మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ఇల్లు
దారుణం
Published Mon, Jul 3 2017 11:11 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
-వివాహిత హత్య
– అనుమానం రాకుండా ఇంట్లోనే మృతదేహాన్ని పూడ్చివేత
- ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
– నేడు మృతదేహం వెలికితీయనున్న పోలీసులు
నంద్యాల: వైఎస్‌నగర్‌లో రెండు నెలల క్రితం అదృశ్యమైన వివాహిత శిరసాల లక్ష్మి దారుణ హత్యకు గురైంది. అయితే, ఇంట్లోనే ఎవరికీ తెలియకుండా ఆమె మృతదేహాన్ని పూడ్చివేసినట్లు పోలీసులు సోమవారం గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. సుద్దులపేటకు చెందిన బుడగజంగం సంఘం నేత జమ్మడక్క కుమార్తె లక్ష్మికి, మాబియ్యకు రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం లేదు. ఈ దంపతులు వైఎస్‌నగర్‌లో నివాసమున్నారు. అయితే ఏప్రిల్ 30నుంచి లక్ష్మి కనిపించడంలేదని జమ్మడక్క రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఎస్‌ఐ రమణ కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే పోలీసుల జాగిలాలతో విచారణ నిర్వహించగా, వైఎస్‌నగర్‌లోని ఒక ఇంటిని చూపింది. దీంతో పోలీసులు ఇంటి ప్రాంతంలో పరిశీలించగా, దుర్వాసన వస్తున్నట్లు తెలిసింది. లక్ష్మికి చెందిన వస్తువులు కూడా లభ్యం కావడంతో ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. తహసీల్దార్ ఇంద్రాణి, డీఎస్పీ హరినాథరెడ్డి సమక్షంలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు నేడు వెలికి తీయనున్నారు. అయితే, హత్యకు పాల్పడిందే ఎవరన్నది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement