వీఎమ్‌సీ సర్కిల్ కార్యాలయాలపై ఏసీబీ దాడి | ACB Raids On VMC Padamata Circle Offices | Sakshi
Sakshi News home page

వీఎమ్‌సీ సర్కిల్ కార్యాలయాలపై ఏసీబీ దాడి

Published Tue, Oct 15 2019 8:41 PM | Last Updated on Tue, Oct 15 2019 9:02 PM

ACB Raids On VMC Padamata Circle Offices - Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్(వీఎమ్‌సీ) పటమట సర్కిల్ పరిధిలోని మూడు ఆఫీసులలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబీ) మెరుపుదాడి చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న సూర్య భగవాన్‌ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇంటిపన్నులో పేరు మార్చడానికి సూర్య భగవాన్‌ డబ్బులు డిమాండ్‌ చేయడంతో.. బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సూర్య భగవాన్‌ను ట్రాప్‌ చేసి పట్టుకున్నారు.  రూ. 9వేల నగదు స్వాధీనం చేసుకొని అతడిని కస్టడీలోకి తీసుకొన్నారు. ఈ తనిఖీల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీ కనకరాజులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement