ఆర్టీసీ డ్రైవర్లు ప్రజల మన్ననలుపొందాలి
ఆర్టీసీ డ్రైవర్లు ప్రజల మన్ననలుపొందాలి
Published Sat, Jul 30 2016 11:04 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
నల్లగొండ
ప్రమాదాల బారిన పడకుండా ప్రయాణికులను గమ్యానికి చేర్చడంలో ఆర్టీసీడ్రైవర్లు ప్రజల మన్నలను పొందుతున్నారని ఎస్పీ ప్రకాష్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో డిపో కార్యాలయంలో జరిగిన ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రీజియన్ మేనేజర్ కృష్ణహరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి డిప్యూటీ సీటీఎం మధుసూదన్, నల్లగొండ డిపో మేనేజర్ వెంకటేశ్వరబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కొన్నేళ్లుగా ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా బస్సులు నడిపిన 24 ఉత్తమ డ్రైవర్లను ఎస్పీ సన్మానించారు. డిపోకు ముగ్గురు చొప్పున ఏడు డిపోలకు 21 మంది, నల్లగొండ డిపో నుంచి ముగ్గురు డ్రైవర్లను ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ మాట్లాడుతూ...డ్రైవర్లు మానసికంగా శక్తివంతులుగా ఉండాలన్నారు. ఆరోగ్య మీద శ్రద్ధ వహించాలని, నిబంధనలు పాటించాలన్నారు. ఉత్తమ డ్రైవర్లుగా అవార్డులు పొందిన వారిని మిగితా డ్రైవర్లు ఆదర్శంగా తీ సుకోవాలన్నారు. డ్రైవర్లు తప్పని సరిగా ‘ట్రిపుల్ ఈ’ సూత్రాన్ని (ఇంజినీరింగ్, ఎడ్యు కేషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్) పాటించాలని సూచించారు. ఆర్‌ఎం కృష్ణహరి మాట్లాడుతూ. ...ప్రమాదాల బారిన పడకుండా డ్రైవర్లకు నిరంతరంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం డ్యూటీ ఎక్కే సయమంలో తప్పనిసరిగా డ్రైవర్లకు బ్రీత్ ఎన్‌లైజింగ్ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. 40 ఏళ్లు దాటిన డ్రైవర్లకు ఏడాదికోసారి, 45 ఏళ్లలోపు ఉన్న డ్రైవర్లకు మూడేళ్లకు ఒకసారి వైద్య పరీక్షలు చేయిస్తున్నామని ఆర్‌ఎం వివరించారు.
Advertisement
Advertisement