20న వైఎస్సార్‌సీపీ జిల్లాస్థాయి ప్లీనరీ
►ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేందుకే సమావేశాలు
►ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారా బాబూ?
►ఎన్టీఆర్ ఫొటో లేకుండా ఎన్నికలకు వెళ్లగలరా
►విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నారాయణస్వామి
తిరుపతి మంగళం: ఈనెల 20వతేదీన తిరుపతిలో వైఎస్సార్‌సీపీ జిల్లాస్థాయి ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూ రు నారాయణస్వామి తెలిపారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుపతిలో ఏఐఆర్ బైపాస్‌రోడ్డులోని పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్లో ఉదయం 9గంటలకు జిల్లా స్థాయి ప్లీనరీ ప్రారంభమవుతుందని తెలిపారు. ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి పాల్గొంటారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి, అక్రమాలను ఎండగట్టడం, ప్రజాసమస్యలపై ఉద్యమాలు, వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కార్యచరణ వంటి అంశాలపై చర్చిస్తామన్నారు.
ఎన్టీఆర్ ఫొటోలేకుండా ఎన్నికలకు వెళతారా బాబూ?
చంద్రబాబూ.. మీకు దమ్ముంటే రాబోయే ఎన్నికల్లో ఎన్టీ ఆర్ ఫొటో లేకుండా గెలవగలరా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి సవాల్ విసిరారు. ఎన్టీఆర్ ఫొటో లేకుండా నాలుగు సీట్లు గెలిచినా తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. మహానుభావుడు ఎన్టీఆర్ చివరి దశలో చంద్రబాబుపై చెప్పిన వాస్తవాలను ప్రతి ఒక్కరు వింటే చంద్రబాబు ఎన్టీఆర్‌కు చేసిన మోసాలు బయటపడుతాయన్నారు. 2014 ఎన్నికల్లో ఎలాగైనా అధి కారంలోకి రావాలన్న దురాలోచనతో చంద్రబాబు నోటికొచ్చిన వందలాది హామీలను గుప్పించారన్నారు. రాష్ట్ర ప్రజలకు, రైతులకు, యువతకు, మహిళలకు ఇచ్చిన హామీల్లో ఇంతవరకు ఏ ఒక్కటైనా నెరవేర్చావా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు మూడున్నరేళ్ల పాలనలో పేదలకు సెంటు భూమి ఇచ్చిన పాపానపోలేదని మండిపడ్డారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో 65.48లక్షల మందికి ఇళ్లు మంజూరుచేశారని, అందులో 25వేల మందికి ఇళ్లు పూర్తిచేసి ఇచ్చారని గుర్తుచేశారు.
రాబోయే ఎన్నికల్లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయసాధన కోసం నిరంతరం శ్రమిస్తున్న వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తేనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.ఇమామ్, పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు చెలికం కుసుమమ్మ, విద్యార్థి విభాగం నగర అధ్యక్షులు నరేంద్ర, పుష్పలత, పుణీత, సాయికుమారి పాల్గొన్నార