బోధన్‌ డివిజన్‌లో రూ. 14 కోట్ల పంట నష్టం | rupees 14 crores croplose in bodhan division | Sakshi
Sakshi News home page

బోధన్‌ డివిజన్‌లో రూ. 14 కోట్ల పంట నష్టం

Published Mon, Oct 3 2016 10:57 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

rupees 14 crores croplose in bodhan division

బోధన్‌ : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వచ్చిన వరదల వల్ల పంటలకు భారీ నష్టం వాటిల్లిందని ఆర్డీవో సుధాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో సుధాకర్‌రెడ్డి ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్‌ డివిజన్‌లో రూ. 14 కోట్ల 50 లక్షల పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. సమగ్రంగా పంట నష్టాన్ని గుర్తించేందుకు త్వరలోనే క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించి సర్వే నిర్వహిస్తారన్నారు. ఏ రైతుకూ అన్యాయం జరుగకుండా సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించామన్నారు. వర్షాలకు 4,145 ఇళ్లు దెబ్బతిన్నాయని, డివిజన్‌లో 120 చోట్ల ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ రోడ్లకు నష్టం జరిగిందని గుర్తించామన్నారు. రోడ్లకు మరమ్మతులకు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement