`అవకాశవాద పార్టీతో మతోన్మాదపార్టీ వెళ్తుంది`
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరగనున్న నేపథ్యంలో బీజేపీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ తెలంగాణపై నయవంచన చేసిందంటూ నారాయణ విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవకాశవాద పార్టీతో మతోన్మాదపార్టీ కలిసి వెళ్తొందంటూ ఘాటుగా విమర్శించారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధంతాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వాడుకోవలనుకుంటున్నారని నారాయణ విమర్శించారు. ప్రస్తుతం పెరిగిన కరెంట్, గ్యాస్ ధరల పెంపుపై ఆందోళన చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు.