సంగారెడ్డి జోన్ : గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించేందుకు అర్హత పరీక్ష కోసం గిరిజన సంక్షేమం ద్వారా ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి మాణెమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా నుంచి ఐదు మంది లా గ్రాడ్యుయేట్లను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడంతో పాటు శిక్షణ కాలం స్టయిఫండ్ చెల్లిస్తామన్నారు.
విద్యార్థులు ఈ నెల 28లోగా సమీకృత కలెక్టరేట్‌లోని జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జీఆర్‌ఈ/జీఎంఏటీ, టీఓఎఫ్‌ఈఎల్/ఐఈఎల్‌టీఎస్ శిక్షణను ఇచ్చి మంచి ఫలితాలు సాధించిన వారికి విదేశీ విశ్వ విద్యాలయాల్లో చదువుకునేందుకు తోడ్పాటునందిస్తుందన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 31లోగా www.telanganaepass.egg.gov.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.