లుబియానా: కరోనాకు అగ్రదేశాలే వణుకుతుంటే చిన్నదేశాలు మాత్రం దాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నాయి. తమ దేశాల్లో కరోనాకు చోటు చేదంటూ వైరస్ వ్యాప్తిని నివారిస్తూ కరోనాను తిప్పికొడుతున్నాయి. తాజాగా స్లొవేనియా.. తమ దేశంలో కరోనా చాప్టర్ ముగిసినట్లేనని ప్రకటించింది. ఈ మేరకు స్లొవేనియా ప్రధాన మంత్రి గురువారం జానేజ్ జంజా అధికారికంగా ప్రకటన చేశారు. ఇలా కరోనాను సమర్థవంతంగా అరికట్టిన తొలి యూరోపియన్ దేశంగా స్లొవేనియా నిలిచింది. అయితే ఇది కరోనా వల్ల చిగురుటాకులా వణికిపోయిన ఇటలీ సరిహద్దు దేశం కావడం గమనార్హం. గత పద్నాలుగు రోజులుగా అక్కడ రోజుకు ఏడు కన్నా తక్కువ కేసులు నమోదవుతున్నాయి. (లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలు ఇవేనా..!)
దీంతో కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్ సడలింపులను క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తోంది. అందులో భాగంగా ఈ వారం ప్రారంభంలో ప్రజా రవాణా తిరిగి ప్రారంభమవగా వచ్చేవారం నుంచి పాఠశాలలు కూడా తెరుచుకోనున్నాయి. తర్వాతి వారం నుంచి రెస్టారెంట్లు, బార్లు, తక్కువ గదులున్న హోటళ్లు తెరుచుకునేందుకు అనుమతులు జారీ చేసింది. త్వరలోనే అన్ని రకాల షాపులు, డ్రైవింగ్ స్కూళ్లు తెరుచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇతర దేశాల నుంచి వచ్చేవారికి వారం రోజుల క్వారంటైన్ నిబంధనను సైతం ఎత్తివేయనుంది. అయితే కోవిడ్-19 వ్యాప్తి కట్టడికి అవసరమయ్యే కొన్ని ఆంక్షలను ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. (కరోనా వచ్చినా కంగారు పడలేదు!)
Comments
Please login to add a commentAdd a comment