-
విషాద మలుపుల ప్రేమ
కృష్ణరాజపురం: బెంగళూరులో ప్రేమ వ్యవహారాలు ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల పెళ్లయిన యువతి, అవివాహిత యువకుడు ప్రేమ ఫలించలేదని ఆత్మహత్యలు చేసుకోవడం తెలిసిందే. ప్రేయసిని ఓ ప్రియుడు చంపిన ఘటన కుందలహళ్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటన పూర్వాపరాలు.. ఉజ్మాఖాన్, ఇమ్దాద్ బాషా, ఇద్దరూ టెక్కీలుగా పనిచేసేవారు. పరస్పరం ప్రేమలో ఉన్నారు. అయితే వారి ప్రేమను వారి కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో ఇద్దరూ వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ ఇటీవల ఇద్దరూ విడాకులు తీసుకుని మళ్లీ తమ పాత ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించారు. గత నెల 30న కుందలహళ్లిలో కలుసుకున్నారు. ఆ సమయంలో ఏదో విషయానికి వాగ్వాదం జరగడంతో ప్రియుడు ఇమ్దాద్ బాషా ఆమెను గొంతు పిసికి చంపేశాడు. చాలా గంటలపాటు అక్కడే ఒంటరిగా గడిపాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు తామిద్దరం విషం తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాట్సాప్ మెసేజ్ చేశాడు.పోస్టుమార్టంలో ఇలాబంధువులు చేరుకుని చూడగా ఉజ్మాఖాన్ మరణించి ఉంది, అతడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. మృతదేహానికి జరిపిన పోస్టుమార్టం నివేదికలో ఇమ్దాద్ బాషా మెసేజ్ చేయడానికి 10 గంటల ముందే ఆమె మరణించినట్లు వెలుగులోకి వచ్చింది. ఇమ్దాద్ బాషాను అదుపులోకి తీసుకున్న హెచ్ఏఎల్ పోలీసుల విచారణలో మరొక టెక్కీ యువకునితో ఉజ్మాఖాన్ చనువుగా ఉంటోందని, అతనిని పెళ్లి చేసు కుంటానని చెప్పడం వల్లనే తాను ఆమెను చంపేసినట్లు ఒప్పకున్నాడు. అరెస్టు చేసి విచారణ చేపట్టారు. -
జయం రవి, ఆర్తీ విడాకుల కేసులో మధ్యవర్తులతో చర్చలు
కోలీవుడ్ ప్రముఖ నటుడు జయం రవి (రవి మోహన్) భార్య ఆర్తీతో విడిపోతున్నట్లు కొద్దిరోజుల క్రితం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వీరి 14 ఏళ్ల వివాహ బంధానికి తెర పడినట్లయ్యింది. ఈ వ్యవహారంలో జయం రవి భార్య ఆర్తీ (Aarthi) నుంచి విడాకులు కోరుతూ చైన్నె కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఆయన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇందరు మళ్లీ కలిసి జీవించడానికి సామరస్య చర్చలకు అవకాశం ఇచ్చింది. (ఇదీ చదవండి: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. అసలైన నిందితుడి అరెస్టు)ఇప్పటికే జయం రవి (Jayam Ravi), ఆర్తీల మధ్య మూడు సార్లు సామరస్య చర్చలు జరిగాయి. కాగా శనివారం ఈ కేసు మరోసారి న్యాయమూర్తి తేనెతోమొళి సమక్షంలో విచారణకు వచ్చింది. దీంతో జయం రవి,ఆర్తల తరపు న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు. నటుడు జయం రవి, ఆర్తీ కూడా ఆన్లైన్ ద్వారా విచారణలో పాల్గొన్నారు. కాగా వారి న్యాయవాదులు తమ క్లైంట్ల మధ్య శనివారం సామరస్య చర్చల కోసం మధ్యవర్తులు ఆహ్వానించినట్లు కోర్టుకు విన్నవించారు. దీంతో సామరస్య చర్చలు పూర్తి అయిన తరువాత తీర్పును ప్రకటిస్తామంటూ న్యాయమూర్తి ఈ కేసు విచారణను ఫిబ్రవరి 15వ తేదీకి వాయిదా వేశారు.పేరు మార్చుకున్న జయం రవి.. కారణం ఇదేజయం రవి (Jayam Ravi) పేరు మార్చుకున్నాడు. తనను ఇకపై రవి మోహన్(Ravi Mohan) అని పిలవాలని కొద్దిరోజుల క్రితమే తెలిపాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన కాదలిక్క నెరమలై సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అందుకు కారణం ఎంటో ఇలా చెప్పాడు. 'ఈ రోజు నుంచి నా పేరు రవి లేదా రవి మోహన్. వ్యక్తిగతంగా కానీ, వృత్తిగతంగా కానీ ఇలాగే పిలవండి. దయచేసి ఇకపై ప్రతి ఒక్కరూ నన్ను జయం రవి అని సంభోదించకుండా రవి/ రవి మోహన్ అని మాత్రమే పిలవాలని కోరుతున్నాను' అని అన్నాడు. జయం రవి అసలు పేరు రవి. ఆయన తండ్రి మోహన్ డైరెక్ట్ చేసిన జయం (తెలుగు జయం మూవీ రీమేక్) మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో తన పేరు జయం రవిగా మారింది. రెండు దశాబ్దాలుగా జయం రవిగానే కొనసాగిన ఆయన ఇప్పుడు తనను పాత పేరుతోనే పిలవాలని చెప్తున్నాడు. అలాగే ఈ హీరో తన పేరు మీద రవి మోహన్ స్టూడియోస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. తన బ్యానర్ ద్వారా మంచి కథలను అందించడంతో పాటు ప్రతిభావంతులైన కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని చెప్పుకొచ్చాడు. -
పేలిన పెట్రోల్ ట్యాంకర్.. 70 మంది మృతి
అబుజా : నైజీరియా ( Nigeria)లో ఘోర ప్రమాదం సంభవించింది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడి అధికారులు ప్రకటించారు.నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఎన్ఈఎంఏ) అధికారిక ప్రకటన మేరకు.. శనివారం నార్త్ సెంట్రల్ నైజీరియా నైజర్ రాష్ట్రం (Niger state)లో అక్రమంగా ఇంధనాన్ని తరలించే సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు ఎన్ఈఎంఏ అధికారులు నిర్ధారించారు.అగంతకులు జనరేటర్ సాయంతో ఒక పెట్రోల్ ట్యాంకర్ (petrol tanker explosion) నుంచి మరో పెట్రల్ ట్యాంకర్‌లోకి పెట్రోల్‌ను నింపి ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమయంలో ఒక్కసారి జనరేటర్ పేలడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. పేలుడు ధాటికి మంటలు చెలరేగి భారీ శబ్దాలు రావడం.. స్థానికుల ఆర్తనాదాలతో భయంకరంగా పరిస్థితి మారిపోయింది. అక్కడికక్కడే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా కాలిన గాయాలతో మరికొందరు విలవిల్లాడారు.పేలుడు ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ సహాయ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాద బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. అయితే, భారీ స్థాయిలో ఎగిసి పడిన మంటల కారణంగా బాధితుల్ని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న పలువురు రెస్క్యూ సిబ్బంది సైతం అగ్నికి ఆహుతైనట్లు ఎన్ఈఎంఏ అధికార ప్రతినిధి హుస్సేన్ ఇసా తెలిపారు. ప్రమాదాలు సర్వసాధారణంనైజీరియాలో ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. నైజీరియాలో అస్థవ్యస్థంగా ఉన్న రైల్వే వ్యవస్థ కారణంగా ఎక్కువ శాతం మంది ప్రజలు రోడ్డు రవాణాను వినియోగించుకుంటున్నారు. పలుమార్లు అక్రమ ఇంధన రవాణా కారణంగా తరుచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. గతేడాది ఇదే రాష్ట్రంలో గతేడాది సెప్టెంబరులో ఇదే తరహా దుర్ఘటన జరిగింది. నైజర్ రాష్ట్రంలో పశువులను తరలిస్తున్న ట్రక్కును పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 48 మందికి పైగా మరణించారు.నైజీరియా ఫెడరల్ రోడ్ సేఫ్టీ గణాంకాల ప్రకారం.. 2020లోనే 1,531 పెట్రోల్ ట్యాంకర్లు పేలాయి. ఫలితంగా 535 మరణించగా, 1,100 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఇలాంటి ఘటనల వల్ల ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతా నిబంధనలను పాటించాలని అధికారులు కోరుతున్నారు. అయినప్పటికీ పలువురు అక్రమంగా ఇంధనాన్ని తరలిస్తూ ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు. -
సంధ్యావేళ.. మహా కుంభమేళా
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. శనివారం మహాకుంభ్‌లో 42 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు. ఇప్పటివరకు 7 కోట్ల 72 లక్షల మంది మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు.ఈ నేపధ్యంలో మహాకుంభ్ నగరానికి చెందిన దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. ఈ చిత్రాలలో వేదికలు, టెంట్లు, అద్భుతమైన లైట్లు కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు చూపుతిప్పుకోలేనివిగా ఉన్నాయి.ఈ మహాకుంభ్ నగర దృశ్యాలు డ్రోన్ సాయంతో తీసినవి. కుంభ్ ప్రాంతంలో మిరిమిట్లుగొలిపే రంగురంగుల లైట్లు కూడా కనిపిస్తున్నాయి. దీనిలో సంగమం దగ్గరున్న అందమైన చెట్లు కూడా కనిపిస్తున్నాయి.మహా కుంభమేళా సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ఏర్పాట్లను ఈ చిత్రాలలో వీక్షించవచ్చు. మహాకుంభ నగరం వెలుగుజిలుగుల మధ్య ఎంతో అందంగా కనిపిస్తోంది.ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఎక్స్ హ్యాండిల్లో మహాకుంభ్ నగరపు అందమైన చిత్రాలను షేర్ చేశారు. ఈ దృశ్యాలను చూడటం ఆనందంగా ఉన్నదన్నారు.మహా కుంభమేళా సందర్భంగా శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివేణీ సంగమంలో స్నానం చేశారు. ఎంపీ సుధాంశు త్రివేది కూడా పుణ్యస్నానం ఆచరించారు. సంగమంలో స్నానం చేసిన రక్షణ మంత్రి అనంతరం అక్షయవత్, పాతాళపురి, బడే హనుమాన్ ఆలయాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు.జనవరి 22న మహా కుంభమేళాపై సమీక్షించేందుకు యూపీ మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు త్రివేణి సంగమంలో స్నానం చేయనున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: కుటుంబ సభ్యులు తప్పిపోతారనే భయంతో.. -
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. అసలైన నిందితుడి అరెస్టు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడికి పాల్పడిన అసలైన నిందితుడిని ముంబై పోలీసులు(Mumbai Police) అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి మహారాష్ట్రలోని థానే జిల్లాలో అతన్ని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. సైఫ్‌పై దాడికి పాల్పడిన వ్యక్తి విజయ్ దాస్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కేసు ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు పలు బృందాలుగా విడిపోయి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో థానే జిల్లాలోని హీరానందని వద్ద జరుగుతున్న మెట్రో నిర్మాణ సమీపంలో ఉన్న ఒక లేబర్ క్యాంప్‌లో దాస్ ఆశ్రయం పొందాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ నివాసి అయిన విజయ్ దాస్ గతంలో సైఫ్-కరీనా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పబ్‌లో హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేశాడని వారు తెలిపారు. నిందితుడు మొదట అక్కడి పరిసర ప్రాంతాల్లో పని చేయడం వల్ల సులువుగా ఇంట్లోకి వెళ్లే మార్గాలను తెలుకున్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. అతని అరెస్టు తరువాత, తదుపరి విచారణ కోసం దాస్‌ను ముంబైకి తరలించారు.అంధేరీ వెస్ట్ స్టేషన్ వెలుపల దొరికిన అతని సీసీటీవీ ఫుటేజీ సహాయంతో నిందితుడిని చేరుకోగలిగామని క్రైమ్ బ్రాంచ్ వర్గాలు వెల్లడించాయి. అక్కడ అతని స్నేహితుడు తీసుకెళ్లారు. ఆ ఫుటేజీ సహాయంతో, పోలీసులకు మొదటి క్లూ లభించింది. అంటే దాస్ స్నేహితుడిని తీసుకెళ్లడానికి స్టేషన్ వెలుపలికి వచ్చిన అతని మోటారుసైకిల్ నంబర్ సాయంతో అతని వాహనాన్ని కనిపెట్టారు. అతన్ని విచారించిన తర్వాత దాస్‌ను పోలీసులు చేరుకోగలిగారు. దాస్‌ను పట్టుకునేందుకు కాసర్వదలి పోలీసులు ముంబై టీమ్‌కు సహకరించారు.ప్రాథమిక విచారణలో నిందితుడు తక్కువ వ్యవధిలో త్వరగా డబ్బు సంపాదించాలనుకుంటున్నట్లు పోలీసులకు వెల్లడించాడు. నిందితుడు పశ్చిమ బెంగాల్‌కు చెందినవాడు. అయితే, ముంబైలో వర్లీ కోలివాడ సమీపంలో ఉండేవాడు. సైఫ్‌పై దాడి వల్ల అరెస్టు భయంతో ఇటీవలే థానే హీరానందానీకి అతను మకాం మార్చాడు. వెస్ట్ రీజియన్ అదనపు పోలీసు కమిషనర్ పరంజిత్ దహియా, డీసీపీ జోన్ 09 దీక్షిత్ గెడం ఆధ్వర్యంలో దయా నాయక్ నేతృత్వంలోని క్రైమ్ బ్రాంచ్ టీమ్ యూనిట్ -9 నిందితుడిని కనిపెట్టింది. ఆదివారం ఉదయం 9 గంటలకు ముంబయి డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆపై ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. -
గాజా ఒప్పందం వేళ ట్విస్ట్!.. నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు
గాజా శాంతి ఒప్పందం వేళ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన ఫ్రేమ్‌వర్క్ లేకుండా ఒప్పందం ముందుకు సాగదని.. అవసరమైతే మళ్లీ యుద్ధానికి దిగుతామని సంచలన వ్యాఖ్యలు అన్నారాయన. కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశ ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అంతకంటే కొన్ని గంటల ముందు.. నెతన్యాహూ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.‘‘సరైన ఫ్రేమ్ వర్క్ లేకుండా ఒప్పందంలో ముందుకు వెళ్లలేం. తమ దగ్గర ఉన్న బంధీల జాబితాను హమాస్ విడుదల చేయాలి. వాళ్లలో ఎవరెవరిని ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారో స్పష్టత ఇవ్వాలి. అప్పుడే మేం ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్తాం. ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా.. మేం సహించబోం. తదుపరి పరిణామాలకు హమాసే బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Benjamin Netanyahu) తెలియజేశారు. హమాస్‌పై పూర్తిస్థాయి విజయం సాధిస్తేనే గాజా యుద్ధాన్ని(Gaza War) విరమిస్తామని.. అప్పటి వరకు పోరు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గతంలో అనేక సందర్భాల్లో బహిరంగంగా ప్రకటిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు.. తాజాగా బంధీల జాబితా ఇవ్వాలంటూ ఆయన మెలిక పెట్టారు. దీంతో ఇవాళ్టి నుంచి ఒప్పందం అమలు అవుతుందా? అనే అనుమానాలు నెలకొంటున్నాయి.స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఆరు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావాల్సి ఉంది. ఇజ్రాయెల్ కారాగారాల్లో మగ్గిపోతున్న పాలస్తీనియన్లు, పాలస్తీనా రాజకీయ పార్టీల నేతలను ఈ 42 రోజుల్లోపు ఇజ్రాయెల్ అధికారులు విడిచిపెట్టనున్నారు. మరోవైపు 2023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై దాడిచేసి కిడ్నాప్ చేసి బందీలుగా ఎత్తుకెళ్లిన వారిలో కొందరిని హమాస్ విడిచి పెట్టాల్సి ఉంది. హమాస్ చెరలోని 460 రోజులకు పైగా బందీలుగా ఉన్నారన్నమాట!.హమాస్ చెరలో ఉన్న 98 బంధీల్లో.. 33 మందిని విడిచి పెట్టడంప్రతిగా.. తమ జైళ్లలో మగ్గుతున్న 2000 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడిచిపెట్టడంపదిహేను నెలలుగా రక్తమోడుతున్న గాజాలో బాంబుల మోత.. క్షిపణుల విధ్వంసం.. తుపాకుల అలజడి ఈ శాంతి ఒప్పందంతో ఆగనుంది. దోహా వేదికగా.. అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్హమాస్ మధ్య గత బుధవారం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో గాజా ఊపిరి పీల్చుకుంది. వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రధాని ఎన్నడూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంతగా ఆసక్తి చూపలేదు. యుద్ధం కొనసాగించడానికి మొగ్గు చూపుతూ.. ఏదో కారణంతో చర్చల ప్రక్రియను పక్కదోవ పట్టించే ప్రయత్నాలే చేస్తూ వచ్చారు. అయితే.. గతేడాది మే నెలలో బైడెన్ ప్రభుత్వం కాల్పుల విరమణకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేసింది. వాటికి హమాస్ సానుకూలంగా స్పందించింది. దీంతో అప్పుడే గాజాలో శాంతి నెలకొంటుందని అంతా భావించారు. కానీ, నెతన్యాహు మాత్రం ఆ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలను పూర్తిగా ఉపసంహరించడానికి అంగీకరించలేదు. కానీ, ఇప్పుడు కుదిరిన ఒప్పందంలోనూ రెండో దశలో గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ నిబంధన ఉంది. అందుకే ఒప్పందంలో తొలి దశ అమలైనా, రెండో దశకు ఇజ్రాయెల్ అంగీకారం తెలుపుతుందా? లేదా? అన్నది కీలకం కానుంది.ఇదీ చదవండి: కెనడా ప్రధాని రేసులో చంద్ర ఆర్య -
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు అందరిచేత ప్రశంసలు అందుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామిక వేత్తలకు చిక్కులు తొలగుతాయి. వారం చివరిలో ధనవ్యయం. నేరేడు, నీలం రంగులు. గణేశాష్టకం పఠించండి.వృషభంకొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు రాగలవు. కళారంగం వారిని విజయాలు వరిస్తాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. గులాబీ, పసుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.మిథునంఆర్థిక విషయాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. మిత్రులతో వివాదాలు ఏర్పడవచ్చు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. కష్టమే తప్ప ఫలితం అంతగా కనిపించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు కాస్త గందరగోళం కలిగించవచ్చు. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, నేరేడు రంగులు. శివస్తోత్రాలు పఠించండి.కర్కాటకంఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాలలో గందరగోళం. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము సకాలంలో అందదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో మార్పులు. కళారంగం వారికి పర్యటనలు వాయిదా. వారం ప్రార ంభంలో ఉద్యోగలాభం. ఎరుపు, నేరేడు రంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.సింహంమిత్రులే శత్రువులుగా మారతారు. మీ సహాయం పొందినవారే సమస్యలు సృష్టించవచ్చు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. తీర్థయాత్రలు చేస్తారు. ఒక వివాద పరిష్కారంపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాల వ్యవహారాలలో అవరోధాలు. ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. ఉద్యోగయోగం. పసుపు, లేత ఎరుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.కన్యసరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరుల ద్వారా ధనలబ్ధి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం మధ్యలో వ్యయప్రయాసలు. గులాబీ, లేత పసుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.తులచేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. రుణయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు. ఆరోగ్యసమస్యలు. శ్రమకు ఫలితం కనిపించదు. విద్యార్థులు, నిరుద్యోగులకు కాస్త నిరాశ తప్పదు. ఒక సమాచారం కొంత ఊరటనిస్తుంది. వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో ఒత్తిళ్ళు. పారిశ్రామిక వర్గాలకు సామాన్యంగా ఉంటుంది. వారం మధ్యలో వాహనయోగం. ఆకుపచ్చ, పసుపు రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.వృశ్చికంకొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. భూములు, ఆభరణాలు కొంటారు. ముఖ్య వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు. కళారంగం వారికి మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో ధనవ్యయం. బంధువిరోధాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. కనకధారా స్తోత్రాలు పఠించండి.ధనుస్సురుణబాధలు తొలగుతాయి. ఆప్తులు, బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. స్థిరాస్థి వృద్ధి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ఒత్తిడులు. నేరేడు,తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి.మకరంఅనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంక్రిమెంట్లు రాగలవు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కుంభంఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆస్తుల విషయంలో సోదరులతో మనస్పర్థలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం చివరిలో ఆకస్మిక ధనలాభం. నేరేడు, గులాబీ రంగులు. శివాష్టకం పఠించండి.మీనంఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. శ్రమ పెరుగుతుంది. విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగానే లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం ప్రారంభంలో విందువినోదాలు. గులాబీ, ఎరుపు రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. -
బ్యాంకింగ్ కాల్స్‌కు ప్రత్యేక నంబర్ల సిరీస్: ఆర్బీఐ సూచన
ముంబై: ఆర్థిక మోసాలను నివారించే దిశగా బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో కస్టమర్లకు చేసే కాల్స్‌కి సంబంధించి ’1600’ ఫోన్ నంబరింగ్ సిరీస్‌ను మాత్రమే ఉపయోగించాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ సూచించింది. అలాగే, ప్రమోషనల్ అవసరాల కోసం బ్యాంకులు, ఇతరత్రా నియంత్రిత సంస్థలు (ఆర్ఈ) ’140’ నంబర్ల సిరీస్‌నే ఉపయోగించాలని పే ర్కొంది. బ్యాంకులు, ఆర్ఈలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల డేటాబేస్‌ను అప్డేట్ చేసుకుంటూ ఉండాలని ఆర్బీఐ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. డిజిటల్ రూపంలో ఆర్థిక లావాదేవీల నిర్వహణ సులభతరంగా మారినప్పటికీ, దీనితో మోసాల ఉదంతాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. నిర్దేశిత ఆదేశాలను మార్చి 31 కల్లా అమలు చేయాలని సూచించింది. -
చాంపియన్ కర్ణాటక
వడోదర: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు విజేతగా నిలిచింది. సీజన్ ఆసాంతం నిలకడగా రాణించిన కర్ణాటక... తుది పోరులోనూ భారీ స్కోరు చేసి టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఐదోసారి ఫైనల్‌కు చేరిన కర్ణాటక ఐదు సార్లూ టైటిల్ సొంతం చేసుకోవడం మరో విశేషం. శనివారం జరిగిన ఫైనల్లో కర్ణాటక 36 పరుగుల తేడాతో విదర్భను చిత్తుచేసింది. ఈ సీజన్లో పరుగుల వరద పారించిన విదర్భ సారథి కరుణ్ నాయర్ (31 బంతుల్లో 27; 4 ఫోర్లు) ఆఖరి పోరులో ఎక్కువసేపు నిలవకపోవడంతో ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. రవిచంద్రన్ స్మరణ్ (92 బంతుల్లో 101; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కగా... క్రిష్ణన్ శ్రీజిత్ (74 బంతుల్లో 78; 9 ఫోర్లు, ఒక సిక్స్), అభినవ్ మనోహర్ (42 బంతుల్లో 79; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలతో విజృంభించారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (32; 5 ఫోర్లు), టీమిండియా ఆటగాడు దేవదత్ పడిక్కల్ (8), అనీశ్ (21) విఫలమయ్యారు. 67 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో శ్రీజిత్‌తో కలిసి స్మరణ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ జంట నాలుగో వికెట్‌కు 160 పరుగులు జోడించారు. ఇక చివర్లో అభినవ్ మనోహర్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కర్ణాటక భారీ స్కోరు చేయగలిగింది. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే, నచికేత్ భూటె చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో విదర్భ జట్టు 48.2 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ధ్రువ్ షోరే (111 బంతుల్లో 110; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో పోరాడగా... హర్ష్ దూబే (30 బంతుల్లో 63; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) వీరవిహారం చేశాడు. క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్లోనూ సెంచరీలు చేసిన ధ్రువ్ షోరే తుది పోరులోనూ అదే జోరు కొనసాగించగా... అతడికి సహచరుల నుంచి సరైన సహకారం లభించలేదు. కెపె్టన్ కరుణ్ నాయర్, యశ్ రాథోడ్ (22), యష్ కదమ్ (15); జితేశ్ శర్మ (34), శుభమ్ దూబే (8), అపూర్వ వాంఖడే (12) విఫలమయ్యారు. కర్ణాటక బౌలర్లలో వాసుకి కౌషీక్, ప్రసిద్ధ్ కృష్ణ, అభిలాశ్ శెట్టి తలా 3 వికెట్లు పడగొట్టారు. సెంచరీతో చెలరేగిన కర్ణాటక బ్యాటర్ స్మరణ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తాజా టోర్నిలో 389.5 సగటుతో 779 పరుగులు చేసి ‘టాప్ స్కోరర్’గా నిలిచిన కరుణ్ నాయర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు లభించింది. -
కోతలపైనే సర్కారు దృష్టి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకుండా, కోతలు విధించడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆరు గ్యారంటీల హామీ తో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం వాటిని నిజాయితీగా అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. రేషన్ కార్డులు, వ్యవసాయ కూలీలకు భరోసా, రైతుబంధు, పేదల గృహ నిర్మాణ పథకాల్లో లబ్ధిదారుల సంఖ్యను భా రీగా కుదిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివా రం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, చింత ప్రభాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్టీ నాయకుడు దేవీప్రసాద్‌తో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ ఈ సందర్భంగా హరీశ్‌రావు బహిరంగ లేఖను విడుదల చేశారు. ‘రేషన్‌కార్డు లబ్ధిదారుల ఎంపికను గ్రామాల్లో చేయకుండా, కులగణన సర్వే ఆధారంగా జాబితా తయారు చేశారు. గతంలో ప్రజాపాలనలో వచ్చిన 11 లక్షల దరఖాస్తులతో పాటు రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను చెత్తబుట్టలో వేశారు’అని ఆయన ధ్వజమెత్తారు. ఆదాయ పరిమితి పెంచాలి.. ‘పదేళ్ల క్రితం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదల ఆదాయ పరిమితిని పెంచి కొత్తగా 6.47 లక్షల రేషన్‌కార్డులు ఇచ్చాం. ఇప్పుడు కూడా పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ, ఆశ వర్కర్లు, ప్రైవేటు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, పేద వర్గాలకు లాభం జరిగేలా ఆదాయ పరిమితిని పెంచాలి. లేకుంటే అనేక కుటుంబాలు కొత్త రేషన్‌కార్డులకు అర్హత కోల్పోతాయి. అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వకుంటే బీఆర్ఎస్ తరఫున నిలదీస్తాం. వ్యవసాయ కూలీలకు ఇచ్చే భరోసా విషయంలోనూ క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులను గుర్తించడం లేదు. 20 రోజుల పనిదినాలు అనే నిబంధనతో అర్హుల సంఖ్యను ఆరు లక్షలకు కుదించారు. రైతు రుణమాఫీలో రేవంత్ చేసిన మోసంతో ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారాన్ని ఆ రైతు కుటుంబానికి చెల్లించాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. నెలలు గడిచినా వేతనాలేవీ.. ముఖ్యమంత్రి పాలనలో చిరుద్యోగులకు నెలల తరబడి వేతనాలు అందడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. చిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే మంత్రి సీతక్క రాజకీయం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు.