హైదరాబాద్: చత్తీస్‌ఘర్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రొ ఎంటరాలజీ (ఏఐజీఈ) ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గత కొంత కాలంగా ఉదరకోశ వ్యాధి (గ్యాస్ట్రొ ఎంటరాలజీ) సమస్యతో ఆయన బాధపడుతున్నారు. దీంతో ఆయన ఆదివారం ఉదయం 9:30 గంటల సమయంలో ఏఐజీఈ ఆస్పత్రికి వచ్చారు. ఈయనకు ఏఐజీఈ చైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రొ ఎంటరాలజీ నిపుణులు డా.నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఎండోస్కొపీ పరీక్షతో పాటు స్కానింగ్‌లు, రక్తపరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం రమణ్‌సింగ్‌కు ఉన్నది చాలా చిన్న సమస్య అని తేల్చారు. సాధారణ మందులు సూచించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ ఆయన ఆస్పత్రిలో ఉన్నారు.
చత్తీస్‌గఢ్ సీఎంకు హైదరాబాద్‌లో వైద్యపరీక్షలు
Published Sun, May 24 2015 8:31 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM