మళ్లీ మొదలైంది | KL Damodar Prasad announces four projects | Sakshi
Sakshi News home page

మళ్లీ మొదలైంది

Published Fri, Nov 23 2018 12:11 AM | Last Updated on Tue, Jun 4 2019 6:19 PM

KL Damodar Prasad announces four projects - Sakshi

కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌

కొత్త తరం చిత్రాలను ఆదరించే నిర్మాణ సంస్థగా శ్రీరంజిత్‌ మూవీస్‌కు మంచి పేరుంది. రంజిత్‌ మూవీస్‌ అనగానే ‘అలా మొదలైంది’, ‘అంతకుముందు– ఆ తరువాత’, ‘కళ్యాణ వైభోగమే’ చిత్రాలు గుర్తుకొస్తాయి. వైవిధ్యమైన కథలతో పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రాలతో సంస్థ అధినేత కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌ సినిమాలు నిర్మిస్తుంటారు. రెండేళ్ల విరామం తర్వాత నాలుగు నూతన చిత్రాలను నిర్మించటానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే నాలుగు కథలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయటం జరిగింది. వీటి నిర్మాణం సమాంతరంగా జరుగుతుంది. వీటిలో ఓ చిత్రాన్ని జనవరిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నాం. ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు సాగర్‌ను పరిచయం చేస్తున్నాం. ప్రముఖ నటీనటులతో పాటు నూతన తారాగణం కూడా ఉంటుంది. మా గత చిత్రాల కోవలోనే ఈ నాలుగు చిత్రాలు ఉంటాయి. మిగతా చిత్రాల విశేషాలను త్వరలోనే తెలియచేస్తాను’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement