బండి సంజయ్(ఫైల్)
సాక్షి, నల్గొండ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేసు నమోదైంది. కరోనా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలపై కూడా కేసులు నమోదయ్యాయి. మంగళవారం నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. అయితే లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా ఉన్న భౌతిక దూరాన్ని పాటించలేదు. దీంతో పెద్దవూర పోలీసులు సంబయ్‌తో పాటు పలువురిపై 188 సెక్షన్ క్రింద కేసులు నమోదు చేశారు. కాగా, నిన్న నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలం ఊట్లపల్లిలో బత్తాయి రైతులను బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడి కూడా రాకపోవడంతో బత్తాయి రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వమే బత్తాయిలను కొనుగోలు చేయాలని కోరారు.
చదవండి : ‘ఆయన క్వారంటైన్ ముఖ్యమంత్రి’
Comments
Please login to add a commentAdd a comment