క్విజ్ పోటీలతో విద్యార్థుల మేధస్సు పెంపు
Published Sat, Aug 6 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
నర్వ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఒకచోట చేర్చి క్విజ్‌పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థులలో దాగివున్న మేధస్సును బయటకు తీసుకొచ్చే వీలుందని ఆర్వీఎం మానిటరింగ్ అధికారి హేమచంద్ర, ఎంఈఓ బాలరాజు పేర్కొన్నారు. శనివారం జయశంకర్ జయంతి సందర్భంగా మండలంలోని పాతర్‌చెడ్ ఉన్నత పాఠశాలలో మండలస్థాయి క్విజ్‌పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు వారి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. వారు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు బాహ్యప్రపంచంలో చోటు చేసుకుంటున్న ప్రతి సంఘటనలను తెలియజేసుకునే వీలుందని అన్నారు. జీహెచ్‌ఎం ఆడమ్స్ ఇలాంటి మండలస్థాయి క్విజ్‌పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు.
మండలస్థాయి విజేత నర్వ
మండలస్థాయి క్విజ్‌పోటీలలో నర్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మొదటి బహుమతిని సాధించారు. అదేవిధంగా పెద్దకడ్మూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రెండో బహుమతిని గెలుచుకోగా మూడో బహుమతిని పాతర్‌చేడ్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సాధించారు. గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథులచే బహుమతులను అందించారు. అనంతరం విద్యార్థులలో చదువుపై శ్రద్ధ వహించాలన్న లక్ష్యంతో రోజువారి కార్యక్రమాలలో ఎన్ని గంటలు చదువుకు కేటాయించాలి అన్న అంశాలను ప్రముఖ సైకాలజిస్ట్ కష్ణమోహన్ తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మినరసింహ, ఎంపీటీసీ రాణి, జీహెచ్‌ఎం రవికుమార్, కష్ణయ్య, హె^Œ ఎంలు శ్రీహరి, సుదర్శన్, కేజీబీవీ ఎస్‌ఓ పావని, గ్రామపెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement