న్యూఢిల్లీ: ఉగాండా మహిళను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఇద్దరు యువకులకు ఢిల్లీ కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రపంచం దృష్టిలో భారత్‌ను చులకన చేసిన వీరికి కఠినమైన, అసాధారణమైన శిక్ష విధించాలని కోర్టు పేర్కొంది. ఢిల్లీకి చెందిన రాజ్‌కుమార్, దినేశ్ శర్మలకు 30 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.50 వేల చొప్పున జరిమానా విధిస్తూ అదనపు సెషన్స్ జడ్జి వీరేందర్ భట్ మంగళవారం తీర్పు ఇచ్చారు. ఆకలిగొన్న తోడేలు ఆహారం కోసం వెంపర్లాడినట్లు నిందితులు ప్రవర్తించారని జడ్జి పేర్కొన్నారు.
విదేశీ మహిళపై గ్యాంగ్‌రేప్ కేసులో 30 ఏళ్ల జైలు
Published Wed, Apr 1 2015 1:29 AM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM
Advertisement