండిపడుతున్నారు. పావులు కదుపుతున్న గన్ని... పార్టీలో సీనియర్ అయిన తనకు అవకాశం ఇవ్వాలని గన్ని కృష్ణ పట్టుబడుతున్నారు. రాజమహేంద్రవరంలో అనుచరులతో సమావేశమై రేసులో ఉన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్, సిటీ కోసం ప్రయత్నించిన సందర్భంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కృష్ణ పట్టుబడుతూ తాడోపేడో తేల్చుకుంటారని గన్ని వర్గం పేర్కొంటోంది. గన్ని ఆశలపై రాజకీయ ప్రత్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గండికొట్టే దిశగా పావులుకదుపుతున్నారని అనుమానపడుతున్నారు.‘గుడా’ చైర్మన్ కోసం దరఖాస్తు చేసుకున్న కృష్ణ ఎమ్మెల్సీ రేసులో కూడా ఉంటారా అని గోరంట్ల వర్గం ప్రశ్నిస్తోంది. ఇంకా మరి కొందరు... బ్రాహ్మణ కోటాలో డొక్కా నా«థ్‌బాబు, మత్స్యకార కోటాలో కాట్రేనికోన జెడ్పీటీసీ నాగిడి నాగేశ్వరరావు కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ నేతలను వెంటబెట్టుకుని సీఎంను కలిసేందుకు నాగేశ్వరరావు వెళుతున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చివరకు బొడ్డు, చిక్కాలలో ఒకరికి ఖాయమవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బరిలో నిలిచే అభ్యర్థి ఎవరనేది పార్టీ అధినేత ఈ నెల 25న తేలుస్తారు. -
పొట్ట చెక్కలయ్యేలా...
యోగా అధిక బరువు ఉన్నవారికి మాత్రమే కాదు సరిపడా బరువు ఉన్నవారికి కూడా ఇబ్బందికరమైన సమస్య పొట్ట. శరీరంలో మరే ప్రాంతంలో ఉన్నా పర్లేదు కాని ఉదర భాగంలో పేరుకుపోయిన కొవ్వు మాత్రం మనిషి ఆకారాన్ని వికారంగా మార్చే అవకాశం ఉంది. అలా దర్జాగా పెరిగే పొట్ట... పొట్ట కొట్టే ఆసనాలు యోగాలో ఉన్నాయి. అవే ఈ వారం... ధనురాసనం స్టెప్–1 కుర్చీ పై నుంచి లేచి నిలబడి కుడికాలుని కుర్చీ కుడి హ్యాండిల్ కింద ఉన్న గ్యాప్‌లో నుంచి తీసుకెళ్లి, కుడి పాదం భూమి మీద ఉంచాలి. అలాగే ఎడమ పాదం కూడా భూమి మీద ఉంచి సీటును కుర్చీలో వీలైనంత వెనుకకు ఉంచి ఉదర భాగాన్ని కుర్చీ ముందువైపునకు అంచునకు గట్టిగా నొక్కుతూ చేతులు భూమి మీద సమాంతరంగా ఉంచాలి. వెనుక కాళ్లను స్ట్రెయిట్‌గా లేదా మడచి ఉంచవచ్చు. సరిగా బ్యాలెన్స్ చేయగలిగితే కేవలం పొట్ట భాగాన్ని కుర్చీలో, చేతులు పక్కలకి గాలిలో ఉంచి కాళ్ల వెనుక బాగా స్ట్రెచ్ చేస్తూ 3 లేదా 5 సాధారణ శ్వాసల వరకూ ఉండవచ్చు. శ్వాస వదులుతూ కాళ్లు రిలాక్స్ చేసి చేతులు భూమి మీద ఉంచి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్లీ ఇదే విధంగా రిపీట్ చేయవచ్చు. ధనురాసనం స్టెప్–2 సీటును కుర్చీలో బాగా వెనుకకు నెట్టి (తొడ జాయింట్లు కుర్చీ అంచుకు దగ్గరగా ఉండేటట్టు) శ్వాస తీసుకుంటూ కాళ్లు రెండూ పైకి లేపి రెండు చేతులతో చీల మండలం పట్టుకునే ప్రయత్నం చేయాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ చీల మండలంను వదిలిపెట్టి కాళ్లు రిలాక్స్ చేసి చేతులు రెండూ ఇంతకు ముందు ఫొటోలో చూపిన విధంగా భూమి మీద ఉంచి రిలాక్స్ కావాలి. ఉపయోగాలు: పొట్ట చుట్టూ ఎడిపోస్ టిస్యూలో ఉన్న కొవ్వు కరగడానికి, తొడ ప్రాంతంలో ఉన్న కొవ్వు తగ్గడానికి ఉపకరిస్తుంది. రుతు సమస్యలకు కిడ్నీలు సమర్ధవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అర్ధ ఉష్ట్రాసన కుర్చీలో వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత మోకాళ్ల మీద పైకి లేచి శరీరాన్ని వెనుకకు వాలుస్తూ కుడిచేత్తో వెనుక ఉన్న కుర్చీ హ్యాండిల్‌ని పట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని పైకి స్ట్రెచ్ చేస్తూ పొట్ట భాగాన్ని వీలైనంత ముందుకు నెట్టాలి. తల పైకి ఎత్తి 3 లేదా 5 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ ఎడమ చేతిని పక్క నుంచి కిందకు సీటు భాగాన్ని తిరిగి మడమల మీదకు వజ్రాసన స్థితిలోకి రావాలి. అదే విధంగా మళ్లీ రెండో వైపు కూడా చేయాలి. జాగ్రత్తలు: స్పాండిలైటిస్, షోల్డర్ జాయింట్ లేదా ఫ్రోజెన్ షోల్డర్ వంటి సమస్యలు ఉన్నట్లయితే తలను పైకి ఎత్తకుండా స్ట్రయిట్‌గా ముందుకు చూస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా గిడ్డీనెస్, తలతిరుగుతోంది అనిపించినట్టయితే అది లో బిపి వల్ల గాని లేదా లో షుగర్ లెవల్స్ వల్ల గాని జరగవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా తలను వెనుకకు వాల్చకొని ఉంచాలి. లేదా వెంటనే వెనక్కు వచ్చేయాలి. ఉష్ట్రాసన వజ్రాసనంలో నుంచి మోకాళ్ల మీదకి పైకి లేచి కొంచెం కొంచెం వెనుకకు వాలుతూ కుడిచేత్తో కుర్చీ కుడి హ్యాండిల్‌ని, ఎడమ చేత్తో ఎడమ హ్యాండిల్‌ని పట్టుకోవాలి. పొట్టను ముందుకు నెడుతూ, తలను వెనకకు వాల్చి, 3 లేదా 4 సాధారణ శ్వాసలు తీసుకున్న తర్వాత శ్వాస వదులుతూ వెనకకు రావాలి. జాగ్రత్తలు: ఒకవేళ సయాటికా సమస్య గాని లోయర్ బ్యాక్ ప్రాబ్లెం గాని ఉన్నట్లతతే మోకాళ్లు రెండూ వీలైనంత వరకూ దూరం ఉంచి చేయడం మంచిది. ఎన్లార్జ్డ్ థైరాయిడ్ ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తగా చేయాలి. ఉపయోగాలు: పొట్టను బలంగా ముందుకు నెడుతూ ఉండడం వలన జీర్ణవ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేయడానికి దోహదం చేస్తుంది. అన్ని రకాలైన వెన్నెముక సమస్యల నివారణకు చేయదగ్గ ఆసనం. మలబద్ధకాన్ని నివారిస్తుంది. భుజాల ప్రాంతం, ఛాతీ బాగా వ్యాచోచింపబడతాయి కాబట్టి శ్వాసకోస వ్యవస్థకు రక్త ప్రసరణ వ్యవస్థకు కార్డియో వాస్క్యులర్ వ్యవస్థకు, లింఫు గ్రంధులు బాగా పనిచేయడానికి ఉత్తమమైన ఆసనం. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ సమన్వయం: సత్యబాబు -
ఆసనాలపై ఆసనాలు
యోగా కూర్చోడానికి పనికి వచ్చే కుర్చీని ప్లాస్టిక్ ఆసనంగా పిలుచుకోవచ్చు. అంటే ఇక్కడ వేస్తున్న ఆసనాలు... మరో రకం ఆసనాలపై వేస్తున్నవనుకోవచ్చు. ఆసనంతో ఎన్నో ప్రయోజనాలు కదా. మరి ఆసనాలపై ఆసనాలు వేస్తే... ఆరోగ్యపరంగా ప్రయోజనాల మీద ప్రయోజనాలు చేకూరుతాయి. అవేమిటో తెలుసుకోండి. మార్జాలాసనం కుర్చీలను మ్యాట్‌పై కదలకుండా స్థిరంగా ఉంచాలి. రెండు మోకాళ్లను ఒకదాని తర్వాత ఒకటి కుర్చీమీదకు తీసుకురావాలి. అనంతరం శరీరాన్ని ముందుకు వంచుతూ రెండు చేతులనూ రెండవ కుర్చీ మీద ఉంచాలి. ఆసనంలో కుదురుకున్నాక నిదానంగా గాలి పీల్చుతూ నడుమును నిదానంగా లోపలకు నెడుతూ పిరుదల భాగాన్ని ముందుకు సాగదీస్తూ తలని పైకి ఎత్తాలి. ధ్యాసను నడుముపై ఉంచాలి. ఉష్ట్రాసనం ఇందులో రెండు రకాలుంటాయి. ఒకటి శరీరాన్ని ముందుకు వంచి చేసేది, రెండు వెనుకకు వంచి చేసేది. శరీరాన్ని ముందుకు వంచి... మార్జాలాసనంలోకి వెళ్లినట్టే ఈ ఆసనంలోకి కూడా వెళ్లాలి. తర్వాత నెమ్మదిగా గాలి వదులుతూ నడుమును పైకి ఎత్తాలి. పిరుదుల భాగాన్ని లోనికి నెడుతూ కంఠకూపస్థం లోనికి ఆనించాలి. ఒంటె మూపురంలా అనిపించే ఈ ఆసనంలో ఉన్నప్పుడు ధ్యాసని నడుము, గొంతు భాగంలో ఉంచాలి. ఉపయోగాలు: ఈ రెండింటినీ కలిపి సాధన చేయాల్సి ఉంటుంది. రోజువారీ జీవితంలో పనుల కారణంగా నడుము మీద పడే ఒత్తిడిని తొలగించేందుకు ఉపకరిస్తాయి. తద్వారా నడుం కుడి, ఎడమల మధ్య సమతౌల్యానికి, నడుము నొప్పి నివారణ, నడుము భాగం బలోపేతం అవుతుంది. తర్వాతి దశల్లో నడుము ఆధారంగా వేసే సంక్లిష్టమైన ఆసనాల సాధనను ఇవి సులభతరం చేస్తాయి. గొంతు సాగదీయడం, సంకోచింపజేయడం వల్ల థైరాయిడ్ గ్రంధి హార్మోన్స్ సమతుల్యానికి కారణమవుతాయి. ప్రసారిత మార్జాలాసనం మార్జాలసనంలోకి వెళ్లినట్టే ఈ ఆసనంలోకి కూడా వెళ్లాలి. తర్వాత రెండు చేతులనూ ముందు కుర్చీ మీద బలంగా పెట్టి ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కుడి కాలిని పైకి ఎత్తాలి. ఇప్పుడు నెమ్మదిగా కుడిచేతిని అదే విధంగా ఛాతీ, శరీరం మొత్తాన్ని కుడివైపునకు తిప్పాలి. వీలైనంత వరకూ కుడికాలు, శరీరం, తలని ఒకే వరుసలో ఉండేలా చూడాలి. చూపు కుడిచేతి కొనలను చూస్తూ ఉండాలి. ధ్యాసంతా నడుము, కటిభాగంపైనే ఉంచాలి. అలాగే ఉంచి కొన్ని శ్వాసలు తీసుకున్న తర్వాత నిదానంగా ఛాతీని ఎడమవైపు తిప్పుతూ కుడిచేతిని కిందకు దించిన తర్వాత కాలిని కూడా కిందకు తీసుకురావాలి. ఇలాగే ఎడమవైపున కూడా చేయాలి. ఉపయోగాలు: కటిభాగం వదులుగా మారడానికి, అక్కడ పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగించడానికి శరీరంలోని దిగువ భాగాలకు రక్తసరఫరా మెరుగుపరచడానికి ఉపకరిస్తుంది. వజ్రాసనం కుర్చీలను ఎదురుగా ఉంచుకుని ముందుగా ఒక కుర్చీలో రెండు మోకాళ్లను ఉంచాలి. రెండు చేతులతో కుర్చీ హ్యాండిల్స్ పట్టుకుని నెమ్మదిగా సీటు భాగాన్ని కాలి మడమల మధ్య ఉంచాలి. రెండవ కుర్చీని సీటు భాగానికి సౌకర్యంగా ఉండేలా అంటే కాలి చీలమండలం దగ్గరగా ఉండేలా సరిచేసుకోవాలి. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు మోకాళ్ల కింద టవల్గాని కుషన్గాని ఏర్పాటు చేసుకోవాలి. ధ్యాసంతా శరీరం వెనుక భాగంలో నడుము కింద నుంచి శరీర భాగాలపై ఉంచాలి. అలా కాసేపున్న తర్వాత రెండు చేతులతో కుర్చీ హ్యాండిల్‌ని పట్టుకుని సీటు భాగాన్ని పైకి లేపి మోకాళ్ల మీదకు రావాలి. ఉపయోగాలు: వెన్నెముకను నిటారుగా ఉంచుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కాలి మడమలు, చీల మండలం... దగ్గర ఉన్న సమస్యలను నివారిస్తుంది. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
ఎమ్మెల్సీ సీటు కోసం.. టీడీపీలో కుమ్ములాట
► కొల్ల ఆశలకు నాయకుల గండి? ► ‘డబ్బు’న్న వారివైపే మొగ్గు! ► సీటు కోసం బగ్గు గాలం? ► కలిశెట్టి ఆశలు నెరవేరేనా? ► అచ్చెన్న, కళా చెరోవైపు పావులు ► అధిష్టానం ఎంపికపైనే ఉత్కంఠ ‘తమ్ముళ్లూ... తొలినుంచి పార్టీ జెండా మోస్తున్నవారెవ్వరో నాకు తెలుసు... నన్ను నమ్ముకున్నవారికి న్యాయం చేస్తా! నన్ను నమ్మండి తమ్ముళ్లూ...’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడల్లా ఇచ్చిన హామీతో ఆ పార్టీలో పలువురు ఆశావహులు పెద్దల సభలో అడుగుపెట్టాలని కలలుగంటున్నారు! స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పీరుకట్ల విశ్వప్రసాద్ పదవీకాలం మరో నెలలో ముగియనుంది. ఆ సీటు కోసం ఇంకా నోటిఫికేషన్ రాకముందే అధికార పార్టీలో పోటీ మొదలైంది. ఎలాగైనా సరే ఈ సీటు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో రెండు గ్రూపులకు నాయకత్వం వహిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావులను ప్రసన్నం చేసుకొనే పనిలో తలమునకలై ఉన్నారు. అయితే తమకు అనుకూలమైనవారిని, అదీ భవిష్యత్తులో తమ రాజకీయ అవసరాలకు ఉపయోగపడేవారిని ఆ సీటులో కూర్చోబెట్టేందుకు ఇరువురు నాయకులు కూడా తమదైన శైలిలో పావులు కదుపుతున్నారని ఆ పార్టీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతానుభవాల నేపథ్యంలో ఏదిఏమైనా ‘డబ్బు’న్నవారివైపే అధిష్టానం మొగ్గు చూపిస్తుందనే అనుమానాలూ లేకపోలేదు. ఇదే జరిగితే సుదీర్ఘకాలంగా ఎమ్మెల్సీ కావాలని కోరుకుంటున్నవారి ఆశలపై నీళ్లు చల్లినట్లే! సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: ఎమ్మెల్సీ సీటు కోసం అధికార పార్టీలో గత దఫాలో వినిపించిన పేర్లే మరోసారి తెరపైకి వచ్చాయి. పార్టీ అధికారంలో ఉండటం, ప్రతిపక్ష పార్టీ నుంచి కొంతమంది ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులను రకరకాలుగా ప్రలోభపెట్టి లాక్కొన్న నేపథ్యంలో సీటు వస్తే గెలుపు ఖాయమనే ధీమా టీడీపీ వారిలో కనిపిస్తోంది. దీంతో ఏ రకంగానైనా సరే సీటు దక్కించుకోవాలని ఎవ్వరికివారే విశ్వప్రయత్నాలు అప్పుడే ప్రారంభించేశారు. గత వారం శ్రీకాకుళంలో జరిగిన టీడీపీ కార్యవర్గ సమావేశంలో కొంతమంది పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. సీనియర్ నాయకుడు, సంతకవిటి మండలంలో నాలుగుసార్లు ఎంపీపీ పదవి నిర్వహించిన కొల్ల అప్పలనాయుడు ఈ సీటు రేసులో ముందున్నారు. అలాగే మరో సీనియర్ నేత, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. కలిశెట్టి అప్పలనాయుడు, చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ), ఎల్ఎల్ నాయుడు, నడుకుదిటి ఈశ్వరరావుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ వేడిని తగ్గించడం కోసం మందసకు చెందిన జుత్తు నీలకంఠం, కోటబొమ్మాళికి చెందిన బోయిన గోవిందరాజులు, డీసీసీబీ మాజీ చైర్మన్ సింతు సుధాకర్, దివంగత నాయకుడు గొర్లె హరిబాబునాయుడు భార్య లలితకుమారి పేర్లను వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లా టీడీపీలో ఎస్సీ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదనే ఫిర్యాదులున్న నేపథ్యంలో ఈసారి ఎమ్మెల్సీ సీటు ఆ సామాజికవర్గానికి కేటాయించాలనే వాదనలు మొదలయ్యాయి. దీంతో ఎస్వీ రమణమాదిగ తదితరులు ఆశలు పెంచుకుంటున్నారు. ఎవ్వరి మాట నెగ్గేనో? జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరులో ఇప్పటివరకూ అచ్చెన్న మాటే నెగ్గుతూ వచ్చింది. అయితే చిన్నబాబు ప్రోద్భలంతో కళావెంకటరావు జిల్లాపై తన పెత్తనాన్ని ఇప్పుడిప్పుడే పెంచుతున్నారు. దీంతో ఎమ్మెల్సీ సీటుకు అభ్యర్థి ఎంపికపై ఎవ్వరి మాట నెగ్గుతుందోనని పార్టీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే కొల్ల అప్పలనాయుడికి వీరిద్దరి నుంచి సహకారం లభించే పరిస్థితి కనిపించట్లేదు. కొల్ల పేరు గతంలో జడ్పీ చెర్మన్, ఎమ్మెల్సీ పదవుల కోసం పరిశీలనలోకి వచ్చింది. ఆఖరి నిమిషంలో చాన్స్ దక్కలేదు. వచ్చేసారి ఎమ్మెల్సీ సీటు తప్పకుండా ఇస్తామని ఆశచూపించి గత శాసనసభ ఎన్నికలలో ఆయన సేవలను వాడుకున్నారు. కళావెంకటరావు టీడీపీ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్లిపోయినప్పుడు రాజాం ప్రాంతంలో పార్టీని నిలబెట్టడంలో కొల్ల కీలక పాత్ర పోషించారు. కళా మళ్లీ తిరిగి టీడీపీలోకి రావడం, ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయన వ్యవహరిస్తున్న నేపథ్యంలో కొల్ల ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉందనే వాదన పార్టీలో వినిపిస్తోంది. ఎమ్మెల్సీని చేస్తానంటూ గతంలో కొల్లకు దివంగత నాయకుడు ఎర్రన్నాయుడు ఇచ్చిన మాటను అతని సోదరుడు అచ్చెన్నాయుడు నెరవేర్చలేకపోయాడనే నిందను ఆపాదించేందుకు కళావర్గానికి ఇదొక మంచి అవకాశమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బగ్గు వైపే అచ్చెన్న మొగ్గు! ఒకవేళ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే టెక్కలి నియోజకవర్గంలోకి సారవకోట, పోలాకి మండలాలు కలిసే అవకాశం ఉందనే ప్రచారం జరగడం, అదే జరిగితే అక్కడి గట్టి పట్టువున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు నుంచి 2019 సాధారణ ఎన్నికలలో తనకు సీటు విషయంలో పోటీ లేకుండా చూసుకోవడమనే వ్యూహంతో అచ్చెన్న పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఆర్థికంగానూ బలమైన బగ్గును ఎమ్మెల్సీ చేస్తే తనకు అన్నివిధాలా ఉపయోగం ఉంటుందని అచ్చెన్న ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ‘పార్టీ మారి తిరిగి రావడం ఎమ్మెల్సీకి అర్హతా?’ అని పలాస ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు జీఎస్ఎస్ శివాజీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీలో కరివేపాకులేనా? పార్టీలో ఎర్రన్నాయుడికి అనుచరుడిగా ఎదిగిన కలిశెట్టి అప్పలనాయుడు... పార్టీకి తాను చేసిన సేవల దృష్ట్యా తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కోరుతున్నాడు. గతంలో పాతపట్నం సీటు పోటీ నుంచి కలిశెట్టిని తప్పించడానికి ఎమ్మెల్సీ సీటు ఆశ చూపించారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు ఆ అంశాలతోనే నేరుగా అధిష్టానం దృష్టిలో పడేందుకు ఆయన తాపత్రయపడుతున్నారు. గతంలో మూడు పర్యాయాలు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన చౌదరి బాబ్జీ, అలాగే బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎల్ఎల్ నాయుడు పేర్లను కేవలం వారి సామాజికవర్గ కోణంలో మాత్రమే తెరపైకి తెచ్చారనే వాదన ఉంది. అంత రాజకీయ అనుభవం లేకపోయినా కేవలం గత ఎన్నికలలో కళా వెంకటరావుకు అన్ని రకాలుగా సాయపడిన నడుకుదిటి ఈశ్వరరావు పేరును జాబితాలో చేర్చారు. ఇక సింతు సుధాకర్, జుత్తు నీలకంఠం, బోయిన గోవిందరాజులు జాబితాలో పేరుకే పరిమితమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
భగ్గుమంటున్న అబ్బాయి, బాబాయ్‌ల వివాదం
సమాజ్‌వాద్ అధికార పార్టీ ఇంట నెలకొన్న రాజకీయ సంక్షోభం, సీట్ల పంపకం విషయంలో మళ్లీ తారాస్థాయికి వెళ్తోంది. టిక్కెట్ల పంపిణీల్లో బాబాయి శివ్‌పాల్ యాదవ్, అబ్బాయి అఖిలేష్ యాదవ్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. టిక్కెట్ల విషయంలో బెంగ పడొద్దని ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చిన అఖిలేష్, 403 మంది అభ్యర్థులతో కూడిన సొంత జాబితాను తయారుచేసి బాబాయి శివ్‌పాల్‌కు పంపించారు. అయితే ఆ జాబితాపై శివపాల్ అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారికి టిక్కెట్ ఇచ్చే ప్రసక్తే లేదని శివ్ పాల్ తేల్చిచెప్పినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ జాబితాలోనే బుందేల్ ఖండ్‌లోని రెండు స్థానాల నుంచి తాను పోటీచేయనున్నట్టు అఖిలేష్ తెలిపారు. బబినా, మహోబ నుంచే అఖిలేష్ పోటీచేస్తున్నారని రిపోర్టులు తెలిపాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపక బాధ్యతలను రాష్ట్ర పార్టీ చీఫ్ శివ్‌పాల్ నిర్వహిస్తున్నారు. ఈ పంపక విషయంలో తనకు ఇష్టంలేని వారికి, క్రిమినల్స్‌కు బాబాయ్ టిక్కెట్లు ఇస్తారని అఖిలేష్ గుర్రుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనకిష్టమైన వారితో సొంత జాబితా సిద్ధం చేసి శివ్‌పాల్‌కు పంపించారు. కానీ అఖిలేష్ పంపిన జాబితాపై శివ్‌పాల్ అసంతృప్తి వ్యక్తంచేయడం మళ్లీ వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో చిచ్చు రేపుతోంది. -
జిప్మర్లో ‘అనంత’ విద్యార్థికి సీటు
జేఎన్టీయూ : జవహర్లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్)లో అనంతపురం నగరానికి చెందిన తప్పెట తేజస్విణి మెడికల్ సీటు సాధించింది. జిప్మర్ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో 134వ ర్యాంకు (99.90 శాతం) సాధించింది. ఫలితాలు గత నెలలో విడుదలయ్యాయి. జాతీయ స్థాయిలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్న మెడికల్ సంస్థ జిప్మర్ ఒకటి. పాండిచ్చేరిలో ప్రెంచ్ ప్రభుత్వం 1823లో ఈ సంస్థను ఏర్పాటు చేసింది. మెడిసిన్‌లో ర్యాంకు తెచ్చుకోవడమే అరుదైన విషయం. మెడిసిన్ ప్రవేశ పరీక్షలో అనంతపురానికి చెందిన తప్పెట తేజస్విణి అత్యుత్తమ ప్రతిభతో మెరుగైన ర్యాంకు సాధించింది. అరుదైన రికార్డును ఆమె కైవసం చేసుకుంది. గతంలో ఏపీ ఎంసెట్–2016 ఫలితాల్లో తప్పెట తేజస్విణి మెడిసిన్‌లో రాష్ట్ర స్థాయి 29వ ర్యాంకు సాధించింది. ఎస్వీయూ రీజియన్‌లో 4వ ర్యాంకు (లోకల్ ర్యాంకు ) దక్కింది. ఏపీ ఎంసెట్‌లో 160 మార్కులకు గాను 147 మార్కులు సాధించి అత్యుత్తమ ర్యాంకు సాధించింది. తెలంగాణ ఎంసెట్–1లో మెడిసిన్‌లో 16 వర్యాంకు, తెలంగాణ ఎంసెట్–2లో మెడిసిన్‌లో 7 వ ర్యాంకు, తాజాగా తెలంగాణ ఎంసెట్–3లో మూడో ర్యాంకు (160కి 151 మార్కులు) సాధించారు. జిప్మర్లో 134వ ర్యాంకు సాధించి, అడ్మిషన్ పొందింది. -
ఆ కారు ఓన్లీ ఫర్ లేడీస్..
చిన్నగా... పర్ఫుల్ కలర్లో కనిపించే ఈ కారు చూడానికి భళే ఉందికదా! ఎప్పుడూ మగవారికోసమే కార్లు, బైక్స్ ఏం తయారుచేస్తాంలే అని భావించిన ఓ రెండు కంపెనీలు జతకట్టి మహిళల కోసం ప్రత్యేకంగా ఓ కారును డిజైన్ చేశాయి. స్పానిస్ కారు తయారీదారి సీట్, లేడిస్ లైఫ్ స్టైల్ పబ్లికేషన్ కాస్మోపాలిటన్ కలిసి కేవలం మహిళల కోసం ఓ కొత్త కారు రూపొందించి లండన్ కాస్మోపాలిటన్స్ ఫ్యాస్ఫెస్ట్ ఈవెంట్లో లాంచ్ చేశాయి. మహిళలు ఎలాగైతే మేకప్ చేసుకుంటారో అదేమాదిరి కారును డిజైన్ చేశారు. జ్యువెల్ ఎఫెక్ట్ రిమ్స్, హ్యాండ్ బ్యాగ్ హుక్, ఐలైనర్ హెడ్‌లైట్స్ తో సీట్ మి కారు మార్కెట్లోకి వచ్చింది. సీట్ కారు తయారీదారి, లేడీస్ మ్యాగజైన్ రెండేళ్ల రీసెర్చ్, డెవలప్మెంట్తో మహిళల అభిరుచులకు అనుగుణంగా దీన్ని ఎక్స్‌క్లూజివ్‌గా డిజైన్ చేసినట్టు కంపెనీ చెబుతోంది. అయితే ఓ వైపు ఈ కారు రూపొందించినందుకు కృతజ్క్షతలు చెబుతూనే మరోవైపు సెటైర్లు కూడా వేస్తున్నారు. తమ సుతిమెత్తని చేతుల మాదిరి స్టీరింగ్ వీల్ చిన్నదిగా ఉందా అంటూ ట్వీట్లు వస్తున్నాయి. మహిళల డిజైన్‌తో ఈ కారు రూపొందించడం గుడ్ ఐడియానా అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఈ ట్వీట్లపై స్పందించిన సీట్ కారు తయారీదారు ఈ కారు కేవలం కాస్మోపాలిటన్ రీడర్స్ కోసమే తయారుచేసినట్టు చెబుతోంది. కాస్మోపాలిటన్ రీడర్స్, ఎడిటర్స్, మ్యాగజైన్ క్రియేటివ్ టీమ్ సహకారంతో కేవలం పరిమిత టార్గెట్‌తోనే వచ్చినట్టు పేర్కొంది. మహిళల అందరికోసమేమీ ఈ కారు తయారుచేయలేదని పేర్కొంది. కానీ లాంచ్ చేసిన కొన్నిరోజులకే ఈ బ్రాండెడ్ న్యూ కారుపై ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. Wow, thanks @SEAT_cars_UK & @Cosmopolitan for designing a car just for women. Is the steering wheel small for my delicate hands?! #its2016!! How did ANYONE think making a #carforwomen would be a good idea? #ThisisMii https://t.co/yQ6eRrAe9G — Bethany Hill (@andbethanysays) 21 September 2016 — Hannah Walker (@bananhan) 16 September 2016 -
పీజీ రెండవ దశ సీట్ల కేటాయింపు
కమాన్‌చౌరస్తా : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో పీజీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు రెండవ దశ సీట్లను కేటాయించడం శనివారం జరిగిందని కాకతీయ యూనివర్సీటీ ప్రవేశాల విభాగం అధికారులు డాక్టర్ వెంకయ్య, లక్ష్మీనాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీటు పొందిన విద్యార్థులు కోర్సు, సై ్లడింగ్ ఫీజును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చలాన ద్వారా కానీ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చని సూచించారు. సీటు అలాట్మెంట్ను డౌన్లోడ్ చేసుకొని సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయాలని లేనిచో ప్రవేశాలు రద్దవుతాయని వెల్లడించారు. ప్రత్యేక విభాగాలు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఇతర విభాగాలకు సర్టిపికేట్ల పరిశీలన, సీట్ల కేటాయింపు ఈ నెల 8న కాకతీయ ప్రవేశాల విభాగంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతందని తెలిపారు. చివరి దశ సీట్లను ఈనెల 9న కేటాయిస్తామని తెలిపారు. వెబ్ ఆప్షన్లు 9 నుంచి 11 తేది వరకు ఉంటాయని పేర్కొన్నారు. తుది దశలో సీటు పొందిన విద్యార్థులు తప్పనిసరిగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు తీసుకోవాలని లేనిచో వారి అడ్మిషన్లు రద్దు అవుతాయని సూచించారు. -
డైట్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
అంగలూరు (గుడ్లవల్లేరు) : జిల్లాలోని డైట్ సీట్ల భర్తీకి 223 దరఖాస్తులను స్వీకరించి నట్లు అంగలూరు ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థ(డైట్) ప్రిన్సిపాల్ జి. వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం నుంచి డైట్లో జిల్లాకు సంబంధించిన సీట్లకు ఆయన కౌన్సిలింగ్ చేపట్టారు. జిల్లాలోని 32డైట్లు ఉన్నాయన్నారు. వాటిలోని 2,750సీట్లలో తొలి విడతగా 1,458 సీట్లను కేటాయించారని తెలిపారు. మేనేజ్మెంట్ సీట్లు 530 ఉన్నాయని చెప్పారు. ఆన్లైన్లో ఏ అభ్యర్థులకు ఏ సమయం కేటాయిస్తే ఆ సమయంలోనే కౌన్సిలింగ్‌కు రావాలని సూచించారు. వచ్చేటపుడు, ప్రొవిజినల్ ఎలాట్మెంట్ లెటర్, ఆన్లైన్ అప్లికేషన్ లెటర్, డైట్‌సెట్ ర్యాంకు కార్డు, 10వ తరగతి మార్క్స్ లిస్ట్, ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్(టీసీ), 4నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు , కుల ధృవీకరణ సర్టిఫికెట్(మీ–సేవా ద్వారా తీసుకున్నవి), ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్ లేదా రేష్కార్డు జిరాక్స్(రేషన్‌కార్డు అయితే వెరిఫికేషన్ ఆఫీసర్‌కు ఒరిజినల్ కార్డు చూపించాలి), ³హెచ్‌సీ, స్పోర్ట్, ఆర్మీ కోటా అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు ఈ కింది ధృవపత్రాలను తీసుకురావాలని కోరారు. -
డిగ్రీ కళాశాలల్లో సగం సీట్లు ఖాళీ!
కేయూ పరిధిలో ముగిసిన మూడో దశ దరఖాస్తు గడువు రెండు దశల్లో కలిపి 43,578 మందికి ప్రవేశాలు రేపు సీట్ల కేటాయింపు ఇప్పటివరకు 26 కళాశాలల్లో ప్రవేశాలే లేవు.. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ కళాశాలల్లో ఈ ఏడాది సగానికి పైగా సీట్లు ఖాళీగానే ఉండనున్నాయి. యూనివర్సిటీ పరిధిలో 1,28,080 సీట్లు ఉన్నాయి. ఇప్పటివరకు మూడు దశల్లో ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. మొదటి దశలో 41,909, రెండో దశలో 17,563 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. పలువురు వెబ్ ఆప్షన్లు ఇవ్వలేదు. రెండు దశల్లో కలిపి మొత్తంగా 43,578 మంది విద్యార్థులు వివిధ కళాశాలల్లో ప్రవేశాలు పొందారు. కాగా, యూనివర్సటీ పరిధిలోని 26 డిగ్రీ కళాశాలల్లో అసలు ఒక్కరు కూడా చేరకపోవడం గమనార్హం. మరో ఎనిమిది కళాశాలల్లో పది మంది లోపు విద్యార్థులే చేరారు. దీంతో ఆయా కళాశాలలను మూసివేయక తప్పదనే భావన నెలకొంది. మూడో దశలో 4,943 దరఖాస్తులు యూనివర్సిటీ పరిధిలోని పెద్దసంఖ్యలో కళాశాలల్లో సీట్లు ఖాళీగా ఉండడంతో మళ్లీ మూడో దశలో దరఖాస్తులు స్వీకరించారు. గతంలో దరఖాస్తు చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోని వారు, మొదటి దశలో సీట్లు రాని వారు, కొందరు కళాశాలల్లో చేరినా మార్పు కోసం మళ్లీ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఈ దశలో అవకాశం కల్పించారు. అయితే, మూడో దశలో ఆన్లైన్ దరఖాస్తు గడువు శనివారం ముగియగా మొత్తం 4,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 492మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే, ఈ దశలో దరఖాస్తు చేసుకున్న వారికి, గతంలో దరఖాస్తులు చేసి ఇప్పుడు వెబ్‌ఆఫ్షన్లు ఇచ్చుకున్న వారికి, కళాశాలల మార్పునకు ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి మంగళవారం సీట్ల కేటాయింపు జరగనుంది. ఆయా విద్యార్థులు 4వ తేదీన కళాశాలల్లో చేరా>ల్సి ఉంటుంది. మూడో దశ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసే నాటికి మొత్తంగా యూనివర్సిటీ పరిధిలో 1,28,080 సీట్లలో 50శాతం సీట్లు కూడా భర్తీ అవుతాయా అనేది అనుమానంగా ఉంది. 50శాతంలోపే సీట్లు భర్తీ అవుతాయని భావిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన అడ్మిషన్లలో యూనివర్సిటీ పరిధిలో కొన్ని కళాశాలల్లో సీట్లు ఎక్కువ శాతం మేర భర్తీ కాగా మరికొన్ని కళాశాలల్లో అంతంత మాత్రంగానే సీట్లు నిండాయి. ఇక కొన్ని రకాల కాంబినేషన్ కోర్సులకైతే అసలే ఆదరణ లేనట్లు సమాచారం. అలాగే, పలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరినట్లు తెలుస్తోంది. మూడో దశ సీట్ల కేటాయింపు, విద్యార్థుల చేరిక ప్రక్రియ పూర్తయితే తప్ప ఎన్ని సీట్లు మిగిలిపోతాయనే అంశం తేలనుంది. కాగా, 4వ తేదీ నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. -
25 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఐసెట్–2016కు కౌన్సెలింగ్‌ను ఈ నెల 25 నుంచి ఎస్‌జీపీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తామని కోఆర్డినేటర్ వై.విజయభాష్కర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 25 నుంచి 29వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందన్నారు. జూలై 28 నుంచి 30వ తేదీ వరకు కళాశాలలకు ఆప్షన్లు, ఆగస్టు రెండో తేదీ కళాశాలల కేటాయింపు ప్రక్రియ ఉంటుందన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500, బీసీ/ఓసీ విద్యార్థులు రూ.1000 చెల్లించాలన్నారు. ఎన్సీసీ/పీహెచ్సీ/క్యాప్/స్పోర్ట్స్ కేటగిరీ వారికి విజయవాడ బెంజ్ సర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఐసెట్–2006 హాల్‌టికెట్, ర్యాంకు కార్డు, ఆధార్‌కార్డు, పది, ఇంటర్, డిగ్రీ మార్కుల జాబితాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 9 నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్ల ఒరిజినల్స్, రెండు సెట్ల జిరాక్స్ ప్రతులతో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ (www.apicet.nic.in) లో చూడాలన్నారు. -
సీటే బంగారమాయెనా...
హ్యూమర్ కాస్త డబ్బుంటే కష్టపడి ఎలాగోలా కిందా మీదా పడి ఏదో పార్టీలో ఓ ఎమ్మెల్యే సీటు సంపాదించుకోవచ్చు గానీ మన హైదరాబాద్ సిటీ ఆర్టీసీ బస్సులో సీటు సంపాదించుకోవడం మాత్రం అంతకన్నా కష్టం. అది బస్సెక్కి ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలే తప్ప చెబితే అతిశయోక్తే అంటారు. రోజూ రెండు పూటలా సిటీ బస్సెక్కితే ’బతుకు జట్కా బండి కాదనీ, గుట్కా పొడి అనీ, కిలోమీటర్ చొప్పున మనల్ని తొలిచేస్తుందనీ’ తెల్సుకుంటాం. నా పేరు ముఖేష్, నేను ఒక్కసారే బస్సెక్కాను, మళ్లీ నగరంలో బస్సు ప్రయాణం చేస్తానని నమ్మకం లేదు అంటూ థియేటర్లో స్లైడులు వేసుకోవాల్సిందే. రామదాసు గనుక సిటీ బస్సు ఎక్కితే ’సీటే బంగార మాయెనా కోదండపాణి’ అని ప్రార్థించక మానడు. ఎక్కాల్సిన బస్సువైపు చూస్తే.. దాంట్లో ’దండయాత్ర ఇది దయా గాడి దండయాత్రా’ అంటూ చాలా మంది ఎన్టీఆర్ లు టెంపర్ మీదుంటారు. ‘ఈ బస్సు మనందరిదీ’ అనే స్లోగన్ బాగా నచ్చిన కాలేజీ కుర్రాళ్లు ఫుట్ బోర్డుపై గబ్బిలాల్లా వేలాడుతుంటారు. ’సెన్సిటివ్’ జీవులం గనుక ఆ ఫీట్లు చేయలేక.. జనాల్ని తోసుకుంటూ, జీవితంలో అసలు సిసలు సంఘర్షణ అంటే ఏంటో తెల్సుకుంటూ, బస్సు మధ్యలోకి చేరిపోతాం. అలా వెళ్లే క్రమంలో తోటివాళ్లు మన కాళ్లు ఇంట్లో చపాతీ పిండిలా మెత్తగా తొక్కే ప్రక్రియ పాక్షికంగా పూర్తవుతుంది. (మళ్లీ దిగేప్పుడు సంపూర్ణమవుతుందనుకోండి). ఆశతో ఒక సీటు పక్కన నిల్చుంటాం..అతను వచ్చే స్టాప్ లోనే లేచి వెళ్లిపోతాడని మన ప్రిడిక్షన్. అయితే ఎన్టీఆర్ గార్డెన్ బయట చిలక జ్యోతిష్కులు చెప్పేవాటిలాగే ఇదీ జరగదు. అతనిది బస్సుతో విడిపోనిబంధమైనట్లు చివరి స్జేజీ వరకు దిగడు. ఈలోపు మీ తల ’సాధ్యమైనంత’ తిప్పితే కనబడే సీట్లలో కొందరు బిలబిలమంటూ దిగిపోతుంటారు. కొందరు నిరాశావాదులకు ఆ ఉచితాసనం దక్కుతుంది. ఇక వాళ్ల దర్జా మాటల్లో చెప్పలేం. అదృష్టాన్ని టిఫిన్ లో పెట్టుకుని బస్సెక్కిన ఆ ’సీటు రాజాలు’ వెంటనే ెహ డ్ ఫోన్స్ తీసి, పాటలు వింటూ, లయబద్దంగా తలూపుతుంటారు. ఆ ఊపుడుకి ’నో వేకెన్సీ’ వాళ్లందరికీ కడుపు మండుతుంటుంది. మా ఆఫీసులో ‘సార్’లా ఓరీ దురహంకారీ అనాలనిపిస్తుంది. మన పక్కసీట్లో కూర్చున్న పుణ్యపురుషుడు మాత్రం ఇంచు కదలడే. ఇక వీడు దిగడు అని విసిగిపోయి మన ఆశను వెనుక సీటు పక్కకి మార్చుకున్నామనుకో, ఇంతసేపూ మనం ఆశలు పెట్టుకున్న వాడు ఆకాశవాణి పిలిచినట్లు సడెన్ గా దిగిపోతాడు. ఈ అవకాశంతో అప్పటిదాకా ఆ సీట్లో సర్దుకుని కూర్చున్న మరో ఇద్దరు కులాసాగా కూర్చోవడమో, మరో కొత్త అతిథి వాళ్ల గూటికి చేరడమో జరుగుతుంటుంది. ఈ ’కిరణజన్య సంయోగ క్రియ’ చూస్తున్నప్పుడు చిన్నప్పుడు చదువుకున్న ఆశ- నిరాశ తెలుగు పాఠం లీలగా గుర్తుకొస్తుంది. మన రెండో ఆప్షన్ లేడీస్ రిజర్వేషన్ సీట్లపైకి వెళ్లినా.. అదృష్టదేవత మన వెంట ఉంటే తప్ప కూర్చోలేం. ఈ లోపు ఏ ఇంజినీరింగ్ సైన్స్ దేవ తనో వచ్చి ఇది లేడీస్ సీటుఅందనుకో.. సీటు వేటుతో పాటు అవమాన పోటూ తప్పదు. మనం వదిలేసిన మహిళా రిజర్వేషన్ సీట్లలో ఎవడో సభ్యత మరిచి ‘సిగ్గు’ లేకుండా కూర్చుంటాడు. ’మహిళలను గౌరవించడం మన విధి... వాళ్లకు కేటాయించిన సీట్లలో వాళ్లనే కూర్చోనిద్దాం’ అన్న సుభాషితాలు తలపైనే రాసి ఉన్నా వాడికి పేనుకుట్టినట్లయినా ఉండదు. అలాంటి అసభ్యుడు కూర్చున్నప్పుడు మాత్రం ఏ దేవకన్యా ఆ సీటు వైపు కన్నెత్తి చూడదు. బహుశా ఆఫీసులో పొద్దంతా కూర్చున్నాం కదా కాసేపు నిల్చుందాం అని డిఫరెంట్ గా ఆలోచిస్తుందేమో. మన కా కనికరం దక్కదెందుకో. పోనీ, సిగ్గూ బిడియం విడిచిపెట్టి, స్వార్థం బుసలు కొట్టి .. ఆ సీట్లలో మనం కూర్చున్నామనుకో... ఏదో అపరాధ భావం వెంటాడుతూనే ఉంటుంది. తప్పు చేస్తున్నామని లోపలి మనిషి అరుస్తూనే ఉంటాడు. లేవరా.. అంటూ పెదరాయుడులో రజినీకాంత్ లా గద్దిస్తుంటాడు. ఈ లోపలి సంఘర్షణ తో పాటు, ఎవరైనా లేడీస్ వస్తారేమో అని క్షణక్షణం భయం భయంగా హార్రర్ సినిమా చూస్తున్నట్లు కూర్చోవాల్సి వస్తుంది. ఇంత హెడ్ పెయిన్ తో కూర్చోడం కంటే... లెగ్ పెయిన్ తో నిల్చోవడం బెటరనిపిస్తుంది. అతి అరుదుగా ఎవరైనా బ్యూటిఫుల్ గర్ల్ కాస్త జరుగుతారా కూర్చుంటా.. అందనుకో, ఇక నువ్వు కూర్చునేది సీటుకి ఐదించుల పైనే గానీ సీట్లో కాదు. ఇదే కాదు.. బస్సు ఎక్కాలన్నా ఆశనిరాశే.. (మన ఫేట్ తిరగబడినట్లే) 9 నెంబరు కోసం కోసం చూస్తే 6 వెళ్లిపోతుంటుంది. మనవి కాని బస్సులు కదులుతూ, అమూల్యమైన సాయం సమయం కరుగుతూ, ఎన్నో ’హోప్స్’ పెట్టుకున్న ఇంటినుంచి ‘ఎక్కడ లక్కీ’ అంటూ ఫోన్ లో మెసేజ్ లు ఫ్లాష్ అవుతూంటే, ’కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం’ అంటూ మహాప్రస్థానంలో శ్రీ శ్రీ నా కోసమే పాట రాశాడా అనిపిస్తుంది. - రమేష్ గోపిశెట్టి -
అతడి విమానం ఎంతో గొప్పదట!
అమెరికాః రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్షపదవికి పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్ తన విమానం గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నాడట. తాను ప్రచారానికి వినియోగించే స్వంత ఫ్లైట్ ముందు ఎయిర్ ఫోర్స్ విమానం కూడ ఎందుకూ పనికిరాదన్నాడట. తన విమానంలో ఉన్న ప్రత్యేక సౌకర్యాలు అధ్యక్షుడు ఒబామా ప్రయాణించే విమానానికి సైతం లేకపోవచ్చంటూ చెప్పడం చూస్తే... నిజంగా ఆయనగారి విమానం ఏ రేంజ్ లో ఉందోనని అంతా ఎగ్జైటింగ్ గా ఫీలయ్యారట. తన ప్రచారంలో భాగంగా ఓ వేదికపై స్పీచ్ ఇస్తున్న డోనాల్డ్ ట్రంప్ తన విమానంగురించి చెప్పి మురిసిపోయాడట. విమానంలోని సీటు బెల్టులకు, బాత్ రూం లోని ట్యాప్ లకు సైతం బంగారు పూత పూసి ఉంటుందని చెప్పుకొచ్చాడట. సాధారణంగా బోయింగ్ విమానం అంటే 200 మంది ప్రయాణీకులతో, ఎయిర్ హోస్టెస్ లతో సందడి చేస్తుంది. అలాంటిది ట్రంప్ వినియోగించే బోయింగ్ 757 విమానం మాత్రం ఆయన చెప్పినట్లుగానే ప్రత్యేక సౌకర్యాలు కలిగి ఉందట. కేవలం 43 మంది ప్రయాణీకులు మాత్రమే ఎక్కగలిగేట్లు విమానంలో ఏర్పాట్లు చేశారట. స్టాబాంగ్ ఏవియేషన్ నిర్వహణలో ఆ ప్రత్యేక విమానం నడుస్తుంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అల్టెన్ నుంచి ట్రంప్ ఆ విమానాన్ని 2005 సంవత్సరంలోనే కొనుగోలు చేసి, అనంతరం అందులో తనకు కావలసినట్లుగా మార్పులు చేర్పులు చేసుకున్నాడు. నిజంగా ట్రంప్ సొంత విమానం చూస్తే అన్ని హంగులూ కలిగిన స్వంత గృహంలా కనిపిస్తుంది. విమానంలో లగ్జరీ సీట్లు, వాటికున్న బెల్టులకు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు పూత ఉంటాయి. తన అభిరుచికి తగ్గట్లుగా చేసుకున్న ఏర్పాట్లలో ముఖ్యంగా విమానంలో మీటింగ్ హాళ్ళు, సిల్క్ లైన్ మాస్టర్ బెడ్ రూం, సుమారు వెయ్యి చిత్రాలను ప్రదర్శించగలిగే శక్తి ఉన్న 57 అంగుళాల టెలివిజన్, సకల సౌకర్యాలు కలిగిన బాత్ రూం లు, వీలైనంత వరకూ బంగారు పూతతోనే కనిపిస్తాయట. ఈ ప్రత్యేక విమానంలోనే ఆయన ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నాడు. ఇన్ని హంగులతో కూడిన ఆ విమానం ప్రస్తుతం 100 మిలియన్ డాలర్లు అంటే.. సుమారు 675 కోట్ల రూపాయలు విలువ చేస్తుందట. -
జూలై 5 నుంచి ఎంసెట్ ఆప్షన్ల నమోదు
► 14న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు, 24 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ► 29 నుంచి తరగతుల ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ వచ్చే నెల ఐదో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు జూలై 5వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. విద్యార్థుల ర్యాంక్‌ను బట్టి 9వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు వెసులుబాటు ఉంది. 10, 11 తేదీల్లో చివరగా తమ వెబ్ ఆప్షన్లను మార్చుకునేందుకు అవకాశముంది. 14న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. మొదటి దశలో సీటు వచ్చినవారు, రానివారు కూడా రెండో దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి వీలుగా ఈ నెల 24 నుంచి రెండోదశ వెబ్ కౌన్సెలింగ్ చేపడతారు. మిగిలిపోయిన సీట్ల భర్తీకి 24, 25 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి వీలు కల్పించారు. 27వ తేదీన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. అదేనెల 29 నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభమవుతాయి. సుప్రీంకోర్టు నిర్దేశించిన విధంగా ఆగస్టు 1వ తేదీన ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం కావాలి. తెలంగాణ ఎంసెట్-16 తొలిదశ కౌన్సెలింగ్ షెడ్యూల్(ఆప్షన్ల కోసం) క్ర.సం రోజులు తేదీ ర్యాంకులు నుంచి వరకు నుంచి వరకు 1 2 05-07-2016 06-07-2016 1 45000 2 2 07-07-2016 08-07-2016 45001 90000 3 2 09-07-2016 10-07-2016 90001 చివరి 4 ఆప్షన్ల మార్పు 10-07-2016 11-07-2016 1 చివరి 5 సీట్ల కేటాయింపు 14-07-2016 6 కళాశాల వద్ద రిపోర్టింగ్‌తోపాటు చలానా ద్వారా ఫీజుల చెల్లింపు 21-07-2016 తెలంగాణ ఎంసెట్-16 తుదిదశ కౌన్సెలింగ్ షెడ్యూల్(ఆప్షన్ల కోసం) 1 ధ్రువపత్రాల పరిశీలన, ఆప్షన్లు 24-07-2016 25-07-2016 2 సీట్ల కేటాయింపులు 27-07-2016 3 తరగతుల ప్రారంభం 29-07-2016 -
ప్రశాంత యోగం
లైఫ్ అనారోగ్యాలను మాత్రమే కాదు భావోద్వేగాలను అదుపుచేయడంలోనూ యోగాకు తిరుగులేదు. ఈ విషయంలో కొన్ని ఆసనాలు మరింతగా ఉపకరిస్తాయి. చక్రాసన వెల్లకిలా పడుకుని కాళ్లు రెండూ మడచి పాదాలు- మడమలను పిరుదుల దగ్గరగా తీసుకొని మోకాళ్లు పైకి నిలబెట్టాలి. తలకి ఇరు వైపులా అరచేతులు నేల మీద ఉంచి (చేతి వేళ్లు లోపలి వైపునకు ఉంటాయి) శ్వాస తీసుకుంటూ అరచేతులూ, అరిపాదాలు భూమికి బలంగా నొక్కుతూ శరీరాన్ని పైకి లేపాలి. రెండు లేదా మూడు శ్వాసల తరువాత శ్వాస వదులుతూ నెమ్మదిగా శరీరాన్ని కిందకు తీసుకురావాలి. కాళ్లను స్ట్రెచ్ చేసి చేతులు శరీరం పక్కన ఉంచి శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. ఒక వేళ పూర్తి స్థితిలో చేయలేకపోతే... ⇒ స్టెప్-1 ముందుగా భుజాలు భూమి మీదనే ఉంచి సీటు భాగాన్ని పైకి లేపాలి. శ్వాస వదులుతూ సీటు భాగాన్ని భూమి మీద ఉంచాలి. ⇒ స్టెప్-2 మళ్లీ స్టెప్ 1 లోకి వచ్చి, ఈ సారి తలను (మాడు భాగాన్ని) నేలమీద ఉంచి అరచేతులు భూమి మీద ఉంచి భుజాలను కూడా పైకి లేపి రెండు మూడు సాధారణ శ్వాసల అనంతరం శ్వాస వదులుతూ ముందు భుజాలను తరువాత సీటు భాగాన్ని నేల మీదకు తీసుకురావాలి. ⇒స్టెప్-3 ఇంకా పూర్తి స్థాయిలో చేయాలనుకుంటే స్టెప్ 2లో నుంచి, చేతుల మీద భారం ఉంచుతూ తలను భుజాలను పూర్తిగా పైకి లేపే ప్రయత్నం చేయాలి. పూర్తి స్థితిలోకి వచ్చిన తరువాత శరీరం మొత్తాన్ని చేతుల మీద తేలికగా నిలుపగల స్థితి ఉన్నట్లయితే కుడి కాలుని పైకి ఆకాశంలోకి లేపి పాదాన్ని కాలివేళ్లను పైకి స్ట్రెచ్ చేసి ఉంచవచ్చు. తరువాత కుడి కాలుని కిందకు తీసుకువచ్చి తిరిగి ఎడమకాలుని పైకి తీసుకువెళ్లవచ్చు. జాగ్రత్తలు: ఇది కొంచెం ముందస్తు భంగిమ (అడ్వాన్స్ పోశ్చర్) కాబట్టి ఊబకాయం ఉన్నవారు శరీరాన్ని పైకి లేపాల్సి వచ్చినప్పుడు భుజాలు, చేతి మణికట్టు బలంగా ఉన్నట్లయితే తేలికగా చేయవచ్చు. మణికట్టు ఏమాత్రం బలహీనంగా ఉన్నా పూర్తి స్థాయిలో చేయకుండా స్టెప్ 1 లేదా స్టెప్ 2 వరకూ చేయడం మంచిది. ఉపయోగాలు: వెన్నెముకకు ఆధారంగా ఉన్న కండరాలకి, పొట్ట కండరాలకి, భుజం, తొడ కండరాలకు మంచి వ్యాయామం జరుగుతుంది. కిడ్నీలకు, ఎడ్రినల్ గ్రంథులకు టోనింగ్ జరగడం వల్ల భావోద్వేగాలను అదుపులో ఉంచడానికి ఉపకరిస్తుంది. కర్ణ పీడాసన ఆసనంలో వెల్లకిలా పడుకుని కాళ్లు రెండూ కలిపి ఉంచి, చేతులు రెండూ వెనుకకు పైకి స్ట్రెచ్ చేయాలి. ఇలా చేసేటప్పుడు రెండు చెవులకు రెండు భుజాలు తాకుతూ ఉంటాయి. శ్వాస తీసుకుంటూ కాళ్లు రెండూ పైకి లేపి మళ్ళీ శ్వాస వదులుతూ కాళ్లు కిందపెడుతూ మళ్ళీ శ్వాస తీసుకుంటూ తల భుజాలను పైకి లేపి శ్వాస వదులుతూ ముందుకు వంగి తలను మోకాలు దగ్గరకు వచ్చేటట్లు చేయాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ తలతో పాటు కాళ్లను కూడా పైకి లేపి, శ్వాస వదులుతూ తలా, కాళ్ళు వెనుకకు హలాసనంలోనికి తీసుకు వెళ్ళి, కాళ్ళు రెండూ రిలీజ్ చే యాలి. మోకాళ్ళు రెండింటిని తల చెవుల పక్కకు దగ్గరగా తీసుకువచ్చి పాదాలను ముందుకు స్ట్రెచ్ చేసి ఉంచాలి. చేతులు రెండూ స్ట్రెచ్ చేసి అరచేతులు భూమి మీద ఉంచి సాధారణ శ్వాసలు తీసుకుంటూ రెండు మూడు శ్వాసల తరువాత వెన్నుపూసను భూమి మీద ఆనిస్తూ సీటు భాగాన్ని నేలమీదకు తీసుకువచ్చి కాళ్ళు రెండు కిందికి తీసుకురావాలి. ఈ ఆసనంలో ఉన్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేగంగా ఉంటాయి కనుక, ఆసనం తరువాత శవాసనంలోకి వచ్చి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఊపిరితిత్తులకు పూర్తిగా గాలిని తీసుకుని వదలాలి. ఫొటోలో చూసిన విధంగా పూర్తి స్థాయిలో చేయలేనివారు నావాసనంలో లాగా తలను మోకాళ్ళను వీలైనంత దగ్గరగా ఉండేటట్లుగా వెన్నెముక మీద ముందుకు వెనుకకు రోల్ అవ్వవచ్చు. ఈ ఆసనంలో వెన్నుపూస పూర్తిగా స్ట్రెచ్ అవుతుంది. ఒకవేళ కేవలం వెన్నెముక మీద రోల్ అయినట్లయితే చక్కగా వెన్నెముకకు మసాజ్ జరుగుతుంది. మెడ, వెన్నెముక సమస్య ఉన్నవాళ్లు జాగ్రత్తగా చేయాలి. ఉపయోగాలు: భుజాలను, వెన్నెముకను స్ట్రెచ్ చేస్తుంది. మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. మానసిక, శారీరక ఒత్తిడులు, అలసటను తగ్గిస్తుంది. వంధత్వం, మెనోపాజ్ సమస్యలను పరిష్కరిస్తుంది. తలనొప్పి, సైనసైటిస్, ఆస్తమా సమస్యలను కూడా ఈ ఆసనంతో తగ్గించుకోవచ్చు. (గమనిక: కఠినమైన ఆసనాలను నిపుణుల పర్యవేక్షణలో చేయడం మేలు) ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
పదిలో 99.8 శాతం వచ్చినా..
ముంబై: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 99.8 శాతం మార్కులు తెచ్చుకుని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఓ అమ్మాయికి జూనియర్ కాలేజీలో సీటు రాని విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. కళ్యాణ్ పాఠశాలలో పదోతరగతి చదివిన ఆమె పబ్లిక్ పరీక్షల్లో 99.8 శాతం మార్కులను సంపాదించింది. జూనియర్ కాలేజిల్లో చేరేందుకు నోటిఫికేషన్ వెలువడటంతో ఆన్ లైన్ ద్వారా నగరంలోని ప్రముఖ కాలేజీల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. మంగళవారం కాలేజీల్లో సీట్లకు ఎంపికయిన అభ్యర్థుల్లో ఆమె పేరు లేకపోవడంతో ఒక్కసారిగా షాకైంది. తనకు వచ్చిన మార్కులకు కచ్చితంగా సీటు వస్తుందని భావించినట్లు చెప్పింది. ఈ నెల 10, 11, 16 తేదీల్లో మాత్రమే ఆన్ లైన్ ఆప్లికేషన్ లో కాలేజీల వరుసను మార్చినట్లు తెలిపింది. దీనిపై స్పందించిన అధికారులు ఆమె అప్లికేషన్ ను మార్చి ఉండకపోతే పాఠశాలకు చెందినవారే మార్పులు చేసి ఉంటారని అన్నారు. అప్లికేషన్ ను నింపేటపుడు పాఠశాల నుంచే సాయం తీసుకుంది కాబట్టి కచ్చితంగా మరలా వారే మార్పులు చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. డిపార్ట్ మెంట్ కు సంబంధించి ఏదైనా పొరబాటు జరిగిందేమోనని విచారించామని అలాంటిదేమీ లేదని చెప్పారు. ఈ నెల20న విడుదల చేసిన జనరల్ మెరిట్ లిస్టులో ఆమె పేరు రాలేదు. దీంతో జులై 15న జరిగే మరో విడత అడ్మిషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఏపీ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు వాయిదా
- ఆప్షన్ల మార్పునకు నేటి సాయంత్రం వరకు గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో సీట్ల కేటాయింపు వాయిదా పడింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నిబంధనలకు విరుద్ధంగా 29 కాలేజీల ఫీజులను పెంచు తూ ప్రత్యేక జాబితాను ప్రభుత్వానికి అందించడమే దీనికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫీజులు ఖరారు కాకుండా సీట్ల కేటాయింపునకు అవకాశం లేకపోవడంతో 22న చేయాల్సిన సీట్ల కేటాయింపును అడ్మిషన్ల కమిటీ వాయిదా వేసింది. దీనిపై అధికారిక ప్రకటన చేయాలని భావించినా మంత్రి కార్యాలయం నుంచి అనుమతి రాలేదు. మరోపక్క ఆప్షన్ల మార్పులో సరైన సమాచారం లేనందున వేలాది మంది అభ్యర్థులు 19, 20 తేదీల్లో అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. సీట్ల కేటాయింపు వాయిదా పడినందున అభ్యర్థులందరూ 21వ తేదీ (మంగళవారం) సాయంత్రం వరకు తమ ఆప్షన్లు మార్పు చేసుకోవచ్చని అడ్మిషన్ల కమిటీ సమాచారాన్ని పంపింది. ఈనెల 23, లేదా 24వ తేదీల్లో సీట్ల కేటాయింపు ఉంటుందని అడ్మిషన్ల కమిటీ వర్గాలు తెలిపాయి. -
ఆప్షన్ల మార్పునకు అవకాశం
- ఇంజినీరింగ్ కళాశాల, బ్రాంచ్‌లు మార్చుకునేందుకు వీలు - ఎంసెట్ కౌన్సెలింగ్‌లో చివరి అవకాశం ఎచ్చెర్ల (శ్రీకాకుళం) : ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ చివరి దశకు చేరుకుంది. ఆది, సోమవారాల్లో ఆప్షన్లు మార్పునకు మరో అవకాశం ఉంది. గతంలో ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు సైతం మళ్లీ అదనపు సమాచారం ఉంటే మార్చుకోవచ్చు. 22న ఎలాట్మెంట్ల ప్రకటన ఉంటుంది. విద్యార్థుల పూర్వపు పాస్వర్డ్, లాగిన్ ఐడీతో ఆప్షన్లు మార్పు చేసుకోవచ్చు. దాదాపుగా విద్యార్థులు ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చు కున్నారు. ఈనెల 6 నుంచి 15 వరకు ఎంసెట్-2016 కౌన్సెలింగ్ శ్రీకాకుళం పురుషుల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రలో జరగ్గా, 2,825 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. 1 నుంచి చివరి ర్యాంకు వరకు ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ శనివారంతో ముగిసింది. షెడ్యూల్ మేరకు ఉన్నత విద్యామండలి విద్యార్థులు కళాశాలలు, ఆప్షన్లు మార్పునకు మరో అవకాశం కల్పించింది. విద్యార్థుల పునరాలోచనకు అవకాశం గతంలో అవగాహనతో విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకుంటే మార్పులు అవసరం లేకున్నా, గతంలో అవగాహన లేకుండా కళాశాల, బ్రాంచ్‌లు ఎంచుకుంటే మాత్రం విద్యార్థులు మార్పులు చేయడం మంచిది. ప్రస్తుతం కొత్తగా కొన్ని ప్రభుత్వ కళాశాలలు సైతం కౌన్సెలింగ్ జాబితాలో చేరాయి. ప్రభుత్వ కళాశాలలకు ర్యాంకు బట్టి విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. 10వేల లోపు ర్యాంకు విద్యార్థులు ఎటువంటి కళాశాలు ఎంచుకున్నా రీయింబర్స్మెంట్ వర్తించే విద్యార్థులకు సమస్య ఉండదు. కామన్ ఫీజు దాటిన కళాశాలలు ఎంచుకునే విద్యార్థులు ఆర్థిక స్థోమత పరిగణలోకి తీసుకొని కళాశాల ఎంపిక చేసుకుంటే మంచిది. ప్రస్తుతం విద్యార్థులు ట్రెండ్ బట్టి సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్, ట్రిఫుల్ఈ, సివిల్ బ్రాంచ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుం ఉన్న ట్రెండ్ విద్యార్థి రిలీవ్ అయిన నాలుగేళ్ల తరువాత కొనసాగుతుందని చెప్పలేం. మార్పులు ఉంటాయి. ఎంచుకున్న బ్రాంచ్‌లో నిష్ణాతులైన విద్యార్థులు మాత్రమే మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. కళాశాల మార్పులు చేసుకునే విద్యార్థులు గత ప్రవేశాలు, పూర్వపు విద్యార్థుల ఫీడ్ బ్యాక్ తీసుకుంటే నష్టపోయో అవకాశాలు తక్కువ. ఆప్షన్లు మార్పునకు అవకాశం విద్యార్థులు ఆది, సోమవారాల్లో ఆప్షన్లు మార్పు చేసుకోవచ్చు. అవసరం లేదంటే మార్పునకు అవసరం లేదు. గతంలో ఇచ్చిన ఆప్షన్లు సరిచూసుకోవచ్చు. ఆప్షన్ల మార్పునకు ఇది చివరి అవకాశం. - మేజర్ కె.శివకుమార్, సహాయ కేంద్రం ఇన్చార్జి. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో భాష్యం విజయకేతనం
హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో భాష్యం ఐఐటీ అకాడమీ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని ఆ విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ చెప్పారు. గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ.. ఆదివారం ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థి చుండూరు రాహుల్ ఓపెన్ కేటగిరీలో జాతీయ స్థాయిలో 15వ ర్యాంకుతో పాటు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. రిజర్వేషన్ కేటగిరీలో కల్లూరి హరిప్రసాద్ అఖిల భారత స్థాయిలో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకున్నాడని చెప్పారు. జేఈఈ లక్ష్యంగా ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దుతూ ఏటా సంచలన విజయాలను నమోదు చేస్తున్నామన్నారు. నారాయణ శ్రీచైతన్య హవా హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో నారాయణ శ్రీచైతన్య ఐఐటీ అకాడమీ సత్తా చాటిందని ఆ విద్యాసంస్థల డెరైక్టర్లు పేర్కొన్నారు. అత్యధిక టాప్ ర్యాంకులతోదేశంలో అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. విద్యా సంస్థల డెరైక్టర్లు డాక్టర్ బీయస్ రావు, డాక్టర్ పి.సింధూర నారాయణ, సుష్మ, శ్రీనిశిత్ విలేకరులతో మాట్లాడుతూ, ఓపెన్ కేటగిరీలో 50 శాతం టాప్ ర్యాంకులతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ముందు వరుసలో నిలిచారని చెప్పారు. దక్షిణ భారతదేశం నుంచి ఫస్ట్ ర్యాంక్‌తో పాటు ఆలిండియా 4, 5, 7, 8, 10.. ఇలా 50 శాతం టాప్ ర్యాంకులు కైవసం చేసుకుందని పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీలో దక్షిణ భారతదేశం నుంచి తొలి ర్యాంకును, ఆలిండియా నాలుగో ర్యాంకులను జీవితేష్ దుగ్గాని, ఆలిండియా ఐదో ర్యాంకును సాయితేజ తాళ్లూరి, ఆలిండియా ఏడో ర్యాంకును జి.నిఖిల్ సామ్రాట్, 8వ ర్యాంకును సాయి ప్రణీత్ రెడ్డి, పదో ర్యాంకును విఘ్నేశ్వర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. శ్రీగాయత్రి విజయభేరి హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ గాయత్రి విద్యార్థులు ఆలిండియా టాప్ ర్యాంకుల సాధించినట్లు విద్యా సంస్థల చైర్మన్ పీవీఆర్కే మూర్తి తెలిపారు. వివిధ కేటగిరీల్లో 1,000 లోపు 32 ఆలిండియా ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. శ్రీ గాయత్రి లక్ష్య, ఇంటెన్సివ్ ప్రోగ్రాం, ఐసీసీ ప్రోగ్రామ్ వల్లే తాము ఈ ఘన విజయాన్ని సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేకేఆర్ గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్స్ రికార్డు హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు సంచలనం సృష్టించారని విద్యాసంస్థల చైర్మన్ కేకేఆర్ తెలిపారు. తమ విద్యార్థులు వివిధ కేటగిరీల్లో 4, 13, 16, 25.. వంటి ఆలిండియా టాప్ ర్యాంకులు సాధించారని చెప్పారు. ఈ ఫలితాలు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని బ్రాంచీల విద్యార్థుల నుంచి సాధించినవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జేఈఈలో విజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభాభినందనలను తెలియజేశారు. ‘శశి’ ప్రభంజనం హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు వివిధ కేటగిరీల్లో మరోమారు సత్తా చాటారని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ తెలిపారు. ప్రిన్స్ కమల్ తేజ జాతీయ స్థాయిలో 296 వ ర్యాంకు, టీ సుందర్ 389 వ ర్యాంకు సాధించినట్లు చెప్పారు. హాజరైన 92 మందిలో 51 మంది ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. 5 వేల లోపు 19 ర్యాంకులు, 8 వేలలోపు 23 ర్యాంకుల సాధించారన్నారు. ‘విశ్వభారతి’ పూర్వ విద్యార్థికి 8వ ర్యాంకు హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గుడివాడ విశ్వభారతి ఇంగ్లిష్ మీడియం స్కూల్ పూర్వ విద్యార్థి సుంకేశుల సాయి ప్రణీత్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకు సాధించాడని స్కూల్ చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ తెలిపారు. మరో పూర్వ విద్యార్థి వి.నిరంజన్ ఆలిండియా 12 వ ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. ‘ఎస్ఆర్’ ప్రతిభ హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించినట్లు విద్యా సంస్థల అధినేత వరదారెడ్డి తెలిపారు. జి.రవితేజ జాతీయ స్థాయిలో (రిజర్వేషన్ కేటగిరీ) 16వ ర్యాంకు, భూక్యా రాంనాయక్ 48వ ర్యాంకు సాధించారు. సన్నతి ప్రవీణ్ 50వ ర్యాంకు సాధించాడు. వీరితో పాటు మరో 61 మంది ఐఐటీలో ప్రవేశానికి అర్హత సాధించారని వరదారెడ్డి వివరించారు. వారిని డైరక్టర్లు మధుకర్, సంతోష్‌రెడ్డి తదితరులు అభినందించారు. -
ర్యాంకర్ల మనోగతం
బాంబే ఐఐటీలో సీఎస్ఈ: జీవితేశ్ ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేయడమే తన లక్ష్యమని జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా నాలుగో ర్యాంకు సాధించిన జీవితేశ్ చెప్పాడు. ఈయన తండ్రి శివకుమార్ వీటీపీఎస్‌లో ఏడీఈగా పని చేస్తున్నారు. పదో తరగతి వరకు విజయవాడలో చదివిన జీవితేశ్.. హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసి 981 మార్కులు సాధించాడు. తెలంగాణ ఎంసెట్‌లో 35, ఏపీ ఎంసెట్‌లో 78వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతా: సాయితేజ ‘‘తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు నారాయణ శ్రీచైతన్య ఐఐటీ అకాడమీ ఫ్యాకల్టీ గెడైన్స్‌తోనే ఈ విజయం సాధ్యపడింది. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదవడం నా లక్ష్యం. ఆ తర్వాత సివిల్స్‌కి ప్రిపేర్ అవుతా’’ అని జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఐదో ర్యాంకు సాధించిన తాళ్లూరి సాయితేజ చెప్పాడు. టాప్-5లో స్థానం దక్కుతుందని ముందుగా ఊహించానన్నారు. గుంటూరు జిల్లా కూచిపూడికి చెందిన వీరి కుటుంబం చాలా సంవత్సరాల కిందట హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో స్థిరపడింది. నాన్న చలపతిరావు సివిల్ కాంట్రాక్టర్. తెలంగాణ ఎంసెట్‌లో సాయితేజ మొదటి ర్యాంకు సాధించగా... ఏపీ ఎంసెట్‌లో ఏడో ర్యాంకు పొందాడు. ఎంసెట్‌లో 3.. అడ్వాన్స్‌డ్‌లో 7 వరంగల్ జిల్లాకు చెందిన నిఖిల్ సామ్రాట్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఏడో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. నిఖిల్ తండ్రి ప్రసాద్ విద్యాశాఖలో డీఈగా విధులు నిర్వహిస్తున్నారు. బాంబే ఐఐటీలో సీఎస్ఈ చేస్తానంటున్న నిఖిల్ తెలంగాణ ఎంసెట్‌లో మూడో ర్యాంకు, ఏపీ ఎంసెట్‌లో 54వ ర్యాంకు సాధించాడు. బాంబేలో చదువుతా: ప్రణీత్‌రెడ్డి కడప జిల్లాకు చెందిన సాయి ప్రణీత్ రెడ్డి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 8వ ర్యాంకు సాధించాడు. ఈయన తండ్రి రాజగోపాల్ రెడ్డి సివిల్ కాంట్రాక్టర్. అమ్మ శ్రీలత గృహిణి. చిన్నతనం నుంచే చదువులో ముందుండే ప్రణీత్... తెలంగాణ ఎంసెట్‌లో 31, ఏపీ ఎంసెట్‌లో 53వ ర్యాంకు పొందాడు. బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తానని చెప్పాడు. స్పేస్ సైంటిస్ట్ అవుతా: విఘ్నేష్ రెడ్డి బాంబే ఐఐటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తానని జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో పదో ర్యాంకు సాధించిన కొండా విఘ్నేష్ రెడ్డి చెప్పాడు. ఈయనది నెల్లూరు జిల్లా. నాన్న శ్రీనివాసులు సాఫ్ట్వేర్ ఇంజినీర్. అమ్మ సరళాదేవి గృహిణి. ప్రస్తుతం వీరి కుటుంబం హైదరాబాద్‌లోనే స్థిరపడింది. ‘‘నాకు అంతరిక్షం అంటే చిన్నప్పట్నుంచీ చాలా ఆసక్తి. స్పేస్ సైంటిస్ట్ కావడమే నా జీవిత లక్ష్యం. 2025 నాటికి ఇస్రో ప్రపంచాన్ని శాసిస్తుందని నా నమ్మకం. అప్పటికి ఇస్రోలో నా పాత్ర ఉండాలి’’ అని విఘ్నేష్‌రెడ్డి పేర్కొన్నాడు. -
23 ఐఐటీల్లో 10,575 సీట్లు
ఓపెన్ కేటగిరీలో 5187 స్థానాలు సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలి తాలు వెలువడడంతో అందులో మంచి ర్యాంకులు సాధించిన అభ్యర్ధులు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యా సంస్థల్లో చేరేందుకు వీలుగా తదుపరి సన్నాహాల్లో నిమగ్నమవుతున్నారు. దేశంలో 23 ఐఐటీ సంస్థలుండగా తమకు ఏ ఐఐటీలో సీటు దక్కుతుందన్న అంశాలపై వారంతా దృష్టి సారించారు. దేశం మొత్తం మీద ఐఐటీల్లో 10,575 సీట్లు ఉన్నాయి. అందులో శారీరక అంగవికలుర కు మూడుశాతం కోటా వర్తిస్తుంది. మొత్తం సీట్లలో ఓపెన్ కేటగిరీలో 5187 ఉండగా తక్కినవన్నీ వివిధ రిజర్వుడ్ కేటగిరీల కింద కేటాయించారు. ఓపెన్ కేట గిరీలో వికలాంగులకు 150 సీట్లు, ఎస్సీ కేటగిరీలో 1537, ఎస్సీ వికలాంగులకు 48, ఎస్టీలకు 773, ఎస్టీ వికలాంగులకు 31 సీట్లు కేటాయించారు. ఇక ఓబీసీలో నాన్ క్రిమీలేయర్‌కింద 2763, ఓబీసీ వికలాంగ అభ్యర్ధులకు 86 సీట్లు కేటాయించారు. అత్యధిక సీట్లు ఖరగ్‌పూర్ ఐఐటీలో (1341) ఉన్నాయి. రెండో స్థానంలో వారణాసి ఐఐటీ (1090 సీట్లు) ఉంది. 20 నుంచి ఐఐటీల్లో సీట్లు కేటాయింపు 15న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు వెలువడిన నేపథ్యంలో ఐఐటీల్లో ఈ నెల 20 నుంచి సీట్ల కేటాయింపు చేపట్టేందుకు ఐఐటీల సంయుక్త కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రూర్కీలో ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ)ను ఈ నెల 15న నిర్వహించేందుకు ఐఐటీ గువాహటి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఆదివారం నుంచే ఏఏటీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. విద్యార్థులు ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. ఆర్కిటెక్చర్ ప్రవేశ పరీక్షను ఈ నెల 15న ఉదయం 9 గంటల నుంచి మధాహ్నం 12 గంటల వరకు జోనల్ ఐఐటీల్లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. వీటి ఫలితాలను ఈ నెల 19న ప్రకటించనుంది. ఐఐటీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను వచ్చే నెల 19లోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. -
నచ్చిన సీటుకోసం 2000 మందికి నరకం
ముంబయి: తనకు నచ్చిన చోట సీటు ఇవ్వాలంటూ శివసేన పార్టీ ఎమ్మెల్యే అతడి అనుచరులు నానా రచ్చ చేశారు. చత్రపతి శివాజీ టర్మినస్ పై దాదాపు గంటసేపు ఎక్స్ ప్రెస్ రైలును ముందుకెళ్లకుండా అడ్డుకున్నాడు. దీంతో దాదాపు 2000 మంది ప్రయాణీకులకు ఇబ్బంది కలిగినట్లయింది. నాందేడ్ ప్రాంతానికి చెందిన హేమంత్ పాటిల్ అనే ఎమ్మెల్యే దేవగిరి ఎక్స్ ప్రెస్ లో తనకు సెకండ్ ఏసీ కోచ్ లో పక్క సీటు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాత్రి పదిగంటల వరకు రైలు కదలకుండా అడ్డుకున్నారు. -
చర్చల్లేవ్!
సాక్షి, చెన్నై : అధికారం లక్ష్యంగా తీవ్ర వ్యూహ రచనలతో డీఎంకే ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. మైనారిటీ పార్టీల్ని అక్కున చేర్చుకుని, వివిధ సామాజిక వర్గాల సంఘాలు, పార్టీల మద్దతు , వారికి సంఖ్యా బలం ఆధారంగా సీట్ల కేటాయింపుల్లో డీఎంకే అధినేత కరుణానిధి, దళపతి, కోశాధికారి ఎంకే స్టాలిన్ బిజీబిజీగా ఉన్నారు. అయితే, కూటమిలోకి తొలుత అడు గు పెట్టిన కాంగ్రెస్ సీట్ల పందేరం మాత్రం ఇంత వరకు కొలిక్కి తీసుకురాలేదు. డీఎంకే తో సాగించిన మంతనాల మేరకు ఢిల్లీలో అధినేత ఆమోదం కోసం టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ తిష్ట వేసి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేం దుకు కరుణానిధి సిద్ధం అయ్యారు. గురువా రం ఉదయం గోపాలపురానికు దళపతి స్టాలి న్, గారాల పట్టి,మహిళా నేత, ఎంపీ కనిమొళిలతో పాటుగా ముఖ్య నాయకులు దురై మురుగన్, పొన్ముడి, ఏవీ వేలు, కేఎన్ నెహ్రు, పూండి కలై వానన్లతో సమావేశమయ్యారు. సుమారు రెండు గంటల పాటుగా ఈ సమావేశం కాంగ్రెస్‌కు సీట్ల కేటాయింపు మీదే సాగి నట్టు సమాచారం. సీట్ల పందేరాన్ని త్వరితగతిన ముగించి, అభ్యర్థుల ప్రకటన, ప్రచార బరిలోకి దూసుకెళ్లేందుకు తగ్గ కార్యాచరణను వేగవంతం చేయడానికి ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఉన్నారు. అదే సమయంలో సీట్ల పందేరం తేలని దృష్ట్యా, కాంగ్రెస్‌ను పక్కన పెట్టి, తమిళ మానిల కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకునేందుకు డిఎంకే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వస్తున్న సమాచారాలకు ఈసందర్భంగా స్టాలిన్ ముగింపు పలికారు. సమావేశానంతరం వెలుపలకు వచ్చిన స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. తమిళ మానిల కాంగ్రెస్‌తో చర్చల్లో ఉన్నట్టుందే..? అని ప్రశ్నించగా, ఎవరు చెప్పారు..? నేను చెప్పానా..? తమ వాళ్లెవరైనా చెప్పారా..? అని ఎదురు ప్రశ్న వేశారు. తమిళ మానిల కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చలు జరపలేదని, జరపబోమని వ్యాఖ్యానించారు. ఊహా జనిత కథనాలకు, ప్రచారాలకు తనను సమాధానం అడగడం మానుకోవాలని, వాటన్నింటికీ తానెలా బాధ్యుడు అవుతానంటూ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో సీట్ల పందేరం కొలిక్కివచ్చిందా..?అ ని ప్రశ్నించగా, వచ్చాక పిలిచి చెబుతానంటూ ముందుకు సాగారు. ప్రచార రథంలో చక్కర్లు : అధికారం లక్ష్యంగా ముందుకు సాగుతున్న డిఎంకే అధినేత కరుణానిధి ఈ సారి రాష్ర్ట వ్యాప్తంగా పర్యటించేందుకు నిర్ణయించి ఉన్నారు. ఆయన వయోభారాన్ని పరిగణలోకి తీసుకుని ప్రత్యేక ప్రచార రథాన్ని సిద్ధం చేసి ఉన్నారు. వీల్ చైర్‌కు పరిమితంగా ఉన్న కరుణానిధి నేరుగా ఆ రథంలోకి వెళ్లేందుకు తగ్గ ప్రత్యేక ఏర్పాట్లు, ఆయన విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక సదుపాయాలు, సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా అత్యాధునిక హంగులు, నలు వైపులా ప్రత్యేక విద్యుత్ లైట్లు, స్పీకర్లు, ఇలా ప్రత్యేక సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఈ వాహనం చెన్నైకు బుధవారం సాయంత్రం చేరింది. ఈ వాహనం రాగానే, అందులో కాసేపు కరుణానిధి, స్టాలి న్ చక్కర్లు కొట్టడం విశేషం. తనకు ఆ వాహ నం అన్ని విధాలుగా సౌకర్యంగా ఉందా..? అని పరిశీలించేందుకు తగ్గట్టుగా ఈ ట్రైల్ నగరంలో సాగడంతో కరుణానిధి చూడటానికి పార్టీవర్గాలు, అభిమానులు రోడ్డెక్కారు. ట్రాఫిక్‌ను ఎక్కడా నిలపకుండా జనంతో జనంగా అన్ని వాహనాలతో కలిసి కరుణానిధి రథం నగరంలో కొన్ని చోట్ల సాగింది. -
గ్రేటర్ ఎన్నికల్లోనూ తప్పని తిప్పలు
-
స్ట్రెచ్ యోగా సాగిపో హ్యాపీగా!
గత వారం ప్రాథమిక ఆసనాలైన సూర్య నమస్కారాల గురించి తెలుసుకున్నాం. ఈ వారం మరికొన్ని ప్రాథమిక ఆసనాలు... తాడాసనం, తాళాసనం, కటి చక్రాసనం గురించి తెలుసుకుందాం. ఇవి శరీరాన్ని చురుగ్గా ఉంచడంలో సాయం చేస్తాయి. కీళ్ల నొప్పులను, కండరాల బాధలను ఇవి దూరం చేసి మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతాయి. యోగావగాహన.... శారీరక ధృఢత్వానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఋషులు, మునులు అందించిన శాస్త్రం హఠయోగం. దీనిని తొలుత 8వ శతాబ్దంలో స్వాత్మారామ అనే గురువు హఠయోగ ప్రదీపిక పేరిట గ్రంథ రూపంలో అందించారు. స్వాత్మారాముడు ప్రథమ శ్లోకంలోనే రాజయోగ ఉపయోగార్థం ఈ హఠయోగాన్ని ఇస్తున్నట్టు చెబుతాడు. పతంజలి ఇచ్చిన యోగ దర్శనానికి అనుగుణంగా ధ్యానానికి శరీరాన్ని సిద్ధం చేయడం హఠయోగ సాధన ముఖ్యోద్దేశం. శాస్త్రం కాబట్టి యోగాను శాస్త్రీయ దృక్పథంతోనే ఆచరించాలి. యోగా అనే పదం యంగ్ అనే పదంలో నుంచి వచ్చినట్టయితే దాని అర్థం సంయోగం. అంటే శరీరాన్ని, శ్వాసను మనసుతో అనుసంధానం చేసి సమన్వయం చేయడం. దీనికి మూలం ‘యోక్’ అయినట్లయితే దాని అర్థం కాడి. రైతు పొలం దున్నేటప్పుడు కాడికి కుడి ఎడమ వైపున కట్టిన ఎడ్ల కదలికలో సమతుల్యం ఉండేటట్టుగా ఎలా చూస్తాడో అలాగే యోగాసన, ప్రాణాయామ సాధన చేసేటప్పుడు శరీరంలో ఎడమ, కుడి భాగాలను మెదడులో ఎడమ, కుడి గోళార్ధములను, ఇడ-పింగళ నాడులను సమంగా పనిచేసేటట్టుగా చూడాలి. తాళాసన (తాళ అంటే తాడిచెట్టు) రెండు కాళ్లను ఒక చోట చేర్చి సమంగా నిలబడి నెమ్మదిగా చేతులను శరీరం పక్క నుంచి తలపైకి తీసుకెళ్లి, పైన ఆకాశం వైపు చూపుతూ వాటిని ఇంటర్ లాక్ చేయాలి. కాలిమడమలు పెకైత్తి మునివేళ్ల మీద నిలబడి శరీరాన్ని వీలైనంత వరకూ పైకి సాగదీస్తూ శక్తి ప్రవాహాన్ని వెన్నెముక కింది భాగం నుంచి తలపై భాగం వరకూ ప్రసరించడాన్ని గమనించాలి. దీని వల్ల వెన్నెముక ధృఢంగా అవడంతో పాటు వెన్నెముక పూసల మధ్య ఖాళీ పెరుగుతుంది. పూసల మధ్యలో ఉన్న డిస్క్‌లకు వ్యాకోచత్వం పెరిగి, స్లిప్డ్ డిస్క్ డిస్క్ ప్రోలాప్స్ వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఒక వయోపరిమితి వరకూ ఎత్తు పెరగడానికి కూడా ఈ ఆసనం ఉపకరిస్తుంది. శ్వాస తీసుకుని శరీరాన్ని పైకి సాగదీసేటప్పుడు పొట్టని లోపలికి లాగడం ద్వారా పొట్టలో ఉన్న కొవ్వు కరిగే అవకాశంతో పాటు, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. తాడాసన (తాడ అంటే పర్వతము) నిటారుగా నిలుచుని వెన్నెముకను నిదానంగా సాగదీయాలి. చేతులు శరీరానికి పక్కగా ఉంచాలి. ప్రశాంతంగా కళ్లు మూసుకుని శ్వాసను పీలుస్తూ, వదులుతూ ఉండాలి. శరీరానికి ఇది చక్కటి విశ్రాంతిని అందిస్తుంది. కటి చక్రాసనం రెండు పాదాలను ఒక చోట చేర్చి నిటారుగా నిలబడాలి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ కుడిచేతిని పెకైత్తాలి. తర్వాత నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ (కుడిచేతిని తలకి ఆనంచి) దేహాన్ని ఎడమవైపునకు వంచాలి. ఆసనంలో కొద్దిసేపు ఉండి, నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ పైకి రావాలి. శ్వాస వదిలేస్తూ కుడిచేయి కిందకు తీసుకురావాలి. ఎడమవైపు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి. దీని వల్ల నడుము కుడి ఎడమ భాగాల్లో కొవ్వు తగ్గడమే కాక వెన్నెముకలో ధృఢత్వం, సాగే గుణం పెరుగుతుంది. ఎ.ఎల్.వి. కుమార్ ట్రెడిషనల్ యోగా సెంటర్ -
రాజ్యసభ సీటు ఆశిస్తున్న హరికృష్ణ
-
సీటు వెనక్కి నెట్టిందని..
లాస్ ఏంజెల్స్ : స్వల్ప వివాదం కారణంగా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన సౌత్ వెస్ట్ ఎయిర్వేస్ జెట్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. కేవలం తన సీటును వెనక్కి నెట్టిన కారణంగా ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల తోటి ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. దీంతో విమానంలో ఉన్న 136 మంది ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ కారణంగా పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. స్వల్ప విషయానికే అసహనానికి గురైన అతగాడు.. ప్రయాణికురాలి గొంతు పట్టుకుని నులిమేశాడు. ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడకుండా చేసి తలపై తీవ్రంగా కొట్టాడు. దీన్ని గమనించిన తోటి ప్రయాణీకులు అప్రమత్తమై అతడిని వారించి, సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అతగాడిని అదుపులోకి తీసుకున్నారు. విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత బాధిత మహిళ రిలాక్స్‌గా తన సీటును వెనక్కి జరిపిందని... అయితే ఆమె వెనక సీటులో కూర్చున్న ప్రయాణికుడు ..ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ...అకస్మాత్తుగా ఆమె గొంతుపట్టుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో ఆమె భయంతో బిక్కచచ్కిపోయిందన్నారు. ఈ వివాదంతో సుమారు అయిదుగంటల పాటు విమానం ఆగిపోయింది. దీంతో మిగతా వారిని వేరే విమానంలో శాన్ ఫ్రాన్సిస్కోకు తరలించారు. కాగా ఈ ఆలస్యం విలువ సుమారు రెండు లక్షల డాలర్లని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ తెలిపింది. -
సీటుకు రూ.5 వేలు కడితే చాలు
సాక్షి, హైదరాబాద్: ‘సీటుకు రూ.5 వేలు కట్టండి. మీ తప్పులన్నీ మాఫీ చే యించుకోండి’ ఇదీ ప్రైవేటు సాంకేతిక, వృత్తి విద్యాకాలేజీలకు ఉన్నత విద్యామండలి ఇస్తున్న బంపర్ ఆఫర్. కాలేజీల్లో వివిధ కోర్సుల్లో రాష్ట్రేతర విద్యార్థులకు ప్రవేశాలు తదితర అక్రమాలకు పాల్పడి ఉంటే వాటిని సరిచేసుకోవడానికి సీటుకు రూ.5 వేల చొప్పున అపరాధ రుసుముగా చెల్లించాలని ఉన్నత విద్యామండలి సర్క్యులర్ జారీచేసింది. గురువారం ఈ సర్యులర్‌ను మండలి వెబ్సైట్లో పొందుపరిచారు. 2014-15లో కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లలో, మేనేజ్మెంటు కోటాలోని సీట్ల భర్తీలో నిబంధనలకు విరుద్ధంగా ఆయా కాలేజీలు ఇతర రాష్ట్రాల విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ప్రవేశాలను అధికార యుతం చేసేందుకు ఈ జీవో విడుదల చేశారు. -
బీజేపీకి 160.. ఎల్జేపీకి 40!
ఆర్ఎల్ఎస్పీకి 23; మాంఝీ పార్టీకి 20 - బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే పక్షాల సీట్ల సర్దుబాటు - అసంతృప్తి లేదు: మాంఝీ; గెలుపు మా కూటమిదే: అమిత్ షా సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఎన్డీయే మిత్రపక్షాల మధ్య అవగాహన కుదిరింది. మొత్తం 243 స్థానాలకు గాను.. 160 సీట్లలో బీజేపీ, 40 స్థానాల్లో రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ), 23 స్థానాల్లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ), 20 సీట్లలో జతిన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ ఆవామ్ మోర్చా-సెక్యులర్(హెచ్ఏఎమ్-ఎస్) పోటీ చేయనున్నాయి. పాశ్వాన్, ఆర్ఎల్ఎస్పీ నేత ఉపేంద్ర కుష్వాహా, మాంఝీలతో కలసి సోమవారం మీడియా భేటీలో పాల్గొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ వివరాలను వెల్లడించారు. మిత్రపక్షాల్లో విబేధాలు లేవని, మాంఝీ పార్టీ నేతలు కొందరు బీజేపీ తరఫున పోటీ చేస్తారన్నారు. ఎన్నికల్లో ఎన్డీయే పూర్తి మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల లౌకిక కూటమి అవసరాల ప్రాతిపదికన ఏర్పడిన కూటమి కాగా, తమది బిహార్ అభివృద్ధి ధ్యేయంగా సైద్ధాంతిక ప్రాతిపదికన ఏర్పడిన కూటమి అని విశ్లేషించారు. ‘నితీశ్‌కుమార్ నేతృత్వంలోని కూటమి.. రూ.12 లక్షల కోట్ల స్కాం చేసిన కాంగ్రెస్‌తో కలిసి బిహార్‌లో అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇస్తోంది. జంగిల్రాజ్తో ప్రసిద్ధి చెందిన లాలూతో కలిసి నేరరహిత బిహార్‌కు హామీ ఇస్తోంది’ అని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లోనూ తమ ప్రధాన ప్రచారకర్త ప్రధాని మోదీనేనని అన్నారు. పాశ్వాన్‌తో విబేధాలు లేవు: మాంఝీ హెచ్ఏఎం-ఎస్‌కు బీజేపీ మొదట 13 నుంచి 15 సీట్లు ఇవ్వజూపిందని, ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించడం వల్లనే సీట్ల సర్దుబాటులో జాప్యం నెలకొందన్న వార్తలను మాంఝీ కొట్టేశారు. తమ పార్టీకి కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందానన్నారు. పాశ్వాన్ కన్నా దళితుల్లో తనకే ఎక్కువ పలుకుబడి ఉన్నందువల్ల తన పార్టీకే ఎక్కువ సీట్లు ఇవ్వాలని పట్టుబట్టారని వచ్చిన వార్తలను కూడా మాంఝీ తోసిపుచ్చారు. పాశ్వాన్‌తో తనకు విభేదాల్లేవన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని ఎల్జేపీకి కేటాయించిన స్థానాల కన్నా తక్కువ సీట్లకు ఎలా ఒప్పుకున్నారన్న ప్రశ్నకు.. ఈ అంశాన్ని అమిత్ షా ముందు లేవనెత్తానన్నారు. లౌకిక కూటమిలో కేటాయింపు చర్చలు.. బిహార్ ఎన్నికల్లో మహా లౌకిక కూటమి వేదికగా పోటీ చేస్తున్న జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు.. ఏయే స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలన్న విషయంపై చర్చలు కొనసాగిస్తున్నాయి. మిత్రపక్ష నేతల మధ్య సీఎం నితీశ్ నివాసంలో సోమవారం కూడా చర్చలు జరిగాయి. మొదటి, రెండో దశ ఎన్నికల్లో నియోజకవర్గాల కేటాయింపునకు సంబంధించి తుది ప్రకటన మంగళవారం వెలువడుతుందని ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ తెలిపారు. కలసి పోటీ చేయనున్న ఎస్పీ, ఎన్సీపీ ఈ ఎన్నికల్లో కలసి పోటీ చేయనున్నామని ఎస్పీ, ఎన్సీపీలు ప్రకటించాయి. పొత్తుపై కాంగ్రెస్, బీజేపీల వ్యతిరేక పార్టీలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయన్నాయి. కాగా, బిహార్‌లోని మొత్తం 62,779 పోలింగ్ బూత్‌ల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్ర పోలీసులను, హోంగార్డులను వివిధ అవసరాలకు వినియోగిస్తామని వెల్లడించింది. -
ఎన్సీసీ కోటా సీట్ల భర్తీని వాయిదా వేయండి
ఎన్టీఆర్ యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఎన్సీసీ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీని వాయిదా వేయాలని హైకోర్టు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని బుధవారం ఆదేశించింది. ఎన్సీసీ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ప్రాధాన్యత విషయంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో వారంరోజులపాటు కౌన్సెలింగ్ వాయిదా వేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఎన్సీసీ కోటా సీట్ల భర్తీ విషయంలో ఎన్టీఆర్ వర్సిటీ అధికారులు నిర్దిష్ట విధానాన్ని అనుసరించట్లేదంటూ కర్నూలు జిల్లాకు చెందిన మర్రి సాయిశ్రీ, హైదరాబాద్‌కు చెందిన మాళవిక.. మరికొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిని జస్టిస్ సుభాష్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. అండమాన్ నికోబార్‌లో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్‌లో పాల్గొన్న విద్యార్థులకే సీట్ల భర్తీలో ప్రాధాన్యమిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. అంతేగాక ఎన్సీసీ డెరైక్టరేట్లు స్పాన్సర్ చేయని గెస్ట్ కాడెట్లకు సైతం సీట్లు ఇస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఒక్కో రాష్ట్రప్రభుత్వం ఒక్కోవిధంగా ప్రాధాన్యతను రూపొందించిందని నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. అసలు ప్రాధాన్యతలను తమ ముందుంచాలని కేంద్రప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
<b>ఓయూ ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు ఖాళీ</b>
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాలలో గతంలో ఎన్నడూలేని విధంగా ఈ విద్యా సంవత్సరం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం సీట్లు ఖాళీ అవుతున్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న ఈ క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాలకు ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు తొలి ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఈ విద్యా సంవత్సరం సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, బయో మెడిసిన్ విభాగాలలో సుమారు 42 సీట్లు ఖాళీ అయ్యాయి. ఐఐటీ, ఇతర కేంద్రస్థాయి విద్యా సంస్థల్లో సీట్లు సాధించడంతో విద్యార్థులు వలస వెళ్తున్నారని ఇన్చార్జి ప్రిన్సిపల్ ప్రొ.రామచంద్రం తెలి పారు. ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఖాళీ అవుతున్న సీట్లను వృథాగా వదిలేయోద్దని, ప్రభుత్వం వెంటనే స్పందించి వీటికి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాలని వివిధ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
మెడిసిన్ సీటు పేరుతో 10.5 లక్షలకు టోపీ
తూర్పుగోదావరి(కపిలేశ్వరపురం): మెడిసన్ సీటు ఇప్పిస్తామని నమ్మించి రూ.10.5 లక్షలు కాజేసిన వ్యవహారంపై తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలిలా ఉన్నాయి. అంగరకు చెందిన నెక్కంటి శ్రీనివాస్‌కుమార్ అదే గ్రామానికి చెందిన గుడిమెట్ల మురళీకృష్ణ కుమారుడికి చైనాలో మెడిసన్ సీటు ఇప్పిస్తానని నమ్మించాడు. 2013లో హైదరాబాద్‌లోని శాంభవి కన్సల్టెన్సీ ద్వారా సీటు ఇప్పిస్తానని ఆ కార్యాలయంలో ఉన్న భరత్‌కుమార్, హరిశంకర్లకు రూ.మూడు లక్షలు మురళీకృష్ణతో ఇప్పించాడు. ఎంతకీ సీటు ఖరారు కాకపోవడంతో మురళీకృష్ణ నిలదీయడంతో కుంటిసాకులు చెప్పి గుంటూరులోని కాటూరి మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తానని శ్రీనివాస్‌కుమార్ అన్నాడు. ఆ క్రమంలోనే మరో రూ.3,92,000 వసూలు చేశాడు. కాలేజీ నుంచి అడ్మిషన్ లెటర్ తెచ్చి, చేర్పించే బాధ్యత తనదని, మరికొన్ని ఖర్చులకని ఇంకో రూ.3,60,000 వసూలు చేశాడు. ఇలా దఫ దఫాలుగా మొత్తం రూ. 10,52,000 వసూలు చేశాడు. ఎంతకీ సీటు రాకపోవడంతో మురళీకృష్ణ ఈ నెల ఆరున అంగర పోలీసులను ఆశ్రయించాడు. శ్రీనివాస్‌కుమార్, భరత్‌కుమార్, హరిశంకర్‌లతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. -
ఆ సీటు బంగారం గానూ..
చెన్నై: సీటు బంగారం అంటే బంగారంతో చేసిన సీటు కాదు. సీటు కింద బంగారం దాచుకుని ప్రయాణించడం. అది కూడా ఒకటీ, అరా కాదు.. ఏకంగా మూడు కిలోల బంగారం!! చెన్నై ఎయిర్‌పోర్టులో కలకలం రేపిన ఈ సీటు కింద బంగారం కథేంటో చూద్దాం.. ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం కౌలాలంపూర్ నుంచి బుధవారం మధ్యాహ్నం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ప్రయాణికులందరూ దిగి వెళ్లిపోయారు. షెడ్యూల్ ప్రకారం ఆ విమానం ముంబైకి ఓ ట్రిప్పు వెళ్లాల్సి ఉంది. దీంతో క్లీనింగ్ స్టాఫ్ హడావిడిగా వాక్యూమ్ క్లీనర్లు, మాప్‌లతో విమానాన్ని శుభ్రం చేసేందుకు లోనికి వెళ్లారు. ఆ క్రమంలో ఓ సీటు కింద ఒక పెట్టెను చూశారు. వెంటనే అధికారులకు కబురందించారు. బాక్సును స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఏ బుట్టలో ఏ పాము ఉంటుందోనని జాగ్రత్తగా తెరిచి చూస్తే.. దాని నిండా బంగారమే! ఒకటికాదు రెండు కాదు దాదాపు కోటి రూపాయల విలువచేసే మూడు కేజీల బంగారం. అప్రమత్తమైన అధికారులు ఆ బంగారం ఉన్న సీటులో ప్రయాణించిన వ్యక్తి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఎలాగోలా అతడ్ని పట్టుకోగలిగారు. ప్రస్తుతం అతణ్ని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇదేకాకుండా చెన్నై ఎయిర్ పోర్టులో ఈ రోజు అక్రమంగా తరలిస్తున్న 35 నక్షత్ర తాబేళ్లను కూడా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సింగపూర్ కు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. -
సీటు కోటిపైనే..!
- ప్రత్యేక ఎంసెట్‌కు ముందే యాజమాన్య కోటా సీట్ల అమ్మకం - 500 ఎంబీబీఎస్ సీట్లు హాంఫట్! - ప్రైవేటు మెడికల్ కాలేజీల బరితెగింపు - సీట్లు కొన్నవారికి పేపర్ లీక్! - ‘దోపిడీ’కి సర్కారు వెసులుబాటు... ఇంకా ఎంసెట్ ఫలితాలు రాలేదు... ‘బి’ కేటగిరీ వైద్య సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష జరగనే లేదు... కానీ ఈలోపే రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు బరితెగించాయి. యథేచ్ఛగా సీట్ల దందా సాగించాయి. ఎంబీబీఎస్‌కు ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటూ యాజమాన్య కోటాలోని సీట్లను ఫిబ్రవరి నుంచే భర్తీ చేసేసుకున్నాయి! కాలేజీని, ప్రాంతాన్నిబట్టి ఒక్కో సీటుకు రూ. 1.10 కోట్ల నుంచి 1.25 కోట్లు దండుకున్నాయి! హైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం 2,950 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా వాటిలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 2,100 సీట్లు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్నాయి. 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ‘ఎ’ కేటగిరీలోని 50 శాతం (1,050) సీట్లు, ‘బి’ కేటగిరీలోని 10 శాతం (210) సీట్లను ఎంసెట్ మెరిట్ ద్వారానే ప్రభుత్వం భర్తీ చేసేది. మిగిలిన 40 శాతంలో (25 శాతం యాజమాన్య, 15 శాతం ప్రవాస భారతీయ) సీట్లను ప్రైవేటు కళాశాలలే తమకు నచ్చినట్లు సీట్లు భర్తీ చేసుకునేవి. అయితే ఈ ఏడాది ప్రభుత్వం ఆ విధానాన్ని మార్చింది. బీ కేటగిరీలోని 35 శాతం సీట్లను యాజమాన్య కోటాలో కలిపేస్తూ రెండ్రోజుల క్రితం ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ‘ఎ’ కేటగిరీలో 50 శాతం సీట్లు 1,050 ఉంటాయి. అవన్నీ ఎంసెట్ కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. బీ కేటగిరీలో 35 శాతం సీట్లు (735) ఉన్నాయి. వీటికి ప్రస్తుత ఎంసెట్ ర్యాంకుతో సంబంధం లేకుండా ప్రైవేటు వైద్య కళాశాలల ఆధ్వర్యంలోనే ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించుకొని వారే భర్తీ చేసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వచ్చే నెల మొదటి వారంలో ప్రత్యేక ప్రవేశ పరీక్షకు ప్రైవేటు కళాశాలలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. వారే కన్వీనర్‌ను నియమించుకొని త్వరలో ప్రత్యేక పరీక్షకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మిగిలిన 15 శాతం కోటాలో 315 సీట్లున్నాయి. ఇప్పుడు ఈ మొత్తం సీట్లతోపాటు బి కేటగిరిలో 200 దాకా సీట్లను కూడా యాజమాన్యాలు అమ్మేసుకున్నాయి. ‘దోపిడీ’కి సర్కారు వెసులుబాటు... యాజమాన్య కోటా సీట్లలో ప్రైవేట్ వారి దోపిడీ చాలదన్నట్లు సర్కారు మరో మార్గం కూడా చూపింది. కాలేజీలకు అనుకూలంగా రెండ్రోజుల కిందట మార్గదర్శకాలు జారీ చేసింది. బి కేటగిరిలో 35 శాతం సీట్లకు రూ. 9 లక్షలుగా ఫీజును నిర్ధారించింది. ప్రైవేటు వారు నిర్వహించే ప్రవేశ పరీక్ష రాసి ర్యాంక్ సాధించినా ఏటా రూ. 9 లక్షలు చెల్లించడానికి స్థోమత లేక ఆ సీటు భర్తీ కాకపోతే యాజమాన్యాలు ఆ సీటును భర్తీ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ వెసులుబాటును అడ్డంపెట్టుకునే కాలేజీలు ప్రవేశ పరీక్ష కూడా పెట్టకుండానే బి కేటగిరిలో దాదాపు 200 సీట్లను అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీట్లు కొన్నవారికి పేపర్ లీక్! యాజమాన్య కోటా 15 శాతం కంటే అధికంగా సీట్లు తెగనమ్ముకున్న కాలేజీలు బి కేటగిరిలో 35 శాతం సీట్లకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాన్ని సీట్లు కొన్నవారికి ముందే లీక్ చేసే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎంబీబీఎస్ సీటు కావాలంటూ దక్షిణ తెలంగాణలోని ఓ వైద్య కళాశాలను సంప్రదించిన ఓ తండ్రికి ఆ కాలేజీ యాజమాన్యం ఇదే మాట చెప్పింది. ‘మీరు ముందే రూ.1.25 కోట్లు చెల్లించండి. మీ అమ్మాయికి ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం ముందే లీక్ అయ్యేట్టు చూస్తాం’ అని హామీ ఇచ్చింది. దీనిపై ఆయన సాక్షి కార్యాలయానికి ఫోన్ చేయడంతో ఈ విషయం బయటపడింది. ర్యాంకు రాకుంటే డబ్బు వాపస్ కాలేజీలు ఒకవేళ సీట్లన్నీ ముందే భర్తీ చేసుకున్నా ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా వచ్చే ర్యాంకుల బట్టే ప్రైవేటు వైద్య కళాశాలలు యాజమాన్య సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ర్యాంకు రాని వారుంటే విద్యార్థుల నుంచి ముందే తీసుకున్న సొమ్మును వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది. మొదటిసారి కాబట్టి కొంత గందరగోళం సాధారణం. మున్ముందు ఈ పరిస్థితి మారనుంది. - లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి -
వచ్చే నెల లోక్‌సభలో సీట్ల కేటాయింపు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందే లోక్‌సభలో సభ్యులకు సీట్ల కేటాయింపు పూర్తయ్యే అవకాశముంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు పూర్తయినా ఇప్పటి వరకూ సీట్ల కేటాయింపు కొలిక్కి రాని సంగతి తెలిసిందే. వచ్చే నెలలో శీతాకాల సమావేశాలకు ముందే లోక్‌సభలో పార్టీలకు సీట్లను కేటాయించే అవకాశం ఉందని పార్లమెంట్ అధికారి ఒకరు తెలిపారు. సోమవారం జరిగే పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. పార్లమెంట్ సమావేశాలు నవంబర్ 24న ప్రారంభమై నెల రోజులు కొనసాగుతాయి. లోక్‌సభలో ఏ పార్టీకీ ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోవడంతో ఎక్కువ పార్టీలు ముందు వరుస సీట్లను కేటాయించాలని స్పీకర్‌ను కోరుతున్నాయి. -
బీఎంసీ .. యథాతథం!
సాక్షి, ముంబై: శివసేన, బీజేపీ నేతృత్వలోని మహాకూటమిలో సీట్ల సర్దుబాటు బెడిసి కొట్టినప్పటికీ మహానగర పాలక సంస్థ (బీఎంసీ)లో శివసేన పార్టీయే అధికారంలో కొనసాగుతుందని బీజేపీ పేర్కొంది. ఈ మేరకు కొంకణ్ రీజియన్ మహామండలికి బీజేపీ లిఖిత పూర్వకంగా లేఖ అందజేసింది. దీంతో బీఎంసీ కార్పొరేషన్ లో ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టమైంది. బీఎంసీలో మహాకూటమి అధికారంలో ఉంది. ఒకవేళ పొత్తు ఊడితే తమ పరిస్థితి ఏంటనే దానిపై కార్పొరేటర్లు గందరగోళంలో పడిపోయిన విషయం తెలిసిందే. చివరకు ఊహించిన విధంగానే జరిగింది. కాని బీఎంసీలో అధికారం మిత్రపక్షమైన శివసేన వద్దే ఉంటుందని లేఖ ఇవ్వడంతో ఈ వాగ్వాదానికి తెరపడింది. ఒకవేళ బీఎంసీలో మహాకూటమి నుంచి బీజేపీ బయట పడాలంటే తమ కార్పొరేటర్లందరితో పదవులకు రాజీనామా చేయించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే శివసేన సంఖ్యాబలం తగ్గి అధికారం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. 1997 నుంచి బీఎంసీలో శివసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్, స్థాయి సమితీ, ఇతర కీలక పదవులు వారివారి సంఖ్యాబలాన్ని బట్టి చేపడుతూ వస్తున్నాయి. బీఎంసీలో మొత్తం 227 మంది కార్పొరేటర్లున్నారు. అధికారం చేజిక్కించుకోవాలంటే 114 మంది కార్పొరేటర్ల బలం తప్పనిసరి . ఇందులో శివసేనకు 75, బీజేపీ 32, ఇండిపెండెంట్లు 12 మందిని కలుపుకొని 119 మంది కార్పొరేటర్లతో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇటీవల మేయర్‌గా ఎన్నికైన స్నేహల్ అంబేకర్‌కు మరో ముగ్గురు ఇండిపెండెంట్లు అదనంగా ఓట్లు వేయడంతో ఆమెకు మొత్తం 122 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల ప్రకారం కూటమి నుంచి బీజేపీ బయటపడితే శివసేన ప్రభుత్వానికి 32 మంది కార్పొరేటర్ల బలం తగ్గిపోతుంది. దాంతో ప్రతిపక్షాలు మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి శివసేనను ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. కాని బీజీపీతోపాటు ఇండిపెండెంట్లు కూడా శివసేనకు మిత్రపక్షంగా ఉంటామని లిఖితపూర్వక హామీ ఇచ్చాయి. దీంతో బీఎంసీలో ఇరుపార్టీలకూ అధికారంలో వాటా ఉంటుంది. దీంతో బీజేపీ భవిష్యత్తులో శివసేనను ఇబ్బందిపెట్టే అవకాశం ఉండదని కార్పొరేటర్లు భావిస్తున్నారు. -
‘పొత్తు’ చెడితే..!?
బీఎంసీలో ‘మహా’ సంశయం.. - ‘సీట్ల సర్దుబాటు’ వ్యవహారంతో ఆందోళనలో మహాకూటమి కార్పొరేటర్లు - కూటమి విడిపోతే ‘బీఎంసీ’ పరిస్థితిపై మల్లగుల్లాలు సాక్షి, ముంబై: ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం..’ అనే సామెత చందంగా తయారైంది బీఎంసీలోని అధికార కూటమి పరిస్థితి.. సీట్ల సర్దుబాటుపై శివసేన, బీజేపీ నేతృత్వంలోని మహాకూటమిలో ఇంతవరకు సయోధ్య కుదరకపోవడంతో మహానగర పాలక సంస్థ (బీఎంసీ)లో ‘మహాకూటమి’ కార్పొరేటర్లు ఆందోళనకు గురవుతున్నారు. గత 15 రోజులుగా ఇరు పార్టీల నాయకుల మధ్య చర్చలు ప్రత్యక్షంగా జరగకపోయినా మీడియా లేదా లేఖల ద్వారా ప్రతిపాదనలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ సమస్య ఎటూ పరిష్కారం కావడంలేదు. కాగా, దీని ప్రభావం బీఎంసీ పరిపాలన విభాగం పడే ఆస్కారముంది. బీఎంసీలో మహాకూటమి అధికారంలో ఉంది. పొత్తు ఉంటుందా..? ఊడుతుందా..? ఒకవేళ పొత్తు ఊడిపోతే బీఎంసీలో అధికారం శివసేన, బీజేపీ వద్ద ఉంటుందా...? లేక ఇక్కడ కూడా తెగతెంపులు చేసుకుని ఎవరి దారివారు చూసుకుంటారా...? అప్పుడు తమ పరిస్థితి ఏంటి..? ఇలా అనేక సందేహాలతో కొర్పొరేటర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. బీఎంసీలో మొత్తం 227 వార్డులున్నాయి. అధికారం చేజిక్కించుకోవాలంటే 114 మంది కార్పొరేటర్లు తప్పనిసరి కావాలి. కాని గత బీఎంసీ ఎన్నికల్లో ఏ కూటమికీ పూర్తి మెజార్టీ రాలేదు. బీఎంసీలో ప్రస్తుతం శివసేన-75, బీజేపీ-31, కాంగ్రెస్-52, ఎన్సీపీ-13, ఎమ్మెన్నెస్-28, సమాజ్‌వాది పార్టీ-9, అఖిల భారతీయ సేన-2, బీఆర్పీ-1, ఆర్పీఐ-1, ఇండిపెండెంట్లు-15 మంది సభ్యులున్నారు. ఇందులో శివసేన, బీజేపీ, ఆర్పీఐ కూటమి ఇద్దరు అఖిల భారతీయ సేన, 15 మంది ఇండిపెండెంట్లను కలుపుకొని అధికారంలోకి వచ్చింది. కాని ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఒకవేళ పొత్తు కుదరక మహాకూటమి చీలిపోతే బీఎంసీలో బలాబలాలను బట్టి చూస్తే బీజేపీ లేకుండా శివసేనకు 114 మేజిక్ ఫిగర్‌కు చేరుకోవడం ఒక సవాలుగా మారనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెన్నెస్, కాంగ్రెస్, ఎన్సీపీలతో జతకట్టడం సాధ్యం కాని పని. దీంతో మహాకూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం తమ సీట్ల కిందకు నీళ్లు తెచ్చేలా ఉందని కార్పొరేటర్లు ఆందోళనలో చెందుతున్నారు. -
కొత్తోళ్లకు క ష్టకాలమే..!
సాక్షి, ముంబై: సీట్ల సర్దుబాటుపై అటు అధికార ప్రజాస్వామ్య కూటమిలోనూ, ఇటు ప్రతిపక్ష మహా కూటమిలో స్పష్టత లేకపోవడంతో ఎన్నికల బరిలోదిగే అన్ని పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కొత్తగా బరిలో దిగే అభ్యర్థుల్లో ఈ గుబులు మరింత ఎక్కువైంది. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంత నిర్భయంగా ఉన్నప్పటికీ కొత్తగా పోటీచేసే వివిధ పార్టీ ల వందలాది అభ్యర్థులకు సవాలుగా మారింది. ఇంత తక్కువ సమయంలో ఎన్నికల ప్రచారం ఎలా చేయాలి...? ఎలా గెలవడమని ఆందోళనలో పడిపోయారు. శనివారం నుంచి ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఈ నెల 27తో ముగుస్తుంది. ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణకు రెండు, మూడు రోజు ల గడువు ఉంటుంది. అంటే ఒకటో తేదీ సాయంత్రం వరకు ఎంతమంది అభ్యర్థులు, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాత ప్రచార కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికలకు 48 గంటల ముందే ప్రచా రం నిలిపివేయాలి. అంటే కేవలం 13 రోజులు మాత్రమే ప్రచారాలకు, సభలకు సమయం దొరుకుతుంది. ఇంత తక్కువ సమయంలో నియోజకవర్గంలోని సుమారు రెండున్నర నుంచి మూడు లక్షల జనం మధ్యకు ఎలా వెళ్లాలి.. ఎలా ప్రచారం చేయా లో తెలియక కొత్తగా ఎన్నికల బరిలో దిగుతున్నవారు అయోమయానికి గురవుతున్నారు. ఎంత ప్రచారం చేస్తే విజయానికి అంత దగ్గరవుతార నేది జగమెరిగిన సత్యం. ఇదిలా ఉండగా, కూటముల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై ఏమాత్రం ఆధారపడకుండా కొంద రు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. ఈసారి కూడా తమకు అభ్యర్థిత్వం దొరకడం ఖాయమనే ధీమాతో ఉన్నా రు. కాని కొత్తగా బరిలో దిగే అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ టెకెటు దొరుకుతుందా..? లేదా...? తెలియని పరిస్థితి ఉంది. ఒకవేళ టికెటు ఇవ్వకుంటే ప్రత్యామ్నాయ మార్గం వెతు క్కోవడానికి తగిన సమయం కావాలి. ఇండిపెండెంట్‌గా పోటీచేయాలంటే తగిన మందిమార్బలాన్ని, ప్రచార సామాగ్రిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. లేదా చివరి క్షణంలో అభ్యర్థిగా ప్రకటిస్తే అప్పుడు పరిస్థితి ఏంటని కొత్త అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. -
తేలని ‘మహా’ సర్దుబాట్లు
కాంగ్రెస్-ఎన్సీపీ, శివసేన-బీజేపీ మధ్య కొలిక్కిరాని సీట్ల పంపకాలు ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ (అక్టోబర్ 15న పోలింగ్) అధికార కాంగ్రెస్-ఎన్సీపీ, ప్రతిపక్ష శివసేన-బీజేపీ కూటముల మధ్య సీట్ల సర్దుబాటు అంశం చిచ్చురేపుతోంది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకుగానూ మెజారిటీ స్థానాల కోసం నాలుగు పార్టీలూ ఈసారి పట్టుబడుతుండటంతో అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారం ప్రారంభమైనప్పటికీ సీట్ల సర్దుబాటు చర్చల్లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. ఈ పరిణామం కూటమి పార్టీల ఆశావహ అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది. అయితే ఒకవేళ చర్చలు ఫలించకపోతే ఒంటరి పోటీకి సిద్ధమనే సంకేతాలను నాలుగు పార్టీలూ ఇస్తుండటం గమనార్హం. కాంగ్రెస్‌కు ఎన్సీపీ 24 గంటల గడువు సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కిరాకపోవడంపై అసహనంతో ఉన్న శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ ఈ అంశంపై తేల్చేందుకు కాంగ్రెస్‌కు శనివారం 24 గంటల గడువు ఇచ్చింది. కాంగ్రెస్ ఇస్తామన్న 124 సీట్ల ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించింది. తమకు 144 సీట్లు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. ఎన్సీపీ ఉపాధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ శనివారం ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఈ విషయంలో మరో రోజు గడువు ఇస్తున్నట్లు చెప్పారు. నామినేషన్ల ప్రక్రియ దాఖలైనందున ఇంతకుమించి తాము వేచిచూడలేమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇస్తామంటున్న 124 సీట్లు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కుదరదన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్‌కన్నా తమ పార్టీయే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుందని...అందువల్ల సీట్ల సర్దుబాటుపై పాత లెక్కలు ప్రస్తుతం వర్తించబోవన్నారు. 2004లోనే తమ పార్టీ 124 సీట్లలో పోటీ చేసిందని ఆయన గుర్తుచేశారు. ఆదివారంలోగా కాంగ్రెస్ నేతలు స్పష్టత ఇవ్వకుంటే సోమవారం సీఎం పృథ్వీరాజ్ చవాన్‌ను కలిసి ఏదో విషయం తేల్చుకుంటానన్నారు. ఒకవేళ అవసరమైతే ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా? అని విలేకరులు ప్రశ్నించగా ఆ అవకాశం అన్ని పార్టీలకూ ఉందన్నారు. మరోవైపు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ మాణిక్‌రావు ఠాక్రే ఢిల్లీలో ఈ అంశంపై స్పందిస్తూ ఎన్సీపీ తమ ప్రతిపాదనకు ఒకటి, రెండు రోజుల్లో ఒప్పుకోకుంటే తాము అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధం కావాల్సి ఉంటుందని చెప్పారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 174 స్థానాల్లో పోటీ చేయగా ఎన్సీపీ 114 సీట్లలో పోటీ చేసింది. శివసేన-బీజేపీ పరిస్థితీ ఇంతే... కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి తరహాలోనే శివసేన-బీజేపీ కూటమి కూడా సీట్ల సర్దుబాటుపై శుక్ర, శనివారాల్లో రెండు విడతలుగా చర్చలు జరిపినా ప్రతిష్టంభనకు తెరపడలేదు. చెరో 135 సీట్లలో పోటీ చేసి మిగిలిన 18 సీట్లను కూటమిలోని చిన్న పార్టీలైన ఆర్పీఐ, స్వాభిమాని శేత్కరి సంఘటనలకు ఇద్దామంటూ బీజేపీ చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చిన శివసేన తాము 155 సీట్లలో పోటీ చేస్తామని ప్రతిపాదించింది. అయితే మహారాష్ట్ర శాసన మండలిలో విపక్ష నేత, బీజేపీ నాయకుడు వినోద్ తావ్దే శనివారం మాట్లాడుతూ శివసేన ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. శివసేన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన 59 సీట్లతోపాటు తాము పోటీ చేసి ఓడిన 19 సీట్లను మార్చుకుంటే బాగుంటుందని తావ్దే సూచించారు. ఎన్నికల్లో కూటమి తరఫున 200 సీట్లు గెల్చుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో మరో 24 గంటల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు తావ్దే పేర్కొన్నారు. మరోవైపు ఆదివారం జరిగే తమ పార్టీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో పార్టీ చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రే తుది నిర్ణయం తీసుకుంటారని శివసేన ప్రతినిధి, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. బీజేపీకి 125 సీట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. గత ఎన్నికల్లో శివసేన 169 సీట్లలో, బీజేపీ 119 సీట్లలో పోటీ చేశాయి. హర్యానా ఎన్నికల బరిలో సుష్మా సోదరి: విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చెల్లెలు వందన శర్మ హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. శనివారం 47 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ విడుదల చేసిన తుది జాబితాలో ఆమె పేరూ ఉంది. బీజేపీ చీఫ్ అమిత్‌షా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, సుష్మా తదితరులతో కూడిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశమై జాబితాకు ఆమోదం తెలిపింది. -
నామినేషన్ల ఘట్టం షురూ..
సాక్షి, ముంబై: రాష్ట్రంలో వచ్చే నెలలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు పర్వం శనివారం ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీ వరకు వీరు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అయితే ఎంతో ఆర్భాటంగా కొనసాగాల్సిన నామినేషన్ల పర్వం మొదటిరోజు నిశ్శబ్దంగా ప్రారంభం కావడం గమనార్హం. ముంబై, శివారు ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల పరిసరాలన్నీ శనివారం బోసిగా కనిపించాయి. సాధారణంగా నామినేషన్ వేసే అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు బ్యాండు మేళాలు, బాణసంచా పేలుస్తూ, బలాన్ని నిరూపించేందుకు భారీ జనాన్ని వెంటేసుకుని ఎంతో ఆర్భాటంగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటారు. కాని పితృపక్షాల కారణంగా అభ్యర్థులెవరూ నామినేషన్ వేసేందుకు కలెక్టర్ కార్యాలయం దరిదాపులకు రాలేదు. అలాగే ప్రధాన కూటములైన డీఎఫ్ (కాంగ్రెస్- ఎన్సీపీ), మహాకూటమి (శివసేన-బీజేపీ)లో సీట్ల సర్దుబాటు అంశం ఇంతవరకు కొలిక్కి రాలేదు. దీంతో ఇరు కూటముల మధ్య పొత్తు కుదురుతుందా..? ఊడుతుందా..? తెలియని పరిస్థితి ఉంది. ఒకవేళ ఊడితే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) ఏం పాత్ర పోషిస్తుంది... ఇలా రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఏ పార్టీ అభ్యర్థి, ఏ నియోజక వర్గం పోటీచేస్తారనేది కూడా స్పష్టంగా తెలియడం లేదు. వీరిని పక్కన బెట్టినా కనీసం ఇండిపెండెంట్‌గా పోటీచేసే అభ్యర్థులు కూడా నామినేషన్ వేయడానికి ముందుకు రాలేదు. ఈ నెల 24తో పితృపక్షాలు పూర్తవుతాయి. నామినేషన్లు వేసేందుకు ఈ నెల 27వ తేదీ ఆఖరు కావడంతో వారం రోజుల సమయం ఉంది. 25-27 తేదీల మధ్య నామినేషన్ల పర్వం జోరందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. సమయం చాలా తక్కువగా ఉండడంవల్ల పోటాపోటీగా అభ్యర్థులు కలెక్టర్ కార్యాలయాలకు తరలిరానున్నారు. దరఖాస్తులు స్వీకరించే అధికారులు ఉరుకులు పరుగులు తీయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. ఇక్కడ ఎన్నికల నిర్ణయ అధికారుల కార్యాలయాలను స్థాపించనున్నారు. ఈ పనుల కోసం వివిధ రాష్ట్రాల నుంచి 144 మంది ఐఏఎస్ అధికారులు మహారాష్ట్రకు చేరుకున్నారు. సొంత బ్యాంకు ఖాతాలు... ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు సొంతంగా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. దరఖాస్తు ఫారంలో పొందుపర్చిన అన్ని కాలమ్‌లను పూర్తిచేయాల్సి ఉంటుం ది. ఏ ఒక్క కాలమ్‌నూ వదలకూడదని దరఖాస్తులో పొందుపరిచారు . తమ ఆస్తుల వివరాలు అఫిడెవిట్ (ప్రతిజ్ఞ పత్రం)లో కచ్చితంగా వెల్లడించాలి. దరఖాస్తుతోపాటు తమ సోషల్ అకౌంట్‌కు చెందిన యూఆర్ఎల్ నంబర్ కూడా రాయాలి. డిపాజిట్ రెట్టింపు... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు డిపాజిట్ సొమ్ము రెట్టింపు చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. గతంలో ఈ డిపాజిట్ రూ.ఐదు వేలు ఉండగా ఇప్పుడు రూ.10 వేలు చేశారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.ఐదు వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. మొదటి రోజు మూడు నామినేషన్లు నాందేడ్, న్యూస్‌లైన్: నామినేషన్ల పర్వం ప్రారంభమైన మొదటిరోజు నాందేడ్ జిల్లాలో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఉత్తర నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పఠాణ్ జఫర్ అలీ ఖాన్ అనే వ్యక్తి ఇండిపెండెంట్‌గా రెండు నియోజక వర్గాల్లో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అలాగే దక్షిణ నాగపూర్ నియోజకవర్గానికిగాను ప్రజాస్వామిక లౌకిక పార్టీకి చెందిన అబ్దుల్ కరీమ్ అబ్దుల గఫార్ పాటిల్ నామినేషన్ దాఖలు చేశారు. -
ఎమ్మెల్సీ స్థానాలు 58కి పెంచాలి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు శాసనమండలి సీట్ల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని సవరించడంలో భాగంగా ప్రస్తుతం ఉన్న 50 స్థానాలను 58కి పెంచాలని కోరుతూ సభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. సరైనవిధం గా, సంతృప్తికరంగా సంప్రదింపులు జరపకుం డా, ప్రధానమైన భాగస్వామ్యపక్షాలను పట్టిం చుకోకుండా, భవిష్యత్ దుష్ఫలితాలను ఏమాత్రం పరిగణనలోనికి తీసుకోకుండా, హేతుబద్దత లేకుండా జరిగిన రాష్ట్ర విభజన ప్రక్రియ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. శుక్రవారం మండలి చేసిన మరిన్ని తీర్మానాల వివరాలు.. - రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా, సమతుల అభివృద్ధి లక్ష్య సాధనకు శాసనమండలి కట్టుబడి ఉంది. - ప్రపంచ స్థాయి రాజధాని నగరం ఏర్పాటుకు కావాల్సిన వనరులను కేంద్రం అందించాలి. - ఏపీ పునర్విభజన చట్టం- 2014లో పొందుపరిచిన అన్ని ప్రతిపాదనలు, పార్లమెంటులో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేసి కొత్త రాష్ట్ర నిర్మాణానికి కేంద్రం సహకరించాలి. - విభజన వల్ల ఏపీకి జరిగిన వివక్షను పూరిం చేందుకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పాటుకు కావాల్సిన చర్యలన్నీ కేంద్రం తీసుకోవాలి. - రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఆర్థిక మద్దతు, విధానపర మద్దతును కేంద్రం అందించాలి. - పోలవరం నిర్మాణం నాలుగేళ్ళలో పూర్తయ్యేలా అన్ని చర్యలను కేంద్రం తీసుకోవాలి. - రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. -
26 నుంచి మెడికల్ కౌన్సెలింగ్ ?
నేడు నోటిఫికేషన్ వెలువడే అవకాశం లబ్బీపేట : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మెడికల్ కళాశాలల్లో 2014-15కుగాను ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేసేందుకు ఈనెల 26 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మెడికల్ కౌన్సిలింగ్ విషయమై రెండు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులతో బుధవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఈనెల 26 నుంచి నిర్వహించాలని సూచనప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆ రోజు కాకపోతే ఆగస్టు 31 నాటికి మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి చేయడం కష్టమని వర్సిటీ అధికారులు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు తెలిపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మరిన్ని అంశాలపై చర్చించేందుకు గురువారం కూడా సమావేశం కావాలని వర్సిటీ అధికారులతో పాటు, రెండు ప్రభుత్వాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో గురువారం నిర్ణయం తీసుకుని, నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలోలని ప్రభుత్వ, ప్రవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించి సీట్మ్యాట్రిక్ను వర్సిటీ అధికారులు రూపొందించారు. ఈ ఏడాది కొన్ని కళాశాలలకు పెంచిన సీట్లకు సంబంధించి ఇంకా వర్సిటీకి ఆదేశాలు రాక పోవడంతో వాటిని మినహాయించి ఆరువేలకు పైగా సీట్లు భర్తీకి రంగం సిద్ధం చేశారు. సీట్ మ్యాట్రిక్ విషయంలో పీజీ కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొనడంతో ఈసారి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా అధికారులు ముందుగానే జాగ్రత్త పడినట్లు సమాచారం. -
‘వాణిజ్య’ మనీ ల్యాండరింగ్‌పై సిట్ కన్ను!
న్యూఢిల్లీ: ఎగుమతులు, దిగుమతుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి మనీ ల్యాండరింగ్ (విదేశాలకు అక్రమంగా సొమ్ము తరలించడం, తీసుకురావడం)కు పాల్పడుతున్న ఘటనలపైనా సుప్రీం కోర్టు నల్లధనంపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దృష్టి పెట్టింది. త్వరలో జరిగే సిట్ భేటీలో ఈ అంశంపై చర్చించి, చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. హాంకాంగ్ కేంద్రంగా ఎగుమతులు, దిగుమతుల పేరిట తప్పుడు, నకిలీ పత్రాలను తయారుచేసి భారీగా సొమ్మును విదేశాలకు పంపడం, స్వదేశానికి తీసుకురావడం జరుగుతున్నట్లు డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) గుర్తించింది. -
డిగ్రీ కళాశాలల్లో సీట్ల పెంపు
సాక్షి, ముంబై : ముంబై విశ్వవిద్యాలయం డిగ్రీ కళాశాలల్లో 10 శాతం సీట్లను పెంచడంతో వేల మంది విద్యార్థులు లబ్ధిపొందనున్నారు. ట్రెడిషనల్ డిగ్రీ కోర్సులలో కూడా 10 శాతం సీట్లను పెంచేందుకు అన్ని కాలేజీలకూ అనుమతించింది. అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు 15 శాతం సీట్లు ఈ విద్యా సంవత్సరం నుంచే పెంచామని పేర్కొంది. మెరిట్ సాధించని విద్యార్థులకు ఈ విధానం ఎంతో దోహదకరంగా ఉంటుంది. ఇందుకు ఆన్లైన్ దరఖాస్తు కోసం తుది గడువు జూలై 15వ తేదీ వరకు పొడిగించారు. ఈసారి అధిక శాతం విద్యార్థులు మంచి మార్కులు స్కోర్ చేయడంతో ఈ ఏడాది సీట్లు పెంచాల్సిందిగా నగరంలోని పలు కాలేజీలు డిమాండ్ చేశాయని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం.ఎ.ఖాన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని తీర్మానించింది. యూనివర్సిటీ అనుబంధ కళాశాలల మొత్తం సామర్థ్యం 1.3 లక్షలుగా ఆయన పేర్కొన్నారు. కాలేజీలలో సీట్లు పెంచాలని ఇదివరకే 130 కళాశాలలు దరఖాస్తు చేశాయని ఆయన పేర్కొన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ముఖ్యంగా బీకాం, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కోర్సులకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని తెలిపారు. ఆఫర్ చేసిన సీట్లకంటే మూడింతలుగా విద్యార్థుల నుంచి కళాశాలలు దరఖాస్తులను స్వీకరించారు. చర్చ్‌గేట్‌లోని జైహింద్ కళాశాలలో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కోర్సులైన బీఎంఎం, బీఎంఎస్‌లకు 120 సీట్లు ఉండగా దాదాపు రెండు వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. బీకాం కోర్సు కోసం హెచ్ఆర్ కళాశాల ఇతర కామర్స్ కళాశాల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. గతంలోనే కళాశాలలో 10 సీట్లు పెంచాలని పలు కళాశాలలు డిమాండ్ చేసినా ఇప్పుడు దీనికి మోక్షం లభించింది. కొన్ని కాలేజీల విముఖత ఇదిలా ఉండగా కొన్ని కాలేజీలు మాత్రం 10 శాతం సీట్లను పెంచేందుకు విముఖత చూపిస్తున్నాయి. 10 శాతం సీట్లను పెంచడంతో తరగతి గదుల్లో రద్దీ పెరుగుతోందనీ, అధ్యాపకులపై కూడా అదనపు భారం పడుతోందని సీట్ల పెంపునకు అంగీకరించడం లేదు. నగర వ్యాప్తంగా కాలేజీలలో చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయని విలేపార్లేలోని ఎన్ఎం కళాశాల ప్రిన్సిపల్ సునీల్ మంత్రి అభిప్రాయపడ్డారు. మరిన్ని సీట్లను పెంచడం సరికాదని తెలిపారు. కానీ డివిజన్లను పెంచి, అనుగుణంగా ప్రక్రియ మంజూరు చేస్తే ఉంటే బాగుంటుందనీ అభిప్రాయం వ్యక్తం చేశారు. వృథాగా అన్‌పాపులర్ కోర్సులు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కోర్సులలో 15 శాతం సీట్లను పెంచడంతో ప్రస్తుతం 60 మంది విద్యార్థులకు బదులు ఒకో డివిజన్లో 69 మంది విద్యార్థులు చేరవచ్చు. ట్రెడిషినల్ కోర్సులలో కూడా మామూలుగా కళాశాలల్లో 120 సీట్లు ఉండగా, 10 శాతం సీట్లు పెంచడంతో మరో 12 మంది విద్యార్థులను అదనంగా చేర్పించుకోవచ్చు. ఈ ఏడాది అడ్మిషన్ల కోసం 1.3 లక్షల డిగ్రీ సీట్లు ఉండగా, 60 వేల సీట్లు వృథాగా పడి ఉన్నాయి. అన్ పాపులర్ కోర్సులకు సంబంధించి చాలారోజులుగా నగరంలోని కళాశాలలో సీట్లు వృథాగా పడి ఉన్నాయని ఎం.ఎ.ఖాన్ తెలిపారు. -
కలవని మనసులు
- కూటమిలో పొసగని పొత్తులు ఎవరికి వారుగా - బీజేపీ, టీడీపీ అభ్యర్థులు - నాలుగు చోట్ల కమలానికి సహాయ నిరాకరణ - తెలుగుదేశంతో కలిసి నడవని కమలనాథులు - ఇందూరులో వ్యవహారం బెడిసినట్లే సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బీజేపీ, తెలుగుదేశం పార్టీల పొత్తు జిల్లాలో పొసగలేదు. సీట్ల సర్దుబాటు సందర్భంగా నారాజైన ఇరు పార్టీల నేతల మనసులు కలవలేదు. ఐదు స్థానాలలో టీడీపీ, నాలుగు స్థానాలలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తుండగా, ఆ రెండు పార్టీల సీనియర్ నాయకులు కలిసి పనిచేయడం లేదు. బీజేపీ నాయకులు ఆ పార్టీ అభ్యర్థుల ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. టీడీపీ సీనియర్లు సైతం కమలం అభ్యర్థులతో కలిసి వెళ్లడం లేదు. కొందరు బీజేపీ అభ్యర్థులైతే టీడీపీ కండువాలు సైతం వేసుకోవడానికి విముఖత వ్యక్తం చేస్తుండగా, టీడీపీ అభ్యర్థులు మాత్రం కాషాయం కండువాలను మెడలో వేసుకుంటున్నారు. బీజేపీకున్న ‘తెలంగాణ’ సెంటిమెంట్‌ను సొమ్ము చేసుకుంటున్న టీడీపీ నేతలు కొందరు బీజేపీ అభ్యర్థుల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఈ ప్రభావం ఇరు పార్టీల అభ్యర్థులపై పడనుండటం చర్చనీయాంశం అవుతోంది. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థిగా యెండల లక్ష్మీనారా యణ పోటీ చేస్తున్నారు. దీనిపరిధిలోకి జిల్లాలోని ఐదు సెగ్మెంట్లు వస్తాయి. నిజామాబాద్ రూరల్, అర్బన్ నుంచి బీజేపీ అభ్యర్థులు గడ్డం ఆనందరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్త పోటీలో ఉండగా బోధ న్, ఆర్మూరు, బాల్కొండలో టీడీపీ అభ్యర్థులున్నారు. అయితే, ఇక్కడ సమన్వయం కుదరక కేవలం అసెంబ్లీ వరకే ఎవరికీ ప్రచారం చేసుకోవడం ఇబ్బంది కరంగా ఉంది. నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్త టీడీపీ కండువా వేసుకుని ప్రచారం చేయడం లేదని ఆ పార్టీ నాయకులు రెండు రోజుల క్రితం నిరసన వ్యక్తం చేశారు. పైగా ఆ పార్టీ కండువా వేసుకోవద్దని బీజేపీ హైకమాండ్ నుంచే ఆదేశాలున్నాయనడంతో టీడీపీ నేతలు విస్తుపోతున్నారు. నిజామాబాద్ రూరల్ బీజేపీ అభ్యర్థి గడ్డం ఆనందరెడ్డికి టీడీపీ నుంచి స హాయ నిరాకరణ ఎదురవుతోంది. ఇ క్కడి ఓ సీనియర్ టీడీపీ నేత ఓ బల మైన ప్రత్యర్థికి లోపాయికారిగా ఒ ప్పందం కుదుర్చుకున్నాడన్న ప్రచా రం ఉంది. టీడీపీ సిట్టింగ్ స్థానమైన ఈ నియోజకవర్గం నుంచి కావాలనే ఆ పార్టీ పోటీ నుంచి తప్పుకోగా చి వరి నిముషంలో ఆనందరెడ్డిని బరి లోకి దించారని అంటున్నారు. బాల్కొండ నియోజకవర్గం కూటమి లో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జు న్ రెడ్డి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా రు. బీజేపీకి టికెట్ ఖాయమన్న నమ్మకంతో ఇక్కడ పార్టీ కార్యక్రమాలను విస్తృతపర్చిన ముత్యాల సునీ ల్‌రెడ్డి నిరాశకు గురై నామినేషన్ కూడా వేశారు. అయితే చివరి నిముషంలో పోటీ నుంచి తప్పుకున్నా.. ఆయన, క్యాడర్ దూరంగా అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బానాల లక్ష్మారెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉ న్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉప ఎన్నికలతో కలుపుకుని తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు టీడీపీ, ఒకసారి కాంగ్రెస్, మూడు ప ర్యాయాలు టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. ఇక్కడ కూడ టీడీపీ సహక రించడం లేదు. ఆర్మూరు నియోజకవర్గం నుంచి పో టీ చేసేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, రాష్ట్ర నాయకులు ఆ లూరు గంగారెడ్డి, అల్జాపూర్ శ్రీనివా స్ తదితరులు ఉత్సాహం చూపారు. వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే అన్నపూర్ణ మ్మ తప్పుకోగా, ఓయూ జేఏసీ నేత రాజారాం యాదవ్ టీడీపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఇరుపార్టీ ల మధ్య సమన్వయం లేదని అంటున్నారు. బాన్సువాడ కోసం బీజేపీ గట్టిగా పట్టు పట్టింది. అనూహ్యంగా టీడీపీకి చెందిన బద్యానాయక్‌కు టికెట్ దక్కింది. గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో బద్యానాయక్‌కు బీజేపీ నాయకులు సహకరిం చడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. బోధన్‌లో టీడీపీ ఆవిర్భావం తర్వా త వరుసగా నాలుగుసార్లు విజయం సాధించగా, 1999, 2004, 2009లో వరుసగా కాంగ్రెస్ కైవసం చేసుకుం ది. దీంతో బోధన్ నియోజకవర్గం టీడీపీ చేజారింది. బీజేపీ నుంచి బలమైన అభ్యర్థిగా కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి ఉంటారని భావించారు. చివరి నిముషంలో టీడీపీ అభ్యర్థిగా మేకపాటి ప్రకాశ్‌రెడ్డిని దించడంతో పొసగడం లేదు. జుక్కల్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలలో ఏడుసార్లు పోటీ చేసిన టీడీపీ మూడుసార్లు ఓటమిపాలు కా గా, 2009లో గెలుపొందిన హన్మంత్ సింధే టీఆర్ఎస్లో చేరారు. దీంతో చివరకు మద్దెల నవీన్ అనే వ్యక్తికి టికెట్ కట్టబెట్టారు. ఇక్కడ కలిసిరాని బీజేపీతో టీడీపీ అభ్యర్థి ఒంటరిపోరు చేస్తున్నారు. కామారెడ్డి నుంచి 2009లో టీడీపీ నుంచి షబ్బీర్‌అలీపై గెలుపొందిన గంప గోవర్ధన్ టీఆర్ఎస్లో చేరారు. దీంతో టీడీపీకి అభ్యర్థులు కరువయ్యారు. అయితే బీజేపీ నేతగా సీరి యస్‌గా పనిచేసిన నిట్టూరు వేణుగోపాల్‌రావు ఇక్కడి నుంచి టికె ట్ ఆశించారు. చివరి నిముషంలో సిద్ధిరాములును ఆ పార్టీ బరిలోకి దిం పింది.దీంతో ఇటు బీజేపీలో ఓ వర్గం కలిసిరాక, అటు టీడీపీ సపోర్టు లేక ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. -
సీటు మారినా.. రాత మారేనా!
గతంలో పోటీ చేసిన స్థానాలు వదిలి కొత్త చోట్ల నేతల పోటీ ఓటమి భయంతో కొందరు.. విజయం కోసం మరికొందరు సీటు మారిన వారిలో కేసీఆర్, జైపాల్, జేపీ, మోత్కుపల్లి, విజయశాంతి, నాగం వంటి ప్రముఖులు హైదరాబాద్: సీటు మారితేనైనా రాత మారుతుందేమోనన్న ఆశ... వలస వెళితేనైనా విజయం వరిస్తుందనే నమ్మకం.. ఇప్పటికే ఎన్నికైన చోట పోటీ చేస్తే గెలుస్తామో లేదోనన్న అనుమానం.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదన్న భయం.. వెరసి రాష్ట్రంలో పలువురు రాజకీయ పార్టీల నేతలు వలసల బాట పట్టారు. ఇప్పటిదాకా తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాలను వదిలి, కొత్త స్థానాలకు మారారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు మొదలుకుని రాష్ట్ర, జిల్లా స్థాయిలో హవా నడిపించిన నాయకుల వరకు పలువురు ప్రముఖులు కూడా ఈ వలస జాబితాలో ఉన్నారు. మారిన చోట స్థానిక నాయకులతో పరిచయాలు, వారిని మచ్చిక చేసుకునే యత్నాల్లో కొందరికి పుణ్యకాలం గడిచిపోతోంటే.. మరికొందరు ముందస్తు వ్యూహంగానే సీట్లు మారారు. సీటు మారిన ప్రముఖులు.. ఈ సారి సీట్లు మారిన ముఖ్య నాయకుల్లో కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు, టీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీహరి, మైనంపల్లి హన్మంతరావు, కొండా సురేఖ, జితేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు విజయశాంతి, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ తదితరులు ఉన్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభకు పోటీ చేసిన కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, ఆయనకు ప్రత్యర్థిగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన జితేందర్‌రెడ్డి ఇద్దరూ ఇప్పుడు మహబూబ్‌నగర్ నుంచి బరిలో ఉన్నారు. గతంలో నాగర్‌కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచిన నాగం జనార్దనరెడ్డి కూడా ఈ సారి మహబూబ్‌నగర్ బరిలో ఉన్నారు. ఈ ముగ్గురూ ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నారు. అయితే జైపాల్‌రెడ్డికి ఈసారి ఇంటిపోరుతో అనుకున్న స్థాయిలో దూసుకెళ్ల లేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి జితేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి నాగం జనార్దన్‌రెడ్డి ప్రచారంలో జోరుమీద ఉన్నారు. గతంలో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన అబ్దుల్ రెహ్మన్ కూడా స్థానం మార్చి మహబూబ్‌నగర్ లోక్‌సభ కు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి.శ్రీనివాస్ 2009లోనూ ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానంలో పరాజయం పాలవడంతో... ఈ సారి నిజామాబాద్ రూరల్ స్థానానికి మారారు. ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌తో తలపడుతున్నారు. ఇక కేసీఆర్ తాను పోటీ చేసిన చోట మళ్లీ పోటీ చేయరనే అభిప్రాయం ఇప్పటికే ఉంది. ఆయన సీటు మారిన ప్రతీసారీ గెలుస్తూనే ఉండడం ఆయన బలంగా చెబుతున్నారు. గత సారి మహబూబ్‌నగర్ లోక్‌సభ నుంచి గెలిచిన కేసీఆర్.. ఈసారి మెదక్ లోక్‌సభతో పాటు, గజ్వేల్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగారు. మెదక్ లోక్‌సభ స్థానంలో ఆయనతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి నరేంద్రనాథ్ పోటీలో ఉన్నారు. గతంలో మెదక్ లోక్‌సభకు పోటీ చేసిన విజయశాంతి ఈ సారి మెదక్ అసెంబ్లీ స్థానానికి మారారు. ఇక్కడ మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నాయకుడు శశిధర్‌రెడ్డి మనస్ఫూర్తిగా పని చేయడంపైనే ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంది. దాంతోపాటు టీఆర్ఎస్ నుంచి పద్మా దేవేందర్‌రెడ్డి గట్టిపోటీ ఇస్తున్నారు. నల్లగొండ జిల్లా ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు ఈ సారి ఖమ్మం జిల్లా మధిరకు మారి.. డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్కతో తలపడుతున్నారు. ఇక్కడ వైఎస్సార్సీపీ మద్దతుతో సీపీఎం అభ్యర్థి పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన నోముల నర్సింహయ్య.. ఈ సారి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరఫున పోటీ పడుతున్నారు. ఆలస్యంగా వచ్చినా.. ప్రచారంలో తనదైన శైలితో ముందుకెళుతున్నారు. వరంగల్ జిల్లా పరకాల నుంచి గెలుస్తూ వచ్చిన కొండా సురేఖ ఈ సారి వరంగల్ (తూర్పు) స్థానానికి టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. ఆమె అక్కడ మంత్రి బస్వరాజు సారయ్యతో పోటీ పడుతున్నారు. ఇక్కడ ముస్లింల ఓట్లు కీలకం కావడంతో... ఆ ఓట్ల కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. గతంలో స్టేషన్ ఘన్పూర్ నుంచి పోటీ చేస్తూ వచ్చిన కడియం శ్రీహరి.. ఈసారి వరంగల్ లోక్‌సభకు ప్రస్తుత ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పోటీలో ఉన్నారు. తొలిసారిగా ఎంపీగా గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉండి, ఇటీవల ఎమ్మెల్సీగా నియమితులైన నంది ఎల్లయ్య ఏకంగా నాగర్‌కర్నూల్ లోక్‌సభకు పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన మందా జగన్నాథంతో తలపడుతున్నారు. -
వెలుగు చూస్తున్న ‘వ్యవహారాలు’
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : టీడీపీ-బీజేపీ పొత్తు, సీట్ల పంపకాల్లో తెర వెనుక జరిగిన ‘వ్యవహారాలు’ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. టీడీపీ నేత, ఎంపీ రాథోడ్ రమేష్ వద్ద ముడుపులు తీసుకుని జిల్లాలోని ఎస్టీ ఎమ్మెల్యే స్థానాలను టీడీపీకి అమ్ముకున్నారంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యనగారి భూమయ్యపై ఆ పార్టీ ముఖ్య నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. తూర్పు జిల్లాకు చెందిన గోనె శ్యాంసుందర్‌రావుతో కలిసి భూమయ్య బీజేపీకి ఒక్క ఎస్టీ సీటు దక్కకుండా చేశారంటూ రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రానికి వచ్చిన భూమయ్యను స్థానికంగా ఉన్న ఆ పార్టీ నాయకులు నిలదీశారు. ఈ సందర్భంగా ఏకంగా ఆయనపై దాడికే యత్నించడం.. వెంటనే ఆయన అక్కడి నుంచి చిత్తగించడం ఆలస్యంగా వెలుగుచూసింది. జిల్లాలో ఆదిలాబాద్ ఎంపీ స్థానంతోపాటు, బోథ్, ఆసిఫాబాద్, ఖానాపూర్ స్థానాలు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. రెండు పార్టీల పొత్తుల్లో ఈ నాలుగింటిలో ఒక్క ఎస్టీ సీటు కూడా బీజేపీకి ఇవ్వకపోవడాన్ని ఆ పార్టీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది. గిరిజన స్థానాలు టీడీపీకి కట్టబెట్టిన అయ్యనగారి భూమయ్య ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చే అర్హతే లేదని ఆ పార్టీ ముఖ్య నాయకులు మడావి రాజు పేర్కొంటున్నారు. ఏ ముఖం పెట్టుకుని బీజేపీ గిరిజనులను ఓట్లు అడగాలని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే భూమయ్యపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ దీని ప్రభావం ఆ పార్టీ ఉమ్మడి అభ్యర్థుల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపుతోంది. టీడీపీ పోటీ చేస్తున్న స్థానాల్లో బీజేపీ శ్రేణులు సహకరించకపోగా, బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లో టీడీపీ నాయకులు దూరంగా ఉంటున్నారు. దీని ప్రభా వం ముఖ్యంగా ఎంపీ అభ్యర్థి రాథోడ్ గెలుపు ఓటములపై పడటం ఖా యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఈ విషయమై.. అయ్యనగారి భూమయ్యను అడుగగా.. రాథోడ్ రమేష్‌తో నేను ఎలాం టి కుమ్ముక్కు కాలేదు. అవగాహన లేకపోవడంతోనే కొందరు నాయకులకు డబ్బులు చేతులు మారాయని ఆరోపిస్తున్నారు. ఇది పూర్తి అవాస్తవం. సీట్ల పంపకాల్లో నా ప్రమేయం లేదు అని పేర్కొన్నారు. రాజీనామా యోచనలో పలువురు పొత్తుల్లో బీజేపీకి నాలుగు స్థానాలు కేటాయించారు. ఈ నాలుగింటిలో టీడీపీకి నుంచి వచ్చిన వారికే బీజేపీ అభ్యర్థులుగా ఎంపిక చేయడంపై బీజేపీ నాయకులు అసంతృప్తి తో ఉన్నారు. ఆదిలాబాద్ అభ్యర్థి శంకర్ టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరినవారే. అలాగే ముథోల్ బీజేపీ అభ్యర్థి రమాదేవి కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే. ఇలా టీడీపీ నుంచి వచ్చిన నాయకులకే బీజేపీ టిక్కెట్లు ఇవ్వడంపై ఆ పార్టీలోని సీని యర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన నాయకులు కూడా తమను పట్టించుకోక పోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఈ మేరకు బీజేపీలోని పలువురు జి ల్లా నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తామని బీజేపీ ముఖ్యనాయకులు కొందరు పేర్కొంటున్నారు. -
‘ఐ’ననూ ఎంపిక!
సాక్షి ప్రతినిధి, గుంటూరు :రానున్న ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని అభిప్రాయ సేకరణ చేస్తే, ఈసారి పార్లమెంటు నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని, ఒక ముస్లిం, ఒక బీసీ అభ్యర్థికి సీటు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీని ప్రకారం జిల్లాలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లోని 17 అసెంబ్లీ సెగ్మంట్లలో ముగ్గురు బీసీలు, మరో ముగ్గురు ముస్లింలకు సీట్లు ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం, బీసీల వివరాలు సేకరిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లోనూ పార్టీ నాయకుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పార్టీ పరిస్థితి మూడో స్థానానికి దిగజా రిందని తెలిసినప్పటికీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ (రాగా) సూచనల మేరకు పరిశీలకులు జిల్లాలో అభిప్రాయ సేకరణ చేశారు. సిట్టింగ్‌లు, ఇన్చార్జీల్లో కలవరం ... నరసరావుపేట లోక్‌సభ పరిశీలకునిగా నియమితులైన కర్ణాటక మాజీ మంత్రి శివమూర్తి తొలి విడత అభిప్రాయ సేకరణను పూర్తిచేశారు. ‘రాగా’ సూచన మేరకు లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటే, జిల్లాలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ సెగ్మంట్లలో ముగ్గురు బీసీలు, ముగ్గురు ముస్లింలకు సీట్లు కేటాయించాల్సి వస్తుంది. గత ఎన్నికల్లో ముగ్గురు బీసీలకు, ఇద్దరు మైనార్టీలకు కాంగ్రెస్ సీట్లు కేటాయించింది. రేపల్లె నుంచి మోపిదేవి వెంకట రమణ, మంగళగిరి నుంచి కాండ్రు కమల, గురజాల నుంచి డాక్టర్ వెంకటేశ్వర్లుకు బీసీ వర్గాల నుంచి సీట్లు లభించాయి. మైనార్టీల నుంచి గుంటూరు ఒన్‌లో మస్తాన్ వలీ, పెదకూరపాడులో నూర్జహాన్‌లకు సీట్లు లభించాయి. అభ్యర్థుల ఎంపికలో పరిశీలకులు అనుసరిస్తున్న విధానాలు కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదు. అభిప్రాయ సేకరణను నియోజకవర్గ కేంద్రాలతో సరిపెట్టకుండా మండల కేంద్రాల్లోనూ నిర్వహించనున్నట్టు పార్టీ బాధ్యులు చెబుతున్నారు. నాలుగు అసెంబ్లీ సెగ్మంట్లలో ఒక్కొక్క పేరు ... నియోజకవర్గ కేంద్రాల్లో ముగిసిన అభిప్రాయ సేకరణ ప్రకారం సత్తెనపల్లి, పెదకూరపాడు,నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్క పేరు చెప్పినట్టు తెలిసింది. సత్తెనపల్లి- ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, పెదకూరపాడు- జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పక్కాల సూరిబాబు, నరసరావుపేట- ఎమ్మెల్యే కాసు కృష్ణారెడ్డి, వినుకొండ- జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జునరావులకు వ్యతిరేకంగా మరో పేరును నాయకులు, కార్యకర్తలు ప్రస్తావించలేదని తెలిసింది. అయినప్పటికీ ఈ నియోజకవర్గాల్లో బీసీలు, మైనార్టీల నుంచి అర్హులైన అభ్యర్థుల వివరాలను పరిశీలకులు నమోదు చేసుకున్నట్టు తెలిసింది. ఏఐసీసీ సమావేశాల తరువాతనే మిగిలిన రెండు లోక్‌సభ నియోజకవర్గాలు, నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మంట్లలోని మండల కేం ద్రాల్లో అభిప్రాయ సేకరణను ఏఐసీసీ సమావేశాల తరువాత నిర్వహించనున్నట్టు తెలిసింది. ఆ పర్యటన వివరాలను కూడా గోప్యంగా ఉంచే యత్నంలో జిల్లా నాయకులున్నారు. -
‘గూడెం’ టీడీపీలో కుర్చీలాట
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ సీటు కోసం ఆట మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సీటు ఎవరికి దక్కుతుందనే విషయమై విసృ్తత చర్చ సాగుతోంది. పాత కాపులకే మ్యాండెట్ ఇస్తారా.. లేక కొత్తవారికి, వలస వాదులకు రెడ్ కార్పెట్ పరుస్తారా అనేది తేలకపోవడంతో ఆ పార్టీలో చాపకింద నీరులా సాగుతున్న వర్గ రాజకీయూలు రసకందాయంలో పడ్డాయి. టీడీపీ పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు, మాజీ మంత్రి యర్రా నారాయణ స్వామి తనకు లేదా తన కుమారుడు నవీన్‌కు టికెట్ సాధించుకుంటారా అనే కోణంలో విశ్లేషణ చేస్తున్నారు. యర్రా చాణక్యం తెలిసిన వారు ఇలా జరగడానికి ఆస్కారం లేకపోలేదంటున్నారు. దీనికి ఊతమిచ్చే విధంగా ఆయన కుమారుడు నవీన్ తాడేపల్లిగూడెంలో మకాం పెట్టడం ఈ ఊహాగానాలకు అవకాశం కల్పిస్తోంది. గతంలో యర్రా నారాయణస్వామి టికెట్ పొందిన ప్రతి సందర్భంలోనూ ఎన్నికలకు ముందు ఇక్కడ మకాం పెట్టేవారు. మొదటిసారి టికెట్ దక్కించుకున్న రోజుల్లో కొబ్బరి తోటలో నివాసం ఉన్నారు. రెండోసారి సత్యవతినగర్కు మకాం వచ్చారు. ఈసారి టికెట్ ఆశిస్తున్న నవీన్ తండ్రి బాటలోనే సత్యవతి నగర్ ప్రాంతంలో మకాం వేశారు. నారాయణస్వామి ఇప్పటికే తనను వెన్నంటి ఉన్న పార్టీ శ్రేణులను, తన అనుయాయులను పిలిపించుకుని మంత్రాంగం నడిపారు. ఎన్టీఆర్ హయూంలో ఓ వెలుగు వెలిగిన యర్రా నారాయణస్వామికి చంద్రబాబు హయూంలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. అనంతర పరిణామాల నేపథ్యంలో సామాజిక వర్గాలను దగ్గర చేసుకునే పనిలోపడిన చంద్రబాబు నాయుడు తాజాగా నారాయణస్వామికి పెద్దపీట వేయ డం ప్రారంభించారు. ప్రస్తుతం అధినేతకు దగ్గరగా ఉంటున్న నారాయణస్వామి తాడేపల్లిగూడెం టికెట్ విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, పార్టీలో చేరాలనుకుంటున్నవారి సమాచారాన్ని అధినేతకు సలహాల రూపంలో ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నట్టు సమాచారం. కీలెరిగి వాతపెట్టే నేర్పుగల నేతగా వినుతికెక్కిన నారాయణస్వామి టికెట్ విషయంలో అధినేతకు శిరోభారం తగ్గించే క్రమంలో చివరి అవకాశంగా ఈ సీటును తనకు ఇవ్వాలని కోరే అవకాశం లేకపోలేదు. పార్టీని వీడకుండా సుదీర్ఘకాలంపాటు చేస్తున్న సేవలను పరిగణనలోకి తీసుకుని తన కుమారుడికైనా టికెట్ అడుగుతారని అంటున్నారు. ఇదే జరిగితే కుర్చీలాట రసవత్తరంగా మారడం ఖాయం. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ముళ్లపూడి బాపిరాజు రెండోసారి టికెట్ దక్కించుకునే క్రమంలో ముందుకు సాగుతున్నారు. సామాజిక వర్గాల సర్ధుబాటు కోణంలో బాపిరాజుకు ఈసారి సీటు దక్కకపోవచ్చేనే ప్రచారం కూడా నడుస్తోంది. ఈ కోణంలో బాపిరాజు మాటతీరు మారడం చర్చనీయాంశంగా మారింది. పార్టీకి సేవచేసి గెలవగలిగిన వ్యక్తులను కాదని కొత్త వారికి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే, అధిష్టానంపై పోరు సల్పడానికి సిద్ధమని ఇటీవల గూడెంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ప్రకటించారు. ఇదిలావుండగా, బీసీలకు లేదా పార్టీకి సేవచేసిన పాతకాపులకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను ఈ సమావేశంలో తెరపైకి తెచ్చారు. అలాంటివారిని ఆర్థికపరంగా ఆదకునేందుకు అవసరమైతే ఆస్తులను కుదువపెడతామని, చందాలు వేసుకుని అయినా గెలిపించుకుంటామని చెప్పుకొచ్చారు. ఇదిలావుండగా, వేరే పార్టీల నుంచి వచ్చేవారికి సీటిస్తే సహించేది లేదనే హెచ్చరికలు ఇప్పటికే అధిష్టానానికి వెళ్లారుు. అరుునా, వేరే పార్టీనుంచి టీడీపీలోకి వచ్చే వారిలో ఎవరో ఒకరికి గూడెం సీటును కట్టబెట్టే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడా నడుస్తోంది. ఇదిలావుంటే బీసీలకు జిల్లాలో నాలుగు టీడీపీ సీట్లు కేటాయించాలని డిమాండ్ ఊపందుకుంది. ఆ జాబితాలో తాడేపల్లిగూడెంను కూడా చేర్చారు. ఇటీవల బీసీ నాయకులు చంద్రబాబును కలసి ఈ విషయాన్ని నివేదించారు కూడా. బీసీ కోటాలో కిల్లాడి ప్రసాద్‌కు టికెట్ ఇవ్వాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చంద్రబాబుకు లేఖ సైతం ఇచ్చారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన కిల్లాడికి అధినేతకు దగ్గరగా ఉండే యనమల రామకృష్ణునితో సాన్నిహిత్యం ఉంది. ఆయనకు టీడీపీ బెర్తు దక్కే అవకాశాలను పార్టీ వర్గాలు కొట్టి పారేయడం లేదు. ఏదేమైనా.. సీటు ఎవరికి ఇచ్చినా టీడీపీలో వర్గపోరు తప్పదనే విషయాన్ని విశ్లేషకులు నొక్కిచెబుతున్నారు. -
మేయర్ సీటుకు భారీ డిమాండ్
-
29,820 మందికి డీఎడ్ సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థుల్లో 29,820 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు డైట్‌సెట్ కన్వీనర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. సీట్లు పొందిన వారి జాబితాను బుధవారం ప్రకటించినట్లు పేర్కొన్నారు. 25 ప్రభుత్వ డైట్ కాలేజీల్లో 3,100 సీట్లను, 642 ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో 26,720 సీట్లను విద్యార్థులకు కేటాయించినట్లు వివరించారు. మొత్తంగా 62,457 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 23 నుంచి 26 వరకు కాలేజీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, కాలేజీల్లో చేరిన విద్యార్థులకు 27 నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఇక రెండో కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్లకు డిసెంబర్ 2 నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఫార్మసీ సీట్ల కేటాయింపు, 9,106 సీట్లు భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2013 బైపీసీ విభాగం అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జాబితా సోమవారం రాత్రి విడుదలైంది. సీట్ల వివరాలను అభ్యర్థులకు ఎస్ఎంఎస్ల ద్వారా చేరవేశారు. ఎంసెట్ బైపీసీ విభాగంలో 85,741 మంది అర్హత సాధించగా.. వారిలో ఫార్మసీ కోర్సుల కోసం 14,724 మంది ధ్రువపత్రాల పరిశీలనలో పాల్గొన్నారు. అందులో 13,696 మంది వెబ్ఆప్షన్లు నమోదు చేశారు. రాష్ట్రంలో 9,401 ఫార్మసీ సీట్లు ఉండగా.. 9,106 సీట్లు భర్తీ అయ్యాయి. బీఫార్మసీలో 8,506 సీట్లకుగాను 8,326 సీట్లు.. ఫార్మా-డిలో 741 సీట్లు, బయోటెక్నాలజీలో 154 సీట్లకు గాను 39 నిండాయి. సీటు పొందిన అభ్యర్థులు వెబ్సైట్ నుంచి అలాట్మెంట్ ఆర్డర్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు కట్టాల్సి ఉంటే చలానా ద్వారా బ్యాంకులో చెల్లించాలి. ఆ రశీదులతో 27లోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. 29 నుంచి తుది కౌన్సెలింగ్: ఎంసెట్ బైపీసీ విభాగం అభ్యర్థులు ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 29, 30 తేదీల్లో తుది విడత వెబ్ కౌన్సెలింగ్ ఉంటుందని అడ్మిషన్ల కన్వీనర్ తెలిపారు. వచ్చే నెల ఒకటిన సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రకటనను ఈ నెల 25న వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు. ఎంపీసీ విభాగంలో మిగిలిపోయే సీట్లను తుది విడత బైపీసీ స్ట్రీమ్ అభ్యర్థులకు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. -
'పదవులు పట్టుకొని వేలాడుతున్నసీమాంధ్ర మంత్రులు, ఎంపీలు'
-
రాష్ట్రాలవారీగా సీట్ల సర్దుబాట్లు: సీపీఎం
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికలు, అలాగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో రాష్ట్రాల వారీగా సీట్ల సర్దుబాటు చేసుకోవాలని సీపీఎం ఆదివారం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, ఒడిశాలో బిజూ జనతాదళ్, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీతో చర్చలు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే తమిళనాడులో ఏఐఏడీఎంకే, అస్సాంలో ఏజీపీలతోనూ చర్చలు జరపనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశం రెండు రోజులపాటు జరిగింది. రాబోయే లోక్‌సభ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానంపై ఇందులో ప్రధానంగా చర్చించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో లౌకిక, ప్రజాతంత్ర పార్టీలతో కలిసి కాంగ్రెస్, బీజేపీయేతర వేదిక ఏర్పాటుకు సీపీఎం ఇప్పటికే పిలుపు ఇవ్వడం తెలిసిందే. కాగా సీపీఎం ఇప్పటికే రాజస్థాన్‌లో సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, జేడీ(యూ), జేడీ(ఎస్)లతో కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసింది. చత్తీస్‌గఢ్‌లోనూ ఈ ప్రయత్నాలు తుదిదశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇదే రీతిలో ముందుకుపోవాలని సీపీఎం నిర్ణయించింది. ఇదిలా ఉండగా పశ్చిమబెంగాల్లో ఇటీవలి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఈ సమావేశం చర్చించింది. ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ప్రజలతో తిరిగి మమేకమయ్యేందుకు వీలుగా మరింత చురుగ్గా దూసుకుపోవాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తమ పట్టును పునరుద్ధరించుకునేందుకు కృషిచేయాలని నిశ్చయించింది.