బంద్‌కు సహకరించండి | Union Cabinet approves creation of Telangana YSRCP, call for bandh in Seemandhra | Sakshi
Sakshi News home page

బంద్‌కు సహకరించండి

Published Fri, Dec 6 2013 4:59 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

Union Cabinet approves creation of Telangana YSRCP, call for bandh in Seemandhra

 బొబ్బిలి, విజయనగరం కలెక్టరేట్ న్యూస్‌లైన్ :  రాష్ర్ట విభజనకు కేంద్ర కేబినేట్ ఆమోద ముద్ర వేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం బంద్ పాటించాలని  వైఎస్‌ఆర్ సీపీ  ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్.వి.సుజయ్‌కృష్ణ రంగారావు, ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు పిలుపునిచ్చారు. గురువారం రాత్రి బొబ్బిలి కోటలో పార్టీ నాయకులతో అత్యవసరంగా సుజయ్‌కృష్ణ రంగారావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజనను నిరసిస్తూ వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చిన మేరకు జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు  సహకరించాలని  కోరారు.  ఈ నిరసన ద్వారా సీమాంధ్ర ప్రజల మనోభావాలను మరోసారి కేంద్రానికి గట్టిగా చెప్పే అవకాశం  ఉంటుందన్నారు. 
 
 నదీ జలాల సమస్య తప్పదు
 రాష్ట్ర విభజన  వల్ల నదీజలాల సమస్య ఉత్పన్నం కావడంతో పాటు నిరుద్యోగ సమస్య పెరుగుతుందని ఓ ప్రకటనలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నారన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు, సమైక్యవాదులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement