శాన్ ప్రాన్సిస్కో : అమెరికాను కొంత కాలంగా ప్రకృతి వైపరీత్యాలు కుదిపేస్తున్నాయి. తాజాగా ఉత్తర కరోలినాలోని అడవుల్లో వ్యాపించిన కార్చిచ్చు.. 10 మందిని బలి తీసుకుంది. అడవులకు సమీపంలో నివస్తున్న 20 వేల మందిని... అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉండగా.. కార్చిచ్చు మంటలకు సుమారు 15 వేల ఇళ్లు అగ్నికి ఆహుతయినట్లు అధికారులు ప్రకటించారు. అమెరికాలోని అడవుల్లో కార్చిచ్చు సహజంగా వ్యాపించినా.. ఇంత స్థాయిలో ఆస్తి నష్టం జరగడం ఇదే మొదటిసారని తెలిపారు.
ఉత్తర కరోలినాలో మొత్తం 94 వేల ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం కార్చిచ్చు వందల ఎకరాల్లో ఉందని.. ఈ మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కరోలినా ఫారెస్ట్ అండ్ ఫైర్ ప్రొటక్షన్ డిప్యూటీ డైరెక్టర్ జానెట్ అప్టన్ తెలిపారు. ఆస్తి నష్టం మరింత ఎక్కువగా ఉండేందుకు అవకాశముందని ఆమె అన్నారు. అడవులకు సమీపంలోని నగరాలైన నాపా, నవేదా, ఆరెంజ్, సోనోమా, యాబాల్లో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment