ఆయన మనకు గురువులాంటోడు...! | He is like a teacher | Sakshi
Sakshi News home page

ఆయన మనకు గురువులాంటోడు...!

Published Sun, Jun 19 2016 2:50 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

ఆయన మనకు గురువులాంటోడు...! - Sakshi

ఆయన మనకు గురువులాంటోడు...!

ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేత  ఒకరిని తెగ పొగిడారట. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత ఒకరు స్వయంగా టీడీపీ నేతకు చెప్పారట. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ నేత టీడీపీలో సీనియర్. గతంలో అధ్యాపకునిగా పనిచేసిన ఆయన ఏ విషయమైనా ఆపకుండా గంటపాటు మాట్లాడగలరు. ఎవరిపైన ఏ విమర్శనైనా జంకు, గొంకు లేకుండా చేస్తారు. ఇటీవల ఆ నేత సొంత జిల్లాకు చెందిన ఓ నాయకురాలిపై విమర్శల వర్షం కురిపించారు. మరుసటి రోజు ఆ వార్త పత్రికల్లో ప్రచురితమైంది.

పత్రికలు చదువుతూ తనకు సన్నిహితులైన మంత్రులతో పిచ్చాపాటిగా మాట్లాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఆ టీడీపీ నేత మనందరికి గురువు లాంటి వారు, ఏ విషయమైనా అనర్గళంగా మాట్లాడే సత్తా ఉంది, మనందరం టీడీపీలో ఉన్నపుడు వివిధ అంశాలపై మాట్లాడాలంటే ఆయన సూచనలు, సలహాలు తీసుకునే వాళ్లం అని కితాబిచ్చారట. ఈ విషయాన్ని సీఎంతో పాటు పిచ్చాపాటి ఇష్టాగోష్టిలో పాల్గొన్న మంత్రి ఒకరు టీడీపీ నేత చెవిలో వేశారట. దీంతో ఆ నేత మనల్ని పొరుగు రాష్ట్రం సీఎం కూడా మెచ్చుకున్నారు అని ఉబ్బితబ్బిబ్బు అయి పోతున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement