కొనసాగుతున్న ఆటల పోటీలు | Ongoing sporting events | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఆటల పోటీలు

Published Thu, Sep 8 2016 7:42 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

ఖోఖో ఆడుతున్న విద్యార్థులు

ఖోఖో ఆడుతున్న విద్యార్థులు

జిన్నారం: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆటల పోటీలు గురువారం రెండో రోజు కొనసాగాయి. ఆయా పాఠశాలల పీడీ, పీఈటీలు జిన్నారంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో క్రీడాకారులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌ క్రీడలను నిర్వహించారు.

ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలకు పంపుతామని పీడీ శ్రీనివాస్‌రావు తెలిపారు. అథ్లెటిక్‌ పోటీలను కూడా విద్యార్థులకు నిర్వహిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement