రాంచీ: జార్ఖండ్లో మావోయిస్టులు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను కిడ్నాప్ చేశారు. పశ్చిమ సింగ్భుమ్ జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. కాగా దీనికి సంబంధించి మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రకటన కానీ డిమాండ్లు కానీ రాలేదు. జమ్మూకాశ్మీర్తో పాటు జార్ఖండ్ అసెంబ్లీకి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జార్ఖండ్లో ఎన్నికలు రెండు విడతలు జరిగాయి.