రాబందులు లేక పర్యావరణానికి తీవ్ర ముప్పు
వాషింగ్టన్: అంతరించిపోతున్న రాబందులతో భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో పర్యావరణానికి, మానవాళికి తీవ్ర ముప్పు పొంచివుందని యుటా వర్సిటీ అధ్యయనంలో తేలింది. విషకారకాల వినియోగంతో ఇతర పక్షులు సైతం తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. తాజా అధ్యయనాల ప్రకారం 88 శాతం రాబందులకు చెందిన పక్షి జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది.
‘విషతుల్యమైన పశు కళేబరాలు తిని రాబందులు అంతరించిపోతున్నాయి. పశువులకు నొప్పిని నిర్మూలించేందుకు వినియోగించే డైక్లోఫినాక్ మందే ఇలా రాబందులు అంతరించిపోవడానికి కారణ’మని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పశువుల కళేబరాల్ని తినే పక్షులు రకరకాల వైరస్, బ్యాక్టీరియాలను వ్యాప్తికి కారణమవుతున్నాయి.