సాక్షి, విశాఖపట్నం : భీమిలి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ అందరికీ అందేలా చర్యలు చేపట్టాలని వైఎస్సార్ సీపీ నేత, భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ కోరారు. కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటుచేసి, పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సేవ్ డెమోక్రసీ అని నినాదం చెయ్యడం కంటే ముందు రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ గురించి మాట్లాడాలన్నారు.
ఉద్యోగులకు ఓటు హక్కు ఇవ్వలేని సీఎంపై ప్రజలకు ఎలాగూ నమ్మకం లేదని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబునాయుడు మాదిరిగానే విశాఖ జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ పదో తేదీన విధులు వేస్తూ ఏడో తేదీ నాటికీ పోస్టల్ బ్యాలెట్ నిలిపివేశారని, దీని వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment