ఇందిర నుంచే నేర్చుకున్నా: సోనియా | Learned from Indira Gandhi sayes Sonia | Sakshi
Sakshi News home page

ఇందిర నుంచే నేర్చుకున్నా: సోనియా

Published Sun, Nov 20 2016 2:47 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ఇందిర నుంచే నేర్చుకున్నా: సోనియా - Sakshi

ఇందిర నుంచే నేర్చుకున్నా: సోనియా

న్యూఢిల్లీ: భారతీయ సంస్కృతి, విలువలు, తొలినాళ్లలో రాజకీయ పాఠాలను మాజీ ప్రధాని ఇందిర గాంధీ నుంచే నేర్చుకున్నానని శతజయంతి ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ‘ఆమె చారిత్రక వ్యక్తి మాత్రమేకాదు నాకు అత్తగారు. మేమంతా ఒకే కప్పు కింద నివసించాం. బాధలు, సంతోషాలను కలసి పంచుకున్నాం.

ఆమె నాకు గురువు.’ అని అన్నారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, మాజీ ప్రధాని మన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయనే పాఠాన్ని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం నేర్పుతుందని ఇందిర శతజయంతి ప్రసంగంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. ఇందిరకు నివాళులు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement