కృష్ణాజిల్లా గుడివాడలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీని మంగళవారం సమైక్య సెగ తగిలింది. సమైక్యాంధ్రకు మద్దతుగా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చొరవ తీసుకోవాలని ఏపీఎన్జీవోలు పనబాక లక్ష్మీకి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
విభజన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇకనైన ఉపసంహరించేలా చర్యలు తీసుకోవాని వారు కేంద్రమంత్రి పనబాక లక్ష్మీని ఈ సందర్భంగా వారు కోరారు. దాదాపు 60 రోజులుగా తాము సమైక్య ఉద్యమం చేస్తున్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు నిమ్మకు నిరెత్తినట్లు వ్యహారిస్తుండటం పట్ల ఏపీఎన్జీవోలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.