చిన్నారి మృతి | child died | Sakshi
Sakshi News home page

చిన్నారి మృతి

Published Mon, Feb 20 2017 11:58 PM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM

child died

కోడుమూరు రూరల్‌: గోరంట్ల గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్‌ విద్యార్థి సోమవారం అకస్మాత్తుగా మృతి చెందాడు. గ్రామానికి  చెందిన  రాంమోహన్, లలిత దంపతుల రెండో కుమారుడు అరవింద్‌ స్థానిక అంగన్‌వాడీ సెంటర్‌లో చేర్పించారు. తండ్రి  శివ మాల ధరించి ఇరుముడి సమర్పించేందుకు శ్రీశైలం వెళ్లాడు. తల్లి సోమవారం ఽపనులకు వెళ్తూ కుమారుడు అరవింద్‌ (4)ను అంగన్‌వాడీ సెంటర్‌లో వదిలి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన చిన్నారి అకస్మాతుగా కిందపడిపోయి అపస్మారక స్థితికి చేరుకొని మృతి చెందాడు. అంగన్‌వాడీ సెంటర్‌లో విషతుల్యమైన ఆహారం తినడం వల్లే బాలుడు మృతి చెంది ఉంటాడని కుటుంబీకులు అనుమానిస్తుండగా, మిగతా పిల్లలు కూడా ఆహారం తీసుకున్నా వారికేమి కాలేదని సెంటర్‌ నిర్వాహకులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న కోడుమూరు తహసీల్దార్‌ నిత్యానందరాజు, ఎస్‌ఐ మహేష్‌కుమార్, ఐసీడీఎస్‌ సీడీపీఓ నిర్మలాదేవి గోరంట్ల చేరుకొని బాలుడి మృతికి గల కారణాలపై ఆరా తీశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement