'రాధా'ను మారుతి ఎత్తుకొచ్చాడా?
'రాధా'ను మారుతి ఎత్తుకొచ్చాడా?
Published Mon, Feb 10 2014 3:48 PM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM
టాలీవుడ్ నటుడు వెంకటేశ్ తో సెన్సేషనల్ దర్శకుడు మారుతి ఇటీవల ప్రారంభించిన 'రాధా' చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పిన కథను కాపీ కొట్టేసి వెంకటేశ్ తో సినిమాను ఓకే చేశాడనే వార్త టాలీవుడ్ లో ఒక్కసారిగా గుప్పుమంది. కథకు సంబంధించిన క్రెడిట్ తనకు ఇవ్వకపోతే ఆత్మహత్యకు పాల్పడటానికైనా వెనుకాడను అంటూ అసిస్టెంట్ డైరెక్టర్ హెచ్చరించారని పలు వెబ్ సైట్లలో వార్తలు రావడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
'రాధా' చిత్రంపై వివాదం జటిలవ్వడంతో దర్శకుడు మారుతి సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ.. ఓకే ఐడియా ఇద్దరికి రావడాన్ని ఎవరూ కొట్టివేయలేం. హోం మంత్రి నేపథ్యంగా ఎన్నో కథలు వచ్చాయి. నా ఐడియాతో రూపొందించిన కథను రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ చేశాను. తుది నిర్ణయం రైటర్స్ అసోసియేషన్ తీసుకుంటుంది. ఒకవేళ తన కథ వేరే కథతో పోలి వుందని రుజువైతే.. సీన్లను, లైన్లను తొలగిస్తాను అని అన్నారు. ఈ వివాదంపై క్లియరెన్స్ వచ్చినా తర్వాతే తాను షూటింగ్ కొనసాగిస్తాను అని అన్నారు.
అయితే ఈవివాదం ఎక్కడి వెళ్లుతుందో అనే విషయంపై పలువురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ వివాదంపై నిజానిజాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Advertisement
Advertisement