కౌడిపల్లి ఐకేపీ సమీపంలో తంగేడు చెట్టుకు తాళాలు వేసిన దృశ్యం
కౌడిపల్లి(నర్సాపూర్): గ్రామ సమీపంలో ఉన్న తంగేడు చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు వేశారు. అక్కడే తాళంచెవిలు సైతం పడేశారు. గొర్రెల కాపరులు గమనించి గ్రామస్తులకు విషయం చెప్పడంతో గ్రామానికి అరిష్టం తలపెట్టేందుకే ఇలా చేశారని పలువురు అనుకుంటున్నారు. కాగా విషయం పోలీసులకు తెలవడంతో పోకిరిలు చేసిన పని అని మూఢనమ్మకాలను నమ్మొద్దని స్థానిక ఎస్‌ఐ శ్రీనివాస్ సూచించారు.
వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రమైన కౌడిపల్లిలోని ఐకేపీ గోదాం పక్కనగల సాగుభూమిలో గుర్తుతెలియని వ్యక్తులు తంగెడు చెట్టు కొమ్మలకు అయిదు తాళాలు వేశారు. సుమారు పక్షం రోజుల క్రితం వేసినట్లు ఉన్నాయి. తాళం చెవులను సైతం అక్కడే వదిలేశారు. కాగా రెండో రోజుల క్రితం గ్రామానికి చెందిన మేకల కాపర్లు గమనించి విషయం గ్రామస్తులకు తెలిపారు.
దీంతో విషయం తెలియడంతో పలువురు గ్రామస్తులు వెళ్లి పరిశీలించి వచ్చారు. గ్రామానికి అరిష్టం తలపెట్టేందుకు ఇలా చేశారంటున్నారు. విషయం ఎస్‌ఐ శ్రీనివాస్‌కు తెలవడంతో సంఘటన స్థలానికి వెల్లి తంగేడు చెట్టును పరిశీలించారు.
ఆందోళన చెందవద్దు...
మూఢ నమ్మకాలు నమ్మొద్దని ఇలాంటివి పట్టించుకుని ఆందోళన చెందవద్దని ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. పనిలేని వ్యక్తులు చేసే పనులవల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడవద్దన్నారు. మంత్రాలు, తంత్రాలు లేవన్నారు. తాళం వేసిన వ్యక్తుల గురించి విచారణ చేస్తామని తెలిపారు. అనంతరం తంగెడు చెట్టుకు వేసిన తాళాలను తొలగించి చెట్టుకొమ్మలను విరిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment