♦ ఒకటీ రెండు రోజుల్లో ఏపీ సెట్‌ల తేదీల ప్రకటన!
♦ వాటికి 2–3 రోజుల వ్యవధి ఉండేలా తెలంగాణ ప్రవేశ పరీక్షలు
♦ కసరత్తు చేస్తున్న ఉన్నత విద్యా మండలి.. 12న ప్రకటించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవ త్సరం (2017–18) వివిధ వృత్తి విద్యా కోర్సు ల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను ఖరారు చేసేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీఈసెట్ తదితర ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను సోమవారం ఖరారు చేయాలని తొలుత భావించినా.. సాధ్యం కాలేదు. విభజన చట్టం ప్రకారం ఏపీ విద్యార్థులు కూడా తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు హాజరై, ఇక్కడి విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందేలా అవకాశం కల్పించాల్సి ఉన్నందున... ఏపీ ప్రభుత్వం ఖరా రు చేసే తేదీలను బట్టి తెలంగాణ సెట్స్ తేదీ లను ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది.
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వద్ద జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో దీనిపై చర్చించారు. ఏపీ ఒకటి రెండు రోజుల్లో తమ సెట్స్ తేదీలను ఖరారు చేయనున్న నేపథ్యంలో.. ఆ తేదీలకు రెండు మూడు రోజుల వ్యవధిలో రాష్ట్ర సెట్స్ తేదీలను ఖరారు చేయనున్నారు. మరో వైపు ఏయే వర్సిటీ ఆధ్వర్యంలో ఏయే పరీక్షల ను నిర్వహించాలి, నిర్వహణ బాధ్యతలను ఎవ రికి అప్పగించాలనే అంశాలతోపాటు కన్వీనర్ల నియామకంపై స్పష్టత వచ్చాక ప్రవేశపరీక్షల తేదీలను ఖరారు చేయనున్నారు. ఈ నెల 12 నాటికి ఈ ప్రకియను పూర్తి చేసి, అదే రోజు తేదీలను ప్రకటించాలని భావిస్తున్నారు. ఈ మేరకు షెడ్యూల్ రూపకల్పనపై ఉన్నత విద్యా మండలి దృష్టి సారించింది. అందులో భాగంగా మంగళ వారం (నేడు) వివిధ వర్సిటీల వీసీలతో సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది.
త్వరలోనే రాష్ట్ర సెట్స్ తేదీలు
Published Tue, Jan 10 2017 2:25 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
Advertisement