కాకినాడలో పోలీస్ పికెట్
Published Mon, Jan 23 2017 11:02 PM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
కాకినాడ వైద్యం :
ముద్రగడ పద్మనాభం పాదయాత్రను అడ్డుకునేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం కాకినాడ నగర పరిధిలోని పలు ముఖ్య కూడళ్ల వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. పాదయాత్ర నిర్వహించేందుకు ఉద్యమ నేతలు ఏర్పాట్లు చేస్తుంటే, జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయని, పాదయాత్రను అడ్డుకుని తీరుతామని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ స్పష్టం చేశారు. ఉద్యమ కీలక నేతలు రావులపాలెం వెళ్లేందుకు అవకాశం ఉన్న ప్రధాన రూట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. కిర్లంపూడి, కాకినాడ, అమలాపురం తదితర ప్రాంతాల నుంచి ఉద్యమ నేతలు సత్యగ్రహ పాదయాత్రకు బయలు దేరే అవకాశం ఉండటంతో, వీరిని ఎక్కడికక్కడే నిర్బంధంలోకి తీసుకునే చర్యలు చేపట్టారు. అవసరమైతే నేతలను ఇళ్లవద్దే గృహ నిర్బంధం చేయాలనే యోచనలో పోలీస్ యంత్రాంగం ఉంది. కాకినాడ ఇతర ప్రాంతాల నుంచి రావులపాలెం, అమలాపురం వెళ్లే అన్ని వాహనాలు, నేతల కదలికలపై ఇప్పటికే ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక బలగాలు రప్పిస్తున్నారు. ఇవి మంగళవారం ఉదయానికి జిల్లాకు చేరుకోనున్నాయి. ఇప్పటికే జిల్లా పోలీస్‌లు, రాజమహేంద్రవరం అర్బ¯ŒS పరిధిలోని పోలీసులు ప్రత్యేక బందోబస్తు చేపట్టారు.
Advertisement
Advertisement