కాపులకు ఇంకా స్వాతంత్య్రం రాలేదు: ముద్రగడ | Police Stops Again Mudragada Padmanabham Padayatra | Sakshi
Sakshi News home page

కాపులకు ఇంకా స్వాతంత్య్రం రాలేదు: ముద్రగడ

Published Wed, Aug 16 2017 1:58 AM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM

కాపులకు ఇంకా స్వాతంత్య్రం రాలేదు: ముద్రగడ

కాపులకు ఇంకా స్వాతంత్య్రం రాలేదు: ముద్రగడ

కాకినాడ: దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ తమ కాపు జాతికి ఇంకా స్వాతంత్ర్యం రాలేదని కాపు ఉద్యమనేత ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. చలో అమరావతి పాదయాత్ర కోసం కిర్లంపూడిలోని తన నివాసం నుండి కాపు జేఏసీ నేతలతో కలిసి జాతీయ జెండా పట్టుకుని బయలుదేరిన ముద్రగడను పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. దీంతో కాపు నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
 
ప్రభుత్వాలైనా, అధికారులైనా చట్టాలకు లోబడే పనిచేయాలని, అయితే ఏపీలో ఆ పరిస్ధితులు లేవని విమర్శించారు. జిల్లాలో సెక్షన్ 30, 144 లు తమ కాపు జాతికే అమలు చేస్తున్నారని, జగ్గంపేటలో జరిగే ముఖ్యమంత్రి సభకు అవి వర్తించవా అని ముద్రగడ పోలీసులను ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement