-
టీడీపీ నేత కారు బీభత్సం
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు.. మైలవరం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కొడుకు.. టీడీపీ నేత ఉయ్యూరు వెంకటరమణ శనివారం బెజవాడలో బీభత్సం సృష్టించాడు. అతివేగంతో కారును నడిపి రోడ్డు వెంబడి ఉన్న దుకాణాలు.. తోపుడు బండ్లపైకి దూసుకెళ్లి ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ నందమూరినగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. వివరాలివీ..మద్యం మత్తులో.. మహిళతో కారు నడిపిస్తూ?మైలవరం నియోజకవర్గం జి.కొండూరు ప్రాంతానికి చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్ ఉయ్యూరు నరసింహారావు కొడుకు వెంకటరమణ తన ఏపీ 16 ఈఎఫ్ 4979 కారులో విజయవాడ నుంచి తన ఇంటికి శనివారం మధ్యాహ్నం బయల్దేరాడు. సింగ్‌నగర్ ఫ్లైఓవర్ దిగి నందమూరినగర్ సాయిబాబా గుడి దాటిన తరువాత కారు వేగాన్ని పెంచి వెళ్తుండగా ఒక్కసారిగా కారు అదుపుతప్పి రోడ్డు వెంబడి ఉన్న బడ్డీకొట్టును ఢీకొని ఆ పక్కనే ఉన్న తోపుడు బండ్ల వైపు దూసుకువెళ్లి 20 అడుగుల ఎత్తుకు ఎగిరి చివరకు స్తంభాన్ని ఢీకొని ఆగింది. ఈ ఘటనలో అక్కడే తోపుడు బండిపై శనక్కాయలు అమ్ముకుంటున్న నందమూరినగర్ తోటవారి వీధికి చెందిన పీకా కోటేశ్వరరావు (49) అనే చిరువ్యాపారి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కారును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు నడిపింది ఓ మహిళ అని, పోలీసులు వచ్చేసరికి ఆమెను తప్పించి వెంకటరమణను చూపుతున్నారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.నిందితులను చూస్తుంటే వారు మద్యం సేవించినట్లుగా ఉన్నారని.. అతివేగంతో ఆ మహిళ కారును నడపడంవల్లే ఈ ఘటన జరిగిందని వారు చెబుతున్నారు. ఇక నిందితులకు కూడా స్వల్ప గాయాలయ్యాయని.. చికిత్స నిమిత్తం వారినీ ప్రభుత్వాస్పత్రికి పంపామని సింగ్‌నగర్ సీఐ బీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. బాధితులు ఇంకా ఫిర్యాదు ఇవ్వలేదని, కారు నడిపింది మహిళ కాదు తానే అని నిందితుడు వెంకటరమణ చెబుతున్నాడని ఆయన చెప్పారు. అయితే కారు ఎవరు నడిపారు.. ప్రమాదం ఎలా జరిగిందనే అంశాలకు సంబంధించి సంఘటనా స్థలంలో సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని.. అవి వచ్చాక పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. నిందితుడిపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. మరోవైపు.. నిందితుడు వెంకటరమణను తప్పించేందుకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. -
బాలికలపై ఆగని అత్యాచారాలు
చాగలమర్రి/నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వ పాలనలో.. రాష్ట్రంలో అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి అత్యాచారం వార్త వినాల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లాలో ఒక పాఠశాలలో ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు అత్యాచార యత్నం చేయగా, నెల్లూరులో పదేళ్ల బాలికపై యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. నిందితులపై పోక్సో కేసులు నమోదు చేశారు. ఈ దారుణం గురించి తెలిసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల కరస్పాండెంట్‌పైనా కేసు నమోదైంది.నంద్యాల జిల్లాలో మండల కేంద్రం చాగలమర్రిలోని శ్రీరాఘవేంద్ర ఉన్నత పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఐదేళ్ల బాలికపై అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు లైంగికదాడికి యత్నించారు. మూత్ర విసర్జనకు టాయిలెట్‌కు వెళ్లిన చిన్నారిపై వారు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన బయటకు పొక్కకుండా పాఠశాల యాజమాన్యం దాచిపెట్టింది. చిన్నారి తల్లిదండ్రులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 12వ తేదీ సాయంత్రం బడి నుంచి ఇంటికెళ్లిన చిన్నారికి జ్వరం వచ్చింది.పొత్తి కడుపులో నొప్పిగా ఉందని ఏడవడంతో తల్లిదండ్రులు స్థానిక కేరళ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యురాలు బాలికపై లైంగికదాడియత్నం జరిగినట్లు చెప్పారు. దీంతో బాలికను మెరుగైన చికిత్స కోసం వైఎస్పార్ జిల్లా ప్రొద్దుటూరులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా కేసు నమోదు చేయాలని సూచించారు. భయపడిన తల్లిదండ్రులు అక్కడి నుంచి కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా విషయం తెలిపి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.దీంతో తల్లిదండ్రులు వెంటనే చాగలమర్రికి వెళ్లి పాఠశాల కరస్పాండెంట్‌ను ప్రశ్నించగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో బాధితులు బంధువుల సహాయంతో నంద్యాల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ విచారణ చేయాలని ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్‌ను ఆదేశించారు. డీఎస్పీ రవికుమార్ శనివారం ఎస్ఐ రమేష్‌రెడ్డి, సిబ్బందితో కలిసి శ్రీరాఘవేంద్ర పాఠశాలకు వెళ్లి సిబ్బందిని విచారించారు. అనంతరం పోలీసు స్టేషన్లో బాధిత చిన్నారి కుటుంబసభ్యులను విచారించి, వారి ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై పోక్సో కేసు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల కరస్పాండెంట్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలికను మాయచేసి అత్యాచారంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో పదో తరగతి బాలిక (16)కు మాయమాటలు చెప్పి ఒక యువకుడు అత్యాచారం చేశాడు. నెల్లూరు రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. మెడికవర్ హాస్పిటల్ వెనుక పాతమెట్టపాళెంలో ఉండే బాలిక స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన పెంచలయ్య (23) బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని నెలలుగా తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయమాటలు చెబుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన బాలికను మాయచేసి లొంగదీసుకుని అత్యాచారం చేశాడు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు శనివారం నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పొక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నేత కుటుంబం కిడ్నాప్ కలకలం
రామకుప్పం: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో గురువారం అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేత గోవిందప్ప కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. కిడ్నాపర్ల నుంచి వారిని పోలీసులు రక్షించారు. ఆ సమయంలో కిడ్నాపర్లు పరారయ్యారు. బాధితుల కథనం మేరకు.. మండలంలోని పెద్దకురబలపల్లిలోని వైఎస్సార్సీపీకి చెందిన మాజీ సర్పంచ్ గోవిందప్ప కుటుంబాన్ని గురువారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.మూడు లగ్జరీ కార్లలో వచ్చిన ఆగంతకులు గన్లతో బెదిరించి గోవిందప్ప కుటుంబసభ్యుల్ని కారుల్లో ఎక్కించుకున్నారు. గోవిందప్ప, గంగమ్మ, మాధవమ్మ, సుబ్బక్క, సిద్ధప్ప, సోమశేఖర్, పునీత్‌లను కారుల్లో ఎక్కించుకుని రామకుప్పం వైపు బయలుదేరారు. తాము ఆదాయపన్ను అధికారులమని, మీ దగ్గర ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఫిర్యాదు అందిందని గోవిందప్పకు చెప్పారు. మీవద్ద దాచిన నగదు ఇస్తే పంచుకుని వదిలేస్తామని ఆఫర్ ఇచ్చారు. విజలాపురం సమీపంలో గోవిందప్ప తమ్ముడు జయరఘురాం కోసం వాకబు చేశారు. తన తమ్ముడు ఇంటివద్దే ఉన్నట్లు గోవిందప్ప చెప్పడంతో మళ్లీ పెద్దకురబలపల్లి వెళ్లారు. అక్కడ జయరఘురాం లేకపోవడంతో కార్లను రామకుప్పం వైపు తీసుకెళ్లారు. రామకుప్పంలోని వైఎస్సార్ సర్కిల్లో బీట్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లను గమనించిన ఆగంతకులు కుటుంబం మొత్తాన్ని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు పోలీసులకు చెప్పాలని బాధితులను బెదిరించారు. ముందు రెండు కార్లను ఆపిన పోలీసులకు బాధితులు ఆవిధంగానే చెప్పారు. అయినా అనుమానించిన పోలీసులు అందరినీ కిందికి దించి ప్రశ్నించసాగారు. ఈ నేపథ్యంలో ఆ రెండు కార్లలోని కిడ్నాపర్లు పరారయ్యారు. ఆ సమయంలో వెనుక ఉన్న మూడోకారు వేగంగా ముందుకెళ్లిపోయింది. ఆ కారులో ఉన్న బాధితులు ఇద్దరిని రెండు కిలోమీటర్ల తరువాత కిడ్నాపర్లు వదిలేసి వెళ్లిపోయారు. చేతులు మారిన నగదే కారణమా? ప్రశాంతంగా ఉన్న రామకుప్పం మండలంలో కిడ్నాప్ అంశం ప్రజల్లో తీవ్రచర్చకు దారితీసింది. రైస్‌పుల్లింగ్ పేరిట కోట్లాది రూపాయలు చేతులు మారాయని అందులో భాగంగానే ఈ కిడ్నాప్ జరిగిందన్న చర్చలు సాగుతున్నాయి. దుండగులు కర్ణాటకకు చెందిన వారని తెలిసింది. పోలీసులు మాట్లాడుతుండగానే దుండగులు పరారవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతటివారైనా వదిలిపెట్టం: కుప్పం సీఐ మాజీ సర్పంచ్ గోవిందప్ప కుటుంబం కిడ్నాప్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నామని కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. అందులో భాగంగా గోవిందప్ప తమ్ముడు జయరఘురాంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. నగదు లావాదేవీలు, నగదు మార్పిడి కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మద్యం మత్తులో మహిళా కండక్టర్‌పై దాడి
జరుగుమల్లి (సింగరాయకొండ): మద్యం మత్తులో ఓ యువకుడు ఆర్టీసీ మహిళా కండక్టర్‌పై దాడి చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కామేపల్లిలో శుక్రవారం జరిగింది. కామేపల్లికి చెందిన ప్రత్తిపాటి హరిబాబు మద్యం తాగి గ్రామంలోని షాపుల వద్దకు వెళ్లి ఒక్కొక్కరు రూ.100 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వారు గద్దించడంతో అటుగా వస్తున్న టంగుటూరు–కామేపల్లి ఆర్టీసీ బస్సు ఎదుట అడ్డంగా పడుకున్నాడు. కండక్టర్ సుభాష్ ని సెల్ఫోన్లో వీడియో తీసేందుకు ప్రయతి్నంచగా ఫోన్ లాక్కొని పగులగొట్టాడు. సుధారాణి కిందపడిపోగా ఆమె ఛాతీపై తన్నాడు.అనంతరం తన చేతికి చిన్న గాయమైందని ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన హరిబాబు ఆయా డ్రస్సింగ్ చేస్తుండగా డాక్టర్ ఎక్కడ అని కేకలేస్తూ ఆస్పత్రిలోని సీసీ కెమెరాలు, ఫరి్నచర్ ధ్వంసం చేశాడు. డాక్టర్ రేష్మి ఫిర్యాదు మేరకు జరుగుమల్లి పోలీసులు కేసు నమోదుచేశారు. కండక్టర్ సుహాసినిని ప్రథమ చికిత్స అనంతరం కందుకూరు ఏరియా ఆస్పత్రికిపంపించారు. -
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెదగంట్యాడ బాలచెరువు సమీపంలో యువతిపై ఓ యువకుడు దాడి చేశారు. ఈ ఘటనలో బాధితురాలు మేఘన తీవ్రంగా గాయపడింది. కాగా, మేఘనపై జరిగిన దాడిలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. రెండు సార్లు నిందితుడిపై ఫిర్యాదు చేసిన కానీ పోలీసులు పట్టించుకోలేదు.మేఘన తలపై బలంగా ఇనుప రాడ్డుతో నిందితుడు నీరజ్ శర్మ దాడి చేశాడు. మేఘన పై దాడి చేస్తున్న క్రమంలో అడ్డు వచ్చిన మరో ఇద్దరిపై కూడా ప్రేమోన్మాది దాడి చేశాడు. బాధితురాలి తలపై వైద్యులు 30కి పైగా కుట్లు వేశారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని కిమ్స్‌కు తరలించారు. -
రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై రోజుకు 48 అఘాయిత్యాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, హత్యలు , దాడులకు సంబంధించి రోజుకు సగటున 48 కేసులు నమోదవుతున్నాయి. ఈ లెక్కన కూటమి ప్రభుత్వం వచ్చిన జూన్ నుంచి అక్టోబర్ నెలల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 7,393 కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వమే స్వయంగా శాసనసభలో వెల్లడించిన లెక్కలివి. శాసనసభలో వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వం అధికారికంగా ఈ వివరాలు వెల్లడించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటినుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మితిమీరిపోయాయి. నిత్యం లైంగికవేధింపులు, హత్యాచారం, హత్య ఘటనలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలే లైంగికవేధింపులు, అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు సైతం వెలుగు చూశాయి. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయకుండా నిందితుల పక్షానే నిలబడుతున్న ఘటనలు అనేకం. కొన్ని సందర్భాల్లో బాధితులు రాజీ పడాలంటూ బెదిరింపులకు సైతం దిగుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణే లేకుండాపోయింది. ఆ ఆరోపణలను ప్రభుత్వం వెల్లడించిన లెక్కలు బలపరుస్తున్నాయి. బయటకిరాని కేసులు మరెన్నో ఉన్నాయన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి.జూన్ నుంచి రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరిగిన అఘాయిత్యాల్లో కొన్ని.. » సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ ముస్లిం బాలికను అపహరించి హత్యకు పాల్పడ్డారు. నాలుగు రోజుల తరువాత బాలిక ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆ చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనలో చిన్నారి అదృశ్యమైన రోజే తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, ఆ బాలికను రక్షించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. విచారణ సరిగా చేయకపోవడంతో బాలిక ప్రాణాలే పోయాయి. సమీపంలోని అనుమానిత ప్రాంతాల్లో వెదకడంలోనూ పోలీసులు విఫలమయ్యారు. » ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు జాన్ 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. » అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ జూలైలో ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐషర్ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడితో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ కుటుంబం ఆందోళన చేయడంతో ఎనిమిది రోజుల తర్వాత ఆగస్టు 2న పోలీసులు కేసు నమోదు చేశారు. » శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తోటపాలెంలో ఓ యువతిని టీడీపీ నేత లైంగికంగా వేధించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె జూన్ 14న మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దాంతో పోలీసులు జూన్ 16న కేసు నమోదు చేశారు. »కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని బాత్ రూమ్‌లలో రహస్య కెమెరాలతో విద్యా ర్థి నుల వీడియోలు తీసిన ఘటనతో యావత్ రాష్ట్రం హడలెత్తిపోయింది. వందలాది విద్యా ర్థి నులు అర్ధరాత్రి ఆందోళనకు దిగడం సంచలనం సృష్టించింది. అంతటి తీవ్రమైన ఉదంతాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసేసింది. » నంద్యాల జిల్లా ముచ్చిమర్రులో ఓ చిన్నారిని అపహరించుకునిపోయి అత్యాచారం చేసి హత్య చేసినా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. నేటికీ ఆ చిన్నారి మృతదేహం ఆచూకిని పోలీసులు కనిపెట్టలేకపోయారు. » సీఎం బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం పరిధిలో కామాంధులు అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. -
చిత్తూరులో 14 ఏళ్ల బాలిక అదృశ్యం
చిత్తూరు అర్బన్: చిత్తూరులో ఓ మైనర్ బాలిక కనిపించకుండా పోయింది. నగరంలోని చామంతిపురానికి చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈమె తండ్రి గల్ఫ్ దేశంలో పొట్టకూటి కోసం వెళ్లారు. తల్లి, అమ్మమ్మ వద్ద ఉంటున్న బాలిక ఆదివారం చికెన్ తీసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత బాలిక ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు కంగారుపడి, తెలిసినవాళ్ల ఇళ్ల వద్ద వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు చెప్పి సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆదివారం రాత్రి వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. మంగళవారం చిత్తూరు పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువయ్యిందని.. మహిళలు మిస్ అవుతున్నా, అఘాయిత్యాలు, అత్యాచారాలకు గురవుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు ప్రవర్తిస్తోందన్నారు. చిత్తూరులో కనిపించకుండాపోయిన బాలిక ఆచూకీ వెంటనే కనిపెట్టి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. బాలిక ఆచూకీ తెలియకపోవడంతో చామంతిపురం వాసులు మంగళవారం రాత్రి వన్‌టౌన్ స్టేషన్ వద్దకు చేరుకుని బాలిక వివరాలు చెప్పాలని నిరసన తెలిపారు. -
‘కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణే లేదు’
గోపాలపురం(ప.గో.జిల్లా): గోపాలపురం మండలం హుకుంపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై టీడీపీ కార్యకర్త అత్యాచారానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం ఆమెను గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితురాలని మాజీ హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. అనంతరం తానేటి వనిత మాట్లాడుతూ.. టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు కేసును నీరుగార్చాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. చిన్న పిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. పోలీసులు సైతం అధికార పార్టీ నాయకులకే కొమ్ము కాస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత.. సరైన చర్యలు చేపట్టలేకపోతున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలి. వెంటనే బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలి’ అని వనిత డిమాండ్ చేశారు. -
చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తను హత్య చేసిన భార్య
మడకశిర: నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన గుర్తు తెలియని శవం కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్ వివరాలను తెలియజేశారు. 2023 జనవరి 12న మడకశిర మండలం కోడిగానిపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలువకు ఏర్పాటు చేసిన బ్రిడ్జి కింద గుర్తు తెలియని శవాన్ని గుర్తించారు. వీఆర్ఓ హారతి స్థానిక పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.మిస్సింగ్ కేసుల ఆధారంగా ..మడకశిర పోలీసులు వివిధ ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి మడకశిర సీఐ సురేష్‌బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆయన బదిలీపై వెళ్లిపోవడంతో ప్రస్తుత మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్, గుడిబండ ఎస్ఐ మునిప్రతాప్ కేసు దర్యాప్తు కొనసాగించారు. ఇందులో భాగంగా కర్ణాటకలోని తుమకూరు జయనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఓ మిస్సింగ్ కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. తుమకూరుకు చెందిన నాగరత్నమ్మ అనే మహిళ తన పెద్ద కుమారుడు మోహన్‌కుమార్ (52) తప్పిపోయినట్లు 2023 జనవరి 21న జయనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వివరాలను మడకశిర పోలీసులు సేకరించారు. ఆ తర్వాత శవం ఫొటోను నాగరత్నమ్మకు చూపించగా మృతుడు తన పెద్ద కుమారుడేనని గుర్తు పట్టింది. మృతుడి సోదరులైన అరుణ్‌కుమార్, కిరణ్‌కుమార్‌లను కూడా మడకశిర పోలీసులు విచారించారు. తప్పిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు.విచారణలో పోలీసులకు దొరికిన క్లూమృతుడి తల్లి, సోదరుల విచారణలో ఈ కేసుకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడికి, అతని భార్య కవితకు మనస్పర్థలు ఉన్నాయి. దీంతో మృతుడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి తుమకూరులోనే శిరా గేట్లో వేరుగా తన కుమారుడు కౌశిక్, కుమార్తె దీక్షితతో కలిసి ఉంటోందని వారు పోలీసులకు వివరాలు అందించారు. ఈవివరాల మేరకు మడకశిర పోలీసులు మృతుడి భార్య కవితను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు.భార్య విచారణతో వీడిన మిస్టరీమృతుడి భార్య కవితను పోలీసులు విచారణ చేయడంతో మోహన్‌కుమార్‌ను హత్య చేసినట్లు తేలింది. కవితకు తుమకూరు జిల్లా గుబ్బిలో పనిచేసే విద్యుత్‌శాఖ జేఈగా పని చేసే అక్తర్‌పాషాతో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అతనితో సహ జీవనం కూడా చేసేది. అక్తర్‌పాషాతో కవిత డబ్బులు ఇప్పించుకుని తుమకూరులోనే ఓ హోటల్ పెట్టింది. ఈ క్రమంలో మృతుడు మోహన్‌కుమార్ పలుసార్లు హోటల్ వద్దకు వెళ్లి భార్య కవిత, ప్రియుడు అక్తర్‌పాషా, హోటల్లో పని చేసే వంట మనిషి మోహన్‌ప్రసాద్, కుమారుడు కౌశిక్‌ను దూషించేవాడు. తన ఆస్తిని మీకు ఇవ్వనని, తన సోదరులకు ఇస్తానని భార్య, కుమారుడితో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో భార్య కవిత, కుమారుడు కౌశిక్, ప్రియుడు అక్తర్‌పాషాలు మోహన్‌కుమార్‌ను చంపడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనికి హోటల్ వంట మనిషి మోహన్‌ప్రసాద్‌తో సుపారీ మాట్లాడారు. రూ.లక్షకు ఒప్పందం చేసుకొని రూ.50 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చారు.చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి హత్యపథకం ప్రకారం కుమార్తె దీక్షతకు ఆరోగ్యం బాగా లేదని మోహన్‌కుమార్‌ను భార్య కవిత 2023 జనవరి 11న రాత్రి 9 గంటల సమయంలో ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు వేసి మోహన్‌కుమార్‌కు పెట్టారు. భోజనం చేసిన తర్వాత మృతుడు మత్తులోకి పోయాడు. ఈక్రమంలో భార్య కవిత, కుమారుడు కౌశిక్, వంట మనిషి మోహన్‌ప్రసాద్... మోహన్‌కుమార్ తలపై రోకలిబండతో కొట్టారు. మృతుడి భార్య ప్రియుడు అక్తర్‌పాషా కత్తితో గొంతుకోశారు. మోహన్‌కుమార్ మృతి చెందగా శవాన్ని ఓ ప్లాస్టిక్ సంచిలో కట్టి వంట మనిషి ఓ కారులో వేసుకుని మడకశిర మండలంలోని కోడిగానిపల్లి హంద్రీనీవా కాలువ బ్రిడ్జి కింది భాగాన పడేసి వెళ్లారు.నలుగురు నిందితుల అరెస్ట్పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్, గుడిబండ ఎస్ఐ మునిప్రతాప్ సిబ్బంది ఆదివారం నిందితులను తుమకూరులో అరెస్ట్ చేశారు. శవాన్ని తరలించడానికి ఉపయోగించిన కారు, మరణాయుధాలు కూడా సీజ్ చేశారు. నిందితులైన కవిత, అక్తర్‌పాషా, కౌశిక్, మోహన్‌ప్రసాద్‌లను కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ రాజ్‌కుమార్, ఎస్ఐ మునిప్రతాప్ తదితర పోలీసులను ఎస్పీ రత్న అభినందించినట్లు పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. -
‘‘టార్చర్ చేశారు సర్..’’ జడ్జికి గాయాలు చూపించి వాపోయిన వర్రా రవీంద్రారెడ్డి!
వైఎస్సార్ జిల్లా, సాక్షి: సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ అభియోగాలు మోపుతూ ఏపీలో వేధింపుల పర్వం కొనసాగిస్తోంది కూటమి ప్రభుత్వం. వైఎస్సార్సీపీ మద్దతుదారు వర్రా రవీంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి.. ఆయన కుటుంబాన్ని సైతం నడిరోడ్డుకు లాగింది. అదుపులోకి తీసుకోవడం దగ్గరి నుంచి జడ్జి ముందు హాజరపర్చడం దాకా అంతా గోప్యత, హైడ్రామాను నడిపించారు పోలీసులు. గత అర్ధరాత్రి దాటాక వర్రా రవీంద్రారెడ్డిని కడప 2వ ఏడీజేఏం ఎదుట హాజరుపరిచారు. విచారణ సందర్భంగా తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని వర్రా పేర్కొన్నాడు.‘‘శుక్రవారం నన్ను అరెస్టు చేసి ఎక్కడెక్కడో తిప్పి టార్చర్ చేశారు సర్(తనకు అయిన గాయాలను జడ్జికి చూపించారు). వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన పీఏ ప్రోద్బలంతోనే షర్మిల, సునీతలపై పోస్టులు చేశానని చెప్పాలంటూ ఒత్తిడి చేశారు. అందుకు ఒప్పుకోకపోవడంతో టార్చర్ చేశారు సర్. మేం ఏది చెప్పినా ‘యస్’ అనాలని వీడియో రికార్డు చేశారు సర్’’ అంటూ జడ్జి ఎదుట వాపోయారాయన. ఆ వివరాలన్నింటిని జడ్జి రికార్డు చేశారు. రవీంద్రారెడ్డికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అదే సమయంలో.. రవీంద్రా రెడ్డి ఆరోగ్య పరిస్థితి వివరాలను తెలియజేయాలని ఆదేశించారు. మరోవైపు.. ఇదే కేసులో అరెస్ట్ అయిన సుబ్బారెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డికి 41-ఏ నోటీసులు ఇచ్చి వదిలేయాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన్ని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. జడ్జి ఆదేశాల నేపథ్యంలో ఈ ఉదయం 10 గంటలకు కడప రిమ్స్‌లో వైద్య పరీక్షలకు తీసుకెళ్లనున్నారు. అనంతరం మళ్లీ కడప జైలుకు తరలించారు. ‘‘వర్రా రవీంద్రారెడ్డి ఎక్కడికి పారిపోలేదు. పోలీసుల సూచన మేరకు హైదరాబాద్ వెళ్లారు. శుక్రవారం ఆయన్ని అదుపులోకి తీసుకుని టార్చర్ చేశారు. కర్నూలు టోల్ ప్లాజా సమీపంలో కళ్లకు గంతలు కట్టి వేధించారు. అరికాళ్లపై రాడ్లతో చితకబాదారు. మార్కాపురం తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారు. ఆయన మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి’’::: సాక్షితో రవీంద్రారెడ్డి తరఫు అడ్వొకేట్ ఓబుల్‌రెడ్డి -
రంగరాయలో ర్యాగింగ్ కలకలం
కాకినాడ క్రైం: కాకినాడ రంగరాయ వైద్యకళాశాల (ఆర్ఎంసీ)లో ర్యాగింగ్ కలకలం రేపింది. హౌస్ సర్జన్ తన జూనియర్లకు ర్యాగింగ్ పేరుతో శనివారం అర్ధరాత్రి ప్రత్యక్ష నరకం చూపాడు. శ్రీకాకుళానికి చెందిన జగదీశ్ ఆర్ఎంసీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇంటర్న్ చేస్తున్నాడు. ఆర్ఎంసీ పీజీ హాస్టల్లో ఉంటూ చదువుతున్నాడు. శనివారం అర్ధరాత్రి మద్యం తాగి ఆర్ఎంసీ మెన్స్ హాస్టల్లోకి చొరబడ్డాడు. రాత్రి ఒంటిగంటకు హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి, రెండో సంవత్సరం చదువుతున్న పలువురు వైద్య విద్యార్థులను నిద్ర లేపాడు. 10 మంది విద్యార్థులను బలవంతంగా కారిడార్లోకి తీసుకొచ్చి, నిలబడాలని ఆదేశించాడు. రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5 వరకూ ప్రత్యక్ష నరకం చూపించాడు. వికృత చేష్టలు చేయాలంటూ వేధించాడు. వారిలో ఎదురు తిరిగిన ముగ్గురు జూనియర్లపై చేయి చేసుకున్నాడు. బాధిత విద్యార్థుల్లో పలువురు ఆదివారం తల్లిదండ్రులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారు కళాశాల యాజమాన్యానికి ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆదివారం సెలవు అయినప్పటికీ ఈ ఫిర్యాదుపై యాజమాన్యం స్పందించింది. మద్యం తాగి, హాస్టల్లోకి చొరబడి ర్యాగింగ్ పేరుతో జూనియర్లను వేధించిన విద్యార్థిని జగదీశ్‌గా గుర్తించింది. ఈ విషయాన్ని యాంటీ ర్యాగింగ్ కమిటీకి నివేదించింది. జగదీశ్‌పై సోమవారం చర్యలు తీసుకోనుంది. -
సరూర్‌నగర్‌లో ప్రేమోన్మాది కాల్పులు
సాక్షి, హైదరాబాద్: సరూర్ నగర్లో కాల్పుల కలకలం రేగింది. ప్రేమోన్మాది.. యువతి తండ్రిపై గన్‌తో కాల్పులు జరిపాడు. యువతి తండ్రి కంటిలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. స్థానికుల వివరాలు ప్రకారం.. కొన్నాళ్లుగా బల్వీందర్ సింగ్, మన్విత ప్రేమించుకుంటున్నారు. దీంతో మన్వితను ఆమె తండ్రి రేవంత్ ఆనంద్ దూరంగా పంపేశాడు. దీంతో కక్ష పెంచుకున్న బల్వీందర్‌సింగ్.. యువతి తండ్రిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విశాఖ నగరంలో గంజాయి కలకలం
విశాఖపట్నం, సాక్షి: శాంతిభద్రతలు క్షీణించడంపై చర్చ నడుస్తున్న వేళ.. నగరంలో మరోవైపు సంచలనం వెలుగు చూసింది. విశాఖలో గంజాయి కలకలం రేగింది. హోం మంత్రి అనిత నివాసానికి సమీపంలోనే ఉండడం గమనార్హం.లేడీస్ హాస్టల్ వెనుక ఉన్న కేజీహెచ్ కొండ ప్రాంతంలో గంజాయి ముఠా గుట్టు రట్టైంది.. ఏజెన్సీ నుంచి తీసుకొచ్చి మరీ ఇక్కడ పండిస్తోంది ఓ ముఠా. తాము సేవించడమే కాకుండా.. మిగతాది నగరంలోని విద్యార్థులకు విక్రయిస్తోంది. ఈ గ్యాంగ్ గురించి పక్కా సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు.. దాడులు జరిపారు. ఐదుగురు ముఠా సభ్యుల గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. అందులో ఇద్దరు పారిపోగా.. ముగ్గురు మాత్రం దొరికారు. వీళ్లలో ఒక మైనర్ ఉండడం గమనార్హం. ఈ ప్రాంతం హోం మంత్రి అనిత నివాసానికి కేవలం 3 కి.మీ. లోపే ఉంది. నావికా దళం(నేవీ) ఆధీనంలో ఉండడం, పైగా హోం మంత్రి నివాస సమీపంలోనే గంజాయి సాగు జరగడం ఒక్కసారిగా విశాఖను ఉలిక్కి పడేలా చేసింది. ఈ ముఠా ఎవరెవరకి సప్లయ్ చేసిందనే దానిపై నిందితుల్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. -
కోట్లలో కట్నం.. ఆరంకెల జీతం..అత్తింటి వేధింపులతో కోడలి ఆత్మహత్య?
గతేడాది వరకు ఆమె సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ ఉద్యోగి. ఆరంకెల జీతం. ఉద్యోగ జీవితంలో క్లిష్టమైన సమస్యల్ని మేనేజ్ చేసిన నైపుణ్యం. 12 ఏళ్ల క్రితం తండ్రి చనిపోయారు. తల్లి, సోదరుడి అండతో ఏ చీకూచింత లేని జీవితం. రూ.కోట్లలో బంగారం, కట్నం ఇచ్చి మరీ నగరంలోని ఓ చార్టర్డ్ అక్కౌంటెంట్తో ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేశారు. ఈ 8 మాసాల్లో ఏం జరిగిందో.. ఎంత క్షోభ అనుభవించిందో.. ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి, సోదరుడు మాత్రం ఇది ఆత్మహత్య కాదని, అత్తింటివారే హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీతమ్మధార: నగరంలోని బాలయ్యశాస్త్రి లేఅవుట్‌కు చెందిన సత్యప్రియ(31) ఆత్మహత్య అనుమానాలకు తావిస్తోంది. మృతురాలి తల్లీ, సోదరుడు ఇది ముమ్మాటికీ అత్తింటి వారు చేసిన హత్యేనని ఆరోపిస్తున్నారు. ద్వారకా స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాలు. సత్యప్రియ కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. తండ్రి 12 ఏళ్ల క్రితం మరణించారు. అన్నయ్య అడబాల రామకృష్ణ హైదరాబాద్‌లో ఎస్ఎంఆర్ ఫౌండేషన్ హెడ్. వీరి సొంతూరు రాజమండ్రి. సత్యప్రియ బెంగళూరులోని డిలైట్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేది. తర్వాత హైదరాబాద్‌కు మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న నగరంలోని బాలయ్యశాస్త్రి లేఅవుట్‌కి చెందిన ఎల్లిశెట్టి కార్తికేయ(32)తో హైదరాబాద్‌లో ఘనంగా వివాహం జరిగింది. కార్తికేయ విశాఖలో చార్టర్డ్ అకౌంటెంట్. ఇతని తండ్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వద్ద ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. పెళ్లయ్యాక బాలయ్యశాస్త్రి లేఅవుట్లోని కృపా నిలయంలో ఉంటున్నారు. ఈ నెల 5న వీరు అరకు వెళ్లారు. సత్యప్రియ అక్కడి నుంచి తల్లి శ్రీవెంకటరమణకు వీడియోకాల్ చేసింది. ఐ మిస్ యూ అని చెప్పడంతో తల్లి కంగారు పడింది. వెంటనే ఫోన్ కాల్ చేసి మాట్లాడింది. కానీ, కుమార్తె ఏమీ లేదని చెప్పిందట. బుధవారం భార్యాభర్తలు ఇంటికి వచ్చేశారు.గురువారం ఉదయం కార్తికేయ యథావిధిగా ఆఫీసుకి వెళ్లిపోయాడు. ఆమె మళ్లీ తల్లికి ఫోన్ చేసి తన బాధ వెల్లబోసుకుంది. సత్యప్రియ పిన్ని కుమార్తెకు వివాహం కుదిరిందని తల్లి చెప్పగా, చెల్లికి బాగా విచారణ చేశాకే మంచి సంబంధం ఖాయం చేయండని సలహా ఇచ్చింది. గురువారం భర్తకి వాట్సప్‌లో కార్టూన్ బొమ్మ పంపించి, మధ్యాహ్నం 12.30 సమయంలో ఫోన్ చేయగా అతను లిఫ్ట్ చేయలేదు. తిరిగి 2.30కు కాల్ చేయగా ఆమె నుంచి బదులు రాలేదు. సాయంత్రం ఇంటికొచ్చి చూసేసరికి పడక గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని సత్యప్రియ కనిపించింది. వెంటనే తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. వారు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. కోడలు చనిపోయి ఉండటాన్ని చూసిన అత్త స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెను ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చేరి్పంచారు. కుమార్తె ఆత్మహత్య విషయమై అత్తింటివారు కాకుండా వేరే వ్యక్తి ఆమె తల్లికి ఫోన్ చేయడం గమనార్హం. గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో సత్యప్రియ మామ సూర్యచంద్రరావు కోడలి తల్లికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. పోలీసులకు రాత్రి 10.20 కు ఫిర్యాదు చేయడం విశేషం. మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు. పోస్టుమార్టం శనివారం చేస్తారని సమాచారం. విమానంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చి, అక్కడి నుంచి కారులో శుక్రవారం ఉదయం తల్లి, సోదరుడు విశాఖ చేరుకున్నారు. ద్వారకా స్టేషన్లో తమ కుమార్తెది ఆత్మహత్య కాదని, అత్తింటివారే హత్య చేశారని తల్లి ఫిర్యాదు చేశారు. వివాహ సమయంలో రూ.4.5 కోట్ల విలువైన బంగారం, కట్నం ఇచ్చామని, పెళ్లికి మరో రూ.కోటి ఖర్చయిందన్నారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, మొదటి నుంచి అల్లుడు తల్లిదండ్రుల మాటలు విని, తన కుమార్తెను అనుమానంతో వేధించేవాడని పేర్కొన్నారు. తల్లి ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త కార్తికేయ, మామ సూర్యచంద్రరావులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఏసీపీ రాంబాబు పర్యవేక్షణలో ద్వారకా స్టేషన్ సీఐ బీవీ రమణ మృతు రాలి భర్త, అత్త, మామల పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
పిఠాపురం: ఇంటర్ విద్యార్థిని అదృశ్యం..
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గంలో ఇంటర్ విద్యార్ధిని అదృశ్యమైంది. 15 రోజుల క్రితం కళాశాలకు వెళ్లిన కొడవలి గ్రామానికి చెందిన వరలక్ష్మీ(16) మిస్సింగ్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్తిపాడులో విద్యార్థిని ఇంటర్ ఫస్ట్‌యర్ చదువుతోంది.తొలుత గొల్లప్రోలు పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన యువతి తల్లిదండ్రులతో పోలీసులు హేళనగా మాట్లాడారు. దీంతో గత నెల 22న ప్రత్తిపాడు పీఎస్ లో వరలక్ష్మీ అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. వరలక్ష్మీ ఆచూకీ తెలియక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. తమ కుమార్తె జాడ కోసం సాయం చేయాలని వరలక్ష్మీ తల్లిదండ్రులు పవన్‌కు లేఖ రాశారు. -
అమ్మా సారీ.. నేను చదవలేకపోతున్నా
నెల్లూరు సిటీ: ‘అమ్మా.. సారీ నేను చదవలేకపోతున్నాను.. నేను బతికినా ఒకటే.. చచ్చినా ఒకటే’ అంటూ పదో తరగతి విద్యార్థి హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముత్తుకూరు మండలం ఆర్ఆర్ కాలనీలో దువ్వూరు హరనాథ్‌రెడ్డి, అనిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి జీవనాధారం వ్యవసాయం. ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు పనత్రెడ్డి (15) ధనలక్ష్మీపురంలోని వీబీఆర్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. అతను చిన్నప్పటి నుంచే చదువుల్లో కొంత వెనుకబడ్డాడు. ఇంట్లో ఉంటే ఆటల్లో పడి పుస్తకాలపై శ్రద్ధ పెట్టే అవకాశం తక్కువగా ఉంటుందని, హాస్టల్లో చేర్చితే సహచర విద్యార్థులతో కలిసి మంచి మార్కులు సాధిస్తాడని తల్లిదండ్రులు భావించారు. దీంతో ఎనిమిదో తరగతిలోనే హాస్టల్లో చేర్పించారు. చదువు విషయంలో పనత్పై ఎక్కువ ఒత్తిడి చేయొద్దని, పాస్ మార్కులు వస్తే చాలని అక్కడి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు చెప్పారు. అయితే పనత్రెడ్డికి ఒక పక్క పాఠాలు అర్థం కాక, తల్లిదండ్రులకు చెబితే తిడతారని భయపడ్డాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఒత్తిడికి లోనవుతూనే చదువు కొనసాగించాడు. మంచి మార్కులు రావడం లేదన్న ఆందోళన అతన్ని వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం భోజనం చేశాక పనత్రెడ్డి నేరుగా హాస్టల్లోని తన గదికి వెళ్లాడు. నైలాన్ తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన సహచర విద్యార్థులు పాఠశాల సిబ్బందికి సమాచారం అందించారు. వారు కిందకు దించి అతడిని చికిత్స నిమిత్తం నారాయణ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే పనత్రెడ్డి మృతి చెందాడని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు హుటావుటిన ఘటనా స్థలానికి చేరుకుని విగతజీవిగా పడి ఉన్న పనత్ను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.పాఠశాల ఎదుట ఆందోళనపనత్రెడ్డి మృతిపై విద్యార్థి సంఘ నాయకులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. ఉపాధ్యాయుల ఒత్తిడితోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ వేణు ఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్ది చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.2,610 కోట్ల అక్రమ డిపాజిట్లు.. 18 ఏళ్లుగా జిత్తులు!
చట్టపరమైన చర్యల కోసం కింది కోర్టులో అ«దీకృత అధికారి ఫిర్యాదు చేస్తే దానిపై పిటిషన్..! వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కమిషన్‌ను నియమిస్తే పిటిషన్...! అధీకృత అధికారిని నియమిస్తే పిటిషన్..! కేసు వాదించడానికి స్పెషల్ పీపీని నియమిస్తే పిటిషన్! కింది కోర్టు విచారణకు స్వీకరిస్తే పిటిషన్...! వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తే పిటిషన్..! హైకోర్టు జోక్యానికి నిరాకరిస్తే సుప్రీంకోర్టులో పిటిషన్...!! ఇలా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్ 6న బట్టబయలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు.ప్రతి దశలోనూ విచారణను అడ్డుకుంటూ వచ్చారు. అయితే ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 7వ తేదీన మరోసారి విచారణ జరపనుంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు స్వీకరించిందా? లేదా? అనే విషయాన్ని తేల్చనుంది. చట్ట విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించినట్లు తేలితే వసూలు చేసిన రూ.2,610 కోట్లకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అటు అక్రమ డిపాజిట్లు.. ఇటు నష్టాలంటూ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. 1997 కేంద్ర చట్టం ప్రకారం హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. అయితే దీన్ని ఖాతరు చేయకుండా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి 1997 నుంచి 2006 మార్చి నాటికి 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.2,610.38 కోట్లు అక్రమంగా వసూలు చేసింది. ఇంత భారీగా డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఆశ్చర్యకరంగా 2006 మార్చి నాటికి రూ.1,369.47 కోట్లను వృద్ధి చెందుతున్న నష్టాలుగా చూపింది. తద్వారా 50 శాతం మంది డిపాజిటర్లకు డిపాజిట్లు చెల్లించలేని పరిస్థితికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేరింది. డొంక కదిల్చిన ఉండవల్లి... మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. మార్గదర్శి అక్రమాల తీరును బహిర్గతం చేశారు. ఇదే సమయంలో ఆ డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంతోపాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్ నుంచి వివరణ కోరింది.వాస్తవానికి 1997లోనే డిపాజిట్ల సేకరణపై మార్గదర్శి స్పష్టత కోరగా ప్రజల నుంచి అలా సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ అప్పుడే స్పష్టం చేసింది. అయినా సరే పట్టించుకోకుండా మార్గదర్శి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తూ వచి్చంది. ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారో అప్పుడు మళ్లీ ఆర్బీఐ దీనిపై స్పందించింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. రంగాచారి, కృష్ణరాజు నియామకం.. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్బీఐ చేతులెత్తేయడంతో చట్ట ప్రకారం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముందుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలపై నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని, చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ టి.కృష్ణరాజును అ«దీకృత అధికారిగా నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ నియామకాలను సవాలు చేస్తూ రామోజీ 2006లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం 2007లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఐటీ శాఖ నుంచి సేకరించిన రంగాచారి.. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రంగాచారి నిర్వహించిన విచారణకు రామోజీరావు, మార్గదర్శి సహకరించకుండా కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డంకులు సృష్టించారు. తమ పిటిషన్లు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని, డాక్యుమెంట్లు ఇచ్చేది లేదంటూ మొండికేశారు. దీంతో రంగాచారి ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖ నుంచి తెప్పించుకున్నారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని పేర్కొంటూ 2007 ఫిబ్రవరి 19న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్ హైకోర్టుకు నివేదించటాన్ని తన నివేదికలో పొందుపరిచారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆరి్థక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. రామోజీ పెట్టుబడి రూపాయైనా లేదు.. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీ తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణలో తేల్చారు. 2000, ఆ తరువాత బ్యాలెన్స్ షీట్లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శిని నడిపారని నిగ్గు తేల్చారు. కోర్టు అనుమతితో తనిఖీలు.. మరోవైపు ఈ కేసులో అ«దీకృత అధికారిగా నియమితులైన కృష్ణరాజు కోర్టు అనుమతితో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో తనిఖీలు చేశారు. దీన్ని సవాలు చేస్తూ మార్గదర్శి, రామోజీరావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ 14.3.2007న కోర్టు ఉత్తర్వులిచి్చంది. దీనిపై రామోజీ హైకోర్టును ఆశ్రయించగా కింది కోర్టు ఇచి్చన సెర్చ్ వారెంట్‌ను నిలుపుదల చేసింది. ఈ క్రమంలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. దీన్ని కొట్టి వేయాలంటూ అదే ఏడాది రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ రజనీ స్టేతో మూలపడిన కేసు.. దీంతో దిక్కుతోచని రామోజీ 2010లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అ«దీకృత అధికారి ఇచ్చిన ఫిర్యాదులో విచారణను సెక్షన్ 45(ఎస్)(1), 45(ఎస్)(2), 58బీ(5ఏ) రెడ్ విత్ సెక్షన్ 58(ఈ)లకే పరిమితం చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ నాంపల్లి కోర్టు 2011లో ఉత్తర్వులిచ్చి0ది. ఈ ఉత్తర్వులపై మార్గదర్శి, రామోజీ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్బీఐ చట్టం పరిధిలోకి మార్గదర్శి ఫైనాన్షియర్స్ రాదంటూ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ 20.7. 2011న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.‘‘స్టే’’ వల్ల కేసు అప్పటి నుంచి మూలనపడిపోయింది. అటు తరువాత వచి్చన ప్రభుత్వాలు రామోజీ గుప్పిట్లో ఉండటంతో మార్గదర్శి అక్రమాలను పట్టించుకోలేదు. విచారణ.. తీర్పు.. ఒకే రోజు ఉమ్మడి హైకోర్టు విభజన 1.1.2019న జరిగింది. 31.12.2018 ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు. అటు న్యాయవాదులు ఇటు న్యాయమూర్తులు అందరూ భావోద్వేగ వాతావరణంలో ఉన్నారు. కేసుల విచారణపై దృష్టి సారించలేని పరిస్థితిని రామోజీరావు తనకు అనుకూలంగా మలచుకున్నారు. నాంపల్లి కోర్టులో అ«దీకృత కృష్ణరాజు చేసిన ఫిర్యాదును కొట్టేయాలంటూ 2011లో తాము దాఖలు చేసిన వ్యాజ్యాలను రామోజీ విచారణకు తెప్పించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. రామోజీరావు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రాను రంగంలోకి దించారు. లూథ్రా వాదనలు విన్న జస్టిస్ రజనీ ఇంత పెద్ద కేసులో అదే రోజు అంటే 31వతేదీన తీర్పు కూడా ఇచ్చేశారు. రామోజీ, మార్గదర్శి వాదనను సమరి్థంచారు. హెచ్‌యూఎఫ్.. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదని జస్టిస్ రజనీ తన తీర్పులో తేల్చేశారు. మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో అధీకృత అధికారి కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు. ఇంత పెద్ద కేసులో ఒకే రోజు విచారణ జరిపి అదే రోజు తీర్పునివ్వడం అరుదైన ఘటన. అసలు ఈ కేసు విచారణకు వచ్చినట్లు గానీ, న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చినట్లుగానీ ఎవరూ గుర్తించలేదు. అటు తరువాత కొద్ది నెలలకు ఈ తీర్పు వెలుగు చూసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. జస్టిస్ రజనీ తీర్పుపై మార్గదర్శి, రామోజీరావు సుప్రీంకోర్టును ఆశ్రయించడం. అటు తరువాత మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్రమత్తమై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2019 డిసెంబర్ 17న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. హైకోర్టు తీర్పును రద్దు చేసిన సుప్రీం.. హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు 19.9.2020న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం17.8.2022న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటు ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీ ప్రభుత్వం, ఇటు మార్గదర్శి, రామోజీరావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చి0ది. మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు విచారణ సందర్భంగా ఆర్బీఐ న్యాయవాది మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా ఈ ఏడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసుల కొట్టివేతకు సుప్రీం నిరాకరణ.. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ ఇదే సమయంలో రామోజీ, మార్గర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చి0ది. చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని.. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు ఏకపక్షంగా ఇచి్చన తీర్పును పక్కనపెడుతున్నామని స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని, సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. తాజాగా విచారణ జరిపి ఆరు నెలల్లో విచారణను ముగించాలని, సేకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్ నోటీసు ఇవ్వాలని తెలిపింది. తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జూన్‌లో తిరిగి విచారణ ప్రారంభించింది. విచారణ జరుగుతుండగానే రామోజీరావు మరణించగా ఆయన స్థానంలో హెచ్‌యూఎఫ్ కర్తగా తనను చేర్చాలని రామోజీ కుమారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలు వాయిదాల అనంతరం పూర్తిస్థాయి వాదనల నిమిత్తం ఈ నెల 7న విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. -
మొద్దునిద్రలో సర్కారు.. చిదిమేస్తున్న కామాంధులు!
సాక్షి, అమరావతి: ఆకాశాన హరివిల్లు విరిస్తే అది తమకోసమేనని ఆనందించే పసిపాపలను కామ పిశాచాలు నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నాయి! పుస్తకాల బ్యాగు భుజాన వేసుకుని తుళ్లింతలతో స్కూల్‌కు వెళ్లే బాలికలపై పాశవికంగా లైంగిక దాడులకు తెగబడుతున్నాయి. భవిష్యత్‌పై కోటి ఆశలతో కాలేజీకి వెళ్లే విద్యార్థినులపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. చిన్నారులు, బాలికల ఆర్తనాదాలు అరణ్య రోదనగా మారుతున్నాయి. కూటమి సర్కారు చేతగానితనం తల్లిదండ్రులకు గుండెకోత మిగులుస్తోంది! రెడ్‌బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తున్న పోలీసు వ్యవస్థ చేష్టలుడిగి చూస్తోంది.నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో కామ పిశాచాలు ఓ చిన్నారిని అపహరించి హత్యాచారానికి తెVý బడ్డా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదు! నాలుగు నెలలు గడిచినా కనీసం మృతదేహాన్ని అయినా బాధిత కుటుంబానికి అప్పగించలేకపోయామనే అపరాధ భావన లేకపోవడం విభ్రాంతి కలిగిస్తోంది!! చంద్రబాబు సొంత జిల్లా తిరుపతిలో 9 మంది చిన్నారులపై అత్యాచారాలు వెలుగులోకి వచ్చాయి. చిత్తూరు జిల్లాలో ఐదుగురు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఓ విద్యార్థిపై సామూహిక లైంగిక దాడి చోటు చేసుకుంది. నాలుగు నెలల్లో రాష్ట్రంలో 91 మంది చిన్నారులు, విద్యార్థినులపై అత్యాచారాలు, లైంగిక దాడుల ఘటనలు జరిగాయి. వీరిలో ఏడు మందిపై అత్యాచారానికి పాల్పడి హతమార్చడం రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల దుస్థితికి నిదర్శనం.ఆగని అత్యాచారకాండకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రౌడీమూకలు, అసాంఘిక శక్తులు విశృంఖలంగా రెచ్చిపోతున్నాయి. ఐదేళ్ల అజ్ఞాతవాసం తరువాత సంకెళ్లు తెగినట్టుగా యథేచ్చగా సంచరిస్తూ బరితెగించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నాయి. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో అచ్చోసిన ఆంబోతుల్లా దాడి చేస్తున్నాయి. ప్రధానంగా చిన్నారులు, విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని కీచక పర్వానికి ఒడిగడుతున్నాయి. వరుస అత్యాచారాలతో రాష్ట్రం హడలిపోతుంటే ప్రభుత్వం మాత్రం మొద్దునిద్రలో జోగుతోంది.పోలీసుల అస్త్ర సన్యాసంబాలికలు, విద్యార్థినులు, మహిళల భద్రతను టీడీపీ కూటమి ప్రభుత్వం గాలికి వదిలేయడంతో పోలీసులు పూర్తిగా అస్త్ర సన్యాసం చేశారు. అనంతపురం జిల్లాలో జరిగిన దారుణమే దీనికి తార్కాణం. పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ ఈ ఏడాది జూలైలో ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐషర్ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. తాపీగా ఎనిమిది రోజుల తర్వాత కేసు నమోదు చేసినా ఉపసంహరించుకోవాలని బాధిత కుటుంబాన్ని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. ‘ముఖ్య’నేత ఆదేశించినట్టుగా రెడ్‌బుక్ రాజ్యాంగం అరాచకాలకు కొమ్ముకాయడం.. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడమే తమ కర్తవ్యంగా పోలీసు శాఖ భావిస్తోంది. చిన్నారులను అపహరించారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదు. అందుకు పుంగనూరులో మైనార్టీ బాలిక ఉదంతమే అందుకు నిదర్శనం.బాలిక అపహరణకు గురైనా విస్తృత గాలింపు చర్యలు చేపట్ట లేదు. మూడు రోజుల తర్వాత నాలుగు కి.మీ. దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అదే పోలీసులు ఫిర్యాదు రాగానే స్పందించి ఉంటే ప్రాణాలతో కాపాడగలిగేవారు. యథా చేతగాని ప్రభుత్వం..తథా చేష్టలుడిగిన పోలీసు! అన్నట్టుగా తయారైంది రాష్ట్రంలో పరిస్థితి. -
బాధిత బాలిక తండ్రిపై తీవ్ర ఒత్తిళ్లు!
సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండలానికి చెందిన మైనర్ దళిత బాలికపై జరిగిన దాడి ఘటనను నీరుగార్చేందుకు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు మొదలైనట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధ బాధిత బాలిక చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకుని దాదాపు ఐదు గంటల పాటు మంతనాలు జరపడం.. ఆమెను అనుమతించిన పోలీసులు వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలను మాత్రం అడ్డుకోవడం.. బాలిక తండ్రి ఒక్క రోజులోనే మాట మార్చేలా ఒత్తిడి తేవడం.. ఆద్యంతం ప్రభుత్వం గోప్యంగా వ్యవహరిస్తుండటం దీన్ని బలపరుస్తున్నాయి. వైద్య పరీక్షల్లో లైంగిక దాడి జరగలేదని తేలినట్లు ఎస్పీ సుబ్బరాయుడు చెప్పారు. బాలిక చెప్పిన వివరాల మేరకు అనుమానితులను విచారిస్తున్నట్లు తెలిపారు. దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత బాలిక సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి దాడి చేసిన విషయం తెలిసిందే. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను పోలీసులు అర్ధరాత్రి తొలుత పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి అనంతరం తిరుపతి మెటర్నటీ ఆసుపత్రికి తరలించారు.బాధిత కుటుంబంతో పులివర్తి సుధ మంతనాలుచంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధ మంగళవారం ఉదయం 10.20 గంటల ప్రాంతంలో తిరుపతి మెటర్నటీ ఆసుపత్రికి చేరుకుని దాదాపు ఐదు గంటల పాటు బాధిత కుటుంబంతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. సాయంత్రం 3.04 గంటలు దాటాక వెలుపలకు వచ్చి మీడియాతో మాట్లాడారు. తిరిగి మరోసారి లోపలకు వెళ్లారు. మధ్యాహ్నం 12.09 గంటల ప్రాంతంలో సుధ ఆసుపత్రి లోపల ఉన్న సమయంలో బాలిక తండ్రి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. బాలికపై దాడి జరిగింది వాస్తవమేనని, అయితే లైంగిక దాడి జరగలేదని చెప్పారు. తన కుమార్తె వారిని ప్రేమించలేదనే కారణంతో దాడి చేశారన్నారు.వైఎస్సార్సీపీ, ఏఐఎస్ఎఫ్ ఆందోళనబాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, మాజీ మంత్రి ఆర్కే రోజా, తిరుపతి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్‌రెడ్డి, నూకతోటి రాజేష్, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పలువురు వైఎస్సార్సీపీ నాయకులు ఉదయమే వేర్వేరుగా తిరుపతి మెటర్నటీ ఆసుపత్రికి చేరుకోగా రోజా మినహా మిగిలిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తరువాత వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను మాత్రం ఆస్పత్రి లోపలకు అనుమతించారు. దీనిపై వైఎస్సార్సీపీ ఎంపీ, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ధర్నా చేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు కూడా ఆందోళనకు దిగారు. సీపీఐ నాయకులను సైతం అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనకు దిగడంతో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, భూమన అభినయ్‌ని మాత్రం అనుమతించారు. -
వృద్ధురాలిని హత్యచేసి.. సూట్‌కేస్‌లో కుక్కి..
నెల్లూరు (క్రైమ్)/తిరువళ్లూరు: పరిచయస్తురాలిని హత్యచేసి.. మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి.. పక్కరాష్ట్రంలో పడేసేందుకు ప్రయత్నించిన ఘటన సంచలనం కలిగించింది. నెల్లూరులో వృద్ధురాలిని హత్యచేసి మృతదేహాన్ని తమిళనాడులో పడేసేందుకు ప్రయత్నించారు. ఈ దుర్మార్గానికి సంబంధించి తండ్రీకుమార్తెలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు రాజేంద్రనగర్‌లో ఎం.రమణి (65), మురుగేశం దంపతులు ఉంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు. రమణి సోమవారం కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లి ఎంతకీ తిరిగిరాకపోవడంతో గాలించిన కుటుంబసభ్యులు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. మీంజూరు రైల్వేస్టేషన్లో మృతదేహం సంతపేట ఇన్స్పెక్టర్ మద్ది శ్రీనివాసరావు, ఎస్ఐ బాలకృష్ణ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి సాంకేతికత ఆధారంగా గాలింపు చేపట్టారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సీసీ ఫుటేజ్‌లు పరిశీలించారు. ఆ సమయంలో తమిళనాడులోని మీంజూరు రైల్వే పోలీసులు సంతపేట ఇన్స్పెక్టర్కు ఫోన్‌చేసి సూట్ కేసులో వృద్ధురాలి మృతదేహం ఉందని, ఆ సూట్ కేసును తీసుకొచ్చిన రాజేంద్రనగర్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం, అతని కుమార్తె తమ అదుపులో ఉన్నారని చెప్పారు. మృతదేహం ఫొటోను పంపించారు. మృతదేహం రమణిదిగా గుర్తించిన ఇక్కడి పోలీసులు రైల్వేపోలీసులకు సమాచారమిచ్చారు. మీంజూరు రైల్వేపోలీసుల విచారణలో రమణిని హత్యచేసినట్లు చెప్పారు. బంగారు ఆభరణాల కోసమే.. గతంలో రమణి ఇంటికి సమీపంలో ఉన్న బాలసుబ్రహ్మణ్యం కుటుంబం ఇటీవల అదేప్రాంతంలో అపార్ట్‌మెంట్‌కు వెళ్లిపోయింది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో రమణి ఒంటిపై ఆభరణాలు కాజేయాలని నిర్ణయించుకుని ఆమె కదలికలపై నిఘా ఉంచాడు. సోమవారం కూరగాయల కోసం వచ్చిన ఆమెతో మాట కలిపి తమ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్యచేసి ఒంటిపై ఉన్న సరుడు, నల్లపూసలదండ, కమ్మలు దోచుకున్నాడు.రమణి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి ట్రావెల్ సూట్‌కేస్‌లో కుక్కాడు. మృతదేహాన్ని నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా పడేస్తే తెలిసిపోతుందని.. పొరుగునున్న తమిళనాడులో పడేయాలని నిర్ణయించుకుని కుమార్తెకు చెప్పాడు. సాయంత్రం సుబ్రహ్మణ్యం, కుమార్తెతో కలిసి నెల్లూరు సౌత్ రైల్వేస్టేషన్లో చెన్నై వెళ్లే ప్యాసింజర్ రైలు ఎక్కారు. చెన్నై మీంజూరు స్టేషన్లో రైలు ఆగడంతో.. దిగి నెల్లూరు వెళ్లే రైలెక్కి మార్గంమధ్యలో సూట్‌కేస్‌ను బయట పడేయాలనుకున్నారు. రైలు కోసం వేచి ఉన్న సమయంలో అక్కడి రైల్వే పోలీసులు విజిల్ వేయడంతో కంగారుపడి వెళుతుండగా ప్లాట్‌ఫాంపై ఉన్న ఓ యువకుడు సూట్‌కేస్‌ను మరిచిపోయారంటూ కేకలు వేశాడు. రైల్వే పోలీసులు వారిని ఆపి సూట్‌కేస్ గురించి ప్రశ్నించగా నీళ్లునమలడం, భయపడడంతో వారికి అనుమానం వచ్చింది. సూట్‌కేస్ నుంచి రక్తం కారుతుండడంతో తెరచి చూశారు. మృతదేహం బయటపడింది. దీంతో వారిని రైల్వే పోలీసులు విచారించగా బంగారు ఆభరణాల కోసమే హత్యచేసినట్లు చెప్పారు. కాగా, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. çహత్య జరిగిన ప్రాంతం నెల్లూరు కావడంతో త్వరలోనే కేసును ట్రాన్స్ఫర్ చేస్తామని అక్కడి పోలీసులు తెలిపారు. -
విద్యార్థిని తొడ కొరికిన కీచక టీచర్
కోడూరు: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు అభం శుభం తెలియని చిన్నారులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రాక్షసానందం పొందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలంలో నరసింహపురంలో చోటుచేసుకుంది. నరసింహపురం ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు పది మంది పిల్లలు చదువుతున్నారు. ఆ పాఠశాలలో పనిచేస్తున్న అవనిగడ్డకు చెందిన ఎస్జీటీ ఉపాధ్యాయుడు కటికల వేణుగోపాలరావు.. విద్యాశాఖ అనుమతి లేకుండా ఓ ప్రైవేట్ టీచర్‌ను నియమించుకుని విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు. బాధ్యత మొత్తం ఆ టీచర్ మీద వదిలేసి వేణుగోపాలరావు పాఠశాలలో తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వేణుగోపాలరావు మూడో తరగతి విద్యార్థినితో నాలుగు రోజుల నుంచి అసభ్యంగా ప్రవరిస్తున్నాడు. చెప్పుకోలేని చోట తాకుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. సోమవారం ఉదయం ఆ విద్యార్థిని పాఠశాలకు వెళ్లగానే వేణుగోపాలరావు వేరే గదిలోకి తీసుకువెళ్లి బెంచిపై కూర్చొబెట్టి తొడపై కొరికాడు. విద్యార్థిని వద్దు సార్ అని ఏడుస్తున్నా కనికరించకుండా పళ్లగాట్లు పడేలా కొరికాడు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరించినట్టు విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది. ఉపాధ్యాయుడు నాలుగు రోజుల నుంచి తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. ఎక్కడ పడితే అక్కడ తాకుతున్నాడని చెప్పింది. తల్లిదండ్రులు విద్యార్థిని తొడపై పంటిగాట్లు గమనించారు. దీనిపై మండల విద్యాశాఖ అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోడూరు పోలీసులను ఆశ్రయించారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వేణుగోపాలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. -
మహిళలపై టీడీపీ నేతల మరో అరాచకం
సాక్షి టాస్‌్కఫోర్స్: ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ అరాచకాలు మరీ శ్రుతిమించాయి. ఆదివారం అర్ధరాత్రి ఆత్మకూరు మండలం బ్రాహ్మణ యాలేరులో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. బాధితుల కథనం మేరకు.. బ్రాహ్మణ యాలేరుకు చెందిన రహమత్బీ అన్న ఇస్మాయిల్ వైఎస్సార్సీపీ తరఫున చురుగ్గా పనిచేసేవాడు. అతడిపై కొందరు టీడీపీ నాయకులు అక్కసు పెంచుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇస్మాయిల్ గ్రామం వదలి వేరేచోట తలదాచుకున్నాడు. పది రోజుల క్రితం గ్రామానికి తిరిగొచ్చాడు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు గ్రామానికి చెందిన యువతిపై ఇస్మాయిల్ దాడి చేశాడంటూ అనంతపురం పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి వేళ టీడీపీకి చెందిన దాసరి అనిల్, దాసరి ఈశ్వరయ్య, మిలటరీ ఈశ్వరయ్య, దాసరి నీరజ ద్విచక్ర వాహనాలపై వచ్చి రహమత్బీ ఇంట్లోకి చొరబడ్డారు.బూతులు తిడుతూ ఆమెతో పాటు కులసింబీ, అమనాబీలపై చెప్పులతో దాడి చేశారు. మెడలో ఉన్న నల్లపూసల దండలు తెంచేశారు. ఊరు వదిలి వెళ్లిపోవాలని, లేకుంటే అంతు చూస్తామని బెదిరించారు. ఈ ఘటనపై సోమవారం ఉదయం ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళుతుండగా మాపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ మరోసారి దాడి చేశారు. -
విద్యుత్ షాక్‌కు నలుగురు యువకులు బలి
ఉండ్రాజవరం: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై నలుగురు యువకులు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణపై స్థానికంగా రెండు సామాజికవర్గాల మధ్య 18 నెలలుగా వివాదం నెలకొంది. కలెక్టర్, ఆర్డీవో వంటి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇటీవల వివాదాన్ని పరిష్కరించారు. ఈ నేపథ్యంలో సోమవారం గౌడ సామాజికవర్గం వారు పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు, అన్నసమారాధనకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం తెల్లవారుజామున కొందరు యువకులు 25 అడుగుల భారీ ఫ్లెక్సీ కడుతుండగా వారికి 11కేవీ విద్యుత్ వైరు తగిలింది. తీవ్ర విద్యుదాఘాతానికి గురై బొల్లా వీర్రాజు (25), కాసగాని కృష్ణ (23), పామర్తి నాగేంద్ర (25), మారిశెట్టి మణికంఠ (29) అక్కడికక్కడే మృతిచెందారు. కోమటి అనంతరావు అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతిచెందినవారిలో కాసగాని కృష్ణకు పెళ్లి కాగా, మిగిలిన ముగ్గురు అవివాహితులు. తీవ్రంగా గాయపడిన కోమటి అనంతరావును తొలుత పశి్చమ గోదావరి జిల్లా తణుకు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ యువకులు అందరూ కొబ్బరి ఒలుపు కారి్మకులుగా, వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనతో తాడిపర్రు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. -
మరో బాలికపై అఘాయిత్యం!
సాక్షి టాస్క్‌ఫోర్స్, తిరుపతి: తిరుపతి జిల్లాలో మూడున్నరేళ్ల బాలికపై హత్యాచార ఘటనను మరువకముందే.. సోమవారం మరో బాలికపై దారుణం చోటుచేసుకుంది. గాయాల పాలై ముళ్లపొదల్లో అపస్మారక స్థితిలో మూలుగుతున్న బాలికను గుర్తించిన తండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం యల్లమంద దళితవాడకు చెందిన 14 ఏళ్ల బాలిక సమీపంలోని జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఎప్పటిలా సోమవారం పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం అవుతున్నా.. ఇంటికి రాకపోవటంతో బాలిక తండ్రి కంగారుపడి పాఠశాలకు వెళ్లాడు. బాలిక పాఠశాలలో లేకపోవటంతో వెతకటం ప్రారంభించాడు. గ్రామానికి సమీపంలోని ముళ్లపొదల్లోంచి మూలుగు వినిపించడంతో లోనికి వెళ్లి చూశాడు. బాలిక తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసి చలించిపోయాడు. అక్కడే సపర్యలు చేసి ఏం జరిగిందని బాలికను ఆరా తీశాడు.పొట్టపై తన్ని.. చాకుతో దాడిపాఠశాల ముగిసిన తరువాత బాలిక నడచుకుంటూ ఇంటికి బయలుదేరింది. వెనుకవైపు నుంచి పల్సర్ బైక్‌పై మాస్క్‌లు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు బాలికను అడ్డగించారు. వెంటతెచ్చుకున్న మత్తు మాత్రలను నీళ్లలో కలిపి తాగమని బాలికను బలవంతం చేశారు. అందుకు నిరాకరించడంతో ఇద్దరు దుండగులు కాలితో ఆమె పొట్టపై తన్నారు. ఆపై చాకుతో దాడిచేసి బలవంతంగా మత్తు మందు కలిపిన నీటిని తాగించారు. అనంతరం ఎవరికో వీడియో కాల్చేసి.. ఈ అమ్మాయేనా? కాదా? అని అడిగి తెలుసుకున్నారు. తరువాత ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు. మత్తు మందు తాగించాక గంటకుపైగా బాలిక స్పృహలో లేదు. స్థానికుల సహాయంతో బాలికను ఆమె తండ్రి యల్లమంద పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాలికను పోలీసులు జీపులో పీలేరు ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. తండ్రిని సర్పంచ్ ఓబులేసు, వైఎస్సార్సీపీ నాయకుడు నాగార్జునరెడ్డి కారులో తీసుకుని పోలీసు వాహనాన్ని వెంబడించారు.కేసులో అనేక సందిగ్ధాలు: ఎస్పీ కార్యాలయంయర్రావారిపాలెం మండలం యల్లమంద గ్రామంలో బాలికపై అత్యాచారం జరిగినట్టు ప్రచారం ప్రచారం చేస్తున్నారని.. దీనిపై యర్రావారిపాలెం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారని తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. విచారణలో అనేక సందిగ్ధాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపింది. అయితే, విచారణ పూర్తికాకముందే కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని, కేసు నమోదు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో పేర్కొంది.ఆ దుండగుల్ని ఉరి తీయాలిబాలికపై చాకుతో దాడిచేసి.. మత్తు మందు కలిపిన నీళ్లు తాగించి దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని బాలిక తండ్రి కోరారు. నిందితులిద్దరినీ పట్టుకుని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే తమకు న్యాయం జరుగుతుందని చెప్పారు.దోషులను శిక్షించే వరకు వదలం: చెవిరెడ్డిమైనర్ బాలికపై దారుణం జరిగిందన్న సమాచారం అందుకున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హుటాహుటిన యల్లమంద దళితవాడకు చేరుకున్నారు. అనంతరం బాలిక చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలికకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను కోరారు. దారుణ ఘటనకు కారుకులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులను శిక్షించే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
క్రాస్ వీల్ నుంచి పడి యువతి మృతి..
చంద్రగిరి(తిరుచానూరు): సరదాగా గడపాలని ఆటవిడుపు కోసం వచ్చిన మహిళా ప్రమాదవశాత్తు మృత్యు వాత పడగా, మరో మహిళా తీవ్ర గాయాలపాలైన ఘటన తిరుచానూ రు శిల్పారామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... తిరుపతి అర్బన్ మండలం సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన లోకేశ్వరి(22) తన స్నేహితురాలు గౌ తమి అలియాస్ పండుతో కలసి ఆటవిడుపు కోసం తిరుచానూరు సమీపంలోని శిల్పారామానికి చేరుకుంది. సుమారు గంట పాటు శిల్పారామంలో ప లు ప్రాంతాలను సందర్శించి, ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగా గడిపారు. ఈ క్రమంలో అక్కడే ఏర్పాటు చేసిన క్రాస్‌వీల్ ఎక్కారు. ఇద్దరు మహిళలు కూర్చుని తి రుగుతుండగా క్రాస్‌వీల్ ఉన్నట్టుండి విరిగి పడిపోయింది. ఈ ప్రమాదంలో లోకేశ్వరి, ఆమె స్నేహితురాలు గౌతమి గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే నిర్వాహుకులు తేరుకుని, 108కు సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలను ని ర్వహించిన వైద్యులు అప్పటికే లోకేశ్వరి మృతి చెందినట్లు నిర్ధారించగా, గౌతమి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం గౌతమిని తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.