మనిషి మాంసం వడ్డిస్తున్నారంటూ.. | Indian Eatery in UK Could Close After 'Human Meat' Report | Sakshi
Sakshi News home page

మనిషి మాంసం వడ్డిస్తున్నారంటూ..

Published Thu, May 18 2017 12:30 PM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM

మనిషి మాంసం వడ్డిస్తున్నారంటూ..

మనిషి మాంసం వడ్డిస్తున్నారంటూ..

లండన్‌: యూకేలోని ఓ భారతీయ రెస్టారెంట్‌లో మనిషి మాంసం వండుతున్నారని ఫేక్‌ వార్త కలకల రేపింది. దీంతో ఆ హోటల్‌ మూత పడింది. నాన్‌వెజ్‌ వంటకాల పేరిట మనిషి మాంసం వడ్డిస్తున్నారంటూ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు వైరల్‌ అయింది. దీనిపై స్పందించిన 'కర్రీ ట్విస్ట్‌' రెస్టారెంట్‌ యాజమాన్యం తమ వ్యాపారాన్ని దెబ్బతీసేందుకే కొందరు గిట్టని వ్యక్తులు ఇలా చేశారని చెప్పారు.

నకిలీ వార్తను నమ్మిన కొందరు దాడి చేసేందుకు హోటల్‌పైకి రాగా.. పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. గత 60 ఏళ్లుగా రెస్టారెంట్‌ నడుపుతున్నామని ఇలాంటి సంఘటన ఎదురవుతుందని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. ఓ ఫేక్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ ప్రచురించిన వార్తను ఎలా నమ్మారో తెలీడం లేదని అన్నారు. కేవలం ఒక కాలమ్‌.. దాని నిండా స్పెల్లింగ్‌ మిస్టెక్స్‌ ఉన్నాయని వార్తను గురించి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement