-
చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు
సాక్షి, విజయవాడ: చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. పీసీ (ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు.. కేసులో ఏ3గా చంద్రబాబును చేర్చారు. ఎఫ్ఐఆర్ కాపీ పూర్తి వివరాల కోసం చదవండి చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు తెలిపారు. ఏసీబీ కోర్టులో కేసుకు సంబంధించి విచారణ జరపాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను ఏసీబీ కోర్టు అనుమతించింది. చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారు: ఏపీబీసీఎల్ ఎండీ మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చే అంశంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని ఏపీబీసీఎల్ ఎండీ పేర్కొన్నారు. రెండు బేవరేజ్‌లు, మూడు డిస్ట్రిలరీల కోసం 2012లో మద్యం పాలసీనే మార్చేశారు. 2015లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వానికి పన్నులు రాకుండా చేశారు. 8 శాతం వ్యాట్ కాకుండా 6 శాతం పన్నులు తీసేశారని APBCL ఎండీ ఫిర్యాదులో పేర్కొన్నారు. మద్యం కంపెనీల అనుమతుల పూర్తి కథేంటీ? 40 ఏళ్ల అనుభవం అంటూ తరచుగా చెప్పుకునే చంద్రబాబు.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం విధానంలో కొత్త ఒరవడులు తెచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీలకుగానూ ఏకంగా 14 డిస్టీలరీలకు అనుమతి ఇచ్చింది చంద్రబాబే. లిక్కర్లో చంద్రబాబు తెచ్చిన బ్రాండ్లు వినూత్నం, విశేషం. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్, భూంభూం బీర్, పవర్ స్టార్ 999, లెజెండ్.. ఇవన్నీ చంద్రన్న కానుకలే. ఆయన దిగిపోయే చివరి క్షణం వరకు లిక్కర్ బ్రాండ్లకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లు వచ్చాయి. బాబు హయాంలో మద్యం సిండికేట్లు రాజ్యమేలేవి. నలభైఐదు వేల బెల్టు షాపులతో మద్యాన్ని ఇంటింటికి సరఫరా చేసేవారు. ► చంద్రబాబు హయాంలోనే బూమ్ బూమ్ బీర్, ప్రెసిడెంట్స్ మెడల్, గవర్నర్స్ ఛాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, 999 లెజండ్, హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హేంగర్ లాంటి 254 బ్రాండ్లకు అనుమతులిచ్చారు. ఇలాంటి బ్రాండ్ల పేరుతో తన దగ్గరి నేత రుణం తీర్చుకున్నారు. ► SPY బ్రాండ్ ఎవరిదో అందరికీ తెలుసు. ఎస్పీవై రెడ్డి ఏ పార్టీలో ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే ► విశాఖ డిస్టిలరీకి 2019 ఫిబ్రవరి 25న అనుమతి ఇచ్చారు. అది టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి చెందిన కంపెనీ. చంద్రబాబు పాలన అయిపోగానే దాన్ని అమ్మేశారు. ► PMK డిస్టిలరీ పార్టీలోని ఓ సీనియర్ నేత వియ్యంకుడిందని తెలుగుదేశంలోనే ప్రచారం ఉంది ► శ్రీకృష్ణా డిస్టిలరీ కూడా రాయలసీమ టిడిపి నేతకు చెందినది ► 1982కి ముందు ఉన్నవి కేవలం ఐదు డిస్టిలరీలే. ఆ తర్వాతే మిగిలినవన్నీ వచ్చాయి. యాజమాన్యం మారిన రెండు కంపెనీలతో కలిపి చంద్రబాబు హయాంలో అనుమతి ఇచ్చినవి మొత్తం 14. ► చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 7 డిస్టిలరీలకు కు అనుమతి ఇచ్చారు. ఐదేళ్లలో 254 బ్రాండ్లు, ఏడు డిస్టిల్లరీలకు అనుమతి ఇచ్చి లిక్కర్ విక్రయాలను ప్రోత్సహించారు ► ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూడీలక్స్ బ్రాండ్ల విస్కీకి చంద్రబాబు సీఎంగా ఉండగానే 2017 నవంబరు 22న అనుమతిచ్చారు. ► గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ, బ్రాందీ తదితర 15 బ్రాండ్లకు కూడా టీడీపీ ప్రభుత్వమే 2018 అక్టోబరు 26న ఒకేసారి అనుమతులిచ్చింది. ► హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్లతో బీరు విక్రయాలు సైతం చంద్రబాబు నిర్వాకమే. ఆ బ్రాండ్లకు టీడీపీ ప్రభుత్వం 2017 జూన్ 7న అనుమతి జారీచేసింది. ► రాయల్ ప్యాలెస్, న్యూకింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు కూడా చంద్రబాబే 2018 నవంబరు 9న అనుమతిచ్చారు. ► బిరా 91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు అనుమతులు పదవి నుంచి దిగిపోయే కొద్ది ముందు ఇచ్చారు. ► టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకూ టీడీపీ సర్కారే అనుమతి ఇచ్చింది. -
Oct 30th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Arrest, Remand, Cases, Petitions, Court Hearings And Political Updates 18:24 PM, అక్టోబర్ 30, 2023 Big Breaking : చంద్రబాబుపై మరో కేసు నమోదు ► విజయవాడ : చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన CID ► గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన CID ► అవినీతి నిరోధక చట్టం కింద ( ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) చంద్రబాబుపై కేసు ► మద్యం కంపెనీలకు అక్రమ అనుమతుల కేసులో A-3 గా చంద్రబాబు ► చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని ACB కోర్టుకు తెలిపిన సిఐడి అధికారులు ► ACB కోర్టులో కేసుకు సంబంధించి పిటిషన్ దాఖలు ► పిటిషన్ ను అనుమతించిన ACB కోర్టు ► కేసుకు FIR నంబర్ - 18/2023 కేటాయింపు 17:48 PM, అక్టోబర్ 30, 2023 చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు దుష్ప్రచారం: సజ్జల ►టీడీపీ డ్రామాలు ప్రజలు పట్టించుకోవడం లేదు ►చంద్రబాబు అరెస్ట్ భావోద్వేగానికి అవకాశం ఉండే అంశం కాదు ►ప్రాథమిక ఆధారాలున్నాయి కాబట్టే కోర్టు రిమాండ్‌కు పంపింది ►స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు ►సీఎం జగన్‌పై తప్పుడు కేసులు పెట్టినప్పుడు న్యాయపరంగానే పోరాడాం ►ప్రజాకోర్టులో సీఎం జగన్ తిరుగులేని విజయం సాధించారు ►2019లో 151 సీట్లలో గెలిచి అధికారంలోకి వచ్చారు ►చంద్రబాబు జైలులో ఉండటం దారుణం అన్న రీతిలో టీడీపీ వ్యవహరిస్తోంది ►వేర్వేరు కారణాలతో చనిపోయినా చంద్రబాబు కోసమే మృతిచెందినట్టు ప్రచారం చేస్తున్నారు ►టీడీపీ స్టేక్ హోల్డర్స్ అంతా కలిసి నిన్న హైదరాబాద్‌లో ఈవెంట్ చేశారు ►ప్రజలు ఏమనుకుంటారో అన్న జ్ఞానం కూడా లేదు ►ఏదో మ్యూజికల్ ఈవెంట్‌కు రిహార్సల్ చేసినట్లు ప్రదర్శన చేశారు ►స్కిల్ స్కామ్ కేసు గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు ►టీడీపీ ఎవరి పార్టీ అన్నది గచ్చిబౌలీ ఈవెంట్‌తో అందరికీ తెలిసింది 16:45 PM, అక్టోబర్ 30, 2023 ప్రచారం ఎక్కువ.. బాబు చేసింది తక్కువ : మల్లాది విష్ణు ► విజయవాడ : చంద్రబాబు ముద్దాయిగా జైల్లో ఉంటే టీడీపీ నేతలు దుర్మార్గపు రాజకీయలు చేస్తున్నారు ► చంద్రబాబు చేసిన అవినీతి కుంభకోణాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు ► హైటెక్ సిటీ ని ప్రారంభించింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ► ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది దివంగత మహానేత వైఎస్ఆర్ ► కులాల పేరుతో సమాజాన్ని విడదీయడం చాలా పెద్ద నేరం ► మా కులం వాడే అని టిడిపి నేతలు సర్ది చెప్పుకోవడం దారుణం ► సమాజంలో అందరూ బాగుండాలి అందరికీ మేలు జరగాలని సిద్ధాంతం వైఎస్ఆర్సిపి పార్టీది ► మంత్రి అంబటి రాంబాబు పై దాడి హేయం. ► స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం , ఇన్సైడ్ ట్రేడ్ కుంభకోణం, అస్సైన్డ్ భూములు కుంభకోణాలలో తప్పు చేయలేదని కోర్టు ముందుకొచ్చి ధైర్యంగా చెప్పగలరా.? ► చంద్రబాబు కులానికి సంబంధించిన మద్దతుదారులు దీనికి సమాధానం చెప్పాలి 16:23 PM, అక్టోబర్ 30, 2023 బాబు, బాలకృష్ణ, భువనేశ్వరీ.. అంతా వెన్నుపోటులో భాగమే : డిప్యూటీ సీఎం నారాయణస్వామి ► చంద్రబాబు డైరెక్షన్ లో సోనియా గాంధీ నాడు నడిచారు, వైఎస్ జగన్‌పై నాడు కేసులు పెట్టించారు ► పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు ► బాలకృష్ణ, భువనేశ్వరి తో పాటు నందమూరి కుటుంబాన్ని బాబు మోసం చేసారు ► నిజాలు రాయడాన్ని ఎల్లోమీడియా ఎప్పుడో మరిచిపోయింది ► చంద్రబాబు తప్పులు, అవినీతి పై వార్తలు రాసే దమ్ము వాళ్ళకి ఉందా? ► నిజం గెలిచింది కాబట్టే.. చంద్రబాబు జైలులో ఉన్నాడు.. ► ఏది నిజమో.. ఏది అబద్దమో భువనేశ్వరి తెలుసుకుని.. ప్రజలకు చెప్పాలి 16:12 PM, అక్టోబర్ 30, 2023 బీసీలకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర బాబుదే : మంత్రి కారుమూరి ► ఏలూరులో మంత్రి కారుమూరి నాగేశ్వరావు ప్రెస్ మీట్ ► దాచుకుని దోచుకుని పంచుకున్నారు కాబట్టి చంద్రబాబు జైలుకు వెళ్లారు ► బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు ► కాసాని జ్ఞానేశ్వర్ అనే వ్యక్తిని తెలంగాణలో వందల కోట్లు ఖర్చుపెట్టించి చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలిపాడు ► కాసాని జ్ఞానేశ్వర్‌ను ఖర్చు పెట్టించి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు ► ఇప్పుడు తీరా ఎన్నికల సమయంలో తెలంగాణలో చేతులెత్తేసిన వ్యక్తి చంద్రబాబు ► హైదరాబాదులో చంద్రబాబు సామాజిక వర్గం వారే సమావేశం పెట్టారు ► పేదల ఉద్యోగాలు కబ్జా చేసి వారి సామాజిక వర్గానికి ఇవ్వబట్టే అంతమంది వచ్చారు 16:02 PM, అక్టోబర్ 30, 2023 భువనేశ్వరీ నిజం గురించి మట్లాడడం హస్యాస్పదం : మంత్రి కొట్టు సత్యనారాయణ ► నిజం గెలవాలని భువనేశ్వరి అనడం హాస్యాస్పదంగా ఉంది ► భువనేశ్వరి నిజం గెలవాలని బస్సు యాత్ర అంటున్నారు... ► ఇది న్యాయస్థానాన్ని తప్పు పట్టేట్లుగా ఉంది ► చంద్రబాబును జైల్లో పెడితే ప్రజలు ఎవరైనా బాధపడ్డారా? ► లోకేష్ వల్లే చంద్రబాబుకు ప్రాణహాని ఉంది ► జనసేన-టీడీపీ కూటమి ఎన్నికల లోపు ఎన్ని ముక్కలు అవుతుందో చూడండి ► సీటు ఎవరికి ఇస్తారో తెలియక టీడీపీ, జనసేన నేతలు మదన పడిపోతున్నారు ► పవన్ తన ఆర్థిక లాభం కోసం బాబు కాళ్లు పట్టుకున్నారు ► దీనికి కాపు సామాజిక వర్గం సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది 15:42 PM, అక్టోబర్ 30, 2023 స్కిల్ స్కాంలో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్ ► ఏపీ హైకోర్టులో టీడీపీ నేతల పిటిషన్ పై విచారణ వాయిదా ► విచారణ వచ్చే నెల 16కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ► గత ప్రభుత్వ నిర్ణయాల పునఃసమీక్షకు ప్రభుత్వం వేసిన సిట్, కేబినెట్ సబ్ కమిటీని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ ► 1411 జీవో, 344 జీవోను సవాల్ చేస్తూ పిటిషన్లు 15:42 PM, అక్టోబర్ 30, 2023 స్కిల్ స్కాంలో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్ ►బాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు ►బాబు మధ్యంతర బెయిల్‌పై రేపు తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు ►కంటి ఆపరేషన్ కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ ►చంద్రబాబు తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు ►చంద్రబాబు తరపున వర్చువల్‌గా వాదనలు వినిపించిన సిద్ధార్థ్ లూథ్రా ►రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై తమ వాదనలు వినిపించేందుకు సమయం కావాలన్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి 13:17 PM, అక్టోబర్ 30, 2023 చంద్రబాబు పిటిషన్ల విచారణకు లంచ్ బ్రేక్ ►చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు ►బాబు తరఫున వాదనలు వినిపించిన దమ్మాలపాటి శ్రీనివాస్, లూథ్రాలు ►చంద్రబాబు ఆరోగ్య రిత్యా బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి ►చంద్రబాబు రెండో కంటికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంది ►మధ్యాహ్నానికి విచారణ వాయిదా ►లంచ్ బ్రేక్ తర్వాత కొనసాగనున్న వాదనలు 13:01 PM, అక్టోబర్ 30, 2023 భువనేశ్వరి అలా ఒప్పుకున్నట్లేనా?: మంత్రి సత్యనారాయణ ►నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో యాత్ర ►అబద్ధాలతో నిజం గెలవాలని అనడం హాస్యాస్పదం ►న్యాయస్థానాన్ని తప్పు పట్టేట్లుగా భువనేశ్వరి తీరు ►నాడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి.. కుంగిపోయి చనిపోయేలా చేసిన చంద్రబాబు ►సొంత తండ్రికి అంత జరిగినా స్పందించని భువనేశ్వరి ►ఇవాళ చంద్రబాబు జైలుకు వెళ్తే భువనేశ్వరి పోరాటమా? ►చంద్రబాబుని జైల్లో పెడితే ప్రజలు ఎవరైనా బాధపడ్డారా? ►చంద్రబాబు నాయుడు కరెక్ట్, ఎన్టీఆర్ గారిదే తప్పు అనేది పోనీ భువనేశ్వరి గారు చెప్పగలరా? ►లోకేష్ వల్లే చంద్రబాబుకి ప్రాణహాని ►టీడీపీ-జనసేన పొత్తు.. రెండు అక్రమ పార్టీల కలయిక ►పశ్చిమ గోదావరిలో రెండు పార్టీల మధ్య సీటు కొట్లాట ►ఆర్థిక లాభం కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్న పవన్ ►కాపు సామాజిక వర్గం సిగ్గుపడేలా పవన్ తీరు ►ఎన్నికలోపు జనసేన-టీడీపీ కూటమి.. ముక్కలు ముక్కలు ►తాడేపల్లిగూడెంలో ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కామెంట్స్ 12:52 PM, అక్టోబర్ 30, 2023 కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాదనలు ►చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు ►మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్ వాదనలు ►చంద్రబాబు వయసు, ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ విజ్ఞప్తి పరిశీలించండి ►కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు ►కాబట్టి బెయిల్ ఇప్పించండి ►కోర్టులో చంద్రబాబు నాయుడి తరఫు లాయర్ల వాదనలు 12:07 PM, అక్టోబర్ 30, 2023 ఏపీ హైకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ ►చంద్రబాబు రెగ్యులర్, ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ ►కంటి ఆపరేషన్ కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ ►చంద్రబాబు తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు ►చంద్రబాబు తరపున వర్చువల్‌గా వాదనలు వినిపిస్తున్న సిద్ధార్థ్ లూథ్రా 11:28 AM, అక్టోబర్ 30, 2023 ఏపీ హైకోర్టులో బాబు పిటిషన్లపై విచారణ ప్రారంభం ►స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►ఏసీబీ కోర్టులో బెయిల్ నిరాకరణ ►హైకోర్టులో పిటిషన్లు వేసిన చంద్రబాబు లాయర్లు ►బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై కాసేపటి కిందట ప్రారంభమైన విచారణ 11:25 AM, అక్టోబర్ 30, 2023 జనసేన వద్దు బాబోయ్: బీజేపీ కార్యకర్తలు ►తెలంగాణ బీజేపీ రాష్ట్ర నేతల తీరుపై పార్టీ కేడర్ ఆగ్రహం ►సోమవారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ►జనసేన వద్దు బాబోయ్ అంటున్న కార్యకర్తలు ►ఏ ప్రాతిపదికన.. పొత్తులో భాగంగా సీట్లు ఇస్తారని ప్రశ్న ►జనంలేని జనసేతో పొత్తు అవసరమా? అని అభ్యంతరం ►నిన్న శేరిలింగంపల్లి సీటు ఇవ్వొద్దంటూ కార్యకర్తల నిరసన ►ఇవాళ బీజేపీ కార్యాలయం వద్ద కూకట్పల్లి బీజేపీ కార్యకర్తల ఆందోళన ►కూకట్పల్లి సీటు జనసేనకు ఇవ్వొద్దని నినాదాలు 11:18 AM, అక్టోబర్ 30, 2023 పవన్ కల్యాణ్.. పీకే కాదు కేకే మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ ►టీడీపీని కమ్మ వాళ్లే నాశనం చేస్తున్నారు ►అంత బలంగా ఉంటే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా.. ►అసెంబ్లీలో నేను భువనేశ్వరిని తప్పుగా మాట్లాడలేదు ►భువనేశ్వరి గురించి మాట్లాడింది ఆ సామాజిక వర్గం లీడరే ►పవన్ కళ్యాణ్ PK కాదు.. KK ►పవన్ కిరాయి కోటి గాడు ( KK ) ►కిరాయి తీసుకుంటాడు కాబట్టే కాపులపై జరిగిన దాడుల్ని ఖండించడు ►ముద్రగడ మీద దాడి జరిగినప్పుడు కనీసం ఖండించాడా? ►ప్రగల్భాలు పలికే పవన్.. చంద్రబాబును ఏదైనా అంటే మాత్రం రోడ్డు మీద పడుకుంటాడు 10:32 AM, అక్టోబర్ 30, 2023 నారా లోకేష్‌కు కౌంటర్లు ►ఏపీ ప్రభుత్వం వ్యవస్థల్ని మేనేజ్ చేస్తోందంటూ లోకేష్ వ్యాఖ్యలు ►న్యాయ వ్యవస్థను కించపర్చడమేనంటున్న నేతలు ►స్కిల్ స్కామ్‌లో.. ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో నోట్‌ఫైల్స్‌పై చంద్రబాబు సంతకం ►మొత్తం 13 నోట్ ఫైళ్లపై సంతకం ►సీమెన్స్ తిరుగులేని సాక్ష్యం ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టుకు, తమకు సంబంధం లేదంటూ ఈ-మెయిల్ పంపిన సీమెన్స్ ►స్కిల్ స్కామ్‌లో నలుగుర్ని అరెస్ట్ చేసినట్లు ఈడీ ప్రకటన ►మరోవైపు చంద్రబాబుకు ఐటీ నోటీసులు ►వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబే దిట్ట అంటూ లోకేష్‌కు కౌంటర్లు 09:55 AM, అక్టోబర్ 30, 2023 చెప్పేవన్నీ అబద్దాలే! ►పదుల కొద్దీ పిటిషన్లతో కోర్టులను పరీక్షిస్తోన్న బాబు లాయర్లు ►ఎన్నికల వేళ సానుభూతి కోసం కుటుంబ సభ్యుల నానా పాట్లు ►పేరుకు నిజం గెలవాలి.. చెప్పేవన్నీ అబద్దాలు ►తెలంగాణ బరి నుంచి ఓటమి భయంతో తప్పుకున్న తెలుగుదేశం.! ►చంద్రబాబుకు లేని రోగాలను అంటగడుతూ సానుభూతి కోసం ప్రయత్నాలు 08:59 AM, అక్టోబర్ 30, 2023 .@pawankalyan రాజకీయాలకు కాదు.. సినిమాలకు మాత్రమే పనికి వస్తాడు. ఆయన పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు.. కనీసం పార్టీ జెండా మోసే వాళ్లు కూడా లేరు. అలాంటివాళ్లు పొత్తులతో కలిసి వచ్చినా సీఎం @ysjagan కు వచ్చే నష్టమేమీ లేదు. - ఓ సామాన్యుడి అభిప్రాయం#PublicVoice#CMYSJagan… pic.twitter.com/O71XUOSb8s — YSR Congress Party (@YSRCParty) October 30, 2023 08:39 AM, అక్టోబర్ 30, 2023 మారని చంద్రబాబు, తెలుగుదేశం తీరు ►అధినేత చంద్రబాబు నాయుడు బాటలోనే టీడీపీ శ్రేణుల దిగజారుడు రాజకీయాలు ►సెంట్రల్ జైల్ కేంద్రంగా చంద్రబాబు రాజకీయ మంతనాలు ►జైల్లో ఉన్నా మారని చంద్రబాబు, తెలుగుదేశం తీరు ►చంద్రబాబు బహిరంగ లేఖ పేరిట తప్పుడు ప్రచారం ►పదుల సంఖ్యలో చంద్రబాబు కోసం పిటిషన్లతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం ►ఒక పక్క లోకేష్‌ను, మరో పక్క భువనేశ్వరీని రంగంలోకి దించుతున్న బాబు ►సానుభూతి కోసం సర్వప్రయత్నాలు చేస్తోన్న చంద్రబాబు ►చంద్రబాబు జైల్లో ఉండడంతో నిస్తేజంగా మారిన తెలుగుదేశం 08:27 AM, అక్టోబర్ 30, 2023 టీడీపీ లేకుంటే నా వల్ల కాదు! ►తెలంగాణ ఎన్నికల వేళ ఇటలీకి జంప్ అయిన పవన్..!! ►అమిత్ షాను కలిసినా.. టీడీపీతో పొత్తు కుదరకపోవడంతో నైరాశ్యంలో పవన్? ►తెలంగాణలో బీజేపీతో పొత్తు అంటూనే.. ఇటలీకి జంప్ అయిన పవన్ ►తిరుపతి ఉప ఎన్నికల వేళ ఫాం హౌజ్‌కు పరిమితమైన పవన్ ►తెలంగాణ ఎన్నికల వేళ ఇప్పుడు ఇటలీకి.. ►తెలుగుదేశంతో పొత్తు లేకుంటే తాను సహకరించబోనని బీజేపీకి సంకేతాలిస్తున్న పవన్ 07:55 AM, అక్టోబర్ 30, 2023 ఇవాళ్టి సుప్రీం జాబితాలోని బాబు కేసు ►సుప్రీంకోర్టులో ఇవాళ్టి కేసుల జాబితా విడుదల ►జాబితాలో లేని చంద్రబాబు కేసు ►అయోమయంలో యెల్లో మీడియా కథనాలు! ►నవంబర్ 8న క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెల్లడిస్తామని ఇది వరకే ప్రకటించిన కోర్టు ►ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్‌పై నవంబర్ 9కి విచారణ వాయిదా ►17a కేసు, ఫైబర్ నెట్ కేసు ఒకేసారి పరిశీలించే అవకాశం 07:55 AM, అక్టోబర్ 30, 2023 చంద్రబాబు, లోకేష్‌లపై టీటీడీపీ ఆగ్రహం ►టీ - టీడీపీ ఏకగ్రీవ తీర్మానం ►తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలని టీడీపీ తీర్మానం ►తీర్మానాన్ని చంద్రబాబుకు పంపనున్న కాసాని జ్ఞానేశ్వర్ ►చంద్రబాబు, లోకేష్ నిర్ణయంపై తెలంగాణ టీడీపీ తీవ్ర ఆగ్రహం ►వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెట్టొద్దని అంతర్గతంగా చర్చ ►ఈ కారణాలతో పోటీకి దూరంగా ఉంటున్నాము అని ప్రజలకు ఎలా చెబుతామని ఆందోళన ►ఇప్పుడు పోటీ చేయకపోతే తెలంగాణలో ఇక పార్టీ కార్యాలయం మూసుకున్నట్టేనని ఆవేదన ►కేవలం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేందుకే పోటీ నుంచి తప్పుకున్నామన్న కారణం కనిపిస్తోందంటున్న పార్టీ సీనియర్లు 07:34 AM, అక్టోబర్ 30, 2023 ఏపీ హైకోర్టు రోస్టర్‌లో మార్పులు ►ఏపీ హైకోర్టు రోస్టర్‌లో సమూల మార్పులు ►కొత్త జడ్డీల రాకతో మార్పులు చేసిన సీజే ►జస్టిస్ మల్లికార్జునరావుకు బెయిల్ పిటిషన్ల విచారణ ►ప్రజా ప్రతినిధుల కేసులు కూడా మల్లికార్జునకే! ►నేడు చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై సోమవారం విచారణ 07:32 AM, అక్టోబర్ 30, 2023 ఎరైటీ తమ్ముళ్లు.. జనం నవ్వులు ►చంద్రబాబు అరెస్టుకు నిరసనగా వెరైటీగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న టీడీపీ ►చంద్రబాబు అరెస్టును ఏమాత్రం పట్టించుకోని సాధారణ జనం ►అయినా తమ్ముళ్ల ఎరైటీ నిరసనలు ►పల్లెం కొట్టడం, కొవ్వొత్తి వెలిగించడం, చేతులకు సంకెళ్లు, మరికొన్ని చోట్ల వేడుకలు ►చేపట్టిన ప్రతీ కార్యక్రమం అట్టర్ ప్లాప్ ►తాజాగా.. కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమానికి అదే రీతిలో స్పందన ►కనీసం క్యాంప్ కార్యాలయం వద్ద కూడా నిరసన కార్యక్రమం నిర్వహించని టీడీపీ శ్రేణులు 07:19 AM, అక్టోబర్ 30, 2023 చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ ►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు ►నేడు విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు సీజే బెంచ్ ►తన బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ జ్యోతిర్మయి విచారణ చేయకుండా అడ్డుకునే ఎత్తుగడ ►పార్టీతో, లీగల్ సెల్‌తో సంబంధం లేని మూర్తితో కన్సెంట్ వకాలత్ దాఖలు ►మూర్తి వెనుక ఓ ఎల్లో మీడియా చానెల్ ఓనర్, ఒక విశ్రాంత న్యాయమూర్తి ►నిబంధనల ప్రకారం నడుచుకునే జడ్జిగా జస్టిస్ జ్యోతిర్మయికి పేరు ►మూర్తి సతీమణి తనకు తెలిసి ఉండటంతో నైతిక విలువలకు లోబడి విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ►అందుకే ఆమె ముందు నాట్ బిఫోర్ అస్త్రం ►ఆమె నైతిక విలువలనే అవకాశంగా మలుచుకున్న చంద్రబాబు ►ఆమె తప్పుకుంటే ఆయన వ్యాజ్యాలు జస్టిస్ నిమ్మగడ్డ, జస్టిస్ అడుసుమిల్లి ముందుకు వెళ్లేలా ప్లాన్ ►అయితే ఊహించని విధంగా ఉత్తర్వులు జారీ చేసిన జస్టిస్ జ్యోతిర్మయి ►ఈ కేసును సీజే ముందుంచాలని ఆదేశం ►దీంతో కంగుతిన్న చంద్రబాబు న్యాయవాదులు 07:15 AM, అక్టోబర్ 30, 2023 వివిధ కోర్టులో పెండింగ్‌లో బాబు పిటిషన్లు ►ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డింగ్‌ల పిటిషన్ ► స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటాను భద్రపర్చాలని, అరెస్ట్ వెనుక కుట్ర ఉందని చంద్రబాబు లాయర్ల వాదన ►డేటా భద్రపర్చడం అంటే.. బహిర్గత పర్చడమే!. అది అధికారుల వ్యక్తిగత భద్రతకు మంచిది కాదని సీఐడీ తరపు న్యాయవాదుల వాదన ►వాదనలు పూర్తి కావడంతో అక్టోబర్ 31కి తీర్పు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►స్కిల్ స్కామ్‌లో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►విచారణ నుంచి తప్పుకుని సీజే బెంచ్‌కు రిఫర్ చేసిన న్యాయమూర్తి ► నేడు అక్టోబర్ 30(సోమవారం) విచారణ ►ఏపీ హైకోర్టులో ఇన్నర్‌రింగ్‌రోడ్డు కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా ►ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు ►సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8వ తేదీన ►సుప్రీంలో నవంబర్ 9వ తేదీన ఫైబర్‌నెట్ స్కామ్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై వేసిన సీఐడీ ►విచారణను ఏసీబీ కోర్టు నవంబర్ 10కి వాయిదా 07:12 AM, అక్టోబర్ 30, 2023 జైల్లో బాబు.. సానుభూతి కోసం కుటుంబ సభ్యులు ►పదుల కొద్ది పిటిషన్లతో కోర్టులను పరీక్షిస్తోన్న బాబు లాయర్లు ►ముందు క్వాష్, తర్వాత బెయిల్, ఆ తర్వాత ఏసీ, మళ్లీ వైద్యం, ఆ తర్వాత కాల్ డాటా ►చేతిలో లాయర్లున్నారన్న ధీమాతో కింది నుంచి పైదాకా అన్నికోర్టుల్లో పిటిషన్లు ►లేని భయాలు, సాకులు చూపుతూ ACB కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు మూడు పేజీల లేఖ ►ఎన్నికల వేళ సానుభూతి కోసం కుటుంబ సభ్యుల నానా పాట్లు ►పేరుకు నిజం గెలవాలి.. చెప్పేవన్నీ అబద్దాలు 07:00 AM, అక్టోబర్ 30, 2023 జైల్లో చంద్రబాబు @51వ రోజు ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ►సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం నంద్యాలలో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.371 కోట్లు సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారని అభియోగం ►ఆధారాలతో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ ►అరెస్ట్ సమయం నుంచి మొదలైన డ్రామా ►రిమాండ్ విధించిన విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం (ఏసీబీ కోర్టు) ►ఇప్పటిదాకా ఐదుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు ► నవంబర్ 1 వరకు జైల్లోనే చంద్రబాబు ►రాజమండ్రి సెంట్రల్ జైలు 51వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది.. ఇంటి భోజనం.. టవర్ ఏసీ సదుపాయం ►చంద్రబాబుకు నిత్యం ఆరోగ్య పరీక్షలు, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ►జైలు, లోపల బయటా చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు -
విజయనగరం రైలు ప్రమాదం.. అప్డేట్స్
విజయనగరం రైలు ప్రమాద ఘటన.. సహాయక చర్యల అప్డేట్స్ విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఓ ప్యాసింజర్ రైలు.. ఆగి ఉన్న మరో ప్యాసింజర్ రైలును ఢీ కొట్టింది. ఆపై పక్క ట్రాక్‌లోని గూడ్సుపైకీ దూసుకెళ్లి మరింత బీభత్సం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, 54 మందికి గాయాల అయ్యాయని అధికారులు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతుండగా.. ఈ సాయంత్రం లోపే ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తి చేస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. 17:40 PM సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైంది?.. ట్వీట్ ద్వారా ప్రశ్నించిన సీఎం జగన్ ►రైళ్ల కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఎందుకు విఫలమైంది? ►ఉన్నతస్థాయి ఆడిట్ కమిటీ వేయాలని ప్రధానిని, రైల్వే మంత్రిని కోరిన సీఎం జగన్ ►దేశంలోని అన్ని మార్గాల్లోనూ ఆడిట్ జరగాల్సి ఉంది ►ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చూడాలి ►నిన్న జరిగిన రైలు ప్రమాదం తీవ్రంగా బాధించింది ►ప్రమాద ఘటన కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది ►బ్రేకింగ్, హెచ్చరిక వ్యవస్థలు ఎందుకు పనిచేయలేదు? The devastating train accident that occurred in Vijayanagaram district last night has caused me great pain. A running train collided with another stationed train, both of which were running in the same direction. This horrifying accident gives rise to certain obvious questions:… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 30, 2023 17:24 PM రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ ట్వీట్ ►విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. ►వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ►ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. ►వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. ►వారికి మంచి వైద్యం అందించాలి ► మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలి 16:06 PM సీఎం జగన్ ఏరియల్ వ్యూ ►విజయనగరం: ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ వ్యూ ►విజయనగరం నుంచి విశాఖ వెళ్తూ పరిశీలించిన సీఎం జగన్ 16:05 PM విజయనగరం ప్రమాదస్థలిలో ట్రాక్ టెస్టింగ్ సక్సెస్ ►పునరుద్ధరణ జరిగిన మార్గాల్లో విజయవంతంగా రైళ్లు నడిపిన అధికారులు ►డౌన్‌లైన్‌లో గూడ్స్.. అప్‌లైన్‌లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ పరిశీలన పూర్తి 14:22 PM విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం జగన్ ►ప్రమాద ఘటనకు సంబంధించిన ఫోటోలను పరిశీలించిన సీఎం ►అధికారుల నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం ►ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎం ►ప్రమాదంలో గాయపడిన చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్ ►రెండు వార్డుల్లో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరి దగ్గరకూ వెళ్లి పరామర్శించిన సీఎం ►వారి ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం 14:08 PM విజయనగరం చేరుకున్న సీఎం జగన్ ►విజయనగరం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సీఎం జగన్ ►విజయనగరం రైల్వే ప్రమాద ఘటన బాధితులకు కాసేపట్లో పరామర్శ ►ఆస్పత్రి బయట ప్రమాదానికి సంబంధించిన ఫొటోల ప్రదర్శన ►ఘటన గురించి సీఎం జగన్‌కు వివరిస్తున్న అధికారులు ►రైల్వే అధికారుల విజ్ఞప్తితో ఘటనా స్థలికి వెళ్లని సీఎం జగన్ ►నేరుగా ప్రమాద బాధితుల్ని పరామర్శించనున్న సీఎం జగన్ 13:23PM విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం జగన్ ►విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం జగన్ ►కాసేపట్లో విజయనగరం ప్రభుత్వాసుపత్రికి ►రైలు ప్రమాదంలో గాయపడిన బాధితులకు పరామర్శ 12:44PM బాధితుల బాధ్యత ప్రభుత్వానిదే: మంత్రి బొత్స ►రైలు ప్రమాద బాధితులకు ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేవరకు ప్రభుత్వం దే బాధ్యత ►విజయనగరం ప్రమాద ఘటన సహాయక చర్యలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందన ►బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది ►మృతులు కుటుంబాలకు రూ. 10లక్షల ఆర్థికసాయం ఇస్తాం ►తీవ్రంగా గాయపడిన వాళ్లకు రూ. 2లక్షలు ►సాధారణ గాయాలైనవాళ్లకు రూ. 50 వేల సాయం ►ఏపీ ప్రభుత్వ యంత్రాంగం సత్వరమే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది ►రైల్వే అధికార్ల సమన్వయంతో పనిచేస్తున్నాం ►ట్రాక్ పునః నిర్మాణ పనులు కాసేపట్లోనే పూర్తి అవుతాయి 12:30PM సీఎం జగన్ పర్యటనలో మార్పు ►సీఎం జగన్ విజయనగరం పర్యటనలో మార్పు ►కంటకాపల్లి ప్రమాద ఘటన స్థలం వద్ద పర్యటన రద్దు ►రైల్వే అధికారుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం ►ఘటనా స్ధలంలో ప్రమాదానికి గురైన బోగీల్ని తొలగిస్తున్న అధికారులు ►యుద్ద ప్రాతిపదినక ట్రాక్ పునురుద్ధరణ పనులు ►ముఖ్యమంత్రి ఘటనా స్ధలానికి వస్తే... ట్రాక్ పునరుద్ధరణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని వెల్లడి ►రైల్వే అధికారుల విజ్ఞప్తితో నేరుగా బాధితుల్ని పరామర్శించనున్న సీఎం జగన్ ►నేరుగా పోలీస్ శిక్షణ కళాశాల మైదానంలో వున్న హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్న సీఎం జగన్ ►ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులకు పరామర్శ :::జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి 12:18PM విజయనగరం బయల్దేరిన సీఎం జగన్ ►విజయనగరం బయలుదేరిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ►విశాఖకు.. అక్కడి నుంచి విజయనగరం ప్రమాద స్థలికి ►కాసేపట్లో రైలు ప్రమాద ఘటనా స్థలం పరిశీలన ►గాయపడిన వారిని పరామర్శించనున్న సీఎం జగన్ 12:05PM విజయవాడ డివిజన్లో హెల్ప్‌లైన్ డెస్క్ ►విజయవాడ రైల్వే జంక్షన్ పై రాయగడ రైలు ప్రమాద ప్రభావం ►విజయవాడ నుండి వెళ్ళే పలు రైళ్లు రద్దు ►విజయవాడ మీదుగా విశాఖ వెళ్లే రత్నాచల్, సింహాద్రి, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-పూరీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు ►27 రైళ్లు రద్దు, 28రైళ్ళను మళ్లించిన రైల్వే అధికారులు ►విజయవాడ రైల్వే జంక్షన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు ►ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్న హెల్ప్ డెస్క్ ►ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు ►అనకాపల్లి, తుని, సామర్లకోట, కాకినాడ టౌన్, రాజమండ్రి, నిడదవోలు, ఏలూరు, భీమవరం టౌన్, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరుకు సంబంధించి నెంబర్లు ►ప్రమాదానికి సంబంధించిన సమాచారం కోసం అయినా సంప్రదించవచ్చొన్న రైల్వే అధికారులు ►ఇప్పటివరకు తమవాళ్లు లేదా రైలు ప్రమాదంలో ఉన్నట్టు తమకి ఒక్క ఫోన్ ఫోన్ రాలేదంటున్న అధికారులు 11:48AM బాధితులకు మెరుగైన వైద్యం అందుతోంది: సీపీఎం రాఘవులు ►విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి లో రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన సీపీఎం నేత రాఘవులు ►గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందుతోంది.. వైద్యులకు అభినందనలు ►ఒడిశా బాలాసోర్ తరహా ఘటన మళ్లీ పునరావృతం అయ్యింది ►రైల్వే శాఖకు శిక్ష వేయాలి ►మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ 50 లక్షలు పరిహారం ఇవ్వాలి ►క్షతగాత్రులకు 25 లక్షలకు పరిహారం ఇవ్వాలి ►ఆదివారం కాకుండా మిగతా పని దినాల్లో అయితే వందల్లో చనిపోయే వారు ►రైల్వే సిగ్నలింగ్ లో లోపాలు వున్నాయి ►సిబ్బంది కొరత వలనే రైల్వే లో ప్రమాదాలు తరుచూ జరుగుతున్నాయి. 11:29AM కాసేపట్లో విజయనగరానికి సీఎం జగన్ ►కాసేపట్లో విజయనగరం పర్యటనకు సీఎం జగన్ ►విశాఖకు.. అక్కడి నుంచి కంటకాపల్లికి ►రైలు ప్రమాద ఘటనా స్థలం పరిశీలన ►చికిత్స పొందుతున్న వాళ్లకు పరామర్శ ►నేటి ఎస్.ఐ.పీ.బీ సమావేశం త్వరగా ముగించుకున్న సీఎం జగన్ ►పలు పెట్టుబడులు, వివిధ పరిశ్రమల ప్రోత్సాహకాలకు ఆమోదం 11:10AM విజయనగర ప్రమాదానికి మానవ తప్పిదమే కారణం: ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారి ►విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస (08532) రైలు ►వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ (08504) రైలు ►కంటకాపల్లి-అలమండ మధ్య నెమ్మదిగా వెళ్తున్న పలాస రైలును ఢీ కొట్టిన రాయగడ రైలు ►విజయనగర రైలు ప్రమాదం మానవ తప్పిదవల్లేనన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆఫీసర్ ►ప్రమాదంపై ఓ మీడియా ఛానెల్తోఈస్ట్ కోస్ట్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ విశ్వజిత్ సాహూ ►రాయగడ ప్యాసింజర్ రైలు లోకో పైలట్ వల్లే ప్రమాదం జరిగింది ►రెడ్ సిగ్నల్‌ను రాయగడ లోకో పైలట్ పట్టించుకోలేదు ►ఫలితంగానే ఘోర ప్రమాదం సంభవించిందన్న అధికారి సాహూ ►అయితే దర్యాప్తు తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని స్పష్టీకరణ ►ఈ ప్రమాదంలో రాయగడ రైలు లోకో పైలట్ రావు కూడా మృతి 10:26AM చురుగ్గా రైల్ ట్రాక్ పునఃనిర్మాణ పనులు ►విజయనగరం రైల్వే ప్రమాద ఘటనాస్థలంలో యుద్ధప్రాతిపాదికన చర్యలు ►140 టన్ ల బాహుబలి క్రేన్‌తో ధ్వంసమైన బోగీలు తొలగింపు ►ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ►ట్రాక్ పునఃనిర్మాణ పనులు, బాధితుల సౌకర్యాల పై ఘటనా స్థలం లో సమీక్ష చేసిన ఇంచార్జ్ మంత్రి బూడి ముత్యాల నాయుడు ప్రమాదంలో దెబ్బతిన్న విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేస్తున్న రైల్వే ఎలక్ట్రికల్ సిబ్బంది ►సహాయక చర్యల పై జిల్లా అధికార యంత్రాంగాన్ని అర్ధరాత్రే అప్రమత్తం చేసిన సీఎం జగన్ ►సీఎం ఆదేశాలతో ఘటనా స్థలం వద్ద 40 అంబులెన్సులులు సిద్దం ►గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించిన అధికార్లు ►మృత దేహాలను హుటాహుటిన గుర్తించి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ కి తరలింపు ►ప్రత్యేక వైద్యులను కేటాయించి త్వరితగతిన పోస్టుమార్టం ►బంధువులకు మృతదేహాలు అప్పగించి, వారి గ్రామాలకు ఉచిత రవాణా ఏర్పాటు ►వైద్య సేవలకు సంతృప్తి వ్యక్తం చేస్తున్న బాధితులు ►ఇవాళ మధ్యాన్నం విజయనగరానికి సీఎం జగన్ ►రైలు ప్రమాద ఘటనా స్థలం పరిశీలించి, క్షతగాత్రులకు పరామర్శ 10:23AM క్షతగాత్రులకు మెరుగైన చికిత్స ►రైలు ప్రమాదంలో సహాయ చర్యల్లో వెయ్యి మంది రైల్వే సిబ్బంది ►మంచినీరు మందులు... ఆహర పదార్థాలతో నిన్న రాత్రి.. ఈరోజు ఉదయం విశాఖ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు ►ఐదుగురు విశాఖ వాసులకు విజయనగరం జిజిహెచ్ లో చికిత్స ►విశాఖలోని అపోలో ఒకరు.. కింగ్ జార్జ్ ఆసుపత్రలో మరొకరికి వైద్యం 10:18AM నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి ►విజయనగరం రైలు ప్రమాదంపై నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి ►మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన భువనేశ్వరి 10:12AM రైలు ప్రమాద ఘటనపై రాహుల్ గాంధీ స్పందన ►విజయనగరం రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి ►ఫేస్బుక్లో పోస్ట్ ►మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ►క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన రాహుల్ గాంధీ 09:58AM విజయనగర ప్రమాదం.. రాజమండ్రి స్టేషన్లో హెల్ప్‌డెస్క్ ►విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదం ►రాజమండ్రి మెయిన్ రైల్వే స్టేషన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన రైల్వే అధికారులు ►రద్దయిన, మళ్లించిన రైళ్ళ వివరాలపై ప్రయాణికులకు సమాచారం ఇస్తున్న రైల్వే సిబ్బంది ►ప్రమాద ఘటనలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మృతులు గాని గాయపడిన వారిపై సమాచారం లేదని తెలిపిన రైల్వే అధికారులు 09:40AM విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాదంలో మృతుల పేర్లు రావు, రాయగడ ప్యాసింజర్ లోకో పైలట్, విశాఖపట్నం చింతల కృష్ణం నాయుడు పిల్ల నాగరాజు కంచుభరకి రవి (30), గోడికొమ్ము (గ్రామం), జామి (మండలం), విజయనగరం గిడిజాల లక్ష్మి (35), ఎస్పీ రామచంద్రాపురం, జీ సిగడాం మండలం, శ్రీకాకుళం కరణం అప్పలనాయుడు (45), కాపు సంబాం (గ్రామం), గరివిడి (మండలం), విజయనగరం చల్లా సతీష్ (32), ప్రదీప్ నగర్, విజయనగరం శ్రీనివాస్ టెంకల సుగుణమ్మ రెడ్డి ససీతంనాయుడు మజ్జి రాము ఎం. శ్రీనివాస్ విశాఖ-పలాస ప్యాసింజర్ రైలు గార్డు ►మరో మృతదేహాం గుర్తించాల్సి ఉంది ►త్వరగతిన విజయనగరం ప్రభుత్వాసుప్రతిలో మృతదేహాలకు పోస్ట్‌మార్టం 09:17AM ►విజయనగరం ఘోర రైలు ప్రమాదం.. 13కి చేరిన మృతుల సంఖ్య 09:04AM బాధితుల్ని తక్షణమే ఆదుకునేలా ఏపీ సర్కార్ చర్యలు ►విజయనగరం రైలు ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాల్ని సత్వరమే ఆదుకునేలా ఏపీ ప్రభుత్వం అన్ని రకాలచర్యలు ►క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ►మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం ప్రకటన ►మృతుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ 50వేల చొప్పున సహాయం ►తక్షణమే అందేలా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు ►బాధితులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలను కేంద్ర రైల్వే మంత్రికి ఫోన్లో వివరించిన సీఎం జగన్ 08:54AM ఘటనాస్థలానికి వెళ్లనున్న సీఎం జగన్ ►విజయనగరం జిల్లా కంటాకపల్లి వద్ద ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం ►ఘటన గురించి తెలియగానే సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి ►రైల్వే శాఖ మంత్రితోనూ ఫోన్లో మాట్లాడిన సీఎం జగన్ ►సీఎం జగన్ ఆదేశాలతో ఘటనాస్థలానికి వెళ్లిన మంత్రి బొత్స.. సహాయక చర్యల పర్యవేక్షణ ►నేడు ఘటనా స్థలానికి వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ►ప్రత్యేక విమానంలో విశాఖకు.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఘటనాస్థలానికి ►అనంతరం చికిత్స పొందుతున్న క్షతగాత్రులనూ పరామర్శించనున్న సీఎం జగన్ ►క్షతగాత్రుల్లో ఏపీ వాసులే అధికం 08:50AM రైలు ప్రమాదం రీత్యా పలు రైళ్ల రాకపోకలు మళ్లింపు ►చెన్నై-సంత్రగచి(22808) ఎక్స్‌ప్రెస్ ►హైదరాబాద్-షాలిమర్(18046) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ►త్రివేండ్రం-షాలిమర్(22641) ఎక్స్‌ప్రెస్ ►ఆగర్తల-బెంగళూరు(12504)ఎక్స్‌ప్రెస్ ►సంత్రగచీ-తిరుపతి(22855)ఎక్స్‌ప్రెస్ ►షాలీమర్-చెన్నై(12841) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ►ధన్‌బాద్-అలెప్పీ(13351) బొకరో ఎక్స్‌ప్రెస్ ►హతియా-బెంగళూరు(12835)ఎక్స్‌ప్రెస్ ►మంగళూరు-సంత్రగాచీ(22852) ఎక్స్‌ప్రెస్ ►బెంగళూరు-హౌరా(12246) దురంతో ఎక్స్‌ప్రెస్ ►బెంగళూరు-జశిద్ది(22305) ఎక్స్‌ప్రెస్ ►కన్యాకుమారి-హౌరా(22503) ఎక్స్‌ప్రెస్ ►చెన్నై-హౌరా(12840) ఎక్స్‌ప్రెస్ వాస్కోడిగామా-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ 08:35AM ఘటనా స్థలంలో ముమ్మురంగా సహాయ చర్యలు ►రైళ్ల రాకపోకల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికంగా కొనసాగుతున్న పనులు ►ప్రమాదానికి గురైన పలాస పాసింజర్ 11 భోగిలను అలమండ రైల్వే స్టేషన్ కు తరలించిన సిబ్బంది ►ప్రమాదానికి గురైన రాయగడ పాసింజర్ 9 బోగీలను కంటకాపల్లి రైల్వే స్టేషన్ కు తరలించిన రైల్వే సిబ్బంది ►వాల్తేరు రైల్వే డివిజనల్ మేనేజర్ ప్రకటన ►ఘటనా స్థలం నుంచి దూరంగా వెళ్లాలని.. రైల్వే పునరుద్ధరణ పనులకు ఆటంకం కలిగించవద్దని ప్రజలకు అధికారుల విజ్ఞప్తి 08:21AM కంటకాపల్లి - అలమండ మధ్య జరిగిన జరిగిన రైలు ప్రమాదంతో సోమవారం రద్దైన రైళ్ల వివరాలు ► కోర్బా - విశాఖపట్నం (18517) ఎక్స్‌ప్రెస్ ►పారాదీప్ - విశాఖపట్నం (22809) ఎక్స్‌ప్రెస్ ►రాయగడ - విశాఖపట్నం (08503)ప్యాసింజర్ స్పెషల్ ► పలాస - విశాఖపట్నం (08531) ప్యాసింజర్ స్పెషల్ ► విశాఖపట్నం - గునుపుర్ (08522)ప్యాసింజర్ స్పెషల్ ►గునూపుర్ - విశాఖపట్నం (08521) ప్యాసింజర్ స్పెషల్ ► విజయనగరం - విశాఖపట్నం (07469) మెము స్పెషల్ ► విజయవాడ - విశాఖపట్నం (12718) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నం - విజయవాడ (12717) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ► గుంటూరు - విశాఖపట్నం (12739) సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ► కాకినాడ - విశాఖపట్నం (17267) మెము ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నం - కాకినాడ (17268) మెము ఎక్స్‌ప్రెస్ ► రాజమండ్రి- విశాఖపట్నం (07466) మెము స్పెషల్ ►విశాఖపట్నం - రాజమండ్రీ (07467) మెము స్పెషల్ ►కోరాపుట్ - విశాఖపట్నం (08545) స్పెషల్ ►విశాఖపట్నం - కోరాపుట్ (08546) స్పెషల్ ► పలాస - విశాఖపట్నం (08531) స్పెషల్ ► చెన్నై - పూరి (22860) ఎక్స్‌ప్రెస్ ►రాయగడ - గుంటూరు (17244) ఎక్స్‌ప్రెస్ 08:09AM ట్రైన్ లోకో పైలట్ ఎం ఎస్ రావులు మృతి ►విజయనగరం రైలు ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన రాయగడ ట్రైన్ ఇంజన్ ►ఇంజన్లో మృతదేహం.. లోకో పైలట్ ఎంఎస్ రావుగా గుర్తింపు ►తోటి ఉద్యోగి మరణంతో దిగ్భ్రాంతిలో రైల్వే ఉద్యోగులు 07:59AM ఆయా స్టేషన్ల నుంచి బయల్దేరి.. దారి మళ్లిన రైళ్ల వివరాలివే.. ►29న చెన్నై లో బయల్దేరిన చెన్నై - సంత్రగచి (22808) ఎక్స్‌ప్రెస్ ►29న హైదరాబాద్ లో బయల్దేరిన హైదరాబాద్ - శాలిమర్ (18046)ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ►28న త్రివేండ్రం లో బయల్దేరిన త్రివేండ్రం - షాలిమర్ (22641) ఎక్స్‌ప్రెస్ ►28న అగర్తల లో బయల్దేరిన ఆగర్తల - బెంగళూరు (12504) ఎక్స్‌ప్రెస్ ►29న శాలిమార్ లో బయల్దేరిన షాలిమర్- హైదరాబాద్ (18045) ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ►29న సంత్రాగచి లో బయల్దేరిన సంత్రగచీ - తిరుపతి (22855) ఎక్స్‌ప్రెస్ ►29న షాలిమర్ లో బయల్దేరిన షాలిమర్ - చెన్నై (12841) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ►29న చెన్నై లో బయల్దేరిన చెన్నై - షాలిమర్ (12842) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ►29న Dhanbad లో బయల్దేరిన Dhanbad - అలెప్పీ (13351) బొకారో ఎక్స్‌ప్రెస్ ►29న హతియ లో బయల్దేరిన హతియా - బెంగళూరు (12835) ఎక్స్‌ప్రెస్ ►28న మంగుళూరు లో బయల్దేరిన మంగుళూరు - సంత్రగాచి (22852) ఎక్స్‌ప్రెస్ ►29న బెంగళూరు లో బయల్దేరిన bengaluru- హౌరా (12246) దురంతో ఎక్స్‌ప్రెస్ ►29న తిరుపతి లో బయల్దేరిన తిరుపతి - హౌరా (20890) ఎక్స్‌ప్రెస్ ►29న సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన సికింద్రాబాద్- హౌరా (12704) ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ ►29న బెంగళూరు లో బయల్దేరిన బెంగళూరు - హౌరా (12864) ఎక్స్‌ప్రెస్ ►29న బెంగళూరు లో బయల్దేరిన బెంగళూరు - జశిద్ది (22305) ఎక్స్‌ప్రెస్ ►28న కన్యాకుమారి లో బయల్దేరిన కన్యాకుమారి - హౌరా (22503) ఎక్స్‌ప్రెస్ ►29న చెన్నయ్ లో బయల్దేరిన చెన్నయ్ - హౌరా (12840) మెయిల్ ►29 న వాస్కోడగామ లో బయల్దేరిన వాస్కొడగమ - షాలిమార్ (18048) ఎక్స్‌ప్రెస్ లు వయా Kharagpur - ఝార్సుగుడ - రాయ్ పూర్ - విజయవాడ మీదుగా రాకపోకలు ఈ 19 రైళ్లు ఇవాళ (సోమవారం) విశాఖపట్నం మీదుగా నడవవు 07:42AM ►కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు పది మంది మృతి చెందారు ►రైలు ప్రమాదంలో 54 మంది క్షత గాత్రులయ్యారు ►క్షతగాత్రులంతా ఏపీకి చెందినవారే ►క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్పించి మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నాం ►32 మందికి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స ►విశాఖ ఎన్.ఆర్.ఐ. ఆసుపత్రిలో ఒకరిని, మెడికవర్ ఆసుపత్రిలో ఇద్దరిని చేర్పించాం ►నలుగురి పరిస్థితి విషమంగా ఉంది :::విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి 07:40AM విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు నెంబర్లు 0891 2746330, 08912744619 ►ఎయిర్టెల్ 81060 53051 8106053052 ►బీఎస్ఎన్ఎల్ 8500041670 8500041671 07:32AM ►రైలు ప్రమాదం నేపథ్యంలో విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో హెల్ప్ లైన్ ►జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ప్రకటన ►కేజీహెచ్ క్యాజువాలిటీ 8912558494 ►కేజీహెచ్ డాక్టర్ హెల్ప్ లైన్ నెంబర్ 8341483151 ►కేజీహెచ్ కేసు క్వాలిటీ 8688321986 ►ప్రయాణికుల క్షతగాత్రుల వైద్య సహాయం కోసం ఈ ఫోన్లను సంప్రదించాలని సూచన 06:31AM ►ఘటనా స్థలానికి చేరుకున్న బాహుబలి క్రేన్. చెల్లా చెదురు అయిన బోగీలను తొలగించే పనులు మరింత ముమ్మరం 06:02AM ►క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న వైద్యులు ►రాత్రంతా కొనసాగుతూనే ఉన్న మూడు లైన్ ల ట్రాక్ పనులు, పునరుద్ధరణ పనులు ►అలమండ ప్రాంతంలో భారీ పోలీస్ బందోబస్తు ►మృతుల సంఖ్య, వివరాలని అంచనా వేస్తున్న అధికారులు ►విశాఖ, భువనేశ్వర్ నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ ►పదికి చేరిన మృతుల సంఖ్య ►మృతుల సంఖ్య పెరిగే అవకాశం నేడు పలు రైళ్ల రద్దు విజయనగరం రైలు ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు తెలిపారు. కోర్బా-విశాఖపట్నం, పారదీప్-విశాఖపట్నం, రాయగడ-విశాఖపట్నం, పలాస-విశాఖపట్నం, విశాఖపట్నం-గుణుపూర్, గుణుపూర్-విశాఖపట్నం, విజయనగరం-విశాఖపట్నం రైళ్లు రద్దయ్యాయి. Bulletin 6-: pic.twitter.com/qr2o319M04 — Ministry of Railways (@RailMinIndia) October 29, 2023 బాధితుల కోసం సహాయక కేంద్రాలు విజయనగరం సమీపంలో జరిగిన రైలుప్రమాద బాధితుల సహాయం కోసం, సమాచారం అందించేందుకు రైల్వే, విశాఖ జిల్లా అధికారులు సహాయక కేంద్రాలను (కంట్రోల్ రూం) ఏర్పాటుచేశారు. విశాఖ కేజీహెచ్‌లో, విమ్స్‌లో వైద్యబృందాలను కలెక్టర్ మల్లికార్జున అందుబాటులో ఉంచారు. విశాఖ నుంచి ప్రమాదస్థలికి అంబులెన్సులను పంపారు. బాధితులకు వైద్య సహాయార్థం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటుచేశారు. హెల్ప్‌లైన్ నంబర్లు విజయనగరం కలెక్టరేట్: 94935 89157 విశాఖ కలెక్టరేట్: 90302 26621, 70361 11169, 08912 590102 కేజీహెచ్: 89125 58494, 83414 83151 వైద్యుడు (24 గంటలు అందుబాటులో ఉంటారు): 83414 83151 అత్యవసర విభాగం వైద్యుడు: 86883 21986 రైల్వే ఆధ్వర్యంలో.. భువనేశ్వర్: 06742301625, 06742301525, 06742303060, 06742303729 (టోల్ ఫ్రీ) వాల్తేరు టెస్ట్ రూం: 89780 80805 సీనియర్ సెక్షన్ ఇంజినీర్ : 89780 80815 వాల్తేరు డివిజన్: 08942286245, 08942286213 అలమండ, కంటకాపల్లి: 89780 81960 విజయనగరం: 08922221206, 08922221202, 89780 80006 శ్రీకాకుళం రోడ్డు: 08942286213, 08922286245 ఏలూరు: 08812232267 సామర్లకోట: 08842327010 రాజమహేంద్రవరం: 08832420541 తుని: 08854252172 విశాఖ రైల్వేస్టేషన్లో..: 08912 746330; 08912 744619; 81060 53051; 81060 53052; 85000 41670; 85000 41671. ప్రమాదం ఎందుకు జరిగింది? విజయనగరం ఘోర ప్రమాదంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. విశాఖ నుంచి పలాస రైలు సాయంత్రం 5:45 గంటలకు విజయనగరం వైపు బయలుదేరింది. అదే ట్రాక్‌పై వెనుకనే విశాఖ నుంచి రాయగడ ప్యాసింజర్ 6 గంటలకు బయలుదేరింది. గంట వ్యవధిలోనే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్లిన పలాస రైలుకు సిగ్నల్ సమస్య ఎదురవ్వడంతోనే కంటకాపల్లి నుంచి చాలా నెమ్మదిగా రైలు ట్రాక్‌పై వెళ్లిందని అందులోని ప్రయాణికులు చెబుతున్నారు. ఈలోగా వెనుకనుంచి వచ్చిన రైలు ఢీకొన్నట్లు వివరిస్తున్నారు. కారుచీకట్లు అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రమాదం తరువాత సహాయక చర్యలు చేపట్టిన యంత్రాంగం.. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో బొగ్గు రవాణా రైలు, ట్యాంకరు రైలును ఆ ప్రాంతం నుంచి తరలించారు. అలాగే పలాస రైలులో ప్రమాదానికి గురైన బోగీలు మినహాయించి మిగిలిన బోగీలను తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వస్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను కంటకాపల్లిలో నిలిపివేశారు. ఆయా రైళ్లలో ప్రయాణికులను రోడ్డు మార్గంలో తరలించారు. ప్రమాదానికి సిగ్నల్ సమస్య కారణమా? లేదంటే మానవ తప్పిదమా? అనేది తేలాల్సి ఉంది. ఏం జరిగింది.. విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస (08532) రైలును వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ (08504) రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రాయగడ రైల్లోని బోగీలు నుజ్జునుజ్జు కాగా, మరికొన్ని పట్టాలు తప్పాయి. ప్రమాద ధాటికి రైలు ఇంజన్ సహా ఐదు బోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. అక్కడే మరో ట్రాక్‌పైనున్న గూడ్సు రైలు బోగీలపైకి అవి దూసుకెళ్లాయి. దీంతో ఇక్కడ భీతావహం నెలకొంది. బాలేశ్వర్ తరహాలోనే.. ఈ ఏడాది జూన్‌లో జరిగిన బాలేశ్వర్ రైలు ప్రమాద సంఘటన మాదిరిగానే ఈ ప్యాసింజర్ రైళ్ల ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. పలాస గార్డు బోగీని రాయగడ ఇంజిను ఢీకొట్టడంతో ఆ రెండు నుజ్జయ్యాయి. ఈ వేగానికి రాయగడ బోగీలు ఏకంగా అదే రైలు ఇంజినుపైకి దూసుకెళ్లాయి. అదే సమయంలో పక్కన గూడ్సు రైలు వెళుతోంది. ప్రమాదం జరిగినప్పుడు రాయగడ రైలుకు చెందిన కొన్ని బోగీలు గూడ్సు రైలును ఢీకొన్నాయి. రెండు ప్యాసింజర్, గూడ్సు రైళ్లలో కలిపి ఐదు బోగీలు నుజ్జయ్యాయి. మృతుల కుటుంబాలకు ప్రధాని సాయం రూ.2 లక్షలు విజయనగర రైలు ప్రమాద ఘటనపై దేశ ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ఆయన ప్రకటించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆయన మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh from the PMNRF for the next of kin of each deceased due to the train derailment between Alamanda and Kantakapalle section. The injured would be given Rs. 50,000. https://t.co/K9c2cRsePG — PMO India (@PMOIndia) October 29, 2023 ప్రమాద స్థలం నుంచి ప్రయాణికులందరినీ తరలించినట్లు అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితోనూ ప్రధాని మాట్లాడారని, రైల్వే బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. All injured shifted to hospitals. Ex-gratia compensation disbursement started - ₹10 Lakh in case of death, ₹2.5 Lakh towards grievous and ₹50,000 for minor injuries. — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 29, 2023 సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి విజయనగరం రైలు ప్రమాదంపై సీఎం జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.రైలుప్రమాదంలో మృతిచెందిన ఏపీకి చెందినవారి కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం జగన్ ప్రకటించారు. ఇతర రాష్ట్రాలవారు మరణిస్తే రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. ఘటన గురించి రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌తో ఆదివారం రాత్రి ఆయన ఫోన్లో మాట్లాడారు. ఘటనాస్థలికి మంత్రి బొత్స సత్యనారాయణను పంపామని, ప్రమాద విషయం తెలియగానే సహాయకబృందాలు అక్కడకు చేరుకున్నాయని వివరించారు. సహాయక చర్యల్ని స్థానిక కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షిస్తున్నారని, క్షతగాత్రుల్ని వివిధ ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు. -
రౌడీమూకపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: అసాంఘిక శక్తులను ఏమాత్రం ఉపేక్షించొద్దని పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విస్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో కావలిలో ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసు శాఖ 14 మంది నిందితులను గుర్తించడంతోపాటు ఏడుగురిని 24 గంటల్లోనే అరెస్ట్ చేయడం గమనార్హం. నిందితులకు అధికార వైఎస్సార్సీపీతో ఏమాత్రం సంబంధం లేదని, వారిపై గతంలోనే పలు కేసులు నమోదైనట్లు వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనను రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకునేందుకు విపక్ష టీడీపీ – జనసేన వేసిన ఎత్తుగడలు పారలేదు. పరారీలో ప్రధాన నిందితుడు ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై రౌడీమూకల దాడిని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. దాడికి పాల్పడ్డవారిని ఏమాత్రం ఉపేక్షించకుండా తక్షణం కఠిన చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసు శాఖను ఆదేశించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసు శాఖ దాడి దృశ్యాల వీడియో ఫుటేజీని పరిశీలించి 14 మంది నిందితులను గుర్తించింది. కావలి – తుమ్మలపెంట మార్గంలో రాష్ట్రం దాటేందుకు ప్రయత్నిస్తున్న ఏడుగురు నిందితులను శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బండి విల్సన్, పుట్టా శివకుమార్‌రెడ్డి, షేక్ ఖాజావలి, కుప్పాల వంశీ, షేక్ కలీమ్ చోటు, షేక్ ఇలియాజర్, షేక్ బాజీలను అరెస్ట్ చేసినట్టు ఆదివారం ప్రకటించారు. 24 గంటల్లోనే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఏడుగురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్‌తోపాటు మిగిలినవారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాతోపాటు అన్ని చోట్లా విస్తృతంగా గాలిస్తున్నారు. గతంలోనే నేర చరిత్ర.. రామ్‌సింగ్‌పై దాడికి పాల్పడిన నిందితులకు గతంలోనే నేర చరిత్ర ఉంది. కావలి ప్రాంతంలో ఈ ముఠా ఎన్నో ఏళ్లుగా రౌడీయిజం, సెటిల్మెంట్లు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది. అమాయకులను మోసగిస్తున్న నిందితులపై గతంలోనే పోలీసులు సస్పెక్ట్ షీట్లు తెరిచారు. బండి విల్సన్‌పై 14 కేసులు, శివకుమార్‌రెడ్డిపై 8 కేసులు ఉండటం గమనార్హం. మిగిలిన ఐదుగురిని వీరి అనుచరులుగా గుర్తించారు. ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడికి పాల్పడిన నిందితులపై పోలీసులు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 143, 341, 332, 307, 323, 427 రెడ్‌విత్ 34 సీఐపీ సెక్షన్ల కింద కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. రాజకీయ రాద్ధాంతం డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడిని అధికార వైఎస్సార్ సీపీతోపాటు అంతా ఖండించినా టీడీపీ – జనసేన రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాడికి పాల్పడిన నిందితులతో అధికార పార్టీకి ఎలాంటి సంబంధం లేకున్నా లోకేశ్ సహా టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. 24 గంటల్లోనే వాస్తవాలు బహిర్గతం కావడంతో విపక్ష నేతలు తోక ముడిచారు. ఆర్టీసీ యూనియన్ల హర్షం ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించిన విధానం, ఏడుగురు నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేయడం పట్ల ఆర్టీసీ యూనియన్లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌తోపాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాయి. ఈ ఉదంతం వెలుగులోకి రాగానే నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ సంఘాలకు ఎండీ భరోసానిచ్చారు. సుధీర్ ముఠా మోసాలపై ఫిర్యాదు చేయాలి వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించాం. కావలికి చెందిన ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్ కుమారుడి నిశ్చితార్థం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లడంతో పరారయ్యాడు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. త్వరలోనే మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేస్తాం. రూ.1.5 కోట్ల విలువైన రెండు వాహనాలను జప్తు చేశాం. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. సుధీర్ ముఠా చేతిలో మోసపోయిన వారు ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతున్నాం. – తిరుమలేశ్వరరెడ్డి, ఎస్పీ, నెల్లూరు జిల్లా -
Vizag: రేవ్ పార్టీలో దారుణం.. మద్యం మత్తులో అమ్మాయి కోసం..
సాక్షి, విశాఖపట్నం: అచ్చుతపురంలో రేవ్ పార్టీలో దారుణం చోటు చేసుకుంది. విజయనగరం నుంచి పార్టీ చేసుకోవడానికి కొంత మంది యువతీ యువకులు వచ్చారు. మద్యం మత్తులో అమ్మాయి కోసం జరిగిన గొడవలో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. ఆ యువకుడిని స్విమ్మింగ్ పూల్‌లో ముంచి స్నేహితులు హత్య చేశారు. మృతుడు సాయి వర్మగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కోమాలో భర్త, భార్య దారుణ హత్య.. అసలేం జరిగింది? -
Oct 29th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Arrest, Remand, Cases, Petitions And Political Updates 07:39PM, అక్టోబర్ 29, 2023 అట్టర్ ప్లాప్ అయినా కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమం ►చంద్రబాబుకు సంఘీభావంగా కళ్ళుకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టాలని లోకేష్ పిలుపు ►లోకేష్ పిలుపును పట్టించుకోని ప్రజలు, టీడీపీ క్యాడర్ ►ఇళ్లల్లో నుంచి బయటికి రాని ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ►వరుసగా అట్టర్ ప్లాప్ అవుతున్న చంద్రబాబు సంఘీభావ కార్యక్రమాలు ►ఇప్పటికే అట్టర్ ప్లాప్ అయినా మోత మోగిద్దాం, కాంతిలో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాలు ►ఫోటోలకు పోజులు కోసం కొంతమంది టీడీపీ సంఘీభావం పేరుతో డ్రామా 07:27PM, అక్టోబర్ 29, 2023 నారా లోకేష్ ట్వీట్‌కు ఆర్జీవీ స్ట్రాంగ్ కౌంటర్ ►లోకేష్‌ను చూసి జాలి పడాలా.. నవ్వాలా.. ఏం చేయాలో అర్థం కావడం లేదు ►నేనొక ఫిలిం మేకర్ని సినిమాలు తీయడం నా పని ►నేను నీలాగా జనాలకు సేవ చేయడానికి పుట్టాను.. తిరుగుతున్నాను.. చస్తాను అని ఎప్పుడైన చెప్పానా? ►నన్ను క్రిటిసైజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ సేవ తప్పితే ఏ టాపిక్నీకు దొరకలేదా? ►నేను నీ ప్లేస్‌లో ఉంటే ఏం చెప్తానో తెలుసా.. అతను హిట్ ఇచ్చి చాలా రోజులు అయ్యింది.. పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తాడు.. ఏవో ట్వీట్స్ పెడతాడు.. అతనికి సమాధానం చెప్పాల్సిన పని లేదు అని చెప్పొచ్చు కదా ►ఆ మాత్రం కూడా తెలివి లేకపోతే ఎట్లా? ►నా లైఫ్ ఓపెన్ బుక్ ►నీలాగా ఎక్కడో స్విమ్మింగ్‌పూల్‌లో ఉన్న ఫోటోలను దాచేసి అలాగ నేనెప్పుడూ చెప్పను ►చంద్రబాబు గారు ఉన్న పరిస్థితి చూసి నీ మైండ్ ఇన్స్టిబిలైజ్ అయ్యిందేమో చూసుకో ►నీ ఫాదర్‌ని దేవుడు కూడా కాపాడ లేడు.. నిన్ను చూస్తే బాధ కలుగుతుంది ►లండన్‌కో.. ఎక్కడికో వెళ్లి రెస్ట్ తీసుకొని మనసుకు శాంతిపరుచుకుంటే మంచిది నువ్వు ►హయిరాన పడి ఏది పడితే అది మాట్లాడితే రాంగ్ సిగ్నల్ వెళుతుంది.. నీ మంచి కోసం నేను చెప్తున్నా 04:40PM,అక్టోబర్ 29, 2023 చంద్రబాబు, లోకేష్‌లపై మంత్రి అమర్నాథ్ ఫైర్ ►లోకేష్ తండ్రితో ములాఖత్ అయిన తర్వాత వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నట్లున్నారు ►చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుల్లో టీడీపీ వాదనల ఫలితాలు అందరూ చూశారు ►రుజువులు మీకు ఎందుకు చూపిస్తారు.. కోర్టులకు ఇస్తారు ►మీ తండ్రి 13 చోట్ల సంతకాలు చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా చూపించాం ►సీమెన్స్ సంస్థ మాకు, ఆ ఒప్పందానికి సంబంధం లేదని స్పష్టంగా చెప్పింది ►130 నుంచి 140 మంది వాంగ్మూలం కూడా ఇచ్చారు ►రూ. 370 కోట్లు రాష్ట్ర ప్రజల సొమ్ము మీ తండ్రి చంద్రబాబు కొట్టేశారు ►దొంగ దొరికిన తర్వాత ఎంతకాలమైనా జైల్లో ఉంటారు ►17-ఏ గురించి మాట్లాడతారు గానీ తప్పు చేయలేదని అనడం లేదు ►లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలి ►లోకేష్ సినిమా డైలాగులు మానుకుంటే మంచిది ►దొంగలకు పోలీసుల కాల్ డేటాతో ఏం సంబంధం? ►వ్యవస్థలను మేనేజ్ చేసుకునే అలవాటు మాకు లేదు ►వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకే అలవాటు ►గత ఎన్నికల్లో ప్రజలు చీ కొట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు ►చంద్రబాబు తన కొడుకును కూడా గెలిపించలేకపోయాడు ►పొత్తు లేకుండా ఎన్నికలకు వచ్చే దమ్ము చంద్రబాబుకు ఎప్పుడూ లేదు 12:00 PM, అక్టోబర్ 29, 2023 మాట తప్పడం బాబుకు మాములే.. ►హామీలు ఇచ్చి మాట తప్పడం చంద్రబాబు నైజం ►ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చని బాబు. హామీలు ఇచ్చి మాట తప్పడం చంద్రబాబు నైజం....ఇచ్చిన మాట మీద నిలబడడం సీఎం వైయస్ జగన్ నైజం.#EndofTDP pic.twitter.com/Tcep4wtr2W — YSR Congress Party (@YSRCParty) October 29, 2023 10:30 AM, అక్టోబర్ 29, 2023 చంద్రబాబు పిటిషన్లపై రేపు విచారణ ►చంద్రబాబుు పిటిషన్లపై రేపు ఏపీ హైకోర్టులో విచారణ ►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు ►సోమవారం విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు 8:30 AM, అక్టోబర్ 29, 2023 చంద్రబాబు @జైలు 50వ రోజు.. ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 50వ రోజు కొనసాగుతున్న చంద్రబాబు ►నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం ►చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ప్రతీరోజూ మూడుసార్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు ►చంద్రబాబు భద్రతకు సంబంధించి పూర్తిస్థాయి చర్యలు చేపట్టామన్న జైలు అధికారులు ►జైలు లోపలే కాకుండా బయట కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేసిన అధికారులు ►నిరంతరం సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్న జైలు అధికారులు, పోలీసులు ►చంద్రబాబు వైద్య పరీక్షలకు సహకరించాలంటూ భువనేశ్వరికి లేఖలు రాసిన జైలు అధికారులు 8:00 AM, అక్టోబర్ 29, 2023 ఇటలీకి పవన్ జంప్.. ►ఒక వైపు సమన్వయ కమిటీ మరోవైపు పవన్ ఇటలీకి జంపు ►నేటి నుంచి ప్రారంభం కానున్న తెలుగుదేశం-జనసేన సమన్వయ కమిటీ సమావేశాలు ►సమన్వయ కమిటీని పట్టించుకోకుండా ఇటలీకి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్ ►పవన్ చేసింది ఎప్పుడూ పార్ట్ టైం పాలిటిక్స్ అంటున్న జనసేన నాయకులు ►కొన్ని షూటింగ్స్, మరికొన్ని ట్రిప్పుల మధ్యలో విరామం వస్తేనే పాలిటిక్స్ ►మీకు ఖాళీ ఉన్నప్పుడే జనం గుర్తుకు వస్తారా? ►మీరు బిజీగా ఉంటే ప్రజలను, పార్టీని పట్టించుకోరా? ►ఇంతటి దానికే జైలుకు ముందుకెళ్లి పొత్తు ప్రకటన చేస్తారా? ►రాజకీయాల పట్ల ప్రజా సమస్యల పట్ల మీకున్న అవగాహన, నిబద్ధత ఇదేనా? 7:45 AM, అక్టోబర్ 29, 2023 పరాకాష్టకు చేరిన లోకేష్ పిచ్చి పనులు.. ►చంద్రబాబుకు మద్దతుగా నేడు రా.7 నుంచి 7.05 గంగల మధ్య కళ్లకు గంతలు కట్టుకోవాలని సూచన ►అలా ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి నిజం గెలవాలి అని గట్టిగా నినదించండి: నారా లోకేష్ ►ఇప్పటికే పలుమార్లు నవ్వుల పాలైన లోకేష్, తెలుగుదేశం ►చప్పట్లు కొట్టాలని ఒకసారి, ప్లేట్స్ కొట్టాలని మరోసారి, ఆ తర్వాత వాహనాల సైరన్లు మోగించాలని.. ఇలా పిచ్చి పనులతో నవ్వుల పాలవుతున్న టీడీపీ శ్రేణులు ►జనమంతా నవ్వుకుంటున్నా తనకేంటన్న ధోరణిలో లోకేష్ ►చంద్రబాబు బోలెడు తప్పులు చేశారన్న ఆధారాలు బయటపడ్డ తర్వాత ఇంకెవరి కళ్లకు గంతలు కడతారు? ►చంద్రబాబు తప్పు చేయకపోతే 50 రోజులు జైల్లో ఎందుకుంటారు? ►ఇన్నాళ్లు మీరు ప్రజల కళ్ళకు గంతలు కట్టారని ఒప్పుకుంటారా లేదా? ►మీకు అనుకూలంగా ఉన్నన్నాళ్ళు వ్యవస్థలన్నీ బాగున్నట్టా? ►మీకు అనుకూలంగా తీర్పులు రాకపోయేసరికి కళ్లకు గంతలు కట్టాలని పిలుపునిస్తారా? 7:20 AM, అక్టోబర్ 29, 2023 హైకోర్టు రోస్టర్‌లో మార్పులు ►ఏపీ హైకోర్టు రోస్టర్‌లో సమూల మార్పులు ►కొత్త జడ్డీల రాకతో మార్పులు చేసిన సీజే ►జస్టిస్ మల్లికార్జునరావుకు బెయిల్ పిటిషన్ల విచారణ ►ప్రజా ప్రతినిధుల కేసులు కూడా మల్లికార్జునకే. ►చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై సోమవారం విచారణ. 7:15 AM, అక్టోబర్ 29, 2023 పాపం.. బతకనివ్వండి ప్లీజ్.. రాజకీయం కోసం రోగాలంటగడతారా? ► చంద్రబాబు ఆరోగ్యంతో ఆటలాడుకుంటోన్న కుటుంబసభ్యులు, టిడిపి నేతలు, ఎల్లో మీడియా ► ఒకసారి ఎవరి వర్షన్ ఏంటో మీరే చూడండి. ► పుట్టుకతోనే చంద్రబాబుకు గుండె సమస్య ఉంది, ఇప్పటి వరకు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నారు : కొడుకు లోకేష్ ► ఇప్పుడు జైలులో గుండె సమస్య తీవ్రతరమయ్యే అవకాశముంది : నారా లోకేష్ ► చంద్రబాబు కంటి సమస్య ఉంది, తక్షణం సర్జరీ చేయాలని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు : ఎల్లో మీడియాలో ఒక పత్రిక ► చంద్రబాబుకు యాంగిల్ క్లోజర్ గ్లకోమా అనే కంటి వ్యాధి ఉంది. ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ ద్వారా కేవలం ఆస్పత్రిలోనే చికిత్స అందించాలి : ఎల్లోమీడియాలో ఓ ఛానల్ ► చంద్రబాబు వెన్ను కింది భాగంలో నొప్పితో పాటు చర్మవ్యాధులున్నాయి. వీపరీతంగా దద్దర్లు రావడం వల్ల గోకుతున్నారు : ఎల్లో మీడియాలోని మరో ఛానల్ ► చంద్రబాబు మలద్వారం వద్ద తీవ్రంగా నొప్పి వస్తోంది. రాత్రంతా నిద్ర లేకుండా నొప్పితో బాధపడుతున్నారు : ఎల్లో మీడియాలోని ఓ పత్రిక ► చంద్రబాబు ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవద్దు, బాగా సౌకర్యంగా ఉండే సింహాసనం లాంటి కుర్చీ అయితే బెటర్ : ఎల్లోమీడియాలోని మరో ఛానల్ 7:05 AM, అక్టోబర్ 29, 2023 బాబు హయాంలో ఫైబర్ గ్రిడ్ కుంభకోణం.. జరిగిందిలా ►సుప్రీంకోర్టులో నవంబర్ 9వ తేదీన ఫైబర్ గ్రిడ్ కేసు ►ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబు ►చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణం ► గతంలో ఏపీ సివిల్ సప్లైస్‌కు సర్వీసులు అందించిన టెర్రాసాఫ్ట్ కంపెనీ ► నాసిరకం ఈ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్‌ను నాడు బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం ► అయినా టెర్రాసాఫ్ట్‌పై అంతులేని ప్రేమ కురిపించిన చంద్రబాబు సర్కారు ► టెర్రాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు నాడు చంద్రబాబు సర్కారు అవకతవకలు ► బ్లాక్‌లిస్ట్‌లో టెర్రాసాఫ్ట్‌ను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే తప్పించిన వైనం ► బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే టెర్రాసాఫ్ట్‌ను లిస్ట్ నుంచి తొలగించిన అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు ► హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో జట్టు కట్టి ప్రాజెక్టు దక్కించుకున్న టెర్రాసాఫ్ట్ ► టెండర్లు దక్కించుకున్న తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపిన టెర్రాసాఫ్ట్ ► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన CID ► తమని మోసం చేసినట్టు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ VP అనీల్ జైన్ ► నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసిన టెర్రా సాఫ్ట్ ► చంద్రబాబు సూచనల మేరకే టెర్రాసాఫ్ట్ వ్యవహరం మలుపులు తిరిగిందని తేల్చిన సీఐడీ 7:00 AM, అక్టోబర్ 29, 2023 నేటి సమన్వయం నెక్ట్స్ లెవల్.! ► నేటి నుంచి టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు ► ఉమ్మడి జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు ► 29,30,31న జిల్లాల్లో టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు ► ఇరు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు ► ఎవరెవరి సీట్లు ఉంటాయి? ఎవరివి పొత్తులో భాగంగా పోతాయి? ► ఎవరికి సర్దిచెప్పాలి? ఎవరిని బుజ్జగించాలి? ► 29న శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంత జిల్లాల్లో సమావేశాలు ► 30న పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లో సమావేశాలు ► 31న విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమావేశాలు. దిగజారిపోతున్న టీడీపీ రాజకీయం ►అధినేత చంద్రబాబు నాయుడు బాటలోనే టీడీపీ శ్రేణుల దిగజారుడు రాజకీయాలు ►సెంట్రల్ జైల్ కేంద్రంగా చంద్రబాబు రాజకీయ మంతనాలు ►జైల్లో ఉన్నా మారని చంద్రబాబు, తెలుగుదేశం తీరు ►చంద్రబాబు బహిరంగ లేఖ పేరిట తప్పుడు ప్రచారం ►పదుల సంఖ్యలో చంద్రబాబు కోసం పిటిషన్లతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం ►ఒక పక్క లోకేష్‌ను, మరో పక్క భువనేశ్వరీని రంగంలోకి దించుతున్న బాబు ►సానుభూతి కోసం సర్వప్రయత్నాలు చేస్తోన్న చంద్రబాబు ►చంద్రబాబు జైల్లో ఉండడంతో నిస్తేజంగా మారిన తెలుగుదేశం ►మ్యానిఫెస్టో విడుదల చేయలేనంత దుస్థితిలో తెలుగుదేశం -
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. ఆరుగురి అరెస్ట్
కావలి/సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన కేసులో పోలీసులు శనివారం ఆరుగురిని అరెస్టు చేశారు. మిగిలినవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు 24 గంటల్లోపే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసిన ఆరుగురిని ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగిలిన నిందితులను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకునేందుకు ఏఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. కాగా దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు(ఏపీ16జెడ్0702) డ్రైవర్ బి.రామ్‌సింగ్ కావలి ట్రంక్‌రోడ్డు వద్ద కారును పక్కకు తీయాలంటూ హారన్ మోగించాడు. దీంతో కారు యజమాని ఆర్టీసీ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. స్థానికులతో పాటు అక్కడే ఉన్న కానిస్టేబుల్ సర్దిచెప్పడంతో అతడు అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయాడు. అనంతరం తన స్నేహితుడైన దేవరకొండ సుధీర్‌తో పాటు మరికొందరికి ఫోన్ చేశాడు. వారంతా కారు, ద్విచక్రవాహనాల్లో బస్సును వెంబడించి మద్దూరుపాడు వద్ద అడ్డుకున్నారు. డ్రైవర్ రామ్సింగ్ను బస్సు నుంచి కిందకు దించి విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం నిందితులంతా అక్కడి నుంచి పారిపోయారు. అటుగా వెళ్తున్న కావలి రూరల్ సీఐ ఎం.రాజేశ్ ప్రయాణికులు రోడ్డుపై ఉండటాన్ని గమనించి వివరాలు ఆరా తీశారు. గాయపడిన డ్రైవర్ రామ్సింగ్ను చికిత్స నిమిత్తం వెంటనే కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడితో మాట్లాడి నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఎం.వెంకటరమణ మాట్లాడుతూ.. దాడి ఘటనకు సంబంధించి దేవరకొండ సుధీర్, విల్సన్, శివారెడ్డి, మల్లి, కిరణ్ సహా మొత్తం 10 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా ఏఎస్పీ హిమవతి నేతృత్వంలో కావలి డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, 50 మంది కానిస్టేబుళ్లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో నిందితుల కోసం తీవ్రంగా గాలించారు. కావలిలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన కాగా ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. కావలిలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహించి.. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడిని పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) వేర్వేరు ప్రకటనల్లో ఖండించాయి. దాడికి నిరసనగా ఆదివారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలపనున్నట్టు పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు చంద్రయ్య, ఈయూ నేతలు పలిశెట్టి దామోదరరావు, వై.శ్రీనివాసరావు, అప్పారావు ప్రకటించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు వినతిపత్రం సమర్పిసా్తమన్నారు. అంతకుముందు విజయవాడలో చికిత్స పొందుతున్న రామ్సింగ్ను ఈయూ నేతలు పరామర్శించారు. -
చంద్రబాబు రాజకీయ జీవితంలో చోటు లేనిది దానికే!
సాక్షి, గుంటూరు: 371 కోట్ల రూపాయలు లూటీ చేసిన స్కిల్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. స్కిల్ స్కాం ఆద్యంతం అబద్ధాలతో ముందుకు తీసుకెళ్లారాయన. సాక్ష్యాలతో దొరికినా సిఐడీ అధికారులకు అబద్ధాలే చెప్పారాయన. న్యాయస్థానం ఆయన్ను జైలుకు పంపితే..ఆయన కుటుంబ సభ్యులు, టిడిపి నేతలు అబద్ధాలపై అబద్ధలు పేర్చుకుపోయారు. బాబు ఆరోగ్యంపైనా లేనిపోని అబద్ధాలు చెప్పి ఆయనకు మాయరోగాలన్నీ అంటించారు. ఇన్ని అబద్ధాలతో కోట కట్టేసి ఇపుడు నిజం గెలవాలని భువనేశ్వరి చేత యాత్ర చేయిస్తున్నారు. నిజం గెలవాలంటున్నారు నారా భువనేశ్వరి. నిజమే నిజమే గెలవాలి. అబద్ధం ఎప్పుడూ గెలవకూడనే కూడదు. కాకపోతే దురదృష్ట వశాత్తూ అబద్ధాలతోనే చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితమంతా నెట్టుకొచ్చేశారని అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు నాయుడికి నిజానికి అసలు సంబంధంమే లేదంటున్నారు ఆయన గురించి బాగా తెలిసిన రాజకీయ నేతలు. 371 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అమాంతం భోంచేసిన అతి పెద్ద అవినీతి ఘట్టంలో చంద్రబాబు నాయుడి పాత్రకు సంబంధించి ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని న్యాయస్థానం భావించింది కాబట్టే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాల్సి వచ్చింది. ► నిజానికి స్కిల్ వ్యవహారంలో సిమన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని కేబినెట్ ను నమ్మించారు. అది అబద్ధం ► మనం 10 శాతం నిధులు పెడితే సిమన్స్ కంపెనీ 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇస్తుందని మంత్రివర్గాన్ని నమ్మించారు. అది అబద్ధం ► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మందికి నైపుణ్యాలు నేర్పితే వేలాది మందికి బంగారంలాంటి ఉద్యోగాలు వచ్చాయన్నారు. అది అబద్ధం ► సెప్టెంబరు 9న చంద్రబాబు నాయుణ్ని సిఐడీ పోలీసులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుముందు హాజరు పరిస్తే తనను 24 గంటల లోపు కోర్టు ముందు హాజరు పర్చలేదని ఫిర్యాదు చేశారు. అది అబద్ధం ► 48 రోజులకు పైగా జైల్లో ఉండి..ఏ కోర్టులోనూ బెయిల్ రాకపోవడంతో మధ్యంతర బెయిల్ కోసం ఆరోగ్యం బాగాలేదని సాకులు చెబుతున్నారు. అది అబద్ధం ► చంద్రబాబు నాయుణ్ని ములాఖత్ లో కలిసిన ఆయన సతీమణి నారా భువనేశ్వరి నా భర్త జైలుకెళ్లాక అయిదు కిలోల బరువు తగ్గిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అది అబద్ధం ఆయన ఒక కిలో బరువు పెరిగారన్నది నిజం. ► జైల్లో సరఫరా అవుతోన్న నీళ్లు కలుషితంగా ఉన్నాయని భువనేశ్వరి ఆరోపించారు. అది అబద్ధం ► తన తండ్రికి స్టెరాయిడ్స్ ఇచ్చి అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. అది అబద్ధం ► చైనా నుండి డ్రాగన్ దోమలను దిగుమతి చేసి వాటిని చంద్రబాబు పైకి ఉసిగొల్పి కుట్టిస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించారు. అది అబద్ధం ► తన భర్త కు సరియైన భద్రత లేదని.. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని భువనేశ్వరి ఆరోపించారు. అది అబద్ధం. అత్యంత పటిష్ఠమైన భద్రతను చంద్రబాబుకు ఏర్పాటు చేశారన్నది నిజం. ► ఇపుడు తాజాగా చంద్రబాబు నాయుడు కూడా తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని అంటున్నారు . అది అబద్ధం. చంద్రబాబుకు జైలును మించిన సురక్షితమైన చోటు మరోటి లేదని వారు అంటున్నారు. ► అసలు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగనే లేదని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అది అబద్ధం. 371 కోట్ల రూపాయలకు ఎలా రెక్కలు వచ్చాయో.. ఎలా షెల్ కంపెనీలు దాటుకుంటూ హవాలా మార్గంలో చంద్రబాబు నాయుడికి అవి చేరాయో ఈడీ అధికారులు మొత్తం రూట్ ని కనిపెట్టారు. ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చారు. హవాలా మార్గంలో చంద్రబాబుకు నిధులు సేకరించిన బాబు పి.ఎస్. పెండ్యాల శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ లతో పాటు షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి చెందిన మనోజ్ పార్ధసానికి సిఐడీ నోటీసులు ఇవ్వడంతోనే వారు పరారయ్యారు. కిలారు రాజేష్ అయితే నెల రోజులకు పైగా అజ్ఞాతంలో ఉండి ఆ తర్వాత అమాంతం సిఐడీ ముందు ప్రత్యక్షమయ్యారు. అయితే విచారణకు ఏ మాత్రం సహకరించలేదు. ఏం అడిగినా తెలీదు గుర్తులేదు అని దాటవేశారు. రెండో రోజు విచారణకు వచ్చేటపుడు కొన్ని డాక్యుమెంట్లు తీసుకుని రావలసిందిగా సిఐడీ అధికారులు ఆదేశించారు. అంతే తాను విచారణకు రాలేనని ఆ డాక్యుమెంట్లు తీసుకురాడానికి కొంత సమయం పడుతుందని దసరా తర్వాత తిరిగి విచారణకు హాజరవుతానని చెప్పి రాజేష్ మాయమయ్యాడు. పెండ్యాల శ్రీనివాస్ ఇప్పటికీ ఎక్కడ ఉన్నాడో తెలీదు. ఆయన ఎందుకు పారిపోయాడో మాత్రం సిఐడీ అధికారులకు తెలుసు. అతగాణ్ని విచారిస్తే షెల్ కంపెనీల ద్వారా తలరించిన 241 కోట్ల రూపాయల నిధులు ఏయే ఖాతాల్లో జమ చేశారో తెలుస్తుంది. ఆ భయానికే చంద్రబాబు నాయుడే శ్రీనివాస్ ను దేశంలో లేకుండా బయటకు పంపేశారని సిఐడీ అనుమానిస్తోంది. స్కిల్ స్కాం ఒక్కటే కాదు చంద్రబాబు నాయుడి అపకీర్తి కిరీటంలో ఎన్నో అవినీతి రాళ్లు పొదిగి ఉన్నాయి. అమరావతి ల్యాండ్ స్కాం, అసైన్డ్ ల్యాండ్స్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం వంటివి క్యూలో నిలబడ్డాయి. చంద్రబాబును ఎప్పుడు విచారిద్దామా అని దర్యాప్తు సంస్థలు కాచుక్కూర్చున్నాయి. వీటిలోనే కొన్నింటికి పీటీ వారంట్లు జారీ చేసింది అందుకే. న్యాయస్థానాల అనుమతి రాగానే ఒకటొకటిగా పాపాలు బద్దలు అవుతాయి. అబద్ధాల పుట్టలు పేలిపోతాయి...అని న్యాయ రంగ నిపుణులు అంటున్నారు. అన్ని కేసుల్లోనూ స్కిల్ స్కాం తరహాలోనే అబద్ధాలపై అబద్ధాలు పేర్చుకుంటూ పోయి పెద్ద కోట కట్టేశారు. ఆ కోటకు ఇంతకాలానికి బీటలు వారాయి. ఇక అది కుప్పకూలడం ఖాయం అంటున్నారు పరిశీలకులు. బెయిల్ ఎంతకీ రాకపోయే సరికి చంద్రబాబుకు ఆ రోగం ఉంది ఈ సమస్య ఉంది అని రోజుకో ఫిర్యాదు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. చివరకు 73 ఏళ్ల వయసున్న నేతని జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారంటూ సానుభూతి కోసం డ్రామాలాడుతున్నారు. చంద్రబాబు నాయుడికన్నా వయసులో చాలా పెద్ద వారు అయిన నేతలు మాజీ ముఖ్యమంత్రులు కూడా జైల్లో ఉన్న సంగతిని టిడిపి నేతలు కానీ..భువనేశ్వరి అండ్ కో కానీ తెలివిగా విస్మరిస్తున్నారు. అబద్ధాల చంద్రబాబును కాపాడుకోడానికి భువనేశ్వరి ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతిమంగా నిజం గెలిచి తీరుతుందని.. అపుడు చంద్రబాబు శాశ్వతంగా జైల్లోనే ఉండక తప్పదని పాలక పక్ష నేతలు అంటున్నారు. -
అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ కళ్లముందే...
తూర్పు గోదావరి: స్కూలుకని బయలుదేరిన కొడుకు తిరిగిరాని లోకాలకు తరలిపోవడం తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది. మండపేట సత్యశ్రీ రోడ్డులో శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో తొమ్మిదవ తరగతి విద్యార్థి మృతి చెందడం పట్టణంలో విషాదాన్ని నింపింది. స్థానిక సంఘం కాలనీకి చెందిన కోనె మహేష్ సత్యశ్రీ రోడ్డులోని ఎస్ఎస్వీవీ మున్సిపల్ హైస్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. రోజూ మాదిరి ఉదయం కాలనీ నుంచి సైకిల్‌పై పాఠశాలకు బయలుదేరాడు. బైపాస్ రోడ్డు దాటి కోళ్ల ఫారాల మలుపు వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీ నడపడం, రోడ్డు బెర్ములు కిందికి కుంగిపోయి ఉండటం వలనే ప్రమాదం సంభవించిందని స్థానికులు అంటున్నారు. స్కూల్‌కు వెళుతున్న బాలుడు రోడ్డుపై మృతిచెంది ఉండటం దారిన వెళ్లే వారిని కలచివేసింది. మహేష్ మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తండ్రి శ్రీనివాస్ భవన నిర్మాణ కారి్మకుడిగా పనిచేస్తూ భార్య, కుమారుడు, కుమార్తెను పోషించుకుంటున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ కళ్లముందే విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు విలపించిన తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చోటా డాన్ రజాక్, ఖాజాలకు జేసీ సోదరుల అండ !
తాడిపత్రిలో చీకటి మాటున మట్కా మాఫియా రాజ్యమేలుతోంది. ఒకప్పటి జూదరులు ఇప్పుడు బుకీలుగా అవతారమెత్తి చోటా మట్కా డాన్‌తో కలిసి అమాయక ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపెడుతున్నారు. డబ్బు ఆశ చూపి వారిని రొంపిలోకి లాగుతున్నారు. అత్యాశకు పోయిన సామాన్యులు జేబులకు చిల్లు వేసుకుంటున్నారు. తాడిపత్రి అర్బన్: మట్కా మహమ్మారి అంకెల గారడీతో అమాయకులను బురిడీ కొట్టిస్తోంది. మట్కా తగిలితే రూపాయికి రూ.80 ఇస్తామని ఆశ చూపిస్తోంది. దీంతో ఎంతోమంది కూలీనాలీచేసుకునే వారు, వ్యాపారులు, చిరుద్యోగులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు, సులభంగా డబ్బు సంపాదించుకునేందుకు మట్కాను ఎంచుకుంటున్నారు. పోలీసులు మట్కాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నా టీడీపీ నేతల అండదండలున్న నిర్వాహకులు తమ పంథాను మాత్రం మార్చుకోవడం లేదు. కేరళ నుంచి వలస వచ్చి స్థిరపడిన వ్యక్తి ఈ ప్రాంతానికి మట్కాను పరిచయం చేశాడు. ఆ వ్యక్తి కుమారుడైన రషీద్ మట్కా పగ్గాలు చేపట్టాక అనతికాలంలోనే డాన్‌గా ఎదిగాడు. టీడీపీకి చెందిన జేసీ సోదరుల (మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి – మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి)ఆశీస్సులుండడమే ఇందుకు కారణమన్న విమర్శలు ఉన్నాయి. తెరపైకి చోటా డాన్ రజాక్ మట్కా డాన్ రషీద్ కరోనాతో మృత్యువాతపడ్డాక పట్టణంలో మట్కా కొన్నాళ్లు మరుగున పడింది. తన అన్న (ఎల్లో డాన్) వారసత్వాన్ని అబ్దుల్ రజాక్ కొనసాగించడంతో మట్కా తిరిగి పుంజుకుంది. గతంలో బళ్లారికి చెందిన రిజ్వాన్‌ను శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రిజ్వాన్ ఇచ్చిన సమాచారంతో ఎస్పీ టీం అప్పట్లో అబ్దుల్ రజాక్‌ను అదుపులోకి తీసుకుంది. కర్ణాటకలోని హుబ్లీకి చెందిన వినాయక్ మేత్రాని అనే మట్కా నిర్వాహకుడిని కూడా పోలీసులు అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు. అయితే రిజ్వాన్, వినాయక్ మేత్రాని అనే వీరిరువురు సౌత్ ఇండియాలోనే మట్కా కంపెనీల్లో నంబర్ వన్ షేర్‌హోల్డర్స్. వీరిలో రిజ్వాన్‌కు తాడిపత్రికి చెందిన అబ్దుల్ రజాక్ మట్కా పట్టీలు ఇచ్చేవాడని అప్పట్లో పోలీసులు గుర్తించారు. టీడీపీకి చెందిన మరో మట్కా డాన్ మకందర్ ఖాజా అలియాస్ లప్ప ఖాజా కుటుంబం మొత్తం తాడిపత్రిలో మట్కా పురుడు పోసుకున్నప్పటి నుంచి మట్కా నిర్వహిస్తుండడం విశేషం. వీరి కుటుంబంలో మహిళలే మట్కా నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు కూడా గుర్తించారు. ఇటీవల మకందర్ ఖాజా తండ్రి మునీర్బాషాతో పాటు ఖాజా సతీమణి షేక్ నూరీని అరెస్టు చేశారు. పోలీసులనే టార్గెట్ చేసి.. తాడిపత్రి పచ్చ మట్కా మాఫియాలో కీలక సూత్రధారి రషీద్ సోదరుడు అబ్దుల్ రజాక్‌ను కొద్ది రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మట్కాను పూర్తిస్థాయిలో ఆపాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అబ్దుల్ రజాక్ కుటుంబం ఏకంగా పోలీసులనే టార్గెట్ చేసింది. సీఐ హమీద్‌ఖాన్ తమను వేధిస్తున్నాడంటూ మొసలి కన్నీరు కార్చింది. తెరవెనుక ‘పచ్చ’ కుట్ర మట్కా మాఫియాను ఇన్నాళ్లూ పెంచి పోషించిన ‘పచ్చ’ నేతలకు అర్బన్ సీఐ హమీద్‌ఖాన్ చర్యలు మింగుడుపడడం లేదు. ఈయన ఉంటే తమ ఆటలు సాగవని భావించిన ‘పచ్చ’ నేతలు బురదజల్లేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల చోటా డాన్ అబ్దుల్ రజాక్ భార్యతో పోలీసు శాఖలోని కీలక అధికారులపై ఆరోపణలు చేయిస్తున్నారు. మానవ హక్కుల సంఘం, ప్రైవేటు కేసుల పేరుతో పోలీసులను బ్లాక్మెయిల్ చేసి మట్కాను సాగించాలని పథకం రచిస్తున్నారు. మట్కారాయుళ్లపై కొరడా ఎన్నడూ లేని విధంగా తాడిపత్రి పోలీసులు మట్కా రాయుళ్లపై కొరఢా ఝళిపిస్తున్నారు. అర్బన్ సీఐగా పి.హమీద్‌ఖాన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మట్కాపై ఉక్కుపాదం మోపారు. పట్టణంలో మట్కా ఎవరు నిర్వహిస్తున్నారన్న దానిపై ఆరా తీసి వారికి ముందుగా హెచ్చరికలు జారీ చేశారు. తీరు మార్చుకోని వారిని జిల్లా నుంచి బహిష్కరించేందుకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారు. కలెక్టర్ గౌతమి ఉత్తర్వుల మేరకు మట్కా నిర్వాహకులు బుక్కపట్నం శివకుమార్, చుక్కలూరు చాంద్‌బాషా, మక్తుం పాల మాబు, దూదేకుల కుళ్లాయప్ప, ఉదయగిరి మాబున్నీ, దిగువపల్లి పుల్లయ్య, తుంగ రామాంజులరెడ్డిలపై ఆరు నెలల పాటు జిల్లా బహిష్కరణ వేటు వేశారు. ఆన్లైన్లో మట్కా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నిర్వాహకులు మట్కాను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కొందరు మట్కా నిర్వాహకులు స్వయంగా యాప్ డెవలపర్స్.. మిలాన్డే, మిలాన్ నైట్ పేర్లతో ప్రత్యేక వెబ్సైట్లు రూపొందించి యాప్‌ల ద్వారా అండ్రాయిడ్ ఫోన్లకు లింక్‌లను పంపి గుట్టుగా మట్కా నిర్వహిస్తున్నారు. ఇందుకు గాను సదరు ఆండ్రాయిడ్ యూజర్ రూ.10 వేలు నగదు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్‌దారుకు ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. ఆ పాస్వర్డ్ ఉపయోగించి మట్కా నిర్వహించుకోవాలి. రూ.100కు రూ.8వేలు చెల్లిస్తామంటూ అమాయకుల బతుకులను నాశనం చేస్తున్నారు. ఉపేక్షించేది లేదు మట్కా విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా మట్కా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. నేను బాధ్యతలు తీసుకున్నాక ఇప్పటి వరకు మట్కా స్థావరాలపై దాడులు జరిపి, 33 కేసులు నమోదు చేశాం. మట్కా, గ్యాంబ్లింగ్‌ను కూకటివేళ్లతో పెకలించాలని సీఐ, ఎస్ఐలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ఆన్లైన్ మట్కాను కూడా నిర్మూలిస్తాం. – సీఎం.గంగయ్య, డీఎస్పీ, తాడిపత్రి -
Oct 28th 2023 : చంద్రబాబు కేసు టుడే అప్డేట్స్
Chandrababu Arrest, Remand, Cases, Petitions And Political Updates 16:56 PM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబు క్షేమంగా ఉన్నారు : డాక్టర్లు ► కోర్టు సూచనల మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన అధికారులు ► రిమాండ్ ముద్దాయి నెంబర్ 7691 : చంద్రబాబు నాయుడు, తండ్రి పేరు ఖర్జూరనాయుడు ఆరోగ్య నివేదిక ► ఆరోగ్య పరిస్థితి అన్ని రకాలుగా నిలకడగా ఉంది : డాక్టర్లు 17:36 PM, అక్టోబర్ 28, 2023 నిజాలు చెప్పడానికి వచ్చిందట.. అబద్దాల భువనేశ్వరీ : YSRCP ► వచ్చే వారంలో రెండో విడత నారా భువనేశ్వరి పరామర్శ యాత్ర ► ఉత్తరాంధ్రలో ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి పర్యటన ► శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో యాత్ర ► కుటుంబాలను పరామర్శించనున్న భువనేశ్వరి ► ఇప్పటివరకు అన్నీ అబద్దాలతో కొత్త రికార్డు సృష్టిస్తోన్న భువనేశ్వరీ 17:05 PM, అక్టోబర్ 28, 2023 రాజకీయ వ్యభిచారి చంద్రబాబు : బాపట్లో మంత్రి జోగి రమేష్ ► జైల్లో ఉన్న చంద్రబాబును లోకేష్ కలిసొచ్చి మీరు ఏం పీకారని మమల్ని అడుగుతున్నాడు ► 40 ఏళ్ల చరిత్ర అని చెప్పిన చంద్రబాబు తప్పు చేసి జైలు జీవితం గడుపుతున్నాడు ► చంద్రబాబు జైల్లో ఉంటే లోకేష్ కి పండగలాగా ఉంది ► రాజకీయ వ్యభిచారం అనేది చంద్రబాబుతోనే పుట్టింది ► ఆ రోజుల్లో చంద్రబాబు రాజకీయ వ్యభిచారి ఎన్టీఆర్ అని చెప్పారు ► వందల పేజీల అవినీతి చిట్టా ఉంది కాబట్టే బాబుకు బెయిల్ రాలేదు ► పాపం పండింది కాబట్టే చంద్రబాబు అరెస్టు అయ్యాడు ► వ్యవస్థలను మేనేజ్ చేసి ఇప్పటివరకు బతికిందే చంద్రబాబు : మంత్రి జోగి రమేష్ 16:45 PM, అక్టోబర్ 28, 2023 పచ్చమీడియా.. కళ్లు తెరవండి ► విశాఖ భీమిలిలో మాట్లాడిన మంత్రి సిదీరి అప్పలరాజు ► పచ్చమీడియా.. కొంచెం కళ్లు తెరిచి భీమిలీలో ఉన్న జనాలను చూడండి ► జనాలు లేని సభలు చూడాలంటే భువనేశ్వరి సభలకు వెళ్ళండి ► దొరికిన దొంగ చంద్రబాబు ► బీసీలను చంద్రబాబు దారుణంగా అవమానించారు ► నిప్పు తుప్పు అనే చంద్రబాబు జైల్ లో చిప్ప కూడు తింటున్నారు ► చంద్రబాబు తప్పు చేయలేదని టిడిపి నేతలు కూడా చెప్పడం లేదు ► నిన్నటి వరకు కుర్రాడినని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు బెయిల్ కోసం మాట మార్చి వయస్సు అయిపోయిందని అంటున్నారు ► తోకలు తోలు తీస్తానని నిన్నటిదాకా చంద్రబాబు బెదిరించారు ► బీసీలు జడ్జిలు గా పనికి రారని లేఖలు రాశారు 16:15 PM, అక్టోబర్ 28, 2023 రేపట్నుంచి సమన్వయం నెక్ట్స్ లెవల్.! ► ఏపీ : రేపటి నుంచి టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు ► ఉమ్మడి జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు ► ఈ నెల 29,30,31 న జిల్లాల్లో టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు ► ఇరు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు ► ఎవరెవరి సీట్లు ఉంటాయి? ఎవరివి పొత్తులో భాగంగా పోతాయి? ► ఎవరికి సర్దిచెప్పాలి? ఎవరిని బుజ్జగించాలి? ► 29న శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంత జిల్లాల్లో సమావేశాలు ► 30న పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లో సమావేశాలు ► 31న విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమావేశాలు 15:58 PM, అక్టోబర్ 28, 2023 హైకోర్టు రోస్టర్‌లో మార్పులు ► ఏపీ హైకోర్టులో రోస్టర్ విధానంలో భాగంగా న్యాయమూర్తుల బెంచ్‌లో మార్పులు ► కొత్తగా నలుగురు జడ్జిలు ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించటంతో వారికి రోస్టర్ విధానంలో బెంచ్ లు కేటాయింపు ► బెయిల్ పిటిషన్ల మీద విచారణ చేపట్టనున్న జస్టిస్ మల్లికార్జునరావు బెంచ్ ► క్వాష్ పిటిషన్ల మీద విచారణ చేయనున్న జస్టిస్ భానుమతి బెంచ్ 14:56 PM, అక్టోబర్ 28, 2023 పాపం.. బతకనివ్వండి ప్లీజ్.. రాజకీయం కోసం రోగాలంటగడతారా? ► చంద్రబాబు ఆరోగ్యంతో ఆటలాడుకుంటోన్న కుటుంబసభ్యులు, టిడిపి నేతలు, ఎల్లో మీడియా ► ఒకసారి ఎవరి వర్షన్ ఏంటో మీరే చూడండి. ► పుట్టుకతోనే చంద్రబాబుకు గుండె సమస్య ఉంది, ఇప్పటి వరకు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నారు : కొడుకు లోకేష్ ► ఇప్పుడు జైలులో గుండె సమస్య తీవ్రతరమయ్యే అవకాశముంది : నారా లోకేష్ ► చంద్రబాబు కంటి సమస్య ఉంది, తక్షణం సర్జరీ చేయాలని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు : ఎల్లో మీడియాలో ఒక పత్రిక ► చంద్రబాబుకు యాంగిల్ క్లోజర్ గ్లకోమా అనే కంటి వ్యాధి ఉంది. ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ ద్వారా కేవలం ఆస్పత్రిలోనే చికిత్స అందించాలి : ఎల్లోమీడియాలో ఓ ఛానల్ ► చంద్రబాబు వెన్ను కింది భాగంలో నొప్పితో పాటు చర్మవ్యాధులున్నాయి. వీపరీతంగా దద్దర్లు రావడం వల్ల గోకుతున్నారు : ఎల్లో మీడియాలోని మరో ఛానల్ ► చంద్రబాబు మలద్వారం వద్ద తీవ్రంగా నొప్పి వస్తోంది. రాత్రంతా నిద్ర లేకుండా నొప్పితో బాధపడుతున్నారు : ఎల్లో మీడియాలోని ఓ పత్రిక ► చంద్రబాబు ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవద్దు, బాగా సౌకర్యంగా ఉండే సింహాసనం లాంటి కుర్చీ అయితే బెటర్ : ఎల్లోమీడియాలోని మరో ఛానల్ మీరే కదా, నిన్న మొన్నటిదాకా.. వయస్సు అనేది చంద్రబాబుకు ఒక నెంబర్ మాత్రమే అని రాసింది..! 14:36 PM, అక్టోబర్ 28, 2023 ఇంకా ఇన్ని భ్రమలా? ► తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం : కాసాని ► బీజేపీతో పొత్తుల విషయంపై క్లారిటీ రాలేదు : కాసాని ► రేపు ఉదయం లోకేష్ తో చర్చించి ఫైనల్ చేస్తాం : కాసాని ► తెలంగాణలో టీడీపీ బలంగానే ఉంది : కాసాని ► నాకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదు : కాసాని ► కాసాని తీరుపై విస్మయపోతున్న రాజకీయ వర్గాలు ► ఏది చెబితే అది నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు.! ► అసలు ఒక్క చోట కూడా పోటీ చేయదని ఇప్పటికే లోకేష్ సంకేతాలిచ్చారు.! ► ఆ విషయం తెలిసి కూడా ఇంకా దొంగాట ఎందుకు కాసాని.? ► ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని చెప్పడంలో మీ ఉద్దేశ్యమేంటీ? ► అసలు జైల్లో ఉన్న చంద్రబాబు, బయట ఉన్నలోకేష్ మీకిచ్చిన బ్రీఫింగ్ ఏంటీ? 14:27 PM, అక్టోబర్ 28, 2023 డామిట్.. కథ ఎందుకు అడ్డం తిరుగుతోంది? ► తెలుగుదేశంలో ఉన్నది విజన్ కాదు.. కోడి బుర్ర అని స్పష్టం చేస్తోన్న దృష్టాంతాలు ► ఓటుకు కోట్లు కేసులో ఓ మత పెద్దను పట్టుకుని రూ.50లక్షలతో అడ్డంగా దొరికిన పచ్చ గ్యాంగ్ ► ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే కాకుండా.. మనవాళ్లు బ్రీఫ్డ్మీ అంటూ హామీలిచ్చి రికార్డు చేయించుకుని పట్టుపడ్డ చంద్రబాబు ► గుడిలో విగ్రహాలను కూల్చి ఏపీ సర్కారుకు చెడ్డ పేరు తేవాలనుకున్న కుట్రలో సీసీ కెమెరాలో అడ్డంగా దొరికిపోయిన తెలుగు తమ్ముళ్లు ► ఢిల్లీకి వెళ్లి లాయర్లతో మాట్లాడతాను అన్నప్పుడే తెలుగుదేశం వాళ్లు భయపడ్డారు.. చినబాబు గురించి బాగా తెలుసుకాబట్టి.! ► చేసిన పనికి ఎదురు తన్నిన పరిణామాలు, కిక్కురుమనకుండా తిరిగొచ్చేసిన లోకేష్ ► నాట్ బిఫోర్ వెనక కథ నడిపి అడ్డంగా దొరికిపోయిన ఎల్లోమీడియా ఓనర్ ► ఇంత గుడ్డిగా చేయడం, దొరికిన తరవాత అన్యాయం జరిగిపోయిందనడం మీ విజనా? ► మీ రాజకీయ అధికారం కోసం ఇంకెన్ని అక్రమాలు చేస్తారు? ఇంకెన్ని దుర్మార్గాలు చేస్తారు? ► మీ కక్కుర్తి కోసం దేనికైనా దిగజారుతారా? 14:08 PM, అక్టోబర్ 28, 2023 బ్రోకర్ పని చేసి అడ్డంగా దొరికిపోయిన ఎల్లోమీడియా ఓనర్ ► సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకుని న్యాయవ్యవస్థను దెబ్బతీసే కుట్ర చేసిన తెలుగుదేశం ► నాట్ బిఫోర్ గేమ్‌లో తెర వెనక ప్లాన్ చేసిన పచ్చ టీవీ ఛానల్ ఓనర్ ► అందర్నీ మేనేజ్ చేస్తానంటూ వెళ్లి అడ్డంగా పట్టుబడ్డ పచ్చ టీవీ ఛానల్ ఓనర్ ► హై ప్రొఫైల్ లాబీయిస్ట్‌గా బిల్డప్ ఇచ్చి దొరికిపోయిన పచ్చ టీవీ ఛానల్ ఓనర్ 13:48 PM, అక్టోబర్ 28, 2023 నారా వారి అబద్ధాల ఫ్యాక్టరీ ►సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని కేబినెట్‌కు చెప్పింది.. అబద్ధం ►పది శాతం నిధులు పెడితే.. సీమెన్స్ సిమన్స్ కంపెనీ 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇస్తుందన్నది.. అబద్ధం ►స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మందికి నైపుణ్యాలు నేర్పితే వేలాది మందికి బంగారంలాంటి ఉద్యోగాలు వచ్చాయన్నది.. అబద్ధం ►సెప్టెంబరు 9న చంద్రబాబు నాయుడ్ని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేస్తే.. 24 గంటల లోపు కోర్టు ముందు హాజరు పర్చలేదని చంద్రబాబు ఆరోపణ.. అబద్ధం. ►48 రోజులకు పైగా జైల్లో ఉండి.. ఏ కోర్టులోనూ బెయిల్ రాకపోవడంతో మధ్యంతర బెయిల్ కోసం ఆరోగ్యం బాగాలేదని చెప్తుండడం.. అబద్ధం ►చంద్రబాబు నాయుడు జైల్లో బరువు తగ్గారని నారా భువనేశ్వరి చేస్తున్న ప్రచారం.. అబద్ధం. ► జైల్లో సదుపాయాల గురించి టీడీపీ చేస్తున్న ప్రచారం.. అబద్ధం ►తన తండ్రికి స్టెరాయిడ్స్ ఇచ్చి అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని నారా లోకేష్ చెప్తుండడం.. అబద్ధం ► చైనా నుండి డ్రాగన్ దోమలను దిగుమతి చేసి వాటిని చంద్రబాబు పైకి ఉసిగొల్పి కుట్టిస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించడం.. అబద్ధం ►తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెడుతుండడం.. అబద్ధం ► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగనే లేదని చంద్రబాబు చెప్తుండడం.. అబద్ధం 12:55 PM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబు జైల్లో ఉండడమే సరైంది విశాఖ సామాజిక సాధికార యాత్ర సమావేశంలో సీదిరి అప్పలరాజు కామెంట్స్ ►నారా భువనేశ్వరి సభకు, వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభలకు వచ్చే జనాన్ని చూడండి. ►లోకేష్ యాత్రను మొదటి పేజీలో వేసుకోలేని స్థితిలో పచ్చ మీడియా ►చంద్రబాబు తప్పు చేయలేదు బెయిల్ ఇవ్వండి అనడం లేదు.. బాగోలేదు గనుకే బెయిల్ ఇవ్వండి అంటున్నారు ►చంద్రబాబు జైల్లో ఉండడమే సరైంది ►బాబు బయటకు ఉంటే ప్రజలకు ప్రమాదం ►చంద్రబాబు పూర్తిగా అవినీతిలో కూరుకు పోయారు.. ఇక బయటకు రాలేరు 12:32 PM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబు పిటిషన్.. అత్యంత తొందరపాటు చర్య ►చంద్రబాబు పిటిషన్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో బలమైన వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్‌రోహత్గి(అక్టోబర్ 17న) ►స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేయడం తొందరపాటు చర్యే ►17ఏ సెక్షన్ అనేది నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకే వర్తిస్తుంది ►17ఏ సెక్షన్ చంద్రబాబుకి వర్తించదు ►ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి ►పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు ►స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదు ►17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది ►అవినీతి పరులకు ఈ సెక్షన్ రక్షణ కవచం కాకూడదు ►అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికే ఈ సెక్షన్ తెచ్చారు ►నిజాయితీ గల ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకునే సమయంలో భయం లేకుండా ఉండేందుకు 17-ఏ తెచ్చారు ►ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే 17-ఏ కాపాడుతుందనేది చట్టం ఉద్దేశం ►అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య ►విచారణ చేస్తున్న అధికారులకు కనీసం సమయం ఇవ్వకపోవడం కూడా సరికాదు ►సెక్షన్ 482 ప్రకారం క్వాష్ చేడయం అనేది.. అత్యంత అరుదైన కేసుల్లోనే తీసుకునే నిర్ణయం ►కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదు ►గతంలో కొన్ని కేసుల్లో పీసీయాక్ట్ కొట్టేసినా సెక్షన్ 4 ప్రకారం.. ఐపీసీ సెక్షన్లపై స్పెషల్ ట్రయల్ కోర్టు విచారణ కొనసాగించవచ్చు ►ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే ►పీసీ యాక్ట్ వర్తించకపోయినా.. మిగిలిన సెక్షన్లపై విచారించొచ్చు ►పీసీ యాక్ట్ లేకపోయినా.. విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది ►సగం సెక్షన్లకు ఒక కోర్టులో విచారణ, మరో సగం సెక్షన్లకు మరో కోర్టులో విచారణ అనడం లా కాదు ►ఇలా భావిస్తే.. వ్యవస్థ అపహస్యం అవుతుంది ►ఇది తీవ్రమైన నేరం...విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది ►జిల్లా జడ్జికి ఉండే అధికారాలూ స్పెషల్ జడ్జికి కూడా ఉంటాయి ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు.. చాలా తీవ్రమైన ఆర్థిక నేరం ►ఈ కేసులో 17ఏ వర్తించినా.. మిగిలిన ఐపీసీ సెక్షన్లపై విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంది ►ఎఫ్ఐఆర్లో కాగ్నిజబుల్ అఫెన్సెస్‌కు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయా? లేదా? అనేది ముఖ్యం ►ఈ విషయాన్ని మాత్రమే కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి ►ఈ కేసులో ఎఫ్ఐఆర్ కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు ►స్కిల్ స్కామ్ కేసులో వందల కోట్ల అవినీతి జరిగింది ►పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికారు ►ఇప్పటికే ఈ కేసులో ఈడీ, ఇన్‌కమ్‌ట్యాక్స్ సంస్థలు విచారణ చేస్తున్నాయి ►ఇన్ని విచారణ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది? ►ఈ కేసులో ఫొరెన్సిక్ నివేదిక చూస్తే షాక్‌కు గురవుతారు ►రూ. 371కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము ను లూటీ చేశారు ►అధికారులు వద్దని వారించినా.. ఇచ్చేయండి ఇచ్చేయండంటూ ఆదేశాలు జారీచేశారు ►మొత్తంగా ఈ కేసు 482సెక్షన్ కింద క్వాష్ చేయాలా? వద్దా? అనే నిర్ణయాధికారం తీసుకునే కేసు ►ఇది ఏదో ఇద్దరు గల్లా పట్టుకుని కొట్టుకున్న కేసు కాదు ►ఇది చాలా తీవ్రమైన ఆర్ధికనేరానికి సంబంధించి కేసు ►నేరం జరిగిందనే ప్రాథమిక ఆధారాలు ఉన్న కేసుల్లో... సెక్షన్ 482 కింద క్వాష్ చేయకూడదని ఎంఆర్ షా తీర్పు ఉంది ►సెక్షన్ 482కింద క్వాష్ అనేది చాలా అరుదైన కేసుల్లో మాత్రమే వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి ►17ఏ అనేది ఈ కేసులో వర్తించదు ► 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది ►2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది ►2018 జులై కంటే ముందు నేరం జరిగింది కాబట్టి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదు ►2015-16లో లేని చట్టం అనేది అప్పుడు జరిగిన నేరానికి ఎలా వర్తిస్తుంది? ►స్కిల్ స్కామ్ కేసులో మరింత దర్యాప్తు అవసరం ►ఒక వ్యక్తి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదయింది ►ఒక వేళ కోర్టు ఆ సెక్షన్లు తొలగించాలనుకుంటే.. మిగతా సెక్షన్ల కింద కేసు కొనసాగుతుంది ►గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఇది ►శాసనవ్యవస్థ ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేసు ఇది. అందుకే సెక్షన్ 44 PMLA పెట్టారు ►ఏసీబీ కోర్టుకు (ప్రత్యేక కోర్టు)కు కచ్చితమైన పరిధి ఉంది. ►ఎప్పుడయితే వేర్వేరు సెక్షన్ల కింద నమోదయిన నేరాలన్నీ ఒక అంశంలో నమోదయి ఉంటే.. ప్రత్యేక కోర్టుకు అధికారం ఉంటుంది. ►ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్షకూడా వేయవచ్చు. ►అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది. ►జీఎస్టీ,ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయి ►నేరం జరిగిందా లేదా..ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా.. అంతవరకే పరిమితం కావాలి ►అవినీతి నిరోధక,సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు ►ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారు? ►ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. 17ఏ అనేది హైబ్రిడ్ సెక్షన్..అవినీతిపరులకు ఇది రక్షణ కాకూడదన్నదే నేను చెప్పేది ►రాఫేల్ కేసులో వేసిన రివ్యూ పిటిషన్‌ను బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులు డిస్మిస్ చేశారు ►కాని మరో జడ్జ్ తీర్పును అంగీకరిస్తూనే 17ఏ కీలక వ్యాఖ్యలు చేశారు ►రాఫెల్ కేసులో 17ఏపై జస్టిస్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి ►కోర్టు విచారణకు ఆదేశించిన కేసుల్లో 17ఏ అనేది వర్తించదు 12:02 PM, అక్టోబర్ 28, 2023 బాబు హయాంలో ఫైబర్ గ్రిడ్ కుంభకోణం.. జరిగిందిలా ►సుప్రీంకోర్టులో నవంబర్ 9వ తేదీన ఫైబర్ గ్రిడ్ కేసు ►ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబు ►చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణం ► గతంలో ఏపీ సివిల్ సప్లైస్‌కు సర్వీసులు అందించిన టెర్రాసాఫ్ట్ కంపెనీ ► నాసిరకం ఈ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్‌ను నాడు బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం ► అయినా టెర్రాసాఫ్ట్‌పై అంతులేని ప్రేమ కురిపించిన చంద్రబాబు సర్కారు ► టెర్రాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు నాడు చంద్రబాబు సర్కారు అవకతవకలు ► బ్లాక్‌లిస్ట్‌లో టెర్రాసాఫ్ట్‌ను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే తప్పించిన వైనం ► బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే టెర్రాసాఫ్ట్‌ను లిస్ట్ నుంచి తొలగించిన అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు ► హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో జట్టు కట్టి ప్రాజెక్టు దక్కించుకున్న టెర్రాసాఫ్ట్ ► టెండర్లు దక్కించుకున్న తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపిన టెర్రాసాఫ్ట్ ► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన CID ► తమని మోసం చేసినట్టు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ VP అనీల్ జైన్ ► నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసిన టెర్రా సాఫ్ట్ ► చంద్రబాబు సూచనల మేరకే టెర్రాసాఫ్ట్ వ్యవహరం మలుపులు తిరిగిందని తేల్చిన సీఐడీ 11:26 AM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబుతో ములాఖత్‌లో కాసాని ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయిన కుటుంబ సభ్యులు ►నారా భువనేశ్వరి, నారా లోకేష్‌తోపాటు తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ కూడా ►అసలు తెలంగాణలో పోటీ చేయమంటారా? వేరే దారి చూస్కోమంటారా? అని బాబును నిలదీయనున్న కాసాని 11:19 AM, అక్టోబర్ 28, 2023 ఇంతకీ తెలంగాణలో టీడీపీకి ఎంత సీను? ► నిజంగానే చంద్రబాబు సామాజికవర్గానికి, తెలుగుదేశానికి తెలంగాణలో అంత సీను ఉందా? ► హైదరాబాద్ కట్టింది నేనే అని ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి? ► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150 డివిజన్ లలో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు? ► మా పార్టీ, మా వర్గం బలంగా ఉందని చెప్పుకునే గుంటూరు జిల్లా పక్కనే నాగార్జున సాగర్ నియోజకవర్గం ► 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 ,714 (మే 3, 2021 ) ► ఇక్కడ మొత్తం పోల్ అయిన ఓట్లు -1 .91 లక్షలు, టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 శాతం లోపే (1 ,714) ► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా బిల్డప్‌లు ఎందుకు? ► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు? ► ఏ సర్వేలోనయినా తెలుగుదేశం ప్రభావం ఉందని చెప్పింది ఒక్కరయినా ఉన్నారా? 11:01 AM, అక్టోబర్ 28, 2023 ఎన్టీఆర్‌ను మానసికంగా హత్య చేసింది వాళ్లే! ►ప్రాణహాని ఉందని చంద్రబాబు నాయుడు ఏసీబీ జడ్జికి లేఖ రాయడం హాస్యాస్పదం ►పాపం పండింది కాబట్టి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు ►ఎన్టీఆర్‌ను మానసికంగా హత్య చేసింది ఆయన సంతానమే! ► కన్నతండ్రిపై చెప్పులు విసిరినప్పుడు తండ్రి ప్రేమ భువనేశ్వరికి కనపడలేదా..? నారా భువనేశ్వరి, చంద్రబాబు నాయుడు పై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న ఫైర్ 10:32 AM, అక్టోబర్ 28, 2023 నిజం గెలవాలితో ఏం ఒరగదు ►నిజం గెలవాలి పేరుతో ఓదార్పు యాత్ర చేస్తున్న నారా భువనేశ్వరి ►భర్త చంద్రబాబు తప్పుల్ని ఒప్పుకోకుండా.. పచ్చి అబద్ధాలతో కొనసాగుతున్న యాత్ర ►నిజం గెలవాలి యాత్రపై మేకపాటి రాజారెడ్డి వ్యంగ్యాస్త్రాలు ►యాత్ర వల్ల అనారోగ్య సమస్యలు తప్ప.. ఆమెకి ఒరిగేది ఏమి లేదని ఎద్దేవా ►చంద్రబాబు అవినీతి చేశాడని ప్రజలకు తెలిసిపోయింది ►ఆయన చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. 10:10 AM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబుతో కాసాని.. తాడోపేడోనా? ►ఇవాళ చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్, భువనేశ్వరి ►ములాఖత్ కోసం 11 గంటలకు సెంట్రల్ జైలుకు చేరుకోనున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు ►టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా ములాఖత్ కు హాజరయ్యే అవకాశం ►తెలంగాణలో ఒంటరి పోరు వల్ల కాదని.. పోటీకి దూరంగా ఉండాలని నారా లోకేష్ సూచన ►అదే జరిగితే పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపిన కాసాని ►అయినా వినని చినబాబు అండ్ కో ►ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న కాసాని ►నేటి చంద్రబాబు భేటీతో మరింత స్పష్టత వచ్చే అవకాశం 09:17 AM, అక్టోబర్ 28, 2023 దిగజారిపోతున్న టీడీపీ రాజకీయం ►అధినేత చంద్రబాబు నాయుడు బాటలోనే టీడీపీ శ్రేణుల దిగజారుడు రాజకీయాలు ►సెంట్రల్ జైల్ కేంద్రంగా చంద్రబాబు రాజకీయ మంతనాలు ►జైల్లో ఉన్నా మారని చంద్రబాబు, తెలుగుదేశం తీరు ►చంద్రబాబు బహిరంగ లేఖ పేరిట తప్పుడు ప్రచారం ►పదుల సంఖ్యలో చంద్రబాబు కోసం పిటిషన్లతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం ►ఒక పక్క లోకేష్‌ను, మరో పక్క భువనేశ్వరీని రంగంలోకి దించుతున్న బాబు ►సానుభూతి కోసం సర్వప్రయత్నాలు చేస్తోన్న చంద్రబాబు ►చంద్రబాబు జైల్లో ఉండడంతో నిస్తేజంగా మారిన తెలుగుదేశం ►మ్యానిఫెస్టో విడుదల చేయలేనంత దుస్థితిలో తెలుగుదేశం 09:00 AM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబు న్యాయవాదులకు బిగ్ ఝలక్ ►ఏపీ హైకోర్టులో తన ట్రేడ్‌మార్క్ అస్త్రం ‘నాట్ బిఫోర్’ ప్రయోగం ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ ►తన బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ జ్యోతిర్మయి విచారణ చేయకుండా అడ్డుకునే ఎత్తుగడ ►పార్టీతో, లీగల్ సెల్‌తో సంబంధం లేని మూర్తితో కన్సెంట్ వకాలత్ దాఖలు ►మూర్తి వెనుక ఓ ఎల్లో మీడియా చానెల్ ఓనర్, ఒక విశ్రాంత న్యాయమూర్తి ►నిబంధనల ప్రకారం నడుచుకునే జడ్జిగా జస్టిస్ జ్యోతిర్మయికి పేరు ►మూర్తి సతీమణి తనకు తెలిసి ఉండటంతో నైతిక విలువలకు లోబడి విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ►అందుకే ఆమె ముందు నాట్ బిఫోర్ అస్త్రం ►ఆమె నైతిక విలువలనే అవకాశంగా మలుచుకున్న చంద్రబాబు ►ఆమె తప్పుకుంటే ఆయన వ్యాజ్యాలు జస్టిస్ నిమ్మగడ్డ, జస్టిస్ అడుసుమిల్లి ముందుకు ►అయితే ఊహించని విధంగా ఉత్తర్వులు జారీ చేసిన జస్టిస్ జ్యోతిర్మయి ►సోమవారం విచారణకు వచ్చేందుకు వీలుగా ఈ కేసును సీజే ముందుంచాలని ఆదేశం ►దీంతో కంగుతిన్న చంద్రబాబు న్యాయవాదులు 08:12 AM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబును వెంటాడుతున్న చేసిన పాపాలు ► అధికారంలో ఉండగా అవినీతి భాగోతాలు ►స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ►కేసులు.. కిందిస్థాయి నుంచి సుప్రీం కోర్టు దాకా పలు పిటిషన్లు.. ములాఖత్‌లతో బాబు బిజీ బిజీ ►జైల్లోనే రాజకీయ మంత్రాంగం చేస్తోన్న చంద్రబాబు ►పార్టీలో ఎవరెవరు ఏం చేయాలన్నదానిపై ములాఖత్‌లో సుదీర్ఘ చర్చలు ►లోకేష్ ఏం చేయాలి? భువనేశ్వరీ ఏం చేయాలన్నదానిపై లోపలి నుంచే బాబు సూచనలు ►నవంబర్ 8వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న తెలుగుదేశం శ్రేణులు 07:55 AM, అక్టోబర్ 28, 2023 వివిధ కోర్టులో పెండింగ్‌లో బాబు పిటిషన్లు ►ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డింగ్‌ల పిటిషన్ ► స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటాను భద్రపర్చాలని, అరెస్ట్ వెనుక కుట్ర ఉందని చంద్రబాబు లాయర్ల వాదన ►డేటా భద్రపర్చడం అంటే.. బహిర్గత పర్చడమే!. అది అధికారుల వ్యక్తిగత భద్రతకు మంచిది కాదని సీఐడీ తరపు న్యాయవాదుల వాదన ►వాదనలు పూర్తి కావడంతో అక్టోబర్ 31కి తీర్పు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►స్కిల్ స్కామ్‌లో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►విచారణ నుంచి తప్పుకుని సీజే బెంచ్‌కు రిఫర్ చేసిన న్యాయమూర్తి ►అక్టోబర్ 30(సోమవారం) సీజే బెంచ్ ముందుకు వచ్చే అవకాశం ►కంటికి అత్యవసరంగా ఆపరేష్ అవసరం ఉందని వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు నో ►ఏపీ హైకోర్టులో ఇన్నర్‌రింగ్‌రోడ్డు కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా ►ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు ►సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8వ తేదీన ►సుప్రీంలో నవంబర్ 9వ తేదీన ఫైబర్‌నెట్ స్కామ్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై వేసిన సీఐడీ ►విచారణను ఏసీబీ కోర్టు నవంబర్ 10కి వాయిదా 07:15 AM, అక్టోబర్ 28, 2023 జైల్లో బాబు.. సానుభూతి కోసం కుటుంబ సభ్యులు ►పదుల కొద్ది పిటిషన్లతో కోర్టులను పరీక్షిస్తోన్న బాబు లాయర్లు ►ముందు క్వాష్, తర్వాత బెయిల్, ఆ తర్వాత ఏసీ, మళ్లీ వైద్యం, ఆ తర్వాత కాల్ డాటా ►చేతిలో లాయర్లున్నారన్న ధీమాతో కింది నుంచి పైదాకా అన్నికోర్టుల్లో పిటిషన్లు ►లేని భయాలు, సాకులు చూపుతూ ACB కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు మూడు పేజీల లేఖ ►ఎన్నికల వేళ సానుభూతి కోసం కుటుంబ సభ్యుల నానా పాట్లు ►పేరుకు నిజం గెలవాలి.. చెప్పేవన్నీ అబద్దాలు 06:58 AM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబు అవినీతిపరుడు విజయనగరంలో మంత్రి ధర్మాన కామెంట్స్ ►స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అవినీతి జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు చెప్పాయి ►సొమ్ము చంద్రబాబు పీఏ, లోకేశ్ పీఏ ఖాతాల్లోకి వెళ్లాయి ►విశాఖకు రాజధాని వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది 06:54 AM, అక్టోబర్ 28, 2023 బాబు భద్రతపై ఎలాంటి అనుమానాలు లేవు : జైళ్ల శాఖ డీఐజీ ►చంద్రబాబు సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం ►బాబు భద్రత కట్టుదిట్టంగా ఉంది ►మావోల పేరుతో వచ్చిన లేఖ నకిలీ లేఖగా గుర్తించాం ►జైల్లోకి వచ్చే ప్రతి ఖైదీని తనిఖీ చేశాకే లోనికి అనుమతిస్తాం ►శ్రీనివాస్ అనే ఖైదీని రిమాండ్ కు తీసుకునే సమయంలో బటన్ కెమెరా స్వాధీనం చేసుకున్నాం ►చంద్రబాబు జైలుకు వచ్చిన విజువల్స్ బయటకు రావడంపై దర్యాప్తు పూర్తి చేశాం రాజమండ్రి సెంట్రల్ జైలులో తన ప్రాణాలకి ముప్పు ఉందని ఆరోపిస్తూ ఏసీబీ గౌరవ జడ్జికి చంద్రబాబు రాసిన లేఖపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పందించారు. జైలులో బాబుకి పూర్తి స్థాయిలో పటిష్టమైన భద్రతని కల్పిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చిన డీఐజీ.. ఆయనని చంపబోతున్నట్లు మావోయిస్టులు రాసిన లేఖ కూడా… pic.twitter.com/uo4YLUTTmu — YSR Congress Party (@YSRCParty) October 27, 2023 ►జైలు చుట్టూ ఐదు వాచ్ టవర్స్ ఉన్నాయి ►జైల్లోకి ఎలాంటి గాంజా ప్యాకెట్లు విసిరి వేయలేదు ►ప్రతి గంటకు ఒకసారి జైలు చుట్టూ గార్డింగ్ చేస్తున్నాం ►సెంట్రల్ జైలు చుట్టూ పోలీస్ భద్రత ఉంది ►బీపీవో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నాం ►సెక్యూరిటీ అంశాలు బహిరంగంగా చర్చించలేం ►చంద్రబాబును ఏ రూమ్ లో పెట్టామనేది చెప్పలేం ►చంద్రబాబు భద్రత విషయంలో ఎలాంటి భయాందోళన అవసరం లేదు ►చంద్రబాబు కంటి సమస్యపై భువనేశ్వరికి రెండు సార్లు సమాచారం ఇచ్చాం ►చంద్రబాబు కుటుంబ సభ్యులకు చెప్పిన తరువాత బయట చెప్పాల్సిన అవసరం లేదు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ప్రతి ఖైదీ భద్రత, ఆరోగ్యం మా బాధ్యత. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఖైదీలందరికీ మూడు రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులకి కూడా సమాచారం ఇస్తున్నాం. - జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్… pic.twitter.com/SptXh0Dv8i — YSR Congress Party (@YSRCParty) October 27, 2023 06:51 AM, అక్టోబర్ 28, 2023 నేడు బాబుతో కుటుంబసభ్యుల ములాఖత్ ►చంద్రబాబుతో ములాఖత్ కానున్న భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి ►ఇప్పటికే రాజమహేంద్రవరం చేరుకున్న భువనేశ్వరి, లోకేష్ ►క్రమం తప్పకుండా వారం వారం ములాఖత్ అవుతున్న నారా ఫ్యామిలీ ►జైల్లోనూ కుటుంబ సభ్యులతో బాబు రాజకీయాల ప్రస్తావన ►ములాఖత్ తర్వాత బయటకు వచ్చి.. బాబు భద్రత, ఆరోగ్యం గురించి క్రమం తప్పకుండా అబద్ధాలు ప్రచారం 06:43 AM, అక్టోబర్ 28, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @49 ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ►సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం నంద్యాలలో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.371 కోట్లు సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారని అభియోగం ►ఆధారాలతో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ ►అరెస్ట్ సమయం నుంచి మొదలైన డ్రామా ►రిమాండ్ విధించిన విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం (ఏసీబీ కోర్టు) ►ఇప్పటిదాకా ఐదుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు ► నవంబర్ 1 వరకు జైల్లోనే చంద్రబాబు ►రాజమండ్రి సెంట్రల్ జైలు 49వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది.. ఇంటి భోజనం.. టవర్ ఏసీ సదుపాయం ►చంద్రబాబుకు నిత్యం ఆరోగ్య పరీక్షలు, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ►జైలు, లోపల బయటా చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు -
బెయిల్ కోసం బాబు అడ్డదారులు.. ‘నెవర్ బిఫోర్’
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేసి జైలుపాలైన చంద్రబాబు ఇప్పుడు దాని నుంచి ఎలాగైనా బయటపడాలని బెయిల్ కోసం అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకోసం గతం నుంచి తాను అనుసరిస్తున్న తన ట్రేడ్‌మార్క్ అస్త్రం ‘నాట్ బిఫోర్’ ను ఆయన మరోసారి బయటకు తీశారు. తమ పార్టీకి, తమ లీగల్ సెల్‌కు ఏ సంబంధం లేని జీవీఎల్ మూర్తి అనే న్యాయవాదిని తెరపైకి తెచ్చారు. ఆయనతో తన తరఫున చంద్రబాబు కన్సెంట్ వకాలత్ (అప్పటికే దాఖలు చేసిన కేసులో వకాలత్ వేసిన న్యాయవాది అనుమతితో మరో న్యాయవాది కూడా వకాలత్ దాఖలు చేయడం) దాఖలు చేయించారు. చంద్రబాబు తరఫు న్యాయవాది జి.బసవేశ్వరరావు వకాలత్ వేసి ఉండగానే.. మూర్తితో వకాలత్ దాఖలు చేయించడం గమనార్హం. సాధారణంగా ఇలా వకాలత్ దాఖలు చేసిన కేసులో ఏ మాత్రం సంబంధం లేని మరో న్యాయవాది వకాలత్ దాఖలు చేసేందుకు ఏ న్యాయవాది ఒప్పుకోడు. కాగా చంద్రబాబు తరఫున వకాలత్‌లు దాఖలు చేసిన బసవేశ్వరరావు గానీ, మూర్తి గానీ వాదనలు వినిపించకపోవడం ఇందులో అసలు ట్విస్టు. శుక్రవారం జరిగిన విచారణకు మూర్తి రాలేదు కూడా. దీన్ని బట్టి చంద్రబాబు ఇక్కడ మూర్తిని ఓ నిర్దిష్ట ప్రయోజనం నిమిత్తం వాడుకోవాలని నిర్ణయించి, ఆయనతో వకాలత్ దాఖలు చేయించారని ఇట్టే అర్థమైపోతోంది. మూర్తి వెనుక ఉంది వారే.. జీవీఎల్ మూర్తితో వకాలత్ దాఖలు చేయించడం ద్వారా నిబంధనలకు అనుగుణంగా, ముక్కుసూటిగా నడుచుకుంటారనే పేరున్న న్యాయమూర్తి జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి ముందు తన బెయిల్ పిటిషన్‌ను రాకుండా చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారు. జస్టిస్ జ్యోతిర్మయి ముందు ఎవరు ‘నాట్ బిఫోర్’ న్యాయవాదులు ఉన్నారో ముందుగానే తెలుసుకుని, అందుకనుగుణంగా మూర్తితో వకాలత్ దాఖలు చేయించారు. వాస్తవానికి ఈ మూర్తిది కూడా చంద్రబాబు సామాజికవర్గమే. పెద్దగా ప్రాక్టీస్ ఉన్న న్యాయవాది కాదు. చిన్న చిన్న కేసులు, ఉద్యోగ వివాదాలకు సంబంధించిన కేసులను వాదిస్తుంటారు. ఎప్పుడూ టీడీపీ కేసులను కూడా వాదించింది లేదు. కాగా ఎల్లో మీడియాకు చెందిన ఓ న్యూస్ చానెల్ యజమానికి మూర్తి అత్యంత సన్నిహితుడు. జస్టిస్ జ్యోతిర్మయి ముందు మొత్తం నలుగురు న్యాయవాదులు ‘నాట్ బిఫోర్’గా ఉన్నారు. ఈ నలుగురిలో ముగ్గురు న్యాయవాదులు తమ ఉచ్చులోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో తమవాడే అయిన మూర్తిని చంద్రబాబు అండ్ కో విజయవంతంగా తమవైపు తిప్పుకుంది. ఎల్లో మీడియా న్యూస్ చానెల్ యజమాని, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి.. ఈ విషయంలో మూర్తిని ఒప్పించారు. అంతేకాకుండా చంద్రబాబు అండ్ కో ఆయనకు భారీ మొత్తంలో ఫీజును ఆశగా చూపింది. జస్టిస్ నిమ్మగడ్డ లేదా జస్టిస్ అడుసుమిల్లి.. ప్రస్తుతం హైకోర్టుకు దసరా సెలవులు. ఈ నేపథ్యంలో అత్యవసర కేసులను విచారించేందుకు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, జస్టిస్ జ్యోతిర్మయిలు వెకేషన్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. జస్టిస్ జ్యోతిర్మయి విచారణ నుంచి తప్పుకుంటే చంద్రబాబు బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు లేదా జస్టిస్ అడుసుమిల్లి రవీంద్ర బాబు ముందుకు వస్తాయి. చంద్రబాబు అండ్ కో కూడా ఇదే ఉద్దేశంతో మూర్తితో వకాలత్ దాఖలు చేయించి తమ ప్లాన్‌ను పక్కాగా అమలు చేసింది. అయితే జస్టిస్ నిమ్మగడ్డ లేదా జస్టిస్ అడుసుమిల్లిల్లో ఎవరికి చంద్రబాబు కేసును అప్పగించాలన్నది పూర్తిగా ప్రధాన న్యాయమూర్తి విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సెలవులు కావడంతో సీజే అందుబాటులో లేరు. సోమవారం నుంచే హైకోర్టు తిరిగి తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఎప్పుడైతే జస్టిస్ జ్యోతిర్మయి ఈ వ్యాజ్యాలను సోమవారం నాడు విచారణకు వచ్చేందుకు వీలుగా ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారో అప్పుడే చంద్రబాబు అండ్ కో గతుక్కుమంది. అప్పటికే ఆన్లైన్లో ఉన్న చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, కోర్టు హాలులో ఉన్న మరో సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌లు వెంటనే జోక్యం చేసుకున్నారు. సోమవారం అనే పదాన్ని ఉత్తర్వుల నుంచి తొలగించాలని జస్టిస్ జ్యోతిర్మయిని కోరారు. కేసును తగిన బెంచ్ ముందు ఉంచేందుకు వీలుగా ఫైల్‌ను సీజే ముందు ఉంచాలని మాత్రమే ఉత్తర్వుల్లో పేర్కొనాలన్నారు. లేకపోతే రిజిస్ట్రీ ముందు తాము సీజే అనుమతి కోసం అభ్యర్థించలేమన్నారు. అయితే వారి అభ్యర్థన పట్ల న్యాయమూర్తి జోతిర్మయి సుముఖత వ్యక్తం చేయలేదు. రిజిస్ట్రీ ముందు అత్యవసర విచారణ నిమిత్తం అభ్యర్థించేందుకు ‘సోమవారానికి విచారణ వాయిదా’ అనేది ఎంత మాత్రం అడ్డంకి కాదని తేల్చిచెప్పారు. చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవచ్చునని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో చేసేదేమీ లేక చంద్రబాబు న్యాయవాదులు ఉసూరుమంటూ కోర్టు బయటకు వచ్చారు. ఆ వెంటనే రిజిస్ట్రార్ వద్దకు వచ్చారు. చంద్రబాబు బెయిల్‌ను మరో న్యాయమూర్తికి నివేదించేందుకు వీలుగా సీజే అనుమతి తీసుకోవాలని రిజిస్ట్రార్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చినా వారి పప్పులు ఉడకలేదు. 19 నుంచే వ్యూహానికి పదును.. కాగా వాస్తవానికి చంద్రబాబు అండ్ కో ‘నాట్ బిఫోర్’ అస్త్రాన్ని తన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రయోగించాలని గతంలోనే నిర్ణయించింది. అయితే దానిని ఈ నెల 19న నుంచే అమలు చేయడం ప్రారంభించింది. 19న చంద్రబాబు బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ కోసం వేసిన అనుబంధ పిటిషన్ జస్టిస్ సురేష్‌రెడ్డి ముందుకు వచ్చాయి. చంద్రబాబు అనారోగ్య కారణాలను సాకుగా చూపుతూ ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరఫు సీనియర్ న్యాయవాదులు లూథ్రా, దమ్మాలపాటి గట్టిగా వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుని, సుప్రీంకోర్టు చంద్రబాబు చేసిన మధ్యంతర బెయిల్ అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించలేదని జస్టిస్ సురేష్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ పట్ల సానుకూలంగా స్పందించని నేపథ్యంలో తాను కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వలేనని జస్టిస్ సురేష్‌రెడ్డి స్పష్టంగా చెప్పేశారు. దీంతో భోజన విరామం తర్వాత వ్యూహాన్ని మార్చేసిన చంద్రబాబు న్యాయవాదులు బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను వెకేషన్ కోర్టు ముందు పోస్ట్ చేయాలని న్యాయమూర్తిని కోరారు. ఇందుకు జస్టిస్ సురేష్‌రెడ్డి అంగీకరించి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పలుకుబడితో ముందే తెలుసుకుని.. కాగా చంద్రబాబు న్యాయవాదులు తమ వ్యూహం ఎందుకు మార్చుకున్నారంటే వెకేషన్ కోర్టుల్లో ఎవరెవరు జడ్జీలు ఉండబోతున్నారో తమ పలుకుబడిని ఉపయోగించి ముందుగానే తెలుసుకోగలిగారు. ఆ వెకేషన్ కోర్టులో జస్టిస్ జ్యోతిర్మయి కూడా ఉన్నారని నిర్ధారించుకున్నారు. వాస్తవానికి వెకేషన్ కోర్టులో ఏ న్యాయమూర్తులు ఉండబోతున్నారనది చివరి నిమిషం వరకు బయటకు వచ్చే అవకాశం ఉండదు. అయితే వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు అండ్ కో వెకేషన్ కోర్టులో ఎవరెవరు ఉండబోతున్నారో ముందుగానే తెలుసుకుంది. దానికి అనుగుణంగానే తమ వ్యూహాలకు పదును పెట్టింది. జస్టిస్ జ్యోతిర్మయి ముందు ఎవరెవరు నాట్ బిఫోర్‌గా ఉన్నారో తెలుసుకోగలిగింది. నలుగురు న్యాయవాదులు ఉన్నట్లు తెలుసుకుని, అందులో తమ సామాజిక వర్గానికే చెందిన జీఎల్ఎన్ మూర్తితో ఆట మొదలుపెట్టింది. అయితే ఆటలో చివరకు ఓటమే ఎదురైంది. నైతిక విలువలకు కట్టుబడ్డ జస్టిస్ జ్యోతిర్మయి కాగా మూర్తి సతీమణి ఇందిరా ప్రియదర్శిని కింది కోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. న్యాయాధికారి కావడంతో ఎంతో కాలంగా ఆమె జస్టిస్ జ్యోతిర్మయికి తెలుసు. తనకు మూర్తి సతీమణితో పరిచయం ఉన్న నేపథ్యంలో హైకోర్టులో మూర్తి తన ముందు దాఖలు చేసే కేసులను విచారించకూడదని నైతిక విలువలకు కట్టుబడి జస్టిస్ జ్యోతిర్మయి నిర్ణయం తీసుకున్నారు. అందుకనుగుణంగా మూర్తిని తన నాట్ బిఫోర్ జాబితాలో చేర్చారు. అయితే ఆమె నైతిక విలువలనే చంద్రబాబు ఓ అవకాశంగా మలుచుకున్నారు. ఆమె ముందు తన బెయిల్ పిటిషన్ రాకుండా చేసేందుకు మూర్తితో చంద్రబాబు విజయవంతంగా వకాలత్ దాఖలు చేయించారు. మూర్తి వకాలత్ వేస్తే ఆ పిటిషన్‌ను విచారించేందుకు జస్టిస్ జ్యోతిర్మయి నిరాకరిస్తారని తెలిసే ఆ పని చేశారు. నిబంధనల ప్రకారం వెళితే చంద్రబాబుకు బెయిల్ దొరకడం కష్టమని ఆయన తరఫు న్యాయవాదులకు బాగా తెలుసు. అందుకే తమకే సొంతమైన ‘నాట్ బిఫోర్’ అస్త్రాన్ని బయటకు తీశారు. మూర్తి దాఖలు చేసిన కేసును విచారించనని జస్టిస్ జ్యోతిర్మయి ఓపెన్ కోర్టులో చెప్పడంతో చంద్రబాబు అండ్ కో తమ పాచిక పారిందని సంతోషించారు. అయితే ఇంతలోనే సీజే అనుమతి తీసుకుని చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లలో విచారణను సోమవారానికి వాయిదా వేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ జస్టిస్ జ్యోతిర్మయి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో చంద్రబాబు అండ్ కో బిత్తరపోయింది. -
‘మణప్పురం’ మేనేజర్ అరెస్ట్
కోనేరుసెంటర్: ఎట్టకేలకు మణప్పురం ఫైనాన్స్ సంస్థలో చోరీ కేసును పోలీసులు ఛేదించగలిగారు. అదే సంస్థలో పనిచేస్తున్న ఓ మాయలేడి అక్రమాలకు కృష్ణాజిల్లా పోలీసులు చెక్ పెట్టారు. ఆమెను, మరో ముగ్గురిని పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టారు. దీనికి సంబంధించి కృష్ణాజిల్లా ఎస్పీ పీ జాషువా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. అక్రమ మార్గంలో సంపాదన గుడివాడ మండలం, లింగవరం గ్రామానికి చెందిన రెడ్డి వెంకట పావని డిగ్రీ వరకు చదువుకుంది. వివాహమైన కొంతకాలానికే ఆమె భర్త చనిపోయాడు. అప్పటికే ఆమె మణప్పురం ఫైనాన్స్ కంపెనీలో గోల్డ్‌లోన్ మేనేజర్‌గా పనిచేస్తోంది. జిల్లాలోని ముదినేపల్లి, పెడన, బంటుమిల్లి బ్రాంచ్‌లలో పనిచేసి, ఇటీవల కంకిపాడు బ్రాంచ్‌కు బదిలీపై వెళ్ళింది. గోల్డ్‌లోన్ కోసం తరచూ ఆఫీసుకు వచ్చే కృత్తివెన్ను మండలం, పోడు గ్రామానికి చెందిన రేవు దుర్గాప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా చనువుగా మారింది. దుర్గాపస్రాద్ ప్రైవేట్ కళాశాల నిర్వహిస్తున్నాడు. ఈ పరిచయంతో ఇద్దరూ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనుకుని మణప్పురం ఫైనాన్స్‌లో ఎలాంటి ష్యూరిటీ లేకుండా, ఆభరణాలు తనఖా పెట్టకుండా దుర్గాప్రసాద్‌కు పావని లక్షల రూపాయలు బదిలీ చేసింది. అలాగే తాకట్టులో ఉన్న నగలును పెద్దమొత్తంలో అప్పజెప్పింది. పది నెలల్లో సుమారు రూ.3.60 కోట్లకు పైబడి విలువ చేసే దాదాపు 10.650 కిలోల బంగారాన్ని ఇద్దరూ కలిసి అపహరించారు. ఆడిట్‌తో గుట్టురట్టు వీరి పన్నాగానికి బందరు మండలం, పోలాటితిప్ప గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ తమ్ముడు కొక్కిలిగడ్డ నాగబాబు, కంకిపాడు మణప్పురం ఫైనాన్స్ సంస్థ హౌస్ కీపర్ మిట్టగడుకుల ప్రశాంతి సహకరించారు. అపహరించిన నగలును దుర్గాపస్రాద్ మచిలీపట్నం సహా విజయవాడలోని కోస్టల్ సెక్యూరిటీ బ్యాంకు, సౌత్ సెంట్రల్ బ్యాంకు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాల్లో పలు దఫాలుగా తాకట్టు పెట్టి లక్షల్లో డబ్బు తీసుకున్నాడు. ఈనెల 16న ఒకేసారి తాకట్టులో ఉన్న ఏడు కిలోల బంగారు ఆభరణాలను పావని చోరీ చేసి పరారైంది. విషయం తెలుసుకున్న మణప్పురం శాఖ అధికారులు ఆడిట్ నిర్వహించగా, విషయం బయటపడింది. దీంతో వారు కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎస్పీ జాషువా డీఎస్పీ స్థాయి అధికారులతో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం నెప్పలి గ్రామంలోని డొంకరోడ్డులో పావని, దుర్గాప్రసాద్, వారికి సహకరించిన నాగబాబు, ప్రశాంతిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారాన్ని వందశాతం రికవరీ చేశారు. నగదు కొంత వాడుకున్నట్టు గుర్తించగా, మిగిలిన సొమ్మును స్వా«దీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబరచిన అధికారులందరినీ ఎస్పీ అభినందించారు. -
Oct 27th 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Arrest Remand Petitions Court Hearings And Political Updates 09:00PM, అక్టోబర్ 27, 2023 మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదు: జైళ్ల శాఖ డీఐజీ ►చంద్రబాబు భద్రత విషయంలో ఎంతో కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేశాం ►జైలు లోపల చంద్రబాబుకు భద్రత కట్టుదిట్టంగానే ఉంది. ►మొదటి నుంచి 24 గంటలు సెక్యూరిటీ ఏర్పాటు చేశాం. ►అడిషనల్ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ►కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పుటికప్పుడు సెక్యూరిటీ వాచ్ చేస్తున్నాం. ►మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదని తేలింది. ►చంద్రబాబు జైలుకు వచ్చినప్పటి నుంచి ప్రతీ వారం సెక్యూరిటీ పరిశీలిస్తూనే ఉన్నాం. 15:00 PM, అక్టోబర్ 27, 2023 సోమవారం హైకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్.! ► సోమవారం హైకోర్టు సీజే బెయిల్ పిటిషన్‌ను విచారిస్తారన్న వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి ►సోమవారం కాకుండా వెంటనే విచారించే విధంగా తాము విజ్ఞప్తి చేసుకుంటామని చెప్పిన చంద్రబాబు న్యాయవాదులు ►చంద్రబాబు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ముందుకు కేసును బదిలీ చేసిన న్యాయమూర్తి ►ఏ కోర్టు విచారించాలన్నది హైకోర్టు రిజిస్ట్రార్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసిన న్యాయమూర్తి ►చంద్రబాబు తరఫున వాదించేందుకు ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన లూథ్రా 14:50 PM, అక్టోబర్ 27, 2023 అసైన్డ్ భూముల్లో అక్రమాలు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్ల పై ఏసీబీ కోర్టులో వాదనలు ►వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్లను రిలీజ్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నారాయణ లాయర్లు ►అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ అకౌంట్ లోకి వివిధ మార్గాల్లో నిధులు చేరాయన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ►ఏ34గా ఉన్న నారాయణ అకౌంట్ లోకి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నిధులు వెళ్లాయని తెలిపిన ఏసీబీ తరఫు న్యాయవాది 14:40 PM, అక్టోబర్ 27, 2023 జైలు నుంచి రాసిన లేఖలో చంద్రబాబు ఏం కోరారంటే..! ►ఏసీబీ న్యాయమూర్తికి రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు లేఖ ►తన ప్రాణాలకు ముప్పు ఉందని న్యాయమూర్తికి లేఖ రాసిన చంద్రబాబు ►జైల్లో నన్ను చంపాలని కొందరు మావోయిస్టులు కుట్ర పన్నుతున్నారు ►నన్ను చంపాలని మావోయిస్టులు లేఖ రాసినట్లు నాకు తెలిసింది ►అసంబద్ధ సంఘటనలను ఉదహరిస్తూ లేఖ రాసిన చంద్రబాబు ►తన భద్రత, ఆరోగ్యం పై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ 3 పేజీల లేఖ ►తన హత్య కోసం కోట్ల రూపాయలు చేతులు మారినట్లు చంద్రబాబు అనుమానం ► ఆకాశ రామన్న ఉత్తరంలో సంచలన విషయాలు ఉన్నాయన్న చంద్రబాబు ►నార్కోటిక్స్ డ్రగ్స్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న శృంగవరపుకోటకు చెందిన ఓ నిందితుడు పెన్ కెమెరాతో జైలులో ఖైదీల ఫోటోలు తీస్తున్నాడు ►కొందరు ఆగంతకులు జైలులోకి గంజాయి ప్యాకెట్లను విసిరేశారు ►జైలులో మొత్తం 2200 మంది ఉన్నారు, వీరిలో 750 మంది నార్కోటిక్స్ డ్రగ్స్ కేసు నిందితులు ►2019 జూన్ 25వ తేదీన నా సెక్యూరిటీని తగ్గించారు ►2022 నవంబర్ 4వ తేదీన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది ►2023 ఏప్రిల్ 1న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మరోసారి రాళ్ళదాడి జరిగిందని చంద్రబాబు ఆరోపణ ►అంగళ్లులో పోలీసులపై టిడిపి కార్యకర్తలు చేసిన దాడిని మాత్రం ప్రస్తావించని చంద్రబాబు ►అల్లర్లు జరిగేలా తాను ఎలా రెచ్చగొట్టిన విషయాన్ని దాచిపెట్టిన చంద్రబాబు ►ప్రతీ బహిరంగసభలో ప్రజలను రెచ్చగొట్టేందుకు ఎలాంటి మాటలు మాట్లాడాడో బయటకు చెప్పని చంద్రబాబు 14:35 PM, అక్టోబర్ 27, 2023 కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ►ఏపీ : హైకోర్టులో స్కిల్ కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ జ్యోతిర్మయి ►నాట్ బిఫోర్ మీ అని విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ జ్యోతిర్మయి ►చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై వెకేషన్ బెంచ్ విచారణ ►ఏ బెంచ్ విచారించాలో నిర్ణయించనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 14:20 PM, అక్టోబర్ 27, 2023 పిటిషన్లే పిటిషన్లు ►ఏపీ హైకోర్టులో వర్ల రామయ్య రెండు పిటిషన్ల దాఖలు ►రెండు పిటిషన్లను నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి ►టీడీపీ బ్యాంక్ ఖాతా వివరాలను సీఐడీ కోరడంపై పిటిషన్లు 14:05 PM, అక్టోబర్ 27, 2023 చంద్రబాబు కోసం పిటిషన్ల వెల్లువ ►కోర్టులను ప్రభావితం చేసేలా పిటిషన్లతో వెల్లువెత్తుతున్న చంద్రబాబు మనుష్యులు ►చంద్రబాబు అరెస్ట్ అక్రమ నిర్బంధమని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ►లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు నిరాకరించిన హైకోర్టు 13:45 PM, అక్టోబర్ 27, 2023 కాల్ డాటా పిటిషన్ ►చంద్రబాబు అరెస్టు సమయంలో సిఐడీ కాల్ డేటా అంశంపై విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ ►కాల్ డేటా అంశంపై ఈనెల 31న తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు ►చంద్రబాబు ఉద్దేశ్యాలు సరిగా లేవని తెలిపిన CID 13:45 PM, అక్టోబర్ 27, 2023 ఏపీ హైకోర్టులో వర్ల రామయ్యకు చుక్కెదురు ►ఏపీ హైకోర్టులో వర్ల రామయ్యకు చుక్కెదురు ►వర్ల రామయ్య లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు వెకేషన్ బెంచ్ నిరాకరణ ►టీడీపీ అకౌంట్స్, ఫండ్స్ వివరాలు సీఐడీ కోరటాన్ని.. సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ 13:25 PM, అక్టోబర్ 27, 2023 కాల్ డేటా రికార్డు పిటిషన్‌పై వాదనలు ఇలా.. ►కాల్ డేటా రికార్డు పిటిషన్‌పై తీర్పు చేసిన ఏసీబీ కోర్టు ►ఈనెల 31వ తేదీన తీర్పు వెల్లడించిన ఏసీబీ న్యాయమూర్తి చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు ►చంద్రబాబు తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఈ కాల్ డేటా కీలకం ►చంద్రబాబును విచారించిన గది దర్యాప్తు అధికారి నియంత్రణలో ఉంటుంది ►దర్యాప్తు అధికారికి తెలియకుండా ఫోటోలు, వీడియోలు బయటకి రావు ►మా పిటీషన్ రైట్ టూ ప్రైవసీ కిందకి రావడం లేదు ►కాల్ డేటా ఇవ్వడం వల్ల అధికారులు వ్యక్తిగత సమాచారానికి ఇబ్బంది లేదు ►చంద్రబాబు ఏ తప్పు చేయలేదు.. చంద్రబాబు అరెస్టు అక్రమం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు ►చంద్రబాబు ని అరెస్టు చేసే సమయంలో శాంతి భద్రతల సమస్య వస్తుందని జిల్లా పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు ►ఆ పోలీసు అధికారుల ఫోన్ నెంబర్ లు, వివరాలు తీసుకోవాల్సిన అవసరం సీఐడీకి లేదు ►చంద్రబాబు అరెస్టు అక్రమం అని చెప్పుకునేందుకు ఈ విధంగా పిటిషన్లు వేస్తున్నారు ►చంద్రబాబు స్వయంగా తనను ఉదయం ఆరు గంటలకి అరెస్టు చేసినట్లు చెప్పారు ►సీఐడీ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ను బట్టి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది ►ఇదే విషయాన్ని హైకోర్టు సమర్ధించింది ►ఇలా కాల్ డేటా రికార్డు కోరటం న్యాయ విరుద్దం ►దర్యాప్తు అధికారులకు వ్యక్తిగతంగా ఇబ్బందులు వస్తాయి ►అందువల్ల కాల్ డేటా రికార్డు పిటీషన్ కొట్టివేయాలి 13:15 PM, అక్టోబర్ 27, 2023 అసైన్డ్ భూముల కేసు.. ఏసీబీ కోర్టులో వాదనలు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ►వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్లను రిలీజ్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నారాయణ తరపు న్యాయవాదులు ►అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ అకౌంట్లోకి వివిధ మార్గాల్లో నిధులు చేరాయన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ►గురునానక్ కాలనీలోని ఎస్బీఐలో ఉన్న ఏ34 గా ఉన్న నారాయణ అకౌంట్లోకి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నిధులు వెళ్లాయని తెలిపిన ఏసీబీ తరపు న్యాయవాది ►మధ్యాహ్నం నుండి వాదనలు కొనసాగే అవకాశం 12:20 PM, అక్టోబర్ 27, 2023 కాల్ డేటా పిటిషన్ తీర్పు రిజర్వ్ ►సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు ►తీర్పు అక్టోబర్ 31వ తేదీకి వాయిదా వేసిన న్యాయమూర్తి ►స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటా రికార్డింగ్‌లను కోరుతూ పిటిషన్ ►అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువుర్ని ఫోన్ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయంటున్న చంద్రబాబు తరఫు న్యాయవాది ►ఇది అధికారుల గోప్యతకు భంగమని, ఆ ప్రభావం విచారణపై పడుతుందని సీఐడీ న్యాయవాది వాదన 12:06 PM, అక్టోబర్ 27, 2023 సీడీఆర్ పిటిషన్‌పై మొదలైన వాదనలు ►సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ ►మొదలైన వాదనలు ►వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు 12:00 PM, అక్టోబర్ 27, 2023 ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో పిటిషన్ ►చంద్రబాబు ను అరెస్టు చేసి జైలుకు పంపించటం అక్రమ నిర్భమేనని వాదన ►హైకోర్టులో హెబియస్ కార్పస్ లంచ్ మోషన్ పిటిషన్ ►లంచ్ మోషన్ పిటిషన్ నిరాకరించిన హైకోర్టు 11:45 PM, అక్టోబర్ 27, 2023 నా ప్రాణాలకు ముప్పు ఉంది.. ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ ►ఏసీబీ న్యాయమూర్తికి రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు లేఖ ►జైలు అధికారుల ద్వారా లేఖ పంపిన చంద్రబాబు ►జైల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందని న్యాయమూర్తికి లేఖ రాసిన చంద్రబాబు ►తనను చంపాలని కొందరు కుట్ర పన్నుతున్నారంటూ లేఖలో ప్రస్తావన ►తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ 3 పేజీల లేఖ రాసిన చంద్రబాబు ►మావోయిస్టులు తనను చంపాలని లేఖ రాసినట్లు నాకు తెలిసింది(లేఖలో చంద్రబాబు) ►అసంబద్ధ సంఘటనల్ని ఉదహరిస్తూ లేఖ రాసిన చంద్రబాబు ►ఈ నెల 25న లేఖ రాసిన చంద్రబాబు 11:22 AM, అక్టోబర్ 27, 2023 ఖమ్మంలో తెలుగు తమ్ముళ్ల ఓవరాక్షన్ ►ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అడ్డుకున్న టీడీపీ శ్రేణులు ►ఖమ్మంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి గురువారం రాత్రి హాజరైన మంత్రి అంబటి ►అంబటి బస చేసిన హోటల్‌ను ముట్టడించి చంద్రబాబు నినాదాలు చేసిన టీడీపీ శ్రేణులు ►అంబటి కాన్వాయ్‌పైకి 10 మంది కుర్రాలు కర్రలతో దూసుకొచ్చిన వైనం ►పోలీసుల ఎంట్రీతో తమ్ముళ్ల పరుగులు 10:58 AM, అక్టోబర్ 27, 2023 ప్లీజ్ ప్లీజ్.. సోమవారం దాకా వద్దు ►స్కిల్ స్కామ్ కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ►నాట్ బిఫోర్ మీ అనేసిన వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి ►బిత్తరపోయిన చంద్రబాబు లాయర్లు ►హైకోర్టు సీజే సోమవారం విచారణ చేపడతారని చెప్పిన న్యాయమూర్తి ►సోమవారం కాకుండా వెంటనే విచారణ చేపట్టేలా తాము విజ్ఞప్తి చేసుకుంటామన్న లాయర్లు ►విజ్ఞప్తి మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ముందుకు కేసు బదిలీ చేసిన న్యాయమూర్తి ►ఎవరు విచారణ చేపడతారనే నిర్ణయం హైకోర్టు రిజిస్ట్రార్‌కే వదిలేసిన న్యాయమూర్తి 10:50 AM, అక్టోబర్ 27, 2023 చంద్రబాబు పిటిషన్.. నాట్ బిఫోర్ మీ ►చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ ►బాబు తరపున వాదనలు వినిపించేందుకు వచ్చిన లాయర్ లూథ్రా ►నాట్ బిఫోర్ మీ అనేసిన న్యాయమూర్తి ►వ్యక్తిగత కారణాలతో విచారణ చేపట్టలేనని వెల్లడి ►ఎవరు విచారించాలన్నది హైకోర్టు రిజిస్ట్రార్ నిర్ణయిస్తారన్న న్యాయమూర్తి ►మరో జడ్జి ముందుకు వెళ్లనున్న చంద్రబాబు పిటిషన్ 10:46 AM, అక్టోబర్ 27, 2023 సీడీఆర్ పిటిషన్లో బాబు లాయర్ల వాదన ఇది ►సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ ►చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్‌ను భద్రపరచాలంటూ చంద్రబాబు లాయర్లు ►చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో ఇతర వ్యక్తుల డైరెక్షన్ లో సీఐడి అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారని వాదన ►సీఐడీ తరపున న్యాయవాదులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన ఏసీబీ కోర్టు ►కాల్ డేటా రికార్డ్ పిటిషన్ పై నిన్న(అక్టోబర్ 26, గురువారం) కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు ►అధికారుల కాల్ డేటా ఇస్తే వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పిటిషన్ లో పేర్కొన్న సీఐడి న్యాయవాదులు ►అధికారుల భద్రతకు నష్టం ఉంటుందని పిటిషన్ లో పేర్కొన్న సీఐడీ ►ఇరువర్గాల న్యాయవాదులు దాఖలు చేసిన సిఐడి కాల్ డేటా రికార్డ్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ ►మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న విచారణ 10:23 AM, అక్టోబర్ 27, 2023 అత్యవసర విచారణ లేదు ►అనారోగ్యం పేరుతో హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు ►వెంటనే విచారించాలంటూ హౌజ్‌మోషన్ ద్వారా హైకోర్టును కోరిన చంద్రబాబు లాయర్లు ►అత్యవసర విచారణకు నిరాకరించిన హైకోర్టు ►రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను విచారించనున్న వెకేషన్ బెంచ్ 09:05 AM, అక్టోబర్ 27, 2023 నిజం గెలవాలి అంటున్న భువనేశ్వరీకి పది సూటి ప్రశ్నలు 1)నా ఆస్థి లక్ష కోట్లు అని బాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ ఆస్తిని పాలు, పెరుగు అమ్మి సంపాదించాడా? 2)బాబు అవినీతికి నేను అడ్డు అని నాకు వెన్నుపోటు పొడిచాడు బాబు అని ఎన్టీఆర్ చెప్పింది నిజమా? కాదా? 3)మహానాడు హుండీ డబ్బులు కాజేసేవాడు బాబు అని దగ్గుపాటి పుస్తకం రాసింది నిజమా? కాదా? 4)గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని హరికృష్ణ అన్నది నిజమా? కాదా? 5)బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం రాసింది నిజమా? కాదా? 6)బాబు పాలనలో అంతా అవినీతి అని , బీహార్ నయం అని జపాన్ మాకీ సంస్థ యజమాని పూమిహికో లేఖ రాసి వెళ్ళిపోయింది నిజమా? కాదా? 7)అమరావతి కాంట్రాక్టర్ ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని అమరావతి కాంట్రాక్టర్ అయిన షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్కమ్ టాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. నిజమా? కాదా? 8 ) 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో మాకు ఎటువంటి సంబంధం లేదు అని సీమెన్స్ చెప్పింది అంటే టెండర్ లేకుండా సిమ్సన్ పేరుతో రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది. ఇది నిజమా? కాదా? 9) ఓటుకు కోట్లు అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డితో రూ.50 లక్షల నగదును స్టీఫెన్సన్కు ఇచ్చిన నేరంలో తెర వెనక కథనడిపింది, మనవాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబు. నిజమా? కాదా? 10)బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) 2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజమా? కాదా? 08:17 AM, అక్టోబర్ 27, 2023 బాబుకి కంటి సర్జరీ అవసరం లేదు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ప్రతిరోజు మూడుసార్లు చంద్రబాబుకు వైద్య పరీక్షలు ►కుడి కంటికి కాటరాక్ట్ సర్జరీ చేయించాల్సి ఉందని జైలు అధికారులకు చెప్పిన చంద్రబాబు ►చంద్రబాబు పరీక్షించిన రాజమండ్రి జిజిహెచ్ వైద్యులు ►ఇప్పటికిప్పుడు కంటి సర్జరీ అవసరం లేదని స్పష్టం చేసిన ప్రభుత్వ వైద్యుడు ►ఇదే విషయాన్ని చంద్రబాబుకు తెలియజేసిన జైలు అధికారులు 07:15 AM, అక్టోబర్ 27, 2023 తాత అవినీతి గురించి దేవాన్ష్‌కు చెప్పలేదా భువనేశ్వరమ్మా? ►తాత చంద్రబాబు ఎక్కడ అని మా మనవడు దేవాన్ష్ అడుగుతున్నాడట! ►కానీ, స్కిల్ అవినీతితో అరెస్టై జైల్లో ఉన్నట్లు దేవాన్ష్‌కు తెలియదట ►తాత విదేశాలకు వెళ్లారని భువనేశ్వరి చెబుతోందట ►నన్నపనేని రాజకుమారి ఈ ప్రశ్న అడగడం.. దానికి భువనేశ్వరి ఇలాంటి సమాధానం ఇవ్వడం ►‘నిజం గెలవాలి’ యాత్రలో తిరుపతిలో ఇలాంటి విచిత్రమైన డిబేట్ నడిచింది మరి! ► చంద్రబాబు అరెస్టు తర్వాత దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ మాత్రమే అండగా నిలిచారని భువనేశ్వరి చెబుతుండడం గమనార్హం 07:03 AM, అక్టోబర్ 27, 2023 ఏసీబీ కోర్టులో సీడీఆర్ పిటిషన్‌పై నేడు విచారణ ►స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటా రికార్డింగ్‌లను కోరుతూ పిటిషన్ ► గతంలోనే పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తరఫు లాయర్లు ► ప్రతివాదుల్ని మెన్షన్ చేయకపోవడంతో మళ్లీ పిటిషన్ వేయాలని జడ్జి సూచన ►జడ్జి సూచనతో తిరిగి ఫైల్ చేసిన చంద్రబాబు లాయర్లు ►పిటిషన్‌పై గురువారం(26వ తేదీన) ఏసీబీ కోర్టులో విచారణ.. శుక్రవారానికి వాయిదా ► పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు ►అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువుర్ని ఫోన్ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయంటున్న చంద్రబాబు తరఫు న్యాయవాది ►ఇది అధికారుల గోప్యతకు భంగమని, ఆ ప్రభావం విచారణపై పడుతుందని సీఐడీ న్యాయవాది వాదన ► పిటిషన్‌పై నేడు విచారణ జరపనున్న ఏసీబీ కోర్టు 06:55 AM, అక్టోబర్ 27, 2023 హైకోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు ► నేడు విచారణ చేపట్టనున్న దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ (వెకేషన్ బెంచ్) ►న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్ ముందు శుక్రవారం 8వ కేసుగా లిస్టింగ్ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరణ ► హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు ►ఈ నెల 19న విచారణ జరిపి వెకేషన్ బెంచ్‌కు కేటాయించిన హైకోర్టు ధర్మాసనం ►చంద్రబాబుకు సంబంధించిన వైద్య నివేదికలను కోర్టు ముందు ఉంచాలని రాజమహేంద్రవరం జైలు అధికారుల్ని ఆదేశించిన కోర్టు 06:42 AM, అక్టోబర్ 27, 2023 వివిధ కోర్టులో బాబు పిటిషన్ల పరిస్థితి ఇది ►స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8న ►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 9న ►ఫైబర్‌నెట్ కేసు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్ 10న 06:35 AM, అక్టోబర్ 27, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @48 ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►రాజమండ్రి సెంట్రల్ జైలు 48వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►చంద్రబాబుకు నిత్యం ఆరోగ్య పరీక్షలు, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ►జైలు, లోపల బయటా చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసులు మృతి
కర్ణాటక: చిక్కబళ్లాపుర్లో ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో వాహనం ఢీకొట్టగా.. 12 మంది మరణించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. టాటా సుమోలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. పొగ మంచు వల్లే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతులంతా సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కూలీ పనుల కోసం బెంగళూరు వెళ్తుండగా ఘటన జరిగింది. ఘటనా స్థలాన్ని చిక్‌బళ్లాపూర్ ఎస్పీ నగేష్ పరిశీలించారు. ఉదయం 7 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, మృతుల్లో 9 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని తెలిపారు. చదవండి: వాకింగ్ చేస్తూ.. గుండెపోటుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి -
వాషింగ్ మెషీన్లలో నోట్ల కట్టలు.. భారీగా హవాలా నగదు పట్టివేత
సాక్షి, విశాఖపట్నం: వాషింగ్ మెషీన్లలో తరలిస్తున్న రూ.1.30 కోట్లు హవాలా డబ్బు గుట్టు రట్టయ్యింది. విశాఖ నుంచి విజయవాడకు ఆటోలో తరలిస్తుండగా ఎన్ఏడీ జంక్షన్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. హవాలా నగదుగా అనుమానిస్తున్న విశాఖ పోలీసులు.. నగదుకు సరైన ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేశారు. డబ్బు ఎవరిదానే దానిపై పోసులు ఆరా తీస్తున్నారు. ఓ ప్రముఖ కంపెనీ నుంచి తరలిస్తున్నట్లు గుర్తించారు. చదవండి: బతుకమ్మలను చూసేందుకు వెళ్తూ.. -
నిజం గెలిచింది.. బాబు జైలుకెళ్లారు
సాక్షి, అమరావతి: అడుగడుగునా కుంభకోణాలతో ప్రజా ధనాన్ని దోచేసి అడ్డంగా దొరికిపోయి జైలులో కూర్చున్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆడుతున్న సరికొత్త నాటకం ‘నిజం గెలవాలి’ యాత్ర. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కొన్న దగ్గర నుంచి చంద్రబాబు ఎన్నెన్నో డ్రామాలాడారు. ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దోచుకొంటూ, అవినీతి తప్పితే మరే దృష్టీ లేకపోయినప్పటికీ, పైకి విజన్ ఉన్న నాయకుడిగా కలరింగ్ ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసుల నుంచి తప్పించుకుంటున్న ఆయన.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లారు. ఫైబర్‌నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, పేదల నుంచి అసైన్మెంట్ భూములను కొల్లగొట్టడం వంటి పలు వ్యవహారాల్లోనూ చంద్రబాబు అన్ని నిబంధనలనూ ఉల్లంఘించినట్లు వెల్లడైంది. వీటిపైనా సీఐడీ దర్యాప్తు చేస్తోంది. టిడ్కో గృహాల నిర్మాణం, అమరావతిలో తాత్కాలిక కట్టడాల వ్యవహారంలో కేంద్ర ఆదాయ పన్ను శాఖ పలు అక్రమాలను వెలికితీసింది. తెలంగాణ సర్కారును దెబ్బతీసేందుకు చేసిన ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో అరెస్టు నుంచి తప్పించుకొనేందుకు రాత్రికి రాత్రి మకాం హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చిన చంద్రబాబు.. ఆ తర్వాత అమరావతి రాజధాని పేరుతో అనేక అక్రమాలకు తెరతీశారు. అదేమంటే.. దాడులు చేయడానికి ఆదాయ పన్ను శాఖ ఎవరు? సీబీఐ ఎవరు అంటూ దర్యాప్తు సంస్థల పైనే çహూంకరించేవారు. అవినీతిలో బాబు ‘స్కిల్’ ఇది 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. యువతకు ఉపాధి కల్పించే నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు పేరిట రూ.371 కోట్లు కొల్లగొట్టారు. అందుకోసం జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ. 3,300 కోట్లతో ఒక నకిలీ ప్రాజెక్టును తెరమీదకు తెచ్చారు. సీమెన్స్ కంపెనీ 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూర్చాలన్నది ఒప్పందం. ఈ కార్యక్రమంతో తమకు ఎటువంటి సంబంధం లేదని సీమెన్స్ సంస్థ విస్పష్టంగా ప్రకటించింది. ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా నిధులు జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లు చెల్లించింది. ఇది తప్పని ఆరి్థక శాఖ అధికారులు చెప్పినా బాబు పట్టించుకోలేదు. ఆ నిధులను ఫోర్జరీ డాక్యుమెంట్లు, షెల్ కంపెనీల ద్వారా తరలించేశారు. వాటిలో రూ.241 కోట్లు చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు నివాసానికే చేరినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై బాబు సీఎంగా ఉండగానే జీఎస్టీ అధికారులు దర్యాప్తు చేశారు. సీఐడీ కేసు నమోదు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేసి, కొందరిని అరెస్టు కూడా చేసింది. ఇటీవల మరింత లోతుగా దర్యాప్తు జరిపిన సీఐడీ అధికారులు.. చంద్రబాబు ప్రమేయాన్ని బట్టబయలు చేశారు. 18 నోట్‌ఫైళ్లపై ఆయన సంతకాలు పెట్టినట్లు గుర్తించారు. అన్ని ఆధారాలతో ఆయన్ని అరెస్టు చేశారు. ఆధారాలు బలంగా ఉండటంతో ఆయన కూడా తాను నేరం చేయలేదని ఏ కోర్టులోనూ చెప్పడంలేదు. ఎంతసేపూ అరెస్టులో సాంకేతిక కారణాలంటూ కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వాదనలు వినిపిస్తున్నారు. ఈ వాదనలను కోర్టులు పట్టించుకోవడంలేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు భూదోపిడీ కథ ఇదీ.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్ ఖరారులో చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణ యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు బినామీ లింగమనేని రమేశ్‌కు చెందిన భూములు, బాబు సొంత కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్, మంత్రి నారాయణకు చెందిన భూములను ఆనుకొని వెళ్ళేలా అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. అదే అలైన్‌మెంట్‌ను సింగపూర్ కన్సల్టెన్సీతో ఖరారు చేయించారు. దాంతో చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాలు, బినామీల భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబుకు లింగమనేని రమేశ్ కరకట్ట నివాసాన్ని, హెరిటేజ్ ఫుడ్స్‌కు, నారాయణ బినామీలకు భూములు ఇచ్చారు. పార్టీలోనే అనుమానాలు ఇప్పటివరకు 155 మందికిపైగా చంద్రబాబు కోసం మృతి చెందారని ఆ పార్టీ ప్రకటించింది. అయితే, వీరంతా బాబు అరెస్టయ్యారన్న బాధతో చనిపోయారన్నది వాస్తవం కాదని ప్రజలకు స్పష్టంగా తెలుసు. దీనిపై సోషల్ మీడియాలోనూ సెటైర్లు పేలుతున్నాయి. అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో చనిపోయిన వారిని చంద్రబాబు కోసం మృతి చెందినట్లు చిత్రీకరిస్తున్నారని సామాన్య ప్రజానీకమూ చెబుతున్నారు. అందువల్లే ముందుగా పేర్లు ప్రకటిస్తే విమర్శలు వస్తాయన్న భయంతోనే జాబితా బయటపెట్టలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎవరిని పరామర్శించాలి, యాత్ర ఎక్కడి వరకు, ఎన్ని రోజులు చేయాలన్న విషయాలపై పార్టీ అధిష్టానానికే స్పష్టత లేదు. సాధారణ మరణాలను బాబు అరెస్టుకు ముడిపెట్టి, ఓ తప్పుడు కార్యక్రమాన్ని చేపట్టడం వల్లే ఇప్పుడీ అవస్థలు వచ్చాయని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు మద్దతుగా చేపట్టిన కార్యక్రమాలన్నీ విఫలమయ్యాయి. ఈ యాత్ర పరిస్థితి కూడా అలాగే ఉంటే ఏం చేయాలోనని పారీ్టలో ఆందోళన నెలకొంది. ఫైబర్‌నెట్‌లో బాబు ‘సెట్టింగ్’ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్‌నెట్ ప్రాజెక్టులోనూ బాబు అవినీతి వెల్లడైంది. రూ.330 కోట్ల మొదటి దశ ప్రాజెక్టును తన బినామీ వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టారు. అప్పటివరకూ బ్లాక్ లిస్టులో ఉన్న ఆ కంపెనీని బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. టెండర్ల టెక్నికల్ కమిటీలో హరికృష్ణకు స్థానం కల్పించారు. ఎల్1 గా వచ్చిన కంపెనీకి కాకుండా టెరాసాఫ్ట్‌కు టెండరు కట్టబెట్టారు. ఇలా చేయడం పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధమని ఉన్నతాధికారులు అభ్యంతరం చెప్పినా బాబు పట్టించుకోలేదు. 80 శాతం ప్రాజెక్టు పనులు నాసి రకంగా చేశారు. అలా కొల్లగొట్టిన నిధుల్లో రూ.144 కోట్లు చంద్రబాబుకు చేరినట్లు గుర్తించారు. అసైన్మెంట్ పేరుతో పేదలను దోచిన బాబు బ్యాచ్ అమరావతి ప్రాంతంలో అసైన్మెంట్ భూములను దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పేద రైతులను బాబు బ్యాచ్ భయపెట్టి, వాటి ద్వారా వందల కోట్లు దండుకున్న మోసమిది. అమారావతి పరిధిలో అసైన్డ్ భూములకు ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వదని చంద్రబాబు ప్రభుత్వం తొలుత ప్రచారం చేసింది. దాంతో ఆందోళన చెందిన అసైన్డ్ రైతుల వద్దకు బాబు బ్యాచ్ తమ ఏజెంట్లను పంపింది. అతి తక్కువ ధరకు దాదాపు 617 ఎకరాల అసైన్డ్ భూములు హస్తగతం చేసుకుంది. అనంతరం అసైన్డ్ భూములకు కూడా భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో 41 జారీ చేసింది. భూ సమీకరణ ప్యాకేజీ ద్వారా ఈ బ్యాచ్ రూ.3,737 కోట్లు కొల్లగొట్టింది ఇలా అన్నింటా అడ్డంగా దొరికిపోతున్న చంద్రబాబు.. ఇప్పుడు నిజం గెలవాలంటూ ప్రజల్లో మరో ఎత్తుగడతో వస్తున్నారు. బాబు అరెస్టుతో మనస్తాపం చెంది మృతి చెందారంటూ కొందరు టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలను పరామర్శించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. అసలు వాస్తవమేంటంటే.. నిజం గెలిచింది కాబట్టే ఆయన జైలుకు వెళ్లారు. కానీ, ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు కొత్త డ్రామాకు తెరలేపారు. చంద్రబాబు జైలుకు వెళ్లగానే, ఆయన కుమారుడు లోకేశ్ యువగళం పాదయాత్ర నిలిపివేసి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఆయన మళ్లీ పాదయాత్ర చేపట్టే అవకాశాలు కనిపించడంలేదు. చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలూ కనిపించడంలేదు. దీంతో బాబు సతీమణి భువనేశ్వరితో యాత్ర చేపట్టారు. బుధవారం నుంచి తిరుపతి జిల్లాలో బాబు సొంత గ్రామం నారావారిపల్లె నుంచి యాత్ర ప్రారంభమవుతోంది. భవనేశ్వరి మంగళవారం నారావారిపల్లెకు చేరుకున్నారు. అయితే, ఈ ‘నిజం గెలవాలి’ అనే కార్యక్రమంలో అన్నీ దాపరికాలే. యాత్ర ప్రారంభానికి ఒక రోజు ముందు కూడా యాత్ర సమాచారం, రూట్ మ్యాప్ వంటివి ప్రజలకే కాదు.. ఆ పార్టీ నాయకులకే తెలియవు. ఇప్పటివరకు షెడ్యూలే విడుదల చేయలేదు. మొదటిరోజు పాకాల మండలం నేండ్రగుంటలో ఒక పరామర్శ, ఆ తర్వాత కుదిరితే ఎక్కడైనా ఒక దళితవాడలో సహపంక్తి భోజనం, సాయంత్రం చంద్రగిరి మండలంలోని ఆగరాల వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఒకటి, రెండు రోజులు చూచాయగా కార్యక్రమాలు గురించి మాట్లాడుకుంటున్నా ఇంతవరకు స్పష్టత లేదు. -
పల్నాడు జిల్లా: వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
సాక్షి, పల్నాడు జిల్లా: జంగమహేశ్వరం గ్రామంలో దారుణం జరిగింది. బరితెగించిన టీడీపీ నాయకులు.. వైఎస్సార్సీపీ కార్యకర్త కునిరెడ్డి కృష్ణారెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఆయనను టీడీపీ నేతలు గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి చంపారు. జంగమహేశ్వపురం వైఎస్సార్సీపీ పార్టీలో కృష్ణారెడ్డి యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. కృష్ణారెడ్డి హత్య నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హంతకుల కోసం మూడు స్పెషల్ టీంలను పోలీసులు రంగంలోకి దింపారు. -
అనంతపురంలో టీడీపీ నేత రౌడీయిజం
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, చంద్ర దండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు రౌడీయిజానికి దిగారు. ఆర్అండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్‌రెడ్డిని ఫోన్లో బెదిరించిన ప్రకాష్.. టీడీపీ అధికారంలోకి వస్తే అంతు చూస్తామంటూ రెచ్చిపోయారు. ఆర్అండ్బి అతిథి గృహంలో జరిగిన ఇంజనీర్ల మీటింగ్ లో దౌర్జన్యానికి దిగిన ప్రకాశ్ నాయుడు కాళ్లతో డోర్‌ను తన్ని ఇంజనీర్లపై దాడికి యత్నించాడు. దౌర్జన్యం చేసి రివర్స్ కేసు పెట్టేందుకు టీడీపీ నేత ప్రకాశ్ నాయుడు యత్నిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. -
ప్రొద్దుటూరులో 300 కిలోల బంగారం సీజ్
ప్రొద్దుటూరు క్రైం: బంగారం వ్యాపారానికి ప్రసిద్ధి గాంచిన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారులు సోదాలు జరిపి సుమారు 300 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. బంగారు నగలతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని రెండు వాహనాల్లో తిరుపతికి తరలించారు. ప్రొద్దుటూరులోని నాలుగు బంగారం దుకాణాల్లో ఈ నెల 19 నుంచి ఆదాయపన్నుశాఖ అధికారులు జరిపిన తనిఖీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. అధికారులు బంగారం దుకాణాలతో పాటు యజమానులు, వారి బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఒక దుకాణంలో సుమారు 200 కిలోలు, మరో రెండు దుకాణాల్లో 100 కిలోల వరకు లెక్కలు చూపని బంగారం లభించడంతో దాన్ని సీజ్ చేశారు. కాగా ఐటీ అధికారులు ఈ వివరాలను అధికారికంగా ధ్రువీకరించలేదు. పండుగ సమయంలో స్తంభించిన వ్యాపారం కొనుగోలుదారులకు బిల్లులు ఇవ్వకుండా బంగారు నగలు విక్రయించడంతో పాటు అక్రమంగా బంగారం దిగుమతి చేసుకుంటున్నారని ఫిర్యాదులు వెల్లటంతో ప్రొద్దుటూరులోని నాలుగు బంగారం దుకాణాల్లో ఈ నెల 19న సుమారు 40 మంది ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పెద్దమొత్తంలో లెక్కలు లేని బంగారం లభించడంతో పట్టణంలోని బంగారం దుకాణాల్లో జీరో వ్యాపారం జరుగుతోందన్న విషయం బయటపడిందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలా సుదీర్ఘంగా సోదాలు జరగలేదని వ్యాపారులు పేర్కొన్నారు. వేలాది బంగారం దుకాణాలున్న ప్రొద్దుటూరులో ఐటీ అధికారుల దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా వ్యాపారాలు స్తంభించిపోయాయి. తనిఖీలు తమవరకు ఎక్కడ వస్తాయో అనే భయంతో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. పండుగ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలు దుకాణాలు మూసివేయడంతో నిరాశ చెందారు. -
క్షుద్ర పూజల కలకలం.. నర బలి ఇచ్చారా..?
తూర్పు గోదావరి: మండలంలోని వెదురుపాకలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన కంచి వెంకటరమణ (38) పాల వ్యాపారం చేస్తు న్నాడు. శుక్రవారం రాత్రి పాలకేంద్రం వద్ద వ్యాపారం ముగిసిన అనంతరం ఇంటికి చేరుకోలేదు. రాత్రి 9 గంటల తర్వాత కూడా రాకపోవడంతో వెంకట రమణ కు భార్య విజయలక్ష్మి కాల్ చేయగా ఫోన్ కలవలేదని సమాచారం. ఇదిలా ఉండ గా శనివారం ఉదయం వెదురుపాక నుంచి ఆరికరేవుల వెళ్లే దారిలో వెంకట రమణ పంట బోదెలో పడి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి, ఇంటికి సమాచారం అందించారు. అతడి మృతదేహం కాలువలో పడి ఉండగా, మోటార్ సైకిల్ వంతెనపై ఉంది. అక్కడకు సమీపంలోనే క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు ఉండటం స్థానికంగా అలజడి రేపింది. తలపై బలమైన గాయం వెంకట రమణ తలపై బలమైన గాయం ఉండటంతో అతడిని ఎవరైనా హత్య చేసి కాలువలో పడవేసి ఉంటారని భావిస్తున్నారు. క్షుద్రపూజల నేపథ్యంలో ఎవరైనా అతడిని హత్య చేశారా? లేక హత్య చేసి, కేసును తప్పుదోవ పట్టించడానికి క్షుద్ర పూజలు చేసినట్లు సృష్టించారా అనేది మిస్టరీగా మారింది. సమాచారం తెలిసిన వెంటనే ఎస్సై జి.నరేష్, ఏఎస్సై పి.వెంకటేశ్వరరావులు సిబ్బందితో సంఘటన స్థలాని కి చేరుకుని విచారణ చేపట్టారు. రామచంద్రపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, మండపేట రూరల్ సీఐ కె.శ్రీధర్ కుమార్ కూడా అక్కడకు చేరుకున్నారు. వెంకట రమణకు ఎవరితోనైనా పాత కక్షలున్నాయా, వివాహేతర సంబంధం వంటి కారణాలు, రాత్రి షాపు మూసేసిన తర్వాత ఎక్కడికి వెళ్లాడు, అతడి వెంట ఎవరున్నారు, ఈ హత్యలో ఎవరి ప్రమేయం ఉండి ఉంటుంది, హత్యకు అసలు కారణాలేమై ఉంటాయనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. వెంకట రమణకు భార్య విజయలక్షి్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. శుక్రవారం రాత్రి వరకూ అందరితో మాట్లాడిన అతడు ఉదయానికి విగతజీవిగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తాము ఎలా జీవించాలని కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ సంఘటనపై భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. -
Oct 22nd 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Arrest Remand & AP Political Updates చంద్రబాబు లేఖపై రాజమండ్రి జైలు అధికారుల ట్విస్ట్ చంద్రబాబు పేరుతో విడుదలైన లేఖ జైలు నుండి రాలేదు ఆ లేఖతో రాజమండ్రి జైలుకు సంబంధం లేదని వెల్లడి జైలు నుండి ఏ ముద్దాయి అయినా తన సంతకంతో లేఖ విడుదల చేయ్యాలంటే ముందుగా మాకు తెలియజేయాలి జైలర్ పరిశీలించి, ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది - జైలర్ సంతకం, స్టాంప్ వేసి కోర్టులకు లేదా ప్రభుత్వ అధికారులకు, కుటుంబ సభ్యులకు ఇస్తారు చంద్రబాబు పేరుతో విడుదలైన ముద్రణ కరపత్రం జైలు నుండి జారీ చెయ్యలేదు ఆ లేఖతో రాజమండ్రి జైలుకు సంబంధం లేదు రేపు రాజమండ్రిలో జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ భేటీ మధ్యాహ్నం ఒంటిగంటకు రాజమండ్రి చేరుకోనున్న పవన్ ఇరు పార్టీలు పొత్తు ప్రకటన అనంతరం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం కమిటీ తొలి సమావేశం విజయదశమి రోజున మధ్యాహ్నం 3 గంటలకు మంజీరా హోటల్లో 7:30 PM, అక్టోబర్ 22, 2023 రేపు రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో పవన్, లోకేష్ ► రాజమండ్రి జైలుకు మంగళవారం దసరా సెలవు ప్రకటించిన అధికారులు ► రేపు చంద్రబాబుతో పవన్, లోకేష్ ములాఖత్ ఉండే అవకాశం ► రేపు మ.2గంటలకు పవన్, లోకేష్ ఉమ్మడి సమావేశం ► అనంతరం చంద్రబాబును కలవనున్న పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ► ఎన్ని సీట్లలో ఎవరు పోటీ చేయాలన్నదానిపై టిడిపి, జనసేన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ► దసరా సెలవుల కారణంగా వచ్చేవారం కోర్టులకు సెలవులు ► జైల్లోనే దసరా పండుగ జరుపుకోనున్న చంద్రబాబు 4:30 PM, అక్టోబర్ 22, 2023 లోకేష్ వీపరీత పోకడలు : YSRCP ► రోజుకో పిలుపుతో నవ్వులపాలవుతోన్న లోకేష్ ► దసరా రోజు రావణాసుర దహనం తరహాలో కాగితాలు కాల్చాలని పిలుపు ► ఇప్పటికే పళ్లెం-గంట, సైరన్లు, హారన్లు, కొవ్వొత్తులు అంటూ కామెడీ నిరసనలు ► జనం పట్టించుకోకపోవడంతో మరిన్ని ప్రయోగాలు ► తప్పు చేయలేదని జనం చెవిలో పూలు పెట్టేకంటే.. కోర్టు ముందు వాదించొచ్చుగా? ► 17a సవరణ అంటూ వాదనలు వినిపించేకంటే.. మేం తప్పు చేయలేమని ధైర్యంగా ఎందుకు చెప్పడం లేదు? ► ఇన్నాళ్లు ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లకు మీరిచ్చిన సలహాలు ఇవేనా? ► తప్పు చేసిన వాళ్లు అరెస్ట్ చేసిన తీరును మాత్రం తప్పుబడుతున్నారా? ► ఇంతకంటే మీ దగ్గర కేసు నుంచి బయటపడే మరో మార్గం లేదా? ► మీరు చేసిన తప్పులు ప్రజలు గమనించలేదనుకుంటున్నారా? ► నంగనాచి కబుర్లు, పిచ్చి ప్రదర్శనలు చేస్తే సానుభూతి కాదు కదా.. ఉన్న 23 సీట్లు కూడా ఊడిపోతాయని మీకు అర్థం కావడం లేదా? 4:00 PM, అక్టోబర్ 22, 2023 జైల్లో ఉన్నా.. ఆగని చంద్రబాబు సానుభూతి యత్నాలు ► తెలుగు ప్రజలకు జైలు నుంచి చంద్రబాబు బహిరంగ లేఖ ► నేను జైలులో లేను.... ప్రజల హృదయాల్లో ఉన్నానంటూ మభ్యపెట్టే ప్రయత్నం ► ప్రజల నుంచి నన్ను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరంటూ వ్యాఖ్యలు ► తాను ఇన్నాళ్లు చేసిన తప్పుల గురించి లేఖలో ప్రస్తావించలేదేందుకు? ► విలువలు, విశ్వసనీయత అని చెప్పిన చంద్రబాబుకు తాను చేసిన తప్పులు కనిపించలేదేందుకు? ► 45ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడైనా నీతిగా బతికారా? ► పిల్లను ఇచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారన్నది వాస్తవం కాదా? ► పార్టీని, ప్రభుత్వాన్ని లాక్కుని గెంటేశారన్నది నిజం కాదా? ► అధికారంలో ఉన్న 14 ఏళ్లు తన వాళ్ల మేళ్ల కోసం ప్రయత్నించింది నిజం కాదా? ► మన వాళ్లు బ్రీఫ్డ్ అంటూ ఓటుకు కోట్లు గుమ్మరించలేదా? ► రాష్ట్ర ప్రగతి కంటే తన వాళ్ల బాగే బెటరని చంద్రబాబు నమ్మలేదా? ► స్కిల్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ కేవలం బయటపడ్డ నేరాలే, మిగతా వాటి సంగతేంటీ? ► ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని గోబెల్స్ ప్రచారంతో ప్రజల కళ్లకు గంతలు కట్టలేదా? ► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులను సంపాదించింది ఎట్లా? ► కొడుకు స్టాన్ఫోర్డ్ విద్య ఖర్చు కట్టిందెవరో ప్రజలకు చెప్పరా? ► జూబ్లీహిల్స్‌లో తన ఇంటిని కట్టిందెవరో చంద్రబాబు ప్రజలకు చెప్పగలరా? ► ముందు మీ నిజాయతీని మీరు ప్రశ్నించుకోండి.. తర్వాత ప్రజలకు నీతులు చెప్పండి: YSRCP 1:30 PM, అక్టోబర్ 22, 2023 అసైన్డ్ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ పెద్దలు, వారి మనుష్యులు ♦నారా చంద్రబాబునాయుడు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) ♦ నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ రావెల కిశోర్ బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ తెనాలి శ్రావణ్ కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) ♦ గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) ♦ మండల ఎస్.ఎస్.కోటేశ్వరరావు (రియల్టర్) ♦ మండల రాజేంద్ర (రియల్టర్) ♦ కేవీపీ అంజనీ కుమార్ (రియల్టర్) ♦ దేవినేని రమేశ్ (రియల్టర్) ♦ బొబ్బ హరిశ్చంద్ర ప్రసాద్ (రియల్టర్) ♦ హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్) ♦ పొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్) ♦ దోనేపూడి దుర్గా ప్రసాద్ (రియల్టర్) 12:00 PM, అక్టోబర్ 22, 2023 తప్పు చేసింది కాక.. మళ్లీ సానుభూతి రాజకీయాలా? : మంత్రి అంబటి ► స్కిల్ స్కాంలో చంద్రబాబును సాక్ష్యాధారాలతోనే అరెస్ట్ చేశారు ► కోర్టు కూడా ఆధారాలను నమ్మింది కాబట్టే రిమాండ్ కు పంపింది ► సీఐడీ న్యాయవాదులపై దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ► నిజం గెలవాలి అంటూ భువనేశ్వరి పొలిటికల్ డ్రామా మొదలు పెడుతున్నారు ► లోకేశ్ తలాతోకా లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు ► సింపతీ కోసమే భువనేశ్వరి యాత్రకు సిద్ధమవుతున్నారు ► లోకేశ్ టీడీపీని బతికించడానికి పనికి రాడు ► రాజకీయాలను వ్యాపారం చేసిన వ్యక్తి చంద్రబాబు ► తప్పు చేసిన వారెవరైనా శిక్ష అనుభవించాల్సిందే ► దేశంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబుకు ఎవ్వరూ మద్ధతుగా లేరు ► పవన్ తప్ప చంద్రబాబును చూసేందుకు ఎవరైనా వచ్చారా? ► టీడీపీతో ఉన్న ఒప్పందంతో పవన్ వచ్చాడు ► నిజం గెలుస్తుంది కాబట్టే దోషులు జైలుకు వెళుతున్నారు ► లోకేశ్ ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు నమ్మరు ► పవన్ కు ఏ విషయంపైనా అవగాహన లేదు ► విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలో చదివితే తప్పా? ► వ్యవస్థలను మేనేజ్ చేసిన ఘనుడు చంద్రబాబు 11:40 AM, అక్టోబర్ 22, 2023 బాలకృష్ణను ఎందుకు దూరం పెట్టారు? ► ఉన్నఫళాన ఏపీ నుంచి బాలకృష్ణను గెంటేసిన చంద్రబాబు ► ఏపీలో ఉండొద్దు, తెలంగాణకు పరిమితం కావాలని బాలకృష్ణకు ఆదేశాలు ► తెలంగాణ ఎన్నికల్లో పార్టీ ప్రచారం చేయాలని సూచనలు ► బావ చంద్రబాబు ఆదేశాలపై బాలకృష్ణ మనస్తాపం ► ఇంకెన్నాళ్లు అల్లుడి పేరు చెప్పి తనను దూరం పెడతారని ఆవేదన ► అసలు పార్టీ పెట్టిందే తండ్రి ఎన్టీఆర్, అయినా పెత్తనమంతా చంద్రబాబు చేతిలోనే.! ► రాజకీయాలు పక్కనబెట్టి సినిమాలు, సినీ ఫంక్షన్లతో బాలయ్య బిజీ బిజీ ► బాలకృష్ణ ఏపీ నుంచి దూరం జరిగాక.. నందమూరి కుటుంబంలోనూ ఇబ్బందికరపరిస్థితులు ► ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా బ్రాహ్మణి దగ్గర కనిపించని సోదరుడు మోక్షజ్ఞ ► తొలుత బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి యాత్ర చేస్తుందని ఘనంగా ఎల్లోమీడియా ప్రచారం ► అసలు పార్టీ సారథ్యమే బ్రాహ్మణి చేపడుతుందని బ్యానర్ వార్తలు రాసిన ఎల్లో మీడియా ► తెర వెనక ఏం జరిగిందో కానీ.. అటు బాలకృష్ణ, ఇటు బ్రాహ్మణి పార్టీ కార్యక్రమాలకు దూరం ► కేవలం క్యాండిల్ ర్యాలీ, పళ్లెం-గంట నిరసనలకు పరిమితమైన బ్రాహ్మణి 11:10 AM, అక్టోబర్ 22, 2023 స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును సాక్ష్యాధారాలతోనే అరెస్ట్ చేశారు: మంత్రి అంబటి ► కోర్టు కూడా ఆధారాలను నమ్మింది.. కాబట్టే రిమాండ్‌కు పంపింది ► సీఐడీ న్యాయవాదులపై దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ► నిజం గెలవాలి అంటూ భూవనేశ్వరి పొలిటికల్ డ్రామా మొదలుపెడుతున్నారు ► లోకేష్ తలాతోకా లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు 9:15 AM, అక్టోబర్ 22, 2023 బాబు పిటిషన్లకు వెకేషన్ ఎఫెక్ట్ ► ఇవ్వాళ్టి నుంచి (అక్టోబర్ 22) అక్టోబర్ 29వరకు సుప్రీంకోర్టుకి సెలవులు ► విజయదశమి పర్వదినం కారణంగా వారం పాటు న్యాయస్థానానికి సెలవులు ► సెలవుల తర్వాత కోర్టు ముందుకు విచారణకు రానున్న బాబు పిటిషన్లు 9:10 AM, అక్టోబర్ 22, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు గురించి పది పాయింట్లు.. తండ్రీ కొడుకులు ఏం చేశారంటే.? 1. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును 2016 డిసెంబర్ 29న తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు ప్రారంభించారు. రూ.149కే కేబుల్ ప్రసారాలు, 200 చానళ్లతో టీవీ, ఫోన్ సౌకర్యం ఇస్తామని ప్రకటించారు. 2. ఫైబర్‌నెట్ ప్రాజెక్టును బ్లాక్ లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టారు. రూ.333 కోట్ల బిడ్డింగ్ ముగియటానికి ఒక్క రోజు ముందు టెరాసాఫ్ట్‌ను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు. దీనిపై అభ్యంతరం తెలిపిన APTS వీసీ సుందర్‌ను బదిలీ చేశారు. టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్‌ను టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్‌గా తొలగించారు. 3. టెరాసాఫ్ట్ సంస్థకు 14 ఏళ్లు డైరెక్టర్ ఎవరంటే హెరిటేజ్ సంస్థల్లో డైరెక్టర్‌గా పనిచేసిన దేవినేని సీతారామయ్య 4. బహిరంగ మార్కెట్లో అత్యంత నాణ్యమైన సెట్‌టాప్ బాక్స్ రూ.2,200కే దొరుకుతుండగా చంద్రబాబు సర్కారు మాత్రం రూ.4,400 చొప్పున కొనుగోలు చేసింది. వీటిని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీలో ఉత్పత్తి చేసినట్లు వేమూరి అంగీకరించారు. 5. APSFL నుంచి టెరా సాప్ట్‌కి రూ.284 కోట్లు విడుదల చేశారు. అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి ఇచ్చారు. ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్‌లో ఆ కంపెనీ ఏర్పాటైంది. నెట్వర్క్, ఎక్స్‌వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బును బదిలీ చేశారు. ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమ తదితరులకు వెళ్లినట్లు తేలింది. ఈ కంపెనీలన్నింటి చిరునామా, టెరా సాఫ్ట్వేర్ అడ్రస్ ఒక్కటే. 6. ఈ డబ్బంతా పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు రూటు అయినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇన్కమ్ టాక్స్ కూడా శ్రీనివాస్‌కు, చంద్రబాబుకు నోటీసులిచ్చింది. 7. హెరిటేజ్‌తో సంబంధాలున్న వేమూరి హరికృష్ణప్రసాద్కి టెరా సాఫ్ట్‌తో అనుబంధం ఉంది. ఈవీఎంల దొంగతనం కేసు నమోదైన వ్యక్తికి చెందిన సంస్థకు ఈ ప్రాజెక్టును ఇచ్చారు. టెండర్ల పర్యవేక్షణ కమిటీలో ఆయన్ను సభ్యుడిగా నియమించారు. ఆయనే టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్ సంస్థ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. పర్యవేక్షణ కమిటీ సభ్యుడుగా ఉంటూ తన సొంత సంస్థ టెరా సాఫ్ట్‌కు పనులు ఇచ్చేసుకున్నారు. 8. ఐదేళ్లూ చంద్రబాబు వద్దే పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ఉండింది. ఆ శాఖ పరిధిలోనిదే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్. నిబంధనల మేరకు సంబంధిత శాఖను నిర్వహిస్తున్న మంత్రి మాత్రమే ఆ శాఖలోని ఫైళ్లపై సంతకం చేయాలి. ఇతర మంత్రులు సంతకం చేయకూడదు. 9. లోకేశ్ మంత్రి కాగానే హరికృష్ణ ప్రసాద్‌ను 2017 సెప్టెంబర్ 14న APSFLకు సలహాదారుగా నియమించారు. అప్పటి నుంచి టెండర్లలో గోల్ మాల్ పెద్ద ఎత్తున జరిగినట్టు తేలింది. లోకేశ్ వద్ద ఉన్న శాఖలకు, APSFLకు సంబంధం లేదు. అయినా తన తండ్రి శాఖలోని ఫైల్ తెప్పించుకున్న లోకేశ్.. 2017 నవంబర్ 12న బీబీఎన్‌ఎల్‌తో ఎంవోయూ ఫైల్‌పై సంతకం చేశారు 10. కేంద్రం అనుమతి లేకుండా అంచనా వ్యయం రూ.500 కోట్లకుపైగా పెంచేసి వేమూరి సంస్థకు ఖరారు చేశారు. BBNL మార్గదర్శకాలను తుంగలో తొక్కి.. టెండర్ షరతులను సడలించి.. నిబంధనలు ఉల్లంఘించి.. అర్హత లేని టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్‌కు 11.26 శాతం అధిక ధరలకు పనులు అప్పగించారు. దీనివల్ల అంచనా వ్యయం రూ.907.94 కోట్ల నుంచి రూ.1410 కోట్లకు పెరిగింది. 8:55 AM, అక్టోబర్ 22, 2023 కోర్టులపై వక్రభాష్యాలకు సమాధానాలు ఇవిగో ► కోర్టులకు ఎదురవుతున్న సవాళ్లకు ఇటీవల ఇండియా టుడే కాంక్లేవ్‌లో సూటిగా, స్పష్టంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ సమాధానాలు ప్రశ్న : కోర్టుల స్వతంత్రత గురించి మీరేమంటారు? తీర్పు ఇచ్చే సమయంలో మీపై ఒత్తిడులుంటాయా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ : ► ఒక జడ్జిగా నాకు 23ఏళ్లుగా అనుభవం ఉంది. ► ఒక కేసులో ఇలా ఉండండి, ఇలా తీర్పు చెప్పండి అని ఏ ఒక్కరు మాపై ఒత్తిడి తీసుకురారు, తీసుకురాలేదు. ► ప్రతీ రోజూ సుప్రీంకోర్టులో ఉదయాన్నే బెంచ్ మీదకు వెళ్లకముందు జడ్జిలందరూ కలిసి కాఫీ తాగుతాం. ► కానీ ఏ ఒక్కరు ఇంకొకరి కేసు గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించబోరు ► ఇక హైకోర్టులోనయితే ఈ సున్నితమైన పరిస్థితి మరింత ఎక్కువ. ► కొన్ని సార్లు సింగిల్ బెంచ్‌లో జడ్జి ఇచ్చిన తీర్పును అదే హైకోర్టులోని మరో ఇద్దరు జడ్జిలు సమీక్షించాల్సి ఉంటుంది. ► ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోరు. ► ఎవరి కేసునయితే నేను సమీక్షించబోతున్నానో.. అదే జడ్జితో కలిసి భోజనం చేయవలిసిన పరిస్థితి ఉంటుంది. ► భోజనం షేర్ చేసుకుంటాం. అయితే కేసులను మాత్రం షేర్ చేసుకోం. ► అది మేం తీసుకున్న శిక్షణలో భాగం. ► అంతెందుకు మాపై ప్రభుత్వంలో ఉన్న ఏ వ్యవస్థ నుంచి ఒత్తిడి రాదు. ► ఇది నా ఒక్కరి గురించి చెప్పడం లేదు. మొత్తం దేశంలోని న్యాయవ్యవస్థ గురించి చెబుతున్నాను. 8:40 AM, అక్టోబర్ 22, 2023 యాత్రలకు బయల్దేరుతున్న భువనేశ్వరీ, లోకేష్ ముందు వీటికి సమాధానాలు చెబుతారా? ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌పై టిడిపికి YSRCP ఏడు ప్రశ్నలు 1. అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని ఎకరాను రూ.8 లక్షలకు విక్రయించారు, అలైన్మెంట్ తర్వాత రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చూపించారు. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది వాస్తవం కాదా? 2. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా? 3. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు సీఎం హోదాలో చంద్రబాబే ప్రకటించింది వాస్తవం కాదా? 4. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది వాస్తవం కాదా? 5. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనున్న 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా వాస్తవం కాదా? 6. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్‌ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లు పెరిగిందన్నది వాస్తవం కాదా? 7. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. స్కాం జరగలేదంటారు.. మరి ఇన్నాళ్లు ప్రజలకు రాజధాని కట్టామని ఎందుకు చెప్పారు? చంద్రబాబు సృష్టించిన సంపద అంటే మాయా ప్రపంచమేనా? 8:40 AM, అక్టోబర్ 22, 2023 బలమైన ఆధారాలు vs పసలేని వాదనలు ► స్కిల్ స్కాం కేసులో చంద్రబాబువి అత్యంత బలహీనమైన వాదనలంటున్న న్యాయకోవిదులు ► తనను అరెస్ట్ చేసిన విధానమే చంద్రబాబు చెప్పుకుంటున్న ఏకైక పాయింట్ ► ఎల్లోమీడియాలో చెప్పేదొకటి, కోర్టుల ముందు వాదించేది ఒకటి ► ప్రజలను నమ్మించడానికి తెలుగుదేశం, ఎల్లో మీడియా అబద్డాల ప్రచారం ► 17A కింద అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి అవసరమంటూ గగ్గోలు ► తప్పు చేయలేదు అని కోర్టు ముందు బలంగా చెప్పుకోలేని దుస్థితి ► కోర్టుల ముందు తప్పనిసరి పరిస్థితుల్లో నిజాల ఒప్పుకోలు ► పీకల్లోతు ఆరోపణలు, ప్రతీ దాంట్లో బాబుకు వ్యతిరేకంగా ఆధారాలు ► ఏకంగా 13 చోట్ల స్వయంగా సంతకాలు చేసిన చంద్రబాబు ► ఈ కేసులో చంద్రబాబు తప్పించుకోవడం కష్టమంటున్న లాయర్లు 8:20 AM, అక్టోబర్ 22, 2023 బాబు జైలుకు వెళ్తే .! ► బాబు అరెస్ట్ అనగానే టిడిపి సానుభూతి గేమ్ లు ► బాబు అరెస్ట్ వల్ల నిజానికి ప్రభావం పడేది టిడిపి పైన : మంత్రి అంబటి "అవినీతి బాబు"ని అరెస్ట్ చేస్తే మరణించింది 154 మంది కాదు ! మీ తెలుగుదేశం పార్టీనే!@iTDP_Official@JaiTDP — Ambati Rambabu (@AmbatiRambabu) October 21, 2023 8:00 AM, అక్టోబర్ 22, 2023 జైల్లో బాబు కుశలం ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు క్షేమం ► హెల్త్ బులిటెన్ విడుదల చేసిన సెంట్రల్ జైల్ అధికారులు ► అన్ని పరీక్షల్లో నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం ► BP 130/80 ► పల్స్ 71/మినిట్ ► రెస్పిరేటరీ రేటు 13/మినిట్ ► SP ఓటు 97% ► ఫిజికల్ యాక్టివిటీ : గుడ్ ► లంగ్స్ క్లియర్ ► RBS 138 mg/dl 7:45 AM, అక్టోబర్ 22, 2023 జైల్లో బాబు @ 43వ రోజు ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో 43వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ► నిలకడగా ఉన్న చంద్రబాబు ఆరోగ్యం ► యధావిధిగా చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల ► ఆందోళనలు నిలిపివేసి స్తబ్దంగా మారిపోయిన టిడిపి వర్గాలు ► రేపు రాజమండ్రిలో ఉమ్మడి కార్యాచరణ కోసం భేటీకానున్న లోకేష్ ,పవన్ కళ్యాణ్ ► భేటి అనంతరం ఉమ్మడి కార్యాచరణ విడుదల 7:15 AM, అక్టోబర్ 22, 2023 ఇదేందయ్యా ఇదీ.. ►చంద్రబాబు కోసం టీడీపీ నేతలు తిప్పలు మాములుగా లేవు ►సానుభూతి కోసం సినిమా రేంజ్లో ఎల్లో బ్యాచ్ ప్లాన్ ►టీడీపీ నేతల ప్లాన్ అట్టర్‌ప్లాప్ ►బాబు కోసం మరణించిన 150 మంది పేర్లు చెబుతారా ఎల్లో బ్యాచ్? అదేంటి వర్లా మీ నాయకుడు పోయాడా….? బతికుండగానే ఆయన్ను మీరు పోయాడని అంటున్నారంటే, ఏదో బలంగానే కోరుకుంటున్నట్టున్నారు, కొంపదీసి ఆయన సీటు కోసం పోటీ నా ఏంటీ? 🤭 ఇంతకీ ఆ అసువులు బాసిన 150 మంది పేర్లేమి? #JokerTDP pic.twitter.com/EOqWjG6HOb — YSR Congress Party (@YSRCParty) October 21, 2023 అన్ని పిటిషన్లు విచారణ వాయిదా! ►స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8న ►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 9న ►ఫైబర్‌నెట్ కేసు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్ 10న ►కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై విచారణ 26వ తేదీకి వాయిదా ►ములాఖత్‌ల పెంపు పిటిషన్‌పైనా సానుకూలంగా దక్కని ఏసీబీ కోర్టు తీర్పు ►స్కిల్ కేసులో ఏపీ హైకోర్టులో వెకేషన్ బెంచ్‌కు బెయిల్ పిటిషన్ ఇంతకీ తెలంగాణలో టీడీపీకి ఎంత సీను? ► చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం తెగ ఆరాటపడుతోన్న ఎల్లో మీడియా ► నిజంగానే చంద్రబాబు సామాజికవర్గానికి, తెలుగుదేశానికి తెలంగాణలో అంత సీను ఉందా? ► హైదరాబాద్ కట్టింది నేనే అని ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి? ► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150 డివిజన్ లలో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు? ► మా పార్టీ, మా వర్గం బలంగా ఉందని చెప్పుకునే గుంటూరు జిల్లా పక్కనే నాగార్జున సాగర్ నియోజకవర్గం ► 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 ,714 (మే 3, 2021 ) ► ఇక్కడ మొత్తం పోల్ అయిన ఓట్లు -1 .91 లక్షలు, టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 శాతం లోపే (1 ,714) ► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా ఢిల్లీలో బిల్డప్‌లు ఎందుకు? ► మా తండ్రి చంద్రబాబు గురించి పట్టించుకుంటే తెలంగాణలో బీజేపీ కోసం ఏమైనా చేస్తామని చినబాబు గ్యారంటీలకు విలువుంటుందా? ► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు? ► ఏ సర్వేలోనయినా తెలుగుదేశం ప్రభావం ఉందని చెప్పింది ఒక్కరయినా ఉన్నారా? -
హత‘విధీ’.. ఆనందాన్ని చిదిమేసింది
కారంపూడి: ప్రసవ వేదన పడుతున్న భార్యను ఆస్పత్రిలో చేర్చి.. ఆస్పత్రి ఖర్చులకోసం డబ్బు తీసుకుని బైక్‌పై వెళ్తున్న భర్త ప్రమాదవశాత్తూ బైక్‌పై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. భార్యను తరలించిన అంబులెన్స్‌లోనే అతడిని కూడా అదే ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాణాలు విడిచాడు. అప్పటికే భార్య ప్రసవించగా.. పుట్టిన పాపను కూడా చూసుకోకుండా ఆ తండ్రి కన్ను మూయడంతో అక్కడి వారి హృదయాలు బరువెక్కాయి. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా కారంపూడి ఇందిరా నగర్ కాలనీ గనిగుంతలుకు చెందిన బత్తిన ఆనంద్ (33) భార్య రామాంజనికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో శుక్రవారం 108లో గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెకు రక్తం తక్కువగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె వెంట వాళ్ల అమ్మ, చిన్నమ్మ, ఆశా వర్కర్ ఏసమ్మ వెళ్లారు. భర్తను కూడా అంబులెన్స్ ఎక్కమంటే ఆస్పత్రి ఖర్చులకు డబ్బు తీసుకు వస్తానని ఆగిపోయాడు. శనివారం వేకువజామున డబ్బు తీసుకుని బైక్‌పై నర్సరావుపేట బయలుదేరాడు. మార్గమధ్యంలో జూలకల్లు అడ్డరోడ్డు వద్ద రోడ్డు పక్కన కంకర చిప్స్ ఉండటంతో బైక్ అదుపు తప్పి పడిపోయాడు. తలకు బలమైన గాయం కాగా.. కొంతసేపటి వరకు ఎవరూ చూడకపోవడంతో చాలా రక్తం పోయింది. ఆ తరువాత ఓ వ్యక్తి గమనించి 108కు ఫోన్ చేయడంతో భార్యను ఆస్పత్రి తీసుకెళ్లిన అంబులెన్సే వచ్చి అతన్ని కూడా నర్సరావుపేటలో భార్య ఉన్న ఆస్పత్రికే తీసుకెళ్లింది. అప్పటికే రక్తం ఎక్కువగా పోవడంతో ఆస్పత్రికి వెళ్లిన కొద్దిసేపటికే ఆనంద్ మృతి చెందాడు. అదే ఆస్పత్రిలో ఉన్న భార్యకు సకాలంలో సరైన వైద్యం అందడంతో ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డను కూడా చూసుకునే భాగ్యానికి నోచుకోని ఆనంద్ మృతి ఘటన బంధుమిత్రులను కలచి వేస్తోంది. ఇదిలా ఉంటే రామాంజనికి ఇది నాలుగో కాన్పు. ఇంతకుముందు ఇద్దరు అమ్మాయిలు.. ఒక అబ్బాయి ఉన్నారు. -
Oct 21st 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Arrest Remand & AP Political Updates తూర్పుగోదావరి జిల్లా. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పై 9వరోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన సెంట్రల్ జైల్ అధికారులు నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం బీ పీ 130/80 పల్స్..71/మినిట్ రెస్పిరేటరీ రేటు...13/మినిట్ ఎస్ పీ ఓటు...97శాతం ఫిజికల్ యాక్టివిటీ... గుడ్ లంగ్స్... క్లియర్ ఆర్ బీ ఎస్..138 mg/dl 7:00 PM, అక్టోబర్ 21, 2023 ఇంతకీ.. చంద్రబాబు ఆరోగ్యంతో ఆటలాడిందెవరు? ► తెలుగుదేశం మీటింగ్ లో లోకేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఎల్లో మీడియా ► నా తల్లికి సేవా కార్యక్రమాలు తప్ప.. రాజకీయాలు తెలియదు : లోకేష్ ► గవర్నర్‌ను కలిసేందుకు కూడా నా తల్లి వెళ్లలేదు : లోకేష్ ► ఇప్పుడు నా తల్లి, భార్య కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ విమర్శిస్తున్నారు : లోకేష్ ► నా తల్లి.. బ్రాహ్మణి కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారని చెబుతున్నారు : లోకేష్ ► మరీ జైల్లో క్షేమంగా ఉన్న చంద్రబాబుపై సానుభూతి కోసం మీరేం ప్రచారం చేశారు? ► జైల్లో కేజీ బరువు పెరిగినా.. కొంపలు మునిగిపోతున్నాయంటూ ఎల్లో మీడియాలో వార్తలు రాయించింది ఎవరు? ► మా నాన్నకు స్టెరాయిడ్లు ఇస్తున్నారు.. ఆయన ఆరోగ్యం ఏమై పోవాలి అంటూ దొంగ ఏడ్పులు ఏడ్చింది ఎవరు? ► మా భర్త చంద్రబాబు కిడ్నీలకు ప్రమాదం ఉందని ప్రకటనలు చేసిన భువనేశ్వరీకి డైరెక్షన్ ఎక్కడిది? ► దోమలు, చన్నీళ్లు, ఏసీలు అంటూ లేనివన్ని ఎందుకు అంటగట్టారు? ► ఎప్పటినుంచో ఉన్న స్కిన్ ఎలర్జీని హఠాత్తుగా తెరపైకి ఎందుకు తెచ్చారు? ► ఎల్లో మీడియాలో తప్పుడు వార్తలు అచ్చేస్తే ప్రభుత్వంపై తిరుగుబాటు వస్తుందనుకున్నారా? ► మీరు ప్రారంభించిన విష క్రీడ మీ వరకు వచ్చేసరికి మీకు బాధ కలిగిందా? ► ఇంకెన్నాళ్లు జనాల ముందు అసత్యాలు, అబద్దాలు వల్లె వేస్తారు? 6:50 PM, అక్టోబర్ 21, 2023 అయ్యా.. మీరు పాటిస్తున్న సిద్ధాంతమేంటీ? చెబుతున్న నీతులేంటీ? ► పబ్లిక్ మీటింగ్‌ల్లో దిగజారి బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా నిలిచిన పవన్ కళ్యాణ్ ► ఇటీవల జనసేన మీటింగ్‌లో చెప్పులు చూపించిన పవన్ కళ్యాణ్ ► తీవ్ర విమర్శలు రావడంతో కొత్త సిద్ధాంతం వల్లె వేస్తోన్న పవన్ ► అధికార ప్రతినిధులు జాగ్రత్తగా మాట్లాడాలి : పవన్ ► కులాలు, మతాల గురించి పరిమితులకు లోబడి మాట్లాడాలి : పవన్ ► రాజ్యాంగానికి లోబడి మాట్లాడాలి కానీ నోరు జారొద్దు : పవన్ ► అధికార ప్రతినిధుల కోసం వచ్చే నెలలో వర్క్ షాప్ ఏర్పాటు: పవన్ కల్యాణ్ 6:35 PM, అక్టోబర్ 21, 2023 ఓటుకు కోట్లు దొంగలు వాళ్లు ► తెలంగాణ భవన్ లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి ► కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి హరీష్ రావు ► ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి ఇప్పుడు దొంగ మాటలు చెబుతున్నారు ► బిజెపితో పోరాటం మా DNAలో ఉంది అని రాహుల్ గాంధీ అన్నారు. మరి రేవంత్ రెడ్డి DNAలో ఏముంది? ► రేవంత్ DNAలో టిడిపి ఉందా? కాంగ్రెస్ ఉందా? ► రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి DNA మ్యాచ్ కావడం లేదు ► ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి 6:14 PM, అక్టోబర్ 21, 2023 ఇంతకీ తెలంగాణలో టిడిపికి ఎంత సీను? ► చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం తెగ ఆరాటపడుతోన్న ఎల్లో మీడియా ► నిజంగానే చంద్రబాబు సామాజికవర్గానికి, తెలుగుదేశానికి తెలంగాణలో అంత సీను ఉందా? ► హైదరాబాద్ కట్టింది నేనే అని ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి? ► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150 డివిజన్ లలో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు? ► మా పార్టీ, మా వర్గం బలంగా ఉందని చెప్పుకునే గుంటూరు జిల్లా పక్కనే నాగార్జున సాగర్ నియోజకవర్గం ► 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 ,714 (మే 3, 2021 ) ► ఇక్కడ మొత్తం పోల్ అయిన ఓట్లు -1 .91 లక్షలు, టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 శాతం లోపే (1 ,714) ► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా ఢిల్లీలో బిల్డప్‌లు ఎందుకు? ► మా తండ్రి చంద్రబాబు గురించి పట్టించుకుంటే తెలంగాణలో బీజేపీ కోసం ఏమైనా చేస్తామని చినబాబు గ్యారంటీలకు విలువుంటుందా? ► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు? ► ఏ సర్వేలోనయినా తెలుగుదేశం ప్రభావం ఉందని చెప్పింది ఒక్కరయినా ఉన్నారా? 5:44 PM, అక్టోబర్ 21, 2023 మన పొత్తు ఎవరితో? జనసేనలో అనుమానాలు ► జనసేన అధికార ప్రతినిధులతో పవన్ కల్యాణ్ భేటీ ► హాజరైన 21 మంది రాష్ట్ర అధికార ప్రతినిధులు ► అసలు జనసేన పార్టీ ఎవరితో పొత్తు అని పార్టీలో ప్రశ్నలు ► అధికారికంగా బీజేపీతో కొనసాగుతున్న ఒప్పందం ► రాజమండ్రి జైలు ముందు టిడిపితో పొత్తు అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ► ఇంతకీ జనసేన పొత్తు బీజేపీతోనా? టిడిపితోనా? ► ఒక వేళ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే జనసేనకు మిగిలే సీట్లు ఎన్ని? ► అసలు జనసేన తరపున ఖర్చు పెట్టుకోవాలా లేదా అన్నదానిపై అభ్యర్థుల్లో సందేహాలు 5:20 PM, అక్టోబర్ 21, 2023 తెలంగాణలో బీజేపీతో, ఏపీలో సైకిల్ తో ► హైదరాబాద్ : బీజేపీతో కలిసి తెలంగాణ ఎన్నికల్లో జనసేన ► జనసేనకు కేటాయించే స్థానాలపై బీజేపీలో దాదాపుగా స్పష్టత ► కూకట్ పల్లి, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, పాలేరు, ఇల్లందు, మధిర ► కొత్తగూడెం, అశ్వరావుపేట, స్టేషన్ ఘన్ పూర్, నకిరేకల్, కోదాడ కేటాయించే ఛాన్స్ ► ముందు 36 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ► 36 కాస్తా 12కు వస్తాయా అన్న అనుమానాలు ► పోటీ చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తెలంగాణలో ఎందుకు అడుగు పెట్టలేదని పార్టీలో ప్రశ్న 5:05 PM, అక్టోబర్ 21, 2023 రాజమండ్రికి బ్రేక్ ►రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు భువనేశ్వరి, బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ ►ములాఖత్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ కు కుటుంబ సభ్యులు ►నాలుగు రోజుల్లో చంద్రగిరికి వస్తానని చెప్పిన భువనేశ్వరీ 4:45 PM, అక్టోబర్ 21, 2023 ఎవరి భవిష్యత్తుకు గ్యారంటీ ? ► నవంబర్ 1 నుంచి లోకేష్ ‘భవిష్యత్ కు గ్యారెంటీ’ ► ఎవరూ పట్టించుకోకపోవడంతో గద్గద స్వరంతో లోకేష్ స్పీచ్‌లు ► నిన్నటిదాకా పీxxx అన్న లోకేష్ ఇప్పుడు సానుభూతి కోసం గేమ్‌లు ► ఎవరి భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చేందుకు బస్సు యాత్రలు చేస్తున్నావు? ► ముందు నువ్వు ఎమ్మెల్యే కావడానికి గ్యారంటీ ఉందా? ► మీ పార్టీ పొత్తుల్లేకుండా సింగిల్‌గా పోటీ చేస్తుందన్న గ్యారంటీ ఉందా? ► ఎన్నికల ముందు ఘనంగా ప్రకటించే మ్యానిఫెస్టో మాయం చేయబోరన్న దానికి గ్యారంటీ ఉందా? ► ఇచ్చిన ఏ హామీలోనైనా నిలబడడానికి గ్యారంటీ ఉందా? ► హెరిటేజ్ కోసం ప్రభుత్వ డెయిరీలు మూసివేయబోమన్నదానికి గ్యారంటీ ఉందా? ► అసలు ప్రజల ముందుకెళ్లి నాకు ఇందుకోసం ఓటు వేయండని చెప్పే గ్యారంటీ ఉందా? ► ఏం ఉద్ధరించారని ఓటేయాలని మిమ్మల్ని అడిగితే పారిపోకుండా ఉంటారని గ్యారంటీ ఉందా? ► బయటపడ్డ అన్ని స్కాంల్లో తప్పు చేయలేదని కోర్టు ముందు చెప్పుకోలేని మీ తీరుకు ఏం గ్యారంటీ? ► మేనేజర్ తప్పు చేస్తే ఓనర్‌ను పట్టుకుంటారా అంటూ డొంక తిరుగుడు మాటలు చెప్పవని గ్యారంటీ ఏంటీ? ► మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ అంటూ ఓటుకు కోట్లు గుమ్మరించి బేరాలు సాగించబోరన్నదానికి గ్యారంటీ ఉందా? 4:20 PM, అక్టోబర్ 21, 2023 రంగంలోకి భువనేశ్వరీ.. నిజంగా నిజమే చెబుతారా? ► చంద్రగిరి నుంచి ఈ నెల 25 నుంచి ‘నిజం గెలవాలి’ పేరుతో భువనేశ్వరి ► మహిళల్లో సానుభూతి కోసం భువనేశ్వరీని రంగంలోకి దించిన బాబు ► నిజమే.. నిజం గెలవాలి, భువనేశ్వరీ నిజం చెప్పాలంటున్న YSRCP ► ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఏ రకంగా పార్టీ లాక్కున్నారో నిజం చెప్పాలి ► నందమూరి కుటుంబాన్ని తెలుగుదేశం నుంచి ఏ రకంగా తరిమేశారోనన్న నిజం చెప్పాలి ► ఎందుకు 14 కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడో నిజం చెప్పాలి ► వాట్ ఐ యామ్ సేయింగ్, మన వాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబే అన్న నిజం చెప్పాలి ► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో నిజం చెప్పాలి ► అమరావతి పేరిట భ్రమరావతిని సృష్టించి రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేశారో నిజం చెప్పాలి ► హెరిటేజ్‌కు లబ్ది చేకూర్చేందుకు చిత్తూరు డెయిరీని ఏ రకంగా మూతవేశారో నిజం చెప్పాలి ► రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకుని హెరిటేజ్ పేరిట ముందే ఏ రకంగా భూములు కొన్నారో నిజం చెప్పాలి ► ఎస్సీలు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అసలు వైఖరిని నిజంగా బయటపెట్టాలి ► స్కిల్ స్కాం, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట వందల కోట్లు ఎలా మేశారో నిజం చెప్పాలి ► తన వాళ్ల కోసం చంద్రబాబు చేసిన మేళ్ల గురించి నిజాలు బయటపెట్టాలి 3:35PM, అక్టోబర్ 21, 2023 టీడీపీ, నారా లోకేష్‌లకు ఇక భవిష్యత్ లేదు: మంత్రి ఆదిమూలపు సురేష్ ►టీడీపీ కార్యకర్తలు కేసులు పెట్టించుకుంటే 48 గంటల్లో విడిపిస్తా అని.లోకేష్ అన్నాడు ►వాళ్ళ నాన్న జైలుకి వెళ్లి ఇన్ని రోజులైనా ఎందుకు బెయిలు తేలేకపోయాడు ►పాపం పండిపోయి చంద్రబాబు జైలుకి వెళ్లారు ►యువగళం యాత్ర ఎందుకు లోకేష్ ఆపేశాడు ►ఏ యాత్ర చేసిన టీడీపీ, లోకేష్‌లకు భవిష్యత్ లేదని తేలిపోయింది 2:30PM, అక్టోబర్ 21, 2023 చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ ఫైర్ ►అవినీతి చేయడంలో చంద్రబాబు కాకలు తీరిన యోధుడు ► చంద్రబాబు రాష్ట్రాన్ని లూఠీ చేశారు.. అవినీతిని విశృంఖలం చేశారు ►చంద్రబాబు,లోకేష్ తోడు దొంగలు ►బాబు అవినీతి సామ్రాజ్యం...అక్రమాస్తుల మీద సీబీఐ విచారణ కోరే సత్తా ఉందా? ►బాబును అరెస్ట్ చేసి నంద్యాల నుంచి విజయవాడ తెస్తే ఒక్కడూ కూడా వెంట రాలేదు ►చంద్రబాబు అరెస్ట్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు ►చంద్రబాబు ఏనాడైనా ఎవరికైనా అండగా నిలిచారా? ►మీ పార్టీ పెత్తందారుల పార్టీ కాబట్టే ఎవ్వరూ మీకు మద్దతివ్వడం లేదు ►ఆస్తులపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా? ►చేతగాని చవట సన్నాసులందరూ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు ►పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు ►చంద్రబాబు నిజాయితీపరుడంటూ కబుర్లు చెబుతున్నారు ►చంద్రబాబు అందరివాడు కాదు ►మా వాడు అని ఆయన సామాజికవర్గం వారు చెప్పుకుంటున్నారు ►పెత్తందార్ల పక్షాన నిలబడి పేదలను విస్మరించినందునే చంద్రబాబును ఎవరూ పట్టించుకోలేదు ►గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయింది ►పెత్తందారుల పక్షాన పవన్ పాలేరులా మారాడు ►ఇంగ్లిష్ మీడియంపై పవన్ అర్థం లేని విమర్శలు చేస్తున్నారు ►సీఎం జగన్ పరిపాలన ఒక సువర్ణయుగంగా ఉందని ప్రజలే చెబుతున్నారు 1:00 PM, అక్టోబర్ 21, 2023 చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ ►ములాఖత్‌లో చంద్రబాబును కలిసిన కుటుంబసభ్యులు ►చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి, రామకృష్ణ అక్టోబర్ 21, 2023, 11:57 AM న్యాయవ్యవస్థకు ఓ తలనొప్పిగా చంద్రబాబు సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి సూటి ప్రశ్నలు ►న్యాయాన్ని ఓడించడానికి ఓ పక్క కోట్లు వెదజల్లుతున్నారు ►పేరుమోసిన లాయర్లతో పిటిషన్ల మీద పిటిషన్లు వేయిస్తున్నారు ►మరోపక్క న్యాయం గెలవాలని ఆందోళన చేయడం ►ఇవన్నీ వింతే కదా? ►ట్రయల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు 50కు పైగా పిటిషన్లు వేశారు ►వాటిని కొట్టేసినా, వాయిదా వేసినా మరికొన్ని పిటిషన్లు పడుతున్నాయి ►ఏ కోర్టును ఏం అభ్యర్థిస్తున్నారో వాళ్ళకే తెలియనంత గందరగోళం ►పెండింగ్ కేసుల భారంతో ఒత్తిడిలో ఉన్న కోర్టులకు ఈయనో తలనొప్పిలా మారాడు ►న్యాయ వ్యవస్థ ఇదంతా గమనిస్తూనే ఉంది ►మీ దృష్టిలో న్యాయం, ధర్మం, నిజాయితీ అంటే అర్థం ఏమిటి పురందేశ్వరి గారు? ►వేల కోట్ల స్కాములకు పాల్పడిన చంద్రబాబు గారిపై కేసులు పెట్టడం అన్యాయమా? అక్టోబర్ 21, 2023, 11:50 AM అన్ని పిటిషన్లు విచారణ వాయిదా! ►స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8న ►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 9న ►ఫైబర్‌నెట్ కేసు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్ 10న ►కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై విచారణ 26వ తేదీకి వాయిదా ►ములాఖత్‌ల పెంపు పిటిషన్‌పైనా సానుకూలంగా దక్కని ఏసీబీ కోర్టు తీర్పు ►స్కిల్ కేసులో ఏపీ హైకోర్టులో వెకేషన్ బెంచ్‌కు బెయిల్ పిటిషన్ అక్టోబర్ 21, 2023, 10:58 AM అసాంఘిక శక్తులకు గుణపాఠం నేర్పాలి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జగన్ వ్యాఖ్యలు ►నూజివీడు, అంగళ్ళు, పుంగనూరులో పోలీసు సోదరుల మీద ప్రతిపక్షాలు దాడులు చేశాయి. ►తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వని న్యాయస్థానాల మీద సైతం ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయి. ►ఇలాంటి అసాంఘిక శక్తులకు మనం గుణపాఠం నేర్పాలి. ►అప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుంది. నూజివీడు, అంగళ్ళు, పుంగనూరులో పోలీసు సోదరుల మీద ప్రతిపక్షాలు దాడులు చేశాయి. అంతేకాకుండా తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వని న్యాయస్థానాల మీద సైతం ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయి. ఇలాంటి అసాంఘిక శక్తులకు మనం గుణపాఠం నేర్పాలి. అప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుంది. - సీఎం వైయస్ జగన్… pic.twitter.com/OSizn9ZZR3 — YSR Congress Party (@YSRCParty) October 21, 2023 అక్టోబర్ 21, 2023, 10:40 AM టీడీపీ దృష్టిలో పవన్ వాడిపడేసే వస్తువు మంత్రి చెల్లుబోయిన వేణు కామెంట్స్ ►జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ►రాజకీయ విలువలకు పవన్ ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారు? ►తెలంగాణలో బీజేపీతో పొత్తు, ఏపీలో టీడీపీతో పొత్తు దేనికి సంకేతం? ►పవన్‌ను టీడీపీ ఒక టూల్‌గా టీడీపీ వాడుకుంటోంది ►కాపు సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పవన్ ప్రయత్నం ►ముద్రగడను చంద్రబాబు తీవ్రక్షోభకు గురి చేశారు ►మరోసారి కాపు సామాజిక వర్గాన్ని మోసం చేయడానికే చంద్రబాబు ప్రయత్నం ►చంద్రబాబు మోసానికి కాపులు నష్టపోతారని పవన్ గ్రహించాలి ►చంద్రబాబు శకం ముగిసింది ►చంద్రబాబు చట్టాలకు అతీతుడనుకుంటున్నారు ►దేశంలోని చట్టాలు తనకు వర్తించవనే భ్రమలో బాబు ఉన్నారు ►18 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబుకి నేడు బెయిల్ రావడం లేదు అక్టోబర్ 21, 2023, 08:35 AM ముందు స్కిల్.. ఆ తర్వాతే ఫైబర్‌నెట్ ►ఫైబర్‌నెట్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు నాయుడు ► స్కిల్‌డెవలప్‌మెంట్ కుంభకోణంలో క్వాష్ పిటిషన్ విచారణ చేపట్టిన ధర్మాసనం ముందుకే.. ఫైబర్‌నెట్ పిటిషన్ కూడా ►ముందు స్కిల్ స్కామ్ పిటిషన్ తీర్పు వెల్లడిస్తామన్న ద్విసభ్య ధర్మాసనం ►ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ నవంబర్ 9కి వాయిదా అక్టోబర్ 21, 2023, 07:56 AM రాజమండ్రిలో పవన్-లోకేష్ భేటీ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ప్రతిరోజు చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్న జైలు అధికారులు ►చంద్రబాబుతో ఇవాళ మరోసారి ములాఖత్ కానున్న కుటుంబ సభ్యులు ►ప్రజా స్పందన లేకపోవడంతో నిలచిపోయిన టిడిపి దీక్షలు ►జనసేనతో కలిసి ఉమ్మడి కార్యాచరణ కోసం సిద్ధమవుతున్న టీడీపీ ►ఈనెల 23న రాజమండ్రిలో పవన్ కల్యాణ్, లోకేష్ భేటీ అక్టోబర్ 21, 2023, 07:24 AM మనసంతా బాబే ► తెలంగాణ ప్రచారంలో బిజీగా ఉన్నా.. రేవంత్ మనసంతా బాబేనంటున్న నెటిజన్లు ► తన గురువు చంద్రబాబు జైల్లో ఉండడంతో ప్రచారంలో నీరసంగా కనిపిస్తోన్న రేవంత్ ► కీలక సమయంలో తనకు గురువు నుంచి సూచనలు లేకపోవడంతో బాధలో రేవంత్ అక్టోబర్ 21, 2023, 07:20 AM నేడు తెలుగుదేశం విస్తృతస్థాయి సమావేశం ► ఉదయం 9 గంటలకు పార్టీ కేంద్ర కార్యలయంలో ఎన్టీఆర్ భవన్లో సమావేశం ► చంద్రబాబు అరెస్ట్ గురించి ప్రజలకు ఏం చెప్పాలన్నదానిపై చర్చ ► జనసేన, తెలుగుదేశం సమన్వయం ఎలాగన్నదానిపై చర్చ ► భువనేశ్వరీ కార్యక్రమం నిజం గెలవాలి కార్యక్రమంపై వివరించనున్న లోకేష్ ► యువగళం ఎందుకు నిలిపివేశామన్న దానిపై పార్టీ నేతలకు వివరించనున్న లోకేష్ ► బాబు ష్యూరిటీ యాత్రను బస్సులో తానే నిర్వహిస్తానంటున్న లోకేష్ ► పాదయాత్ర చేసేకంటే బస్సులో యాత్ర బెటరన్న ఆలోచనలో లోకేష్ అక్టోబర్ 21, 2023, 07:18 AM నేడు బాబుతో ములాఖత్ ► నేడు చంద్రబాబుతో కుటుంబసభ్యులు, ముఖ్యనేతల ములాఖత్ ► మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబుతో ములాఖత్ కానున్న కుటుంబసభ్యులు ► చంద్రబాబుతో ములాఖత్ కానున్న నారా లోకేష్, భువనేశ్వరి, టీడీపీ నేతలు అక్టోబర్ 21, 2023, 07:08 AM స్కిల్ కేసులో చంద్రబాబు ►చంద్రబాబు నాయుడిపై స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్ కేసు ►స్కిల్ స్కామ్‌లో కింది కోర్టుల్లో దక్కని ఊరట ►ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేత ► హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ ► గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారంటూ.. 17ఏని వర్తిస్తుందంటూ చంద్రబాబు తరపు లాయర్ల వాదన ► నేరం జరిగిన నాటికి 17ఏ సెక్షన్ లేదని.. కేసు కీలక దశలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని సర్వోన్నత న్యాయస్థానానికి ఏపీ సీఐడీ విజ్ఞప్తి ►వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసిన ద్విసభ్య ధర్మాసనం ►నవంబర్ 8న తీర్పు అక్టోబర్ 21, 2023, 07:05 AM చంద్రబాబు రిమాండ్ @42 ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్ ► నంద్యాలలో సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►సెప్టెంబర్ 10న రిమాండ్ విధించిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ► నేటికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 42వ రోజుకి చేరిన జ్యుడీషియల్ రిమాండ్ ► 7691 నెంబర్‌తో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ► స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది వసతి ►కోర్టు ఆదేశాల మేరకు ఇంటి భోజనం, స్కిన్ ఎలర్జీ దృష్ట్యా ఏసీ వసతి ►ప్రత్యేక బృందంతో రోజుకి మూడుసార్లు వైద్య పరీక్షలు ►తాజాగా.. ఐదోసారి జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►నవంబర్ 1వరకు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో చంద్రబాబు -
Oct 20th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Cases Arrest Remand Court Hearings And Political Updates 20:49, అక్టోబర్ 20, 2023 మనసంతా బాబే.! ► తెలంగాణ ప్రచారంలో ఎంత బిజీగా ఉన్నా.. రేవంత్ మనసంతా బాబు గురించే ► బాబు ఎప్పుడొస్తాడు? తనకు ఎలా దారి చూపిస్తాడు? ► తెలంగాణ ఎన్నికల కీలక సమయంలో బాబు గైడెన్స్ లేకుండా ఎలా పని చేసేది? 19:49, అక్టోబర్ 20, 2023 రిమాండ్ ముద్దాయి నెంబర్ 7691 చంద్రబాబు ఆరోగ్యం కుశలం ► రాజమండ్రి జైల్లో చంద్రబాబు క్షేమంగా ఉన్నారన్న డాక్టర్లు ► ఇవ్వాళ్టి హెల్త్ బులెటిన్ ను విడుదల చేసిన డాక్టర్లు 19:39, అక్టోబర్ 20, 2023 యాక్షన్ ఎవరిపై.? రియాక్షన్ ఎవరిపై ? ► రాజమండ్రిలో ఈ నెల 23 న టీడీపీ - జనసేన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ ► పైకి పొత్తుల ప్రకటన, లోలోన గుంభనంగా మంతనాలు ఈ పొత్తుతో నాకేంటీ అన్న చందాన టీడీపీ, జనసేన నాయకులు ఎంత లాభపడదాం? ఎన్ని సీట్లలో పోటీ చేద్దాం? గెలిచే సీట్లు ఎన్ని? కచ్చితంగా ఓడే సీట్లు ఎన్ని? పైకి ఉద్యమ కార్యాచరణ, లోన సమన్వయ సమస్య ఇప్పటికిప్పుడు పక్క పార్టీకి ఎలా జై కొట్టేది? పోటీకి అవకాశం లేనపుడు సాగిలపడడమెందుకు? అసంతృప్తిని కప్పిపుచ్చేందుకు అటు పవన్, ఇటు లోకేష్ రకరకాల ప్రయత్నాలు 19:19, అక్టోబర్ 20, 2023 ముఖ్యమంత్రి ఆశలకు మంగళం ► జనసేన కార్యవర్గానికి స్పష్టత ఇచ్చిన పవన్ ► సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తే ముఖ్యం ► ముఖ్యమంత్రి పదవి అంటే ఇష్టమే, సుముఖమే ► కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం పదవి గురించి ఆలోచించే పరిస్థితి లేదు ► ఈరోజు మన ప్రాధాన్యం సీఎం పదవి కాదు ► జనసేన కార్యకర్తలకు ఇబ్బందులు ఉన్నా టిడిపితో కలిసి వెళ్లాలి ► గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా పనిచేయాలి ► ప్రతికూల సమయంలోనే నాయకుడి ప్రతిభ తెలుస్తుంది ► ఒకరి అండదండలు లేకుండా జనాదరణతో ఇంతదూరం వచ్చాం ► 150 మంది క్రియాశీల సభ్యులతో పార్టీ ప్రారంభమైంది ► ప్రస్తుతం పార్టీలో 6.5 లక్షల మందికి పైగా సభ్యులున్నారు ► పార్టీపరంగా ఏ నిర్ణయమైనా నేను ఒక్కడినే తీసుకునేది కాదు ► ప్రజల్లో ఉన్న భావాన్ని పలు నివేదికల ద్వారా తెప్పించుకున్నా ► మన పార్టీకి కళ్లు, చెవులు క్రియాశీల సభ్యులే ► క్రియాశీల సభ్యుల అభిప్రాయాలు నివేదిక రూపంలో తీసుకుంటున్నా ► అందరి అభిప్రాయాల మేరకే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నా 18:18, అక్టోబర్ 20, 2023 2 ములాఖత్ లకు ఓకే ►చంద్రబాబుకు జైల్లో రెండు లీగల్ ములాఖత్‌లు ఇవ్వాలని ఏసీబీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ►చంద్రబాబుకు భద్రత దృష్ట్యా రెండు ములాఖత్‌లను ఒకటికి కుదించిన జైలు అధికారులు ►లీగల్ ములాఖత్‌లు మూడుకి పెంచాలని మరోసారి పిటిషన్ వేసిన చంద్రబాబు న్యాయవాదులు ►వివిధ కోర్టులలో కేసులు ఉండటంతో మూడు ములాఖాత్‌లు ఇవ్వాలని కోరిన బాబు తరపు న్యాయవాదులు ►రెండు ములాఖత్ లను అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు 17:20 అక్టోబర్ 20, 2023 నవంబర్ 9కి ఫైబర్ గ్రిడ్ కేసు ►ఏసీబీ కోర్టులో ఫైబర్‌నెట్ కేసు పీటీ వారెంట్‌పై నిర్ణయం వాయిదా ►పైబర్‌నెట్ పీటీ వారెంట్‌పై నిర్ణయం నవంబర్ 10కి వాయిదా ►సుప్రీంకోర్టులో ఫైబర్‌నెట్ కేసుపై విచారణ ఉన్నట్లు సీఐడీ మెమో ►సీఐడీ మెమో ఆధారంగా ఏసీబీ కోర్టులో విచారణ నవంబర్ 10కి వాయిదా ►ఫైబర్‌నెట్ స్కామ్‌లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ నవంబర్9కి వాయిదా ►తొలుత నవంబర్8కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ►నవంబర్9న విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు న్యాయవాది విజ్ఞప్తి 15:10, 20 అక్టోబర్ 20, 2023 హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ ఖాళీ ►బీఆర్ఎస్లో చేరిన టీటీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి ► రావులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ ►కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు అధికారం లోకి వచ్చింది బీఆర్ఎస్: రావుల ►కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ది చెందుతుంది ►మేము అభివృద్ది కోసం పోటీ పడ్డాం కానీ వ్యక్తుల కోసం ఏనాడూ పోటీ పడలేదు 14:05 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో సీడీఆర్ పిటిషన్ వాయిదా ►ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్ విచారణ వాయిదా ►ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►చంద్రబాబు లాయర్ల పిటిషన్‌పై కౌంటర్ వేయాలని సీఐడీకి ఆదేశం ►ఈ నెల 26వరకు సమయం కోరిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ►పీపీ విజ్ఞప్తితో పిటిషన్ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 13:55 అక్టోబర్ 19, 2023 టీడీపీ శ్రేణుల్లో వైరాగ్యం ►చంద్రబాబు అరెస్ట్‌తో పాతాళానికి పడిపోయిన టీడీపీ గ్రాఫ్ ►నాయకత్వ లేమితో పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ►మాటిమాటికి ఢిల్లీకి పోతున్న నారా లోకేష్ ►హడావిడి చేసి.. ఆపై సినిమాలతో బిజీ అయిన నందమూరి బాలకృష్ణ ►సగం సినిమా షూటింగ్‌లతో.. సగం రాజకీయాలతో అయోమయస్థితిలోకి జనసేన క్యాడర్‌ను నెట్టేసిన పవన్ ► సింపథీ కోసం నారా భువనేశ్వరి యాత్ర తెరపైకి ►బాబు అరెస్ట్ అప్పటి నుంచి.. ఇచ్చిన నిరసనల పిలుపునకు ప్రజల నుంచి కనీసం స్పందన లేని వైనం ►న్యాయస్థానాల్లోనూ వరుసగా తగులుతున్న దెబ్బలు.. దక్కని ఊరట ►పండుగ తర్వాత కూడా పరిస్థితి మారకుంటే.. తమ దారి తాము చూసుకోవాలని భావిస్తున్న కొందరు నేతలు 13:34 అక్టోబర్ 19, 2023 స్కిల్ స్కామ్ లో బయటపడింది గోరంత! డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కామెంట్స్ ►దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు చంద్రబాబు ►చంద్రబాబు అరెస్టు అయిన బాధ ఆయన కుటుంబ సభ్యుల్లో కనిపించలేదు.. ►చంద్రబాబు బాధలో ఉంటే బాలకృష్ణ సినిమా ఎలా రిలీజ్ చేస్తారు? ►చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టే జైలు నుంచి రాజకీయం చేస్తున్నారు ►బాబు అనారోగ్యంగా ఉంటే కేజీ బరువు ఎలా పెరుగుతారు? ►చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే సీబీఐ విచారణ కోరవచ్చు కదా! ► రూ. 371 కోట్ల అవినీతిలో అడ్డంగా దొరికిపోయారు కాబట్టి జైలు జీవితం అనుభవిస్తున్నారు ►స్కిల్ స్కామ్ లో బయటపడింది కేవలం గోరంత మాత్రమే ►చంద్రబాబు అవినీతి పూర్తిస్థాయిలో వెతికి తీస్తే కొండంత అవినీతి బయటపడుతుంది నారా బ్రాహ్మణి ట్వీట్స్ వెనుక అత్తమామల వేధింపులే కారణం అయ్యుండొచ్చు. @brahmaninaraతో గొడవపడి అప్పట్లో నారా భువనేశ్వరి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. నారా ఇంటిగుట్టు వాళ్లకి మాత్రమే తెలుస్తుంది. - మాజీ మంత్రి పేర్నినాని #GajaDongaChandrababu#EndofTDP pic.twitter.com/slTX4WCgm5 — YSR Congress Party (@YSRCParty) October 20, 2023 13:06 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో మరో రెండు పిటిషన్లు బాకీ ►ఏసీబీలో కోర్టులో ఇవాళ ఇంకా రెండు విచారణకు రావాల్సిన చంద్రబాబు పిటిషన్లు ►ఫైబర్ నెట్ పీటీ వారెంట్ పిటిషన్ విచారణపై నిర్ణయం తీసుకోనున్న ఏసీబీ కోర్టు ►సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ కేసు విచారణ వాయిదాతో.. ఏసీబీ కోర్టులోనూ వాయిదా పడే అవకాశం ►నేడు కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ ►చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఉన్న అధికారుల కాల్ డేటా రికార్డ్స్ ఇవ్వాలని పిటిషన్ వేసిన చంద్ర బాబు తరపు న్యాయవాదులు ►ఈ పిటిషన్‌పై ఇప్పటికే కౌంటర్ వేసిన సీఐడీ తరుపు న్యాయవాదులు 12:55 అక్టోబర్ 19, 2023 ఓడిపోయే స్థానాలు మనకొద్దు సార్ ►మంగళగిరిలో జనసేన సీనియర్లు, ముఖ్యనేతలతో భేటీ కానున్న పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ►టీడీపీతో పొత్తు, వారాహి యాత్రపై చర్చించనున్న పవన్ ►టీడీపీ ముందర జనసేన డిమాండ్లు ఉంచాలని పవన్‌పై ఒత్తిడి చేయనున్న సీనియర్లు ►పాతికా, ముప్ఫై కాదు.. జనసేనకు యాభై సీట్లు కేటాయించాలి ►సామాజిక వర్గ బలం ఉన్న నియోజకవర్గాలతో పాటు అడిగిన నియోజకవర్గాలే ఇవ్వాలి ►ఓడిపోయే స్థానాలను అంటగట్టొద్దు ►వారాహి యాత్ర అంతటా చేయడం దండగ ►పోటీ చేసే స్థానాల్లోనే చేద్దాం ►పవన్ కల్యాణ్‌కు రెండు సీట్లు ఇవ్వాలి.. రెండు చోట్లా పోటీకి టీడీపీ వాళ్లు కృషి చేయాలి ►టీడీపీకి సమాన గౌరవం జనసేనకు ఇవ్వాలి ►టీడీపీ రెబల్స్‌కు జనసేనలోకి పంపకూడదు ►పార్టీని నమ్ముకున్న వాళ్లకు మాత్రమే టికెట్లు ఇవ్వాలి ►లిక్కర్, పెట్రోల్.. ఇలా మొత్తం ఎన్నికల ఖర్చంతా టీడీపీనే భరించాలి 12:32 అక్టోబర్ 19, 2023 లాయర్ల కోట్ల ఫీజులకు డబ్బెక్కడది?: లక్ష్మీ పార్వతి ►చంద్రబాబు కేసుల కోసం సీనియర్ లాయర్లు ►40 రోజులుగా చంద్రబాబు కోసం 19 మంది లాయర్లు పని చేస్తున్నారు ►సీనియర్ లాయర్లకు రోజు రూ.కోటి నుంచి రూ.2.50 కోట్లు ఫీజు ►లాయర్ల ఫీజుకే కోట్లకు పైగా ఖర్చు ఉండొచ్చు ►2 శాతం హెరిటేజ్ షేర్లను విక్రయిస్తే రూ.400 కోట్ల ఆదాయం వస్తుందని భువనేశ్వరి చెప్పారు ►లాయర్ల ఫీజు చెల్లించడానికి ఎక్కడ్నుంచి డబ్బులు వచ్చాయో చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు తెలపాలి ►దాచుకున్న అవినీతి సొమ్మును లాయర్లకు చెల్లించడానికే లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టారా? 11:22 అక్టోబర్ 19, 2023 క్వాష్ తర్వాతే ఫైబర్ నెట్ సంగతి ►ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ నవంబర్ 9వ తేదీకి వాయిదా ►స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ తీర్పు పెండింగ్‌లో ఉందని.. అది ఇచ్చేవరకు ఆగాలని బాబు లాయర్లకు సూచించిన సుప్రీంకోర్టు ►ఆ తర్వాతే ఫైబర్ నెట్ కేసు సంగతి చూస్తామని వెల్లడి ►చంద్రబాబు జైలులోనే ఉన్నారు కదా, మీరు ఇంటరాగేషన్ చేసుకోవచ్చు కదా: జడ్జి ►క్వాష్ పిటిషన్‌పై 8వ తేదీన తీర్పు ఇస్తామన్న ధర్మాసనం ►క్వాష్ పిటిషన్‌పై ఇప్పటికే ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ ►ఇవాళ లిఖిత పూర్వక వాదనల సమర్పణకు ఆఖరు తేదీ ►17ఏ సెక్షన్‌పైనా సాగిన వాడీవేడి వాదనలు ►స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్‌కు సుప్రీం నో ► నేరుగా తుది తీర్పే ఇస్తామని చంద్రబాబు లాయర్లకు స్పష్టీకరణ ►నవంబర్ 8 కోసం ఉత్కంఠంగా ఎదురు చూడాల్సిన టీడీపీ శ్రేణులు 10:59 అక్టోబర్ 19, 2023 ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా ►ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ►విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్‌కుమార్ వాదనలు సిద్ధార్థ లూథ్రా వాదనలు: ►పిటిషనర్‌పై మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి.. ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయ్యింది ►ఫైబర్‌నెట్ కేసులో అరెస్ట్ చేయవద్దని ఇప్పటికే కోర్టు చెప్పింది ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలు ►ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు ►చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోంది.. ఈ అంశాన్ని కౌంటర్ అఫిడవిట్లో తెలిపాం -- ►వాదనల తర్వాత తదుపరి విచారణ నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసిన కోర్టు ►వ్యక్తిగత ఇబ్బంది కారణంగా ఆ మరుసటి రోజుకి విచారణ కోరిన లాయర్ లూథ్రా ► సరేనన్న ధర్మాసనం ► నవంబర్ 9దాకా.. చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని, పీటీ వారెంట్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశం 10:49 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ ►చంద్రబాబు లీగల్ ములాఖత్ పిటిషన్‌ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు ►లీగల్ ములాఖత్‌లను పెంచాలని గురువారం పిటిషన్ వేసిన బాబు లాయర్లు ► వివిధ కోర్టుల్లో చంద్రబాబు కేసుల విచారణలు ఉన్నందునా.. లీగల్ ములాఖత్‌ల సంఖ్య మూడుకి పెంచాలని పిటిషన్లో కోరిన లాయర్లు ► అత్యవసర విచారణ కోరగా.. సాధ్యం కాదన్న కోర్టు ►కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశం ►ప్రతివాదుల్ని చేర్చకపోవడంతో విచారణ అవసరం లేదంటూ ఇవాళ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు ►సరైన లీగల్ ఫార్మట్‌లో మరోసారి పిటిషన్ ఫైల్ చేయమని సూచన 10:15 అక్టోబర్ 19, 2023 చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్‌నెట్ స్కాం ►ఫైబర్‌నెట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై సీఐడీ అభియోగాలు ►టెండర్లలోనే కాకుండా నాసిరకం పరికరాలతో ప్రజాధనం దోపిడీ ►రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని చంద్రబాబు లూటీ చేశారు ►బాబు హయాంలో 2015 సెప్టెంబర్ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం జరిగింది ►2021లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు ►చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్ నెట్ స్కామ్ ►హెరిటేజ్‌తో సంబంధాలున్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ ద్వారా వీరు దోపిడీ ►బ్లాక్ లిస్టులో ఉన్న టెరా కంపెనీకి టెండర్ ►అభ్యంతరం తెలిపిన ఏపీటీఎస్ వీసీ అండ్ ఎండీ సుందర్ బదిలీ ►టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్‌ను టెరా మీడి యా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్‌గా తొలగింపు ►ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి టెరా సాప్ట్‌కి రూ.284 కోట్లు విడుదల ►అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి చేరిక ►ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్‌లో ఆ కంపెనీ ఏర్పాటు!! ►అప్పటికప్పుడు సృష్టించిన షెల్ కంపెనీల ద్వారా డబ్బుల తరలింపు ►నెట్వర్క్, ఎక్స్‌వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బు బదిలీ ►ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమకు చేరిక ►పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ఈ డబ్బంతా చివరకు చంద్రబాబు వద్దకు ►ఫైబర్ గ్రిడ్ స్కామ్ సూత్రధారులు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లే అని సీఐడీ దర్యాప్తులో వెల్లడి 09:45 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో మూడు పిటిషన్లపై విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో నేడు చంద్రబాబు మూడు పిటిషన్లపై విచారణ ►ఫైబర్ నెట్ స్కామ్ కేసులో పీటీ వారెంట్‌పై విచారణ ►సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి.. నిర్ణయం తీసుకునే అవకాశం ►నేడు ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డ్స్ పిటిషన్‌పై విచారణ ►చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఉన్న అధికారుల కాల్ డేటా రికార్డ్స్ ఇవ్వాలని పిటిషన్ వేసిన చంద్ర బాబు తరపు న్యాయవాదులు ►ఈ పిటిషన్‌పై ఇప్పటికే కౌంటర్ వేసిన సీఐడీ తరుపు న్యాయవాదులు ►సీడీఆర్ పిటిషన్ నేడు విచారించనున్న ఏసీబీ కోర్టు ►చంద్రబాబుకి లీగల్ ములాఖాత్ల సంఖ్య మూడుకి పెంచాలని గురువారం బాబు లాయర్ల పిటిషన్ ►అత్యవసర విచారణకు నిరాకరించిన ఏసీబీ కోర్టు ►కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశం ►నేడు లీగల్ ములాఖత్‌ల పిటిషన్‌పైనా విచారణ జరిగే అవకాశం 08:55 అక్టోబర్ 19, 2023 బాబు ఆరోగ్యం.. నారా ఫ్యామిలీ అల్లిన కథలు ►గురువారం వర్చువల్ విచారణ టైంలో చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీసిన జడ్జి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? చంద్రబాబు : ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులున్నాయి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : జైల్లో డాక్టర్లున్నారు కదా, రోజూ చెక్ చేస్తున్నారా? చంద్రబాబు : అవును, రోజూ డాక్టర్లు చెక్ చేస్తున్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : డాక్టర్లు హెల్త్ రిపోర్ట్ ఇస్తున్నారా? చంద్రబాబు : అవును, డాక్టర్లు ఏ రోజుకారోజు హెల్త్ రిపోర్టు ఇస్తున్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : ఇంకా ఏమైనా సమస్యలున్నాయా? చంద్రబాబు : జెడ్ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడిని నేను, నాకు సెక్యూరిటీపై అనుమానాలున్నాయి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : మీకున్న సందేహాలను రాతపూర్వకంగా ఇవ్వండి, పరిశీలిస్తాం ఇవి చంద్రబాబు స్వయంగా జడ్జి ఎదుట చెప్పిన మాటలు.. మరి నారా ఫ్యామిలీ ఏమంటోంది? మా నాన్నకు స్టెరాయిడ్స్ : గత వారం తనయుడు నారా లోకేష్ బాబు చంద్రబాబు ఆరోగ్యం విషమంగా ఉంది, ఆయన కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం : చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ ►ఈ ఆరోపణలన్నీ వట్టివేనని తేల్చిన కోర్టు విచారణ ►లోకేష్, భువనేశ్వరీ అసత్య ఆరోపణలు ఎందుకు? ►స్టెరాయిడ్స్, కిడ్నీలు ఎక్కడినుంచి అల్లిన కథలు? ►టీడీపీ పతనం నేపథ్యంలోనే.. సానుభూతి కోసం అసత్యాల ప్రచారమా? 08:36 AM, అక్టోబర్ 20, 2023 తీర్పు ఎప్పుడన్న దానిపై ఉత్కంఠ ►చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ ►స్కిల్ డెవెలప్మెంట్ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏపై వాడీవేడిగా సాగిన వాదనలు ►ఇరుపక్షాలు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయడానికి ఇవాళ(శుక్రవారం) ఆఖరిరోజు ►వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ ►నేరుగా తీర్పు ఇస్తామంటూ.. బాబు లాయర్లు చేసిన మధ్యంతర బెయిల్ విజ్ఞప్తిని తిరస్కరించిన ధర్మాసనం ►21 నుంచి 29 దాకా కోర్టుకు దసరా సెలవులు ►ఎలాంటి తీర్పు వస్తుందో? ఎప్పుడు వస్తుందోనని చంద్రబాబు కుటుంబ సభ్యుల్లో.. టీడీపీ శ్రేణుల్లో ఆందోళన 08:15 AM, అక్టోబర్ 20, 2023 టీడీపీ ఆశలన్నీ ఆ ఫలితం మీదే! ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 41వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ఇవాల్టి నుండి చంద్రబాబుకు మరో 14 రోజులు రిమాండ్ కొనసాగింపు ►నవంబర్ 1 వరకు రిమాండ్‌లోనే చంద్రబాబు ►సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ ఫలితంపైనే టీడీపీ ఆశలు ►జైల్లో చంద్రబాబుకు యధావిధిగా కొనసాగుతున్న ఆరోగ్య పరీక్షలు ►సుప్రీంలో క్వాష్ పిటిషన్ ఫలితం తేలాకే ప్రారంభం కానున్న భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర 07:43 AM, అక్టోబర్ 20, 2023 సుప్రీంలో బాబు ఫైబర్ నెట్ స్కాం కేసు విచారణ ►సుప్రీం కోర్టులో నేడు ఫైబర్ నెట్ స్కామ్ కేఏసు విచారణ ►ఫైబర్ నెట్ స్కాం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ ► ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణ ► హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్ ►విచారించనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►9వ నెంబర్ కేసుగా లిస్ట్ అయిన పిటిషన్ ►ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ల కేటాయింపుల్లో బాబు భారీ అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు ►చంద్రబాబు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కంపెనీ టేరా సాప్ట్ కు నిబంధనలు ఉల్లంఘించి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ►బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టడం పై అవినీతి ఆరోపణలు ► ఇవాళ్టి సుప్రీం ఆదేశాల తర్వాతే.. పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం 07:30, అక్టోబర్ 19, 2023 అన్నీ నిజాలే చెప్పాలి ► నిజం గెలవాలి పేరిట యాత్రలో నారా భువనేశ్వరీ నిజం చెప్పాలి ► ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఏ రకంగా పార్టీ లాక్కున్నారో నిజం చెప్పాలి ► నందమూరి కుటుంబాన్ని తెలుగుదేశం నుంచి ఏ రకంగా తరిమేశారోనన్న నిజం చెప్పాలి ► ఎందుకు 14 కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడో నిజం చెప్పాలి ► వాట్ ఐ యామ్ సేయింగ్, మన వాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబే అన్న నిజం చెప్పాలి ► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో నిజం చెప్పాలి ► అమరావతి పేరిట భ్రమరావతిని సృష్టించి రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేశారో నిజం చెప్పాలి ► హెరిటేజ్‌కు లబ్ది చేకూర్చేందుకు చిత్తూరు డెయిరీని ఏ రకంగా మూతవేశారో నిజం చెప్పాలి ► ఎస్సీలు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అసలు వైఖరిని నిజంగా బయటపెట్టాలి ► స్కిల్ స్కాం, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట వందల కోట్లు ఎలా మేశారో నిజం చెప్పాలి ► తన వాళ్ల కోసం చంద్రబాబు చేసిన మేళ్ల గురించి నిజాలు బయటపెట్టాలి 07:10 AM, అక్టోబర్ 20, 2023 చంద్రబాబుకు భద్రతా అనుమానాలు ►జైల్లో తన భద్రతపై అనుమానాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు ►గురువారం వర్చువల్ విచారణ సందర్భంగా జడ్జితో ప్రస్తావించిన బాబు ►అలాంటి సమస్యలు ఉంటే లిఖిత పూర్వకంగా తెలియజేయాలని బాబుకి సూచించిన కోర్టు ►చంద్రబాబు రాసిన లేఖను సీజ్ చేసి సమర్పించాలని అధికారులకు కోర్టు ఆదేశం ►ఆరోగ్య సమస్యలూ ఉన్నాయని జడ్జితో చెప్పిన చంద్రబాబు ►అధికారుల్ని వివరణ కోరిన ఏసీబీ న్యాయమూర్తి ►ప్రత్యేక వైద్య బృందం ఉందన్న అధికారులు ►వైద్య నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పించాలని ఆదేశించిన ఏసీబీ జడ్జి 07:10 AM, అక్టోబర్ 20, 2023 వెకేషన్ బెంచ్‌కు బెయిల్ పిటిషన్ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా ►సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్‌ను తోసిపుచ్చిందని గుర్తు చేసిన సీఐడీ తరపు న్యాయవాది ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ►సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణ చేపట్టలేమన్న హైకోర్టు ►విచారణను దసరా తర్వాతకి వాయిదా వేసిన కోర్టు ► వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేయాలని రిక్వెస్ట్ చేసిన బాబు లాయర్లు ►బాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం ►చంద్రబాబు ఆరోగ్య సమస్యలను జడ్జి దృష్టికి తీసుకెళ్లిన బాబు లాయర్లు 06:55 AM, అక్టోబర్ 20, 2023 వివిధ కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లు ►ఫైబర్ నెట్ కేసులో నేడు చంద్రబాబు పిటిషన్‌పై విచారణ ►ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్న ద్విసభ్య ధర్మాసనం ►స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్‌పై విచారణ ►ఇప్పటికే ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ ►నేడు లిఖిత పూర్వక వాదనలు సమర్పించనున్న ఇరుపక్షాల న్యాయవాదులు ►తీర్పు దసరా తర్వాతే వెలువడే అవకాశం? ►ఏపీ హైకోర్టులో ఐఆర్ఆర్ కేసు విచారణ నవంబరు 7కి వాయిదా ►నేడు కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ ►సుప్రీంలో ఫైబర్‌నెట్ కేసు విచారణ ఉండడంతో.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు హాజరు పెండింగ్ ► సుప్రీం ఆదేశాల తర్వాతే.. ఫైబర్ నెట్ కేసులోనూ పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే ఛాన్స్ 06:35 AM, అక్టోబర్ 20, 2023 చంద్రబాబు రిమాండ్ @41 ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్ ► నంద్యాలలో సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►సెప్టెంబర్ 10న రిమాండ్ విధించిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ► నేటికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 41వ రోజుకి చేరిన జ్యుడీషియల్ రిమాండ్ ► 7691 నెంబర్‌తో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ► స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది వసతి ►కోర్టు ఆదేశాల మేరకు ఇంటి భోజనం, స్కిన్ ఎలర్జీ దృష్ట్యా ఏసీ వసతి ►ప్రత్యేక బృందంతో రోజుకి మూడుసార్లు వైద్య పరీక్షలు ►తాజాగా.. గురువారం ఐదోసారి రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►నవంబర్ 1వరకు రిమాండ్ పొడిగింపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రం అట్టుడికిపోతున్నట్లు JaiTDP, ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. కానీ.. ఇప్పటి వరకూ ఒక్కరోజూ కూడా ఎక్కడా హెరిటేజ్‌ని మూసిన దాఖలాలు కనిపించలేదు. నేను వస్తున్నా అంటూ గప్పాలు కొట్టిన బాలయ్య.. హైదరాబాద్‌కి వెళ్లిపోయి కులాసాగా సినిమా పూర్తి చేసుకుని ఈరోజు… pic.twitter.com/C9SXh0EKTU — YSR Congress Party (@YSRCParty) October 19, 2023